అన్యథా వేదపాండిత్యం శాస్త్రమాచారమన్యథా।
అన్యథా వదతః శాంతాన్
లోకాః క్లిశ్యంతి చాన్యథా।।
ఈ శ్లోకంలో ఆచార్య చాణక్యుడు వేదాలలోని తత్వజ్ఞానాన్ని, శాస్త్రాలలో చెప్పబడిన విధానాలను, సమాచారాలను, మహాత్ములు చరిత్రలను మిధ్య అని కొట్టిపారవేసే వ్యక్తి, ఈ లోకంలోను, పరలోకం లోనూ చాలా కష్టాలననుభవిస్తాడు, అని తెలియజేసేరు.
..........
𝕝𝕝 *శ్లో* 𝕝𝕝
*అభ్రచ్ఛాయా ఖలప్రీతిః* *సిద్ధమన్నఞ్చ యోషితః*।
*కిఞ్చిత్కాలోపభోగ్యాని* *యౌవనాని ధనాని చ॥*
తా𝕝𝕝 " *మేఘముల నీడ, దుర్జనులతోడి మైత్రి, వండిన అన్నం, స్త్రీలు, యౌవనం, ధనం - ఇవన్నీ స్వల్పకాల భోగ్యాలు... స్థిరముగా ఉండవు*...
సుభాషితం - 437
---------------
🌺ద్వే వరత్మనీ గిరో దేవ్యా శాస్త్రం చ కవికర్మ చ ౹
ప్రజ్ఞోపజ్ఞం తాయోరాద్యం ప్రతిభోద్భవ మంతిమమ్ ౹౹🌺
వాగ్దేవిని పొందే మార్గాలు రెండు రీతుల్లో ఉన్నాయి.మొదటిది శాస్త్రం,మరొకటి కావ్యం.మొదటిది బుద్ధి సామర్థ్యంతో పుట్టేది.ఇంకోటి ప్రతిభతో లభించేది.
🌺✍🏼ప్రభ,
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను ..... సీతమ్మా .....
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను ..... సీతమ్మా .....సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను ..... సీతమ్మా
సందేహించకుమమ్మా .....
ఒకే బాణము ఒకటే మాట ..... ఒక్క భామకే రాముని ప్రేమ .....
ఒకే బాణము ఒకటే మాట ..... ఒక్క భామకే రాముని ప్రేమ
మిన్నే విరిగిపడినా .....
మిన్నే విరిగిపడినా వ్రతభంగమ్ము కానీడమ్మా
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా .....
సందేహించకుమమ్మా .....
రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు .....
రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు
నాదు జపము తపము నా కావ్యమ్మె వృథయగునమ్మా .....
నాదు జపము తపము నా కావ్యమ్మె వృథయగునమ్మా
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను ..... సీతమ్మా .....

ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ
*అ* క్కడెక్కడో పుట్టి ఎటు పోవాలో తెలియక
*ఆ* పదలో పడేసి తెలియని దానిలా అలక
*ఇ* టలీకి వెళ్లి దేశాలు తన మార్గాలుగా చక
*ఈ* జిప్టుకు పాకింది చాపక్రింద నీరుగా చకచక
*ఉ* ధృతంగా పెరిగి ఉద్యోగ నిరుద్యోగ పాకి
*ఊ* చకోత కోతగా అవకాశమివ్వక చకచక
*ఋ* క్కులకే లొంగని చద్విన తెల్సుకోలేక
*ఎ* ప్పుడు వస్తానో చెప్పక పెంచు భయమిక
*ఏ* డిపించుకుతిని ప్రాణాలతో చెడుగుడు ఇక
*ఐ* శ్వర్యానికి లొంగని ధనిక బీద భావము లేదిక
*ఒ* క్కోదేశానికి ఓరుసగా చుట్టతున్నది ఇక
*ఓ* డలు విమానాలను ఆదేశించింది ఇక
*ఔ* షధాలే లేవని ఇష్టారాజ్యంగా చక చక
*అం* దరికీ వ్యాపిస్తా నన్ను పట్టుకోలేరు ఇక
*అః* కఃనః అన్నట్లుంది. అర్థం కానట్టు బతుక
*క* రోనా తన పేరంటేనే దడ అందరికిక
*ఖ* నిత్రం (గునపం) లా దిగుతోందిక
*గ* రిష్ఠంగా పెరుగుతోంది తప్పఁదిక
*ఘ* నుడుసామాన్యుడని చూడనందిక
*ఙ* వలే తెలియనంటున్నది ఏమనక
*చ* టుక్కున అంటుతో బంకయిందిఇక
*ఛ* రఖాలా తిరుగి అడ్డులేదన్నది ఇక
*జ* బ్బుల్లో గుర్తించని పెద్దదాన్ని నిక
*ఝం* డా ఎగరేస్థా అంటుంది ఇక
*ఞ*! ఆ! యా! అని వెక్కిరిస్తోందిక
*ట* క్కుడెక్కులు చూపిస్తోందిక
*ఠ* క్కున అంటుకుంటుంది ఇక
*డ* బ్బులకు లొంగ నంటుంది ఇక
*ఢ* మరుక నాదంలా వ్యాపిస్తానంటుందిక
*ణ* లా బుద్ది అనేది లేని వంకరదిక
*త* నకు ఎదురు లేదంటోంది క
*ద* య్యంలా పీడిస్థానటుంది ఇక
*ధ* ర్మం న్యాయం తనకు లేవంటుందిక
*న* లుగురు కలిస్తే ఓర్వలేక పోతోందిక
*ప* రుగులు పెట్టిస్తోంది అందర్నీ ఇక
*ఫ* లితం అనేది ఏమీ ఉండదిక
*బ* డులు గుడులు తెరిస్తే చక చక
*భ* యాన్ని ఇంకా పెంచుతోందిక
*మ* రణమృదంగం మోగిస్తోందిక
*య* ముని దగ్గరకు పంపిస్తోందిక
*ర* క్కసి లా అందరిలో దురిస్తుందిక
*ల* క్షలు, కోట్లమందిని కబలిస్తోందిక
*వ* రదలా ఊపిరాడకుండా చేస్తుందిక
*శ* నిలా దాపురించి పీక్కుతింటుంది ఇక
*ష* ట్కాలాల్లో కూడా తానుంటానందిక
*స* బ్బు తో చేయి కడిగేస్తే భయమంటుందిక
*హ* రించుటే గుణం అన్నా ఇంట్లో రాదిక
*ళ* ఇలా అంటూ ఇంట్లో ఉంటే రాదిక
*క్ష* మించడం డిక్షనరీ లో ఉంది ఇక
*ఱంపము* లా కోస్తుందని భయము లేదిక
*పరిసుబ్ర మాస్కుతో ఇంట్లో *ఉంటే రాదిక
సర్వే జానా సుఖినోభవంతు
ఓం శాంతి: శాంతి: శాంతి:
--(())
--(())--

ప్రాంజలి ప్రభ పద్య పుష్పాలు
మనసు దోచేటి నయనాల లలన పలుకు
తనువు చూపే టి వయసాయె చిలక చిలుకు
చినుకు పడ్డ కాంతి వెలుగు కలల మొలక
వణుకు పుట్టించి చూపకు బిడియ కులుకు
ఉదయ తొందర వద్దులె మినుకు మినుకు
హృదయ స్పందన చెప్పకు థళుకు థళుకు
యదను చూపియు ఆశగ వెదకు వెదకు
పదపదా అని ఆటకు ఉడుకు ఉడుకు
అరచి ఆర్భాట మెందుకు చిన్కు చిన్కు
వెరసి తొందర చేయకు కుల్కు కుల్కు
మరచి వాగుట దేనికి దక్కు దక్కు
కరచె చూపులు ఎందుకు హక్కు హక్కు
గొడవ చేసియు ఉండకు దిక్కు దిక్కు
మడమ తిప్పియు వాగుట చిక్కు చిక్కు
పడక ఇష్టము తెల్పుట హక్కు హక్కు
నడక వద్దని ముద్దుయె కిక్కు కిక్కు
ధనము కాదు ఆరోగ్యం ముఖ్యం
ధనము మెదడుకు మేతగా మారు చుండు
ధనము ఆరోగ్య సౌఖ్యము ఇవ్వు లేదు
ధనము మానసికముగను శాంతి లేదు
ధనము కామము క్రోధము పెంచు చుండు
--(())--

న్యస్తాక్షరి........పురాణ..15=03=2023
రా... మా... య... ణం. పద్య పాదాది న రావాలి
రాత్రి పగలు వంతు కథలు రాశి కెక్కి
మాయ మనుషుల గూర్చియు మరల తెల్పి
యశము విషయ వాంచ 😂లుతెల్పి ఎతుల గతి ఋ
ణమ్ము సేవల పరముగా నయన విందు
.....
.ఆ. రామ బాణ మదియు రాత్రి పగలు తీర్గు
మా మనస్సు కథల మాట ఇదియు
యతులు గతులు మతులు ఏమేమి యన్న క
ణం రుణమగు పలుకు నయన మందు
.......మల్లాప్రగడ రామకృష్ణ
🙏
న్యస్తాక్షరి........ ఆటవెలది :
రామ రామ యనగ రాడేల రాముడే!
మాకు మారు దిక్కు మరియు నతడె
యనగ చేరు మమును!అమ్మహా రామాయ
ణమ్మునున్నిలుపను మదిని హృదిని!!
పద్య పాదాది న రావాలి
--జోషి మధుసూదన శర్మ 🙏
🈯🈯🈯🈯🈯🈯🈯🈯
సమస్యా పూరణ: న్యస్తాక్షరి *మ య బ్ర హ్మ*
ఆ.వె.
*మం* చివానికెపుడు మరియాద మెండుగ,
*య* డుగకుండ దొరుకు యవని లోన,
*బ్ర* తుకు సార్థకమగు పరులకు, యపర బ్ర
*హ్మ* స్వరూపులంచు, యడిమె జేయ
**†**†**
యడిమె: సేవ
.......
సమస్యా పూరణ: *న్యస్తాక్షరి* *రామాయణం*
*********
తేటగీతి:
*రా* ముడేగె కోరినదని, రమణి సీత,
*మా* య లేడిని కాన్కగ, జాయ కొసగ,
*యం* త రావణుడేతెంచి యదె సరి తరు
*ణం* బ ని కుజనపహరించె నాశ్రమమున
***********
కుజ = సీత
జాయ= భార్య
.........
----
" తేటగీతి..
--
* రా * మునికిసాటి పురుషుఁడు రాజుగాను
* మా * కనులకగుపడఁడయ్య మాన్యజనుఁడ
* య * శముకలుఁగునుకదమైథిలీశునిరమ
* ణ *మ్మునిచ్చుగాధఁదెలియ నాశమేది ??? "
----అప్పాజీ
.......
మ.రామ నామము నిత్యసత్యము రమ్యమైనది లోకమై
మా మదీయ విధాన నిర్ణయ మాన సమ్ము మనోమయమ్
యమ్మహా మయ సర్వ రక్షణ యోగ్య రామము రమ్యతే
ణమ్ము హృధ్యము దివ్యధామము మోక్ష నామము దివ్యమే
........
"నేను" అనేది నాలుగు తత్త్వాలుగా ప్రస్ఫుటమవుతోంది.
అవే -- మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు.
* సంకల్ప వికల్పాలు చేసేటప్పుడు 'మనస్సు'గా
* నిత్యానిత్యాలను, మంచి చెడులను చెప్పేటప్పుడు 'బుద్ధి'గా
* నిరంతర చింతన చేసేటప్పుడు 'చిత్తం'గా
* నేను, నాది అనేటప్పుడు 'అహంకారం'గా
*- ఆత్మ పదార్ధం ప్రస్ఫుటమవుతోంది.
.......
*మనస్సుని శుద్ధి చేయవలెనంటే 'కర్మయోగం'
* బుద్ధిని సునిశితం చేయవలెనంటే 'జ్ఞానయోగం'
* చిత్త వృత్తులను నిరోధించవలెనంటే 'రాజయోగం'
* అహంకారాన్ని అంటే నేను, నాది అనే భావాలను పూర్తిగా తుడిచిపెట్టుకు పోవాలంటే 'భక్తియోగమే' మార్గము.
.......
*శాశ్వతమైన దాని కోసం క్షణికమైన వాటిని త్యజించండి. అనంతమైన ఆనందాన్ని పొందాలంటే అల్పసుఖాలను వదిలివేయండి.
.......
నారద బ్రహ్మ సూత్రాలు..2.

Comments
Post a Comment