*నేటి సూక్తి : పూర్ణయోగంలో ఏకాగ్రత, ధ్యానము - చైతన్యాన్నీ ఒక ప్రత్యేక స్థితిలోనో గతిలోనో లగ్నం చెయ్యడం ఏకాగ్రత. స్థితికి ఉదాహరణం శాంతి, గతికి ఉదాహరణం ఇచ్ఛ, ఆకాంక్ష. యథార్థ జ్ఞానప్రాప్తికై అంతర్మనస్సు విషయాలను ఈక్షణ చేయడం ధ్యానం. 🍀
***
Train: రైలు నడుపుతున్న డ్రైవర్ పొరబాటున నిద్రలోకి జారుకుంటే ఏమవుతుంది..?
మీరు రైలులో చాలా సార్లు ప్రయాణించి ఉండవచ్చు, కానీ డ్రైవర్ గాఢ నిద్రలోకి వెళితే రైలుకు ఏమి జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ??
Train: రైలు నడుపుతున్న డ్రైవర్ పొరబాటున నిద్రలోకి జారుకుంటే ఏమవుతుంది?
బస్సు గానీ.. కార్లు గానీ ఇతర వాహనాలు నడుపుతున్న డ్రైవర్స్ నిద్రలోకి జారుకోవడం వలన పెను ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. అలానే ట్రైన్‌ను డ్రైవర్ అనుకోకుండా నిద్రలోకి జారుకుంటే ఏం జరుగుతుంది అనే డౌట్ చాలామందికి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా రైలులో ఇద్దరు లోకో పైలట్లు ఉంటారు. వారిలో ఒకరు సీనియర్ లోకో పైలట్ కాగా మరొకరు అసిస్టెంట్ లోకో పైలట్. లోకో పైలట్ అనుకోకుండా నిద్రలోకి జారుకున్నట్లయితే, అసిస్టెంట్ లోకో పైలట్ లోకో పైలట్‌ను అప్రమత్తం చేస్తాడు. ఒకవేళ ఇద్దరూ నిద్రలోకి జారుకుంటే, లోకోపైలట్ అలర్ట్ కోసం విజిలెన్స్ కంట్రోల్ డివైస్ (VCD) అనేది మైక్రోకంట్రోలర్ ఆధారిత భద్రతా పరికరం ఉంటుంది.
ఇది డ్రైవర్ అసమర్థమైన సందర్భంలో స్వయంచాలకంగా ట్రైన్ బ్రేక్స్‌ని అప్లై చేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ప్రతి 60 సెకండ్స్ లోపు లోకో పైలట్ ఎదో ఒక ఆపరేషన్ చెయ్యాలి. అంటే.. హార్న్ ఇవ్వడం లేదా ట్రైన్ స్పీడ్ పెంచడం లేదా తగ్గించడం వంటివి. ఒక వేళ పైలట్ అలా చెయ్యనిచో 60 సెకండ్స్ తర్వాత ఇంజన్‌లోని ఓ లైట్ 8 సెకన్ల పాటు బ్లింక్ అవుతుంది. అప్పుడు పైలట్ అప్రమత్తమైతే ఓకే. లేదంటే ఈ సారి మరో 8 సెకన్ల పాటు బజర్ సౌండ్ వస్తుంది. ఇలా 16 సెకన్లపాటు ఆడియో విజువల్ ఇండికేషన్ వస్తుంది. అయినప్పటికీ పైలట్ కానీ అసిస్టెంట్ పైలట్ కానీ రియాక్ట్ అవ్వకపోతే.. లోకోమోటివ్ పవర్ డౌన్ అయ్యి.. బ్రేక్స్ ఆటోమాటిక్ గా అప్లై అయిపోయి ట్రైన్ ఆగిపోతుంది.
........
*🌹🌹 *
🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 07 🌴
07. ఏతైరన్యైశ్చ పథిభిర్మనో దుష్టమసత్పథమ్|
బుద్ధ్యా యంజీత శనకైర్జితప్రాణో హ్యతంద్రితః॥
తాత్పర్యము : అహింసాది నియమములను పాటించుటయేగాక, వ్రతదానాది ఇతర సాధనలద్వారా కూడ సావధానుడై జితేంద్రియుడై బుద్ధిద్వారా చెడు మార్గముల వైపు వెళ్ళు చిత్తమును తిన్నతిన్నగా ఏకాగ్రమొనర్చి మనస్సును పరమాత్మ ధ్వానమునందే లగ్నము చేయవలెను.
వ్యాఖ్య : అసత్పధములో వెళ్ళే ఇంద్రియాలను బుద్ధితో జయించు. బుద్ధికీ మనసుకీ అనుసంధానం ఉన్నంతకాలం అసత్పధములో వెళ్ళము. ఎందుకంటే బుద్ధికి ఆలోచించే శక్తి ఉంది. మనసు ఆలోచించదు. మనసుని బుద్ధితో కలపాలంటే ప్రాణాయామం ముద్రల తోటి ప్రాణ వాయువుని జయించాలి. సోమరితనాన్ని విడిచిపెట్టాలి. అలాంటి వాడే ప్రాణ వాయువును గెలువగలడు. అటువంటి వాడే మనసును బుద్ధితో కలపగలడు
సాధారణ యోగా ప్రక్రియలో నియమాలు మరియు విధానాలను పాటించడం, వివిధ కూర్చున్న భంగిమలను అభ్యసించడం, గాలి యొక్క ముఖ్యమైన ప్రసరణపై మనస్సును కేంద్రీకరించడం మరియు అతని వైకుంఠ కార్యాలలో పరమాత్ముని గురించి ఆలోచించడం వంటివి ఉంటాయి. ఇది యోగా యొక్క సాధారణ ప్రక్రియ. ఇదే ఏకాగ్రతను ఇతర ఏకాగ్రతా ప్రక్రియల ద్వారా సాధించవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, భౌతిక ఆకర్షణతో కలుషితమైన మనస్సు, భగవంతుని యొక్క పరమపురుషుడిపై బంధింపబడి, కేంద్రీకరించబడాలి. ఇది శూన్యం లేదా వ్యక్తిత్వం లేని వాటిపై స్థిరపడదు. ఈ కారణంగా, శూన్యత మరియు వ్యక్తిత్వం లేని యోగా అభ్యాసాలు అని పిలవబడేవి ఏ ప్రామాణిక యోగా-శాస్త్రంలో సూచన చేయబడవు. నిజమైన యోగి, భక్తుడి మనస్సు ఎల్లప్పుడూ భగవానుడి కార్యకలాపాలపై కేంద్రీకృతమై ఉంటుంది.
సశేషం..
ఆనాటి వైభవం
....
1960 - 2000 మధ్యలోమీరు పుట్టినవారే అయితే
ఇది మనకోసం..
వీధుల్లో ఆటలాడి, నేర్చుకున్నది మనదే చివరి తరం.
పోలీస్ వాళ్ళని నిక్కర్లలో చూసిన తరమూ మనదే.
స్కూల్ కి నడుచుకుంటూ, మధ్యలో స్నేహితులని కలుపుకొని, వారితో నడుస్తూ వెళ్ళిన వాళ్ళం కూడా మనమే
చాలా దూరం అయితే సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు
స్కూళ్ళలో టీకాలు ఇప్పించుకున్న తరమూ మనదే.
మనమే మొదటగా వీడియో గేములు ఆడటం. కార్టూన్స్ ని రంగులలో చూడటం.
అమ్యూజ్ మెంట్ పార్కులకి వెళ్లటం.
రేడియోలలో వచ్చే పాటలని టేప్ క్యాసెట్లలో రికార్డింగ్ చేసినవాళ్ళం.
అలాగే వాక్ మ్యాన్ తగిలించుకొని పాటలు వినేవాళ్ళం.
VCR ని ఎలా వాడాలో తెలుసుకొని వాడిన తరం మనదే..
అలాగే కార్లో సీట్ బెల్ట్స్ పెట్టుకోకుండా ప్రయాణించిన తరం కూడా మనదే.
అలాగే ఎయిర్ బ్యాగ్స్ లేకుండా ప్రయాణించిన తరం కూడా మనదే.
సెల్ ఫోన్స్ లేకుండా మామూలు ఫోన్స్ తో రోజులని వెళ్ళదీశాం..
సైకిల్లకి బ్రేకులు లేకుండా రోడ్డు మీద ప్రయాణించిన ఆ రోజులు మనవే.
మన వద్ద ఫోన్స్ లేకున్నా అందరితో టచ్ లో ఉండేవాళ్ళం.
స్కూల్ కి కాళ్ళకి చెప్పులు లేకుండా, స్కూల్ బ్యాగ్ లేకుండా, జుట్టు కూడా దువ్వుకోకుండా
మామూలు బట్టలతో వెళ్ళాం
ఇప్పటి తరం అలా ఎన్నడూ వెళ్ళలేదు
స్కూల్ లో బెత్తం తో దెబ్బలు తినేవాళ్ళం.
స్నేహితుల మధ్య " కాకి ఎంగిలి " చేసుకొని, ఎన్నో తినుబండారాలు పంచుకోనేవాళ్ళం.
ఎవరూ ఆస్తులు, అంతస్థులు చూడకుండా స్కూల్ కి వెళ్ళేవాళ్ళం,
చెరువు గట్ల వెంట, కాలవల్లో స్నానాలు చేసేవాళ్ళం.
జాతరలలో దుమ్ము దుమ్ము ఉన్నా అన్నీ తినేవాళ్ళం.
సాయంత్రం వేల ఉప్పుడు బేరలు, అష్ట చెమ్మ. వెన్నెల కుప్పలు ఆడిన తరము మనదే.
శుక్రవారం సాయంత్రం " చిత్రల హరి" కోసం ముందు గానే స్నానం చేసి వచ్చి కూర్చున్న తరమూ మనదే
ఆదివారం ఉదయం 9 కి పనులు తప్పించుకుని "మహాభారతము" " రామాయణం"
" శ్రీకృష్ణ" చూసిన తరమూ మనదే...
ఉషశ్రీ గారి భారత రామాయణ ఇతిహాసాలు రేడియోలో విన్నది మనమే,
అమ్మ ఇచ్చిన పదిపపైసల్ని అపురూపంగా చూసుకున్న ఘనతా మనదే ..
ఆదివారం ఒక గంట అద్దె సైకిల్ కోసం రెండు గంటలు వేచి ఉన్నది మనమే...
పలకలని వాడిన ఆఖరు తరం కూడా మనదే.
రుపయికు థియేటర్ లో సినిమా చూడడానికి రెండు కిలోమీటర్ లు నడిచిన కాలం..
గొడుగులు లేక సంచులని కప్పుకుని బడికి పోయిన కాలం..మనమే.. మనమే అమ్మ 5 పైసలు ఇస్తే బఠానీలు తిన్నదీ మనమే..
గోర్లపైన కొంగ గోరు గుర్తులు చువ్వాట.. సిర్రగోనే ఆట..కోతి కొమ్మ..అష్ట చెమ్మ..ఆడిన తరము మనదే.
క్యాలిక్యులెటర్స్
వాడకుండా లెక్కలనీ, కనీసం 20 ఫోన్ నంబర్స్ ని గుర్తుంచుకొన్న తరమూ
మనదే.ఉత్తరాలని వ్రాసుకొని, అందుకున్న తరమూ మనదే..
మన
వద్ద అప్పుడు ప్లే స్టేషన్, 200+ ఛానల్స్ టీవీ, ఫ్లాట్ స్క్రీన్స్, సరౌండ్
సౌండ్స్, MP3, ఐ ప్యాడ్స్, కంప్యూటర్స్, బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్...
లేకున్నా అంతులేని ఆనందాన్ని పొందాం.
మన పిల్లలకు అవి తెలియదు మన పెద్దలకు ఇవి తెలియదు, కానీ మనం అవి ఇవి చూశాం
ఆ ఆనందం మరెన్నడూ తిరిగిరాదు.
--((***))--
సేకరణ రచయత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
కొన్ని భోజ కాళిదాస కథలలో మహాకవిని స్త్రీ లోలుడిగా చిత్రీకరించారు.కవిగా,లలిత శృంగార రస పోషణ లో ఆయన అందే వేసిన చెయ్యి కావటం వల్ల ఇలాంటి అపోహ కలిగిందా?లేక కాళీ వుపాసనతో పాటు కేళీ పిపాసకూడా ఆయన జీవితం లో భాగంగా చెప్తే ఈ కథలు మరీ ఆసక్తి కరంగా వుంటాయని యిది ఈ కథలకు జోడించబడిందా?లేక 'ఎంత వారలయినా కాంత దాసులే' అన్న లోకోక్తి ని కాళిదాసు కూడా పూర్తిగా అనువర్తించాడా?
చెప్పడం కష్టం.
ధారానగరం లో రమణీ మణి అనే రాజ నర్తకి వుండేది. ఆమె సౌందర్యానికి నాట్య ప్రతిభకీ దాసుడై రాజు ఆమెను తన ఉంపుడు కత్తెగా వుంచుకున్నాడు.ఆమెకు కాళిదాసు కవిత్వమంటే చాలా అభిమానం.ఆయనతోనూ ఆమెకు సంబంధాలుండేవి.ఈ రహస్యం ఆమె రాజుకు తెలియకుండా జాగ్రత్త పడింది.అయినా కొన్నాళ్ళకు రాజుకు అనుమానం వచ్చింది. ఆయన దాన్ని తెలుసుకునేందుకు ఒక ఉపాయం చేశాడురాజు ఆమె భవనానికి వచ్చినప్పుడు గోడ మీద శ్లోక పాదం వ్రాశాడు.
'కుసుమే కుసుమోత్పత్తి: శ్రూయతే న తు దృశ్యతే'
అర్థము:-ఒక పువ్వులో నుంచి మరో పువ్వు పుట్టటం వినటమే గానీ ఎక్కడా కనబడదు.
ఈ శ్లోకం పూర్తీ చేసిన వారికి అక్షర లక్షలు యిస్తానని భోజుడు రమణి తో చెప్పాడు.ఒక వేల కాళిదాసు ఇక్కడికి వచ్చినట్టయితే తప్పక పూర్తీ చేస్తాడు,అప్పుడు రహస్యం బట్ట బయలవుతుందని ఆయన ఉద్దేశ్యం.
ఇంత పెద్ద బహుమతి అంటే రమణికి ఆశ పుట్టింది.
ఈసారి కాళిదాసు వచ్చినప్పుడు ఆమె గోడమీది శ్లోక పాదం చూపించి నా కోసం దీనిని పూర్తీ చేయండి అని కోరింది.ఇదేమీ తెలియని కాళిదాసు చెప్తాను రాసుకో అని
'బాలే, తవ ముఖాంభోజే దృష్టం యిందీవర ద్వయం'
అర్థము:-- కానీ ఓ ముద్దరాలా యిప్పుడు నిన్ను చూడగా,నీ ముఖ మనే తామరపువ్వులో నీ కన్నులనే నీలి కలువలు పుట్టినట్టు కనిపిస్తున్నాయి సుమా!అన్నాడు మహా కవి.
అంత చక్కని పూరణ వినగానే రమణికి మతి పోయింది.ఈ పూరణ రాజుకు చూపిస్తే తనకు అక్షర లక్షలు ఖాయం.అనుకోని దురాశ తో కాళిదాసు నిద్రిస్తుండగా ఆయన తల నరికేసి శవాన్ని దాచేసింది.
రాజుగారు వ్రాసిన దానికిందే తన చేత్తో కాళిదాసు పూరణను కొంచెం మార్చి 'బాలే' అనే పదం కాక రాజును వుబ్బేద్దామని 'రాజే!'అని వ్రాసింది
కుసుమే కుసుమోత్పత్తి: శ్రూయతే న తు దృశ్యతే
రాజే,తవ ముఖాంభోజే దృష్టం యిందీవర ద్వయం
అర్థము:-- ఒక పువ్వులోనుంచి యింకొక పువ్వు పుట్టటం వినడమే గానీ ఎక్కడా కనబడదు.కానీ యిప్పుడు నిన్ను చూస్తె రాజా!నే ముఖమనే కమలం లో కన్నులనే నల్ల కలువల జంట కనబడుతున్నది.
రాజు రానే వచ్చాడు పూరణ చూసి ఎవరు పూరించారు?అని అడిగాడు యింకెవరు నేనే అని బొంకింది.
రాజు ఆమె చెంప చెళ్ళు మని పించాడు.దుర్మార్గురాలా నీ అబద్దం నమ్మటానికి నేను మూర్ఖుడ ననుకున్నావా?.ఇది కాళిదాసు పూరించినదని స్పష్టంగా తెలుస్తూంది.ఎటొచ్చీ నీ బుద్ధి హీనత వల్ల 'బాలే'అన్న మాటను మార్చి 'రాజే' అని వ్రాశావు.ఆ మాత్రం తో నేను బుట్టలో పడిపోతాననుకున్నావు.కానీ 'రాజన్'అనే సరయిన సంబోధనకు బదులు నీ సొంత తెలివి నుపయోగించి 'రాజే' అని తప్పు రాసి నీ దొంగ బుద్ధి ని నువ్వే ప్రకటించు కున్నావు.చెప్పు యింతకూ కాళిదాసు ఎక్కడ?అని నిలదీశాడు.
రమణి భయపడిపోయి తప్ప్పు ఒప్ప్పుకొని జరిగిన దంతా చెప్పింది.కాళిదాసు మరణించాడన్న వార్త రాజు నమ్మలేక పోయాడు.రమణి కాళిదాసు శవాన్ని చూపగానే రాజు మూర్ఛ పోయాడు.కాసేపటికి తేరుకొని తన యిష్ట దేవత భువనేశ్వరీ దేవిని ప్రార్థించాడు.నా జీవితం లో మిగిలి వున్న ఆయువు లో సగం ఈ కవీశ్వ రుడికి ధార పోస్తాను.ఈయనను బ్రతికించు తల్లీ అని ప్రార్థించాడు.దేవి కరుణతో కాళిదాసు లేచి వచ్చాడు.రాజా నీ ఆయువు లో సగం ధారపోసి నన్ను బ్రతికించావు.నా శేష జీవితం నీకే అంకితం చేసి నీ ఋణం తీర్చుకుంటాను ఏమి చెయ్యాలో ఆజ్ఞాపించు. అన్నాడు కవిరాజు.కవీశ్వరా నువ్వు లేకుండా నేను జీవించ లేను,జీవించినా అటువంటి నిస్సార మైన జీవితం నాకు వద్దు.మనం జంటగా ఒక కావ్య రాద్దాం
నీ పేరూ,నాపేరూ శాశ్వతంగా చరిత్ర లో నిలిచి పోతుంది.అన్నాడు రాజు.
తర్వాత యిద్దరూ కలిసి 'చంపూ రామాయణ కావ్యాన్ని ప్రారంభించారు.(చంపూ కావ్య మంటే శ్లోకాలూ,గద్యాలూ రెండింటి తో చెప్పబడ కావ్యం) సరళంగా సాగే ఈ చక్కని గ్రంథం 'భోజ చంపువు'గా ప్రచారం పొందింది.దీన్ని ఈనాటికీ సంస్కృత విద్యార్థులు తమ తొలి అధ్యయన గ్రంథాలలో ఒకటిగా చదువుకుంటారు. అయితే ఈ రామాయణం 'సుందరకాండ వరకే భోజ,కాళిదాసుల రచన.అక్కడిదాకా వ్రాసి యిద్దరూ ఒకే సారి మరణించారు. మిగిలిపోయిన యుద్ధ కాండను ఆ తర్వాత 16వ శతాబ్దం లో లక్ష్మణ సూరి అనే ఆంధ్ర దేశ పండితుడు పూర్తి చేశాడట..
సేకరించబడింది
ఆనందమె జీవిత మకరందం*
#రచన - #వేదార్థం జ్యోతి
--((***))-- అఖండ చైతన్య స్వరూపము
అందుకు జనకుడు తాను గ్రహించినది తన తండ్రి పల్కినది కాక వేరేదియు లేదనియు
''అఖండచైతన్య
స్వరూపము, అద్వితీయమైన పరమాత్మ స్వరూపము ఒక్కటే వున్నదని, తక్కిన వన్నియు
లేనివేనని, అజ్ఞాన సంస్కారములు నశించినచో వ్యక్తి ముక్తుడై స్వస్వరూపమును
పొందునని'' పల్కెను. చిన్న వయస్సులోనే శుకుడు భోగములను అనుభవించకుండగనే,
విరక్తిని ప్రకటించి, పూర్ణత్వమును సాధించి సర్వజ్ఞానమును పొంది,
వేదవ్యాసుని కంటే, గురువగు తన కంటే అధికుడవైనట్లు జనకుడు పల్కెను.
నీ మనోరధము సిద్దించినదని, నీవు పొందవలసినదంతయు పొందియెయుంటి, ముక్తుడవని
తెల్పెను. తదుపరి శుకుడు సంశయరహితుడై, నిష్కాముడై నిర్వికల్ప సమాధి యందు,
పదివేల ఏడ్లుండి, తైలహీన మగుదీపము వలె, ఆత్మ స్వరూపమున నిర్వాణమందెను. అని
విశ్వామిత్రుడు శుకుని చరిత్రను తెల్పెను.
శుకుని
వలె శ్రీరామచంద్రుడు తెలుసుకొనవలసినదంతయు తెలుసుకున్నాడని, శ్రీరాముడు
భోగములందు విరక్తుడైనాడని పల్కెను. కామక్రోధాదుల నెవడు జయించునో వాడే
ముక్తుడు. అయితే శ్రీరాముని చిత్త శాంతి కొరకు వశిష్ఠుడు అతనికి తత్వబోధన
చేయవలెనని పల్కెను.
తక్కిన ఋషి పుంగవులు విశ్వామిత్రునితో ఏకీభవించిరి.
శ్రీ
వశిష్ఠులు విశ్వామిత్రుని వచనములను తలదాల్చి శ్రీరామునికి అఖండ
ఆత్మజ్ఞానమును బోధించుటకు ఉద్యుక్తుడయ్యెను. కాని శ్రీరాముడు మోక్ష
శాస్త్రమును బోధించుటకు ముందు తన సందేహమును తీర్చవలయునని ఇట్లు పల్కెను.
శుకుని తండ్రియైన వ్యాసమహర్షి సర్వజ్ఞుడైనను విదేహముక్తిని పొందలేదు. అతని
కుమారుడైన శుకుడు ఏల నిర్వాణముక్తిని పొందగల్గెను. అందుకు వశిష్ఠుడు ఇట్లు
పల్కెను. పరమాత్ముని చైతన్య శక్తి యందు లేచి, మరల లీనమగు
బ్రహ్మండత్రసరేణువులు అసంఖ్యాకములు, త్రిభువన మండలములు కూడ అసంఖ్యాకములు.
అలాంటి జగద్రేణువులను జీవన్ముక్త పురుషులైన శుకుని వంటవారు నమ్మరు. అందువలన
వీరు విదేహముక్తులుగ పిలువబడతారు. అందుకు శ్రీరాముడు తృప్తి చెంది, తాను
అఖండ బ్రహ్మత్వమును గ్రహించితినని తెల్పెను.
-((*))--
అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు నవంబర్19.2019.Dcm🙏
నువ్వు అలిగితే.. ఆడపిల్లవా. .అని హేళన నువ్వు ఏడిస్తే..ఏడ్చేవాడిని
నమ్మొద్దని హేళన..
సరదాగా బయటతిరిగితే.. తిరుగుబోతు అని బిరుదు బాధ మరిచిపోవడానికి తాగితే...
తాగుబోతు అని బిరుదు అమ్మ చెప్పినట్లు వింటే అమ్మ చాటు కొడుకు అని
భార్య చెప్పినట్లు వింటే పెళ్ళాం చాటు మొగుడని చెల్లె, అక్క,బావ ,బాబాయ్, మాట వింటే చేతకాని చవట అని దోస్తులతో బయట తిరిగితే జులాయి అని
ఎక్కువ మాట్లాడితే పోకిరి అని తక్కువ మాట్లాడితే నల్లికుట్లోడు అని ...
నీవు ఏమి చేసినా, ఎలా ఉన్నా తప్పు పట్టే లోకంలో.
ఇంటా-బయట అన్ని రకాల బాధలు భరిస్తూనే,అవమానాలు సహిస్తూనే..బాధ్యతలు మోస్తూనే..
కొడుకు గా,తండ్రిగా,భర్తగా,సోదరుడిగా, మేనమామగా, అల్లుడిగా, ప్రేమికుడిగా, స్నేహితుడిగా నిరంతరం ప్రేమ ను పంచుతూ..అనునిత్యం త్యాగాలు చేస్తూ... నే ఉన్న.. ఓ.."మగ"ధీరుల్లారా..
విధి వంచిత,ప్రియురాలు-భార్యాభాధిత, జనబాధిత,అప్పుబాధిత...మొ'
..
శోకా..తప్త హృదయుల్లారా
బాధా సర్పదష్టుల్లారా..
ఏ బాధాలేకుండా ఉంటున్న మహర్జాతకుల్లారా.. (కొందరు)
బాధనిపిస్తే మనసారా ఏడ్వలేని నిస్సహాయ పురుషుల్లారా...
బ్రతుకు సమరం లో చితికిపోయిన అభినవ గరళకంఠుల్లారా..
జీవితంలో సమస్యలతో కుస్తీ పడుతున్న మల్లయోధుల్లారా..
కుటుంబం కోసం గస్తీ కాస్తున్నా ఇంటి సైనికుల్లారా..
కుటుంబ శ్రేయస్సు కోసం కష్టపడుతున్న జీతంలేని నిరంతర శ్రామికుల్లారా..
వచ్చింది.. నీ కోసం ఓ రోజు నీకూ. కేటాయించారు..ఓ రోజు ....ఈ రోజైనా..
....అన్నీ.. మరిచి... నీ.. కోసం.. నీవు. కాసేపైనా.. సమయాన్ని కేటాయించుకొని
సంతోషంగా గడుపుతావని.. ఆశిస్తూ... అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు... HAPPY MEN'S DAY-2019
సర్వే జన సుఖినోభవంతు..
****************************
నేటి నా పాట పాట సంఖ్య:-596
*****************************
రచన:- మహేష్ వూటుకూరి ✍️
**************
.పాట సందర్భంపై నా విశ్లేషణ.:-
****************************
ఆమె నవ రత్నాలలో వజ్రమంత విలువైనదైనా
మనసు మాత్రం వెన్నెలంత చల్లనిది మంచి మాత్రమే తెలిసిన ఆరుదైన వ్యక్తిత్వం చిన్న పెద్ద వేరు భావం లేని
స్వచ్ఛమైన మనసు కలది నిర్మలత్వం మూర్తీభవించిన స్వచ్ఛ మైన మనిషి తను. నిజాయితీ వ్యక్తి ని ప్రేమించి
ఆ ప్రేమ ను పొందు క్రమంలో మనసులు మద్యన జరిగే ప్రేమ భావం పొంగి పాటగా ఇలా పాడుతున్న అపురూప దృశ్యం.
******************************************
పల్లవి:-
**********
అందమా చందనమే పూయనా
చిక్కనైనా స్వచ్చమైన చందనమా చిరునవ్వై చేరుమా
ఒక్క సారి నా వంక చూడుమా
నెలవంకనై నీ శిగలో మల్లెపువ్వలా నిలిచిపోతాను సుమా...
చక్కనైనా అందమా చందనమే పూయనా
చరణం:-
*******
నింగి నుంచి జాలువారిన వెన్నెల రూపమా
వంగి వంగి మల్లెతీగ దారి ఇచ్చిన అపురూపమా
తొంగి చూసిన మనసును మన్నించిన వినయమా
గంగి గోవు జాతి కడుపున పుట్టిన నవ రత్నమా!!
హే... హే... హే... హా ...హా... హా....
ఏ క్షణం నిను చూసానో సుభిక్షం అయినది చిత్తం
ఏ కారణంతో కలిపెనో దైవం వశమైనది సంతోషం
ఏమైనా నీతో పయనం జన్మజన్మల అదృష్టం
అందుకే ఇలా నీ ఒడిలో పవళించడం నా భాగ్యం.!!
పల్లవి:-
********
చక్కనైనా అందమా చందనమే పూయనా..!
చరణం:-
*********
సంప్రదాయం నిన్ను చూసే మురీసిపోతుందీ
సంస్కృతి నిన్ను చేరి చేతిలో చేయి వేసింది
నాగరికత నడవడికగా నీ చెంత చేరి చిద్విలాసంగా
తన్ను తాను దర్పణంలో చూసుకోని పరవశించింది.!!
వన దేవతలే నవ వసంతం పల్లవిలో కోకీలనే
నవ రాగం పాడించగా
ఇంతకంటే ఆనందం ఇంకే ముంటందని ప్రకృతి
హరివిల్లు నే పిలిచి ఆతిథ్యం ఇవ్వగా
నింగి నేలా దూరాలు మరచి ఒక్కటై చిందు లేసేనుగా..
పల్లవి:-
చక్కనైనా అందమా చందనమే పూయనా..
***************************************
Comments
Post a Comment