
81. సుత్తి
మాస్టార్ : రాము నువు చిన్నప్పుడు సుత్తి పట్టుకొని అందరి వెంట పడి
కొట్టటానికి వచ్చే వాడవు గుర్తుందా.
రాము: ఎందుకు గుర్తులేదు.
మాస్టార్ : ఇప్పుడెం చేస్తున్నావు.
రాము: ఇప్పుడు అలాంటి పోస్టల్ ఉద్యోగమూ
మాస్టార్ : స్టాంమ్పులాపై ముద్రవేసే ఉద్యొగముకాదుకదా
అదే ............................................l
82. పాట
నీవు పాట పాడకు అమ్మాయి, " ఎందుకు"
నీ పాటకు తన్మయత్వం తో తుమ్మెదలు వస్తున్నాయి
పాడకముందే చుట్టు మూగాయి, ఎట్లా పాడేది.........
83. స్టమక్
నాతొ పార్కుకు వస్తావా అని అడిగాడు రాము జానకితో
నీ వెక్కడకు రమ్మంటే అక్కడకు వస్తాను కాని ఒక షరతు
అది ఏమిటి
"నాకు స్టమక్ వచ్చేదాకా నీతొ ఉంటా " ..............
84. తాళి
భర్త భార్యతో బయ్యటకు వచ్చేటప్పుడైనా తాళి మేడలో వేసుకోవచ్చుగా
మీరు నూరెల్లు చల్లగా ఉండాలని తాళి ఫ్రిజులో ఉంచి వచ్చా ...
..........
*680 - శ్రీ విద్యా - శాశ్వతమైన శక్తి / Sri Vidya – The Eternal Energy*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి, ప్రాంజలి ప్రభ
🕉🌞🌏🌙🌟🚩
*540. స్మృతి!!*
స్మృతి = మరల మరల గుర్తుకు తెచ్చుకొను లక్షణము.
దర్శనం జరిగే - క్రొత్త విషయాలు - 'శ్రుతులు' (Revelations) అయితే - ఆ శ్రుతులలోని విషయాలే మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకుని తదనుగుణంగా వివరింపబడే విషయాలను 'స్మృతులు' (Recollections) అంటారు. వేదాలే శ్రుతులు. మనువు, పరాశరుడు, గౌతముడు,యాజ్ఞవల్క్యుడు మొదలైనవారు ఆ వేదాలను అనుసరించి ఒక్కొక్కరు కొన్ని కొన్ని విషయాలను వివరించి వ్రాశారు. వాటన్నిటినీ స్మృతులు' అంటారు. ఇవన్నీ మానవ జాతికి బాగా అర్థమయే రీతిలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. పరమ ప్రామాణికమైన వేదాలలోని విషయాలకు వీటిలో తెల్పే విషయాలకు అభేదమే కాబట్టి స్మృతులకు కూడా - శ్రుతులకు ఉన్న ప్రాధాన్యము, గౌరవము ఉన్నది.
(సుదక్షిణాదేవి తన భర్త అయిన దిలీప మహారాజును అడుగుల్లో అడుగు వేసుకుంటూ అనుసరించే విధానాన్ని ఉపమానం చెప్పడానికి 'శ్రుతే రివార్థం స్మృతి రస్వగచ్ఛత్' - 'స్మృతులు శ్రుతులను ఎలా అనుసరిస్తాయో సుదక్షిణ, దిలీపుని అలా అనుసరించింది' అని - తన కావ్యమైన రఘువంశంలో కాళిదాసు అంటాడు.)
(అంటే - స్మృతులు స్వతంత్రమైనవి కావు. శ్రుతులను అనుసరించే ఉంటాయి అని కూడా దీనిని బట్టి గ్రహించాలి.)
"శ్రుతులను ప్రాధాన్యంగా తీసుకునే వారిని - 'శ్రోత్రీయు'లని, 'స్మృతు' లను ప్రాధాన్యంగా తీసుకునే వారిని - 'స్మార్తులు' అనీ అంటారు.
ఆజ్ఞా చక్రాధిష్టాన దేవత అయిన సిద్ధమాత యొక్క మంత్ర విశేషాన్ని ఆరవ మాస గర్భస్థ పిండ స్వభావాన్ని ఈ నామంతో సమన్వయ పరచుకోవచ్చు.
స్మృతి అనగా శ్రవణాస్మరణాత్మకమైన జ్ఞానము. ఋషులు, శ్రోతగ్రాహ్యులు శ్రుతులను స్మృతి యందుంచుకొని ముందు రానున్న మానవ సముద్ధరణకై వారికి గ్రాహ్యమగునట్లు సమకూర్చబడిన స్మృతులు శ్రుతి నుండి వచ్చిన వగుటచే శ్రీమాత స్మృతి రూపిణి అని కొనియాడబడినది.
శ్రుతి పూర్వకమైనవి శ్రుతులనబడినవి, అట్టి శ్రుతుల యొక్క మననమే స్మృతులు అనబడెను. శ్రుతులను ఆధారంగా తీసకొనే వారిని శ్రోత్రియులనియు, స్మృతులను ప్రాధాన్యంగా చూసేవారిని స్మార్తులనియు అందురు.
ఆజ్ఞాచక్రాధిష్ఠాన దేవతయైన సిద్ధమాత మంత్రవిశేషమును, ఆరవ మాస గర్భస్థ పిండము యొక్క స్వభావాన్ని ఈ నామ మంత్రముతో సమన్వయము చేసికొనవలయును. గ్రంథములు. అందు మనుస్మృతి మిక్కిలి దొడ్డగ్రంథము. ఈమానవ ధర్మశాస్త్రమున జగత్సృష్టి మొదలుకొని సర్వవిషయములును చెప్పఁబడి ఉన్నాయి.
ఇందు బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రులు అను చాతుర్వర్ణ్యాశ్రమ ధర్మములు, వివాహక్రమ పంచమహాయజ్ఞా తిథిపూజా పార్వణవిధి శ్రాద్ధవిధాన భోజననియమాదులు, స్త్రీపుంధర్మములు, రాజధర్మములు, వ్యవహార ధర్మములు, ప్రాయశ్చిత్త నియమములు మొదలుగాఁగల హిందువుల వైదిక లౌకిక విషయములు అన్నియు వచింపఁబడి ఉండును. మఱియు స్మృతులు వేదముల వలెనే గౌరవింపఁబడును. కలియుగమునకు విహితములు అగు ధర్మములు పరాశర స్మృతియందు చెప్పఁబడి ఉన్నాయి. వెండియు పురాణముల వలె స్మృతులును పదునెనిమిది.
అవి మనుస్మృతి, బృహస్పతిస్మృతి, దక్షస్మృతి, గౌతమస్మృతి, యమస్మృతి, అంగీరసస్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి, ప్రచేతస్స్మృతి, శాతాతపస్మృతి, పరాశరస్మృతి, సంవర్తస్మృతి, ఔశనసస్మృతి, శంఖస్మృతి, లిఖితస్మృతి, ఆత్రేయస్స్మృతి, విష్ణుస్మృతి, ఆపస్తంబస్మృతి, హరీతస్మృతి అనునవి. ఇవికాక ఉపస్మృతులు పదునెనిమిది ఉన్నాయి. అవి కణ్వస్మృతి, కపిలస్మృతి, లోహితస్మృతి, దేవలస్మృతి, కాత్యాయనస్మృతి, లోకాక్షిస్మృతి, బుధస్మృతి, శాతాతపస్మృతి, అత్రిస్మృతి, ప్రచేతస్మృతి, దక్షస్మృతి, విష్ణుస్మృతి, వృద్ధవిష్ణుస్మృతి, వృద్ధమనుస్మృతి, ధౌమ్యస్మృతి, నారదస్మృతి, పౌలస్త్యస్మృతి, ఉత్తరాంగిరసస్మృతి అనబఁడును.
మన్వాదిస్మృతులరూపం కలిగినటువంటిది. వేదాలు స్మృతులు కూడా ఆ పరమేశ్వరి రూపాలే.
ఆ దేవి శ్రవణస్మరణాత్మకమైన రూపము గలది. స్మరించుటయే దేవి యొక్క స్మృతి అని దేవీ పురాణంలో చెప్పబడింది. ఎప్పుడూ పరమేశ్వరి నామాన్ని విడవకుండా చెయ్యటమే స్మృతి అనబడుతుంది.
వేదాలన్నీ బాగా ప్రచారమయిన తరువాత, ప్రతివారూ వేదాలను చదవలేరు. చదివినా అర్ధం చేసుకోలేరు కాబట్టి, వేదాలసారాన్ని మనువు, పరాశరుడు, యాజ్ఞవల్క్యుడు మొదలైనవారు స్మృతులును వ్రాశారు.
శ్రుతిపూర్వకమైన వాటి మననరూపమే స్మృతి. సర్వజీవుల యొక్క భూతభవిష్యద్వర్తమానాలనన్నింటినీ ఆ పరమేశ్వరి స్మృతి పధంలో ఉంచుకుంటుంది. కాబట్టి 'స్మృతి' అనబడుతుంది.
శ్రవణము, స్మరణము వలన యేర్పడు జ్ఞానము శ్రీమాత
ముందు నామములో తెలిపిన వాఙ్మయమును వినుట వలన, మరల మరల స్మరించుట వలన జీవులయందు మేధోవికాసము కలుగును. ఇట్లు వికాసము కలిగించు జ్ఞాన రూపమున శ్రీమాత ఉపనిషత్తులు, రామాయణ మహాభారతాది గాథలు, వేదాంగ ములు వినుచూ, స్మరించుచూ నేర్చుకొనుట స్మృతి విద్య.
శ్రుతిని స్మృతి ద్వారా నేర్చుకొనుట సదాచారము. నేర్చిన వానివద్ద నేర్చుట విదితమగు విషయమే కదా! నేటికినీ వేదములు మంత్రములు, స్తోత్రములు నేర్చినవారు పలుకుచుండగా విని నేర్చుకొనుట సదాచారముగ జరుగుచున్నది. స్వంతముగ నేర్చుకొనుట సదాచారము కాదు. అది స్వతంత్ర బుద్ధికి చిహ్నము.
అట్టి వారియందు విద్య రాణించుట కష్టము. అహంకారము కారణముగ విద్యలు రాణింపవు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతారమూర్తులు కూడ సద్గురువుల నాశ్రయించిరి. శుశ్రూషలు చేసిరి. వినయము గలవారికే విద్య అని తెలియవలెను. సంపదలలో వినయ సంపద చాల గొప్పది.
శ్రీమాతయే స్మృతి, శ్రుతి రూపము గనుక ఆమెను భక్తి శ్రద్ధలతో ఆరాధన చేయువారు సర్వవిద్యల సారమును పొందగలరు. భక్తులీమార్గముననే సర్వవిద్యలను నేర్చిరి.
శ్రీమాత సర్వవిద్యా స్వరూపిణి కదా! ఆమెను గూర్చిన శ్రవణము, స్మరణము వలన కూడ జీవులు పూర్ణ వికాసము చెందుదురు. ఇదియునూ సదాచారమే. శ్రుతి స్మృతులు జీవుల మేధస్సును క్రమముగ వృద్ధి పరచుచూ తరింపజేయును. తరువాత నామము దీనినే ప్రతిపాదించును.
......సేకరణ
*****************************
నేటి నా పాట పాట సంఖ్య:-586.
******************************
రచన:- మహేష్ వూటుకూరి ✍️
దోర్నాల.
ప్రకాశం జిల్లా.
24/03/2024.
******************
పాట సందర్భంపై నా విశ్లేషణ.
***************************
సమాజంలో ప్రతి వ్యక్తి కి ఏదో ఒక సమస్య వుంటుంది
ఆ సమస్యను గుర్తించి సాల్వ్ చేసుకోక అబద్రతా భావంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలా మంది.. సమస్య ఎంతటిదైనా పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. ప్రశ్న పుట్టిందంటే అందుకు జవాబు వెతకాలి అలా కాకుండా మరణం వైపు అడుగులు వేస్తు ఆత్మహత్య చేసుకునే రైతు ప్రేమికులు ఇలా అందరు ఆలోచించాలి చావు పరిష్కారం కాదని తెలుసుకోవాలి..
ఈ పాటలో వారిలో మార్పు వస్తుంది ఇంకెవ్వరు అలా ఆత్మహత్యలు చేసుకోకుండా కనువిప్పు కలిగి సామాజిక స్ప్రహ తో నడవాలనే సందేశంతో ఆత్మహత్యల నివారణతో జాతి ఐక్యతను చాటే లా సందేశాత్మక పాట.
********************************************
పల్లవి:-
*********
ఏం తప్పు చేసావు నీవు
మరణించాలని ఎందుకనుకుంటున్నావు...
ఏం తప్పు చేసావు నీవు
నిప్పుల్లోకి దూకాలని ఎదురెళ్ళుతున్నావు....
తుప్పులా రాలిపోవాలని అనుకోమాకు నీవు
నిప్పులా బ్రతకాలని ఎందుకనుకోవు
తప్పే చేయని మనిషే లేడు ఈ లోకంలో
చివరకు ఆ దేవుడు కూడా చేసాడు తప్పు నీలా తొందరపాటులో..!!
నీవు తప్పు చేయడంలో ఏ తప్పు లేదు సోదరి
నీ తెలియని తనమే అందుకు దారితీయించిందిలే
నీవు చేస్తున్న తప్పేదైనా ఉందంటే అది
ఇలా అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకోవడమే మాధురి !!
ఏం తప్పు చేసావు నీవు
మరణించాలని ఎందుకనుకుంటున్నావు నీవు!!
చరణం:-
*********
కోపంలోని నిర్ణయం కొరివి లాంటిదే
ఆవేశంలోని ఆలోచన తెలివి లేనిదే
!! కోపం లోని నిర్ణయం!!
ఎవరో ఏదో మోసం చేసారని
ఇంకెవరో ఇంకేదో ద్రోహం చేసారని
నీ వెందుకిలా శోకంలో కూరుకుపోయితివి
మరణాన్ని ఎందుకు ఆశ్రయించితివి..
ఇది వెర్రి తనం కదా
పెద్ద పిచ్చి తనం కాదా..
చేతకాని వాడిలా చేవ లేని దానిలా నిష్క్రమించడానికేనా నీ జననం
గీత దాటి రాత అంటే ఎలా?
మేత మేసినా కంచెనే ఎనుకేసుకొస్తున్న లోకమిదిలే..
ఈ దారి కాదు నీ పయనం
ఏది మూసుకుపోయినా
తోసుకొని తోపులా జీవించడానికి నీ జీవితం
రాజులా తల ఎత్తి నడవాడినికే నీ జీవనం..
రాజులా తల ఎత్తి బ్రతకడానికే నీ జననం..
పల్లవి:-
*******
ఏం తప్పు చేసావు నీవు
మరణించాలని ఎందుకనుకుంటున్నావు నీవు...!!
చరణం:-
*********
ప్రేమ విఫలమైనా
చదువులో ఫెయిలైనా
వ్యాపారం లో నష్టమొచ్చినా
వ్యవసాయంలో కరువు తాండవించినా
తనువు చాలించాలని కలలో కూడా కల కనకు!!
తప్పు తప్పు తప్పు ముమ్మాటికీ తప్పు రా
ముమ్మాటికీ తప్పురా.!!
ప్రాణం కన్నా విలువైనది ఏది లేదురా
దేహం వదిలేసి సాదించేది శూన్యమురా!
పునరాలోచన చేసుకో ప్రశాంతంగా
చచ్చి సాధించేదేమిటని నిన్ను నీవు ప్రశ్నించుకో
నిదానంగా..!
సమస్యల దేముంది భయపడితే మింగేస్తుంది
ఎదురు తిరిగి తొడగొడితే బెదిరి పారిపోతుందీ.!!
ఏమంటారు మీరు
మాటిచ్చి ముందడుగేసి చూడు
తప్పు తెలుసుకో
సరిదిద్దుకో ముందుకు సాగిపో...
దీర్ఘాయుష్మాన్ భవ అంటు పంచ భూతాలు దీవిస్తున్నాయి.
దీర్ఘకాలం జీవించి చూయించాలి
గెలుపు బావుటా ఎగరేసి నిలిచి చూయించాలి!!
ఆత్మవిశ్వాసమే అన్నింటీకి పరిష్కారం
మనసు పెట్టి ఆలోచిస్తే దొరుకుతుందీ ఓ మంచి మార్గం!!
దొరలా బ్రతుకు రహదారి లో
గమ్యమెంత దూరమైనా చిరునవ్వు నేస్తంతో చేరుకో..
పల్లవి:-
******
ఏం తప్పు చేయలేదు మేము
మరణించాలని ఇక ఎప్పుడు అనుకోము మేము...
ఏదైనా సహజంగా జరగాలని
సహనంతో సరితూగాలని
తెలుసుకున్నాక
తెగువే మేమై వేకువై ఉదయిస్తాము...!!
*************************************
Comments
Post a Comment