ప్రాంజలి ప్రభ 20 /౦౩


𝕝𝕝 శ్లో 𝕝𝕝 తద్దినం దుర్దినం మన్యే
 మేఘఛ్ఛిన్నం న దుర్దినం |     
       యద్దినం శివ (కృష్ణ) సల్లాప 
కథా పీయూష వర్జితం ॥

మేఘములు కమ్మి సూర్యుడు కనబడని రోజు సామాన్యులకు దుర్దినం.....ఏ రోజు శివుడి కబురు లేకుండా, శివుడి తలంపు లేకుండా గడిచిపోతుందో అది దుర్దినము.... కష్టాలు అనుభవించిన రోజు దుర్దినం అని మేము అనం...కష్టాలు అనుభవించినా సరే శివుడిని స్మరిస్తే అది సుదినమే.....

తద్దినం దుర్దినం మన్యే మేఘఛ్ఛిన్నం న దుర్దినం |
యద్దినం కృష్ణ సల్లాప కథా పీయూష వర్జితం ||

కృష్ణ లీలా కథా కాలక్షేపం జరగని రోజు దుర్దినం కానీ, మేఘాలు ఆవరించిన (చీకటి పడిన) రోజు కాదు!!

[ కృష్ణం వందే జగద్గురుం ].....

*****
మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహమ్
న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే
న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః
చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ || 1 || 

అర్థం: నేను మనస్సు కాదు,బుద్ధి కాదు, చిత్తము కాదు,అహంకారం కూడా కాదు. నేను పంచేంద్రియాలు కాదు. నేను పంచభూతాలు కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివున్ని. నేను శివుడిని.
......
భారోsవివేకినః శాస్త్రం
     భారో జ్ఞానం చ రాగిణః 
     అశాంతస్య మనో భారో
     భారోsనాత్మవిదో వపు: ౹౹🌺
        వివేకం లేని అవివేకికి శాస్త్రము కూడా భారం.సంసారం పై మోహము ఉన్నవాడికి తత్వజ్ఞానము భారమే.శాంతి లేనివాడికి మనస్సే భారం.అలాగే జ్ఞానము లేనివాడికి శరీరం భారం.
***
*శ్లో𝕝𝕝 యన్మనసా ధ్యాయతి తద్వాచా వదతి!* 
             యద్వాచా వదతి తత్కర్మణా కరోతి! 
             యత్కర్మణా కరోతి తదపి సంపద్యతే!!

తా𝕝𝕝 ఏదైతే మనం మనస్సుద్వారా ఆలోచన (ధ్యానం ) చేస్తున్నామో, అదే వాక్కు ద్వారా వచించాలి..... ఏదైతే వాక్కు ద్వారా వచిస్తున్నామో, అదే కర్మ-పని ద్వారా చేయాలి. ఏదైతే కర్మ ద్వారా చేస్తున్నామో ఆ సత్ కర్మ ఫలాలను సత్యదృష్టితో దర్శించి సర్వజనుల సౌఖ్యాన్ని ఆకాంక్షించాలి.......
****

నేటి కవిత :అర్పించు 

గదులు విశాలము కాదు 
విశాల హృదయం తో ప్రేమను పెంచు
ఎన్ని అంకెల జీతం కాదు 
నిస్వార్ధసంపాదన వ్యక్తపరుచు

గొప్ప పరిసరాలలో ఉండటం కాదు 
మనసు ఇచ్చి పుచ్చుకొని జీవించు
ఘనమైన భోజనం తినటం కాదు:  
అన్నార్తుల ఆకలి తీర్చి తెలియపరుచు 

అందమైన వస్త్రాలు వేసుకున్నావని కాదు 
నిర్భాగ్యులకు వస్త్రాలిచ్చి తృప్తి పరచు 
అధ్యాత్మిక గ్రంథాలు చదివటం కాదు 
గ్రంథ బోధ ద్వారా మానవ మాస్ శాంత పరచు  

పుణ్య క్షేత్రాలు దర్శించటం కాదు 
మానవ సేవ చేసి పుణ్యాన్ని సాధించు 
బంధంలో ఆనందం కల్పించటం కాదు 
మనుషులకు ఆర్ధికంగా ఆదుకొని ఆనంద పరుచు  

ముక్తి  ఆలశ్యం అని బాధ కాదు
నీవు చెయ్యి పట్టుకొని స్వర్గ ముఖం అందించు  
శృతిలయలు కలపటం కాదు 
మాట మత్రం అందించి హృదయాన్ని అర్పించు  

***
 
నేనేమి అన్నాను, నన్ను నేను మరిచా
నిన్ననేను కలిశా, నన్ను నీకు అర్పించా

మానావమానాలు భరించా : మంచి చెడులనేవి  భరించా 
విధి జయాపజయాలు భరించా : పాపపుణ్యాలను భరించా
 
నీవే నాకును దిక్కు నీకు అమ్మకు చేస్తున్నా మొక్కు   
ధీనర క్షాకోరు హక్కు శ్రీ వెంకటేశ్వరా చెప్తున్నా వాక్కు 

సత్కాలమున జన్మ, సత్కర్మలు చేస్తున్న  
నిస్వార్ధ బుద్ధితోనున్న, సర్వం నీకె అర్పిస్తున్నా  

నేనేమి అన్నాను, నన్ను నేను మరిచా
నిన్ననేను కలిశా, నన్ను నీకు అర్పించా

భక్తితో స్తుతిస్తూ వేడుకుంటున్న
నీలాలు అర్పించి కదులుతున్న 
అమ్మ వకుళాదేవిని ప్రార్ధించు చున్న  
నీ నామ జపంచేస్తూ దర్శించుతున్నా  

రక్కసుడైన ప్రహ్లాదుని రక్షించినవాడవు 
బలిచక్ర వర్తిని అర్ధించి అనగ తొక్కావు 
కురుక్షేత్రంలో ధర్మాన్ని నిలబెట్టావు 
మొక్కులు తీర్చిన మోక్షం ఇచ్చేవాడవు 

నేనేమి అన్నాను, నన్ను నేను మరిచా
నిన్ననేను కలిశా, నన్ను నీకు అర్పించా

లోకమంతా ఈర్ష్యాద్వేషాలతో ఉన్న 
కోపాతాపాలతో కాలుతూ యున్న   
మోసం, మోహం,  మాయాలె కమ్ముకున్న
నేను మాత్రం నిన్ను మరవలేకున్నా 

భ్రష్టుడై, దుష్టుడైన అజామిళుడు ను ఆదుకొన్న
ముసలి నోటినుండి గజరాజుని రక్షించియున్న 
స్త్రీ వేషం వేసి అమృతాన్ని పంచి యున్న 
బాధలను తొలగించే బాధ్యత నీదేయన్నా  

నేనేమి అన్నాను, నన్ను నేను మరిచా
నిన్ననేను కలిశా, నన్ను నీకు అర్పించా
గోవిందా నీదాసుడని నిరంతరం ప్రార్ధించా 
అనుగ్రహం కోసం నిన్ను యాచంచా 
తిరుమల తిరుపతి వెంకటరాయ మన్నించు 
 ****

ముక్తి

మోక్షము ఎలా వస్తుందో చెప్తాను. శమము, దమము కలిగి ఉండడం, దానాలు చేయడం, ధర్మ ప్రవర్తన కలిగి ఉండడం, బ్రహ్మచర్యం పాటించడం, పరుల సొమ్మును కాని పరుల భార్యను కాని ఆశించక ఉండడం, నియమ జీవితం గడపడం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం, శుభ్రంగా ఉండడం, సత్యం పలకడం, పెద్దల ఎడ గురువుల ఎడ గౌరవం కలిగి ఉండడం, దేవతలను పితరులను పూజించడం, సదా శుభకార్యములు చెయ్యడం, ధైర్యంగా ఉండడం, క్రూరత్వం వదిలి పెట్టడంవంటి పుణ్యకార్యాలు చెయ్యాలి. ఆ పుణ్యకార్యాలను ఆధారం చేసుకుని మోక్షసాధనకు ప్రయత్నించాలి. ధర్మాచరణ అత్యంత ముఖ్యమైనది. ధర్మాచరణ గురువుల వద్ద పెద్దల వద్ద అభ్యసించాలి. గురువులను పెద్దలను అనుసరిస్తూ వారి హితవచనాలను శాంతవచనాలను వింటూ జీవితం దిద్దికుంటూ ధర్మాచరణ పాటిస్తూ అది ఒక వ్రతం మాదిరి పాటించాలి. ఇంద్రియములు నిగ్రహించి శాంతిమయ జీవితం సాగిస్తూ పరబ్రహ్మను అను నిత్యము భజించాలి. అటువాంటి మానవునికి బ్రహ్మమే సముద్రాలు, ఋత్వుక్కు, అగ్ని, యాగము , జలము, మంత్రం అతడు సదాబ్రహ్మము నందు చరిస్తూ ఆనందమయుడై ఉంటాడు. అతడిని కామము కాని మోహము కాని బాధించలేవు. క్రమంగా అతడికి సంసారము అందు విరక్తికలుగుతుంది...

క్షరము అక్షరము

బ్రహ్మదేవుడు ముందుగా క్షరమును సృష్టించాడు. దానికి అతీతంగా అక్షరతత్వాన్ని సృజించాలి. అక్షరమే అమృతము. ఈ క్షరము అక్షరము జంటతోనే సృష్టియావత్తు ఉద్భవించింది. ఈ సృష్టికి బ్రహ్మ జననమరణాలను సృజించి నిరంతరం జనమరణ చక్రభ్రమణంలో తిప్పుతుంటాడు. ఇలా జనమరణ చక్రభ్రమణం చేస్తున్న మానవుడు తాను చేసిన పుణ్యకార్యముల వలన వివేకవంతుడై సుఖదుఃఖాలు సిరిసంపదలు ఈ దేహము అశాశ్వతమని తెలుసుకుంటాడు. నిరంతరం కర్మలు చెయ్యడం ఒక వ్యాధిగా భావించి కోరికలను మోహములను త్యజించి మోక్షము వైపు పయనిస్తాడు. తనకున్న పాపములను ప్రక్షాళన చేసుకుని మరలా సంసారచక్రంలో పడకుండా జాగ్రత్త వహిస్తాడు. పుట్టుక వ్యాధులు మసలితనము మరణం జీవుని పరిణామాలని తెలుసుకుని వాటి కొరకు ఆరాటపడడం వ్యర్ధం తలచి మోక్షము కొరకు ప్రయత్నిస్తాడు. అప్పుడు అన్ని చింతలను వదిలి పెట్టి ఆలోచనలను కట్టి పెట్టి ఎవరి మీదా ఆధార పడకుండా ఒంటరియై చరిస్తాడు. భయమును వదిలి మనసును అదుపులో ఉంచి కోరికలను, కోపమును ఇంద్రియములను జయిస్తాడు. మానము అవమానము వంటి ధ్వందములను వదిలి వేస్తాడు. సర్వభూతములలో పరమేశ్వరుడిని ధ్యానిస్తూ ఆత్మజ్ఞానం పొందుతాడు. సుఖదుఃఖములను, కష్టసుఖాలను, ప్రేమద్వేషములను వీటిని సమంగా చూసినవాడు, ధర్మమును అధర్మమును, ఆశనిరాశల వంటి ద్వంధములను వదిలివేసిన వాడు, ధర్మార్ధకామములను వాదిలి మోక్షము కొరకు ప్రయత్నించిన వాడు, జరిగినది జరుగుతున్నది జరగబయేది వేటికీ తాను కర్తను కాదని తెలుసుకున్న వాడు మోక్షాపదవికి అర్హుడు. అది పంచభూతాత్మలకు అతీతముగా అతీతంగా ఏఆధారంగా లేక ఉంటుంది. అది నిర్గుణము పంచభూతగుణములకు అతీతంగా ఉంటుంది. ఆ మోక్షపదవికి నిరంతర సాధన అవసరం. మనసు ప్రశాంతంగా ఉంచుకుని సర్వ సంకల్పములను వదిలి నిరంతరసాధన చేతనే మోక్షపదవిని పొందగలరు...

ప్రతి నిమిషము పరిపూర్ణమైన ఆనందము మరియు స్వాతంత్ర్యమును అనుభవించ వలసినది మన జీవితం. భగవాన్ శ్రీకృష్ణుని జీవితం మనకు నేర్పిస్తున్న పాఠం ఇటువంటిదే. ఒక సాధారణ మనుష్యుడు జీవితంలో అనుభవించినదానికంటే కూడా ఆయన జీవితంలో ఎన్నెన్నో ఉత్కృష్టమైన సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. శ్రీకృష్ణ భగవాన్ జననమే కారాగారంలో జరిగింది. అప్పటినుండి ఆయన జీవితంలో ఏవేవో సమస్యలు ప్రతిబంధాలు ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టకుండా వస్తూనే ఉన్నాయి. శ్రీకృష్ణుడు ఎదుర్కున్న సమస్యలు పలు రూపాలలో ఆయన ముందు ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. కంసుని వల్ల, చాణూరుని వల్ల, శకటాసురుని వల్ల, కాళీయుని వల్ల, పూతన వల్ల, జరాసంధుని వల్ల, శిశుపాలుని వల్ల, ఈ విధంగా జన్మించిన మరుక్షణం నుండి శ్రీ కృష్ణుడు జీవితంలో పలు రకాల బెడదలే ఎదుర్కో వలసి వచ్చింది. అయితే, ఒక్కొక్క సందర్భంలో మరణమే ఎదుట నిలిచినప్పటికీ కృష్ణుడు దానిని చిరునవ్వుతో ఎదుర్కొంటూ వాటిని ఓడించడమే మనం చూస్తున్నాము.

జన్మించినప్పటినుండి, మరణం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. అది ఎప్పుడైనా సంభవించవచ్చు. ఇప్పుడే పుట్టిన ఒక పసి పిల్ల నుండి వయస్సు మళ్ళిన తొంభై సంవత్సరాల వృద్ధుడి వరకు ఒకే విధంగా మరణంయొక్క పిడికిలిలో ఉంటారు. అయితే మరణాన్ని చూసి నవ్వుతూ 'వెక్కిరించ' గలిగే ధైర్యం ఉన్నవారిని చూడడం అపూర్వం. అటువంటి ధైర్యమున్నవాడే కృష్ణుడు. జీవితంలో కష్టాలు ఎదురైన అన్ని సందర్భాలలో, 'సమత్వము, సంయమము మరియు సంతోషము కలిగి ఉండాలి', ఈ విధంగా ఉండేది శ్రీ కృష్ణుని సందేశం. దాని వల్లనే ఆయన యుద్ధ సమయాలలో సహితం చిరునవ్వు నవ్వుతూ నిలవగలిగాడు...

గీతా..

పరమాత్మతో ఐక్యంగా ఉన్న అటువంటి వ్యక్తి ధ్యానం ద్వారా ఆత్మ యొక్క ఆనందాన్ని కనుగొనడం ద్వారా బాహ్య ఇంద్రియ సుఖాలతో సంబంధం లేకుండా ఉంటాడు మరియు అతీంద్రియ ఆనందాన్ని పొందుతాడు...

పరా విద్య అపర విద్య బ్రహ్మ విద్య యోగావిద్యా

శ్రీవిద్యా మీరు యెపేరినా పిలిచినా అన్ని విద్యలు మృత్యువు తరువాత యేమిటి అన్న దాని గురుంచి తెలుసుకోవటమే అదే అధ్యాత్మికత మేలుకొలుపు.

చనిపోతానని తెలిసీ వెతకడం. పునర్జన్మ గురుంచి తెలుసుకోవడం...

ఎవరైతే ఒంటరిగా తనకు తానే అయి ఎగురుతారో

వాళ్ళు చాలా బలమైన రెక్కలు (  సంకల్పాలు )

కలిగి వుంటారు....

""అప్పో దీపో భవ.....

సేకరణ.....


*రోజుకో అన్నమయ్య సంకీర్తన*
*
*రాగము: శంకరాభరణం*
రేకు: 1000-6
సంపుటము: 20-6
*॥పల్లవి॥*
అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ
నలి నిందిర నీతో నవ్వినది
*॥చ1॥*
ఆదిలక్షి మోహనకమలంబున
వేదమాత నిను వేసినది
ఆదెస నీపై నభయహస్తమును
సాదరమునఁ గడుఁ జాఁచినది
*॥చ2॥*
సిరి దనకన్నుల చింతామణులను
పొరి నీపై దిగఁబోసినది
వరదహస్తమున వలచెయి వట్టుక
అరుదుగ విను మాఁటాడించినది
*॥చ3॥*
జలదికన్య తనసర్వాంగంబులఁ
బిలిచి నిన్ను నిటు పెనఁగినది
అలముక శ్రీవేంకటాధిప నిను రతి-
నెలమి నీవురఁ(రం) బెక్కినది.

🌹. నారద భక్తి సూత్రాలు - 4 🌹 
ప్రథమాధ్యాయం - సూత్రము - 2

🌻 2. సాత్వస్మిన్‌ పరమ ప్రేమ రూపా  - 2 🌻

ఏది ప్రేమానుభవాన్ని కలిగిస్తుందో, చివరికి భగవత్సాక్షాత్కారాన్ని కూడా కలిగిస్తుందో, అదే శ్రేష్ఠమైన ప్రేమ, పరమప్రేమలో భక్తుని బుద్ధి, భగవంతునిలో లీనమవుతుంది. ఇట్టి పరమప్రేమనే లక్ష్యంగా సాధన చేయవలసి ఉంటుంది. ''భగవంతుడు నా వాడు'' అనే మమకారంతో మొదలయ్యేది భక్తి. 


ఈ భక్తి భావం కలగాలంటే భక్తుని మనసు ప్రాపంచిక, సాంసారిక విషయాలను విడచి కేవలం భగవంతుని మీదనే తన ధ్యాసనంతా నిలపాలి. 

అనగా యే కోరిక కోరకుండా ''భక్తి కోసమే భక్తి''గా భగవంతుని సేవించడం భగవంతుని యెడల పరమప్రేమ అవుతుంది. 

ఈ భక్తి తైలధార వలె తెంపు లేకుండా సాగిపోవాలి. భగవంతుని ప్రీతి పూర్వకంగా ధ్యానించాలి. అది అలవాటుగా మారాలి. 

చివరికి అది భక్తుని శీలంగా మారాలి. అదే శ్రేష్ఠమైన భక్తి అవుతుంది. ఈ భక్తిలో జనించే ప్రేమ అలౌకికం. ఈ భక్తే మోక్ష సాధనం.

శ్లో||  మోక్షకారణ సామాగ్య్రాం భక్తిరేవ గరీయసి |
         స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే ||

శ్లో||  స్వాత్మ తత్త్వానుసంధానం భక్తిరిత్య పరేజగుః |

           - వివేక చూడామణి

తా||  మోక్షం కావాలంటే భక్తి సాధనయే గొప్పది. తనలో గుహ్యంగా ఉన్న పరమాత్మతో అనుసంధానం చేయడమే భక్తి అనబడుతుంది.


            తన ఆత్మ తత్త్వాన్ని పరమాత్మ తత్త్వంతో అనుసంధానం చేసే సాధనను భక్తి అని పెద్దలు పలికారు.

సశేషం....


The hug…


సమస్యను పరిష్కరించడం........

కటిక చీకటి కనరాదు కాలి ముల్లు

🍅🍅🍅🍅🍅🍅🍅🍅

*పటిక చేయు మేలు ను చూడు పలుకు లేల

స్పటిక వెలుగులు చాలవు సామ మేల

కటిక దారిద్ర్య పంచన కల్లుఏల

కటిక చీకటి కనరాదు కాలిముల్లు

----

" కటిక చీకటి కనరాదు కాలి ముల్లు

చిటిక వైచిన వినఁబడ్దు చిట్టడవిన

పొటిపొటినలుసులవెతలు పొడముచుండె

జటిలమయ్యెబ్రతుకుఁగన జంగమయ్య !!! "




మనసు ఊహలతో తేలియాడుతూ, ఎంత విశాలముగా మారుతుందో, ఊహాలు పెరిగే కొద్ది, సీతాకొక చిలుకదాకా మారేదెప్పుడు,  అనంత మకరందాన్ని పొందే దెప్పుడు, ఆశ్వాదించె దెప్పుడు,  అని విశ్వసిస్తూ  విహరిస్తూ, రంగు రంగులుగా,  మారి రమనీయ మైన,  మాదుర్యాన్ని  ఆస్వాధిచుతూ, ఆనంద డోలికలో, మునిగి పోతుంది.  సీతా కోక చిలుక

ఎన్ని సముద్రాలు, ఎన్ని పర్వతాలు, ఎన్ని  నదులు, ఎన్ని లావాలు, తన కుహరంలో దాచుకుంటుంది  సముద్రాల ఉప్పును భరిస్తూ, పర్వతంలా బరువుని మోస్తూ, నదుల్లా పరవసిస్తూ,  నలుగిరి దాహాన్ని తీరుస్తూ, తనను అన్య క్రాంతను చేసిన వారిని లార్వాలా, పెల్లుబికి ముంచి వేస్తు , మనసులోని మాటను బయటకు చెప్పుకోలేక, గట్టుదాటలేని కడలివలే  భాదలు కష్టాలు సుఖాలు దుఖాలకు  హ్రుదయ మాదుర్య0  చెడకుండా  మందహాసాన్ని అందించే మకారందమా

బయటకు కనబడిన, అద్బుత లోకాలు, మనవద్దె ఉన్నాయి, కాని అవి ఆకాశములో  విహరించే మేఘాలు, దూది పింజాల్లా,  గాలికి కదిలి వేలతాయో అదే విధముగా,  ఆ మనసు అల్ల కల్లోలమునకు చిక్కి,  ఆశలు ఆశయాలు,  నీటి  మీద రాతల్లా తేలియాడుతూ,  ప్రేమ పాశంలో చిక్కి అనంత వాయువులను అస్వాదిస్తూ, అంతరంగ అనుభూతిని పొందుతూ, ఆలోచనలకు తావివివ్వక, ఆనందాన్ని పంచె, అద్బుత  లోకం ఎక్కడ లేదు, ఒకరి కొకరు కలసుకొని, అర్ధం చేసుకొని, జీవన మార్గమే ఆనంద నిలయం  

******
ఆనంద నిలయంలో అందరూ నవ్వుకుంటే ఇంకా బాగుంటుంది కదూ ఒక్కసారి చదవండి అన్దరూ నవ్వండి                                    

నలుగురు  వ్యక్తులు ఒకచోట కలిస్తారు. వారిలో  రోజు కొకరు ఒక సమస్య చెపుతారు. ఆ సమస్యకు మిగతా ముగ్గురుకి  నవ్వు వచ్చే విధముగా హాస్య విషయాలు తెలియపర్చాలి  నాల్గవాడికి నచ్చే విధముగా ఉండాలి. అవి ధర్మ భద్దముగా ఉండాలి 

సందర్భం ఏదైనా తీసుకొవచ్చు ఇందులో నిభందనలు ఏమి ఉండవు

1. అరవకుండా నిశ్శబ్దం  ఉండాలాంటె ఏంచేయాలి  
మొదటి వ్యక్తి : నేను స్కూల్లో జరిగే సంఘటన గురించి తెలియపరుస్తా  (ఓ .కె )
                   : 
టీచర్ : అరవ  కండి నిశ్శబ్దం ఉండండి పిల్లలు 
పిల్లలు :  అరవ కుండా నిశ్శబ్దం  ఉండాలాంటె ఏంచేయాలి, అంటూ 
            తప్పుకోండి టీచర్  మేమంతా బయటకు వెళ్తాం,
               మీరు  నిశ్శబ్దంగా  నోటి మీద వేలేసుకొని కూర్చోండి    
            ఏమంటున్నారు అంటూ ఒక్కసారి టీ చర అరిచింది 

            నిశబ్దం అంటూ నోటి మీద  వేలు వేసుకొని బయటకు వెళ్లారు 
            నోరు తెరుచు కొని చూస్తున్నది  టీచర్  
               అందరు ఒక్కటే నవ్వులు .......... 

రెండవ వ్యక్తీ : నేను స్కూ ల్లో జరిగే సంఘటన గురించి తెలియపరుస్తా  (ఓ .కె )
  పిల్లలు :  అరవకుండా నిశ్శబ్దం  ఉండాలాంటె ఏంచేయాలి అని ఆడి గారు కదా టీచర్ 
  టీచర్ :          నోటి మీద వెలు చూపి మాట్లాడలేదు         
పిల్లవాడు :       అద్యక్షా అద్యక్షా అని అరిచాడు ఒక పిల్లవాడు  
   టీచర్ :         నోటి మీద వేలుచూపి మాట్లాడలేదు  
పక్కపిల్లవాడు : అరచిన వ్యక్తిని మరొకరు గట్టిగా నోరు మూసాడు 
మరోపిల్లవాడు : ఇప్పుడు నిశ్శబ్దం వహిస్తే వాడు చస్తాడు టీచర్
టీచర్ :             నోటి మీద చేయి తీయరా  అని గట్టిగా అరిచింది
పిల్లవాడు :        అయితే మాట్లాడ వచ్చా  టీచర్ 
                       నోరు తెరుచు కున్నది టీచర్  
                       అందరూ  ఒక్కటే నవ్వులు ............. 

మూడవ వ్యక్తి : నేను ఇంట్లో జరిగే సంఘటన గురించి తెలియపరుస్తా 
 శ్రీమతి  : ఏమిటండి  ఆ చెవులకు పెట్టుకున్నారు, 
నేచేప్పేది కాస్త వినండి    
 భర్త   :     నోరెత్త కుండా చెప్పినది చెప్పినట్లు చేయాలి కదా,  ఈ మైకులో మాట్లాడు ,నేను మాట్లాడుతా ఎవరికీ వినబడదు. 
 భార్య :    గట్టిగా మాట్లాడింది అంతే 

 భర్త   :    అప్పుడు నానోరు నిశ్శబ్దం, ఇప్పుడు నాచెవులు కుడా నిశ్శబ్దం వహించాయి 
 భార్య :        ఆ మరేం నష్టం లేదు ............ 
                   ఆ అంటూ   నోరు తెరుచాడు భర్త ................ 
                       అందరూ  ఒక్కటే నవ్వులు ............... 
                                                                ఇంకా ఉంది                      .........................   (2)


మిత్రులు శ్రేయోభిలాషులు  అందరికీ పేరు పేరున ఉగాది పండుగ శుభాకాంక్షలు.. 💐💐💐 మహేష్ వూటుకూరి .
***********౮********౮౮౮***
నేటి నా పాట పాట సంఖ్య:-584.
********౮********************
రచన :- మహేష్ వూటుకూరి  ✍️
9640713717.
 దోర్నాల.
 ప్రకాశం జిల్లా.
22/03/2023.
************-----
 పాట సందర్భంపై నా విశ్లేషణ:-
*****************************
 అదో పల్లెటూరు ఉగాది పండుగ శోభతో
 పచ్చతోరణాల స్వాగతాలు పలుకుతుంటే ఊరంతా
 ఉత్సాహంగా  కలిసి సంబరాలు చేసుకుంటుంటే
 ఓ పడుచు జంట  పరవశమై  పండుగ తోడవంగా పాడుతు కలిసి ఆడుతున్న  పండుగ పూట  ప్రేమ పాట:-
***********************************************
 పల్లవి:-
********
వసంతం నవ్వింది నీలా అందంగా
ఉగాదై  వచ్చింది నాలా ఆనందంగా
కోయిల కూసింది మా పల్లె సీమలా
కోన మురిసింది ఈ మల్లె పూలలా!!

ఆనందం  చిందేసి ఆడింది మనలా
ఆకాశానికి ఎగసింది మనసంతా ఉప్పెనలా

తకతై తకతై తకతై 
తకతై తకతై తకతై అంటు ఆడింది
 ఊరంతా ఒకటై ఉత్సాహమే తోడై తకతై తకతై

నాలో నువ్వు తొంగిచూసాక
నింగి నేలా నా సొంతమైనాదిలే
నేను కరిగి నీలో కలిసి నదిలా సాగినాక
ఏకమైనా క్షణమే హరివిల్లు విరిసి
ఈ సిరిమల్లి సిగ్గు పడింది లే

 తకతై తకతై తకతై
 తకతై తకతై తకతై తనువంత తుళ్ళింత కాగా
 మనువు ఆడమంటు మగువ కోరంగా తకతై తకతై!!

వసంతం నవ్వింది నీలా అందంగా
చరణం:-
*****
ఈడు జోడు
అధరాల మదువుల  షడ్రుచులు గ్రోలంగా
 గోపికల గుంపు అడ్రసునే కనిపెట్టి  హాయిగా నవ్వంగా
 సిగ్గు సిరిమల్లెలై పూసే
 సొట్టబుగ్గల్లో సిటికేయంగా 
ఆకు ఒక్క కలబోత నోరంత ఎరుపెక్కనే..

తకతై తకతై తకతై
తకతై తకతై తకతై..  తారాజువ్వ లా నువ్వు
తారనే చేరి  తాపమే తీర్చగా తకతై తకతై..
పల్లవి:-
******
 వసంతం నవ్వింది నీలా అందంగా
చరణం:-
*********
పండుగ పూట పంచభక్ష్యాలు విందులో
గుమ్మడి పూల  అంచు చీరలో  నిను చూసి
పొందు ఆనందంలో  
నింగి నేల కలిసినంత  అధ్భుతమే ఆవిష్కృతమై

పొంగి పొరలు ప్రేమే వాటేసుకోగా
అంగాంగాలు అంగరంగవైభవంగా ఉప్పొంగెనే
ఉప్పెనల్లే  ఉవ్వెత్తున ఎగసిన సంద్రమయ్యే
నా హృదయం
 కోరస్:-
*******
తకతై తకతై తకతై
తకతై తకతై తకతై  తందాన తానా అంటు  
అందాలు  ఆరబోయంగా

 పల్లవి:-
******
 వసంతం నవ్వింది నీలా అందంగా
 ఉగాదై వచ్చి నాలా ఆనందంగా..
********************************


Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ