సీస పద్యం
సీస పద్యం
ఆత్మావ లోకనం..ఆదర్శ శుభదినం
స్యూర్యుని వెలుగులై ... సూక్ష్మముగను
వాన జల్లులు చేరి...వరదపొంగు కళలు
కొత్త నీరు గ మారు..కోరు మారు
పుడమితల్లి కులుకు.. పుష్పమల్లెను విచ్చె
గాలి ఆకలి వల్ల ... గళము విప్పె
జాతి మత కులము .. జాడ్యము యే యగు
తారతమ్య ముగాను...తాళి వద్ద
ప్రేమను తెలుపు ప్రభలతో ప్రియుని పిలుపు
కోమలి కళలు తెలిపెను కోర్కగాను
కాముని కళల వెన్నెల కానుకగుటె
తామరలు లోన గననగు తారకలను
.....
సీస పద్యం ..ఓర్పు .. 111
సీస పద్యము.. హద్దు ప్రేమ...103
చిగురులు తొడిగేను చిగురాశ నింపేను
హరితవనమగుటే హద్దు ప్రేమ..!
మురిసేను వెన్నెల మౌనమ్ము గానులే
హృదయాన్ని చిలికెను హద్దు ప్రేమ
దొరకవు మాటలు దోబూచు సరదాలు
హా హా అనుకరణ హద్దు ప్రేమ
షరతులు లేకనె..షకలక పొందిక
హాయిగా తరగని..హద్దు ప్రేమ
తే:: పరిమళ భరితం పరవశ పాఠమేను
చూపుల చురక చుంబన స్ఫూర్తి ప్రేమ
తెలిసి తెలియని తికమక తాళ మాయె
తనువు అనురాగ దాహము తృప్తి ప్రేమ
...
*సీస పద్యం...ప్రకృతి హద్దు..104
ప్రేమకై ప్రియురాలు ప్రీతిగా జవరాలు
ఊపిరి ఊయాల ఊహ హద్దు
భారమై సుఖమగు భాగ్యమే తోడుగా
ప్రాణమే జాలిగా ప్రీతి హద్దు
అడగనీ వెన్నెలే ఆడుకో మనియంటే
ప్రతిభ చూపు మగత ప్రగతి హద్దు
నీడలే ఇవియన్ని నిజముగా ఇష్టమే
ప్రణయ ప్రభందమే ప్రకృతి హద్దు
తే.ప్రేమ సాక్ష్యాలు దేనికీ ప్రీతి చాలు
నిత్య వెలిగినా చీకటే నీడవలెను
నీరు నిప్పుకీ మొహమే నీడ బ్రతుకు
నాటకంలా జరుగు ప్రేమ నటన కళలు
****
సీస పద్యము.. పురివిప్పు ప్రేమ 105
స్థితి గతులన్నీను చినుకులై మెరసెను
తడిచినా చందమై తపన ప్రేమ
మనసుతహతలు యే మానస మధనమే
వెలిసినా చందమై వెలుగు ప్రేమ
ఎండలో వానలో యదలలో కదలిక
చూపుల చందమై చురక ప్రేమ
తనువులో పులకింత తపనతో మైకమ్ము
పురివిప్పి చందమై పుడమి ప్రేమ
......
తే. హద్దు లే లేవసలు గాను హాయి గొలుపు
తలచి చందన తాంబూల తనువు లీల
వెలుగు నీడలా కళయిక వెతల ప్రేమ
మనసు ముద్దాడి ముడిచినా మేను లీల
........
*సీసపద్యం.. వినిపించి..106
నిదురొదిరిందిలే నియమమ్ము మారంది
తిలగించు బుద్ధిలో తొందరేల
ముసుగునే మార్చావు మినిమాపు ముదిరింది
కలలన్ని కవ్వించి కల్ల లేల
కునుకునే దులిపేసి కులుకుతో నవ్వింది
నవ్వుతూ లేచావు నటన ఏల
మదిలోని దిగులంత మబ్బులా ముగిసింది
క్రొంగొత్త ఆశలతొ కోర్కె ఏల
తే. వాస్త వమ్ము తట్టి పిలిచే కారణంబు
ఉలికిపడి బయటపడిన ఊహ లేవి
జీవితమె ముందు పదమంటు జీవ యాత్ర
నీవు వినిపించ వినయంగ నిత్య విధియు
.....
సీస పద్యము .. కృష్ణ లీల.. 07
సుందరు డేకాదు హృదయము లోచేరి
మరవలేని మహాను భావుడున్ను
ఆశలు రేపుతూ ముగ్ధ మోహన రూప
మహిమలు చూపిస్తు దివ్ర శక్తి
పంచుతూ వెన్నల రాజుగా పడచుల
ప్రేమను దోచియు కళలు చూపి
వాక్కుతో వర్ణించలేనట్టి అద్భుత
దేహ సౌందర్య వంతుడులె కృష్ణ
తేటగీత
అన్ని ఒక్కటి గాతెలి పేటి మాయ
ఉన్న దానిలో తృప్తియు కలుగ.చేసి
చెప్ప లేనట్టి మహిమలు చూపు చున్న
చిన్న పెద్దల మన్నన పొందు కృష్ణ
**(())**
.
సీస పద్యం...భలేవాడివోయ్ కవీ.....108
దృష్టి కవిత బాణ దృతి మతి గతి విధి
మహిమాన్విత కథలు మనుగడ కళ
ఆయుధమ్ము కవిత్వ ఆలోచనల విధి
భద్రత ఎరుగక భాగ్యము కళ
సంకరం కానిదే సుమధుర కల విధి
నిష్కల్మష మదిలోన నిత్యము కళ
సహన మునకవిత్వ స్వచ్ఛ కిరణ విధి
భాద్యత దేశమై బంధ కళ
తే. అనునయించటం అలలులా అరుగు దెంచి
ప్రణయగీతహృదయముగా ప్రమిద వెలుగు
విశ్వనరుడిగా అయ్యేట్లు విజయ వాంఛ
జగతికి స్వేచ్ఛ కోరుచు జాడ్జ్య బుద్ధి
***
సీస పద్యము...ప్రకృతి
109
కడలిలో కెరటాలు కదల కుండను లేవు
యదలోన పుట్టిన ఎరుక ఏది
తలపుల తలుపులు తరతరాల కథలు
కన్నీరు మారేటి కాల మేది
ముందు వెనుక సాగు ముడుపుల సందడి
ఆగేటి హృదయమ్ము ఆత్ర మేది
విధి రాత కదిలింది విజయము కోరుటే
ప్రకృతి ప్రభావము ప్రతిభ ఏది
.....
తే. నిత్య అనుభవాల సుద్దులు నీడ నిచ్చు
ప్రాణ వాయువు కదలిక ప్రతిభ నిచ్చు
పలకరించు చెలిమి విధి ప్రగతి నిచ్చు
పరిసరాలపచ్చ దనము ప్రకృతి నిచ్చు
.....
*సీస పద్యం... మమకారం 110
మదిలోని మమకార మేను విడిచి పోదు
గదిలోన వెలుతురు కలలు తీర్చు
విధియాడు వింతయే వినయమ్ము నేర్పుటే
కదిలేను కథలన్ని కళలు తీర్చు
చెదిరెను విషయాలు చిరునామ చుట్టూనే
పదిలమ్ము సహనము గళము తీర్పు
నిధి కోరు ప్రతిజోడు నీడను చేరుటే
తిధి ఆడు నాటకం వింత తీర్పు
తే. మాతృ భూమి ఔనత్యము మరువ తగదు
మాతృ భాష విశ్వాసమ్ము మనసు నుంచు
మాతృ తీర్పు మనుగడకే మంచి చేయు
పితృ వాక్కు సంపద దిక్కు పేరు నిచ్చు
.....
111
తీరానికి అలల తీర్పుకు నిజముయె
సమరానికి తెలివి సమయ ఓర్పు
పోరాటము విధిగా ప్రోత్సాహము మదిగా
ధైర్యమే జీవితం దైవమే ప్రార్ధన
బలహీనత కధలు బంధ ఓర్పు
సాధనలో సాధ్య సాధ్యాలు విషయమే
స్వప్నాల లీలలు సహజ ఓర్పు
తే:: ఊపిరి ఒకటే మరువబో కుండ లేను
కష్ట నష్టాల చిరునవ్వు కలల తీరు
కొండనైన డీ కొట్టేటి కోరిక ఇది
ఉండ బట్టలకు మనసు ఉరుకు చుండు
****
సీస పద్యము .. కృష్ణ ప్రభ .. 12
అందంతొ చూపులు - అందరి అలకలే
గోపకాంతల కిచ్చి - గోరు ముద్ద
మురళీ రవంబుచే - మువ్వల శబ్దమే
విప్పగా మాధుర్య - వింత ముద్ద
మఱిమఱి వేణువు - మాధుర్యరుచులచే
గర్ణామృతమొనర్చి - గారవముద్దు
మనసు దృప్తిని చేయు - మాధుర్య పీయూష
మో? యెఱుంగఁగరాదు - మోహనమయి
తే:: గోపికలయందు చపలంబు దోఁపఁజేయుఁ
చరిత మునుగల వాడు సుం దరుడుగా
హృదయ తాపము తగ్గించి శాంతి చేయు
మోవి కాంతితొ లోకాల్ని ఏలు వాడు
****
సీస పద్యము ... కృష్ణ ప్రభ 113
క్రీగంటి చూపులతో తమ తాపాన్ని
శ్రీకృష్ణ ఎదుటనే శ్రీకరమగు
పడచుల ఆశ్రిత పగలన్ని కరుణించి
దర్శించి ఎడతెగ ధర్మమగుట
సుందరీమణులతో సుఖము మనో వాంఛ
నెరవేర్చి తగినట్టి నేటి ఆశ
లీలశుకుడు వల్ల కీలకమగుటయే
సిధ్ధుల యోగుల స్థిరము కోరు
తే:: మధురిమ మనోమయ సుగంధ మందహాస
హృదయ లీల మానుష శక్తి హృద్య మందు
దోచె నిముషమ్ము మాయక త్రోవచూపు
చెందు టేశాంతి కలిగియు చేష్ట ఇదియు
--(())--
*సీస పద్యము 114 కృష్ణ ప్రభ
మందహాస మనిన మదిఎప్పుడు శుభమే
మధురామృ తముగాను హృదయ చేరు
ముఖ కమలము మనోహరము ఎప్పుడు మన
సునె మత్తు లోననే ముంచి వేయు
నెమలి పింఛముకన్నుల మెరుపు హృదయక
మలము ను చేరియు అద్భుతమ్ము
చూపియు మంసదే హములోన రక్తము
ఉడికియు తెలియని కృష్ణ లీల
తే:: మనసు మీమాంస పడుటయు లోక మాయ
దేహము చలించి పోవుట కృష్ణ మాయ
రాగ అనురాగ భావము ప్రేమ మాయ
దేహ మమృత స్వ రూపము జన్మ మాయ
.....
సీస పద్య0 -- 116
చల్లని రాత్రియు..చలికమ్మె వేళలో
సరసమాడెడి జోడు..సాధనయ్యె
తగిలీ తగలక యే.. తపమతో గంధము
రోమాంచకమ్ముగా.. పోరు జరుపు
అందాల కళ్ళకు ఆశల వెల్లువ
కనికరం సౌమ్యమై కనుల విందు
జీవనరాగాలు.. జీవానికి కళలు
ఇంపుగా సాగెను..ఈప్సితమ్ము
ఆటవెలది
ప్రేమ వర్ణము లనె పెనవేసుకొను వేళ
తెన లొలుకు రుసుము తేట తీపి
కోరికల చెలి కళ కోపతాపాలు గా
ప్రేమ దాహమంత ప్రెయసి చెంత
***
సీ// 117
తూర్పున యుదయించి తురుముతూకిరణాలు
పవ్వులాచేరుతూపుడమిజడన
ఆకస మధ్యాన యాత్మచీకటిబాపి
అందాల ప్రకృతి వింద్యనీవు
కనులకు వెలుగిచ్చి కటికచీకటిమాటు
స్పర్శవు పులకిత సంధ్యనీవు
ఆకలిజీవుల యన్నమునీవేను
అవనిలో జనులకు యాశ నీవు
ఆటవెలది
సవిత నిన్ను గనిన కవితకమలములు
విరసి రేకులన్ని విచ్చుకొనుచు
మధుర తేనెగురుయు మనసైన మంజులం
మధురపుమధుపంబుమధిన జేర్చు
***
" అందరికీ ఆత్మీయ హార్దిక భోగి + సంక్రాంతి పర్వశుభాకాంక్షలు + శుభాభినందనలు !!! "
సీసపద్యం 118
చెలిమి కుటుంబము చెలరేగు మాటలు
బలిమి సంబరములు బంధమందు
స్థితిగతులుబట్టియె స్థిర సంతసమ్ముయే
స్థిమిత ఆశయములు స్థిమిత తృప్తి
ప్రకృతి ప్రగతి గాను ప్రతిఇంట ఆటలు
పిండివంటల పాట పిలుపు కళలు
అమలక్కల పలుకు ఆత్రమ్ము చూపుటే
కోడిపందాలతో కొల్లగొట్టు
తహతహలు బిగికౌగిళ్లు తలుపు తట్టు
రంగవల్లి గొబ్బెమ్మలు రంగ రించు
కొత్త అల్లుళ్లు హరిదాసు కొత్త మాట
పర్వ దిన శుభాకాంక్షల ప్రభల కాంతి
***
సీస పద్యం 119
తెలుగు లో గిళ్లలో తిరుణాళ్ళు పందిళ్ళు
పూలదండల ఇళ్ళు పుడమి గుళ్ళు
రంగుల లోగిళ్లు రంగవల్లి గ కళ్ళు
ధాన్య రాసి గొబ్బిళ్ళు ధ్యాస తుళ్ళు
కూతుర్లు అల్లుళ్లు గూడు గుడ్డ కబుర్లు
మూన్నాళ్ళ సరదాళ్ళు ముచ్చట కళ
వాకిళ్ళు మెరుపుళ్ళు వాసనా సందళ్ళు
వరదళ్ళు వలపుళ్ళు వరుస కళ్ళు
నవ్వితే వచ్చు కన్నీళ్లు నిన్ను తాకు
నలుగురితో పంచుకోనెడి నటన కళ్ళు
ఏడ్చి నావచ్చు కన్నీళ్ళు ఎదను తాకు
తుడుచు ఏకాంత కన్నీళ్లు పుడమి కళ్ళు
***
సీస పద్యము 120
భోగి మంటల కళ భోగ మానందమే
సంక్రాంతి వైభవం సందడి సిరి
"పశువు' ఆరాధనం ప్రకృతిలో కనుముగా
గడిచేటి పరవశం గళము విప్పు
పండగ సంబరం పరమార్థ తత్త్వమే
పంచుకోవడమేను ప్రగతి గాను
బతుకంటె సంతోష బంధమ్ము సుఖముయే
ఉన్న ఈ క్షణమేను ఉత్సవమ్ము
ఆటవెలది
పేద ధనిక భావ మేనులేక బ్రతుకు
చిన్న పెద్ద అనక చిత్త ముంచె
కులమతములు లేక కలసి మెలసి
జరుపు కొనెడి జనుల సంకురాత్రి
***
సీస పద్యము..121
కురులలో నెమలి పింఛము ధరించినలీల
మగధీరుడు మమత నెరిగి నోడు
చనుగుబ్బ లుబ్బిన గోప భామల మధ్య
దివ్యాకృతి మనోహ రంగ ఉండి
వక్షస్థలాకర్షణలు హౄదయము
స్పదన పరమాత్మ కళల లీల
మంజుల రూపము చైతన్య జ్యోతిగా
మామనసులొ ఉన్న కరుణ కృష్ణ
ఆ.. స్త్రీల హావ భావ విన్యాస లీలలే
మనసు కదిపి మమత పంచు చుండు
కృష్ణ లీల మాయ స్త్రీలలో ప్రేమను
పంచి పంచె విధము గాను తెలుపు
**(())**
సీస పద్యాలు... 122
జయ జయ జయజయ ధ్వనులతొ మనసిచ్చు
మువ్వల శబ్ధాలు గుండె చేరె
గలగల గలగల చెవుల దిద్దుల శోభ
జిలుగు రత్నముల వల్లే మెరిశియు
చక చక చక చక కదిలేటి కనుల చూ
పుల పిలుపులు మనసు నూర డించె
పక పక పక పక నవ్వులు చూసాక
హదయమే తపించె కృష్ణ లీల
ఆ:: నెమలి నాట్య మాడి నట్లుగ నటన తోను
హంస నడకల వలపున పెంచు చుండె
కొంటె చెష్టలు పడచుల మనసు చేరె
కృష్ణ దివ్యవేషములన్ని ప్రగతి కొరకు
**(())**
సీస పద్యము ... 123
అనురాగ లక్ష్యముతో గొప్ప నైపుణ్య
మంతయు తెల్పుచు ఉన్న కృష్ణ
కదులు నేత్రములు కలిగి దివ్యాతి
దివ్యమై నట్టి కాంతులను కలిగి
మన్మధ జన్మకారకుడు సమస్త శక్తి
సౌందర్య రాశియు ధైర్య లక్ష్మి
శ్రీదేవి తొ కటాక్ష విక్షణ ములచేత
ఆధరింప బడేటి జలజ నయన
తే:: దివ్యనేత్రములు కలిగి దెరుచునంత
గానపడుచుండు నాకు నిత్యంబు విశ్వ
మేలు మాజ్యోతి కాంచితి కరుణ తోడ
నన్ను రక్షించు శ్రీకృష్ణ సన్ను తింతు
***
సీస పద్యము...
అందని జాబిలి అరుదైన నెచ్చెలి
అందుకు దరిచేరు ఆశయమ్ము
వేడిమి నీడన వెన్నెల వెల్లువ
తలపులు యన్నియు తడిమి చూసె
చూపులతో ముని చురకల శబ్దము
మనసెరిగిన వన్నె మమత జాణ
నవ్వులతో ఎరుపెక్కిన నటనలు
మనసు తలుపు మూయ మనిషి ఆట
తే. అనుభవాలతో ఎంతగా ఆదు కొనిన
నున్న భౌతిక జీవితం నుజ్జు కాదు
అయిన ఆత్మ పరంగాను అంత శుభము
చెందినట్టు కదలికయే చింత తొలగు
.......
* సీసము.* 124
సబ్బండ వర్ణాల సారాంశ జలధిగా!
సాకుమా లోకులు శాంతినొంద!
సత్సంగ,సత్పథ సంస్కార మానస!
ధర్మము కాపాడ ధరణియందు!
క్రూరాత్ములెందరో కుత్సితయుక్తితో
సన్మాన సులనిల చంపుచుండె
కలికాల మహిమయో కర్మానుగతమదో!
తెలియకుండెడుబాధ వెలికి తీసి!
తే: మంచితనమునుకాపాడు మాతవీవె!
దుష్ట శిక్షణ చేసెడు దూతవీవె!
ధర్మపథమునురక్షించు దాతవీవె!
అమ్మ! *శ్రీ సోభ కృత్ * కిదే యంజలింతు!
***
ప్రాబంధిక శైలిలో ఆధునిక భావకవిత::
వసంతము:: 125
ఒకటి కోకిల పల్కె నొకట శారిక కుల్కె
నొక కొమ్మపై చిల్క హొయలు నొల్కె
ఒకట మల్లియ పూచె నొకట సంపెగ తోచె
నొక క్రేవ మందార మురిమి చూచె
ఒకట తుమ్మెద పాడె నొకట తెమ్మెర లాడె
కామినీమణి మూగనోము వీడె
ఒకట నవ్వులు హెచ్చె నొకట మోదువు విచ్చె
ప్రణయహృదయమందు వ్రణము దెచ్చె
తే:: చల్ల చల్లని చందన చర్చవలన
తాపము మరింత యధికమై తనర జొచ్చె
మధువొ మధువో యటంచు కమ్మ విలుకాడు
పడతి కన్ను గిన్నెల నిండ పట్టి తెచ్చె
(నవ వసంతవైభవము - కవితాపుష్పకము)
....
సీస పద్యము .. కాంక్ష ...126
కుసుమ కదలలేని కనికరం గానులే
త్రాసు లాగ కదలు తప్పు లేక
చేసుకున్న చెలిమి చేరువగుట యేను
చూసుకున్న వరకు సుఖము లెక్క
కాంక్ష మనసు వేరు కదలిక కళమారు
కాంక్ష పెరుగుటయే కాల జగతి
కాంక్షల ఆశలు కాలవెలుగు రీతి
కాంక్షతో లోభము కాల జగతి
తే. అనుభవాలు తడుముతుంది అభినయనము
కలతలు వలన నలిగెను కాపురమ్ము
తలపు వలపుచుట్టు తిరుగు తుంది నిజము
ప్రశ్న కలలు చెరుగు తుంది ప్రగతి కోరి
***
సీస పద్యము
అనుభవం తలపులు ఆశయం మెరుగులు
అనుభూతి కళలన్ని అనుభవమ్ము
ఆణువణువూ ప్రేమ ఆనంద సంతసమ్ము
తనువు తపన కళ తృప్తి నిచ్చు
కనలేని సొగసులు కళ్లలే యగుటయే
తనమన చూపెట్టె తరుణమేది
వినలేని బుద్ధికి వేవిళ్లు వచ్చినా
చినుగులా బ్రతుకుగా చరిత బ్రతుకు
ఆ:: మనసుమంచమెను మనుగడ కరుణయే
తనివి తీర సుఖంము తప్పు కాదు
చినుఁగు పుట్ట గతియు చేష్టలు వివరనే
వణుకు పుట్ట కలదు వరుస మారె
......
సీస పద్యము 128
చెక్కిలి సొంపులు చేమంతి పువ్వులు
చెనగ సేను మెరుపు చేష్ట ళుడిక
చెండుమల్లి గుబురు చెరుకు తోట పొగరు
చేరువ చెమ్మట చెమ్మ చెక్క
చేతిచెంగును జార చింతచిక్కుడు ఆట
చెలిమి చేరువగుట చీర కులుకు
చేసుకున్న వయసు చెయ్యి చెయ్యి కలుప
చెంగున చెడుగుడు జిగురు బలిమి
ఆ:: యడమ ఎత్తి పెట్టి యేటిగట్టు మునక
మంచె దాపు చేరి మహిమ జూపి
కోడె గిత్త పొగరు కోర్కను తిర్చగా
అడ్డు గీత తొలగి అట ముగిసె
***
సీసపద్యము .. లక్ష్మి 129
జయలక్ష్మి వరలక్ష్మి జప లక్ష్మి ధైర్య లక్ష్మి
సంగ్రామ ధన లక్ష్మి సమయ లక్ష్మి
వీరలక్ష్మి ప్రియురాలవై హరి సతి లక్ష్మి
పాల జలధిలక్ష్మి ప్రగతి లక్ష్మి
నిధిలోని పసనైన మీగడ మేలి లక్ష్మి
నీలవర్ణపు లక్ష్మి నిగమ లక్ష్మి
ఏలేవు లోకము ఎల్లలు కళలక్ష్మి
సంపద విదిలక్ష్మి సమర లక్ష్మి
తే:: నిధులు నిలిపేటి తల్లివి నీవరమగు
విధికి చిక్కిన సుఖమను విద్య తెలప
కల్పవల్లిగా కనులకు కనికరముయె
తోడు నీడగా నుండియు పోరు లక్ష్మి
****
సీసపద్యము ...౧౩౦
పరిచయాలె మనసు పరిమళించ చెలిమి
పగవాని కలయిక పలక రించు
ఏది చేదు యనక ఏది తీపి యనక
జీవితమే కల జీవ మగుట
వరమగు శాపము వరుసగతి స్థితి
పరిణమించు బ్రతుకు పరుని పంచ
ఉన్న నాడు తలుచు ఊహ కలుపు కోవు
ముసుగు మారి కదులు మునక తేలు
తే:: నిత్య సంకల్పము వికల్ప నీడ వెంట
నిత్య ము అహము మమకార వీధి వెంట
నిత్యము అతీతమైనడి స్థిరాము వెంట
స్వామి ఆనంద మకరంద సాక్షి వెంట
*****
సీస పద్యము ... 131
చిరునవ్వు చిరుగాలి చెలిమిగా కదిలెను
మరుమల్లె మనుగడ మనసు కోరె
తెరిచి ఉన్న ద్వార తీర్పును కోరెను
ఆవేశ అనుమాన మసలు వద్దు
ప్రతిఫలించు మదియు ప్రతిభను చూపుట
మనసుకి శత్రువు మాయ చేర
స్వేచ్ఛ ఎంత యనక సేతువైతిని నేను
క్షేమకాంక్షను తెల్పు కీలకమ్ము
ఎగురు గాలిపటమగుటే ఏల మేము
దారి తెలియక బ్రతుకులో ధర్మ మేది
పరిగణించు కొన్నాళ్లకి పెళ్లి కళలు
పగలు రేయి కష్టము వంతు ప్రమిద వెలుగు
***
సీస పద్యము
జ్ఞానము గలవాడు, జ్ఞాని ఉత్కృష్ట గా
నవసించు, సత్యమై నట్టి వాడు
తనివి తీరని మహోత్తరమైన, నిత్యమై,
వెలుగొందు అమరుడు, అమృత మూర్తి
జీవుల నుపవిత్రు లను చేయు, అన్నింటి
ని భరించి ఆధార మైన వాడు
విశ్వ ఆవిర్భావానికి కారణ మైనవాడు
బహుశిర ములుగల భవ్య సాచి
తే:: కరుణ వెదజల్లు కన్నులు గాంచువాడు
నెల్ల దిశలందు గనబడు విశ్వమూర్తి
కుచితమగు నలంకారము గుర్తు వాడు .
రండు రారండు జోహారు రమ్య వేగ
--(())--
సీస పద్యము
ముల్లోకములకు సమ్మదము గూర్చెడు వాడు
చల్లని లోచనా బ్జములు వాడు
దు:ఖార్తులను చూసి ఆర్తిని హరించి
రక్షించె ప్రజ్ఞా స్వ రూపుడైన
వాడు, పగలువలె వ్యాప్తి గలిగెడి యె
కాలము స్వరూపు కామ్య వాడు
పరమాత్మ నీస్వరూపమ్ము గాను .
దర్శించగలగిన ధీరుడు
తే:: పాము వలె పట్ట శక్యము గానివాడు
నరుల కారణ భూతుడై నట్టి వాడు
గోప్యముతెలిసి ఉండేటి విశ్వ హరుడు
సమము చేసియు సంకల్ప ముగల వాడు
--(())--
శౌర్యము గలవాడు. పురుష ప్రయత్నము
నందున ఆధార భూతుడైన
తనకంటె ఉత్తము లైనట్టి వారెవ
రునులేని వాడు , గరుడుని వీపు
పైనఎక్కివిహరిం చేటి వైభవముతొ
నియమాను సారము యున్నవాడు
రాక్షసు లకు కూడ శక్యము గానివా
డు,విషయ గ్రాహ్యము గలిగి నోడు
ఆ:: ప్రాణు లన్ని కర్మ ల ఫలము పొందియు
సర్వ విషయములను తెలుసు కొనియు
ఏక కాలము సర్వము తెలుపు వాడు
సుప్ర తిష్టుడై అందర్ని ఆదు కొనెను
--(())--
సీ:: మధువనే అసురుని సంహరించిన వాడు
భూమిని గర్భము నందు ఉంచి
సర్వ భూతములను శాసించువాడవు
ప్రాణకో టికి నిజ శక్తి నొసగి
విశ్వగర్భమున లోపల నుండిన
అత్యంత వృద్ధుడు అదిపతియును
ఉచ్చ్వాస నిశ్స్వాసలు సలుపు జీవుడు
తన అనుభవములు తెల్పు వాడు
ఆ:: నాడు మనసు విడక ననుబట్టియున్నాడు
కనులకేమో వాడు కాన రాడు
నాదు కన్నులకును మోదంబు గొల్పుచు
నెపుడు కాన బడునొ ? యింపు గాగ
--(())--
సీ:: స్మరణ మాత్రముచే అద్భుతములను
నంతమొందించియు స్థితి బుద్ధి
శుభములు కల్పించు ఆనంద రూపము
కలిగియు పరిశుద్ధుడైన వాడు
ముల్లోకాలను ఏలు జ్ఞానైశ్వర్యాదిగ
గుణసంపద కలిగి నీలి వర్ణ
ప్రళయ కాలమున సర్వమును నశింపచే
యగలిగి సర్వము తెలుపు వాడు
తే:: సచ్చి దానంద వెలుగులు కనులు గలిగి
నిత్య సర్వము నిర్వాహ కమును గలిగి
సృష్టి సక్రమ పధ్ధతి నడప గలిగి
సర్వ లోకాల్ని రక్షణ చేయు వాడు
--(())--
సీ:: ఇంద్రియములకు,దేవతలకు ప్రమాణ
ములకు అందనివాడు విశ్వరచన
చేయగల్గినవాడు శబ్దాది గుణములు
శాశ్వతుడైనవాడు లేనివాడు
అతిశయ స్థూలమైన పురాణ పురుషుడు
నాభి యందును పద్మము గలవాడు
ప్రళయకాలమున సమస్త భూతములను
నాశనము సృష్టింప జేయువాడు.
తే:: విశ్వకర్మతో సాదృశ్యము గలవాడు
దైవ శక్తియు ఇదియు అదియు అనిన ఏల
సర్వ సర్వాంతర్యామిగ కలిగి నోడు
నరులు బ్రహ్మ రుద్రాదుల పూజ్యు డితఁడు
--(())--
సీ:: తనకుతానుగ ఉద్భ వించిన చైతన్య
రూపమై న సమస్త లోకమేలు
కర్మఫలములను అందించి ఆద్యంత
ముయు లేని జన్మము గలిగి నోడు
గొప్పది యగు వేద రూప నాదముగల
వాడు, సూర్యునియందు కాంతి గలిగి
జగతినం తయును చైతన్య పరిచియు
భక్తుల సుఖమును కలుగ చేసె
తే:: స్వర్ణ కాంతితో జగతిని ఏలు వాడు
కర్మ ఫలమును వెంటనే తీర్చువాడు
సర్వ ధాతువు లలొశక్తి కలిగి నోడు
విష్ణు లీలలు నరులను కమ్మి వేయు
--(())--
సీ:: సకలజీవుల అసుభాలను పోగొట్టి
సర్వులకు భగవత్ ప్రాప్తి ఇచ్చి
స్థిరమైన వాడు ఒకరి సహాయము లేక
కార్యము లన్నియు చేసి ఉంచి
ఐశ్వర్య మున్నట్టి సర్వశ క్తి సమన్వి
త,సమస్త కార్యంలొ సామరస్య
ముతొ సకలములను కనిపెట్టి పోషణ
చేసియు ఫలములు పంచి ఇచ్చు
తే:: శాశ్వతుడు సర్వులకు మోక్ష మిచ్చు వాడు
వివిధ అవతార ములు ఎత్తి రక్షకుండు
దేశ కాలాదు లకు మూల మైన వాడు
నిత్య మనుషుల హృదయాన కల్సి ఉండు
--(())--
సీ:: పురుషులం దరిలోను ఉత్తము డు మనో హ
రుడు హృదయమునందు లక్ష్మి ఉన్న
నరుని సింహమును బోలిన అవ యవములు
కలిగిన ప్రకృతిని జీవములను
నియమించి యోగవి ధులకు ప్రభువుగాను
జ్ఞాన సంపదలను వృద్ధి చేయు
సకలఉపాయము లకునిల యముగల
మనసును పంచేటి లోకనాధ
ఆ:: భాద్యతా యుత మగు పనులలో బంధుత్వ
మైత్రి బుద్ధి గుణము పంచు వాడు
ధరణి కలుష మంత దహియింప గలదయా
పరుడు తెల్పు చుండె మల్లాప్రగడ వారు
--(())--
సీ:: నాశర హితుడు, తిరుగులేని గుణములు
అభిరుద్ది పరిచేటి ముక్త పురుష
దేహములో జరుగు పవిత్ర మైనట్టి
ఆత్మస్వ రూపము కలిగి నోడు
నిత్యము శుద్ధము బుద్ధము ముక్తము
రూపమైన ప్రాణి కన్న మిన్న
గొప్పవి యగుఫల ములు ఇచ్చి చక్కగా
సమముగా కర్మలు తెలుపు వాడు
ఆ:: నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై
కార్య సంభవమ్ము చేయు వాడు
జ్ఞాన బీజమైన శుభకర్మలను తెల్పి
నాస రహిత సాక్షి గున్న వాడు
--(())
సీ:: దృశ్యమాన జగత్తు అంతయు తానైన
భూమిని రక్షణ చేయు వాడు
విశ్వమంతయు ఉన్న వేదస్వరూపుడు
జగతికి ప్రభువైన వాడు విష్ణు
భూతభవిష్యత్ జరుగు కాలమును నిర్ణ
యము చేయు శక్తిని పెంచు వాడు
భూతములను సృష్టి , జీవు లందరిని పో
షణ చేసి వేదస్వ రూప విష్ణు
తే:: జగతి నందుసమస్త ప్రజలకు తానె
సర్వ జీవుల అంతర్యామిగను ఉండి
పుట్టి పెరుగుట కారణ మైన విష్ణు
తెల్పు మల్లాప్రగడ వినయపు తృప్తి
--(***)--
సీ:: ఆనంద అధరమే ఆడేది ఆటయే
కానిచ్చు ధర్మమే కాలమగుట
మానమ్ము తీర్ధమే మానస చరితమే
మౌనమ్ము కదలికే మోఖ్య జగతి
వీణ నాదముగాను వీనుల విందుగా
వినయ వాంఛల తీర్పు వేగ పరచ
కనకణాలు కలయు కాల నిర్ణయమది
తనమన లేదులే తపము తీర్చ
తే . మనసు సత్య మిదియె మంగళ కరమగు
తనువు తృప్తి విదిగ తహతహలగు
చినుకు లన్ని చేరి చింత తీర్చతరుణం
వణుకు పోయె హాయి వలపు పొంగ
........
సీ:: `కోటి ప్రభలతోను కొండంత వెల్గుగా
పరులు చూసిన కాన ప్రగతి ఏది
గురుకృపచే కాక గుర్తెరుంగని వెల్గు
అమృత మహిమచూపు ఆశ వెల్గు
విధ్యుత్ లతల పరి వేష్టిత వెల్గుగా
ఘననీల కాంతుల గ్రక్కు వెల్గు
ప్రణవ నాదములు గల్గిన వెల్గు ఇదియగు
మౌనులెన్నగ రమ్య మైన వెల్గు
తే:: ఆది మధ్యంతర ఆశయమ్ముగ వెల్గు
ఆత్మనే కదిలించెడి ఆది వెల్గు
హృదయ ఆనంద పరమాత్మ హాయి వెల్గు
ప్రాంజలిప్రభ సంసార ప్రేమ వెల్గు
.....
సీ:: వేదంబులే నీవు , వేదాంగములు నీవె
జాలరుగా నీవె, జాగృతి ఇది
క్రతువులు నీవెగా , కామ్యతమ్ముగ నీవె
మంచువు నీవెగా , మదిన నీవె
కనకాద్రి నీవెగా , కాంచన వెలుగుయే
తరువులు నీవెగా , తపన నీవె
అనురూప మేనీవె, అవనీతలము నీవె
బ్రహ్మము నీవెగా , బ్రాంతి నీవె
తే:: నిన్ను గొల్చుట నేనెంత నియమ వెలుగు
అణువులో అణువంతయు ఆశ వెలుగు
హృదయ యానందము సుమంత హృద్య వెలుగు
ప్రాంజలిప్రభ సంసార ప్రేమ వెల్గు
.....
సీ:: బ్రహ్మవేదముతోను బ్రహ్మాండమున వెల్గు
నాదాంత సీమల నడచు వెల్గు
సాదు జనానంద సంఘములో వెల్గు
బోధకు నిలయమై పడచు వెల్గు
పరమాత్మ నాలంబ నతొ జొచ్చు నిజవెల్గు
ఆది మధ్యాంతర ప్రేమ వెల్గు
చూడు జూడగ మహా శోభితంబగు వెల్గు
నఖిలజగంబుల నిండు వెల్గు
తే:: మేరు శిఖరంబు నిండిన మేలు వెల్గు
ప్రేమ మోహము వేషము పెంచు వెల్గు
మేను పులక రించేదియు మనసు వెల్గు
ప్రాంజలిప్రభ ఆనంద ప్రేమ వెల్గు
....
సీ:: వేదాంత సూక్తులు విని కొన్ని తెలపాలి
మాత్రాన రాజగా మాయ గాడు
కుండకళ్ళునుత్రాగి తెలియక వాగినంత
మాత్రము శాస్త్రము మాయగాను
మనిషిగా ఉన్నంత మాత్రాన కదలిక
అసలు గుణాన్నియే మార్చలేడు
స్త్రీ వెంట తిరిగినా స్థిరమైన భార్యని
చూడనివాడుయె చూడ లేడు
తే:: ఎంత చదివిన గుణహీను డెంచ లేడు
సింహము జయించె నంతనే సింహ బలుడు
నమ్మ పల్కులతో వాడు నటనకాడు
ప్రాంజలిప్రభ ఆనంద ప్రేమ వెల్గు
.....
సీ:: దండ కమండల దారులై భక్తులు
ముడుపులు కట్టిన ముక్తి రాదు
పులిచర్మము ధరించి పూజ్య విభూతియె
ముక్కుమూసియు యున్న ముక్తి రాదు
సంసారిగా ఉన్న, సన్యాసిగా ఉన్న
మనసుయే లేకున్నా ముక్తి రాదు
పుణ్యతీర్ధాలులే పుడమి ధర్మాలుగా
చేసియు అహముంటె చింత తోడు
తే:: గురువు వాక్యాలు మనసున గుర్తు నిచ్చు
తల్లి తండ్రుల గౌరవం తృప్తి నిచ్చు
భక్తితో దయచూపితే ముక్తి నిచ్చు
ప్రాంజలిప్రభ ఆనంద ప్రేమ నిచ్చు
***
సీ:: ప్రజల దారిద్రాన్ని పారద్రోలు మనసు
శివభక్తి వజ్రమై నిర్ణయంబు
అజ్ణాణ అంధకా రముతొల గించేది
నీ భక్తి భావమే నీ దయంబు
దుర్భుద్ధి మాపియు ధర్మబుద్ధిని పెంచు
నీ సేవ ధర్మము న్యాయమంబు
నిత్య అమృత తత్వ నియముగా ఇచ్చేది
నామ స్మరణ దివ్య ఔషధంబు
తే:: వెన్న ఉన్నను నేతి వెతికి నట్లు
భార్య ఉన్న పరస్త్రీకి పాకి నట్లు
దేవతనుఎంచి ప్రార్ధించి దయయు నట్లు
ప్రాంజలి ప్రభ ఆరొగ్య ప్రేమ యట్లు
****
సీ:: నమ్మకమున యుండి శాలువా లిస్తినె
చాకలి గంజికి కోకలిస్తి
కడియాల కుమ్మర కంకికి దర్శిస్తి
పోగులు పోలంగి పోగు లిస్తి
మనిషికి దుప్పట్లు మనసుగా దర్శిస్తి
దాని తల్లికి నూరు ధార పోస్తి
దాస రచ్చికి దేవతార్చన లమ్మిస్తి
గుర్రాన్ని ఉప్పర గుండ కిస్తి
తే:: చేయు తప్పులు లన్నియు చేయ కుండ
నమ్మ పలికి అపాత్ర దానమును చేసి
చెప్పు కొందురు నిత్యము సిగ్గు విడిచి
ఓర్పు చూపియు కధలన్నీ ఓడు కాదు
***
సీ. చింతపండు పులుపు చీకితే రుచి వేరు
గుళ్ల తీపి మరవ గుర్తు చేయు
సబ్బుబిల్ల శరీర శుభ్రత గనువాడు
ఘుమఘుమలు మనసు గుర్తు చేయు
కందిపప్పు పులుసు కమ్మగ రుచి గాను
గుమ్మడి ముక్కలతో గుర్తు చేయు
మనసు విప్పు రుచిలో మనుగడ కొరకును
మగువకష్టము ఇదే గుర్తు చేయు
ఆ. చింత పండు పులిపు చేష్టమరువనీదు
సబ్బు బిల్ల రుద్దు సంతసమ్ము
కందిపప్పు తింటె కళలు మారి మెరుపు
మనసు విప్పు చున్న మగువ థలుకు
......
తే. మనసులో చింత పండుగే మాయ మాయె
యున్న సబ్బు బిల్ల చిదిమా యూసు లేదు
గుండు కంది పప్పును వాడ గురక తగ్గు
మనసు విప్పు విషయ వాంఛ మనుగడ యగు
.......
సీ.కలల కులుకులేగ కావ్య చరితగాను
లేత గులాబీలు లలిత మగుట
లౌకికమై హృది లావణ్య కథలుగా
లేలేత వలపులు లలిత మగుట
తలపు తలపులోన తారు మారగుటయే
లోకమే హరివిల్లు లోగిలి యిది
లేత మనస్సులో కీలక మేదియో
మమతల మల్లెలు మనసు యగుట
ఆ"" సర్థుబాటు ఏది సమరమే యగుటయు
లేత బుగ్గ గలది కీలకమగుట
గుండె లోన మార్పు గుబులు గుబులుగుబులు
లేత తమలపాకు లయలు చూపు
......
సీ.నేటిబాటను చూడు నిర్ణయం తెలుపుటే
ఆచి తూచి నడక అసలు వద్దు
కాటికెల్లెడివాడు ఖర్చు అడుగు తాడు
ప్రాణభీతిన ఆశ అసలువద్దు
ఏటి కెదురు ఈద ఎల్లవేళల యందు
పట్టుబట్టుట యేను అసలువద్దు
సాటి వానిని చూడు సమయ సుఖము పొందు
వట్టిమాటలు చెప్ప అసలు వద్దు
aa వెనుక ముందు యనకు వేర్పాటు కోరకు
పలుకు లోన పసరు పలక రింపు
కులుకు లాపి చూడు కుళ్ళు కనబడు ను
మలుపు లున్న పట్టు మరువ వద్దు
......

Comments
Post a Comment