ప్రథమాధ్యాయం - సూత్రము - 3


🌻 3. అమృత స్వరూపా చ 🌻

            అమృతం అంటే యజ్ఞశేషం. యజ్ఞం అంటే పురుష ప్రయత్నం. యజ్ఞ శేషమైన భక్తి అమృత స్వరూపం.

            భగవంతునితో మమేకం చేసే ప్రేమ జనన మరణ చక్రంనుండి రక్షిస్తుంది. కనుక ఈ పరమప్రేమ దేహసంబంధమైన మరణం కంటే భిన్నమైనది. హృదయానికి సంబంధించిన ఆత్మ తత్త్వం. 


అందువలన ఈ పరాభక్తి అనేది అమృత స్వరూపం. అనగా మరణం లేని శాశ్వత తత్త్వం. దీనినే ముక్తి, కైవల్యం, అపవర్గం అనే పదాలతో పేర్కొంటారు. 

పరాభక్తిలో భక్తుడి స్థూల శరీరం రాలి పోయిన తరువాత తిరిగి యేర్పడదు. అనగా జన్మను తీసుకోడు. సూక్ష్మ శరీరం కూడా భంగమై, ఆత్మ తత్త్వమే మిగులుతుంది. అప్పుడది అమృత స్వరూపం. దీనినే జీవేశ్వరైక్యం అని అంటారు.

శ్లో||  ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మాన మవసాదయేత్‌

            ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః ||
- భగవద్గీత

తా||  మనుజులు ఈ సంసార సాగరం నుండి తమను తామే ఉద్ధరించుకోవాలి. తమకు తామే అథోగతి పాలు కారాదు. ఏలనన లోకంలో వాస్తవంగా తమకు తామే మిత్రులు, బంధువులు, తమకు తామే శత్రువులు.             

అందువలన స్వేచ్ఛ, ఆనందం, అమృత తత్త్వాల త్రిపుటియే సాధనల పరమావధి.

సశేషం....

రేకు: 962-1
సంపుటము: 19-355
రేకు రాగము: సాళంగం.

మెఱుఁగువంటిది అలమేలుమంగ
అఱిముఱి నవ్వీని అలమేలుమంగ  !!

పలచనియెలుఁగునఁ పాడీ నీమీఁదిపాట
మెలుపుఁగూరిమి నలమేలుమంగ
చెలులతో నీసుద్ది చెప్పిచెప్పి కరఁగీని
అలయుచు సొలయుచు అలమేలుమంగ !!

యీడుగా నీరాకకు నెదురెదురు చూచీ
మేడమీఁద నుండి యలమేలుమంగ
వాడుమోముతో నీపై వలపు చల్లిచల్లి
ఆడీ నాట్యము సారె అలమేలుమంగ !!

పేరుకొని పిలిచీని ప్రియములు చెప్పిచెప్పి
మేరమీర నిన్ను అలమేలుమంగ
యీరీతి శ్రీ వేంకటేశ నిన్నుఁ కూడెఁనేఁడు
ఆరితేరె అన్నిటాను అలమేలుమంగ!!

--(())--

భావము :-

     (ఓ శ్రీనివాసా! ఈ మా అలమేలుమంగమ్మ ఎటువంటిదంటావేమో? వినుము ప్రభూ!) మా అలమేలుమంగ మెరుగు (ఆకాశంలోని మెఱపు) వంటిది. ఆమె నిన్ను చూడగానే... అరిమురి (సంభ్రమముతో) నవ్వుతుంది.

1. పలుచని యెలుగున (సన్నని గొంతుతో) మా అలమేలుమంగమ్మ నీ మీద పాటలు అల్లి పాడుతూనేవున్నది. ఆమెకు నీపై అంత మెలుపు కూరిమి (గాఢమైన ప్రేమ)వున్నది. తన చెలికత్తెలకు నీ కబుర్లు చెప్పి చెప్పి ఆ పరవశంలో కరిగిపోయి అలసిపోయింది, సొలసి పోయింది. (అట్టి మా అలమేలుమంగమ్మను అనుగ్రహించవయ్యా!)

2. మా అలమేలుమంగమ్మ, ఈడుగా (ఆలస్యమైన)నీరాక కోసం యెదురెదరు (ఎదురతెన్నులు) మేడ మీదనుంచి యెలా చూస్తున్నదో చూడవయ్యా! ఆమె సారెకు (మాటిమాటికీ), నీపై వలపు కురిపించీ నాట్యమాడీ ఆడీ, వాడుమోముతో (వాడిపోయిన మొగముతో) ఎలావున్నదో చూశావా? (నీకింకా దయరాదేమయ్యా? 

3. మా అలమేలుమంగమ్మ నీ ప్రియురాలవటంచేత నీ పేరును యెన్నిసార్లు పిలిచిందో లెక్కలేదు. మేరమీద ( అమితముగా ) నీ నామస్మరణ చేస్తూనే వున్నది. ఓ శ్రీవేంకటేశ్వరా! ఆమె ఈ విధంగా నేడు నిన్ను గూడినది. నీ సాంగత్యంలో మా అలమేలు మంగ అన్నిటిలోనూ ఆరితేరింది ప్రభూ!

--(())--

ప్రాంజలి ప్రభ - 

సన్యాసులు - రకాలు :

1. కుటీచకుడు : శిఖ , యజ్ఞోపవీతము, దండ- కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తి మార్గంలో పయనిస్తూ  అల్పాహారం తీసుకుంటూ ఉంటారు .

2 .బహూదకుడు : ఇతను రోజుకు ఎనిమిది కబళములు ఆహారం తీసుకుంటూ, నిత్యం సాధన చేస్తూ ఉంటారు. 

3. హంస : ఇతను జడధారియై కౌపీనం ధరించి, జ్ఞానియై ఉంటాడు.

4 .పరమహంస : వెదురు దండాన్ని కలిగి , ఐదు గృహాల నుండి భిక్ష తెచ్చుకుని కౌపీనం మాత్రం ధరించి ,

 నిరంతర సాధన లో ఉంటారు .

5.తురియాతీతుడు : దేహాన్ని ఓ శవంలా చూస్తాడు .

6.అవధూత :

ఇతనికి ఏవిధమైన నిష్ఠ నియమాలు లేవు .జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం అంటూ ,  నాశనమయ్యే ఈ శరీరం నేను కాదు, చూసే వాడికి కనిపించే ఈ రూపం నాది కాదు .నాకు పాప పుణ్యాలు , సుఖ దుఖాలు లేవు , గర్వము మాత్సర్యము , దంభము , దర్పము , ద్వేషము , అన్నింటిని త్యజించి ప్రాణాలు నిలుపుకోవడానికి అగ్ని దేవుడికి కాస్త దొరికిన ఆహారం అర్పణ చేస్తూ దొరకని రోజు ఏకాదశి , దొరికిన రోజు ద్వాదశి అంటూ.... రాత్రి పగలు నిత్య ఎరుకతో సంచారం చేస్తూ పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు . కర్మలు అన్ని క్షయం అయిపోయి, వరించిన మోక్షం అనే కంబళి కప్పుకుని ఉంటాడు ... ( నిర్వాణ షట్కానికి ప్రతి రూపం - అవధూతల మరో రూపం )

**************


*శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర 

కొండలరాయుడు నిలయము కొండ 

మొక్కులు తీర్చగా మోక్షమిచ్చు కొండ

కట్టెదుర

వైకుంఠము కాణాచయినకొండ

తెట్టెలాయ మహిమలే తిరుమలకొండ

వేదములే

శిలలై వెలసినదికొండ

యేదెస పుణ్యరాసులే యేరులైనదికొండ

గాదిలి

బ్రహ్మాది లోకముల కొనలకొండ

శ్రీదేవుడుండేటి శేషాద్రి యీకొండ 

సర్వదేవతలు

మృగజాతులై చరించే కొండ

నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ

వుర్విఁదపసులే

తరువులై నిలిచిన కొండ 

పూర్వపు టంజనాద్రి యీపొడవాటి కొండ 

వరముల

కొటారుగా ఎక్కణించి పెంచేకొండ

పరుగు లక్ష్మీకాంతు సోబనపుకొండ

కురిసి సంపదలెల్ల

గుహల నిండిన కొండ

విరివైన దిదివో శ్రీవేంకటపుకొండ 

పదిలంబగు

అంతరంగమే పరమ వైకుంఠం.  తిరుమల కొండ

పాపాలను హరించి మోక్ష మిచ్చె కొండ

* చక్కని

తల్లికి చాంగుభళా

తండ్రికి చాంగుభళా 

*చక్కని తల్లికి చాంగుభళా

తన చక్కెర మోవికి చాంగుభళా

మక్కువ కళ్ళచూపులకు చాంగు భళా

*కులికెడి

మురిపెపు కుమ్మరింపు చాంగు భళా 

తన సళుపు చూపులకు చాంగు భళా

*పలుకుల

సొలపుల పతితో కసరెడి చలముల యలుకకు చాంగుభళా

మలుపులు పతితో కలిగెడి సుఖముగ కదలిక చాంగుభళా 

కిన్నెరతో

పతి కెలన నిలుచు తన చన్ను మెఱుగులకు చాంగుభళా ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుభళా .

*జందెపు 

సరుల హారముల చందన గంథిక  చాంగుభళా 

 విం దైన వేంకట విభు పెనచిన తనసంది దండ్రులకు ఛాంగు భళా.

ఓం శ్రీ పద్మావతి వేంకటేశాయనమః

గోవిందా గోవిందా గోవిందా


****************************

23/03/2023.

****-*********

 పాట సందర్భంపై  నా విశ్లేషణ.

**************************

మనసులు కలిసిన ఇద్దరి ప్రేమికుల  ప్రేమ  

ఒకరిపై ఒకరికి గల ప్రేమను వ్యక్తపరుస్తు 

ప్రకృతి రమణీయతల మద్య  చిరుజల్లులు

తడిపేస్తుంటే మధుర భావాలను  పంచుకుంటు

ప్రణయ సీమలో తేలిపోతు పాడుతున్న పాట.

****************************************

 పల్లవి:-

*******

ఎదలోని భావాన్ని  ఎరుకపర్చాలంటె 

ఎదొరొచ్చి ఆపింది సిగ్గు బుగ్గ

మకరంద మనసును మార్చదంటు సెపుతుంటె 

ఉసిగొలిపింది మల్లెమొగ్గ!!


అందమ్ము నీ సొంతమని 

నా అనురాగ బంధాన్ని అడ్డుకోకే

చందన పరిమళం నీ మోమని 

చెప్పలేదెందుకే!!


అన్ని చెబితే నిన్నాపగలనా

చెప్పక నిన్ను మరవ గలనా 

తెలుసుకున్నాక  ఒక్క క్షణమైనా ఓపుకోగలనా!!

తెలియకున్నా ఏ క్షణము విడిచి ఉండ గలనా 


ఎదలోని భావాన్ని ఎరుక పరిచలంటే 

ఎదురొచ్చి ఆపింది సిగ్గు బుగ్గ!!

చరణం:-

******

నిజమే నీవు 

జయమే నీవు

 నీవు నీవు తీసివేసి  ఏకమై  ముద్దాడేసి

ఏకాంతాన్ని ఏలేద్దాము రావే రామచిలుకా

నా ప్రేమ మొలకా!!

 

శ్రావణ మేఘం  రూపం మారి

శ్రావ్యమైన చినుకు రాగంలో

ఏకస్వరమై ధారగా ఇలా పాడగా 


ఏకదారగా కురిసిన చినుకా

తడిసి మురిసేలా చేసినావే!!

పల్లవి:-

********

ఎదలోని భావాన్ని  ఎరుకపర్చాలంటే 

ఎదురొచ్చి ఆపింది సిగ్గు  బుగ్గ!!

చరణం:-

********


తడిసిన ముద్ద మందారమా ముద్దొస్తున్నావే

తపనలన్ని  తీర్చిపోవే

వలపుల వీణా   హద్దులు చెరిపేస్తున్నానే

వచ్చేసానే నీ అందాల లోగిలిలోకి

చిగురించుమా  సొగసుల సిరిచందనమా!!


తొందరపడకు సుందర వదనా 

అందరి  ముందు వద్దన్నాను

ఏదైనా మోతాదు మించితే 

ఆమోదం లభించదు  అర్థం చేసుకోరా .!!

పల్లవి:-

*******

ఎదలోని భావానికి 

ఎదురొచ్చి ఆపింది సిగ్గు  బుగ్గ!!

*****************************


Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ