ప్రాంజలి ప్రభ..24/03ఎదురు చూపులు కధ
భార్యాభర్తలు ఇద్దరూ ఒక హోటల్లో కూర్చోని టిఫిను తింటున్నారు......భార్య భర్తను ఇలా అడిగింది.
" ఏమండీ! మిమ్మల్ని ఒక విషయం అడగనా? " భర్త; అడుగు....దానికి పెర్మిషను అవసరమా?
భార్య;
అదేంలేదండీ ఒక నెల నుంచి మీరు ఆఫీసునుండి లేటుగా రాకుండా మమ్మల్ని తరచుగా
బయటికి తీసుకుని వెళ్తూ.... పిల్లలతో హోం వర్కు చేయిస్తూ.......వారితో
గడుపుతూ......నాతో చాలా ప్రేమగా ఉంటున్నారు.కారణం ఏంటో
తెలుసుకుందామని.....అంటూ
కాస్త భయంగానే అడిగింది.
భర్త; అదేంలేదే! నేను మామూలుగానే ముందులాగానే ఉన్నానే!
నీకెందుకు అలా అనిపిస్తోందో అర్థం కావడం లేదు మరి.
భార్య; నిజం చెప్పండి. మీ మొహంలో తేడా కనిపిస్తోంది. కొంపతీసి చిన్న ఇల్లు కానీ పెట్ట లేదు కదా!
భర్త; అమ్మొయ్......నీకు దండం పెడతానే అలాంటి ఆలోచనకూడా రానివ్వకు.
భార్య; అయితే నాకు నిజం తెలిసి తీరాల్సిందే! చెప్పండి.
భర్త; విషయం ఉంది కానీ నువ్వు అనుకున్నట్లు కాదు......
అంటూ తన డైరీ నుంచి ఒక ఉత్తరాన్ని తీసి భార్య చేతిలో పెట్టాడు ఆ ఉత్తరాన్ని వణుకుతున్న చేతులతో తెరిచి చదవసాగింది భార్య.
ఆ ఉత్తరం తన అత్తగారు కొడుకుకు వ్రాసిన ఉత్తరం.....కన్నీళ్ళు నిండిన కళ్ళతో చదవసాగింది.
ప్రియమైన కుమారునికి......
ఎప్పుడో ఒకరోజు ఈ ఉత్తరం నీ చేతికి దొరుకుతుందని ఆశతో వ్రాస్తున్నాను.
కాస్త ఓపిగ్గా పూర్తిగా ఈ ఉత్తరాన్ని చదువు చిన్నా! ఈ తల్లి మనసును అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను......
మీ నాన్న ను పెళ్ళి చేసుకునేదానికి ముందు నేనో లెక్చరరుని.....పెళ్ళైన తరువాత నువ్వు పుట్టావు...మీ నాన్నకు అదృష్టం కలిసి వచ్చింది.
బాగా
సంపాదించసాగారు. నీకో చెల్లి పుట్టాక నేను ఉద్యోగం చేయడం మానేసాను.మీ
నాన్న చాలా బిజీ అయ్యారు.వివాహం అయిన ఒక్క సంవత్సరం ఎలాంటి బాధలేకుండా
ఉన్నది.
తరువాత అన్నీ ఎదురుచూపులే!
మీ
నాన్నకోసం ఎదురుచూపులు......ఆయనకు ఆదాయంపై మోజుతో సమయానికి ఇంటికి రారు.
మీరే నాకు దిక్కు......మీతోనే నా సంతోషం.ఉదయం లేవగానే మీరు తయారై స్కూలుకు
వెళ్తారు......మీ రాక కోసం ఎదురుచూపు.........ఇలా మీరు
పెద్దవారైపోయారు.......నాతో మాట్లాడటానికి కూడాసమయం ఉండేది
కాదు...అవసరానికో మాట అంతే,,,,,,
ఉద్యోగాలు
వచ్చేశాయి మీకు.......మీ హడావిడి మీది... పిల్లలైనానాతో మాట్లాడుతారేమో
అని ఎదురుచూపు.........మీరు తిరిగి ఇంటికి వచ్చేదాకా
ఎదురుచూపు........రాగానే అలసిపోయి
భోంచేసి
పడుకుంటారు......వంట బాగుందనికానీ బాగలేదనికానీచెప్పడానికి కూడా మీకు టైం
ఉండదు..... మీ నాన్న వ్యాపారాన్నినీకు అప్పచెప్పారు.......నువ్వుకూడా బిజీ
అయిపోయావు.
నీ చెల్లెలికి పెళ్ళి చేశాము......తను హాయిగా విదేశాలకు వె్ళ్ళిపోయింది .
ఆమె సంసారం ఆమె జీవితం.......వారానికి ఒకసారి 2 నిమిషాలు మాత్రమే పోనులో మాట్లాడేది......ఆమె ఫోనుకోసం ఎదురుచూపు......
మీ నాన్నకు ఆరోగ్యం పాడై ఇంట్లో ఉంటే ఆయనకు సమయానికి ఆహారాన్ని
అందివ్వడానికి........మాత్రలు అందించడానికి ఎదురుచూస్తూ గడిపేదాన్ని చూశావా నా బ్రతుకంతా ఎదురుచూపులోనే ముగిసిపోయింది.
నీకు భార్య......కూతురు , కొడుకు వున్నారు. బ్రతికి ఉన్నప్పుడుచెప్పలేకపోయాను......చనిపోయేముందు ఈ ఉత్తరం వ్రాస్తున్నాను.
మీ
నాన్న గారు ఆరోగ్యం బాగలేకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాత్రలు
ఇస్తావా.......అన్నం పెడతావా.......అవసరానికో మాట అంతేపేపరు చదవడానికి టైం
ఉంటుంది....నాతో మాట్లాడటానికి టైంఉండదు మీ నాన్నకు....మీ సంగతి సరే
సరి....
వయస్సులో సంపాదన మోజులో పడి నాతో ,మాట్లాడటానికే టైం లేదు మీ నాన్నగారికి.......ఇక ఈ వయస్సులో మాట్లాడటానికి ఏముంటుంది?
ఎదురుచూపు..........ఎదురుచూపు.........ఎదురుచూపు......
ఇప్పుడు చావుకోసం ఎదురుచూపు........
నాలా నీ కూతురో . నీ భార్యనోఇలా ఉత్తరం వ్రాయకూడదనే ఉద్దేశ్యంతో
ఈ ఉత్తరం వ్రాస్తున్నాను...
ఇంట్లో
ఉండే ఆడవారికి కూడా మనసు ఉంటుందని....మనకోసమే బ్రతుకుకుందనీ
గ్రహించు........నేను ఎదురుచూసినట్లు నీ
భార్యనుబాధపెట్టవద్దు......మనసువిప్పి తనతో అన్నింటినీ షేర్ చేసుకో!
నిన్ను
నమ్ముకుని నీవే లోకంగా వచ్చిన నీ భార్యతో.......నీ పిల్లలతో కొద్ది
గంటలైనా గడుపు......ధనార్జనతో వారిని నిర్లక్షం చేయకు........ఇదే
నా చివరి కోరిక....కోడలు........మనవడు......మనవరాలు జాగ్రత్త......
నా పరిస్థితి నాకోడలికి రాకుండా చూసుకో! తనకూ ఒకమనసు ఉంటుందనీ
అందులో మీరే ఉంటారనీ.....తననేశ్రద్ధగా చూసుకోవాలని ప్రేమను అందించాలని కోరు కుంటుందనీ అర్థం చేసుకో! మనిషిగా ముందు గుర్తించు
యాంత్రికంగా జీవించి నాలా బాధపడుతూ ఎదురుచూపులతో కాలాన్ని
వెళ్ళదీయనీయకు.........నీవు ఎప్పూడూ సంతోషంగా ఉండాలనే
ఈ తల్లి కోరుకుంటుంది..........ఉంటాను.
ఇట్లు
ఎల్లప్పుడూ మీ క్షేమాన్ని కోరే నీ తల్లి.........
దయచేసి మీ కుటుంబంతో గడపండి......
వారి మనస్సును బ్రతికి ఉన్నప్పుడే
గెలుచుకోండి........యాంత్రిక జీవనానికి అలవాటు పడకండి..........
మీ సంసారమే మీకు అన్నింట్లో తోడుంటారని మరువ వద్దు.......
--((***))--
ప్రాంజలి ప్రభ కధలు(4)
రచయిత: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
చూడమ్మా
నీవు ధనవంతుల బిడ్డవే, నీవు మాయింటికి వచ్చాక కొన్ని అలవాట్లు మార్చవచ్చు,
మార్చుకోవచ్చు, మారుతున్న కాలాన్ని బట్టి నడుచు కోవచ్చు, ఏది ఏమైనా
కుటుంబాన్ని అనుసరించి, భర్తను అనుకరించి
బతికి బతికించుకోవటంలోనే ఉన్నది నిజమేన జన్మ అని తెలుసుకోమ్మా చాలు.
జీవితంలో విధి ఎవరిని ఎప్పుడు ఎందుకు పరిచయం చేస్తుందో ఎవరికి
తెలియదు, ఎప్పుడు విడదీస్తుందో కూడ తెలియదు, ఉన్న ఈ చిన్న జీవితంలో కడదాకా
ఉండేవి మనుషులు మిగిల్చిన జ్ఞాపకాలు మాత్రమే ఇది యధార్ధం అని తలిస్తే
చాలు.
జీవిత రాట్నంలో ఆది నుండి జరుగుతున్న నిరంతర జీవిత పోరాటాలు ఆవేశాలు
తాత్కాలికం మాత్రమే అని గమనించు, మన ప్రేమే మనల్ని బతికించేది అని
తెలుసుకుంటే చాలు.
శత్రువులు ఎక్కడో ఉండరు, మనలో కోపం,ద్వేషం, అసూయ, అనుమానం లాంటి గణాలే శత్రు వులని తెలుసుకుంటేచాలు.
మనజీవితమే మనకు అధ్యాపకుడుగా పాఠాలు నేర్పుతుంది.
అందరికి
ఆశయాలు ఉంటాయి, కానీ కొందరు మాత్రమే ఆలోచిస్తారు, చాలా కొందరు మాత్రమే
ఆచరిస్తారు. శక్తి ప్రదర్శించటం కన్నా, సహనం వహించి సమయస్పూర్తితో,
నిజాన్ని నిర్భయంగా తెలిపి న్యాయాన్ని ధర్మాన్ని ఆచరించి చూపించమ్మా అదే
నేను కోరేది. అని కొత్తగా వచ్చి కోడలుతో మామగారు హితబోధ.
--((*))--
వయస్సు నలభై (40) దాటుతుందంటే.. మీరు చాలా బాధ్యతాయుతంగా మెలగాలి. మీ కుటుంబానికి మీరే ఆధారం. మీ వయస్సు 40 ప్లస్ అయితే ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిందే. అందుకే ఈ ఏడు సూత్రాలు పాటించండి.. ఆరోగ్యం కాపాడుకోండి.. యవ్వనంగా కనిపించండి.. అవేమిటంటే..
*ఒకటో సూత్రం.. ఈ రెంటిని అప్పుడప్పుడు పరీక్ష చేయించండి.. 1. బి.పి., 2. షుగరు..
*రెండో సూత్రం.. ఈ నాలుగింటిని సాధ్యమైనంత తగ్గించండి. 1. ఉప్పు, 2. చక్కెర, 3. డైరీ తయారీలు, 4. పిండిపదార్థాలు
*మూడో సూత్రం.. ఈ నాలుగింటిని ఎక్కువ తీసుకోండి. 1. ఆకుకూరలు, 2. కూరగాయలు, 3. పండ్లు, 4. గింజలు
*నాలుగో సూత్రం.. ఈ మూడింటిని మరచిపొండి. 1. మీ వయస్సు, 2. గడిచిపోయిన రోజులు,
3. కోపతాపాలు
*ఐదో సూత్రం ..ఈ మూడింటినీ పొందుటకు చూడండి. 1. ప్రాణ స్నేహితులు, 2. ప్రేమించే కుటుంబం, 3. ఉన్నతమైన ఆలోచనలు
*ఆరో సూత్రం .. ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఈ క్రింది వాటిని పాటించండి. 1. నియమిత ఉపవాసం, 2. నవ్వడం, 3. వ్యాయామం, 4. బరువు తగ్గుట
*ఏడో సూత్రం.. ఈ నాలుగు విషయాలకై ఎదురు చూడకండి.
1. నిద్ర పోవడానికై నిద్ర వచ్చేవరకు కాచుకొని ఉండకండి.
2. విశ్రాంతి తీసుకోవడానికై అలసిపోయే వరకు ఉండకండి.
3. స్నేహితుడిని కలవడానికై అతను ఎదురుచూడడం మానేసేంత ఆలస్యం చేయకండి.
4. దేవుడిని ప్రార్థించడానికై కష్టాలు వచ్చేంతవరకు ఆగకండి.
***
Comments
Post a Comment