ప్రాంజలి ప్రభ..13/3

 13=03=2023 ప్రచ్చే కత.. తెలుగువారు గర్వపదేవిధముగా తెలుగు సినిమా పాటకు ఆస్కార్ అవార్డు...

భారత్‌కు చాలా గొప్ప క్షణం.. ఆస్కార్‌ వేదికను ఓ తెలుగు సాంగ్ ఒక ఊపు ఊపినందుకు చాలా గర్వంగా ఉంది. కీరవాణి గారు, చంద్రబోస్ గారు, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, తమ్ముళ్లు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ అలానే గ్లోబల్ స్టార్స్ నా లవ్లీ బ్రదర్ రామ్ చరణ్, ఎన్‌టీఆర్‌లకు శుభాకాంక్షలు. మీ స్టెప్పులతో ప్రపంచాన్నే డ్యాన్స్ చేయించారు. తెలుగు వాళ్ల గర్వం తారక్‌కు నా శుభాకాంక్షలు. ఈ మ్యాజిక్ సాధ్యమయ్యేలా చేసిన ఎస్ ఎస్ రాజమౌళి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. భారత సినిమాకు అదరహో అదరహో అదరహో

......


RRR విజయం 

ఓపగలు వెలుగు ఓ కళ ఇదియగు 

ఓ రాత్రి వెన్నెల ఓ గుట్టు ఇదియగు

మనసంత ఆత్రము మనతెలుగు కళలు

శూన్యమవని సృష్టి సూత్రదారుల కృషి


ఓతలపు  నిలువ ఓ మలుపు తెలుగు

గమనమ్ము జగతిన అభయమ్ము నీడన


కృషి అగాధపు అంచు కృప కరుణా తీర్పు 

తృప్తి గా గెలుపుయే తృనమైన సంతృప్తి 


 గుర్తింపు తెలుగుకు లోకమ్ము నిజముగా 

బంధాన్ని  వదలదు బంధంతొ ఓప్రేమ 


స్వప్నాలు కాదులే సమరమ్ము చిత్రమై

తీరేను కోరిక  తీవ్రకృషి వలన


ఓనిజం జరగింది ఓ రాజ మౌళిగా

దర్శక మెర్పులు ధరణియందు కళ


అనుభూతులు గుప్పెడు ఆదర్శ చిత్రాలు 

రౌద్రం  రణమ్ము గా ఋదిరమ్ము బతికేను 


ఎందరోమహానుభావుల కృషిగా ❤️RRR కు ఆస్కార్ అవార్డు రావటం తెలుగు వారి ఆత్మ గౌరవం నిలబెట్టటం, గుర్తించటం ప్రాంజలి ప్రభ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నది

 *****

నేటి ప్రాంజలి ప్రభ సమస్య ..  *తాళిగట్టిన భర్తకిచ్చెను తన్విపావన జన్మమున్

ra sa ja -ja bha ra .. /11 

మ:: పాళి రాతలు బ్రహ్మరాతలు పాలు నీళ్ళగ బంధమున్

జోళి కట్టియు మోతమోసియు పొందు బంధపు సౌఖ్యమున్ 

తాళి లక్ష్యము హృద్యబంధము తెల్పు పల్కులు ధర్మమున్        

'తాళి' గట్టిన భర్తకిచ్చెను తన్వి పావన జన్మమున్

(మల్లాప్రగడ రామకృష్ణ) 

....

మ:: తాళిగట్టిన వాడు నిత్యము తాడిచెట్లకు జేరుచున్

కూళలన్ జతగూడి యింటికి కూడు కోసము రాడయో

వేళపాళలు లేని తాగుడు వైద్యశాలకు జేర్చగన్

'తాళి' గట్టిన భర్తకిచ్చెను తన్వి పావన జన్మమున్


*సమస్యను పరిష్కరించడం......ప్రాంజలి ప్రభ  ౧౩-౦౩-2023

గుండ్రాతికి కాళ్లువచ్చి గునగున నడిచెన్ 

....

చండ్రా నిప్పులు కమ్మగ

అండా మరిగియు కదలిక ఆత్రము పెరిగిన్

ఉండా బట్టను లేకయు

గుండ్రతికి కాళ్లు వచ్చి గునగున నడిచెన్

...... (మల్లాప్రగడ రామకృష్ణ గారు ) 

....

*కం. కొండ్ఱాఁతినిశిల్పి కనుచు

బండ్ఱాయైనను విశేషభద్రతతోడన్

తీండ్రపడుచుఁజేసెప్రతిమ

* గుండ్ఱాఁతికికాళ్ళువచ్చి గునగున నడిచెన్ *  !!! "

(అప్పాజీ గారు )

***


ఇదియె రాజ్యాంగ ఉత్తమం రవ్వ వెలుగు
భోజ్య మంత్రుల కాంక్షలు కోరుచున్న
ధర్మ మే నిదురకు దారి ధరణి యందు
జనుల ఘోష రక్షక భట గళము గోల
         
 భారతదేశ ఔన్నత్యం......
మత్త కోకిల: 
ఉత్తరానను ఉత్తమోత్తమ భూధరంబులుగల్గనా
యుత్తమంబగు దేశభక్తులనుత్తమలౌకికరాజ్యమున్
ఉత్తమోత్తమమువ్వన్నెల్ గలముచ్చటైనదిజెండయున్
ఉత్తమంబగురాజ్యఅంగముఉత్తమంబగుదేశమే!

అభినందనలు ... 

ప్రతి మనిషిలో  అహంభావాన్ని చేదించి, అతీతమానసమై అంతర్లయగా సాగేది ప్రేమ, దివ్యజీవనమునకు దోహదకారిగా, నిరంతర కృషికి చేదోడుగా సాగేది ప్రేమ,  అజ్ఞానం అంతర్దానమౌతూ,ఆత్మాన్వేషణకై చేసే అంతర్యానం,స్పృహాదర్శనం, అహంభావం, ఆభిజాత్యం ఆవిరైపోతూ, అనుమానాలు అదృశ్యమౌతూ, అభ్యాసంచే అన్నివేళలా అన్నింటా అంతటా ఆత్మభావం అలవడుతూ పుట్టేది ప్రేమ, అది ఎలా వస్తుందటే నిత్యం ధ్యానం, నియమ ఆహారం, సంతోషపరచి, సంతృప్తపరచి, కర్మ బద్ధులుగా, తల్లి, తండ్రి, గురువు, అథిది, దైవాన్ని స్మరించుటయే ప్రేమ.      

ప్రేమతో  రాష్ట్రీయ సమైక్య సమితి  international వారు 5  పురస్కారాలు మహిళా దినోత్సవం పరంగా ఇచ్చారు 2023లో. " ఉత్తమ మహిళ " పురస్కారం శ్రీమతి ప్రభా శాస్త్రి జోస్సులు గారికి హృదయపూర్వకంగా "ప్రాంజలి ప్రభ" తెలంగాణ ,  ఆ పరమాత్ముడు ఆయురారోగ్య, ఐశ్వర్యం కలించాలని అభినందనలు తెలియపరుస్తున్నది. 

మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ,   

       


ఈ రోజు ప్రాంజలి ప్రభ పత్రికలోనివి ( సేకరణ )

సుభాషితం - 437
----------------
🌺ఉత్తమోsష్యధమస్యస్యా
     ధ్యాజ్ఞానమ్రకరః క్వచిత్ ౹
     కౌస్తుభాదీని రత్నాని
     యయాచే హరిరంభుధిం ౹౹🌺
         కొన్నిసారులు ఉత్తమమైన వాడు కూడా అధముడు ముందు చేతులు కట్టుకొని నించుంటాడు.అలాగే,శ్రీహరి కూడా కౌసభం మొదలైన రత్నాల కోసం సముద్రాన్ని యాచించాడు కదా!?
🌺✍🏼ప్రభ,
           13-3-2023.
🕉️
మాతా శత్రుః పితా వైరీ 
యేన బాలో న పాఠితః ।
న శోభతే సభామధ్యే హంసమధ్యే బకో యథా ।।

ఆచార్య  చాణక్యుడు ఈ సుభాషితంలో విద్యయొక్క ప్రాముఖ్యాన్ని విద్యలేని వారి  పరిస్థితి ద్వారా ఇలా తెలియజేసేరు  --
ఏ బాలుడైతే చదివింపబడడో, వానికి వాని తల్లియే శత్రువు. తండ్రి కూడా శత్రువు. అట్టి బాలుడు సభా మధ్యములో  హంసల మధ్య కొంగ వలె శోభించడు.


 𝕝𝕝 *శ్లో* 𝕝𝕝  
*జకారో జన్మవిచ్చేదః* 
    *పకారః పాపనాశకః |*
    *తస్మాజ్జప ఇతి ప్రోక్తో*
    *జన్మ పాపవినాశకః ||*

*తా𝕝𝕝“జ”*కారము జన్మ కలుగకుండ జేయును....*ప” కారము పాపమును నశింప జేయును*.... *జన్మము, పాపము రెంటిని నాశము చేయునది కావున “జప” మందురు*.... *పరమాత్ముని నామము లన్నింటిలో మూగవాడు కూడ పలుకదగిన నామము "ఓమ్" అనునది శ్రేష్ఠమైనది*.....

🧘‍♂️🙏🪷 ✍️🙏
ఆస్కార్ అవార్డు పొందిన పాట
జయహో... R. R. R. రాజమౌలి , రామారవు , రాంచరణ్ (రౌద్రం, రుధిరం, రణం )ప్రాంజలి ప్రభ 

పొలంగట్టు దుమ్ములోన
పోట్లగిత్త దూకినట్టు
పోలేరమ్మ జాతరలో
పోతరాజు ఊగినట్టు
కిర్రు సెప్పులేసుకొని
కర్రసాము సేసినట్టు
మర్రిసెట్టు నీడలోన
కుర్రగుంపు కూడినట్టు
ఎర్రజొన్న రొట్టెలోన
మిరపతొక్కు కలిపినట్టు
నా పాట సూడు
నా పాట సూడు
నా పాట సూడు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
నాటు నాటు నాటు పచ్చి మిరపలాగ పిచ్చ నాటు
నాటు నాటు నాటు విచ్చు కత్తిలాగ వెర్రి నాటు
చరణం1#
గుండెలదిరిపోయేలా
డండనకర మోగినట్టు
సెవులు సిల్లు పడేలాగ
కీసుపిట్ట కూసినట్టు
ఏలు సిటికలేసేలా యవ్వారం సాగినట్టు
కాలు సిందు తొక్కేలా దుమ్మారం రేగినట్టు
ఒళ్ళు సెమట పట్టేలా వీరంగం సేసినట్టు
నా పాట సూడు
నా పాట సూడు
నా పాట సూడు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు…వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు…ఊర నాటు
నాటు నాటు నాటు…గడ్డపారలాగ చెడ్డ నాటు
నాటు నాటు నాటు…ఉక్కపోతలాగ తిక్క నాటు
చరణం 2#
భూమి దద్దరిల్లేలా
ఒంటిలోని రగతమంతా
రంకెలేసి ఎగిరేలా
ఏసేయ్ రో ఎకాఎకీ
నాటు నాటు నాటు…వాహా…ఏస్కో
అరె దుమ్ము దుమ్ము దులిపేలా
లోపలున్న పానమంతా డుముకు డుముకులాడే
దూకెయ్ రో సరాసరి
నాటు నాటు నాటు
.......



దృఢవిశ్వాసంతో చేసే పని తప్పక ఫలితాలనిస్తుందన్నది

RRR సినిమా లోని నాటు నాటు  సాంగ్ కు  ఆస్కార్  అవార్డు వచ్చిన శుభ సందర్భంలో  యావత్ RRR.  టీం కు  మరియు ప్రతి భారతీయుడు మరియు తెలుగు వారందరికీ శుభాకాంక్షలు  అభినందనలు  తెలుపుతు 

 ఈ పాటను వ్రాసి  నా ఆనందాన్ని ఈ పాట రూపంలో తెలియ జేసుకుంటున్నాను.💐 మహేష్ వూటుకూరి  ✍️

*********************************************

నేటి నా పాట పాట సంఖ్య 575

******************************

పల్లవి:-

*******

జయహో జయహో జయహో

జయహో జయహో( జయ జయ) జయహో!!


జయహో రాజమౌళి జయహో రామ్ చరణ్.

జయహో జూనియర్  ఎన్టీఆర్ 

జయహో అంటు హర్షించెనే మీ అందరికీ ఆంధ్రావని

శుభాకాంక్షలతో


మా జూనియర్ ఎన్టీఆర్ జయహో అంటు 

హర్షాతిరేకమై పుష్పించెనే భారతావని 


మన  రామ చరణ్ జయహో జయహో 

అంటు  హర్షాతిరేకమై ఆనందోదయమై

కురిసిందిలే వర్షమై విశ్వ మానవాళి!!


మీరు అందుకున్నారు  ఆస్కార్ 

అందరు మెచ్చిన  రాజమౌళీ గారు

అందరిలోకి ఘనత మీదేలే  కీరవాణి గారు

 జయహో జయహో..

చరణం;-

********

గగనాన ఆ తేజం ఆశీర్వదించాడులే

భువనాన ఈ జనం  దీవించారులే

మీ  కసి(రౌద్రం)  మీ కృషి (రుధిరం) మీ కోపం( రణం)

RRR

అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారురా!!


జయహో  రాజమౌళి  R

జయహో జయహో రామ్ చరణ్  R

జయ జయ జయహో   రామారావ్ R

జయహో కీరవాణి

జయహో చంద్ర బోస్

జయహో  కాలభైరవా 

జయహో రాహుల్

జయహో ప్రేమ్ రక్షిత్.

జయహో జయహో RRR టీం.

అనితరసాద్యమైన  ఆస్కార్   అందుకున్న ఈ శుభ సమయానా.


మీరు అందుకుంటే

 ఆస్కార్ కే పురస్కారం పొందినట్లురా

మీరు అందుకోగానే

ఆస్కారే తన జన్మ ధన్యమైనదని పులకించి పోయేనురా..!!

 పల్లవి:-

*******

జయహో జయహో

చరణం:-

********

ఎవరూ మీకు సాటి లేరు

ఎవరు ఎప్పుడు  ఇక మీకు పోటి కాలేరులే

నిరూపించేలా నటనలో జీవించినారులే!!


అందుకే అందుకో  అందుకున్నారులే

విశ్వ వేదికపై భారతావని ముద్దు బిడ్డలు గా

తెలుగు తల్లి తొలి బిడ్డలుగా

వెలుగొందారులే.... విరాజిల్లుతున్నారులే...!!

వెలుగులతో వెండి తెర సూర్యుడి లా  

విశ్వజన జయజయ ద్వానాల హోరులో!!


అందుకోరా  కోట్లాది మంది అభినందనల వెల్లువలు

పొందుతావురా ఆనందోత్సాహాల సంబరాలు

ఉత్సాహాల  చప్పట్లు అంబరమంటుతుండగా

ఆస్కార్ ఆస్కార్  ఆస్కార్

అత్యంత అత్యుత్తమమైన అవార్డు

ఆస్కార్ పురస్కారం అందుకున్నారుగా

ఘనాఘన ఘనుడా  సుందరుడా

నట విశ్వ విఖ్యాత వారసుడా!!

 పల్లవి;-

*******

జయహో జయహో

చరణం:-

********౮

కలలో కూడా ఎవ్వరు ఊహించ లేనిది

ఇలలోనే నిజమయినా రోజు  

జీవితాన మీకు వచ్చినాది

జక్కన్నా చెక్కిన చిత్ర రాజానికి

మీ రాజసం తోడైనాది..

రామ్ చరణ్  ఎన్టీఆర్ నాటు నాటు లో

చెలరేగి పోయారులే

అది తెలుగ వారికి  వరమైనాదిలే!!


చక్కనైన చిత్రమై చరిత్ర లిఖించినాదిక

మొక్కవోని మీ కష్టానికి 

దేవుడు ఇచ్చిన కానుకా ఆస్కార్

మా గుండెల్లోని కోరిక  తీరినాదిక !!


జన సంద్ర హృదయ స్పందన నిజమయినాది

ఈ నీరాజనాల జయ జయ ధ్వానాలు నింగి నంటుకోగానే

ఆకాశ  మేఘాలు పులకించి ఆనంద భాష్పాలుగా పూలవర్షమై రాల్చాయిలే!!


మీ  వినయం  ఈ విజయానికి దరహాసం

మీ పనితనం  పలికించిన  ప్రభంజనం

శత్రువైనా శహబాస్ అని మెచ్చిన అధ్బుత చిత్రం

మీకే సాద్యం మీ అందరికీ చెందును ఈ విజయం 

మా అందరికి పంచెను ఆనందం.!!


జూనియర్ ఎన్టీఆర్  రామ్ చరణ్

హ్యాట్సాఫ్ హ్యాట్సాఫ్ హ్యాట్సాఫ్ రాజమౌళి గారు


దేశమే గర్వించేలా  

మా  దేహమే అణువణువు పులకించేలా 

మీ గొప్ప నటనకు విశ్వ చక్రవర్తులుగా  కొనియాడ బడ్డారురా.  ఎన్టీఆర్ రామచరణ్  గారు.

 పల్లవి:-

******

జయహో  జయహో జయహో జయహో

జయహో జయహో జయహో జయహో జయహో!!

************************************

రచన:-మహేష్ వూటుకూరి 

9640713717.

దోర్నాల.

 ప్రకాశం జిల్లా.

13//03/2023.

**********************


Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ