-03 -03 -2023 నాటి రచనలు
*సమస్యను పరిష్కరించడం.. న్యస్తాక్షరి
*సీస పద్యం... కవిత్వం
*సుభాషితం - 422
**. ఒక పొడుపు కథ..
......
న్యస్తాక్షరి...... అ వ్య య ము పద్య పాదాది న రావాలి.
*తే:: అవని ఆశయమ్ము విధిగా అర్ధమగు స
వ్య మగు లక్ష్యము గాలియు వ్యవధి లేక
యరుక పరచలేక నిజము యందు నీరు
ముఖ్య జీవి, తరువు, గిరి, ముత్య మగుట
.....
*తే:: అ ధికులమనెప్పుడు తగదు అదిరి పాటు,
వ్య ర్థ ప్రేలాపన వలన వచ్చు ముప్పు,
య జము నడిపించు వాడేను యాజ్ఞికుడన,
ము దిత విద్య నేర్వ కలుగు భూరి వృద్ధి
*****
యజము = యజ్ఞము
భూరి = మిక్కిలి, అధికము.......
*ఆ. అధిక ఆశ యున్న తగదు తొందర పాటు
వ్యర్థ భావ మేల వ్యసన మేల
యదన కష్ట మొద్దు ఎరుకపరచు చాలు
ముత్య మంత ప్రేమ ముఖ్య మౌను
****
*సీస పద్యం...నాలోని నేను!
నాలో ప్రపంచమే నన్ను నా విధి తెల్ప
నా ఊహల పరధి నటన నేర్ప
నాలాగ కోరను నాది నీ దగుటయే
మొలవుతోంది మనసు మొదలు ఓర్పు
పెరిగిన వయసులో తెలియటం లేదులే
పెద్దరికంలేదు పేరు తీర్పు
చిన్న చిన్న విషయం చింత దారి పరుగు
వూరుకుందామంటె ఊహ ఓర్పు
*తే. అనుభవిస్తేనె ఆనంద మద్భుతంబు
అనుభవమ్ము ఆక్రోశమే ఏలు తోంది
చిన్న రాయిలోనే దైవ విద్య తెలుపు
చేరుకోలేని గమ్య మే కీలక మగు
........
*సుభాషితం - 422
---------------
🌺కేచిదజ్ఞానతో నష్టా:
కేచిన్నష్టా : ప్రమాదతః ౹
కేచిద్ జ్ఞానావలేపన
కేచిన్నష్ట్రస్తు నాశితాః ౹౹🌺
అజ్ఞానంతో కొందరు నాశనం పొందుతారు.కొంతమంది తమ తప్పులనుంచే నాశన పొందుతారు.అయితే కొంతమంది ఈ రీతి నాశనం పొందిన వారివల్ల నాశనం పొందుతారు.
......

-01 -03 -2023 నాటి రచనలు
సమస్యను పరిష్కరించడం
ఉదయ రాగ గీతం
గజిల్... దైవమా
నేటి కధ . (కలసిన హృదయాలు)
1 . ప్రాంజలి ప్రభ... సమస్యను పరిష్కరించడం..... 01 -౦౩-2023
కారము కన్నులన్ జొనిపి కాంతుని పిల్చెను కామకే ళి కిన్
...
ఉ:: జీరయు కాదులే మగువ జేష్టలు మగ్గుత మారమేమియున్
నేరము ఏలనో ఇపుడు. నీడల పంచన సేవచేయుటన్
సారము నాది నీదియగు సాధణ శోధన చెందుటే అహం
కారము కన్నులన్ జొనిపి కాంతుని పిల్చెను కామకే ళి కిన్
.....
ప్రాంజలి ... ఉదయ రాగ గీతం 01/03/2023.
*****
పాట సందర్భంపై నా విశ్లేషణ.
*********
పార్వతీ పర మేశ్వర శృంగార ఆటవెలది సరస సల్లాప గీతమ్ ...!
పల్లవి:-
****
పా:: ఓర చూపు నిన్ను ఓర్పుగా చూడంగ
నాదు చిలిపి ఊహ నాట్య మాడె
కోర మీస మేను కోరియు తిప్పంగ
నాదు వలపు వీణ నాట్య మాడె
ప:: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా ....
ప:: దోర వన్నె చేయి దోభూచు ఆడంగ
నా తణువు అగ్గి నటన అయ్యె
బుగ్గ గిల్ల చుంటె బురబుర పొంగేను
సిగ్గు చీర విడిచి చిందు లయ్యె
ప:: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా ....
ప. పా :: ఓర చూపు నిన్ను ఓర్పుగా చూడంగ
నాదు చిలిపి ఊహ నాట్య మాడె
దోర వన్నె చేయి దోభూచు ఆడంగ
నా తణువు అగ్గి నటన అయ్యె
చరణం:-
***
పా:: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా ....
పా :: మనసు దోచు చున్న మగ మహారాజువి
సామ జవర గమన సాహ సంబు
కొంత నాకు పంచు కోరిక తీర్చుమా
అంత నీవు దోచు ఆశ గాను
ప:: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా ....
ప. :: ఇదియు సంతసమ్ము ఇన్నాళ్ళు నాలోన
అంద మంత నీది ఆత్ర మేను
కొత్త దనము తెచ్చు కోరు వసంతము
అందు కొమ్ము నన్ను ఆత్ర మేను
పా :: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా ....
ప:: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా ....
పల్లవి:-
****
ప. పా :: ఓర చూపు నిన్ను ఓర్పుగా చూడంగ
నాదు చిలిపి ఊహ నాట్య మాడె
దోర వన్నె చేయి దోభూచు ఆడంగ
నా తణువు అగ్గి నటన అయ్యె
చరణం:-
****
పా:: ఎన్ని లక్షణాలు ఏలనమ్మాళిలే
నీదు వేష మాయ నిజము యేన
ఇన్ని నాళ్ళు నమ్మె ఇష్ట మాయా మగడా
నీదు ఆశ తీర్చ నిజము గాను
పా :: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా ....
ప:: గాలి లోని పలుకు గాళమై పట్టెనే
గంధ పరిమళాలు గాయ మేను
వెన్నె కళల మోము వేగమై పిలిచెను
నీదు చుంభ నముయె నాదు జపము
పా :: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా ....
పా:: ప్రాణ మేను నీది ప్రాయము దోచుకో
కమ్ము కొమ్ము నన్ను కాల మిదియు
ఈక్షణమ్ము నేను ఇష్టమ్ము చేసెద
సత్య పలుకు నాది సమయ మిదియు
పా :: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా ....
పల్లవి:-
***
పా. ప:: ఓర చూపు నిన్ను ఓర్పుగా చూడంగ
నాదు చిలిపి ఊహ నాట్య మాడె
కోర మీస మేను కోరియు తిప్పంగ
నాదు వలపు వీణ నాట్య మాడె
**********
-02 -03 -2023 నాటి రచనలు
*సమస్యను పరిష్కరించడం.. దత్తపది
*సీస పద్యం... కవిత్వం
*సుభాషితం - 421
*కాల తీర్పు.. మనిషి కథ..
....
*దత్తపది: స్వర్ణము, రజతము,తామ్రము,ఇత్తడి
****
02=03=2023
తే..స్వర్ణము మదిహృది కుదించు సమయ మౌను
రజతము అభయ హస్తమై రవ్వ వెలుగు
తామ్రమున నీరు ఆరోగ్య దాహ తీర్పు
ఇత్తడి గ్లాసు గిన్నెలు ఇప్పు డేవి
......
*తే. చంద్రగుప్తుని కాలమే స్వర్ణ యుగము,
రజత గిరినేలు దైవము రాజధరుడు,
స్వస్థత యొసగు తామ్ర కలశ జలముగొనిన,
కాంచ నిత్తడి భ్రమయగు కనకముయని
(దినవహి సత్యవతి)
.......
సీస పద్యం... కవిత్వం
అంకుశం కాదులే ఆశా కుసుమ మేను
వ్యంగ్య ధ్వని యనుటే వరుస తప్పు
ఆకాశ శబ్దమే అక్షర సంతృప్తి
విశ్లేషణము ఇదే విదిగ మెప్పు
మనసుఊహ తెలుపు మనుగడకు మలుపు
ఆంతర్య లక్ష్యాలు ఆత్మ ఒప్పు
సౌందర్య అభిమాన సౌసీల్య నిర్మితం
కవికవిత్వ పటుత్వ కాల మెప్పు
తే. కులమతాల అతీతమై ఉనికి తెలుపు
వినయ విషయాన్ని విశ్వసించి వివరణయె
మూగదైన అక్షరప్రాణ ముఖ్య మగుట
హృదయ మై హృధ్యమై వున్న ఉదయ కవియె
మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ
......
సుభాషితం - 421
---------------
🌺సద్భిస్తు లీలయా ప్రోక్తం
శిలాలిఖితమక్షరమ్ ౹
అసద్భి: శపథేనోక్తం జలే
లిఖితమక్షరమ్ ౹౹🌺
ఉత్తములు హాస్యానికి చెప్పిన మాటలు సహా శిలా శాసనములా శాశ్వతముగా ఉంటాయి.అయితే నీచులు శపథం చేసి చెప్పినా అవి నీటిపైన రాసిన అక్షరాలవంటివి.
🌺✍🏽ప్రభ,
.......
కాల తీర్పు.. మనిషి కథ...02=03=౨౦౨౩
ఉషోదయకాలంలో కధా పద్యాలా గళము ఎలావుందో మీరేచెప్పాలి ముఖపుస్తక సభ్యులారా.....
నందనవనంలో చిన్ననాటి స్నేహితులు కలుసుకున్నారు, వారిభావాలు పద్యాలుగా పలకరించుకుంటారు అది వారు అలవాటు
"తే. నీకు ఎవరి మీదను కోప నీడ అనకు
వారిని అసహ్యించక నీవు వినయ ముంచు
నీకు సహనాన్ని నేర్పేడి నిజము గురువు
నిత్యమూ ఆదు కొనుచునే నిర్ణయమ్ము "
చక్కగా చెప్పావు పుల్లారావు అంటూ....
అచ్చంగా నీకు ఎవరి మీదైనా కోపం ఉంటే వారిని అసహ్యించుకోకు,
నేర్పే గురువు నేను.మాత్రం కాదు . నిత్యమూ
ముత్యమల్లె చేరి నిన్ను ఆదు కుంటూ, కథలు చెప్పుతూ
నవ్వుముఖం తిష్టవేసి ఊహల్లో కూర్చొనే వారే మనకు తోడు నీడ గా వుంటారు కదా పుల్లారావు.
అసలు నీవు ఏమనుకుంటున్నావు అంటూ సుబ్బారావు మాటల వరస గుర్రమై పరిగెడుతున్నది.
" ఆశయం లేని జీవితం ఆటలేల నిత్య విశ్వాస మే లేని నియమ మేల
వ్యర్థ సంబాషణలనకు నీవు వయసు బట్టి
పట్టుదల లేని పనులు ఎప్పటికి కావు"
కొరగానివి. వాటికి విలువలేనేలేదు అంటూ ఇంకా ఏవిధముగా పలికె .
కొసరి కొసరి వడ్డించే రుచులన్నీ అద్భుతమే కానీ జీర్ణం చేసుకొనే శక్తి ప్రతిఒక్కరిలో ఉండాలి. అన్నాడు
సుబ్బారావు.
అహచెపొచ్చావులే మాటలు
తినిపించే ప్రతిమెతుకూ ప్రేమతోటి ఉంటుంది అర్థం చేసుకొనేవ్యక్తిలో ప్రేమా ఆనందం కలిగి ఉంటుంది, అర్థం కాని బ్రతుకు వ్యర్థం నీవెప్పుడు తెలుసుకుంటావో. అన్నాడుసుబ్బారావు.
అమాటకు
నిన్ను మెప్పించేలా మాట్లాడితే మంచోళ్లు, వారు నమ్మింది మాట్లాడితే చెడ్డవాళ్ళు అనుకుంటే,
నీచుట్టూ నిజాలు ఉండవు నటనలే ఉంటాయి, నిన్ను నీవుగా నమ్మాలి.
కబురులన్ని మూటవిప్పి అందంగా pఅప్పజెప్పె అపుడే నీకు గుర్తింపు ఉంటుంది, గౌరవము పెరుగుతుంది. అన్నాడు పుల్లారావు
"నీ సమక్షము విలువెంతొ లెక్కకట్ట మనసు కుప్రశాంతతకు ప్రశ్న మేలు కాదు
ఇదియె నా సరే' ప్రేమతో ఇష్టమగుట
మనము గడిపెడి ప్రతి రోజు మధురిమయగు "
ఇంకొంచెం అందంగా ఉంటుంది* కాలం వ్యర్థం ఆశలు కానేకాదు. అన్నాడు పుల్లారావు.
మనుషులందరు... సుబ్బారావు మొదలుపెట్టాడు....
నీ పరిస్థితిని ఎప్పుడూ,ఎవ్వడూ ఆలోచించడు. నీ పలకరింపుని మాత్రమే గుర్తు పెట్టుకొంటాడు అది మనుషుల లో సహజ స్వభావం .
దొర్లిపోవు క్షణాలన్ని తిరిగివచ్చు మార్గ మగుట . అందరి సుఖము కోరుకోమంటింది.
"ఇతరులలొ కష్టమును తీర్చ ఇష్టపడుట
స్థోమత మనకు లేకున్నా సహనముంచి ,
మనము కష్టాల్లొ ఉన్నాను మనసు పెట్టి
ఇతరులకు ధైర్య మిచ్చె తెలివి ఉంటెచాలు
అలసిపోక వేచివుండే మనసేగా నా... నీ..కున్నది. అన్నాడు సుబ్బారావు.
జీవితమూ గడియారం రెండూ ఒకటే వేగంగా పరిగెత్తినా ప్రయోజనం ఉండదు.
ఒకచోట ఆగిపోయినా ప్రయోజనం ఉండదు. అదిమాత్రం తెలుయనుకో అణు పుల్లారావ్ మొదలుపెట్టాడు మాటలు
గూటిలోని రామచిలక రెక్కలొచ్చి ఎగరలేనిస్థితియే. స్వేచ్ఛ కోరి కాలంతో ఎగిరేశక్తి ఏర్పరుచుకొని పంజరాన్ని దాటి రావాలి
"కనుక జీవితం,కాలము రెండు గొప్ప
గురువు కాలాన్ని ఉపయోగించుటయు తెలివి జీవితం ఎంత విలువైన గీత చెప్ప
ఏది యాగదు నిముహము ఏల చెప్ప
నీవు నేను కలియుట యె ఇపుడు గొప్ప "
ఏమిటో ఇలా మాట్లాడుకుంటూ నడుస్తూ కాలాన్ని మర్చిపొయ్యాము
తొందరగా పాలు తీసికెళ్ళపోతే రాత్రికి పాలెం కాదు ఏమీ ఉండవు మాపుల్లమ్మ ను చూసావా
అశలు నువ్వు పిలిస్తేగా
వద్దు వద్దు ఓపికవుంటే ఇలానే కలుద్దాం....
రేపనే కాల ముంది కదా....
అవును వుంది కదా....
మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ, 628190539
******
-03 -03 -2023 నాటి రచనలు
*సమస్యను పరిష్కరించడం.. న్యస్తాక్షరి
*గజల్ ... రెందుకో
*సుభాషితం - 424
**. ఒక పొడుపు కథ..
గజల్ ... రెందుకో -03-2023
పాటలు పాడితే పట్టించుకోకున్నా రెందరో
కవితలు పంపితే చూసి చదవకున్నా రెందుకో
కుక్క గాడిదను ఒకేగాట కట్టేస్తున్నారెందరో
నియమాలు పాటించమంటే బిక్క మోహ మెందుకో
మంచి చేద్దామను కుంటే నమ్మ కున్నారెందుకో
హితవు చెబు దామనుకుంటే వినకున్నారెందుకో
బాగు చేద్దామనుకుంటే పడనీయకున్నా రెందరో
దారి చూపిద్దా మనుకుంటే నమ్మకున్నా రెందుకో
నా పలుకులన్నీ పెడచెవినిపెడుతున్నారెందరో
అందాలు చూడమంటే చూడ నంటున్నా రెందుకో
సహాయం చేస్తే యాన్ని తిరస్కరిస్తున్నా రెందుకో
సంస్కరిద్దామనుకుంటే సహకరించ రెందుకో
***
సుభాషితం - 424
---------------
🌺సంపదో మహతామేవ
మహతామేవ చాపదః ౹
వర్ధతే క్షీయతే చంద్రో న
తు తాగణః క్వచిత్ ౹౹ 🌺
మహాత్ములకు సంపద ఆపత్తు అనేది తప్పితే అల్పులకు కాదు.వృద్ధి క్షయం చంద్రునికి కానీ నక్షత్రములకు కాదు.
....
*. ఒక పొడుపు కథ 04-03-2023
అతి ప్రాచీన కాలమున హిందువులు ఒక పిట్టకథను చెప్పుకొనుచుండెడివారు. ఆర్యులలో మొదటి తెగవారే హిందువులు. ఆర్యులలో జ్యేష్టులు వారే. వారు చెప్పుకొను కథ యిట్లున్నది. అనగ అనగ ఒక రాజ్యములో ఒక మహామృగముండెడిది. అది రోజున కొక జీవుని చొప్పున భక్షించుచుండెడిది. ఆ మృగము ఆకాశమున ఎగురగలదు. భూమిపై పరుగిడగలదు. నీటిలో ఈద గలదు. దానికి ముందు చూపేగాని వెనుక చూపు లేదు. అది, అడ్డు, ఆపులేక జీవులను భక్షించుచునే యుండెడిది.
ఒకనాడు దాని కంటికొక యోగి కనిపించెను. అతనిని భక్షించుట కుద్యమించెను. యోగి నవ్వుకొని పరుగెత్తుచు, సమీపమున గల ఒక మహా సరస్సున జొరపడెను. మృగము కూడ జొరపడినది. మృగము యోగి కొఱకై వెతుకుచుండగ యోగి మృగము వీపు పైకెక్కి కూర్చుండెను. వెనుక చూపు లేని మృగము యోగికై వెతుకుచు నుండెను. యోగి కనపడక పోగ క్రమముగ మృగమునకు పంతము పెరిగెను. యోగికొరకై వెతుకుట సాగించెను. నేటికిని వెదకులాడు కొనుచునే యున్నది. యోగి మృగము వీపున తన యోగమును సాగించుచునే యున్నాడు. పై కథను విప్పుకొనుట సాధకుల కర్తవ్యము.
***
-04 -03 -2023 నాటి రచనలు
*సమస్యను పరిష్కరించడం..
*గజల్ ...
*సుభాషితం **అవధూత అంటే ఎవరు ?.
సీస పద్యము..127
అనుభవం తలపులు ఆశయం మెరుగులు
అనుభూతి కళలన్ని అనుభవమ్ము
ఆణువణువూ ప్రేమ ఆనంద సంతసమ్ము
తనువు తపన కళ తృప్తి నిచ్చు
కనలేని సొగసులు కళ్లలే యగుటయే
తనమన చూపెట్టె తరుణమేది
వినలేని బుద్ధికి వేవిళ్లు వచ్చినా
చినుగులా బ్రతుకుగా చరిత బ్రతుకు
ఆ:: మనసుమంచమెను మనుగడ కరుణయే
తనివి తీర సుఖంము తప్పు కాదు
చినుఁగు పుట్ట గతియు చేష్టలు వివరనే
వణుకు పుట్ట కలదు వరుస మారె
శ్లో|| అనర్ఘమపి మాణిక్యం హేమాశ్రయమషేక్షతే।
వినాశ్రయం న శోభన్తే పణ్డితా వనితా లతాః॥
....సుభాషితరత్నకోశః….
తా|| "ఎంత అమూల్యమైన మాణిక్యమైనా అది శోభించాలంటే దానికి బంగారం ఆశ్రయం ఉండాలి. అదే విధంగా పండితులు, స్త్రీలు, లతలు ఆశ్రయం లేకపోతే ప్రకాశించరు".
****
సమస్యను పూరించండి.......
నకిలీ లంజ గతిం చరించు మృగముం తా గోరె శ్రీరామునిన్
***********
ఇందులో బూతు మాట లేదు. పదముల విరుపు గమనించండి.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
తకలీ తిర్గుగతిం మధించు సుఖమంతా ఆశ శ్రీ భ్రాంతి యున్
మకిలీ చేరుమతిం భేధించు వయసంతా చేష్ట శ్రీ శక్తి యున్
నకిలీ లంజ గతిం చరించు మృగముం తా గోరె శ్రీ రామునిన్
ఒక లీల భవతిం హరించు జగతం తా గోరె శ్రీ భక్తియున్
*అవధూత అంటే ఎవరు ? 04-03-2023
ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు
అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటు గా వచ్చి వెళ్లి పోతూ ఉంటారు. అవధూతల గురించి తెలుసుకోబోయే ముందు,సన్యాసి అంటే ఎవరు, సన్యాసం అంటే ఏమిటో తెలుసుకుందాము.
సన్యాసం నాలుగు రకాలు
వైరాగ్య సన్యాసం :: వ్యర్ధమైన విషయం వినడం చూడటం పై ఆశక్తి తగ్గిపోతుంది.
ప్రత్యేకించి ఇది ఇష్టం అది ఇష్టం లేదు అనే భావన ఉండదు . అన్ని విషయాలపై మెల్లగా అనాసక్తి మొదలౌతుంది.
జ్ఞాన సన్యాసం :: సత్ సాంగత్యం ద్వారా , లౌకిక వాంచలు తగ్గిపోయి సత్యా అసత్యా విచక్షణతో జ్ఞానంతో నిత్యం కర్మలు ఆచరిస్తూ , ఏది తనకు అంట కుండా వసిస్తూ ఉంటాడు .
జ్ఞాన వైరాగ్య సన్యాసం :: సాధన ద్వారా , ధ్యానం ద్వారా అభ్యసించి తనకు తానూ అన్వయించుకుని నిత్య ఆనంద స్దితిలో జీవిస్తాడు .
కర్మ సన్యాసం :: బ్రహ్మ చర్యము , గృహస్త , వానప్రస్త ఆశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ , ఫలితాన్ని ఆశించక కర్మలు చేస్తూ వెళ్ళిపోతూ ఉండటం .
ఈ సన్యాసులు ఆరు రకాలు
కుటిచకుడు :: శిఖ, యజ్నోపవితము దండ, కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తీ మార్గంలో వసిస్తూ అల్పాహారం తీసుకుంటూ ఉంటారు.
బహుదకుడు :: ఇతను రోజుకు ఎనిమిది ముద్దలు ఆహారం తీసుకుంటూ నిత్యం సాదాన చేస్తూ ఉంటారు
హంస :: ఇతను జడధారియై కౌపినం ధరించి ఉంటాడు.
పరమహంస :: వెదుర దండాన్ని కలిగి , ఐదు గృహాల నుండి భిక్ష తెచ్చుకుని కోపినం మాత్రం ధరించి నిరంతర సాధన లో ఉంటారు .
తురియాతితుడు :: దేహాన్ని ఓ శవంలా చూస్తాడు .
అవధూత :: ఇతనికి ఏవిధమైన నిష్ఠ నియమాలు లేవు .జగత్ మిధ్య నేను సత్యం అంటూ ,
నాశనమయ్యే ఈ శరీరం నేను కాదు. చూసే వాడికి కనిపించే ఈ రూపం నాది కాదు.
నాకు పాప పుణ్యాలు, సుఖ దుఖాలు లేవు, గర్వము మాత్సర్యము, దంభము, దర్పము, ద్వేషము, అన్నింటిని త్యజించి ప్రాణాలు నిలుపుకోవడానికి అగ్ని దేవుడికి కాస్త దొరికిన ఆహరం అర్పణ చేస్తూ, దొరకని రోజు ఏకాదశి దొరికిన రోజు ద్వాదశి అంటూ
రాత్రి పగలు నిత్య ఎరుకతో సంచారం చేస్తూ పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు.
కర్మలు అన్ని క్షయం అయిపోయి వరించిన మోక్షం అనే కంబళి కప్పుకుని ఉంటాడు ...
( నిర్వాణ షట్కానికి ప్రతి రూపం అవధూతల మరో రూపం )
***
-05 -03 -2023 నాటి రచనలు
*సమస్యను పరిష్కరించడం.. న్యస్తాక్షరి
*గజల్ ... రెందుకో
*సుభాషితం - 424
***ధ్యానం అంటే ఏమిటి?
*శ్లో|| దానపాత్రమతిక్రమ్య యదపాత్రే ప్రదీయతే।
తద్దత్తం గామతిక్రమ్య గర్దభస్య గవాహ్నికమ్॥
తా|| "దానము పొందుటకు అర్హత, యోగ్యత కలవాడికి కాక అనర్హుడికి, అయోగ్యుడికి చేసిన దానము గోమాతను కాక గాడిదను సేవించినట్లు వ్యర్థం ఔతుంది."
ధ్యానం అంటే ఏమిటి?
*ధ్యానం అంటే ఏమిటి?
ఈ ప్రశ్న ఒక పిల్లాడిని వెంటాడుతూ ఉంది. ఆ కుర్రవాడు అర్థం చేసుకోగలిగే సరళమైన భాషలో ఎలా వివరించాలో ఎంత ఆలోచించినా అతని తల్లిదండ్రులకు తెలియలేదు.
ఒకసారి వారు కుటుంబ సమేతంగా రమణ మహర్షి దర్శనానికి వెళ్లారు.
బాలుడు తన ప్రశ్నను రమణ మహర్షి ముందుంచాడు.
"ధ్యానం అంటే ఏమిటి గురువుగారూ?" అని ఆ అబ్బాయి అడిగాడు.
శ్రీ రమణమహర్షి తనలో తానే నవ్వుకున్నాడు. అప్పుడు చిరునవ్వుతో తన భక్తుడిని పిలిచి, వంటగదిలోంచి దోసె తీసుకొచ్చి ఆ అబ్బాయికి వడ్డించమని చెప్పాడు.
ఒక అరిటాకుపై, ఒక దోసె వడ్డించారు. రమణమహర్షి ఆ కుర్రాడి వైపు చూసి, "ఇప్పుడు నేను ‘మ్మ్’ అంటాను. అప్పుడే నువ్వు తినడం మొదలు పెట్టాలి. మళ్ళీ ‘మ్మ్’ అంటాను. ఆ తర్వాత నీ ఆకులో చిన్న దోసె ముక్క కూడా మిగలకూడదు." అని అన్నారు.
ఆ కుర్రాడు చాలా ఉత్సాహంగా ఒప్పుకున్నాడు. అందరూ కూడా చాలా నిశితంగా గమనిస్తూ ఉన్నారు.
ఇప్పుడు ఆ కుర్రాడు రమణమహర్షి ముఖంలోకి చూస్తూ, సంకేతం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. "మ్మ్" అని సంకేతం ఇవ్వగానే ఆ కుర్రాడు తినడం మొదలుపెట్టాడు.
ఇప్పుడు అతని దృష్టి అంతా రమణమహర్షి పైనే ఉంది. సంకేతం ఇచ్చే ముందే దోసె పూర్తి చేయాలనుకుని, అతను హడావిడిగా దోసెను పెద్ద పెద్ద ముక్కలుగా చింపి తింటున్నాడు కానీ, ఆ సమయమంతా అతని దృష్టి రమణమహర్షి పైనే ఉంది.
దోసె పరిమాణం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఒక చిన్న ముక్క మాత్రమే మిగిలి ఉంది. రెండో సంకేతం కోసం అతను రమణమహర్షి వైపు ఆత్రుతగా చూశాడు.
సంకేతం ఇచ్చిన క్షణం, ఆ కుర్రాడు వెంటనే చివరి దోసె ముక్కను నోటిలో పెట్టేసుకున్నాడు.
ఇప్పుడు రమణమహర్షి అతనిని… "ఇప్పటి వరకు నీ దృష్టి ఎక్కడ ఉంది? నాపైనా లేక దోసెపైనా లేక ఇతరులపైనా?" అని అడిగారు.
"నా దృష్టి మీ మీదా, దోసె మీదా మాత్రమే ఉంది, ఇంక దేనిమీదా లేదు”, అని ఆ అబ్బాయి బదులిచ్చాడు.
రమణమహర్షి, "అవును... నువ్వు నా మీదే శ్రద్ధ పెట్టి, దోసె పూర్తి చేయడంలో పూర్తిగా నిమగ్నమయ్యావు. నువ్వు అస్సలు పరధ్యానంగా లేవు.
అదే విధంగా, నీవు నీ దృష్టిని లేదా ఆలోచనలను భగవంతునిపై నిల్పి, నీ రోజువారీ కార్యకలాపాలను చేసినప్పుడు, దానిని ‘ధ్యానం’ అంటారు."
"మ్మ్" అన్న రెండు సంకేతాలు పుట్టుక - మరణం. ఈ రెండు సంఘటనల నడుమ, శ్రీ రమణ మహర్షి చూపించిన విధంగా… ‘ధ్యానం’ లో నిమగ్నమవ్వవచ్చు.
అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి, మనమందరం పరిపక్వమై, పరిణతి చెందాలి, దీనికి ‘దైవానుగ్రహం’ కూడా అవసరం.
*మనమందరం ఒకరికొకరు భిన్నంగా ఉంటాం, కాబట్టి ఈ గొప్ప సత్యాన్ని అర్థం చేసుకోవడానికి పట్టే సమయం కూడా వివిధరకాలుగా ఉంటుంది.
*మనస్సు బలహీనం వల్ల అన్నీ అలానే అనిపిస్తుంది, కనిపిస్తుంది.
మానసికంగా ధృడం కావాలి. అనుకున్నది పొందటం కూడ, ఒక మార్గమే ధ్యానము
*భౌతిక జీవితంలో - అనుభవాలతో ఎంత నుజ్జు నుజ్జు అయితే, ఆత్మ పరంగా అంతా మధురాతి మధురం గా మారు మనసుయే అభివృద్ధి చెందినట్టు.
*ఒకానొక అజ్ఞాని ప్రతి ఒక్క వరాన్ని ఒక శాపంలా మలచుకుంటే... ఒకానొక సుజ్ఞాని ప్రతి శాపాన్ని ఒక వరంలా మలచుకుని జీవిస్తూ ఉంటాడు.
*సృష్టికి 'సహ సృష్టి' చేస్తూ.. తనను తాను ఎప్పటికప్పుడు ఉద్ధరించుకుంటూ ఉండడమే ఆత్మ యొక్క లక్ష్యం.
*ధ్యానం చేసినప్పుడు, మనం ప్రాణాహుతి ప్రసారాన్ని అందుకుంటాం. ఇది హార్ట్‌ఫుల్‌నెస్ ప్రత్యేకత. ఇది మన చైతన్యాన్ని మెరుగుపరుస్తుంది. *
సేకరణ
*****
*మీ నాన్న గారి జీవితం కంటే మీ జీవితం మెరుగ్గా ఉంటే మీరు అదృష్ట వంతులే.కొంతమంది కోట్లు సంపాదిస్తారు.వారిలో కొందరు పూర్తిగా దివాళా తీస్తారు. మరి అలా దివాళా తీసిన వారు మీకు కనిపించరా?*
*మైక్రో సాఫ్టు అధినేత సత్యానాదెళ్ళ గారు వేల కోట్లు సంపాదించారు. కానీ వారికి పూర్తి అంగవైకల్యం ఉండి వీల్ ఛైర్ కు మాత్రమే పరిమిత మైన కొడుకు ఉండేవాడు.అతను దాదాపు 25సంవత్సరాలపాటు అలాగే జీవించి ఇటీవలే మరణించాడు.మరి వారికి వచ్చి న ఈ దురదృష్టం ఎందరికి తెలుసు?*
*అలాగే మాగుంట సుబ్బరామిరెడ్డి గారు వేలకోట్లు సంపాదించారు.వారికి మానసిక వికలాంగుడైన కొడుకు ఉండేవాడు.అతనికి అంగరంగ వైభవంగా పెళ్ళి చేశాడు. కానీ అది కూడా ఫలించలేదు.*
*మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు కూడా వందల కోట్ల ధనము సంపాదించాడు. అయినా గానీ వారిమొదటి భార్య చనిపోతే ప్రేమ తో పట్టెడు అన్నం పెట్టే వాళ్లు లేరు. అలాగని రెండో పెళ్ళి చేసుకుంటే కుటుంబ కలహాలతో పదవీ చ్యుతుడై మనస్తాపం తో చనిపోయాడు.*
*రేమండ్సు అధినేత విశ్వపతి సింఘానియా తన స్వశక్తితో రేమండ్సు కంపెనీ ని బాగా అభివృద్ధి చేశాడు వేలకోట్ల ఆస్తులను తన పుత్ర రత్నానికి బహుమతి గా ఇచ్చాడు. ఇంత చేస్తే ఆ పుత్రుడే వారిని తమ ఇంటి నుంచి బయటకు గెంటేశాడంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుంది. ?*
*మనము ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు. మనము ధర్మ మార్గం లో జీవిస్తూ ఉండటం ముఖ్యం. మన పిల్లలకు మరియు ఇతర కుటుంబ సభ్యులకు మంచి సంస్కారం అందించాలి. ఇలా ఉంటూ మన శక్తి మేరకు సంపాదిస్తూ వచ్చి న డబ్బు ను ఆస్తులను ఒక ధర్మ కర్త వలె ఖర్చు పెట్టాలి.అప్పుడే ఆ డబ్బు సుఖమును తృప్తి ని ఇస్తుంది. ఇలా తృప్తి సుఖము ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎంత సంపాదించాము అనేది ముఖ్యము కాదు.*
*ఇలా ఎంతో మంది ధనికులు చాలా బాధలు పడ్డారు.*
*డబ్బు తనతో పాటు కొంత చెడును కూడా తీసుకుని వస్తుంది. డబ్బు ఉంటే అహంకారం వస్తుంది. ఆ అహంకారమే అన్ని అనర్థాలకు మూలకారణం అవుతుంది.*
*ఇలా ప్రతివారికీ ఏవో దురదృష్టం కూడా ఉంటుంది. కావున ఇతరుల ఆస్తులను గూర్చి అసూయ పడ కూడదు.*
*ఎంత చెట్టు కు అంత గాలి ఉంటుంది. ఈ విషయం మరచిపోకూడదు.*
*మనకు ఉన్న దానితో సంతోషిస్తూ మన తెలివితేటలతో ఎక్కువ సంపాదించే కృషి చేయాలి.*
*మనకు మంచి ఆకలి వేస్తూ ఉండటం, ఆకలివేసినపుడుమంచి భోజనం, మంచి నిద్ర, ఒక ఇల్లు, సంఘంలో గౌరవ ప్రదమైన జీవితం జీవిస్తూ ఉంటే మనము చాలా ధనవంతులము, అదృష్ట వంతులము కూడా. దానికి తోడు ప్రశాంతమైన,ధర్మ మార్గం లో జీవనం. ఇవి ఉంటే అన్నీ ఉన్నట్లే.*
*ఎవరికీ ఎప్పుడూ సుఖాలు ఉండవు. సుఖపడినవారు కష్టాలు పడతారు. కష్టపడిన వారు సుఖపడే అవకాశం కూడా ఉంటుంది. కష్టపడేవారు హాయిగా భోజనం చేసి హాయిగా నిద్రపోతారు. ఈ అవకాశం చాలా మంది ధనవంతులకు లేదు గదా.*
* నాలో అనుకొని కష్టం వచ్చింది అదే నేను డిస్ట్రిక్ట్ ట్రజరి డిప్యూటీ డైరెక్టర్ ఇంచార్జ్ గా నిజామా బాద్, తెలంగాణా,
పనిచేస్తున్నప్పుడు (2016) ఆంధ్రవాడివి అని దుర్భాషలు త్రాగి మాస్టాఫ్ తిట్టుటే నాలో మార్పు తెచ్చింది
*ఏ కష్టాలు లేని వారి ఇంటి నుంచి గుప్పెడు బియ్యం తీసుకుని రాగలరా? ప్రయత్నించి చూడండి.*
*ఇలా అసూయ పడతారనే శేషప్ప కవిగారు సరళమైన తెలుగు పదాలతో ఇలా చెప్పారు.*
*తల్లి గర్భము నుంచి ధనము తేడెవ్వడు*
*వెళ్ళి పోయెడినాడు వెంటరాదు*
*లక్షాధికారైన లవణమన్నమె గాని*
*మెండుబంగారంబు మింగబోడు.*
*ఏ వస్తువు అయినా తాత్కాలికంగా సుఖమును ఆనందమును ఇస్తుంది. సుదీర్ఘ కాలములో ఎన్ని ఎక్కువ వస్తువులు ఉంటే అంత ఎక్కువ అశాంతి ఉంటుంది. కావాలంటే మీరు కూడా సేకరించి చూడండి. ఎక్కువ డబ్బు సంపాదించినా కూడా అదికూడా అశాంతికి దారితీస్తుంది.*
*మన కోరిక లే అన్ని దుఃఖాలకు మూలకారణం అని బుధ్ధుడు ఎప్పుడో చెప్పాడు. తక్కువ కోరిక లతో తృప్తిగా హాయిగా సమాజం లో గౌరవప్రదంగా జీవించడం చాలా అదృష్టం.*
....
జన్మచేత కాదు వర్ణం, కర్మ చేతనే...
బ్రాహ్మణులుగా పూజించబడి .. ఈరోజుకీ పూజింపబడుతూ .. యజ్ఞయాగాలలో నేటికీ హవిర్భాగములు కూడా అందుకుంటున్న బ్రాహ్మణేతరులు ..
(వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..)
1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు.
2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు.
3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు ..
4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు.
5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు.
6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.
7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువులచేత .. అరుంధతీవశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందుకుంటున్నారు.
వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు.
8. అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.
9. మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి.
ఇంకా ..
1. ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు.
2. ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)
3. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు.
ఉన్నతవంశాలలో పుట్టినవారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్కరించారు ... వారిలో కొందరు
1. భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు.
2. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు ..
3. రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు.
4. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు.
5. విశ్వామిత్రుడు క్షత్రియుడు.. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు.
6. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణుపురాణం 4.1.14)
7. నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది ( విష్ణుపురాణం 4.1.13).
8. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశబ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణుపురాణం 4.3.5).
9. శౌనక మహర్షి కుమారులు .. నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1).
10. అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు.
వీరిలో చాలామంది .. వేదమంత్రాలు కూడా రచించినవ.
హిందూ ధర్మం జ్ఞానంమీద ఆధారపడి నది కానీ, జన్మం మీద కాదు.
🙏🙏🙏🙏🙏💐
సేకరణ:** 05-03-2023
💑 భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం...! 💑
💖 నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు.
💖 తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ... తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే.
💖 అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు.
అహంకారి భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసంలో కలవాల్సిందే.
💖 ప్రతి భర్త తన భార్యను... మరో తల్లి రూపంగా భావిస్తే.. ప్రతి భార్య తన భర్తను.. మొదటి బిడ్డగా పరిగణిస్తుంది...ఇదే మధురమైన బంధం... ఇప్పటికీ... ఎప్పటికీ...
💖 భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం
బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.
💖 సంసారం అంటే కలసి ఉండడమే కాదు.
కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం.
💖 ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడు ఏమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని...మళ్లీ తన భార్య కళ్లలో
కన్నీరు రాకుండా చూసుకుంటాడు.
💖 భార్యాభర్తల సంబంధం శాశ్వతం. కొంతమంది మధ్యలో వస్తారు.
మధ్యలోనే పోతారు. భార్యకి భర్త శాశ్వతం. భర్తకు భార్య శాశ్వతం.
💖 ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ...
గొప్ప విద్యావంతురాలి కిందే లెక్క...!
💖 అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు. భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.
💖 మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం
ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది 'మాంగల్య బంధం'.
💖 బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే
ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి.
మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.
💖 మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది.
కానీ, తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.
💖 కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా... సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది.
భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.
💖 నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే.
నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే.
💖 ప్రేమ అనేది చాలా విలువైనది.
దాన్ని 'వివాహం' అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.
💖 సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం - కుటుంబం.
💖 గొడవ పడకుండా ఉండే బంధం కన్నా...
ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం.
💖 పెళ్లి అనేది అందమైన పూలవనం లాంటిది.
ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులనిస్తాయి.
💖 వివాహ వార్షికోత్సవం అంటే
ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పు ల సంగమాన్ని పండుగ చేసుకోవడమే.
💖 నేలకు జారిన తారకలై, ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు!!
💖 సప్తపది ఏడు అడుగులు
మొదటి అడుగు - అన్న వృద్ధికి, రెండవ అడుగు - బలవృద్ధికి
మూడవ అడుగు - ధన వృద్ధికి, నాల్గవ అడుగు - సుఖవృద్ధికి
ఐదవ అడుగు - ప్రజాపాలనకి, ఆరవ అడుగు - దాంపత్య జీవితానికి
ఏడవ అడుగు - సంతాన సమృద్ధికి
💖 కోరుకున్న ఇంతి... నేడు నీ సతి... నేడు పట్టుకున్న ఆమె చేయి...
విడవకు ఎన్నటికీ.
💖 వివాహాన్ని సుఖమయం చేసుకోవడానికి మీరెంత పొందికగా ఉన్నారనేది కాదు.
పొందిక లేని విషయాలను మీరెలా సర్దుకుంటున్నారనేది ముఖ్యం.
💖 కలిమి లేములతో... కలసిన మనసులతో... కలివిడిగా మసలుకో.. కలకాలం సుఖసంతోషాలు పంచుకో...
💖 బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే.ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ... మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు.
💖 మగవాడు గాలి పటం (అందని ఎత్తులకు ఎదగడం తెలుసు, కానీ తనను తాను నియంత్రించుకోవడం తెలీదు)
ఆడది దారం, అతడికి ఆధారం, (ఆమెకు వెన్నంటి ప్రోత్సహించడం తెలుసు, కానీ ప్రతిభను పదిమందికి ప్రదర్శించడం తెలీదు)
విడివిడిగా దేనికీ విలువ లేదు, ఒకటైతే ఇద్దరికీ తిరుగులేదు.
💖 భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు
భార్యకి భర్త భరోసా కావాలి, భారం కాకూడదు
భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి, అయోమయం కాకూడదు.
💖 మనసులోని ప్రేమని, బాధని కళ్లలో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు.
💖 అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే
ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే.
💖 పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం గురించి కాదు.
ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం.
💖 ప్రతీ అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం.
కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం.
💐💐💐💐💐💐💐💐💐💐
Comments
Post a Comment