శ్రీరామ నవమి 30/03

 ప్రాంజలి ప్రభ 

రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
ఓం శ్రీరామ్ - శ్రీ మాత్రేనమ:


*🚩రేపు శ్రీ రామ నవమి శుభసందర్బంగా🚩*

శ్రీరామ నామము రామ నామము రమ్యమైనది శ్రీరామ నామము  
రామ నామము రామ నామము రామ నామము రామ నామము
శ్రీమదఖిల రహస్య మంత్ర విశేష ధామము శ్రీరామ నామము ||రా|| 
దారిన ఒంటిగా నడచువారికి తోడు నీడే శ్రీరామ నామము ||రా|| 
నారదాది మహా మునీంద్రులు నమ్మినది  శ్రీరామ నామము ||రా||
కోరి కొలిచిన వారికెల్లరికి కొంగు బంగరు శ్రీరామ నామము ||రా||
పాహి కృష్ణా యనుచు ద్రౌపది పలికినది శ్రీరామ నామము ||రా||
ఆలు బిడ్డల సౌఖ్యముకన్న అధిక మైనది శ్రీరామ నామము ||రా||
నీవు నేనను భేదము లేక యున్నది శ్రీరామ నామము ||రా||
ఇడా పింగళ మధ్యమందున ఇమిడియున్నది శ్రీరామ నామము ||రా||
అండ పిండ బ్రహ్మాండముల కాధారమైనది  శ్రీరామ నామము ||రా||
గౌరికిది ఉపదేశ నామము కమలజుడు జపియించు నామము ||రా||
గోచరంబగు జగములోపల గోప్యమైనది శ్రీరామ నామము ||రా||
బ్రహ్మ సత్యము జగన్ మిథ్యా భావమే శ్రీరామ నామము ||రా||
వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామ నామము ||రా|| 
భక్తితో భజియించువారికి ముక్తినొసగును రామ నామము ||రా|| 
భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామ నామము ||రా||
ఆది మధ్యాంత రహిత మనాది సిద్ధము రామ నామము ||రా||
సకల జీవులలోన వెలిగే సాక్షి భూతము శ్రీ రామ నామము ||రా||
జన్మమృత్యుజరా వ్యాధుల జక్కబరుచును రామ నామము ||రా||
ద్వేష రాగ లోభ మోహములను ద్రెంచునది శ్రీరామ నామము ||రా||
ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీ రామ నామము ||రా||
సృష్టి స్థితి లయ కారణంబగు సుక్ష్మ రూపము రామ నామము ||రా||
శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీ రామ నామము ||రా||
సాంఖ్య మెరిగెడి  తత్త్వ విదులకు సాధనము రామ నామము ||రా||
రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది శ్రీరామ నామము ||రా||
ఆత్మసంయమయోగ సిద్ధికి ఆయుధము రామ నామము ||రా||
నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామ నామము ||రా||
కోటి జన్మల పాపమెల్లను రూపు మాపును శ్రీరామ నామము ||రా||
సత్త్వ రజస్ తమోగుణముల కతీతమైనది రామ నామము ||రా||
ఆగామి సంచిత ప్రారబ్ధముల హరియించునది శ్రీరామ నామము ||రా||
ఆశ విడచిన తృప్తులకు ఆనండమోసగును రామనామము  ||రా|| 
ప్రణవమను "ఓం" కార నాద బ్రహ్మమే శ్రీ రామనామము ||రా||
మనసు స్థిరముగ నిలుప గలిగెడి మంత్ర రాజము రామనామము ||రా||
జన్మ మృత్యు రహస్యమెరిగి జపించవలె శ్రీ రామనామము ||రా||
విషయ వాసనలెల్ల విడచిన విదితమగు రామనామము ||రా||
పసితనంబున నభ్యసించిన పట్టుబడు శ్రీ రామనామము ||రా||
సర్వ మతములలోని తత్త్వ సారమే రామనామము ||రా||
నిర్మలంబుగా శోధ చేసిన నేర్వదగు శ్రీ రామనామము ||రా|| 
విజ్ఞుడగు గురువునాశ్రయించిన విశదమగు రామనామము ||రా||
జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీ రామనామము ||రా||
మరణ కాలమునందు ముక్తికి మార్గమగు రామనామము ||రా||
పాలు మీగడ పంచదారల పక్వమే శ్రీ రామనామము ||రా||
ఎందరో మహానుభావుల నుద్ధరించిన రామనామము ||రా||
తుంటరి కామాదులను మంట గాలుపునది శ్రీ రామనామము ||రా||
మేరుగిరి శిఖరాగ్రమందున మేరయుచున్నది రామనామము ||రా||
సిద్ధ మూర్తులు మాటి మాటికి పలుకునది శ్రీ రామనామము ||రా|
వెంట తిరిగెడి వారికెల్లరి కానంద దాయకము రామనామము ||రా||
ముదముతో సద్భక్తి పరులకు మూల మంత్రము శ్రీ  రామనామము ||రా|| 
కుండలిని భేదించి చూచిన పండు వెన్నెల రామనామము ||రా||
గరుడ గమనాదులకైన కడు రమ్యమైనది శ్రీ రామనామము ||రా||
ధాత వ్రాసిన వ్రాత తుడిచెడి  దైవమే రామనామము  ||రా||
పుట్ట తానై పాము తానై బుస్స కొట్టును శ్రీ రామనామము ||రా||
అష్ట దళముల కమలమందున అమరియున్నది రామనామము ||రా||
అచలమై ఆనందమై పరమాణువైనది శ్రీ రామనామము ||రా||
జపతపంబుల కర్హమైనది జగతిలో రామనామము ||రా||
జ్ఞాన భూముల నేడు గడచిన మౌన  దేశము శ్రీ రామనామము ||రా||
తత్త్వశిఖరము  నందు వెలిగే నిత్య సత్యము రామనామము ||రా||
దట్టమైన గాఢ అంధకారములను రూపు మాపును శ్రీ రామనామము ||రా||శ్రీరామ నామము రామ నామము రమ్యమైనది శ్రీరామ నామము  
రామ నామము రామ నామము రామ నామము రామ నామము
శ్రీమదఖిల రహస్య మంత్ర విశేష ధామము శ్రీరామ నామము ||రా|| 
దారిన ఒంటిగా నడచువారికి తోడు నీడే శ్రీరామ నామము ||రా|| 
నారదాది మహా మునీంద్రులు నమ్మినది  శ్రీరామ నామము ||రా||
కోరి కొలిచిన వారికెల్లరికి కొంగు బంగరు శ్రీరామ నామము ||రా||
పాహి కృష్ణా యనుచు ద్రౌపది పలికినది శ్రీరామ నామము ||రా||
ఆలు బిడ్డల సౌఖ్యముకన్న అధిక మైనది శ్రీరామ నామము ||రా||
నీవు నేనను భేదము లేక యున్నది శ్రీరామ నామము ||రా||
ఇడా పింగళ మధ్యమందున ఇమిడియున్నది శ్రీరామ నామము ||రా||
అండ పిండ బ్రహ్మాండముల కాధారమైనది  శ్రీరామ నామము ||రా||
గౌరికిది ఉపదేశ నామము కమలజుడు జపియించు నామము ||రా||
గోచరంబగు జగములోపల గోప్యమైనది శ్రీరామ నామము ||రా||
బ్రహ్మ సత్యము జగన్ మిథ్యా భావమే శ్రీరామ నామము ||రా||🙏
_*శ్రీ రామరక్షా స్తోత్రం*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*ఇది శ్రీ బుధకౌశికముని రచించిన శ్రీ రామరక్షా స్తోత్రం పూర్తిపాఠం :*

ఓం శ్రీ గణేశాయ నమః, అస్య శ్రీ రామరక్షాస్తోత్ర మంత్రస్య, బుధకౌశిక ఋషిః, శ్రీ సీతారామచంద్రో దేవతా, అనుష్టుప్ ఛందః, సీతాశక్తిః శ్రీమాన్ హనుమాన్ కీలకం, శ్రీరామచంద్ర ప్రీత్యర్ధే, రామరక్షా స్తోత్ర జపే వినియోగః

*ధ్యానం:*

ధ్యాయే దాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థమ్

పీతం వాసో వసానం, నవకమల దళస్పర్ధి నేత్రం ప్రసన్నమ్

వామాంకారూఢ సీతా ముఖకమల మిలల్లోచనం నీరదాభమ్

నానాలంకార దీప్తం దధత మురుజటామండలం రామచంద్రమ్.

*శ్రీ రామరక్షా స్తోత్రం :*

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్

ఏకైన మక్షరం పుంసాం మహపాతక bనాశనమ్.

ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్

జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితమ్.

సా సితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్

స్వలీలయా జగత్త్రాతు మావిర్భూత మజం విభుమ్.

రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్

శిరో మే రాఘవః పాతు భాలం దశరథాత్మజః

కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్రః ప్రియః శృతీ

ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రి వత్సలః

జిహ్వాం విద్యా నిధిః పాతు కంఠం భరత వందితః

స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశ కార్ముకః

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్

మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః

సుగ్రీవేశః కటీ పాతు సక్థినీ హనుమత్ప్రభుః

ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకుల వినాశకృత్.

జానునీ సేతుకృత్పాతు జంఘే దశముఖాంతకః

పాదౌ విభీషణ శ్రీదః పాతు రామో ఖిలం వపుః

ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్

స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్.

పాతాళ భూతల వ్యోమ చారిణశ్చద్మ చారిణః

న ద్రష్టు మపి శక్తాస్తే రక్షితమ్ రామనామభిః

రామేతి రామభద్రేతి రామ చంద్రేతి వా స్మరన్

నరో నలిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి.

జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్

యఃకంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వ సిద్ధయః

వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్

అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం.

ఆదిష్టవాన్ యథా స్వప్నే రామ రక్షామిమాం హరః

తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధకౌశికః

ఆరామః కల్పవృక్షాణాం విరామస్సకలాపదామ్

అభిరామ స్త్రిలోకానామ్ రామః శ్రీమాన్సనః ప్రభుః

తరుణౌ రూపసంపన్నౌ సుమారౌ మహాబలౌ

పుండరీక విశాలాక్షా చీర కృష్ణాజినాంబరౌ

ఫలమూలసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ

పుత్రౌ దశారథ స్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ

శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్

రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘోత్తమౌ

ఆత్తసజ్యధనుషా విషుస్పృశావక్షయాశుగ నిషంగసంగినౌ

రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్.

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా

గచ్చన్ మనోరథాన్నశ్చ రామః పాతు సలక్ష్మణః

రామో దాశరథిశ్శూరో లక్ష్మణానుచరో బలీ

కాకుత్థ్సః పురుషః పూర్ణః కౌశల్యేయో రఘోత్తమః

వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః

జానకీ వల్లభః శ్రీమా నప్రమేయ పరాక్రమః

ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః

అశ్వమేథధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః

రామం దూర్వాదళశ్యామం పద్మాక్షం సీతావాససమ్

స్తువంతి నామభిర్ది వైర్నతే సంసారిణో నరాః

రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరమ్

కకుత్థ్స్యం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్

రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలమ్ శాంతమూర్తిమ్

వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్.

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే

రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

శ్రీరామ రామ రఘునందన రామరామ

శ్రీరామ రామ భరతాగ్రజ రామరామ

శ్రీరామ రామ రణకర్కశ రామ రామ

శ్రీరామ రామ శరణం భవ రామ రామ

శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి

శ్రీరామ చంద్ర చరణౌ వచ సాగ్రణామి

శ్రీరమ చంద్ర చరణౌ శిరసా నమామి

శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే

మాతా రామో మత్పితా రామచంద్రః

స్వామీ రామో మత్సఖా రామచంద్రః

సర్వస్వం మే రామచంద్రో దయాళు

ర్నాన్యం జానే నైవ జానే న జానే.

దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా

పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్.

లోకాభిరామం రణరంగధీరం

రాజీవనేత్రం రఘువంశనాథమ్

కారుణ్యరూపం కరుణాకరం తం

శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే

మనోజవం మారుతతుల్య వేగమ్

జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్

వాతాత్మజం వానరయూథ ముఖ్యమ్

శ్రీరామదూతం శరణం ప్రపద్యే.

కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్

ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం

ఆపదా మపర్తారం దాతారం సర్వసంపదామ్

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్.

భర్జనం భవబీజానా మర్జనం సుఖసంపదామ్

తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనమ్

రామో రాజమణిస్సదా విజయతే రామం రమేశం భజే

రామేణాభిహతా నిశాచర చమూ రామాయ తస్మై నమః

రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం

రామే చిత్తలయ స్సదా భవతు మే భో రామ మాముద్ధర

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

*ఇతి శ్రీ బుధకౌశిక ముని విరచితం రామరక్షాస్తోత్రం సంపూర్ణం*

 *సీతాపతి శ్రీరామచంద్రార్పణమస్తు*

.........

⚜️🕉️🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🌹🙏

💥చైత్ర శుద్ధ నవమి - #శ్రీరామనవమి..

"శ్రీరాముడు" వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు.

విశ్వామిత్రుడి యాగ సంరక్షణ కోసం బయలుదేరిన రామలక్ష్మణులు, యాగం పూర్తి కాగానే ఆ బ్రహ్మర్షి వెంట మిథిలా నగరంలోని జనక మహారాజు ఆస్థానానికి చేరుకుంటారు.

విశ్వామిత్రుడు చెప్పిన మీదట జనక మహారాజు శివధనుస్సును రామలక్ష్మణులకు చూపించటానికి సిద్ధపడి, ఆ ధనస్సును తీసుకురావల్సిందిగా తన మంత్రులను ఆదేశిస్తాడు.

నృణాం శతాని పంచాశత్‌
వ్యాయతానాం మహాత్మనామ్‌
మంజూషామ్‌ అష్టచక్రానాం
తాం సమూహస్తే కథంచన॥

బలిష్ఠులు, దీర్ఘకాయులు అయిన ఐదువేల మంది పురుషులు, ఎనిమిది చక్రాలున్న శకటం మీద అమర్చి ఉన్న శివధనుస్సును అతికష్టంతో తోసుకుంటూ తీసుకువస్తారు.

నాగ, కిన్నర, కింపురుష, యక్ష, రాక్షసులు సహా సమస్త దేవతా గణాలకు ఈ ధనుస్సును ఎక్కు పెట్టడం సాధ్యం కాలేదని జనకుడు విశ్వామిత్రుడితో చెబుతాడు.

వెంటనే విశ్వామిత్రుడు...

"వత్స రామ ధనుః పశ్య" – ‘నాయనా రామా! ఈ ధనుస్సును చూడు’ అంటాడు. 

మహర్షి వాక్యంలోని అంతరార్థం గ్రహించిన రాముడు 

"లీలయా స ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునేః"

- ఆ ధనుస్సు మధ్యభాగాన్ని చేతితో పట్టుకుని, ఎంతో అలవోకగా ఎక్కుపెడతాడు.

కేవలం రాముడి కరస్పర్శతోనే ధనుస్సు వంగుతుంది. ఎడమ చేతితో ధనుస్సును పట్టుకుని, కుడి చేతితో ఆ వింటి నారిని పైకొనకు బంధించి, ఆకర్ణాంతం అల్లెత్రాటిని లాగుతాడు.

మరుక్షణంలో ఫెళఫెళమంటూ లోక భీకరమైన శబ్దం చేస్తూ, శివధనుస్సు రెండుగా విరిగిపోతుంది. సీతారామ కల్యాణానికి ఇదే శ్రీకారం.

మహోజ్జ్వలమైన ఈ ఘట్టాన్ని ఆధ్యాత్మికంగా పరికించి చూస్తే, సమున్నతమైన ఆత్మబోధ మనకు అందుతుంది.

💥శాస్త్ర పరిభాషలో ధనుస్సు అంటే ఓంకారం (ప్రణవం) అని అర్థం.

"ప్రణవో ధనుః శిరోహ్యాత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్యతే" - అని ఉపనిషద్వాక్యం. 

ప్రణవం అంటే వంగేది అని అర్థం.
ప్రణవం ఎవరికైతే వంగుతుందో, అటువంటి వ్యక్తికి మన ఆత్మను అర్పించాలి.

ఇక్కడ ధనుస్సు రూపంలో ప్రణవం రామచంద్రునికి వంగింది.

అంటే, మన ఆత్మను అర్పించడానికి తగిన దైవం శ్రీరాముడు.

శివధనుస్సును ఎక్కుపెట్టడానికి ఎందరో దేవతలు కూడా ప్రయత్నించారు.
వారెవరికీ అది సాధ్యం కాలేదు.
అంటే ప్రణవం ఎవరికీ వంగలేదు.
రామునికి మాత్రమే వంగింది.

అంటే, మన ఆత్మార్పణకు అసలైన మార్గం శ్రీరాముడి చరణాలే అని స్పష్టమవుతుంది.
సేకరణ... 💐🙏
ప్రతీ స్త్రీ తప్పకుండా తెలుసుకోవలసిన విషయం : - 
*****************************************            నేటి సమాజంలో కొందరు స్త్రీలు తాము కోరినవి  భర్త  తేలేని  స్థితిలో ఉన్నప్పుడు, అందరి ముందూ తులనాడుతూ, అవహేళన చేస్తూ, అవమానకరంగా ప్రవర్తిస్తుంటారు. భర్తపై హాస్య ధోరణిలో మాట్లాడుతూ అపహాస్యం చేస్తుంటారు. పెళ్ళైన స్త్రీమూర్తి భర్తతో ఎలా ప్రవర్తించాలో చాటి చెప్పే గొప్ప శ్లోకం రామాయణంలో ఉన్నది.  పతివ్రతా ధర్మాన్ని ఆచరించి చూపిన మహా పతివ్రత సీతమ్మ తల్లి రావణునిచే అపరింప బడి అశోకవనంలో ఉన్నప్పుడు రాక్షస స్త్రీలతో జరిగిన సంభాషణ, అత్యంత రమణీయం. 
          వాల్మీకి మహర్షి విరచిత రామాయణం లో సుందర కాండము అత్యంత ప్రశస్తమూ రసబంధురం.అందులో ఈ శ్లోకం అత్యద్భుతంగా ఉంటుంది.ఆదికవి వాల్మీకి అని ఎందుకు అంటారో రామాయణం అంత అద్భుతంగా తాను తన దివ్య దృష్టితో కన్నదంతా పొల్లు పోకుండా విడమరచి వ్రాయడం సామాన్యులకు సాధ్యమేనా.
          లంకా రాజ్యములో రావణుని అశోక వనములో శింశుపా వృక్షము కింద సీతకు కాపలా కాస్తున్న రాక్షస స్త్రీలు ఆమెను పలు పలు విధాలా దూషించారు.
రావణుని వరించి సుఖించమని లేకున్న చంపి తినివేస్తామని బెదిరించారు. 
రావణుడు కూడా ఎన్నో ఆశలు చూపెట్టాడు. అయినా మహాపతివ్రత సీతా సాధ్వి కొంచెం కూడా చలించలేదు. ఆమె సుగుణాలు గన్న రాక్షస స్త్రీ గణం మారారు గానీ సీత ఆ లంకా సామ్రాజ్య వైభవం అంతా గడ్డిపోచతో సమానంగా భావించింది.
          సీత సుగుణాలకు ముచ్చట పడిన రాక్షస కాంతలు - రాజ్యము వైభవం ఏ మాత్రం లేని రామునే భర్తగా ఇప్పటికీ కోరుకుంటున్నావు. ఆయన్ని తిరిగి చేరినా నీకు కష్టాలు తప్ప మరేముంటుంది అని అడిగారు.దానికి సీతా మహా సాధ్వి ఇచ్చిన సమాధానం ఈ అద్భుత శ్లోకం.

దీనోవా రాజ్య హీనోవా యో మే భర్తా సమే గురు:
తం నిత్యా మనురక్తా స్మి యథా సూర్యం సువర్చలా
యథా శచీ మహా భాగా శక్రం సముపతిష్టతి
అరుంధతీ వశిష్టంచ రోహిణీ శశినం యథా
లోపాముద్ర యగస్త్యం సుకన్యా చ్యవనం యథా
సావిత్రీ సత్యవంతంచ కపిలం శ్రీమతీ యథా
సౌదాసం మదయంతీవ కేశినీ సగరం యథా
నైషధం దమయంతీవ భైమీ పతిమనువ్రతా
తథాహు మిక్ష్వాకువరం రామం పతిమనువ్రతా

            తన పతి అయిన రామునికి రాజ్యము లేకపోయినా అతను దీనస్థితిలో ఉన్నా..ఆయన యొడల నిత్యం అనురక్తితో సూర్య భగవానుని సువర్చలా దేవి , ఇంద్రుని మహాపతివ్రత శచీదేవి, క్షత్రియ వంశ గురువు వశిష్టులవారిని అరుంధతి, చంద్రుని వరించి ఆతన్నితోనే అనురక్తురాలైన రోహిణీ తార వలే , అగస్త్య మహామునిని సేవించిన లోపాముద్ర మాదిరి, చ్యవనుని సేవించిన సుకన్యవోలె, సత్యవంతుని బ్రతికించుకున్న సావిత్రి వలే, కపిలమహామునిని సేవించిన శ్రీమతి వలే, సౌదాసుని అనుసరించిన మదయంతి వోలె , సగర చక్రవర్తి ని అనుసరించిన కేశిని వలే, నలమహారాజుని వరించిన భీమ రాజ పుత్రి దమయంతీ దేవి వలే ఇక్ష్వాకు వంశ తిలకుడు తన పతి శ్రీరాముని అన్ని వేళలా అనుసరిస్తానని ఆమె చెప్పడముతో సీత శీల సౌభాగ్యానికి అమిత ముగ్ధులై ఆమె పాదాలను అప్రయత్నంగా తాకారట ఆ రాక్షస స్త్రీలు.ఇదీ మన దేశ స్త్రీల ఔన్నత్యం.ఇదీ మన భారత దేశ సౌభాగ్యము.

(సేకరణ)

[30/03, 5:54 am] Mallapragada Sridevi: _*🚩రేపు శ్రీరామ నవమి🚩*_

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి , గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో  జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము , రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణాలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.

*చరిత్ర*

రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు  కౌసల్య , సుమిత్ర , కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ , రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్రకు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు , మధ్యాహ్నం కౌసల్య రామునికి  జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ , సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు.

*ఉత్సవం*

ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా వసంతోత్సవం (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు (క్రీ.పూ) శాలివాహన శకం 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు.

*ఉత్సవంలో విశేషాలు*

ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కల్యాణం. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.

బెల్లం , మిరియాలు కలిపి తయారు చేసే పానకం  చాలా మందికి ప్రీతిపాత్రమైనది.
ఉత్సవ మూర్తుల ఊరేగింపు. రంగు నీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం.
ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు లేదా పరిమితమైన ఆహారం స్వీకరిస్తారు.
దేవాలయాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరామునితో బాటు సీతాదేవిని , లక్ష్మణుని , ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది.
భద్రాచలంలో రామదాసు చే కట్టబడిన రామాలయంలో , ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున , ముఖ్యమంత్రి తన తలమీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తాడు.
ఇస్కాన్ దేవాలయం వారు ఈ వేడుకలను నానాటికీ ఎక్కువవుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఇంకా ఘనంగా నిర్వహిస్తోంది. కొన్ని చోట్ల స్వామి నారాయణ్ జయంతిని కూడా దీనితో కలిపి జరుపుకుంటారు.

*రామ రాజ్యం*

దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో , సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల  విశ్వాసం. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్ర్యానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించాడు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఉదయాన్నే సూర్యభగవానునికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమౌతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం , అందులో రాముడు , లక్ష్మణుడు , సీత , హనుమంతుల వేషాలు ధరించిన నలుగురు వ్యక్తులు. ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు , నినాదాలతో యాత్ర సాగిపోతుంది .

శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు , రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు , రఘు  మొదలైనవారు. వీరిలో రఘు కచ్చితంగా మాట మీద నిలబడే వాడిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి తన పినతల్లి కైకకు ఇచ్చిన మాటకోసం పదునాల్గేళ్ళు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముని రఘురాముడు , రఘునాథుడు , రఘుపతి , రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలవబడుతుంటాడు.

*"ర" అక్షరం ప్రాముఖ్యత :* చారిత్రికంగా చూస్తే రామాయణం కథ ప్రాచుర్యం పొందడానికి పూర్వమే రామనవమి అనే రోజుకు ఒక ప్రాముఖ్యత ఉండేదని భావిస్తున్నారు. ముఖ్యంగా రామాయణం , రామ నవమిలలో సూర్యుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది."రవి" అంటే సూర్యుడు. ప్రాచీన ఈజిప్టు నాగరికతలో సూర్యుని "Amon Ra" లేదా "Ra" అనేవారు. లాటిన్ భాషలో కూడా "Ra" ప్రత్యయం వెలుగును సూచిస్తుంది. (ఉదా: Radiance, Radium). కడప దగ్గర ఉన్న ఒంటిమిట్ట ఆలయము కూడా ప్రాచీనమైనది.

*ప్రశస్తం*

‘రామ’ యనగా రమించుట అని అర్ధం. కాన మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న ఆ 'శ్రీరాముని’ కనుగొనుచుండవలె. 
ఒకసారి పార్వతీదేవి పరమశివుని ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అని , విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది.

దానికి పరమేశ్వరుడు , *“ఓ పార్వతీ ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా !”* అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు

*శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |*
*సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||*

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు , భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్టశిక్షణ , శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం.

ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవ శంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి , వారికి సధ్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక భక్త రామదాసు అయితే సరేసరి ! శ్రీరామనామ గానమధుపానాన్ని భక్తితో సేవించి , శ్రీరామ నీనామ మేమి రుచిరా… ఎంతోరుచిరా… మరి ఎంతో రుచిరా… అని కీర్తించాడు. మనం శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట ! అలాగనే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని , జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట ! శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి , సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు , పానకం , నైవేద్యం చేసి అందరకీ పంచుతారు.

*శ్రీ రామ నవమి 2023 తేదీ , పూజా ముహూర్తం సమయాలు*

త్రేతాయుగంలో శ్రీ రాముడు చైత్ర శుద్ధ నవమి , గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు అని పురాణాలు తెలియజేశాయి. కాబట్టి, దృక్ పంచాంగ్ ప్రకారం, శ్రీరాముడు జన్మించిన తిథి ఈ సంవత్సరం మార్చి 30న ఉదయం 11:11 నుండి మధ్యాహ్నం 1:40 వరకు ఉంటుంది. కాగా, నవమి తిథి మార్చి 29న రాత్రి 9:07 గంటలకు ప్రారంభమై మార్చి 30న రాత్రి 11:30 గంటలకు ముగుస్తుంది.



[30/03, 5:54 am] Mallapragada Sridevi: _*🚩శ్రీరామనవమి , సీతారాముల వంశ వైభవం , కళ్యాణ ప్రవర🚩*_


*రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే !*
*రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః !!*

శ్రీరాముడు జన్మించిన పవిత్ర దినముగా శ్రీ రామనవమి పండుగను జరుపుకొంటాము. ఈ సంవత్సరము మార్చి 30 వ తేదీ అనగా రేపు  గురువారం శ్రీరామ నవమి పండుగ.
 
శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారంగా భూమి మీద సంచరించి , మానవతా విలువలను తెలిపిన మహోన్నతమైన వ్యక్తి శ్రీరాముడు. ధర్మమునకు మూర్తీభవించిన నిదర్శనం శ్రీరాముడు. ఈ రోజున రామకళ్యాణం చేయుట వలన అనంత పుణ్యఫలితం లభించును. రామునిని పూజించినంతమాత్రాన ధైర్యము , విజయము లభించును. రామ నామమును జపించినా , రామకధను వినినా , సీతారామ కళ్యాణం తిలకించి పానకమును తీసుకొనినా , సీతారాముని అనుగ్రహం తప్పక కలుగును.

శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా ఇరువురి వంశ వృత్తాంతం తెలుసుకొందామా ???

*రఘువంశ వర్ణన (దశరథ మహారాజు పూర్వీకులు):*

చతుర్ముఖ బ్రహ్మ
మరీచి
కశ్యపుడు
సూర్యుడు
మనువు
ఇక్ష్వాకుడు
కుక్షి
వికుక్షి
భానుడు
అనరంయుడు
పృథుడు
త్రిశంకువు
దుందుమారుడు
మాంధాత
సుసంధి కి ఇద్ధరు ధృవసంధి, ప్రసేనజిత్‌
ధృవసంధి
భరతుడు
అశితుడు
సగరుడు
అసమంజసుడు
అంశుమంతుడు
దిలీపుడు
భగీరతుడు
కకుత్సుడు
రఘువు
ప్రవృద్ధుడు
శంఖనుడు
సుదర్శనుడు
అగ్నివర్ణుడు
శీఘ్రకుడు
మరువు
ప్రశిశృకుడు
అంబరీశుడు
నహుశుడు
యయాతి
నాభాగుడు
అజుడు
దశరథుడు
రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు.

 
*జనక వంశ వర్ణన (జనక మహారాజు పూర్వీకులు):*

నిమి చక్రవర్తి
మిథి
ఉదావసువు
నందివర్దనుడు
సుకేతువు
దేవరాతుడు
బృహధ్రతుడు కి ఇద్ధరు శూరుడు , 
మహావీరుడు.

మహావీరుడు
సుదృతి
దృష్టకేతువు
హర్యశృవుడు
మరుడు
ప్రతింధకుడు
కీర్తిరతుడు
దేవమీదుడు
విభుదుడు
మహీద్రకుడు
కీర్తిరాతుడు
మహారోముడు
స్వర్ణరోముడు
హ్రస్వరోముడు కి ఇద్దరు. జనకుడు , 
కుశద్వజుడు.

జనకుడు 
సీత , 
ఊర్మిళ

కుశద్వజుడు 
మాంఢవి , 
శృతకీర్తి
 

*శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణోత్సవములో ఉచ్చరించ వలసిన కళ్యాణ ప్రవరలు.*

*శ్రీరామ ప్రవర :-*

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.
వాసిష్ఠ ఐంద్ర ప్రమధ త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ ,
నాభాగ మహారాజ వర్మణో నప్త్రే…
అజ మహారాజ వర్మణః పౌత్రాయ…
దశరథ మహారాజ వర్మణః పుత్రాయ…
శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.

*సీతాదేవి ప్రవర :-*

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు
ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం,
స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం…
హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం…
జనక మహారాజ వర్మణః పుత్రీం…
సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం…

.......
రాముడిలో ఏమంత గొప్పదనం ఉంది? 🙏🚩

మాయలు మంత్రాలు చూపించలేదు. 
విశ్వరూపం ప్రకటించలేదు. 
జీవితంలో ఎన్నో కష్టాలు... జరగరాని సంఘటనలు... 
చిన్న వయసులోనే పినతల్లి స్వార్థానికి తండ్రిని పోగొట్టుకున్నాడు... 

పట్టాభిషేక ముహూర్తానికే అడవుల బాట పట్టాడు... 
తోడుగా, ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు... 

కారడవుల్లో కన్నీళ్లతో వెతికాడు... 
అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే రాక్షస  వధ చేశాడు... 

అందరిలాగే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు. 
లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా తాను మాత్రం విస్పష్టంగా  అహం దశరథాత్మజః - దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే’ అని ప్రకటించాడు… 
అయినా లోకమంతా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంది? 

ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు. ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కక పోయినా, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ.. ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రామయ్య ధర్మమూర్తి అయ్యాడు. లోకానికి ఒకేఒక్కడుగా నిలిచాడు.

🚩 శాస్త్ర ధర్మం 🚩
తండ్రి మాట కోసం వనవాసానికి సీత, లక్ష్మణులతో కలిసి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు. అయోధ్యలో పుత్రవియోగ దుఃఖంతో దశరథుడు మరణించారు. మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి దశరథుడికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్లి, తండ్రి మరణవార్త తెలియజేశాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రామయ్య. పెద్దకుమారుడినైనా తండ్రికి ఉత్తరక్రియలు చెయ్యలేకపోయానని బాధపడతాడు. అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తరక్రియలు చేసి, పిండితో పిండాలు చేసి, దర్భల మీద ఉంచబోయాడు. ఇంతలో బంగారు కంకణాలు ధరించిన ఓ హస్తం రాముడి ముందుకు వచ్చింది. తాను దశరథుడినని, పిండం తన చేతిలో పెట్టమని వాణి వినిపించింది. కానీ, రాముడు ఇందుకు ఒప్పుకోడు. శాస్త్రప్రమాణాలు అనుసరించి, దర్భల మీదే పిండాలు ఉంచుతాడు. నిజంగా నీవు దశరథుడవే అయితే, దర్భల మీద ఉంచిన పిండాలు స్వీకరించు. నేను మాత్రం శాస్త్ర ప్రమాణాన్ని పాటిస్తానని నిక్కచ్చిగా చెప్పాడు. తండ్రి వియోగ దుఃఖంలో ఉన్నసమయంలో కూడా శాస్త్రధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించిన ఆదర్శమూర్తి రామచంద్రమూర్తి ఒక్కడే.

🚩 స్నేహ ధర్మం 🚩
 మాయలేడి కారణంగా సీతమ్మను వదలి, పర్ణశాలను దాటి చాలా దూరం వస్తారు రామలక్ష్మణులు. ఇదే అదనుగా భావించిన రావణుడు మారు వేషంలో వచ్చి సీతమ్మను అపహరిస్తాడు. ఇదంతా గమనించిన జటాయువు రావణుడిని అడ్డగిస్తాడు. విశాలమైన తన రెక్కలే ఆయుధంగా చేసుకుని, రావణుడిని ముప్పుతిప్పలు పెడతాడు. సహనం నశించిన రావణాసురుడు జటాయువు రెక్కలు నరికివేస్తాడు. రెక్కలు తెగిన ఆ పక్షిరాజు  నేలకూలుతాడు. కొన్నాళ్లకు సీతాన్వేషణ చేస్తూ అటుగా వచ్చిన రాముడికి జరిగిన వృత్తాంతం పూర్తిగా చెప్పి, రాముడి చేతిలోనే ప్రాణం విడుస్తాడు. తనకు క్షేమం కలిగించటానికి ప్రాణాలకు తెగించిన జటాయువును ఆప్తమిత్రుడుగా స్వీకరించి, అతడికి ఉత్తరక్రియలు స్వయంగా నిర్వహిస్తాడు రామయ్య. తాను క్షత్రియుడు. చేస్తున్నది వనవాసం. మరణించింది పక్షి. అయినప్పటికీ జటాయువుకు తాను స్వయంగా ఉత్తరక్రియలు చేసి, స్నేహధర్మానికి అసలైన అర్థాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించాడా మహనీయుడు.

 🚩యుద్ధ ధర్మం 🚩
వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమను చెరబట్టాడు. తమ్ముడి భార్య కోడలితో సమానం. మామగారు తండ్రితో సమానం. తండ్రిలాగా కాపాడాల్సిన తమ్ముడి భార్యను కామంతో వాలి కోరుకున్నాడు. అంతేకాదు.. వాలి వనచరుడు. క్రూరత్వం కలిగిన వనచరాలను వేటాడటం క్షత్రియధర్మం. అంతేకాదు, ఎదుటివారి బలాన్ని తగ్గించే వరమాల వాలి మెడలో ఉంటుంది. దాన్ని ధరించిన సమయంలో వాలి ఎదుట ఎవరు నిలిచినా వారి శక్తి క్షీణిస్తుంది. కాబట్టే రాముడు చెట్టుచాటున దాగి, వాలిపై బాణాన్ని ప్రయోగించాడు. ఇది యుద్ధధర్మం. వాలి వధ ఘట్టంలో రాముడు క్షత్రియ, యుద్ధ ధర్మాలను పాటించాడు.

రావణ సంహారం తర్వాత విభీషణుడు రాముని వద్దకు వచ్చి, ఉత్తర క్రియలు నిర్వహించేందుకు అన్నగారి పార్థివ దేహాన్ని ఇమ్మని అడుగుతాడు. అప్పుడు రామచంద్రుడు

మరణాంతాని వైరాని నివృత్తం నః ప్రయోజనం | క్రియతామద్య సంస్కారః మమాప్యేష యథా తవ ||

 ‘విభీషణా! శతృత్వం ఎంతటిదైనా అది చావుతో ముగిసిపోతుంది. సంధి కుదరకపోవడం వల్ల యుద్ధం చేయాల్సి వచ్చింది. మీ అన్నగారికి ఆచార విధి ప్రకారం ఉత్తర క్రియలు జరిపించు. ఇక నుంచి ఈయన నీకు మాత్రమే కాదు. నాకూ అన్నగారే’ అంటాడు... ఇదీ రాముడి ధర్మవర్తన

🚩దయా ధర్మం 🚩
సీతను రాముడికి అప్పగించమని హితబోధ చేసిన విభీషణుడికి రాజ్యబహిష్కరణ శిక్ష వేస్తాడు రావణుడు. సముద్రతీరంలో అపారమైన వానరసేనతో ఉన్న రామచంద్రుడి పాదాలను ఆశ్రయిస్తాడు విభీషణుడు. మరో ఆలోచన లేకుండా విభీషణుడికి అభయం ఇస్తాడు రామయ్య. అంతేకాదు, రావణుడిని చంపి విభీషణుడిని లంకా రాజ్యానికి రాజును చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. కానీ, సుగ్రీవుడు మొదలైన వారికి ఇదంతా ఇష్టం లేదు. ఏకాంతంలో ఉన్న రామయ్య దగ్గరకు వెళ్లి, విభీషణుడిని నమ్మవద్దని చెబుతారు. అతడు రావణాసురుడి దూత అంటూ హెచ్చరిస్తారు. అంతా విన్న రాముడు విభీషణుడే కాదు... చివరకు రావణుడే తనను ఆశ్రయించినా.. అతడికి కూడా అభయం ఇస్తానంటాడు. ఆశ్రయించిన ప్రాణులకు రక్షణ కల్పించటం క్షత్రియధర్మం. దయాధర్మం కూడా. వనవాసంలో ఉన్నా, చివరకు యుద్ధభూమిలో ఉన్నా దయాధర్మాన్ని రామయ్య విడిచిపెట్టలేదు. 

🚩మనుష్య ధర్మం 🚩
రామరావణ సంగ్రామం ముగుస్తుంది. రావణుడు నేలకు ఒరుగుతాడు. ముల్లోకాలూ ఎంతో ఆనందిస్తాయి. వానరసేన చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇంతలో బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమవుతారు. రాముడిని సాక్షాత్తు శ్రీమహావిష్ణు స్వరూపంగా స్తుతిస్తారు. ‘నీది విష్ణు అంశ. వాస్తవానికి నువ్వు నిరాకారుడివి. అయినా సాకారుడిగా ఉన్నావు. సృష్టి, స్థితి, లయలు నీవే నిర్వహిస్తావు...’ అంటూ రాముడికి దైవత్వాన్ని ఆపాదిస్తారు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి చెప్పినా రాముడు తాను దైవాన్నని చెప్పుకోలేదు. తనకు దైవత్వాన్ని ఆపాదించుకోలేదు.

 ‘ఆత్మానం మానుషం మన్యే... దశరథాత్మజః’ 

అంటూ తాను కేవలం దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే. సాధారణ వ్యక్తిని మాత్రమే’ అంటాడు. ఇదీ రామయ్య పాటించిన మనుష్యధర్మం. రామయ్య ఎక్కడా మాయలు, మంత్రాలు ప్రకటించలేదు. తాను దైవాన్నని చెప్పుకోలేదు. సాధారణ పౌరుడిలాగే రాజ్యభోగాలతో పాటు సుఖదుఃఖాలూ అనుభవించాడు. మనుష్యధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన అవతారమూర్తి శ్రీరాముడు.

🚩 సోదర ధర్మం 🚩 
రావణ వధ జరిగింది. లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావలసిందిగా విభీషణుడుకి వర్తమానం పంపించి, విశ్రాంతిగా కూర్చున్నాడు రామయ్య. దూరంగా ఓ స్త్రీమూర్తి వడివడిగా అడుగులు వేసుకుంటూ తన వైపే వస్తోంది. ఆమె ఎవరై ఉంటుంది? రాముడి ఆలోచన సాగుతుండగానే ఆమె  ఎదురుగా వచ్చి నిలుచుంది. అమ్మా! నీవెవరు? ఎందుకిలా వచ్చావు? రక్తసిక్తమైన రణభూమిని చూస్తుంటే నీకు భయంగా అనిపించటం లేదా? నా వల్ల ఏదైనా సాయం కావాలా? అంటూ రామయ్య ఎంతో వినమ్రంగా ఆమెను అడిగాడు. అందుకామె సమాధానం ఇస్తూ, రామచంద్రమూర్తీ! నన్ను మండోదరి అంటారు. నీ చేతిలో మరణించిన రావణాసురుడి భార్యను. రామా! నీవు ధర్మమూర్తివనీ, ఏకపత్నీవ్రతుడవనీ,  సీతను తప్ప మరే ఇతర స్త్రీ పేరు కూడా తలచవనీ విన్నాను. నా భర్త అనేకమంది స్త్రీలను చెరపట్టాడు. నీవంటి ఉత్తమ గుణసంపన్నుడైన యోధుడిని చూడాలనే కుతూహలంతో వచ్చాను. పరస్త్రీని చూడగానే వినమ్రంగా ఉన్నప్పుడే నీ ఔన్నత్యం అర్థమైంది. రామా! ధన్యురాలను. ఇక సెలవు. అంటూ నిష్క్రమించింది. ఇదీ.. పరస్త్రీల పై రామయ్య చూపించే సోదరధర్మం.

పవిత్ర జీవితం కోసం, ముక్తి కోసం సాధన చేసే యోగులు రామునిలా జీవించాలని అనుకుంటారు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా మారొచ్చు. ఎలాగైనా ఉండొచ్చు. నిరీక్షించి.. కాలపరీక్షను ఎదుర్కోవడం వివేకవంతుల లక్షణం. 

రాముడూ అదే చేశాడు. ఎప్పుడూ ప్రణాళిక బద్ధంగానే జీవితం నడుస్తుందని భావించలేం. మన ప్రమేయం లేకుండా చికాకులు కలుగుతాయి. వాటికి కుంగిపోతే జీవితం గతి తప్పుతుంది. గుచ్చుకున్న ముల్లును నెమ్మదిగా తొలగించి ముందుకెళ్లాలి. అలా చేయగలిగితే అద్భుతమైన అనుభూతి మిగులుతుంది. ఏ విషయాన్నైనా సక్రమంగా నిర్వర్తించే సామర్ధ్యం పెరుగుతుంది. 

రాముడిని ఆదర్శంగా తీసుకోవడం అంటే ఆరాధన కోసం కాదు. మన జీవితాలను మనమే ఉద్ధరించుకోవాలన్నది అందులోని పరమార్థం. త్యాగం, ధర్మం, దయ, పరాక్రమం రామునిలోని గొప్ప లక్షణాలు. వీటిని పెంపొందించుకోవాలని చెప్పేదే రామాయణం.

      🚩🌹🌿🌹🙏 జై శ్రీరామ్ 🙏🌹🌿🌹🚩

*సీత *

ఏకపత్నివ్రతుడు రాముడు.. సీత అనుకుంది "నాలోనివు నీలోనేనని "

రాక్షస వధలో విరామమెరుగని రాముని, రామకథను ముందుకు నడిపించిన సీత మహత్‌ చరితమే రామాయణం. కథానాయకుడు రాముడైనా, కథంతా సీతదే. ప్రకృతి యావత్తూ పసిపాప రూపమై, బీడు వారిన గుండెలతో నిరీక్షిస్తున్న జనకుని చేరి సీతగా మిథిలాపురిని మురిపించినా, ప్రాచీన వైవాహిక సంప్రదాయాలకు మారురూపుగా చెప్పే శివధనువును పునరుద్ధరించే ప్రయత్నం చేసిన శ్రీరాముని చేయందుకుని దాంపత్య ధర్మ ప్రతిష్ఠాపనలో తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినా సీతకే చెల్లింది. సమస్త మానవీయ విలువలకు, ఉద్వేగ నిరూపణలకు, ధర్మరక్షణకు, అపురూపమైన కుటుంబ సంబంధాలకు, కోరిక-త్యాగాలకూ, ప్రకృతికీ-మనిషికీ, నిస్వార్థ పరమార్థాలకు వెన్నుదన్నుగా నిలిచి నేటికీ, ఏ నాటికీ కీర్తిని పొందేది రామాయణమైతే, అంతటి సుందర రామ కథా మణిహారంలో కలికితురాయి సీత. ఒక్క మాటలో చెప్పాలంటే సీత పరిపూర్ణ స్త్రీత్వానికి ప్రతీక. తరాలు మారినా తరగని విలువల గని. ఆమె నుంచి మనం స్ఫూర్తి పొందవలసిన అంశాలెన్నో!..

జ్ఞానభూమిలో పుట్టి జనక రాజర్షి కనుసన్నల్లో పెరిగిన సీత, బ్రహ్మవాదిని గార్గి చేత ప్రభావితమైంది. తద్వారా సకల ధర్మశాస్త్రాల్లో అపార జ్ఞానసముపార్జితురాలైంది. ప్రశ్నించేతత్వాన్ని ఆకళింపు చేసుకుంది. ఆ తత్వమే ఆమె వ్యక్తిత్వ వికాసానికి పునాది రాయి.

*తనదే నిర్ణయం*

: సీత.. తాను తీసుకున్న నిర్ణయాలతో తనకెదురైన అన్ని పరిస్థితులకూ స్వయంసిద్ధగా ఉందే కానీ దేనికీ మరొకరిని కారణంగా చూపించలేదు. అది.. అయోధ్యను వదిలి అడవికి వెళ్ళటమైనా, లక్ష్మణ రేఖ దాటడమైనా, కడలి దాటించగలనన్న హనుమ వినతిని తిరస్కరించటమైనా, సుతులతో తిరిగి రాజ్యానికి రమ్మన్న రాముని కాదని భూమాత ఒడికి చేరుకోవడమైనా.. ప్రతి సందర్భంలోనూ ఆమె తన నిర్ణయానికే కట్టుబడి ఉంది

*ధైర్యశాలి*: శింశుపావనంలో ఘోర రక్కసులు తనను చుట్టుముట్టినా, రావణుడంతటి వాడు తన ఎదుట నిలిచి సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించినా అతనికి లొంగలేదు. సహజ క్షమాగుణంతో రావణుని ప్రవర్తనలో మార్పును కోరిందే కానీ రాక్షస కుల వినాశనాన్ని కోరలేదు.

*వివేకవంతురాలు* రావణుడు మాయోపాయంతో తనను లంకకు ఎత్తుకుపోయే సమయంలోనూ తనకున్న కొద్దిపాటి నగలను జారవిడిచి తన ఉనికిని సూచించింది. మరోసారి మోసపోకూడదన్న ముందు జాగ్రత్తతో... పరిపూర్ణ విశ్వాసం కలిగించిన తర్వాతే హనుమతో మాట కలిపింది.

*ఆత్మగౌరవం*: తన కోసం నిరీక్షించిన భర్త కోసం, ఆనాటి పరిస్థితుల ప్రకారం అగ్నిపరీక్షకు అంగీకరించింది. కానీ, నిండు గర్భిణైన తనను అడవులపాలు చేసిన రాముడు, అయోధ్య ప్రజలు తిరిగి తనను రమ్మని ఎంత ప్రాధేయపడ్డా అంగీకరించలేదు. మాటిమాటికీ నిందలు భరించటం తనవల్ల కాదంది. ఆమె ఏ పని చేసినా తన ఆత్మసంతృప్తికే గానీ సమాజ అభ్యంతరాలకు లొంగి కాదు. ప్రజలు, పరిస్థితులూ- వారి మనోభావాలూ సీత జీవితంలో ఒక భాగమే కానీ వాటి కోసం తన వ్యక్తిత్వాన్ని ఏనాడూ మార్చుకోలేదు. ప్రాణం కన్నా మిన్నగా సీతను ప్రేమించిన రాముడు, ఆమెను వదిలేస్తున్నానని చెప్పినా.. ఆవేశానికి లోను కాలేదు, ఏ అఘాయిత్యానికీ పాల్పడలేదు. భార్యాభర్తల బంధం సజావుగా సాగటానికి ఒక అవకాశమిచ్చిందే కానీ దాని కోసం తన ఆత్మగౌరవాన్ని మాత్రం తగ్గించుకోలేదు.

*నమ్మకం*: సీతకు భర్త పరాక్రమంపై నమ్మకమూ ఎక్కువే. అందుకే రాముడు వస్తాడని, తనను సగౌరవంగా తీసుకువెళతాడనీ రావణుడితో సవాల్‌ చేయగలిగింది. గడ్డిపోచ కన్నా హీనంగా రావణున్ని చూడగలిగింది. ఏకపత్నీవ్రతుడైన తన భర్త చేతిలో రావణుడికి తగిన దండన తప్పదంది. అన్నట్టుగానే దానిని నిలుపుకున్నాడు రాముడు. అందుకే వారు ఆదర్శప్రాయులయ్యారు.

*స్వావలంబన*: ఇది సీత సొంతం. ఎంతటి గడ్డు పరిస్థితుల్లోనూ తనను తాను నిలుపుకున్న తీరు అద్భుతం. ఆమె తనపై తాను ఆధారపడ్డంతగా ఎవరిపైనా ఆధారపదలేదన్నది వాస్తవం. నాటి సీత చేసి, చూపించింది మన తరాలకి అనుసరణీయం. ఆ బాటలో నడుద్దాం.

- సేకరణ 

*రామాయణం ఎందుకు చదవాలి ?* 

**********************#******

నిజమే, రామాయణం ఎందుకు చదవాలి? 

ఎప్పుడో త్రేతాయుగం నాటి కథ. వందల పేజీల గ్రంథం. అదే సమయంలో ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకమో చది వితే, ఎంతోకొంత స్ఫూర్తి కలుగుతుంది. ఏ నెట్ లో సినిమా చూస్తే చక్కని కాలక్షేపం 

లభిస్తుంది. ఏ ఆఫీసుపనో చేసుకుంటే బాసు ప్రశంసా అందుతుంది. కానీ, ఈ ప్రయోజనాలన్నీ తాత్కా లికం.

 రామాయణానికి నిన్ను పరిపూర్ణ వ్యక్తిగా మార్చే శక్తి ఉంది. ఆ స్ఫూర్తి పదాడంబర వికాస పుస్తకంలా పక్షానికో, పున్నానికో పరిమితం కాదు. జీవితాంతం వెన్నంటి నిలుస్తుంది. ఇక,చిన్నచిన్న కష్టాలకే ఆత్మహత్య ఆలోచనలు రావు. ఒకటి రెండు అపోహలతోనే బంధాలు బీటలువారవు. ఆస్తిపాస్తుల కోసం అన్నదమ్ములతో తగువు పెట్టుకోం. 

దశరథ పుత్రుడైన రాముడు ఎన్ని కష్టాలు అనుభవిం చాడూ?

ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నాడు ? 

రాజ్యాన్ని కోల్పోయాడు, తండ్రిని కోల్పోయాడు. భార్య దూరమైంది, ఓ దశలో సోదరుడూ ప్రాణాపాయంలో పడ్డాడు. అయినా, ధైర్యాన్ని వీడలేదు. ఓటమిని అంగీకరించలేదు. 

వానర సైన్యాన్ని కూడ గట్టుకున్నాడు. సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడు. మహా శక్తిమంతుడైన రావణుడితో యుద్ధం చేశాడు. గెలిచాడు. ప్రజల హృదయాల్లో నిలిచాడు. అదీ పోరాట పటిమ. 

రాముడితో మనకు పోలికే మిటి? అనుకోవడానికి వీల్లేదు.

రాముడు ఎక్కడా తాను దేవుడినని చెప్పుకోలేదు. అలా ప్రవర్తించనూ లేదు. దశరథ పుత్రుడినైన శ్రీరాముడిని అనే ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు. మనిషిలోని సాధారణ ఉద్వేగాలన్నీ రాముడిలోనూ ఉన్నాయి. కాకపోతే రాముడు ధర్మాన్ని నమ్మాడు. ధర్మాన్నే ఆచరించాడు. 

విగ్రహవాన్ ధర్మః అనిపించుకున్నాడు. 

అదే అతడిని పురుషోత్తముడిని చేసింది.

రామాయణం అంటేనే రాముడు నడిచిన దారి. 

వాల్మీకం చదవకపోతే ఓ విలువలమార్గం 

శాశ్వతంగా మూసుకుపోతుంది. రామాయణం నిజంగానే మ...హా కావ్యం! 

ఏడుభాగాలు, ఐదువందల అధ్యాయాలు, ఇరవైనాలు గువేల పద్యాల సమాహారం. ప్రతి అధ్యాయాన్నీ సర్గ అంటారు. ప్రతి పద్యాన్ని శ్లోకం అంటారు. 

రామాయణం పేరుకు రామకథే 

కానీ... నదులూ, పర్వతాలూ, అడువులూ, వివిధ దేశాలూ, అనేకానేక లోకాలూ కథాక్రమంలో ప్రస్తావనకు వచ్చాయి. భిన్న జాతుల మనుషుల్నీ, వృక్షాల్నీ, పశుపక్ష్యాదుల్ని పరిచయం చేశాడు వాల్మీకి. ఎంతోమంది రాజులు తారసపడతారు. వారి వంశాలూ తెలుస్తాయి


ఆ ప్రకారంగా రామాయణంలో చరిత్ర ఉంది, 

భూగోళం ఉంది, జీవ-జంతుశాస్త్రాలు ఉన్నాయి.

 ఇక మంచిచెడుల విషయానికొస్తే ఇది అచ్చమైన విలువల వాచకం. యుద్ధ వ్యూహాలూ, రణ తంత్రాలూ ఉన్నాయి. వాటిని నేటి రాజకీయాలకు అన్వయించుకుని పొలిటికల్ సైన్స్ కో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తో అనుబంధంగా చేర్చుకోవచ్చు. 

విశ్వాన్ని కూడా వర్ణించారు కాబట్టి, అంతరిక్ష శాస్త్రంగానూ పరిగణించుకోవచ్చు.

మొత్తంగా రామాయణం సమగ్ర విజ్ఞాన సర్వస్వం!

సకల శాస్త్రాల సారం వాల్మీకి మహర్షి రామాయణాన్ని శ్రీరామపట్టాభిషేకానికో, రావణ సంహారానికో పరిమితం చేయలేదు. సకల వేదాల సారాన్నీ, ఉపనిషత్తుల రహస్యాల్నీ ఒడుపుగా ఇమిడ్చాడు. వ్యక్తిధర్మం, రాజధర్మం, పుత్రధర్మం... అన్నింటికీ మించి మానవ ధర్మం - రామకథలో అంతర్లీనం. 

సీతారామ కల్యాణం సమయంలో జనకుడు...రామయ్యకు సీతమ్మను అప్పగిస్తూ 'ఛాయేవానుగతా సదా...! ఇక నుంచీ ఈమె సహధర్మచారిణి, నీడలా నీ వెంట వస్తుంది - అని చెబుతాడు. అతను ఆమెకు నీడ. ఆమె అతనికి నీడ. ఇంతకుమించిన వివాహధర్మం ఏం ఉంటుంది? క్షణికమైన మోహాలూ, పైపై మెరుగులూ జీవితాల్ని ఎలా ఛిన్నాభిన్నం చేస్తాయో హృదయాలకు హత్తుకునేలా వివరించాడు వాల్మీకి. 

ఎంతో విజ్ఞురాలు అయినా కూడా బంగారు వన్నెలో మెరిసిపోతున్న లేడిని చూడగానే సీత మనసు వశం తప్పింది.

చర్మణా హృతచేతనా !మహా పండితుడైన రావణుడు సైతం బంగారుబొమ్మలా ఉన్న సీత మ్మను చూసీచూడంగానే మనసు పారేసుకున్నాడు,

మోహావేశానికి గురయ్యాడు. 

కాత్వంకాంచ నవర్ణభా! నిభాయించుకోలేని ఓ చిన్న బలహీనతే సీతను రాముడికి దూరం చేసింది, రావణుడిని ధర్మానికి దూరం చేసింది. అని సరిపోలుస్తాడు వాల్మీకి.

 నేటికాలపు అమాయక సీతమ్మలకూ, దురహంకారులైన దశ కంఠులకూ పరోక్షంగా హెచ్చరిక చేశాడు వాల్మీకి. మనం తీయని మాటల్నే నమ్ముతాం. అవి అబద్దాలైనా సరే ఆనందంగా ఆస్వాదిస్తాం. మనకు అయిష్టమైన సత్యాల్ని ఆమోదించడానికి సాహసించం. రావణుడూ అంతే. కాబట్టే, మారీచుడు చెప్పిన మంచి దశకంఠుడి చెవి కెక్కలేదు. 'సులభ్యా పురుషా రాజన్ సతతం ప్రియవాదినః'రావణా తీయ తీయని మాటలు చెప్పేవాళ్లు ఎక్కడైనా ఉంటారు. నాలాగా కఠిన వాస్తవాలు వివరించి మరీ హెచ్చరించేవాళ్లు చాలా అరుదు. దయ చేసి సమస్య తీవ్రతను అర్థం చేసుకో ' అంటూ జరగబోయే తీవ్ర పరిణామాల్ని కళ్లకుకడతాడు. ఏ అహంకారీ వాటిని పట్టించుకోడు. 

దీంతో, తమ పతనానికి తామే కారణం అవుతారు.

 రాముడి శరాఘాతానికి నేలకూలిన 'వాలి', చివరి మాటగా కొడుకు 'అంగదుడికి' హితోపదేశం చేస్తాడిలా 'ఎవరి మీదా మితిమీరిన ప్రేమ చూపించ వద్దు. ఎవరినీ అతిగా ద్వేషించవద్దు'.

 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం ఈ రెండు కారణాలతోనే నూటికి ఎనభైశాతం హత్యలూ హత్యా ప్రయత్నాలూ ఆత్మహత్యలు జరుగుతున్నాయి.

ఇంకో మంచి మాటా అన్నాడు

కృతఘ్నే నాస్తి నిష్కృతిః' ఇతరులు చేసిన మంచిని మరచిపోవడం మహాపాపం, దానికి పరిహారమే లేదు. 

ఆన్లైన్ వేదికలూ డేటింగ్ యాప్స్ పొద్దున్నే నేస్తాలైపోయి, సాయంత్రానికి దుకాణం కట్టేసుకునే ఇంట్ ఫ్రెండ్ షిప్ కూ అన్వయించు కోదగిన సుభాషితమూ ఒకటుంది. "సర్వథా సుకరం మిత్రం, దుష్కరం" ప్రతిపాలనం  స్నేహం చేయడం సులభమే దాన్ని నిలబెట్టుకోవడమే మహా కష్టం! 

ప్రమోషన్లు రాలేదనో, ఇంక్రిమెంట్లు పడలేదనో పని మానేసి మరీ బాధపడిపోయే కెరీర్ జీవులకు వాల్మీకి ఓ గెలుపు మార్గం చెప్పాడు. యజమాని మనసు ఎలా గెలుచుకోవాలో బోధించాడు.

రాముడిని మించిన బాసూ, హనుమంతుడిని మించిన దాసూ ప్రపంచంలో ఎక్కడుంటారు? 'ప్రాజెక్ట్ లంక' విజయవంతం అయిన సందర్భంగా రాముడు ఆంజనేయుడిని బెస్ట్ ఎంప్లాయీగా

గుర్తిస్తాడు. 'యజమాని అంచనాలకు మించి పనిచేసే వాడే ఉత్తమ సేవకుడు. సమర్థత ఉండి కూడా ఒళ్లు దాచుకునేవాడు అథమ స్థాయికి చెందినవాడు' అంటూ అప్రెయిజలో హెమోర్ విభాగానికి పని కొచ్చే కొలమానాన్ని అందించాడు ఆదికవి.

మనం పంచ్ డైలాగులుగా చెప్పుకొని మురిసిపోయే సంభాషణల్ని తలదన్నే వాక్యాలు రామాయణంలో అనేకం. మనోఫలకం మీద ఆ దృశ్యాన్ని ఊహించుకోగలిగితే గ్రాఫిక్స్ కోసమో, ఎఫెక్ట్స్ కోసమో హాలీవుడ్ సినిమాలు చూసి సమయాన్ని వృథా చేసుకోవాల్సిన పరిస్థితే రాదు.

 హనుమంతుడు అశోక వృక్షం మీద వాలే సమయానికి సీతా దేవి'ముక్కలైన విశ్వాసంలా ఉంది' అంటాడు. పొడిపొడి మాటల్లో ఎంత పదునైన వ్యక్తీకరణ? ఆ వర్ణనలూ అంతే. రావణుడు అపహరించే సమయానికి పసుపు పచ్చని చీరలో ఉంది సీతాదేవి. ఆకాశంలో పుష్పక విమానం ఎగిరిపోతుంటే.. ఆ గాలికి చీర కొంగు రెపరెపలాడుతున్నది. పక్కనే నల్లగా అంతెత్తున రావణుడు. ఆ దృశ్యం ఏదో పర్వతం మీద మంటలు అంటుకున్నట్టుగా ఉందట. ఎంత గొప్ప వర్ణన!

 రాముడు అరణ్యవాసానికి వెళ్లిపోగానే దశరథుడు దుఃఖంలో మునిగిపోతాడు. అనారోగ్యం కబళిస్తుంది. చూపు మందగిస్తుంది. ఆ విషాదకర సన్నివేశంలో కౌసల్యతో ఓ మాట అంటాడు' రాముడు నా కనుపాప. తనతోపాటు నా చూపూ వెళ్లిపోయింది'.అనుబంధ వాచకం రాముడు భారతీయుల కుటుంబసభ్యుడు, గురువు, దేవుడు సమస్తం! భార్య భర్తలో రాముడిని చూసుకుంటుంది. తమ్ముడు అన్నలో రాముడిని చూసుకుంటాడు. తండ్రి కొడుకులో రాముడిని చూసుకుంటాడు. కానీ నేటితరాలే, క్రమక్రమంగా రాముడికి దూరం అవుతున్నాయి.

రామాయణాన్ని దూరం చేసు కుంటున్నాయి. కాబట్టే, ఆ జీవితాల్లో సంక్షోభం మొదలవుతున్నది. బంధాలకు బీటలు పడుతున్నాయి. అనుబంధాల్ని ఆస్తులు మింగేస్తున్నాయి

అదెంత నీచమైన చర్యో శ్రీరాముడే సెలవిచ్చాడు. తమను కలవడానికి వస్తున్న భరతుడిని చూసి.. దండయాత్రకు బయల్దేరాడేమో అని శంకించాడు లక్ష్మణుడు. ఆ దాడిని ఎదుర్కో వడానికి ఆయుధాలు సిద్ధం చేసుకున్నాడు. ఆ సందర్భంలో రాముడు చెప్పిన మాట ఇది "యద్ధవ్యం బాస్టవానాం వా మిత్రాణాం వాక్షయే భవేత్ నాహం తత్ ప్రతిగృహ్లియాం భక్ష్యాన్విషకృతానివ" బంధువుల్నో మిత్రుల్నో దూరం చేసుకోవడం వల్ల లభించే సంపద విషం కలిపిన భక్ష్యం లాంటిది. దాన్ని నేను అస్సలు ముట్టుకోను .

లాభాల కోసమో, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో అడ్డదారులు తొక్కే వ్యాపారవేత్తలకూ ఉన్నతాధికారు లకూ అయోధ్యకాండ ఓ హెచ్చరిక చేసింది. 

సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా  సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదమ్.సిరిసంపదల దేవత అయిన లక్ష్మి ఎల్లప్పుడూ సత్యాన్నే ఆశ్రయించి ఉంటుంది. మనం సత్యా నికి దూరమైతే ఆ సిరి దేవి కూడా మనకు దూరమైపోతుంది. జైలుపాలూ బెయి లుపాలూ అవు తున్న మాజీ కుబే రుల వైఫల్య కారణం ఇదే. 

రామకథ తెలియక పోవడం వల్ల కావచ్చు, నవత రానికి జీవితం పట్ల ప్రేమఉండటం లేదు. సమస్యలతో పోరాడే తెగువ కనిపించడం లేదు. ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా చావులోనే పరిష్కారాన్ని వెదుక్కుంటున్నారు. చేజేతులా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. నిద్రమాత్రలు మింగడానికి ఓ పూట ముందో, ఉరితాడు బిగించుకోడానికి ఓ రోజు ముందుకనీసం సంక్షిప్త రామాయణాన్ని తిరగేసినా తమ నిర్ణయం ఎంత మూర్ఖమైందో అర్థమైపోతుంది

. 'బతికుంటే ఏదో ఒక రోజు విజయాన్ని సాధించవచ్చు. అదే చావును ఎంచుకుంటే, ఆ ఆస్కారమే ఉండదు' అని 

సలహా ఇస్తుంది రామాయణం

. ఎట్టి పరిస్థితి లోనూ విషాదాన్ని మనసులోకి రానివ్వకూడదని సలహా ఇస్తాడు వాల్మీకి. 

'విషాదం మహా దుర్మార్గమైంది. కోపంతో బుసలు కొడుతున్న పాము, అమాయకుడైన పసివాడిని కాటేసినట్టు... విషాదం అంతెత్తు మనిషిని కూడా మింగేస్తుంది' అని బోధిస్తుంది. తల్లిదండ్రుల పట్ల దయలేని పిల్లల్ని దాశరథి రామ బాణం లాంటి ఓ మాట అంటాడు... 'కన్నవారిని గౌరవించలేని వారికి, దేవుడిని పూజించే అర్హతాఉండదు'.

ఆదికావ్యం.. ప్రాంతీయ,జాతీయ, అంతర్జాతీయ సాహిత్యాలకూ మహోపకారం చేసింది. కేంద్ర సాహిత్య అకాడమీ.... రామాయణం ఆధారంగా వచ్చిన గ్రంథాల వివరాలు సేకరించింది.

 వరుసగా పేర్లు రాసుకుంటూ వెళ్తే రెండు సంపుటాలు ప్రచురించాల్సి వచ్చింది. రామాయణాలే వెయ్యికి పైగా ఉన్నాయి. ఉర్దూ, నేపాలీ, జర్మన్ ఇలా దాదాపు యాభై భాషల్లోకి రామాయణాన్ని అనువదించుకున్నారు. జైనులూ, బౌద్ధులూ కూడా ఆ గ్రంథాన్ని కళ్లకు అద్దుకున్నారు.రామాయణ తత్వాన్ని మరింత లోతుగా విశ్లేషిస్తూ రామరహస్యోపనిషత్తు, సీతోపనిషత్తు తదితర ఆధ్యాత్మిక గ్రంథాలూ వెలువడ్డాయి సీతారాములు నాయికానాయకులుగా ప్రాణం పోసుకున్న నాటకాలూ చలనచిత్రాలూ జానపద గాథలూ వర్ణచిత్రాలూ లెక్కలేనన్ని

 తెలుగువారైన త్యాగయ్య, రామదాసు, తూము నరసింహదాసు, అన్నమయ్య తదితర వాగ్గేయకారులు తమ సంకీర్తనలతో రామసార్వభౌముడిని అర్చించారు. తరించారు. 

వాల్మీకి రామాయాణాన్ని గద్యంలా చదువుకోవచ్చు. లయబద్ధంగా పాడుకోనూవచ్చు. కాబట్టే, 'పాఠ్యేగేయేచ మధురం'అంటారు లాక్షణికులు.

 ఆదికావ్యం తదనంతర కవులకు కూడా పెద్దబాలశిక్షలా ఉపయోగపడింది. అందుకేనేమో భోజుడు వాల్మీకిని 'మార్గదర్శిః మహర్షి!' అంటూ కొనియాడారు.

అతడికో కథ చెబుతుంది'ఓ పులి పరిగెత్తుకుంటూ వేటగాడికి ఎదురొచ్చింది. దీంతో వేటగాడు భయంతో చెట్టు ఎక్కాడు. అప్పటికే ఓ కొమ్మ మీద ఎలుగుబంటి ఉంది. 'నువ్వేం భయపడవద్దు. నేను నీకు హానిచేయను' అని అతడికి హామీ ఇచ్చింది ఎలుగుబంటి. వేటగాడు ఊపిరి పీల్చుకున్నాడు. వేటగాడు మన ఉమ్మడి శత్రువు. తోసెయ్' సలహా ఇచ్చింది కింది నుంచి పులి. అయినా, ఎలుగుబంటి ఆ మాట వినలేదు. కొద్దిసేపటికి ఎలుగు బంటి నిద్రలోకి జారుకుంటుంది. అదే అదనుగాభావించి... 'వేటగాడా ! ఆ ఎలుగుబంటిని నమ్మొద్దు. నేను వెళ్లిపోయాక నిన్ను తినేయాలని దాని పన్నాగం. ముందు దాన్ని కిందికి తోసెయ్' అని చెప్పింది జిత్తుల మారిపులి. వేటగాడు నిజమే అనుకున్నాడు. కిందికి తోసే శాడు. మనిషిలోని కృతఘ్నుడిని బట్టబయలు చేసే కథ ఇది

మరో కథలో రాజు ఓ బ్రాహ్మణునికి గోవును దానం చేస్తాడు. అది కాస్తా మందలో తప్పిపోయి రాజు గారి పశువులలో కలుస్తుంది. రాజు దాన్నే ఇంకో బ్రాహ్మ ణుడికి దానం చేస్తాడు. మొత్తానికి ఇద్దరూ ఆగోవు నాదంటే నాదంటూ గొడవపడతారు. న్యాయం కోసం ప్రభువు దగ్గరికి వెళ్తారు. ఎన్ని రోజులు ఎదురు చూసినా రాజదర్శనం లభించదు. నిరాశతో పాలకుడికి శాపం పెట్టి వెళ్లిపోతారు. పాలకులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలనేది ఈ కథలోని నీతి. 'రాజా ప్రియద ర్శనః' అన్న చాణక్య నీతికి ఈ కథ ఆధారం కావచ్చు.

అరణ్యవాస సమయంలో విల్లంబులతో తిరుగుతున్న రాముడికి సీత ఓ కథ చెబుతుంది... 'ఆయుధం మహాప్రమాదకారి. మనసును క్రూరంగా మార్చేస్తుంది. 

పూర్వం ఓ ముని తీవ్రమైన తపస్సు చేసుకుంటున్నాడు. అది చూసి ఇంద్రుడు అభద్రతకు లోనయ్యాడు. కొంప దీసి ఇంద్రపదవిని కోరుకుంటాడేమో అన్న అనుమానం

మొదలైంది. దీంతో మాయా రూపంలో వెళ్లి 'స్వామీ! నేను పరదేశిని. ఈ ఆయుధాన్ని మీ దగ్గర భద్రపరుచుకోండి. తిరుగు ప్రయాణంలో తీసుకుంటాను' అని కోరాడు. కాదనడానికి ఏ కారణమూ కనిపించలేదు మునీశ్వరుడికి. ఆయుధాన్ని తన కమండలం పక్కన పెట్టుకున్నాడు. కానీ, ఆయుధం చేతిలోకి రాగానే అతడి ఆలోచనలు మారిపోసాగాయి. మొదట మొక్కల్నీ కొమ్మల్నీ నరికాడు. ఆ తర్వాత జంతువుల ప్రాణాలూ తీయసాగాడు. దీంతో ఆలోచనలు పక్కదారి పట్టాయి. క్రూరాత్ముడిగా 

మారాడు. నరకానికి చేరుకున్నాడు'ఇలా, వ్యక్తిధర్మం నుంచి రాజధర్మం వరకూ రామాయణంలో లేనిదంటూ లేదు.

 ఆ సూత్రాలు పైపై నీతిబోధలు కావు. ఆచరణాత్మకాలు. జీవితమనే ప్రయోగశాలలో తానే ఓ గాజు నాళికగా మారిపోయి సత్య పరీక్షలు జరుపుకొన్నాడు శ్రీరాముడు. అంతిమంగా సత్యమే గెలు స్తుందని నిరూపించాడు. కాబట్టే, భారతీయులు రాము డిని గుండెల్లో నింపుకొన్నారు.

రామాయణాన్ని నెత్తిన పెట్టుకున్నారు. రామాయణాన్ని దూరం చేసుకున్న కొద్దీ.. రావణుడికి దగ్గరవుతున్నట్టే! క్రమక్రమంగా పదితలల మృగంలా మారుతున్నట్టే! జాగృతః జాగృతః జాగృతః

*గగనం గగనాకారం. సాగరః సాగరోపమః రామరావణ యోర్యుద్ధం రామరావణ యోరివ

ఆకాశానికి ఆకాశమే సాటి. సముద్రానికి సముద్రమే సాటి. రామరావణ యుద్దానికి రామరావణ యుద్ధమే సాటి.

రామాయణానికి రామాయణమే సాటి!

రాముడంటే శుచిః : మనసూ శరీరమూ పరిశుభ్రమే. సానుక్రోశః : దయామయుడు. సమదుఖః : ఇతరుల బాధల్ని పంచుకునేవాడు. అహింసా చభూతానాం : ఏ జీవికీ హింస చేయనివాడు. సత్యవాదిన్ : నిత్యం సత్యమే పలికేవాడు. క్రియాపరః : కర్తవ్యానికి 

ప్రాధాన్యం ఇచ్చేవాడు. సమర్థః : సర్వసమర్థుడు. సారగ్రాహిన్ : ఏ విషయాన్ని అయినా ఇట్టే ఆకళింపు చేసుకోగలవాడు ధర్మస్య పరిరక్షితా : ధర్మాన్ని కాపాడేవాడు. సర్వసమః : ప్రజలందర్నీ సమానంగా చూసేవాడు, స్మితపూర్వభాషీ : చిరునవ్వుతో సంభాషణ ప్రారంభించేవాడు. నిత్యంప్రశాంతాత్మా: ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు. నచానృతకథః : అబద్ధం పలకనివాడు. అప్రమత్తః : ఏమరుపాటు లేనివాడు.

జై శ్రీరామ్  -  జై హనుమాన్

........
*॥ శ్రీ శంకరాచార్య కృతం శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రమ్॥*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

*1) విశుద్ధం పరం సచ్చిదానన్దరూపమ్- గుణాధారమాధారహీనం వరేణ్యమ్ ।*
*మహాన్తం విభాన్తం గుహాన్తం గుణాన్తం సుఖాన్తం స్వయం ధామ రామం ప్రపద్యే ॥*

*విశుద్ధుడును , మాయాతీతుడును , సత్తామాత్రుడును , సచ్చిదానందరూపుడును , గుణాధారుడును , ఆధారహీనుడును , శ్రేష్ఠుడును , అఖండముగా వెలుగుచుండువాడును , బుద్ధికి అతీతుడును , గుణములకు అంతమందుండువాడును , సుఖ స్థానమైనవాడును , స్వయంజ్యోతి రూపుడును అగు రాముని చేరుచున్నాను.*



*2) శివం నిత్యమేకం విభుం తారకాఖ్యం   సుఖాకారమాకారశూన్యం సుమాన్యమ్ ।*
*మహేశం కలేశం సురేశం పరేశం  నరేశం నిరీశం మహీశం ప్రపద్యే ॥*

*మంగళకరుడును , నిత్యుడును , సజాతీయాది భేద త్రయ రహితుడును , సర్వవ్యాపకుడును , తారక నాముడును (నామ జపము చేసిన వారిని తరింప జేయువాడు) , సుఖరూపుడును , ఆనంద భిన్నమైన ఆకారము లేనివాడును , మిక్కిలి మాననీయుడును (పూజ్యుడు) , మహేశ్వరుడును , సర్వ కళలకు ప్రభువును , దేవతలకును ప్రభువగువాడును , పరమేశ్వరుడును , సర్వజనాధిపతియు , ఈ భూమికంతకూ ప్రభువగు వాడును అగు శ్రీరాముని చేరుచున్నాను.*



*3) యదావర్ణయత్కర్ణ మూలేఽన్తకాలే  శివో రామ రామేతి రామేతి కాశ్యామ్ ।*
*తదేకం పరం తారకబ్రహ్మరూపం భజేఽహం భజేఽహం భజేఽహం భజేఽహమ్ ॥*

*శివుడు కాశీలో ప్రాణుల మరణ సమయమున చెవిలో రామరామరామ అని చెప్పునట్టి ఆ ఏకైక తారక బ్రహ్మ రూపమైన రామునే ఎల్లకాలమునూ సేవింతును.*



*4) మహారత్నపీఠే శుభే కల్పమూలే సుఖాసీనమాదిత్యకోటిప్రకాశమ్ ।*
*సదా జానకీలక్ష్మణో పేతమేకం సదా రామచన్ద్రమ్ భజేఽహం భజేఽహమ్॥*

*మంగళకరమైన కల్పవృక్షము మొదట సుఖముగా కూర్చుండి వేయి సూర్యులవలే ప్రకాశించుచూ నిత్యము సీతా లక్ష్మణ సమేతుడైయుండు నా రామచంద్రుని నిత్యము సేవించెదను.*



*5) క్వణద్రత్నమన్జీర పాదారవిన్దమ్- లసన్మేఖలాచారుపీతామ్బరాఢ్యమ్ ।*
*మహారత్నహారోల్లసత్కౌస్తుభాఙ్గం నదచ్చఞ్చరీమఞ్జరీలోలమాలమ్ ॥*

*శ్రీ రామచంద్రా ! నీ పద్మములవంటి పాదములు మ్రోయుచున్న రత్నపుటందెలతో ఎంత ఆకర్షకములుగా నున్నవి? కటి స్థలము తళతళలాడు మొలత్రాడుతో బిగించిన పీతాంబరముతో ప్రకాశించుచున్నది. నీ వక్షస్థలము గొప్ప గొప్ప రత్నహారములతోనూ, కౌస్తుభమణితోనూ , పూగుత్తుల వంటి రొద చేయుచూ ముసురుచున్న తుమ్మెదలు గల పూలదండలతోనూ , దర్శనీయముగానూ ఉన్నది.*



*6) లసచ్చన్ద్రికాస్మేర శోణాధరాభమ్- సముద్యత్పతఙ్గేన్దుకోటిప్రకాశమ్ ।*
*నమద్బ్రహ్మరుద్రాదికోటీరరత్న- స్ఫురత్కాన్తినీరాజనారాధితాన్ఘ్రిమ్ ॥*

 *నీ చిరునవ్వు వెన్నెలవలే మెరయు చున్నది.క్రింది పెదవి ఎఱ్ఱని కాంతి కలదై యొప్పుచున్నది. ఉదయించుచున్న కోటి సూర్య చంద్రుల కాంతితో వెలుగుచున్నాడవు. తలలు వంచి నమస్కరించుచున్న బ్రహ్మాది దేవతల కిరీటముల యందలి రత్నకాంతులు నీ పాదములకు నీరాజనములుగా నున్నవి.*



*7) పురః ప్రాఞ్జలీనాఞ్జనేయాదిభక్తాన్- స్వచిన్ముద్రయా భద్రయా బోధయన్తమ్ ।*
*భజేఽహం భజేఽహం సదా రామచన్ద్రం త్వదన్యం న మన్యే న మన్యే న మన్యే ॥*

*ఎదుట దోయి లొగ్గి ప్రార్థించుచూ నిలిచియున్న ఆంజనేయాది భక్తులకు మంగళకరమైన చిన్ముద్రతో (చూపుడు వ్రేలు బొటన వ్రేలు కలిపి పట్టిన ముద్ర) జ్ఞానబోధ చేయుచున్న ఓ రామా! నేనెల్లప్పుడును నిన్నే కొలుతును . నిన్ను కాక మరొకరిని తలపనే తలపను. ముమ్మాటికినీ తలపను.*



*8) యదా మత్సమీపం కృతాన్తః సమేత్య ప్రచణ్డప్రతాపైర్భటైర్భీషయేన్మామ్ ।*
*తదావిష్కరోషి త్వదీయం స్వరూపం తదాపత్ప్రణాశం సకోదణ్డబాణమ్ ॥*

*ఓ స్వామీ ! యముడు మహా భయంకరులైన తన దూతలచేత నన్ను పలకరింపబూనినపుడు సజ్జనుల ఆపదలుబాప బూని ధనుర్బాణములు పూనియున్న నీ దివ్య రూపమును నాకు చూపుదువుగాక.*



*9) నిజే మానసే మన్దిరే సంనిధేహి ప్రసీద ప్రసీద ప్రభో రామచన్ద్ర ।*
*ససౌమిత్రిణా కైకేయీనన్దనేన స్వశక్త్యానుభక్త్యా చ సంసేవ్యమాన ॥*

*భరత శత్రుఘ్న లక్ష్మణులచే మిక్కిలి భక్తి శ్రద్ధలతో సేవింపబడుచున్న ఓ రామచంద్రమూర్తీ ! నా యెడల ప్రసన్నుడవై నా మనోమందిరమున నిలువుమయ్యా!*



*10) స్వభక్తాగ్రగణ్యైః కపీశైర్మహీశై- రనీకైరనేకైశ్చ రామ ప్రసీద।*
*నమస్తే నమోఽస్త్వీశ రామ ప్రసీద ప్రశాధి ప్రశాధి ప్రకాశం ప్రభో మామ్ ॥*

*నీ భక్తులలో మొదట లెక్కింపదగిన వారైన వానరాధిపతులతోను భూపతులతోను అనేకాక్షౌహిణీ సేనలతోను కూడుకొని యున్న ఓ రామచంద్రా! నీకు పదే పదే నమస్కరించుచున్నాను. నా యెడల సుప్రసన్నుడవై తగిన విధముగా నన్ను నడిపింపుము. శాసింపుము.*



*11) త్వమేవాసి దైవం పరం మే యదేకం సుచైతన్యమేతత్త్వదన్యం న మన్యే ।*
*యతోఽభూదమేయం వియద్వాయుతేజో- జలోర్వ్యాదికార్యం చరం చాచరం చ ॥*

*ఏ చైతన్యము వలన ఇంతని లెక్కవేయ శక్యము కానిదియూ పంచభూతాత్మకమైనదియూనైన చరాచర జగత్తును ఓషధులును , అన్నమునూ మొదలైనవి పుట్టెనో ఆ చైతన్యము నీవే. వేఱు కాదు. అన్నిటికంటెనూ పైనున్న అద్వితీయమైన దైవమును నీవే.*

*12)నమః సచ్చిదానన్దరూపాయ తస్మై నమో దేవదేవాయ రామాయ తుభ్యమ్ ।*
*నమో జానకీజీవితేశాయ తుభ్యం నమః పుణ్డరీకాయతాక్షాయ తుభ్యమ్ ॥*

*సచ్చిదానంద రూపుడవును తత్త్వరూపుడవు అయిన రామా! ఓ దేవదేవా! నీకు వందనము. జానకీ జీవిత నాథుడవైన రామా! పద్మములవలె విశాలమైన నయనములు కలవాడా! నీకు నమస్కారము.*



*13) నమో భక్తియుక్తానురక్తాయ తుభ్యం నమః పుణ్యపుఞ్జైకలభ్యాయ తుభ్యమ్ ।*
*నమో వేదవేద్యాయ చాద్యాయ పుంసే నమః సున్దరాయేన్దిరావల్లభాయ ॥*

*భక్తులను ప్రేమతో రక్షించునీకు వందనము. పుణ్యరాశులకు మాత్రమే దొరకునట్టి నీకు నమస్కారము. వేదముల చేత మాత్రమే తెలిసికొనదగిన ఆది పురుషుడవైన నీకు నతులు. లక్ష్మీవల్లభుడవును సుందరుడవును అగు నీకు నమస్సులు.*



*14)నమో విశ్వకర్త్రే నమో విశ్వహర్త్రే నమో విశ్వభోక్త్రే నమో విశ్వమాత్రే ।*
*నమో విశ్వనేత్రే నమో విశ్వజేత్రే  నమో విశ్వపిత్రే నమో విశ్వమాత్రే ॥*

*స్వామీ యీ విశ్వమును నిర్మించువాడవు హరించువాడవును నీవే. ఈ జగత్తును అనుభవించు వాడవును దీని పరిమాణమును తెలిసికొన గలవాడవును నీవే. ఈ విశ్వమునకు నాయకుడవుగాని జయించువాడవుగాని నీవే. ఈ సర్వ జగత్తునకును నీవే తండ్రివి . నీవే తల్లివి. అట్టి నీకు పునః పునః వందనములు.*



*15) శిలాపి త్వదన్ఘ్రిక్షమాసఙ్గిరేణు- ప్రసాదాద్ధి చైతన్యమాధత్త రామ ।*
*నరస్త్వత్పదద్వన్ద్వసేవావిధానా-త్సుచైతన్యమేతేతి కిం చిత్రమద్య ॥*

*నీ పాద పద్మములనందలి భూరేణువుల అనుగ్రహము వలన రాయికూడ చైతన్యము పొందియుండగా నీ పాదపద్మారాధన వలన నరుడు చైతన్యమును పొందుననుటలో వింత ఏమి కలదు?*



*16)పవిత్రం చరిత్రం విచిత్రం త్వదీయం నరా యే స్మరన్త్యన్వహం రామచన్ద్ర ।*
*భవన్తం భవాన్తం భరన్తం భజన్తో లభన్తే కృతాన్తం న పశ్యన్త్యతోఽన్తే ॥*

*పవిత్రమును విచిత్రమునునైన నీ చరిత్రమును నిత్యము స్మరించుచు సంసారాంతకుడవును జగద్భారమును వహించువాడవు అయిన నిన్ను సేవించు జనులు అనేక శుభములను పొందుదురు. మరణ కాలమున యముని చూడరు. అనగా పుణ్యలోకములను పొందెదరని భావము.*



*17) స పుణ్యః స గణ్యః శరణ్యో మమాయం నరో వేద యో దేవచూడామణిం త్వామ్ ।*
*సదాకారమేకం చిదానన్దరూపం మనోవాగగమ్యం పరన్ధామ రామ ॥*

*ఓ రామా! ఏ మానవుడు దేవతా శ్రేష్ఠుడవైన నిన్ను సద్రూపమైనదియును , చిద్రూపమైనదియును , అద్వితీయమును , ఆనందరూపమును , వాక్కునకుగాని , మనస్సునకుగాని , అందనిదియును సర్వతత్త్వాతీతమైన పరమ తేజమునుగా గ్రహించునో వాడే పుణ్యాత్ముడు. వాడే ఉత్తముడుగా గణింపదగినవాడు. అతడే నాకు శరణమంద దగినవాడు.*



*18)ప్రచణ్డప్రతాపప్రభావాభిభూత- ప్రభూతారివీర ప్రభో రామచన్ద్ర ।*
*బలం తే కథం వర్ణ్యతేఽతీవ బాల్యే యతోఽఖణ్డి చణ్డీశకోదణ్డదణ్డః ॥*

*తీక్ష్ణమైన్ ప్రతాప ప్రభావము చేత గొప్ప గొప్ప శత్రువులను నిర్జించిన ఓ రామచంద్రప్రభూ! ఎవ్వరికిని కదల్పరాని శివధనుస్సును బాల్యముననే ముక్కలు చేసిన నీ బలమును ఎట్లు వర్ణింపగలను?*



*19)దశగ్రీవముగ్రం సపుత్రం సమిత్రం సరిద్దుర్గమధ్యస్థరక్షోగణేశమ్ ।*
*భవన్తం వినా రామ వీరో నరో వా ఽసురో వాఽమరో వా జయేత్కస్త్రిలోక్యామ్ ॥*

*ఓ రామమూర్తీ ! చుట్టును సముద్రముతో నున్న దుర్గమున అనేక రాక్షసాక్షౌహిణీ ప్రభువై యుగ్రుడైయున్న దశగ్రీవుని సపుత్త్ర మిత్రముగా నీవుగాక యీ మూడులోకములయందునూ , ఏ నరుడుగాని , అసురుడుగాని , అమరుడుగాని , చంపగలడా?*



*20)సదా రామ రామేతి రామామృతం తే సదారామమానన్ద నిష్యన్దకన్దమ్ ।*
*పిబన్తం నమన్తం సుదన్తం హసన్తం హనూమన్తమన్తర్భజే తం నితాన్తమ్ ॥*

*సజ్జనులకు సుఖకరమైనదై ఆనందరసమును ప్రవహింపచేయు దుంపయనదగు రామనామమను అమృతమును నిత్యము గ్రోలుచు , ఆనందమగ్నుడై నమ్రుడగుచు దంత కాంతు లెసగనవ్వుచు నుండెడి హనుమంతుని నిరంతరము నా మనమున కొలుతును.*



*21)సదా రామ రామేతి రామామృతమ్ తే సదారామమానన్ద నిష్యన్దకన్దమ్ ।*
*పిబన్నన్వహం నన్వహం నైవ మృత్యో- ర్బిభేమి ప్రసాదాదసాదాత్తవైవ ॥*

*ఓ రామా! నిత్యమును సజ్జనాశ్రయమైనదియును , ఆనంద ప్రవాహమునకు మూలకారణమైనదియు అయిన రామ రామ యను నీనామామృతమును ప్రతిదినమును త్రావుచున్న నాకు నీ అనుగ్రహము వలన మృత్యుభయమే లేకుండెను.*



*22)అసీతాసమేతైరకోదణ్డభూశై-రసౌమిత్రివన్ద్యైరచణ్డప్రతాపైః ।*
*అలఙ్కేశకాలైరసుగ్రీవమిత్రై-రరామాభిధేయైరలమ్ దేవతైర్నః ॥*

*సీతాసమేతమును , కోదండభూషితమును , లక్ష్మణాభివందితమును , తీవ్రప్రతాపయుతమును , రావణాంతకమును , సుగ్రీవ సఖమును , రామ సంజ్ఞితమును గాని ఇతర దైవతములతో మాకేమిపని రాముని తక్క ఇతరదైవమును సేవింపనని భావము.*



*23) అవీరాసనస్థైర చిన్ముద్రికాఢ్యై- రభక్తాఞ్జనేయాదితత్త్వప్రకాశైః ।*
*అమన్దారమూలైరమన్దారమాలై-రరామాభిధేయైరలమ్ దేవతైర్నః ॥*

*వీరాసనము వేయని , చిన్ముద్ర వహించని , భక్తులగు ఆంజనేయాదులకు తత్త్వప్రకాశము చేయని మందారమూల ముందుండని , మందారమాలలేని రామ సంజ్ఞితము కాని అన్య దేవతలతో మాకేమి పని ? పై లక్షణము కలిగిన రాముడే మాకు దైవమని తాత్పర్యము.*



*24) అసిన్ధుప్రకోపైర వన్ద్యప్రతాపై-రబన్ధుప్రయాణైరమన్దస్మితాఢ్యైః ।*
*అదణ్డప్రవాసైరఖణ్డప్రబోధై-రరామభిదేయైరలమ్ దేవతైర్నః ॥*

*సముద్రమునందు కోపము , జూపజాలని , నమస్కరింపదగిన ప్రతాపము లేని , బంధువుల యిండ్లకు వలె ప్రజల గృహములకు వెళ్ళి క్షేమము తెలిసి కొనని , మందహాస సుందరము కాని , పితృవాక్య పరిపాలనా వ్యాజమున లోకమునకు మార్గదర్శకముగా దండక ప్రవాసము సేయజాలని , అఖండ జ్ఞాన విశేషము లేని రామ సంజ్ఞితముగాని యితర దైవములతో మాకేమిపని? పై లక్షణములు కలిగిన రాముడే మాకు దైవమని తాత్పర్యము.*



*25) హరే రామ సీతాపతే రావణారే ఖరారే మురారేఽసురారే పరేతి ।*
*లపన్తం నయన్తం సదాకాలమేవ సమాలోకయాలోకయాశేషబన్ధో ॥*

*హరే! రామ! సీతానాయక! రావణాంతకా! ఖరహంతకా! మురాసురాంతకా! రాక్షసనాశకా! పరమపురుషా! అని ఎప్పుడును స్మరించుకొనుచు ఇట్లు కాలము గడుపు నన్ను చూడుము. ఓ జగద్బాంధవా నన్ను కరుణింపుము.*



*26) నమస్తే సుమిత్రాసుపుత్రాభివన్ద్య నమస్తే సదా కైకయీనన్దనేడ్య ।*
*నమస్తే సదా వానరాధీశవన్ద్య నమస్తే నమస్తే సదా రామచన్ద్ర ॥*

*సుమిత్రా పుత్రునిచే నమస్కరింపబడుచుండువాడా! కైకేయీ కుమారునిచే స్తుతింపబడువాడా! వానరేంద్రునిచే అభివందితుడవగుచుండువాడా! ఓ రామచంద్రా! నీకు పునః పునః అభివందనములు.*



*27) ప్రసీద ప్రసీద ప్రచణ్డ ప్రతాప ప్రసీద ప్రసీద ప్రచణ్డారికాల ।*
*ప్రసీద ప్రసీద ప్రపన్నానుకమ్పిన్! ప్రసీద ప్రసీద ప్రభో రామచన్ద్ర ॥*

*అతి తీక్ష్ణo అయిన ప్రతాపము గల ఓ రామమూర్తీ! శత్రువులకు ఘోరమృత్యువైనవాడా! శరణాగతులను దయచూచు ఓ స్వామీ! నా యెడ గడుంగడు ప్రసన్నుడవగువయ్యా.*



*28) భుజఙ్గప్రయాతం పరం వేదసారం ముదా రామచన్ద్రస్య భక్త్యా చ నిత్యమ్ ।*
*పఠన్ సన్తతం చిన్తయన్ స్వాన్తరఙ్గే స ఏవ స్వయమ్ రామచన్ద్రః స ధన్యః ॥*

*వేద సారమును ఉత్తమము అగు ఈ రామభుజంగ ప్రయాత స్తవరాజమును భక్తితో సంతోషముతో నిత్యమును పఠించుచూ ఈ స్తోత్రమును మనస్సునందు నిరంతరమును మననము చేయునట్టివాడు కడుంగడు ధన్యుడు. అతడు స్వయముగా శ్రీ రామచంద్ర స్వరూపుడే అగును.*

*॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం శ్రీరామభుజఙ్గ ప్రయాతస్తోత్రం సమ్పూర్ణమ్ ॥*

🕉️🌞🌍🌙🌟🚩

*‘ఆత్మశుద్ధిలేని ఆచారమదియేల?’*

     

పూర్వం ఒక దేశంలో కరువొచ్చింది. తినడానికి కూడా ఏమీ దొరకని రోజులు దాపురించాయి.

ఆకలికి ప్రాణం పోయే పరిస్థితిలో ఒక పండితుడు దారివెంట నడుస్తున్నాడు.

అదే దారిలో ఓ రాయిపై కూర్చొని శనగలు తింటున్న బాటసారిని గమనించాడు. ‘ఆకలితో ప్రాణాలు పోయేలా ఉన్నాయి. మీరు తినేదాంట్లో నాకు కొంత ఇస్తారా’ అని అడిగాడు.

‘ఇవి తప్ప నా దగ్గర వేరే ఏమీ లేవు. చూస్తే పండితుడిలా ఉన్నారు. ఎంగిలివి ఎలా పెట్టను?’ అన్నాడు బాటసారి.

ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఎంగిలివి తిన్నా తప్పులేదు’ అన్నాడు పండితుడు. 

బాటసారి తన దగ్గర ఉన్న శనగల్లోంచి కొన్ని అతనికి ఇచ్చాడు.

పండితుడు అందులో కొన్ని మాత్రమే తిన్నాడు. ‘నా ఆకలి కాస్త తగ్గింది. ఇంట్లో నా భార్య ఆకలితో చనిపోయేలా ఉంది. ఇవి ఇస్తే తన ప్రాణం కూడా నిలబడుతుంది’ అన్నాడు పండితుడు.

ఎండిపోయిన శనగలు అంత తేలిగ్గా గొంతు దిగవు’ అని చెప్తూ తాగమని పండితుడికి నీళ్లు ఇచ్చాడు.

‘ఎంగిలి నీళ్లు కదా వద్దులే!’ అన్నాడు పండితుడు.

ఇందాక తిన్న శనగలు ఎంగిలివే కదా!’ ఆశ్చర్యంగా అడిగాడు.

‘శనగలు తినకముందున్న స్థితి ఇప్పుడు లేదు. ప్రాణం కాస్త కుదుటపడింది’ అని అతనికి కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయాడు.

‘ఆత్మశుద్ధిలేని ఆచారమదియేల?’ అన్నారు వేమన. అది నిజమే అయినా దానికీ మినహాయింపు ఉంటుందని ధర్మశాస్త్రం చెప్తున్నది. ఆకలితో ప్రాణం పోయే పరిస్థితి ఉన్నప్పుడు అంటు, ఎంగిలి అని చూడకుండా ఏది దొరికితే అది తిని ప్రాణం కాపాడుకోవాలని శాస్త్రం చెప్తున్నది.

అభిమానంతో ఎవరైనా, ఏదైనా పెడితే ఎంగిలి అని నిరాకరించొద్దని కూడా శాస్త్ర వచనం.

శబరి ఎంతో అభిమానంతో ఇచ్చిన ఎంగిలిపండ్లను రాముడు తిన్నాడు కదా! శబరికి మోక్షం ప్రసాదించాడు.

ధర్మం కోసం ఏది చేసినా అది ధర్మమే. ధర్మాన్ని విస్మరిస్తే పాపమవుతుంది.

పండితుడు శనగలను తీసుకువెళ్లి తన భార్యకు ఇచ్చాడు. అప్పటికే ఆమె ఊరంతా తిరిగి కొంత భిక్ష తెచ్చింది. ఉన్నదాంట్లో భర్తకు కొంచెం పెట్టి తాను కొంచెం తిన్నది. భర్త తెచ్చిన శనగలను దాచిపెట్టింది.

మరుసటి రోజు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు కరువు నుంచి బయటపడటానికి యజ్ఞం తలపెట్టాడు. అక్కడికి వెళ్లి తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తే ఎంతో కొంత గిట్టుబాటవుతుందని భావించాడు ఆ పండితుడు.

కానీ, అక్కడిదాకా వెళ్లడానికి శక్తిలేదు. పండితుడి భార్య అంతకుముందురోజు దాచిన శనగలను ఇచ్చింది. దారిలో అవి తిని రాజు దగ్గరికి వెళ్లాడు.

పండితుడి విద్వత్తును గుర్తించిన రాజు అతణ్ని సత్కరించి, కొంత ధనం ఇచ్చి పంపించాడు. ఆయన అన్ని సమస్యల నుంచి బయటపడ్డాడు. జీవితం గాడినపడింది. సంతోషంగా జీవించసాగాడు.

ఆచార వ్యవహారాలు జీవితాన్ని ఉన్నతమార్గం వైపు నడిపించాలి. అంతేకానీ, మూఢంగా పాటించడానికి కాదు. చేపలు, కప్పలు ఎంగిలి చేశాయని గంగాజలంతో అభిషేకం మానుకుంటామా? తుమ్మెదలు ఎంగిలి చేశాయని పూలను పరమాత్మకు సమర్పించకుండా ఉంటామా? విశ్వాసాలు జీవితాన్ని తీర్చిదిద్దాలే కానీ, పాతాళానికి కూలదోసేవిగా ఉండకూడదు.

అందుకే, గుడ్డి ఆచారాలు పాటించొద్దని శాస్త్రమే సెలవిచ్చింది. భుక్తి లేకపోతే ముక్తి లేదు అన్నది శాస్త్రవచనమే. అలాగే ప్రాణావసరానికి ఎంత కావాలో అంతే తినాలి. ఆకలిగా ఉన్నప్పుడు ఆబగా తినకుండా మనపై ఆధారపడినవారి గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉండాలని ఈ కథ మనకు చెప్తున్న మరో నీతి.

ధర్మంగా ఆలోచించాడు కాబట్టే ఆ పండితుడు ఎంగిలి గురించి పట్టించుకోలేదు. ఆ ఆహారం ఆసరాతోనే కష్టాల నుంచి

 బయటపడ్డాడు. ధర్మపరుడు చేయాల్సింది ఇదే కదా!

..........

లోకంలో ‘అదృష్టవంతుణ్ని చెడగొట్టేవారు లేరు. దురదృష్టవంతుణ్ని బాగు చేసేవారు లేరు’ అనే సామెత వినిపిస్తుంటుంది. ‘నా అదృష్టం బాగాలేదు. దేవుడు నన్నిలా చేశాడు. మీ అదృష్టం బాగుంది’ ఇలాంటి మాటలూ వినిపిస్తూ ఉంటాయి. ఇంతకీ అదృష్టం అంటే ఏమిటి?

‘అదృష్టం’ అంటే దృష్టం కానిది అని అర్థం. అంటే కనిపించనిది. మనం చేసే పని కనిపిస్తుంది. దాని ఫలితం కనిపించదు. కర్మఫలాలను.. వాసనలు అనే పేరుతో పిలుస్తారు. ఈ వాసనలకే అదృష్టం అని పేరు. విత్తనం వేస్తాం. దాని ఫలం చెట్టు రూపంలో ఉంటుంది. బావి తవ్వుతాం, దాని ఫలితం జల రూపంలో ఉంటుంది. వ్యాపారం చేసినప్పుడు.. లాభనష్టాల రూపంలో ఫలితం ప్రాప్తిస్తుంది. కర్మ చేసిన వెంటనే ఫలం కనిపించదు. కొందరు ఏ పని చేసినా, దాని ఫలం వెంటనే అనుభవంలోకి రావాలని భావిస్తూ ఉంటారు. ఉదాహరణకు పిల్లల పెండ్లి చేసిన తర్వాత హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చని, ప్రశాంతంగా ఉండొచ్చని తల్లిదండ్రులు భావిస్తారు. కానీ, వైవాహిక ఫలం ఆ వధూవరులకే కానీ, తల్లిదండ్రులకు కాదు.

ప్రపంచంలో సత్కర్మను యజ్ఞంతో పోలుస్తారు. యజ్ఞఫలాన్ని కోరేవాళ్లు ఉన్నారు. యజ్ఞం చేయాలి కానీ, దాని ఫలాన్ని ఆశించరాదనే వాళ్లూ ఉన్నారు. అయితే, ఏ పనిచేసినా దాని ఫలం అనుభవించక తప్పదు. కాస్త అటూయిటుగా చేసిన కర్మ తాలూకు ఫలాన్ని అనుభవించాల్సిందే! కానీ, యోగులు ఫలాన్ని ఆశించకుండా సత్కర్మలు చేస్తారు. వారినే నిష్కామ కర్మయోగులు అంటారు. కర్మఫలాన్ని కోరుకోని వారిని ఆ కర్మలు అంటుకోవు. వారికి కర్మఫలాలు ఎలాంటి వాసన రూపంలో ఉండవు. అంటే వారు అదృష్టాన్ని లెక్కచేయరు. కర్మఫలాన్ని కోరేవాడే ‘అదృష్టవంతుడు’. అయితే, కర్మఫలాన్ని ఆశించనివాడు ‘దురదృష్టవంతుడు’ ఎప్పటికీ కాడు. అతను కర్మఫలాలను ఆశించడు. ఫలాలను అనుభవించాలని కోరుకోడు. అలాంటి వారికి జన్మలు ఉండవు.

అదృష్టం గొప్పదేమీ కాదు. అదృష్టవంతులు అని భావించేవాళ్లు జన్మలు ఎత్తక తప్పదు. ఎంతో అదృష్టం ఉంటేగానీ మానవ జన్మ లభించదు అని పెద్దలు చెప్పే మాట సత్యవాక్కు. కొండంత అదృష్టం చేసుకుంటే దక్కిన మానవజన్మను మళ్లీ అదృష్ట-దురదృష్టాల చట్రంలో పడదోసి మరో జన్మను పొందడానికి వారధిగా మార్చుకోవడం అవివేకమే అవుతుంది. అదృష్టవంతుడికి మరో ఉన్నతమైన జన్మ లభిస్తుందేకానీ, మోక్షం ఎప్పటికీ రాదు. అదృష్టానికి, మోక్షానికి సంబంధం లేదు. అలాగే కర్మఫలాలకు, మోక్షానికి కూడా ఏ సంబంధం లేదు. కర్మఫలాలను సంస్కార రూపంలో పొందినంత కాలం జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అందుకే యోగులు జ్ఞానులై కర్మఫలాల నుంచి విముక్తిని కోరుకుంటారు. అప్పుడే వాళ్లకు దుఃఖం నుంచి ముక్తి లభిస్తుంది.

అవివేకాన్ని బట్టి రాగద్వేషాలు, వాటిని బట్టి ప్రవృత్తులు (పనులు), వాటిని అనుసరించి జన్మలు సంప్రాప్తిస్తాయని దర్శనకారుల అభిమతం.

ముక్తి అంటే ‘ఏదో పొందడం’ కాదు. విడివడటం. దేని నుంచి విడివడాలి? అంటే దుఃఖం నుంచి! దుఃఖం జన్మను అనుసరించి ఉంటుంది. అందుకే జన్మ, దుఃఖ, జరా, వ్యాధుల నుంచి దూరంగా ఉండటానికి నిష్కామ కర్మలు అనుసరిస్తారు. పనులు చేసినప్పుడు వాటి ఫలాలు సంస్కార రూపంలో ఉండి, ఆయా జన్మల రూపంలో భగవంతుడి ఆదేశానుసారం సుఖదుఃఖాలను మనతో అనుభవింపజేస్తాయి. అందుకే దుఃఖ పూరితమైన ప్రపంచాన్ని ఆశ్రయించకుండా, ఆనంద స్వరూపుడైన పరమాత్మను ఆశ్రయించాలని ధర్మగ్రంథాలు ఉద్బోధిస్తాయి.

సుఖానుభవం కలిగినప్పుడు దాన్ని అదృష్టంగాను, దుఃఖానుభవం కలిగినప్పుడు దురదృష్టంగాను భావిస్తుంటాం. కానీ, అదృష్టవంతుడైనా, దురదృష్టవంతుడైనా కర్మలకు అనుగుణంగా పలు జన్మలు ఎత్తాల్సిందే, భవబంధాల్లో ఉండాల్సిందే! సారాంశం ఏమిటంటే, మనిషి అదృష్టవంతుడు కావడం కన్నా.. జన్మరాహిత్యానికే కృషి చేయాలని శాస్త్ర వచనం. మానవ ఉపాధి అందుకు సరైన మార్గం. ఈ జన్మలో అదృష్టం వరించి సుఖం కలిగితే పొంగిపోవడం, దురదృష్టం ఎదురై దుఃఖం కలిగితే కుంగిపోవడం వంటి ప్రలోభాలకు గురైతే జన్మజన్మల అదృష్టంగా దక్కిన మానవ జన్మను వృథా చేసుకున్నట్టే. యోగులు సుఖదుఃఖాలనే ద్వంద్వాలకు అతీతంగా ఉంటూ.. మోక్షతీరాలకు చేరుకునే ప్రయత్నం చేస్తారు.

అదృష్టం కొందరిని వెతుక్కుంటూ వస్తుందని చెబుతారు. దురదృష్టం కూడా అంతే! అదృష్ట, దురదృష్టాలకు కారణమైనవి ప్రారబ్ధకర్మలు. ఎప్పుడో చేసిన కర్మలవి. మనల్ని వెంటాడుతూ ఉంటాయి. మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అప్పుడు వాటి నుంచి తప్పించుకోలేని స్థితి ఏర్పడుతుంది. మనిషి తెలిసి చేసినా, తెలియక చేసినా కర్మఫలం అనుభవించక తప్పదు. బుద్ధి జీవి కాబట్టి మానవ జన్మకే కర్మసిద్ధాంతం వర్తిస్తుంది. బుద్ధిమంతుడు అయిన మనిషి మంచి-చెడు తారతమ్యం తెలిసి పనులు చేయాలి. సత్య-అసత్యాలను గ్రహించి నడవాలి. ఫలం ఎలాంటిదైనా భయపడకూడదు. అసలు ఫలాపేక్ష లేకుండా ఉండాలి. అజ్ఞానంతో కూడిన ఆకాంక్ష కర్మలతో బంధిస్తుంది. కోరికలు లేకుండా చేసుకోవాలని చెప్పేది ఇందుకే! కానీ, కోరి పనులు చేసినప్పుడు మనం అదృష్టవంతులం గానీ, దురదృష్టవంతులం గానీ కాకత

.........

ఆత్మస్తుతి చేరులా అరుదు. నూటికో, కోటికో ఒక్కరుంటారు. ఆత్మస్తుతి అనేక రూపాల్లో ఉంటుంది. అది వ్యక్తి దగ్గరే ఆగిపోదు. కుటుంబం నుంచి కులానికి పాకుతుంది. కులం నుంచి ప్రాంతాలకు చేరుతుంది. ఇలా ఆత్మస్తుతి అనేక రూపాల్లో విస్తరించి, అంతర్గత దోషాలను దాచేస్తుంది, కప్పేస్తుంది. స్వీయ సంస్కారాలకు దూరం చేస్తుంది. పరనిందకు దారి తీస్తుంది. అణకువ లేకుండా చెయ్యడమే కాకుండా, అహంకారాన్ని కూడా ఆత్మస్తుతి పెంపొందిస్తుంది. కాబట్టి అది మన పతనానికి కారణం అవుతుంది. అప్పుడు అది ఆత్మనిందకు కూడా హేతువు అవుతుంది.

బుద్ధుడి కాలంలో కొందరు ధార్మికులు తమ మతం గురించి, తమ గురువుల గురించి, చివరకు తమ గురించి తామే గొప్పలు చెప్పుకొనేవారు. తమను తాము అతీతమైన వ్యక్తులుగా భ్రమించేవారు. ఇలాంటి ధోరణి కొందరు బౌద్ధులలో కూడా కనిపించేది. ఈ  విషయంలో భిక్షువుల మధ్య అప్పుడప్పుడు వాదులాటలు జరిగేవి. ఆత్మస్తుతి చేసుకొనే వాళ్ళు ఎవరు ఎంత చెప్పినా, ఎన్నిరకాలుగా చెప్పినా వినేవారు కాదు. ఇలాంటి వాదులాటలు కోశంబీ ప్రాంతంలోని భిక్షువుల్లో తీవ్రంగా ఉండేవి. మిగిలిన చోట్ల కూడా అక్కడక్కడ తలెత్తేవి. 

ఈ చెడు ధోరణిని మొగ్గలోనే తుంచెయ్యాలని బుద్ధుడు భావించాడు. భిక్షు సంఘాన్ని సమావేశపరిచి-  

‘‘ఆత్మస్తుతి కాదు, ‘ఆత్మనిందా భయం’ ఉండాలి. అది మనల్ని సంస్కరిస్తుంది. ‘నేను శారీరక దుశ్చర్యలు ఏవైనా చేశానా? దురుసుతనంగా ప్రవర్తించి, వాచక (మాటల ద్వారా) దుశ్చర్యలకు పాల్పడ్డానా? దుష్ట ఆలోచనతో మనో దుశ్చర్యలకు ఒడిగట్టానా?’ అని ప్రశ్నించుకోవాలి. ఈ విధంగా మనల్ని మనం గమనించుకోవడం వల్ల... మన తప్పులు తెలుస్తాయి. అప్పుడు మనకు మనమే భయపడతాం. దీనినే ‘ఆత్మనిందా భయం’ అంటారు. ఈ భయం ఉన్నవారే తమను తాము సరిదిద్దుకుంటారు. అంతేకాదు, ‘పరనిందా భయం’ కూడా ఉండాలి. ‘నేను మాట్లాడే మాటల్లో, చేసే చేతల్లో, ఆలోచనల్లో చెడు ఉంటే... ఇతరులు నన్ను నిందిస్తారు కదా! వారి ముందు దోషిగా నిలబడాలి కదా! అది తలవంపులు కదా!’ అని భయపడాలి. దీన్నే ‘పరనిందా భయం’ అంటారు. అంతేకాదు, భిక్షువులారా! తప్పు చేసినవారికి రాజులు అనేక రకాల దండనలను విధిస్తారు. 

తిడతారు, కొడతారు, శిరచ్ఛేదం చేస్తారు. అవయవాలను ఖండిస్తారు. వాతలు పెడతారు. ఇలాంటి భరించలేని శిక్షలన్నీ తప్పు చేసినవారికే! ‘మనం తప్పు చేస్తే మనకూ ఇలాంటి శిక్షలే అమలవుతాయి’ అని భయపడాలి. ఈ భయం కూడా మనల్ని తప్పుడు దారి నుంచి తప్పిస్తుంది. దీన్నే ‘దండనా భయం’ అంటారు. ఇప్పుడు మనం చేసిన చెడ్డ పనులకు, చెడ్డ ఆలోచనలకు, మాట్లాడే చెడ్డ మాటలకు ఫలితం ఇప్పుడే కాదు... భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఇది ఇప్పటికిప్పుడే మనల్ని వదిలి పోదు. జీవించినంత కాలమే కాదు, మరణించాక కూడా వదిలిపెట్టదు. దీన్నే ‘దుర్గతి భయం’ అంటారు. ఈ భయాలను చూసి భయపడాలి. అప్పుడే తప్పులు చెయ్యాలనుకోం. సచ్ఛీలత సాధిస్తాం. సన్మార్గంలో నడుస్తాం. సత్కీర్తి పొందుతాం. ఈ నాలుగు భయాల్లో ‘ఆత్మనిందా భయం’ మనల్ని మనమే సర్దుకొనేలా చేస్తుంది. కాబట్టి మనం ఈ నాలుగు భయాలతో బతికితే... ధైర్యంగా ధర్మాన్ని వ్యాప్తి చేయగలం’’ అని హితవు చెప్పాడు.

భయం చేసే మేలు గురించి తెలిశాక, ఆ భిక్షువులు ఆత్మస్తుతులను విడిచిపెట్టారు.

........
*రామాయణం సంబంధ 55 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో!. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*
------------------------------------------------
సంపూర్ణ వాల్మీకి రామాయణం(వచన) www.freegurukul.org/g/Ramayanam-1

వాల్మీకి సంపూర్ణ రామాయణం(పద్య+తాత్పర్యం) www.freegurukul.org/g/Ramayanam-2

వాల్మీకి రామాయణం-బాల,అయోధ్య,సుందర,ఉత్తర కాండ-అంతరార్ధం www.freegurukul.org/g/Ramayanam-3

చిత్ర రూపంలో సంపూర్ణ వాల్మీకి రామాయణం www.freegurukul.org/g/Ramayanam-4

రామ కథాసుధ-1,2 భాగాలు www.freegurukul.org/g/Ramayanam-5

రామచరిత మానసము www.freegurukul.org/g/Ramayanam-6

సుందర కాండ-పారాయణము www.freegurukul.org/g/Ramayanam-7

సంపూర్ణ ఆంధ్ర శ్రీ మద్రామాయణము www.freegurukul.org/g/Ramayanam-8

రామచరిత మానస్-తులసీ రామాయణం www.freegurukul.org/g/Ramayanam-9

రామాయణం www.freegurukul.org/g/Ramayanam-10

తులసీ రామాయణము www.freegurukul.org/g/Ramayanam-11

యోగ వాసిష్ఠ సారము www.freegurukul.org/g/Ramayanam-12

యోగ వాశిష్ఠ సంగ్రహము www.freegurukul.org/g/Ramayanam-13

రామాయణ రహస్య రత్నావళి www.freegurukul.org/g/Ramayanam-14

రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రలు www.freegurukul.org/g/Ramayanam-15

బాలల బొమ్మల సంపూర్ణ రామాయణం www.freegurukul.org/g/Ramayanam-16

రామాయణం పాత్రల ఆదర్శం www.freegurukul.org/g/Ramayanam-17

రామాయణంలో విశిష్ట పాత్రలు www.freegurukul.org/g/Ramayanam-18

బాలానంద బొమ్మల రామాయణం www.freegurukul.org/g/Ramayanam-19

వాల్మీకి రామాయణం-సంబంధాలు www.freegurukul.org/g/Ramayanam-20

రామాయణ పరమార్ధం www.freegurukul.org/g/Ramayanam-21

శ్రీ రామాయణ రహస్యం www.freegurukul.org/g/Ramayanam-22

రామాయణ తరంగిణి-1 www.freegurukul.org/g/Ramayanam-23

రామాయణ తరంగిణి-2 www.freegurukul.org/g/Ramayanam-24

శ్రీరామాయణ కథా సుధ www.freegurukul.org/g/Ramayanam-25

వాల్మీకి రామాయణము-బాల కాండము www.freegurukul.org/g/Ramayanam-26

వాల్మీకి రామాయణము-అయోధ్య కాండము www.freegurukul.org/g/Ramayanam-27

చిత్రరూపంలో రామాయణం www.freegurukul.org/g/Ramayanam-28

వాల్మీకి రామాయణము-ఉత్తర కాండ www.freegurukul.org/g/Ramayanam-29

వాల్మీకి రామాయణము-అయోధ్య కాండ www.freegurukul.org/g/Ramayanam-30

వాల్మీకి రామాయణము-అరణ్య కాండము www.freegurukul.org/g/Ramayanam-31

వాల్మీకి రామాయణము-కిష్కింద కాండ www.freegurukul.org/g/Ramayanam-32

వాల్మీకి రామాయణము-యుద్ధ కాండ-2 వ భాగము www.freegurukul.org/g/Ramayanam-33

వాల్మీకి రామాయణము-ఉత్తర కాండ-2 వ భాగము www.freegurukul.org/g/Ramayanam-34

శత శ్లోకి వాల్మీకి రామాయణం www.freegurukul.org/g/Ramayanam-35

జాతి జీవనంపై  రామాయణ ప్రభావం www.freegurukul.org/g/Ramayanam-36

రామాయణమంటే www.freegurukul.org/g/Ramayanam-37

రామాయణ సారస్వత దర్శనము www.freegurukul.org/g/Ramayanam-38

అంతరార్ధ రామాయణము www.freegurukul.org/g/Ramayanam-39

రామాయణ విశేషాలు www.freegurukul.org/g/Ramayanam-40

శ్రీమద్వాల్మీకి రామాయణోపన్యాసములు-అయోధ్య,అరణ్య,కిష్కింద కాండ www.freegurukul.org/g/Ramayanam-41

శ్రీరామ కథామృతము - సమగ్ర సమీక్ష www.freegurukul.org/g/Ramayanam-42

శ్రీరామ కథామృతము www.freegurukul.org/g/Ramayanam-43

జీవన చిత్రాలు-రామయణ పాత్రలు www.freegurukul.org/g/Ramayanam-44

రామాయణ పాత్రలు www.freegurukul.org/g/Ramayanam-45

లక్ష్మణుడు www.freegurukul.org/g/Ramayanam-46

లక్ష్మణుడు www.freegurukul.org/g/Ramayanam-47

భరతుడు www.freegurukul.org/g/Ramayanam-48

కళ్యాణ రాముడు www.freegurukul.org/g/Ramayanam-49

కాళిదాసు రామకథ www.freegurukul.org/g/Ramayanam-50

బాలానంద కుశలవుల కథ www.freegurukul.org/g/Ramayanam-51

రావణ రాజ్యము-రామ రాజ్యము www.freegurukul.org/g/Ramayanam-52

రామాయణోపన్యాస మంజరి www.freegurukul.org/g/Ramayanam-53

వాల్మీకి వచన రామాయణము-బాల కాండము www.freegurukul.org/g/Ramayanam-54

వాల్మీకి రామాయణోపన్యాసములు-బాల కాండము www.freegurukul.org/g/Ramayanam-55

రామాయణం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.

ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను  ప్రతి రోజు పొందుటకు:
Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukul
Whatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/జాయిన్
.......
హరే కృష్ణ
ఆత్మ స్వరూపులు అందరికీ శుభాశీస్సులు మరియు శుభాభివందనములు.

ఈ ఈరోజు శ్రీరామనవమి పండుగ జరుపుకుంటున్నాం. మనమందరం శ్రీరాముని అనుచరులుగా ఉండాలి.

శ్రీరాముడు దశరధుని పుత్రుడు.

శ్రీరాముడు పితృవాక్కు పరిపాలకుడు. ఏకపత్నివృతుడు. భార్యను ఎంతగానో ప్రేమించిన వాడు. నిరంతరం కంటతడి పెట్టకుండా చూసుకునేవాడు. భార్యకు ఏ కష్టమూ రాకుండా చూసుకోవాలి, అనే భావనతో ఉండేవాడు. తన భార్య రావణుని వాసంలో ఉండగా కూడా తన భార్య యొక్క శీల నిరూపణకు ప్రజలందరికీ చూపుటకు అగ్ని ప్రవేశం కావించినవాడు. దాని అర్థము తన భార్య శీలవతి కాదు, అని తన ఆలోచన కాదు. ఇతరులకు తన భార్య ఎంత గొప్పదో చూపుటకు చేసిన క్రియ , అగ్ని ప్రవేశ క్రియ. కానీ ఈరోజు భార్యను భర్త ఎంతగా ప్రేమిస్తున్నాడు????? తల్లిని ప్రేమించేవాడు భార్యను ప్రేమిస్తాడు..... శ్రీరామచంద్రుడు తల్లికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు.. అందువలనే సీతామాతను అంతగా ప్రేమించగలిగాడు.

 శ్రీరామనవమి రోజు సీతారామ కళ్యాణం చేయిస్తారు. కానీ ఒక్క రోజే చేయిస్తారా???? ప్రతిరోజు చేయించాలి..

 దాని అర్థము ప్రతిరోజు భార్యాభర్తలకు నిత్య కళ్యాణమే ....నిత్య భోగమే... జరగాలి. అదే సీతారామ కళ్యాణం. అనగా భార్యాభర్తలు ఇద్దరూ నిరంతరం అన్యోన్య దాంపత్య జీవితం సాగిస్తూ., ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరి కష్టంలో ఒకరు పాలు పంచుకుంటూ, బిడ్డలకు ఆదర్శవంతమైన దంపతులుగా తల్లిదండ్రులుగా చూపిస్తూ, బిడ్డలు కూడా తమ  వలె కుటుంబ యాత్ర చేయాలి, అనే విధంగా బిడ్డలకు ఆదర్శ జీవితం ప్రసాదించాలి.

 శ్రీరాముడు స్నేహమునకు ప్రాణమిచ్చేవాడు. అందుకే సుగ్రీవునితో స్నేహం చేసి సుగ్రీవుని యొక్క కష్టాన్ని తగ్గించాడు. తన రాజ్యాన్ని తనిఖీ వచ్చే విధంగా చేశాడు తన భార్యని తన వద్దకు రప్పించాడు. నిజమైన స్నేహం అంటే అదే.. మీరు రాముడికి ఆదర్శవంతుడైన అనుచరుడిగా ఉండాలి. స్నేహితుడు అంటే   స్నేహితుని యొక్క శ్రేయస్సు కోరేవాడు.... హితం కోరేవాడు అందుకే స్నేహితుడు అన్నారు.

శ్రీరాముడు శత్రువుని అంత మొందించేవాడు,......

శ్రీరాముడు సీతామాత ఎంతో అన్యోన్య జీవితం సాగిస్తూ నిత్య ఆనంద స్థితిలో ఉండేవారు. పరమానంద స్థితిలో ఉండేవారు. అటువంటి వారికి ఎడబాటు ఎలా వచ్చింది ?????

సీతామాత అడిగిన కోరిక,..... అదే బంగారు జింకను తీసుకురమ్మని కోరడం.....

 మరి శ్రీరాముడు కదిలాడు,.....

 సీతామాతను లక్ష్మణుడి సంరక్షణలో ఉంచి. కానీ సీతామాత లక్ష్మణున్ని పట్టించుకోకుండా లక్ష్మణున్ని కూడా బయటికి పంపి కోరి కష్టాలు తెచ్చుకుంది. రావణుని చేతిలో బందీగా మారి లంకకు వెళ్లడం జరిగింది. తన యొక్క కష్టాలను తానే కొని తెచ్చుకుంది. రాముని సంరక్షణ కోల్పోయింది., అలాగే లక్ష్మణుని సంరక్షణ కోల్పోయింది.... తన కష్టాలను తానే కొని తెచ్చుకుంది.. ఇక్కడ కొని అంటే బయట నుంచి తెచ్చుకున్న కోరిక.... తన జీవితాన్ని కోరిక  రూపంలో పాడు చేసుకుంది.

అనగా ఇక్కడ మనము ఆధ్యాత్మిక జీవితంలో భౌతిక జీవితాన్ని చూసుకోవచ్చు. ఎలా అంటే, ????? 

సీతామాత అంటే ఆత్మ... ఆ ఆత్మే మనస్సుగా రూపొందింది. ఆ మనస్సు, కోరుకుంది బంగారు జింకను. ఆ బంగారు జింకని తీసుకురావడానికి రాముడు లక్ష్మణుని చెంత సీతను వదిలి, సీతకు రక్షణగా ఉండమని చెప్పి  వెళ్లాడు.ఇక్కడ మనస్సుకి బుద్ధి రక్షణ ....లక్ష్మణుని యొక్క రూపంలో ఉన్న  బుద్ధిమాట మనస్సు వినకుండా ,రాముడు ఆపదలో ఉన్నాడు అని, బుద్ధిని బయటకు పంపింది.అనగా మనస్సు కోరుకునే ప్రతి కోరికకి బుద్ధి చెబుతూనే ఉంటుంది, నీకు అది అవసరం లేదు, అది అవసరం లేదు ,అది అవసరం లేదు.....అని . కానీ ఎప్పటికప్పుడు బుద్ధి మాట మనస్సు వినదు. ఎప్పుడూ బయట ప్రపంచంలోనే తిరుగాలి, బయట వస్తువుని పొందాలి అని అనుకుంటూ ఉంటుంది ,మనస్సు. అందుకే లక్ష్మణుడు వారిస్తున్నా, లక్ష్మణుని కూడా బయటికి పంపుతుంది,సీత.

 ఇక్కడ రాముడు పరమాత్మ....పరమాత్మను  ముందుగా బయటికి పంపింది. అనగా ఆత్మ పరమాత్మ నుండి వేరుపడుంది. 

ఆత్మ మనస్సుగా, బుద్దిగా మారి శరీరాన్ని తీసుకుంది .తానే శరీరాన్ని అని నుకుంటూ...... తానే శరీరాన్ని తృప్తి పరుస్తున్నాను అనుకుంటూ...... మనస్సుగా మారిన తానే  తృప్తి పడుతూ....ఉంటుంది.

 ఇక్కడ కోరిక అనగా రావణాసురుడు......

రావణాసురుడు అనగా బయట ప్రపంచం.రావణాసురుడు మాయ జింకను పంపిస్తాడు.మాయ జింకను చూసి వ్యామోహం పొందింది సీతామాత...  సీతామాత  మాయ జింకను కోరగా  శ్రీరాముడు చెబుతాడు.అది మాయ జింకవలే ఉంది.నీకు అంతగా ఆనందాన్ని ఇవ్వదు...అని చెబుతాడు. కానీ సీత ఒప్పుకోదు. శ్రీరాముని బయటికి ప్పంపుతుంది. అనగా పరమాత్మ స్థితితో ఆనందంగా ఉన్న ఆత్మ పరమాత్మ నుండి వేరుపడింది...తన జీవితాన్ని స్వేచ్ఛగా ఉంచుకోవాలి అని అనుకుంది. శ్రీరాముడు బయటికి వెళుతూ లక్ష్మణుని సంరక్షణలో ఉంచుతాడు and ఇక్కడ లక్ష్మణుడే బుద్ధి..ఇక  తాను అనగా సీత అనగా మనస్సు, బుద్ధిమాట వినకుండా బుద్ధిని కూడా పేడచెవి పెట్టింది...అనగా లక్ష్మణుడు యొక్క అండను వదులుకుంది.  అనగా మనస్సు ఎప్పటికప్పుడు బుద్ధి చెప్పేది వినకుండా  మనస్సు కోరికలను కోరుకుంటూ కష్టాలు తెచ్చుకుంటూ ఉంటుంది. మనస్సు తాను నిరంతరం ఆనందంగా ఉండాలి అనుకుంటుంది ,కానీ ఎప్పటికప్పుడు బుద్ధి మాట వినకుండా కష్టాలు తెచ్చుకుంటూనే ఉంటుంది.

 మరి సీత  రావణుని యొక్క వసంలోకి  వెళ్లబడుతుంది.అనగా మనస్సు బయటకు పరుగులు తీస్తూ ఉంటుంది.మరి మనస్సుకి సుఖం దొరుకుతుందా???????
 అంటే దొరకడం లేదు..... ఇలా ఉంటే మనస్సుకి ఎప్పటికి సుఖం దొరుకుతుంది??? 

సీతామాతకు రాముని యొక్క ఎడబాటు వచ్చింది.అదే పరమాత్మ నుండి ఆత్మ విడిపోవడం. రాముడు విచారిస్తున్నాడు..రోదిస్తున్నడు.  సీతా సీతా సీతా. అని.రాముడు ఆంజనేయ స్వామి యొక్క సహాయంతో రావణుని అంతమొందించి, సీతామాతను తన వద్దకు రప్పించుకున్నాడు. అనగా గురువు సహాయంతో శ్వాస క్రియ రూపంతో మూలాధారంలో ఉండే నేను అనే (హమ్) మనస్సుని శ్వాస ద్వారా తీసుకుని సహస్రారంలోకి అనగా పరమాత్మ చెంతకు తీసుకువెళ్లి కలపడం. పరమాత్మ(సో).….. ఇక్కడ శ్వాస అనగా  ఆంజనేయ స్వామి.ఆంజనేయ స్వామి  సహాయం లేనిదే పరమాత్మ ఆత్మను పట్టుకోలేడు. పరమాత్మ ఎంతటి గొప్పవాడు అంటే, తెలుసో, తెలియకో ఆత్మ తన నుంచి బయటికి పోయినా ఆత్మ మీద ప్రేమతో ఆంజనేయ స్వామి సహాయంతో తన ఆత్మ ని తన వద్దకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అదే క్రియారుపంలో...

 భగవంతుని చేతులు ఎప్పుడు చాపే ఉంటాయి, భక్తుడు కోసం.....

ఎప్పుడైతే రావణాసురుని అంతం జరిగిందో, సీత రాముని సొంతమైంది...

మరి మన జీవితంలో ఎంతమంది రావణులు వస్తున్నారు???? మరి ఒక్క మాయ జింక వల్లే సీతమ్మ రావణుని వసమయింది.…మరి అలాంటి మాయ జింకలు ఎన్నో కోరికల రూపంలో మన జీవితంలోకి వస్తూనే ఉన్నాయి...…. మరి అలాంటి కోరికల రూపంలో ఉన్న రావణుని యొక్క ప్రపంచంలో మనస్సు బయటకు పోతూఉంది. మరి మనస్సుకి శాంతి దొరుకుతుందా?????  ఎప్పటికీ దొరకదు.....

శ్రీరామనవమి రోజున కళ్యాణం జరుపుకోవడం అంటే, అర్థం ఏమిటో గ్రహించండి. రావణుని వంటి కోర్కెలను అంతమొందించేంతవరకు, మీ జీవితంలో మీరు ప్రశాంతంగా జీవించలేరు.... ఎప్పుడైతే రావణుని వంటి కోర్కెలను అంతమొందిస్తారో అప్పుడే మీ మనస్సు మీ వసంలో ఉంటుంది. మీరు ఆనందంగా జీవిస్తారు.... 

మీరు ప్రశాంతంగా జీవించాలి అంటే, మీ యొక్క షడ్చక్రాలు ఎప్పుడూ సమస్థితిలో ఉండాలి. సమస్థితిలో ఉండాలంటే, నిరంతరం షట్ చక్రాలు శక్తివంతంగా ఉండాలి...... ఉండాలి అంటే నిరంతరం క్రియ  జరుగుతూనే ఉండాలి....

అదే మన యోగ రహస్యాలలో మీకు తెలపబడే క్రియా మరియు హీలింగ్ ప్రక్రియ.. షట్ చక్రాలు శక్తివంతం చేసుకోకుండా మీరు పరమాద్భుత స్థితిలో ఆనంద స్థితిలో ఎప్పటికీ ఉండలేరు..

మరి నేను చెప్పినట్లు శ్రీరామనవమి నాడే సీతారామ కళ్యాణం జరుపుకుంటారా????
ప్రతిరోజు సీతారామ కళ్యాణం జరుగుతూనే ఉండాలి.... అదే తిరుమల వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారికి ప్రతిరోజు జరిగే నిత్య కళ్యాణం., అదేవిధంగా మనము కూడా ప్రతిరోజు షట్ చక్రాలను శక్తివంతం చేసుకోకపోతే, నిరంతరం మీకు యోగ రహస్యాలలో నేర్పే క్రియా జరుపుతూ ఉండకపోతే, మీ మనస్సు బయటకు పోతూ ఉంటుంది.... మీరు ప్రతిరోజు షడ్చక్రాలను శక్తివంతం చేసుకుంటూ, మీరు పరమాత్మతో మమేకం అవుతూ ఉండటం వల్ల, మాత్రమే మీ మనస్సు బయటకు వెళ్లకుండా మీతో అనగా పరమాత్మ యొక్క తత్వంతో ఉంటుంది...

ఎప్పుడైతే మీరు పరమాత్మతో కూడి ఉంటారో, మీ మనస్సు బయటకు వెళ్ళదు, కానీ మీ జీవితంలో లోటే ఉండదు.... ఎందుకంటే కోరుకుంటూ ఉంటుంది మనసు కోరికలకు అంతం ఉండదు నిరంతరం లోటే ఉంటుంది..... దానిలో నిత్య ఆనందం దొరకదు. కోరుకుంటే కొంతే వస్తుంది కోరుకుంటే కొండంత వస్తుంది.  ఇది జగత్ సత్యం..... పరమాత్ముని అండలో ఉండగా కోర్కెలకు పని ఏముంది,???? అన్ని పరమాత్నే చేకూరుస్తూ ఉంటాడు... ఇక కోరికలకు తావు ఉండదు. మీ జీవితంలో నిరంతరం ఆరోగ్యం నిరంతరం ఆనందం నిరంతరం సిరిసంపదలు కూడి ఉంటాయి. వాటితో నిరంతరం ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవిస్తూ ఉంటారు. ఇంకా ఏం కావాలి మీకు???? ఎలా చెప్పాలి మీకు??‽ ఎలా చెప్తే అర్థమవుతుంది మీకు?????

ఇంత వ్యాసం చదివినందుకు మీకు కృతజ్ఞతలు.....
*శ్రీ రామచంద్ర హారతి*
🕉🌞🌎🌙🌟🚩

రామ చంద్రాయ జనక
రాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం!!
 ॥రామ॥


 కోసలేశాయ
మందహాసదాస పోషణాయ
వాసవాది వినుత
సర్వరాయమంగళం!!
॥రామ॥


చారు కుంకుమోపేత
చందనాది చర్చితాయ
హారకా సుశోభితాయ భూరిమంగళం!!
॥రామ॥


లలిత రత్న
కుండలాయ తులసీ
వన మాలికాయ
జలజ సద్రుశ దేహాయ
చారు మంగళం!!
॥రామ॥


దేవకీ సుపుత్రాయ
దేవ దేవోత్తమాయ
భావజా గురువరాయ
భవ్య మంగళం!!
॥రామ॥


పుండరీకాక్షయ
పూర్ణచంద్ర వదనాయ అండజా
వాహనాయ
అతుల మంగళం!!
॥రామ॥


 విమల రూపాయ వివిధ
వేదాంత వేద్యాయ
సుముఖ చిత్త కామిత
శుభగ మంగళం!!
॥రామ॥


రామదాసాయ మృదుల
హృదయ కమల వాసాయ
స్వామి భద్ర గిరివరాయ
సర్వ మంగళం!!
॥రామ॥

🕉🌞🌎🌙🌟🚩

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ