ప్రాంజలి ప్రభ..16/03*

......
నారద భక్తి సూత్రాలు - 🌹
ప్రథమాధ్యాయం - సూత్రము -
🌻. పరాభక్తి యొక్క లక్షణం - 1 🌻
1. అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామః ||
అధికారి అయిన వానికి అనుభవ జ్ఞానంతో భగవదనుభవ ప్రాప్తిని బోధించుట అని అర్థం. అనగా ఇప్పుడు భక్తి గురించి వ్యాఖ్యానిస్తున్నారు.
అంటే ఇంతకుముందు ముక్తి కొరకు తెలుసుకోవలసిన అనేక శాస్త్రాలను పరిశీలించారన్నమాట. ఇప్పుడు భక్తి విషయం తెలుసుకోవాలి.
అంతేకాదు. భక్తి సాధనకు ఉపక్రమించే ముందు అతడికి యోగ్యత ఉండాలి. యోగ్యత, ఆసక్తి, శ్రద్ధ ఉన్న వారికే ఈ భక్తి విషయం తెలియజేయాలి.
ఇప్పుడు అంటే అట్టి యోగ్యతను సంపాదించడం కోసం చేసిన ఇతర క్రియలు, సాధనలు పూర్తి అయిన తరువాత అని అర్థం. యోగ్యత లేక అధికారం అంటే ఏమిటి ?
కర్మ నిత్యం, నైమిత్తికం, విశేషం అని మూడు విధాలు. ఈ మూడింటిలోనూ కర్త యొక్క ఆచరణలో భగవదనుభూతి కొరకు ఉద్దేశించబడినట్లైతే అతడు యోగ్యుడు, అధికారి..
భక్తుడు అని పిలిపించు కోవాలంటే ముందుగా అతడికి భగవంతుని మీద విశ్వాసం, ప్రేమ ఉండాలి. మనసా, వాచా కర్మణా భక్తి సాధనలను ఆచరించాలనే దృఢ నిశ్చయం ఉండాలి. సానుకూల దృక్పథం, ఏకాగ్రత ఉండాలి.
ముందుగా భక్తుడు తన లక్ష్యం ఏమిటో తెలుసుకున్న తరువాత క్రమ సాధన గురించి ఆలోచించాలి. ఎందుకనగా ఇప్పుడు మనం చూచే చాలామంది భక్తులలో ముక్తి లక్ష్యం లేదు. కోరికలను తీర్చుకోవడానికో, బాధల నివారణకో భక్తి చేస్తున్నారు. ఎప్పుడు అవసరమో, అప్పుడు మాత్రం చేసి, మానివేస్తున్నారు.
భగవంతుని సరిగా అర్థం చేసుకోకుండా ఆయన మన కోరికలను తీర్చేవాడిగానే విశ్వసించి భక్తి చేస్తున్నారు. ప్రతిఫలం లభిస్తే మ్రొక్కులు తీరుస్తున్నారు. లేకపోతే ఇష్ట దైవాన్నే మార్చివేసుకుంటున్నారు.
సాధారణ మానవులను ప్రసన్నం చేసుకోవడానికి ఏమి చేస్తామో దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి కూడా అవే ఉపాయాలు ఆచరిస్తున్నారు. ఇట్టి క్రియలకు, మానసిక స్థితులకు భగవంతుడు ఉలకడు, పలకడని వారికి తెలియదు.
అయితే లోకంలో చేసే భక్తి క్రియలలో దోషమున్నదా అని అంటే అవన్నీ భక్తి సాధనకు ముందస్తుగా చిత్తశుద్ధితో అవలంబించవలసినవే. అంత మాత్రానికే భగవదనుగ్రహం లభించదు. ఇంకను చేయవలసింది చాలానే ఉన్నది. మొదట్లో తెలియకనో, శక్తి చాలకనో చేసే భక్తి క్రియలు అలాగే ఉంటాయి.
అదే భక్తి యోగంగా, సాధనగా భావించి చేయడం కొనసాగిస్తే కాయికంగానూ తరువాత వాచికంగా కూడా చేస్తారు. అక్కడితో ఆగక మానసిక
భక్తిగా మార్చుకుంటారు. మానసిక భక్తి చేస్తూనే పూర్వపు కాయిక వాచిక సాధనలను కూడా కొనసాగిస్తారు.
ఇదే విధమైన భక్తి క్రియలలో తామసిక భక్తి, రాజసిక భక్తి, సాత్విక భక్తి అని మూడు విధాలు. ఈ మాదిరి గుణాలతో జరిపే భక్తిని గౌణభక్తి అంటారు.
గుణాలతో కూడిన భక్తికి సత్‌ఫలితముండదు. సాధన క్రమంలో భక్తుడు గుణాలను అధిగమించినప్పుడు అది గౌణభక్తి నుండి నిజమైన భక్తిగా పరిణమిస్తుంది. కొందరు భక్తి అనగా అప్పటివరకు వారు చేస్తున్నదే అని అనుకుంటారు.
స్వార్థపూరితం అపవిత్రం అయిన స్వభావాన్ని మార్చుకుంటూపోతే భక్తిలో నాణ్యత పెరగడం మొదలవుతుంది. స్వార్థంతో జరిపే భక్తిని స్వార్థరహితంగా మార్చుకున్నప్పుడది ''భక్తి కోసమే భక్తి''గా మారుతుంది. తుట్ట తుదకు అది ముఖ్యభక్తిగా మారి స్థిరపడుతుంది.
ఇప్పుడు అంటే పై విధాలైన భక్తి విధానాలను తెలుసుకొని, ముఖ్య భక్తిని లక్ష్యంగా చేసుకున్న తరువాత అని అర్థం. పరమ లక్ష్యమైన మోక్షాన్ని పరాభక్తి అంటారు. అందువలన ముందుగా పరాభక్తి అనే లక్ష్యాన్ని చెప్పబోతున్నారు. దీని బోధకు సంసిద్ధమవ్వాలంటే అనుబంధ చతష్టయం తెలియాలి.
అవి (1) భక్తి అంటే ఏమిటి ? (2) భక్తి ఎవరికి అవసరం? (3) భక్తి వలన కలిగే ప్రయోజనం ఏమిటి? (4) భక్తి సాధనకు యోగ్యులెట్టివారు?
(1) భక్తి అంటే మానవుని కష్టాలను శాశ్వతంగా నివారించడానికి చేసేది. భగవంతుని నుండి వేరైన జీవుడిని తిరిగి భగవంతునిలో ఐక్యం చేయడానికి చేసేది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
కవిత్రయం రచించిన అంధ్ర మహాభారతం లోని 108 తెలుగు పద్యాలను తాత్పర్యంతో సహా డా.గజల్ శ్రీనివాస్ ఎంతో శ్రావ్యం గా గానం చేశారు. తప్పక విని , తెలుగు వారందరికీ అందేలా ఈ లింక్ ను పంపండి. మాతృ భాష సేవ..మాతృ మూర్తి సేవ..
టిక్ చేసి వినగలరు
చిత్రం : శాంతినివాసం (1960)
సంగీతం : ఘంటసాల
నేపధ్య గానం : లీల
సాకీ :
తుషార శీతల సరోవరాన.. అనంత నీరవ నిశీధిలోన
ఈ కలువ నిరీక్షణ...నీ కొరకే.. రాజా... వెన్నెల రాజా....
పల్లవి :
కలనైనా నీ వలపే..
కలనైనా నీ వలపే.. కలవరమందైనా నీ తలపే
కలనైనా నీ వలపే..
చరణం 1 :
కలువ మిఠారపు కమ్మని కలలు...
కలువ మిఠారపు కమ్మని కలలు...
కళలూ కాంతులూ నీ కొరకేలే..
కళలూ కాంతులూ నీ కొరకేలే..
చెలియారాధన సాధన నీవే..
జిలిబిలి రాజా జాలి తలచరా
కలనైనా నీ వలపే..
కలనైనా నీ వలపే.. కలవరమందైనా నీ తలపే
కలనైనా నీ వలపే..
చరణం 2 :
కనుల మనోరధ మాధురి గాంచి...ఆ ..ఆ..ఆ...
కనుల మనోరధ మాధురి గాంచి...
కానుక చేసే వేళకు కాచి..
కానుక చేసే వేళకు కాచి...
వాడే రేకుల వీడని మమతల
వేడుచు నీకై వేచి నిలచెరా...

........
.వినాయక చరిత్ర..
విఘ్నేశ్వరుడు* ఒకనాడు పార్వతీదేవి చెలికత్తెలయిన జయ విజయలు అమ్మవారితో ఒకమాట చెప్పారు. ‘అమ్మా, నంది నిన్నూ వహిస్తాడు, శంకరుడినీ వహిస్తాడు. కానీ ఆయనకు కొంచెం శంకరుని మాల ఔదలదాల్చడంలోనే సంతోషం ఎక్కువ. భ్రుంగీ అంతే. మన మాటే వినేవాడు ఒకడు లేడు. అలాంటి వాడు మనకి ఒకడు ఉంటే బాగుంటుంది. అందుకని నీవు ఒకడిని సృష్టించి ద్వారపాలకుడిగా పెడితే వాడు నీ మాటే వింటూంటాడు. అలాంటి వాడిని తయారు చెయ్యి.
అతడు మన అంతఃపురమును కాపాడడానికి పనికివస్తాడు” అని చెప్పారు. వారి మాటలు విన్న పార్వతీ దేవి అలాగే చేద్దాం అని తన శరీరమునకు ఉన్న మలమును స్నానం చేసేటప్పుడు నలుగు పిండిలా తీసి దానిలోంచి ఒక పిల్లవాడిని తయారు చేసింది. నలుగులోంచి తయారు చేయబడిన పిల్లవాడు ఎలా ఉన్నాడన్నది ఎవరికీ తెలియదు. చాలా బాగుండాలని అమ్మవారు సంకల్పం చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. వాడు లేచి కూర్చున్నాడు. అపుడు వానితో నీవు వెళ్లి ద్వారము దగ్గర కూర్చుని ఎవరూ లోపలి రాకుండా నిలుపు’ అంది అపుడు ఆ పిల్లవాడు ద్వారం దగ్గర కూర్చున్నాడు. ప్రమథగణములలో ముందు నందీశ్వరుడు విజయం చేస్తుండగా శివుడు లోపలి వెళ్ళబోయాడు.ఈ పిల్లవాడు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. ముందు శంకరుడు జ్యోక్యం చేసుకోలేదు. అపుడు ప్రమథగణములకు ఆ పిల్లాడికి మధ్య యుద్ధం జరిగింది. ఎవరు సలహా చెప్పారో వాళ్ళే అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మా పిల్లవాడు యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి నీ శక్తులను పిల్లవాడికి ఇవ్వవలసింది అని చెప్పారు. అమ్మవారు శక్తులను ఇచ్చింది. ఆ పిల్లవాడు అద్భుతమయిన యుద్ధం చేసి ప్రమథగణములనన్నిటిని ఓడించేశాడు. ఇంక అక్కడ నుండి బ్రహ్మ, విష్ణువు కూడా వచ్చేశారు యుద్ధానికి. అయినా ఆ పిల్లవాడు శంకరుడిని లోపలికి పంపించలేదు. అపుడు శంకరుడు చేతిలో త్రిశూలమును పట్టుకుని పిల్లవాని కంఠమునకు గురి పెట్టి విసిరాడు. అపుడు త్రిశూలం ఆ పిల్లవాని కంఠమును ఉత్తరించేసింది. ఆ పిల్లవాడు క్రిందపడి మరణించాడు.
తరువాత శంకరుడు లోపలికి వెళ్ళాడు. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో పార్వతీదేవి బయట కాపలా పెట్టిన పిల్లవాని ప్రస్తావన వచ్చింది. అపుడు శివుడు ఆ పిల్లవానిని త్రిశూల ధారల చేత చంపేశాను అన్నాడు. అపుడు పార్వతీదేవి అయ్యో ఆ పిల్లాడిని నేనే సృష్టించాను – చంపేశారా అని దుఃఖమును పొందింది. ఆవిడ దుఃఖమును ఉపశమింపజేయడానికి దేవతలు అందరూ వచ్చారు. ఆవిడ శంకరుని తన బిడ్డను మరల బ్రతికించమని అడిగింది. అప్పుడు ఆయన తన అనుచరులను పిలిచి మీరు ఉత్తర దిక్కుగా వెళ్ళి మీకు మొట్టమొదట కనపడిన ప్రాణి ఏదయితే ఉంటుందో దాని తలకాయ తీసుకురండి. ఆ తలకాయ పిల్లవాడికి పెడతాను’ అన్నాడు. వాళ్లకి మొట్టమొదట ఏనుగు కనపడింది. వాళ్ళు దాని తలకాయ పట్టుకొచ్చారు. దానిని ఈ పడిపోయిన పిల్లవాని కంఠమునకు కలిపాడు. ఆ పిల్లవాడు చక్కగా లేచి కూర్చున్నాడు.
ఇప్పుడు వానికి శంకరుడెవరో తెలిసి శంకరునికి నమస్కారం చేశాడు. వెంటనే శంకరుడు కూడా వాడిని ఎత్తి తొడమీద కూర్చోపెట్టుకున్నాడు. ఈలోపుగా సుబ్రహ్మణ్య జననం కూడా జరిగిపోయింది. ఈ ఇద్దరి పిల్లలతో సంసారం చక్కగా నడిచిపోతోంది. ఒకరోజు ఒక యోగ్యమయిన సంబంధం వచ్చింది విశ్వరూప ప్రజాపతి అనే ఆయన తన ఇద్దరు కుమార్తెలయిన సిద్ధిబుద్ధి అనే వాళ్ళను ఇవ్వాలనుకుంటున్నాను అని వచ్చాడు. అపుడు శంకరుడు తన కుమారులను పిలిచి ఎవరు ముందు భూప్రదక్షిణ చేసి వస్తే వారికి ముందుగా పెళ్ళి చేస్తానన్నాడు. ఇద్దరూ బయలుదేరారు. గణపతిది మూషిక వాహనం. అందుకని ఆయన తల్లిదండ్రులిద్దరికీ ఏడుమార్లు ప్రదక్షిణం చేసి వారిని పత్ర పుష్పములతో పూజ చేశారు. సుబ్రహ్మణ్యుడికి ఎక్కడికి వెళ్ళినా వినాయకుడు ముందుగా వెళ్ళిపోతున్నట్లు కనపడుతున్నాడు. పార్వతీ పరమేశ్వరునకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసిన ఫలితమును ఆయన ఖాతాలో వేసి ‘నువ్వు చెప్పినటువంటి నియమమును పాటించిన వాడివి కనుక నీకు ముందు వివాహం చేస్తున్నాను అని చెప్పి సిద్ధి బుద్ధిలను గణపతికిచ్చి వివాహం చేశారు. సుబ్రహ్మణ్య స్వామీ వారు క్రౌంచ పర్వతం దగ్గరకు వెళ్ళారు. పార్వతీ పరమేశ్వరులు కూడా వెళ్ళారు. ఇక్కడ మనకు కొన్ని సందేహములు కలగడానికి అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా శంకరుడు ఆ పిల్లవాని తలను తీసివేసి ఉంటే ఏనుగు తల పెట్టడం ఎందుకు? పడిపోయిన తలకాయనే అతికించవచ్చు కదా! అని. పార్వతీ దేవి అనగా పరమ ప్రక్రుతి. పరమ శివుడనగా పరమ పురుషుడు. పరమ ప్రకృతి అంటే పంచ భూతములు. పంచభూతములయందలి కదలిక పరమేశ్వరుడు. అమ్మవారు భూతములన్నిటిని తయారుచేస్తుంది. కానీ లోపల చైతన్యం శివుడు. అంటే శివ సంబంధమయిన ఎరుక లేదు. లోపల ఉన్న చైతన్యము ‘నేను’ అన్నది తెలియదు. పైన ఉన్న శరీరము మూడు గుణముల చేత బంధింపబడి ఉంది. ఈ మూడు గుణములే ప్రకృతి యొక్క మలము. అదే అమ్మవారి శరీరంలోంచి వచ్చిన మలము. ఆ మలముతో పిల్లవాడు తయారు అయాడు. అంటే త్రిగుణములయందు కొట్టుమిట్టాడుతున్నాడు. కాబట్టి ఈ తలకు ప్రకృతి తెలుసు శివుడు తెలియదు. లోపల ఉన్న చైతన్యం బయట నిలబడిన శివుడు అని తెలియదు. కాబట్టి ఆయన దానితోనే పోరాటం చేశాడు. శంకరుడు ఆ పిల్లవాని తలను త్రిశూలంతో తరిగేశాడు. త్రిశూలమునకు ఉన్న మూడు త్రిగుణములు, వీటికి ఆధారమైన సత్యము శంకరుని చేతిలో ఉన్న త్రిశూలం. శంకరుడు గుణాతీతుడు. ఎప్పుడయితే శివుడి చేతి త్రిశూలం పిల్లవాని కంఠమునకు తగిలిందో త్రిగుణములకు సంబంధించిన బుద్ధి పోయింది. ఇప్పుడు ‘గజ’ – ఏనుగు తల పెట్టబడింది. ‘గ’ అంటే గతి అంటే కదలడం; ‘జ’ అంటే పుట్టడం. ఇపుడు ఆ పిల్లవానికి ఇందులోంచి పుట్టి ఇందులోకి వెళుతున్నాడో తెలిసిపోయింది. అంటే ఇప్పుడు శివసంబంధం వచ్చేసింది. శివుడు తెలిసిపోయాడు. తెలిసిపోవడం గజముఖం. అందుకని శంకరుడికి నమస్కారం చేశాడు. ఇది మీరు చెయ్యవలసిన ఉపాసనా క్రమమును వినాయకుని మూర్తి ద్వారా లోకమునకు తెలియజెప్పడం. ఏనుగు తల బ్రహ్మాండమును చెప్తే మనిషి శరీరం పిండాండమును చెప్తుంది. బ్రహ్మాండం, పిండాండం రెండింటి యందు పంచభూతములు ఉన్నాయి. రెండూ పంచ భూతములలో నిండి ఉన్నప్పటికీ రెండింటియందు ఉన్నది ఒక్కటే అని జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొంది తత్త్వమసి అర్థమయితే ‘తత్ త్వం అసి’ ‘అదే వాడి ఉన్నాడు’ జీవుడే ఈశ్వరుడై ఉన్నాడు అని తెలియడమే ఏనుగు ముఖం మనుష్యుడు తల కంఠం దగ్గర శివానుగ్రహంతో కలవడం. కాబట్టి తత్త్వమసి మహావాక్యం నడయాడితే మహాగణపతిగా తిరుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడాయన వినాయకుడు అయ్యాడు. ‘వి’ అంటే విశిష్టమయిన – అనగా విశిష్టమయిన నాయకుడు అయ్యాడు. మీరు ఆయనను ఉపాసన చేస్తే ఆయన మిమ్మల్ని అటువంటి పథంలోకి తీసుకు వెడతాడు. ఆయన విఘ్నములకు నాయకుడు. విఘ్నమును తీసేస్తాడు. మీరు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుస్తాడు. గణపతి పరబ్రహ్మమై ఉన్నాడు. ఈయనకు సిద్ధిబుద్ధి భార్యలు. ఎవరు బుద్ధిని ఉపయోగిస్తాడో వాడు సిద్ధిని పొందగలడు. బుద్ధి అనేది ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. గణపతి ఆరాధన చేత మంచి బుద్ధి వచ్చి సిద్ధి పొందడమే ఆయనకీ సిద్ధి బుద్ధి భార్యలు అయి ఉండడం. ఆ అనుగ్రహం మీయందు ప్రసరింపబడడం. ఏనుగుకు అన్నిటికన్నా ఇష్టమైనది దాని దంతం. కానీ అది నమలడానికి పనికిరాదు. ఏనుగు ముఖం ఉన్న గణపతి వ్యాసుడు భారతం చెప్తుంటే తన దంతమును విరిచేసి దానితో రచన చేశాడు. మనకి ఉన్న వస్తువులను లోకోపకారానికి ఉపయోగించాలి. భారతమును రచించడానికి తన దంతం ఉపయోగ పడితే కొన్ని యుగాలపాటు పంచమ వేదమయిన భారతమును లోకం చదువుకుని ఉద్ధరింపబడుతుంది అని భావించి తన దంతమును విరిచేసి దానితో భారతమును రచన చేశాడు. ‘ఏకదంతం, శూర్పకర్ణం, లంబోదరం’ అని పేర్లు సంపాదించాడు. ఎంతో శాశ్వతమయిన యశస్సు పొందాడు. శివుడు ఎంత సులభుడో వినాయకుడు అంత సులభుడు. ఇరువది ఒక్క గరిక తెచ్చి ఆయన పాదముల మీద వేస్తే చాలు. అన్నీ ఇచ్చేస్తాడు. కొద్దిగా సింధూరమును గండయుగ్మమునాకు రాస్తే చాలు పొంగిపోతాడు. ఏనుగు తల కనపడితే మంగళ ప్రథము. చివరకు కలలోకి ఏనుగు వచ్చినా అది మంగళప్రదమే. గణపతి స్వరూపంలో చిత్రమయినది ఎలుక. గణపతికి వాహనం ఎలుక. ఎలుక దొంగతనానికి ప్రతీక. మనతో పాటే ఉంటుంది. మన వస్తువులన్నీ ఎత్తుకుపోతూ ఉంటుంది. మన బ్రతుకూ అంతే. విఘ్నేశ్వరుని ప్రార్థిస్తే మనకి ఆయన పదిమంది హృదయాలను కొల్లగొట్ట గలిగిన దొంగతనమును పొందుతాడు. అనగా ఈశ్వరాభిముఖుడై భగవద్భక్తి చేత తాను మాట్లాడిన మాటలకు పరవశులై చాలామంది హృదయాలను తాను కొల్లగొట్టే దొంగ అవుతాడు. ఇలా మారడానికి ఎలుక విఘ్నేశ్వరుడిని వహించింది. మీరు కూడా అలా వహించడం నేర్చుకోవాలి. పదిమంది ప్రేమను సంపాదించుకోవడం నేర్చుకోవాలి. దీనిని సూచించదానికే ఎలుకను వాహనంగా పెట్టుకున్నాడు. ఎలుక చెవులు పెద్దవిగా ఉంటాయి చేట లాగా. గణపతిని నమ్మి ఆవాహన చేసి జాగ్రత్తగా ఉపాసన చేస్తే లోకంలో పొల్లు తీసేసి సారం వైపుకి మనలను నడిపిస్తాడు. పరమభక్తిని ఇస్తాడు. ఆయన ఆయుధమయిన గొడ్డలితో కర్మ పాశములను తెంచి భక్తీ పాశములను వేసి తన వైపుకి లాక్కుంటాడు. చవితి తిథి ఆయనకు చాలా ఇష్టమైన తిథి. ఆరోజు ఎవరయినా వినాయకుడి గురించి ప్రత్యేకంగా వినినా, చదివినా వారు ఎంతో ప్రయోజనమును పొందుతారు. పరమ భక్తితో స్వామికి నమస్కారం చేసినా ఎవరు కోరుకున్నది వారికి అనుగ్రహిస్తాడు. విద్యార్థికి విద్య వస్తుంది. ద్రవ్యార్థికి ద్రవ్యం వస్తుంది. కన్యార్థికి కన్య దొరుకుతుంది. పుత్రార్థికి పుత్రుడు పుడతాడు. భోగార్థి అయిన వాడికి భోగములు కలుగుతాయి. మోక్షార్థికి మోక్షం దొరుకుతుంది. రాజ్యార్థికి రాజ్యం, కీర్తి కావాలనుకున్న వారికి కీర్తి వస్తుంది. ఆరోగ్యం కుదుటపడక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్లకి ఆరోగ్యం కలుగుతుంది. ఋణభారంతో ఉన్నవాడికి ఋణం తొలగుతుంది. ఇక్కట్టులలో ఉన్న వాడికి ఇక్కట్టులు తొలగిపోతాయి. గణపతి దర్శనం చేత గణపతి యొక్క అనుగ్రహం చేత గణపతి కథను చదవడం చేత సమస్త శుభములు సమకూడతాయని పెద్దలు మనకు ఫలశ్రుతిని వివరణ చేసి ఉన్నారు. కాబట్టి ఆ గజానన స్వరూపము అంత గొప్ప స్వరూపము.
*****
*****
చెఱఁగు వట్టుకొనేవు చెక్కులు నొక్కవచ్చేవు
మఱఁగుల నీ సిగ్గులు మరి చెప్పరాదా!!
॥ఎంత॥
వలపెవ్వఁ డెఱుఁగు నీ వాడికె యెవ్వఁడెఱుఁగు
కలసిన నీ రతియే కనేము గాక
బలిమి శ్రీ వేంకటేశ పై కొంటివి నన్ను నిట్టె
నలువంకవారు మెచ్చ నమ్మించరాదా!!
🕉🌞🌎🌙🌟🚩
సంతసాలు = సంతోషాలు
పెనఁగేవు = శ్రమపడి
చెఱఁగు = చీరకొంగు
మఱఁగుల = ఆశపడితే
నలువంకవారు = నలుదిక్కులవారు
ఎవరికి తెలుసు నువ్వు ఎంతవాడవో. సంతోషము కోసం నీ ముఖము చూపించరాదా. నీ మనసు ఎవరికి తెలుసు నీ మాయ ఎవరికి తెలుసు. గొప్పవాడివి కాని నీ పనులు చూడలేము. శ్రమపడి రమ్మంటే ఇష్టములు చెప్పి నన్ను ఉడికించడానికి అని ఇట్టే నమ్మిస్తావు. నీ గుణము ఎవరికి తెలియదు. నీ గుర్తు ఎవరికి తెలియదు. మెరసే నీ మాటలను మెచ్చుకున్నాము గాని. కొంగుపట్టుకొని చెక్కిళ్ళు నొక్కడానికి వచ్చావు. ఆశ పడితే నీ సిగ్గులు మరి చెప్పరాదా. నీ కోరిక ఎవరికి తెలియదు. నీ వాడుక ఎవరికి తెలియదు.కలిసి నీ సంభోగము చూసేము కాని శ్రీవేంకటేశ బలాత్కారముగా పైకి నన్ను లాగుకొన్నావు ఇట్టె నలుదిక్కులవారు మెచ్చుకోగా నమ్మించరాదా స్వామి అంటు అన్నమయ్య కీర్తించాడు.

ఆనంద పరవశ్యం
మనసు ఊహలతో తేలియాడుతూ, ఎంత విశాలముగా మారుతుందో, ఊహాలు పెరిగే కొద్ది, సీతాకొక చిలుకదాకా మారేదెప్పుడు, అనంత మకరందాన్ని పొందే దెప్పుడు, ఆశ్వాదించె దెప్పుడు, అని విశ్వసిస్తూ విహరిస్తూ, రంగు రంగులుగా, మారి రమనీయ మైన, మాదుర్యాన్ని ఆస్వాధిచుతూ, ఆనంద డోలికలో, మునిగి పోతుంది. సీతా కోక చిలుక
ఎన్ని సముద్రాలు, ఎన్ని పర్వతాలు, ఎన్ని నదులు, ఎన్ని లావాలు, తన కుహరంలో దాచుకుంటుంది సముద్రాల ఉప్పును భరిస్తూ, పర్వతంలా బరువుని మోస్తూ, నదుల్లా పరవసిస్తూ, నలుగిరి దాహాన్ని తీరుస్తూ, తనను అన్య క్రాంతను చేసిన వారిని లార్వాలా, పెల్లుబికి ముంచి వేస్తు , మనసులోని మాటను బయటకు చెప్పుకోలేక, గట్టుదాటలేని కడలివలే భాదలు కష్టాలు సుఖాలు దుఖాలకు హ్రుదయ మాదుర్య0 చెడకుండా మందహాసాన్ని అందించే మకారందమా
బయటకు కనబడిన, అద్బుత లోకాలు, మనవద్దె ఉన్నాయి, కాని అవి ఆకాశములో విహరించే మేఘాలు, దూది పింజాల్లా, గాలికి కదిలి వేలతాయో అదే విధముగా, ఆ మనసు అల్ల కల్లోలమునకు చిక్కి, ఆశలు ఆశయాలు, నీటి మీద రాతల్లా తేలియాడుతూ, ప్రేమ పాశంలో చిక్కి అనంత వాయువులను అస్వాదిస్తూ, అంతరంగ అనుభూతిని పొందుతూ, ఆలోచనలకు తావివివ్వక, ఆనందాన్ని పంచె, అద్బుత లోకం ఎక్కడ లేదు, ఒకరి కొకరు కలసుకొని, అర్ధం చేసుకొని, జీవన మార్గమే ఆనంద నిలయం
.......
*"The Sky Gets Dark Slowly"* అనే పుస్తకం లో 'వృద్ధాప్యంలో డబ్బు అవసరం' గురించి ప్రస్తావిస్తూ ఆ రచయిత చెప్పిన కొన్ని సత్యాలు.
*నువ్వు వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి!*
*నిన్ను ‘అరే, ఒరేయ్’ అని పిలిచే స్నేహితులొక్కొక్కరూ రాలిపోతూ ఉంటారు.*
*నీ చిటికెన వేలు పట్టుకుని నడకలు నేర్చిన నీ పిల్లలందరూ నీకు దూరంగా వారి వారి జీవితాల్లో స్థిరపడి, ఇప్పుడు అప్పుడప్పుడు మాత్రమే నిన్ను పలకరిస్తూ ఉంటారు.*
*నీ ముందు నిక్కర్లేసుకుని కేరింతలు కొడుతూ తిరిగిన నీ మనవళ్ళూ, మనవరాళ్ళూ ఇప్పుడు యుక్త వయస్సులోకి వచ్చి నీ చుట్టూ చాలా హడావిడిగా తిరుగుతూ ఉంటారు. ఇప్పడు నీతో మాట్లాడే సమయం కూడా వారికి ఉండదు.*
*నీ మీద స్పాట్‌లైట్ ప్రసరించటం మానేసి చాలా కాలం అయిపోయి ఉంటుంది.*
*నీ జీవితంలో నువ్వు ఎన్నో సాధించి ఉండవచ్చు గాక. నీ కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు గాక. కానీ ప్రస్తుతం దాన్ని ఎవరూ గుర్తించరు.*
*ఈ సొసైటీ నీ గురించి పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయివుంటుంది*.
*దాహంతో దూరంగా ఎక్కడో ఒక ‘కాకి అరుస్తూ ఉంటుంది. దాని కర్వాడి ఎండిపోతూనే ఉంటుంది’ అన్న మాటకు అసలు అర్థం ఇప్పుడిప్పుడే నీకు తెలుస్తూ ఉంటుంది.*
*నీ చిన్న నాటి స్నేహితుడు… అదే ఇప్పుడు నీ లాంటి వృద్ధుడు ఎవరో నీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇంట్లో తన అవస్థ చెప్పుకుంటూ ఉంటాడు.*
*నీ అమూల్య అభిప్రాయాల్ని చెప్పటానికి ఒక శ్రోత ఈ ప్రపంచంలో దొరికిన సంతోషం నిన్ను తబ్బిబ్బు చేస్తుంది*.
*యవ్వనంలో హెల్త్ ఇన్సూరెన్స్ మానేసి ఆ డబ్బు పిల్లల కాలేజీ ఫీజు కట్టావు. మధ్య వయసులో సంపాదించినది పిల్లల్ని అమెరికా పంపించడానికి ఖర్చు చేసి ఉంటావు. అందరితో ‘నా కొడుకు అమెరికాలో, కూతురు ఆస్ట్రేలియాలో ఉన్నది’ అని గర్వంగా చెప్తూ ఉంటావు. ఎన్నాళ్ళకొకసారి వాళ్ళు నిన్ను చూడటానికి వచ్చారన్నది మాత్రం చెప్పవు.*
*అమెరికా నుంచి నీ కొడుకు తన సెల్ ఫోన్ క్యాలెండర్ రిమైండ్ చేస్తేనే నీ పుట్టినరోజు తేదీ చూసి నీకు ఫోన్ చేశాడన్న స్పృహ నీకు ఉండదు.*
*నీకు నీ మనవడితో మాట్లాడాలని ఉంటుంది. బోలెడు ముచ్చట్లు చెప్పాలని ఉంటుంది. కానీ, వాడు కూడా ఇప్పుడు చా….లా బిజీ.*
*అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్కగదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న సంశయంతోనే తెల్లవారుతుంది.*
*పక్క మీద గంటల, రోజుల తరబడీ పడుకొని ఉండటం నీ దినచర్య అవుతుంది.*
*పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో తిరిగి అదే స్థితి సంభవిస్తుంది నీకు.*
*ఒకటే తేడా… అది ఏమిటంటే చిన్నప్పుడు నీ ఆలనాపాలనా చూసుకోవటానికి నీ తల్లి ఉండేది. కానీ ఇప్పుడెవరూ ఉండరు.*
*అప్పుడప్పుడూ వచ్చి పలకరించే కూతురూ, తప్పదన్నట్టు సేవలు చేసే కోడలూ ఉంటే నువ్వు అదృష్ట వంతుడివే.*
*నీ అదృష్టం బాగా లేకపోతే అనాథాశ్రమంలో వారు కూడా ఉండరు.*
*నువ్వు కొద్దిగా ఎక్కువ తిన్నా, అసలు తినకపోయినా మెడిసిన్ చదివిన డాక్టర్లలాగా నీ పిల్లలు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఒళ్ళు వెచ్చబడితే చలిలో తిరిగావనీ, జలుబు చేస్తే చన్నీళ్ళ స్నానం చేశావనీ, కాళ్ళు నొప్పులు పెడితే గుడికి ఎందుకు వెళ్ళావనీ నిన్ను మందలిస్తూ ఉంటారు.*
*ప్రొద్దున్న లేచేసరికి అకస్మాత్తుగా ఏ జలుబో, కీళ్ళ నొప్పులో ప్రారంభం అవుతాయి. బాత్‌రూంలో పడటం, కాళ్ళు విరగటం, జ్ఞాపకశక్తి నశించటం, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ చాలా క్యాజువల్‌గా ‘నీకు కాన్సర్’ అని చెప్పటం మొదలైనవి అన్నీ నీ జీవితంలో భాగమైపోతాయి.*
*నీది మరీ మధ్యతరగతి కుటుంబం అయితే, నువ్వు సంపాదించిన డబ్బు నీ ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా, చూసీ చూడనట్టు నీ మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో నీ పక్క గదిలో నీ వాళ్ళు చర్చిస్తూ ఉంటారు.*
*మరేం చెయ్యాలి?:*
*THE SKY GETS DARK SLOWLY అనే పుస్తకంలో రచయిత “ప్రస్తుత జీవన విధానం మార్చుకుంటే,*
*పై సమస్యల్లో ‘కనీసం కొన్ని’ తగ్గించుకోవచ్చు” అంటాడు.*
*“ఆకాశo క్రమక్రమంగా నల్లబారుతోందనీ, ఒక్కొక్క దీపమూ ఆరిపోతుందనీ గ్రహించిన వ్యక్తి జీవితపు ఆఖరి స్టేజి కోసం ఆరోగ్యవంతంగా ప్రిపేర్ అవ్వాలంటే అయిదు సూత్రాలు గుర్తుంచుకోవాలి” అంటాడు.*
(01). *ఆకాశం పూర్తిగా నల్లబడక ముందే నీ దారి పొడుగునా లైట్లు వెలిగించి శక్తి ఉన్నంతవరకూ పని చేస్తూ ఉండు.*
(02). *నీకన్నా అశక్తులకీ, అనాథలకీ, అభాగ్యులకీ చెయ్యగలినంత సహాయం చేస్తూ ఉండు.*
(03). *ఏకాంతం స్థానే శూన్యత ప్రవేశించినప్పుడు అది అతి తొందరలో ఒంటరితనం గా మారుతుందన్న విషయాన్ని నువ్వు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత బాగుంటుంది.*
*ప్రతి మనిషి చుట్టూ ఒక ‘తావి’ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ అది సుగంధ సౌరభాల్ని వెదజల్లే పరిమళంగానో, లేదా దుర్గంధ పూరితoగానో మారుతుంది.*
*ఎలా మారుతుందనేది హుందాతనం లేదా చాదస్త ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది.*
(04). *ముప్పై ఏళ్ళ వయస్సులో పిల్లలు పుట్టగానే లావు అవటం సహజం అనుకోకు. జిహ్వ చాపల్యం తగ్గించు. ఒక వయసు వచ్చాక తిండి ఆనందం కాదు. అవసరం.*
*వయసు పెరిగే కొద్దీ శరీరం ఇచ్చే సంకేతాలు గమనించు. పెగ్గులు, సిగరెట్లు తగ్గించు. ఆరోగ్యంపై దృష్టి పెట్టు.
(05). *వయసు వల్ల వచ్చిన అధికారంతో నీ చుట్టూ ఉన్నవాళ్ళని శాసించకు.*
*వీలైనంత వరకూ వారి చర్యలపై నీ అమూల్యాభిప్రాయాన్ని వెల్లడి చేయకు.*
*నీ బోధనలు ఆపి ఒక్కడివే ఉండటం ఎలాగో నేర్చుకో. లేకపోతే నీ ఇంటివారే నిన్ను మరింత దూరం పెడతారు*.
*ఒంటరిగా కూర్చొని పుస్తకాలు చదువు*.
*ఏకాంతంలో సంగీతాన్ని విను.*
*ఓపికుంటే మొక్కల్ని పెంచుకో.*
*చిన్న పిల్లలతో కొద్ది సేపు వారికి ఇంటరెస్టు ఉన్న టాపిక్స్, కబుర్లు, కథలు చెప్పు.*
*అఫెక్షన్ బ్యాంక్ లో ఆప్యాయతని క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళు.*
*“ఎప్పుడైతే నువ్వు మానసికంగా ఇలా ప్రిపేర్ ఔతావో, నీ వృద్ధాప్యాన్ని ఓ పది సంవత్సరాలు వాయిదా వెయ్యగలవు” అంటాడు 'The sky gets dark slowly' అన్న పుస్తక రచయిత.*
*జీవితంభళ్లున తెల్లవారుతుంది… మెల్లగా చీకటి పడుతుంది.*
*ఇదంతా చదివి అప్పుడే ముసలితనం ముంచుకొచ్చేసిందని బెంబేలెత్తి పోకు.*
........
****************************
నేటి నా పాట పాట సంఖ్య:-577.
******************************
మహేష్ వూటుకూరి ✍️
దోర్నాల.
15/03/2023.
************
పాటసందర్భంపై నా విశ్లేషణ.:-
**************************
మాటలు కలిపినాక మనసులు మురిసినాక
ప్రేమ చిగురించి నాక ఇద్దరి మద్య వున్న దూరం చెరిగిపోయి హీరో హీరోయిన్ల మద్య అనుబంధం పెనవేసుకున్న సమయంలో మనసులోని భావాలు ఉవ్వెత్తున ఎగసిపడి సరిహద్దు లు లేని ఏకాంతం
సుఖమై స్వాగతం పలికిన అందమైన ఆనందమైన సమయాన ఈ పాట.
******************౮***************************
పల్లవి:-
*******
మది మది ఒకటైన సమయం
గుస గుసల నీ చూపుల పిలుపులే
కసి కసిగా కవ్విస్తున్నయ్.!!
విది నదిగా మారి
కథ ఒకటిగ చేసి
ముసిముసి నవ్వులు
మురిపించి కురిపించిన మన ప్రేమమ్..!!
మది మది ఒకటైన సమయం
గుస గుసల పిలుపులే
కసి కసిగా కవ్విస్తున్నయ్!!
చరణం:-
********
తడి తడి ఆశలు
తహ తహల కోరికలు
పురివిప్పిన వయసుల
సరససాల భోగం!!
బుస బుసపొంగులు
మిసమిసల మెరుపుల
తళతళ తారలు
దిగివిచ్చి పలుకరించి
పరవశమే పవళించి
మన వశమైన ఆనంద సంగమం!!
పల్లవి:-
*******
మది మది ఒకటైన సంగమం
గుస గుసల నీ చూపుల పిలుపులే
కసి కసి గా కవ్విస్తున్నయ్!!
చరణం:-
*********
రాజ హంసలా వాలి
రాజేసినావే నా యదలో
కోరికల సెగలు రేపినావే కోమలి
వాకిలి తీయ్యవే కౌగిళిలో చేరిపోతానే..!!
చెరి సగమై గడసరి తనమై
సరస సల్లాపాలతో
పూల పాన్పుపై పవళిద్దామే
పాల వెల్లువల పరువాల పంచదారనై
వంశ ధారనే వస్తానే మల్లెపువ్వులా
మరదలు పిల్లా..!!
వచ్చావుగా గిచ్చావుగా కన్నెదనం దోచావుగా
మగసిరుల మగధీరా మనసంతా నువ్వై నిలిచావురా
వెన్నెల హొయలు మల్లెల మత్తు ఒళ్ళంతా సెగలు
చల్లార్చావురా
నీ కోరికకు నా తీరికకు కుదిరిన ఒప్పందంలో భాగంగా
వద్దనని వయసు రాగం తీయగా
నీ సొగసు తాళం వేయగా
నీ పొందులో ఈ హాయిలో సరసమై సాగగా
ముద్దు ముచ్చటకు పొద్దు తెలియక నిద్దుర లేక
మన పొందికైన ప్రేమ చేరేనులే ఆ స్వర్గ సీమ దాకా
పల్లవి:-
*********
మది మది ఒకటైన సమయం
గుస గుసల నీ చూపుల పిలుపులే
కసికసీగా కవ్విస్తుండగా!!
**************************
*"The Sky Gets Dark Slowly"* అనే పుస్తకం లో 'వృద్ధాప్యంలో డబ్బు అవసరం' గురించి ప్రస్తావిస్తూ ఆ రచయిత చెప్పిన కొన్ని సత్యాలు.
*నువ్వు వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి!*
*నిన్ను ‘అరే, ఒరేయ్’ అని పిలిచే స్నేహితులొక్కొక్కరూ రాలిపోతూ ఉంటారు.*
*నీ చిటికెన వేలు పట్టుకుని నడకలు నేర్చిన నీ పిల్లలందరూ నీకు దూరంగా వారి వారి జీవితాల్లో స్థిరపడి, ఇప్పుడు అప్పుడప్పుడు మాత్రమే నిన్ను పలకరిస్తూ ఉంటారు.*
*నీ ముందు నిక్కర్లేసుకుని కేరింతలు కొడుతూ తిరిగిన నీ మనవళ్ళూ, మనవరాళ్ళూ ఇప్పుడు యుక్త వయస్సులోకి వచ్చి నీ చుట్టూ చాలా హడావిడిగా తిరుగుతూ ఉంటారు. ఇప్పడు నీతో మాట్లాడే సమయం కూడా వారికి ఉండదు.*
*నీ మీద స్పాట్‌లైట్ ప్రసరించటం మానేసి చాలా కాలం అయిపోయి ఉంటుంది.*
*నీ జీవితంలో నువ్వు ఎన్నో సాధించి ఉండవచ్చు గాక. నీ కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు గాక. కానీ ప్రస్తుతం దాన్ని ఎవరూ గుర్తించరు.*
*ఈ సొసైటీ నీ గురించి పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయివుంటుంది*.
*దాహంతో దూరంగా ఎక్కడో ఒక ‘కాకి అరుస్తూ ఉంటుంది. దాని కర్వాడి ఎండిపోతూనే ఉంటుంది’ అన్న మాటకు అసలు అర్థం ఇప్పుడిప్పుడే నీకు తెలుస్తూ ఉంటుంది.*
*నీ చిన్న నాటి స్నేహితుడు… అదే ఇప్పుడు నీ లాంటి వృద్ధుడు ఎవరో నీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇంట్లో తన అవస్థ చెప్పుకుంటూ ఉంటాడు.*
*నీ అమూల్య అభిప్రాయాల్ని చెప్పటానికి ఒక శ్రోత ఈ ప్రపంచంలో దొరికిన సంతోషం నిన్ను తబ్బిబ్బు చేస్తుంది*.
*యవ్వనంలో హెల్త్ ఇన్సూరెన్స్ మానేసి ఆ డబ్బు పిల్లల కాలేజీ ఫీజు కట్టావు. మధ్య వయసులో సంపాదించినది పిల్లల్ని అమెరికా పంపించడానికి ఖర్చు చేసి ఉంటావు. అందరితో ‘నా కొడుకు అమెరికాలో, కూతురు ఆస్ట్రేలియాలో ఉన్నది’ అని గర్వంగా చెప్తూ ఉంటావు. ఎన్నాళ్ళకొకసారి వాళ్ళు నిన్ను చూడటానికి వచ్చారన్నది మాత్రం చెప్పవు.*
*అమెరికా నుంచి నీ కొడుకు తన సెల్ ఫోన్ క్యాలెండర్ రిమైండ్ చేస్తేనే నీ పుట్టినరోజు తేదీ చూసి నీకు ఫోన్ చేశాడన్న స్పృహ నీకు ఉండదు.*
*నీకు నీ మనవడితో మాట్లాడాలని ఉంటుంది. బోలెడు ముచ్చట్లు చెప్పాలని ఉంటుంది. కానీ, వాడు కూడా ఇప్పుడు చా….లా బిజీ.*
*అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్కగదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న సంశయంతోనే తెల్లవారుతుంది.*
*పక్క మీద గంటల, రోజుల తరబడీ పడుకొని ఉండటం నీ దినచర్య అవుతుంది.*
*పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో తిరిగి అదే స్థితి సంభవిస్తుంది నీకు.*
*ఒకటే తేడా… అది ఏమిటంటే చిన్నప్పుడు నీ ఆలనాపాలనా చూసుకోవటానికి నీ తల్లి ఉండేది. కానీ ఇప్పుడెవరూ ఉండరు.*
*అప్పుడప్పుడూ వచ్చి పలకరించే కూతురూ, తప్పదన్నట్టు సేవలు చేసే కోడలూ ఉంటే నువ్వు అదృష్ట వంతుడివే.*
*నీ అదృష్టం బాగా లేకపోతే అనాథాశ్రమంలో వారు కూడా ఉండరు.*
*నువ్వు కొద్దిగా ఎక్కువ తిన్నా, అసలు తినకపోయినా మెడిసిన్ చదివిన డాక్టర్లలాగా నీ పిల్లలు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఒళ్ళు వెచ్చబడితే చలిలో తిరిగావనీ, జలుబు చేస్తే చన్నీళ్ళ స్నానం చేశావనీ, కాళ్ళు నొప్పులు పెడితే గుడికి ఎందుకు వెళ్ళావనీ నిన్ను మందలిస్తూ ఉంటారు.*
*ప్రొద్దున్న లేచేసరికి అకస్మాత్తుగా ఏ జలుబో, కీళ్ళ నొప్పులో ప్రారంభం అవుతాయి. బాత్‌రూంలో పడటం, కాళ్ళు విరగటం, జ్ఞాపకశక్తి నశించటం, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ చాలా క్యాజువల్‌గా ‘నీకు కాన్సర్’ అని చెప్పటం మొదలైనవి అన్నీ నీ జీవితంలో భాగమైపోతాయి.*
*నీది మరీ మధ్యతరగతి కుటుంబం అయితే, నువ్వు సంపాదించిన డబ్బు నీ ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా, చూసీ చూడనట్టు నీ మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో నీ పక్క గదిలో నీ వాళ్ళు చర్చిస్తూ ఉంటారు.*
*మరేం చెయ్యాలి?:*
*THE SKY GETS DARK SLOWLY అనే పుస్తకంలో రచయిత “ప్రస్తుత జీవన విధానం మార్చుకుంటే,*
*పై సమస్యల్లో ‘కనీసం కొన్ని’ తగ్గించుకోవచ్చు” అంటాడు.*
*“ఆకాశo క్రమక్రమంగా నల్లబారుతోందనీ, ఒక్కొక్క దీపమూ ఆరిపోతుందనీ గ్రహించిన వ్యక్తి జీవితపు ఆఖరి స్టేజి కోసం ఆరోగ్యవంతంగా ప్రిపేర్ అవ్వాలంటే అయిదు సూత్రాలు గుర్తుంచుకోవాలి” అంటాడు.*
(01). *ఆకాశం పూర్తిగా నల్లబడక ముందే నీ దారి పొడుగునా లైట్లు వెలిగించి శక్తి ఉన్నంతవరకూ పని చేస్తూ ఉండు.*
(02). *నీకన్నా అశక్తులకీ, అనాథలకీ, అభాగ్యులకీ చెయ్యగలినంత సహాయం చేస్తూ ఉండు.*
(03). *ఏకాంతం స్థానే శూన్యత ప్రవేశించినప్పుడు అది అతి తొందరలో ఒంటరితనం గా మారుతుందన్న విషయాన్ని నువ్వు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత బాగుంటుంది.*
*ప్రతి మనిషి చుట్టూ ఒక ‘తావి’ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ అది సుగంధ సౌరభాల్ని వెదజల్లే పరిమళంగానో, లేదా దుర్గంధ పూరితoగానో మారుతుంది.*
*ఎలా మారుతుందనేది హుందాతనం లేదా చాదస్త ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది.*
(04). *ముప్పై ఏళ్ళ వయస్సులో పిల్లలు పుట్టగానే లావు అవటం సహజం అనుకోకు. జిహ్వ చాపల్యం తగ్గించు. ఒక వయసు వచ్చాక తిండి ఆనందం కాదు. అవసరం.*
*వయసు పెరిగే కొద్దీ శరీరం ఇచ్చే సంకేతాలు గమనించు. పెగ్గులు, సిగరెట్లు తగ్గించు. ఆరోగ్యంపై దృష్టి పెట్టు.
(05). *వయసు వల్ల వచ్చిన అధికారంతో నీ చుట్టూ ఉన్నవాళ్ళని శాసించకు.*
*వీలైనంత వరకూ వారి చర్యలపై నీ అమూల్యాభిప్రాయాన్ని వెల్లడి చేయకు.*
*నీ బోధనలు ఆపి ఒక్కడివే ఉండటం ఎలాగో నేర్చుకో. లేకపోతే నీ ఇంటివారే నిన్ను మరింత దూరం పెడతారు*.
*ఒంటరిగా కూర్చొని పుస్తకాలు చదువు*.
*ఏకాంతంలో సంగీతాన్ని విను.*
*ఓపికుంటే మొక్కల్ని పెంచుకో.*
*చిన్న పిల్లలతో కొద్ది సేపు వారికి ఇంటరెస్టు ఉన్న టాపిక్స్, కబుర్లు, కథలు చెప్పు.*
*అఫెక్షన్ బ్యాంక్ లో ఆప్యాయతని క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళు.*
*“ఎప్పుడైతే నువ్వు మానసికంగా ఇలా ప్రిపేర్ ఔతావో, నీ వృద్ధాప్యాన్ని ఓ పది సంవత్సరాలు వాయిదా వెయ్యగలవు” అంటాడు 'The sky gets dark slowly' అన్న పుస్తక రచయిత.*
*జీవితంభళ్లున తెల్లవారుతుంది… మెల్లగా చీకటి పడుతుంది.*
*ఇదంతా చదివి అప్పుడే ముసలితనం ముంచుకొచ్చేసిందని బెంబేలెత్తి పోకు.*
......
తేటతెలుగు నేర్చుకుందాం .. తెలుగును రక్షించుకుందాం
కలల మెరుపు... కావ్య మాయలే .. శిలల మెరుపు .... శిల్పమాయలే
కళలు తలపు ... కళ్ళ లాయాలే .. వలల తలుపు .. బంధ మాటలే
కళలు గెలుపు.... కచ్చ లాయలే .. గెలలు కుదుపు .. గంతు లాయలే
తలలు తడుపు .. తంతులయాలే .. మొలల పొదుపు .. మోక్షమాయెలే
మలుపు కథలు.. మానసమ్ములే .. గెలుపు మనిషి ... గమ్యమౌనులే
మరువ వలదు... మాన్య బత్కులే .. కరువు బతుకు ... కల్లొలమ్ము లే
కరుణ గుణము... చూపవచ్చులే ... అరుణ మెరుపు ... ఆట పట్టులే
తరుణ మయిన... తత్వమాయలే ... మరణ పిలుపు ... మచ్చ తెచ్చులే
బరువు మరుచు.. . భాగ్యమేనులే ... మరియు మురియు ... ముప్పు తెచ్చులే
గరుకు బెరుకు ... గంధ మవ్వులే ... తరువు గిరులు ... స్నేహ మిచ్చులే
నవవిధ మున .. నాట్యమాడు లే .. అవసరమున .. అట చూపులే
అవయవములు... ఆట పల్కు లే .. చవక పలుకు .. చాటు తిట్టులే
భవభవములు... బాధ్యత వ్వులే .. నవకలువలు ... నాటు ఒప్పులే
సవరమలులె... సాధ్యమౌను లే ... సకలముకద ... సౌఖ్యమేనులే
మధురిమలుగ.. మల్లెజాజులే .. మమత కులుకు .. మచ్చ చూపులే
సమవిధి కను ....విద్య పొందుటే .. సమరము విధి .. శాంతా మెప్పులే
మీ విధేయుడు .. (IIIIII -- UIUIU నేటి ఛందస్సు)
మల్లాప్రగడ రామకృష్ణ
Excrelent
ReplyDelete