ప్రాంజలి ప్రభ...29/03

ప్రాంజలి ప్రభ . అంర్జాల పత్రిక . ఆరోగ్య సూత్రాలు (1)
సేకరణ / రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఆధునిక కాలంలో అందరికీ వెంట్రుకల సమస్యలు ఎందుకు వస్తున్నాయి??
ఒకప్పుడు కేశ సౌందర్యంలో మన భారత స్త్రీ మరియూ పురుషులు ప్రథమస్థానంలో ఉండేవారు. కానీ కాలం మారిన తరువాత జీవనశైలి మారింది. క్రమంగా స్వదేశంలో విదేశీ రసాయన పదార్థాల వాడకం ఎక్కువ అయింది. ఒకప్పుడు కుంకుడుకాయ, శీకాయ, మంగకాయ, చీకిరేణి పొడి, నల్ల రేగడి మన్ను, నల్లని చింతపండు గుజ్జుతో తల స్నానం చేసే పద్ధతులను అనుసరించిన భారతీయులు క్రమ క్రమంగా విదేశీ షాంపూలు, సబ్బుల వాడకానికి బాగా అలవాటు పడ్డారు. వెంట్రుకలకు బలం కలిగించే ఆహారం తీసుకోవడం పూర్తిగా పక్కన పడేశారు. ఫలితంగా అతి చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం, బట్టతలలు, ఉన్న జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి కోసం మేము కొన్ని నియమాలను క్రింద ఇవ్వడం జరిగింది. ఆచరించి మీ కేశాలను ఆరోగ్యంగా చూసుకోగలరని మనవి. (1970 జ్వాలా హెయిర్ ఆయిల్ తయారు చేసారు మానాన్నగారు j
డాక్టర్ మల్లాప్రగడ లక్ష్మణ రావు గారు, ఆర్ ఎమ్ పి.గుంటూరు ..)
✍️వెంట్రుకల ఆరోగ్యానికి ఏ ఆహారపదార్థాలు తీసుకోవాలి.
👉వంటల్లో మేలురకమైన నువ్వులనూనెని వాడాలి.
👉నల్ల నువ్వులు, ఎండు కొబ్బరి, నల్ల బెల్లము, త్రిఫల రసాయణము కలిపి స్వీట్ లాగా తయారు చేసిన 'కేశామృతం' రెండు పూటలా ఒక చెంచా మోతాడుతో తినాలి.
👉వారనికి ఒకటి లేదా రెండు సార్లు గుంట గలగర ఆకుతో పచ్చడి చేసి తినాలి.
👉మెంతికూర, వెల్లుల్లి, సునాముఖి, నేల తంగేడు, పాలకూర మొదలైనవి బాగా తినాలి.
✍️ఇంట్లో తయారు చేసుకునే ఆయుర్వేద షాంపూ:
కొత్త కుంకుదుకాయల పై పెచ్చుల పొడి 100గ్రా, శీకాయల పొడి 100గ్రా, ఉసిరికాయల పొడి 100గ్రా, మారేడు పండు గుజ్జు పొడి 100గ్రా, వీటిని అన్ని కలిపి నిలువ ఉంచుకోవాలి.
✍️వాడే విధానం:
👉ఒక పెద్ద గ్లాసు వేడి నీటిలో మగవారికి మూడు చెంచాల పొడి, ఆడవారికి అయితే ఆరు చెంచాల పొడి వేసి అందులో ఒక నిమ్మపండు రసం పిండి మూత పెట్టి మూడు గంటలపాటు నిలువ పెట్టి ఆ తరువాత ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తలకు పట్టిస్తూ స్నానం చేయాలి.
👉వారానికి ఒకసారి లేదా రెండు సార్లు ఇలా చేస్తూ ఉంటే పై పదార్థాల జీవగుణం కేశ మూలముల లోకి చొచ్చుకుని పోయి వెంట్రుకల కుదుళ్లను గట్టిపరుస్తుంది.
👉అంతేకాక తలలో కురుపులు, చుండ్రు, పుండ్లు, దురద మొదలైన సమస్యలను నివారిస్తుంది.
👉వెంట్రుకలకు చక్కటి నునుపు, మెరువు, నిగారింపు, దృఢత్వము ఇచ్చి ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
✍️లిక్విడ్ హెర్బల్ షాంపూ:
👉కుంకుడుకాయల పొడి, గుంటగలగర ఆకు, నిమ్మకాయ చెక్కలు, టీ పొడి, సంబరేణి ఆకులు అన్ని కలిపి ఒక గ్లాసు వేడి నీళ్లలో వేసి బాగా గిలకొట్టి వడగట్టి ఆ నీటిని షాంపూగా వాడుకోవచ్చు.
✍️తెల్ల వెంట్రుకలు లేకుండా నల్ల వెంట్రుకలు రావడానికి:
👉కరక్కాయ, ఉసిరికాయ, తాడికాయ, లోహ చూర్ణం ఇవన్నీ సమ భాగాలుగా తీసుకొని నీటితో కలిపి రసంగా చేయాలి.
👉ఆ రసానికి సమ తుకంగా నల్ల నువ్వుల నూనె కలపాలి.
👉తరువాత ఆ రసం మరియూ ఆ నూనె ఎంత తూకం ఉందో అంతే తూకంతో పచ్చి గుంటగలగరాకు రసంతో కలిపి బాగా తిప్పాలి.
👉ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక మట్టి పాత్రలో పోసి కట్టెల పొయ్యి మీద సన్నటి మంట మీద మరిగించాలి.
👉క్రమంగా కుండలో ఉన్న నీరు అంతా ఇంకిపోయి ఆయిల్ మాత్రమే మిగులుతుంది.
👉ఆ నూనెని దించి వడపోసి వచ్చిన ఆయిల్ ని కుండలో పోసి పైన మూత పెట్టి బంకమట్టితో మెంతి బంధనం వేసి అది ఆరిన తర్వాత ఒక గుంత తవ్వి అందులో ఈ కుండను నెలరోజుల పాటు పాతి పెట్టాలి.
👉ఆ తరువాత ఆ ఆయిల్ ని తలకు బాగా పట్టించి మర్దనా చేయాలి. మూడు గంటల తర్వాత త్రిఫల కషాయం తో తలంటుకుని స్నానం చేయాలి.
👉ఇలా చేస్తూ ఉంటే క్రమంగా తెల్ల వెంట్రుకలు నల్లబడి, నల్ల వెంట్రుకలు మళ్ళీ తెల్లబడకుండా నల్లగా నిగనిగలాడుతాయి.
✍️కేశ సౌందర్య తైలం:
👉మల్లెపూలు 25 గ్రా, మరువము 25 గ్రా, దవనము 25 గ్రా, మాచిపత్రి 25 గ్రా, గుంటగలగర సమూలం 50 గ్రా, గాడిదగడపాకు సమూలం 50 గ్రా, చందనం 10 గ్రా ఇవన్నీ కలిపి మెత్తగా నూరి దానికి 300 గ్రా నువ్వులనూనెని కలిపి కట్టెలపొయ్యి మీద సన్న మంటతో గంట గంటన్నర సేపు మరిగించాలి.
👉ఈ మిశ్రమం చల్లారిన తర్వాత వస్త్రంతో వడగట్టాలి.
👉ఈ ఆయిల్ ని తలకి పట్టిస్తూ ఉంటే కేశాలు చాలా ఒత్తుగా అందంగా ఉంటాయి. ఏ ఆయిల్ ని శరీరానికి కి పట్టిస్తే శరీర దుర్గంధం పోయి మంచిగా ఉంటుంది.
🙏ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి. మీ స్నేహాన్ని పెంచుకోండి
కేశ అలంకరణే అందానికి మొదటి మెట్టు .. మరిస్తే వస్తుంది తిట్టు
--(())--
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
* సూర్యని మంత్రం
* జామకాయ
వంటగదే ఒక ఔషధ నిలయం.
👉మాములుగా వచ్చే జలుబూ జ్వరాల నుండి తీవ్రంగా వుండే ఆస్తమా, మధుమేహం వరకూ కూడా మన వంటిట్లో ఉన్న వస్తువులతో తగ్గించుకోవచ్చు. మరీ తీవ్రంగా ఉంటే డాక్టర్ వద్దకు వెళ్ళాలి.
1). పసుపు:
👉పసుపుని పై పూతగా మరియూ లోపలికి కూడా తీసుకుంటారు.
👉నీళ్లతో కలిపి పాదాలకు పూయడం వలన ఫంగస్ వ్యాధులు, గజ్జి మరియూ ఇతర బాక్టీరియా వ్యాధులు తగ్గిపోతాయి. కాళ్ళ పగుళ్లు కూడా రాకుండా ఉంటాయి.
👉పసుపుని కొద్దిగా నూనెతో కలిపి కాలి వేళ్ళ మధ్య పూస్తే నీళ్లలో నానడం ద్వారా వచ్చే ఎలర్జీ తగ్గి పాదాలకి అందం కూడా వస్తుంది.
👉ముఖానికి పూస్తే నల్ల మచ్చలు, మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి.
👉పసుపులో బెల్లం కలిపి తింటే కడుపులో మంట, అల్సర్లు తగ్గుతాయి.
👉పసుపు పూయడం వల్ల శరీరం మీద వచ్చే ఎర్రని దద్దుర్లు (rashes) తగ్గుతాయి.
👉 బాలింతలకు ఇస్తే పాలు బాగా పడుతాయి.
👉వేడి పాలలో ఒక గ్రాము పసుపు కలిపి ఇస్తే జలుబు, దగ్గు, తగ్గిపోతాయి.
👉5 గ్రాముల పసుపు, 5 గ్రాముల ఉసిరి పొడి కలిపి ఉదయం పరకడుపున తీసుకుంటే మధుమేహం క్రమేనా తగ్గుతుంది.
👉పసుపు నిత్యం తీసుకునే వారిలో జీర్ణవ్యవస్ధ కి సంబంధించిన క్యాన్సర్ లు రాకుండా ఉంటాయి.
👉అప్పుడే తగిలిన గాయాల మీద పసుపు వేస్తే చీము పట్టకుండా తొందరగా మానిపోతాయి.
👉పసుపు కేవలం ఒక ఔషదమే కాక గొప్ప సౌందర్య పోషకం కూడా.
2).ధనియాలు:
👉కాచి చల్లార్చిన నీటిలో నాలుగో వంతు దంచిన పచ్చి దనియాలను రెండు గంటల పాటు నానబెట్టి అందులో చక్కెర కలిపి ఆ నీటిని త్రాగితే జ్వరం వెంటనే తగ్గుతుంది.
👉దప్పిక, మంట పూర్తిగా పోతుంది. చెమట బాగా పడుతుంది.
👉పారాసిటమోల్ టాబ్లెట్ కంటే చాలా త్వరగా పని చేస్తుంది.
👉కళ్ళ కలకలకు ఈ నీటిని వడగట్టి కళ్ళలో వేస్తే దురద, మంట మరియు ఎరుపు రంగు తగ్గిపోతాయి.
👉పచ్చి దనియాలను నూరి కడితే ఎలాంటి తలనొప్పి అయినా తగ్గిపోతుంది.
👉మూలవ్యాధి లో, చక్కెర కలిపిన పొడి లేక ధనియాల నీళ్లను ఇస్తే దురద, రక్తస్రావం తగ్గిపోతాయి.
👉మోతాదు: 5 నుండి 10 గ్రా పొడి కి 50 నుండి 100 మి లీ నీరు కలపాలి.
3). సోంపు:
👉సోంపు ని దంచి నీళ్లలో ఒక గంట నానబెట్టి ఆ తరవాత ఆ నీళ్ళని బాగా కలబెట్టి తాగితే కడుపు నొప్పి, గస్ట్రీక్ సమస్య తగ్గుతుంది.
👉
👉విరేచనం సాఫీగా అవుతుంది.
👉నులిపురుగులు కూడా పడి పోతాయి.
👉కఫం అడ్డగించి ఆయాసపడే వ్యక్తులకు ఇది వెంటనే శ్వాశ నాళాలను తెరిపించి శ్వాశ బాగా ఆడేటట్లు చేస్తుంది.
👉అతిసార వ్యాధి ఉన్నవారికి మెంతుల పొడితో కలిపి ఈ పొడిని ఇవ్వవచ్చు.
👉సోంపుకి కొన్ని నీళ్ళు కలిపి నూరి మెత్తని పేస్టులా చేసి ఎముకల నొప్పి ఎక్కడ ఉందో అక్కడ పట్టిస్తే ఎముకల నొప్పి తగ్గుతుంది.
👉మూత్రంలో వచ్చే మంటకు సోంపు చాలా బాగా పని చేస్తుంది.
3). అల్లం మరియూ శొంఠి:
👉అజీర్ణ వ్యాధితో బాధపడేవారు భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను ఒక ఉప్పురయితో కలిపి నమిలి తింటే ఆకలి పెరుగుతుంది.
👉నాలుక, కంఠం శుభ్రపడి రుచి బాగా తెలుస్తుంది.
👉తేనెతో కలిపి అల్లం రసం తాగితే దగ్గు, ఆయాసం తగ్గుతాయి.
👉నీరుల్లితో కలిపి అల్లం రసం తీసుకుంటే వాంతులు ఆగిపోతాయి.
👉ప్రయాణాల్లో వాంతులు వచ్చేవారు రెండు స్ఫూన్ల అల్లం రసం కానీ లేక ఒక స్పూన్ శొంఠి పొడి కానీ తీసుకుంటే 12గంటల వరకు వాంతులు రావు.
👉అమీబియాసిస్ వ్యాధికి శొంఠి చాలా మంచిది.
👉కీళ్ల నొప్పులకు శొంఠి పొడి రోజూ తీసుకుంటే వాపు తగ్గి కీళ్లు బాగా వంగుతాయు.
4). జీలకర్ర:
👉జీలకర్ర వాడటం వలన జీర్ణాశయంలో వచ్చే అల్సర్లు తగ్గుతాయి.
👉లివర్ పనిచేయడం మెరుగుపడుతుంది.
👉నెలల తరబడి బాధించే రక్త విరేచనాలు పూర్తిగా తగ్గిపోతాయి.
👉అతిసారంతో బాధపడే వారికి మజ్జిగ లేక పెరుగుతో కలిపి ఇస్తే గంటలో తగ్గిపోతాయి. మూత్రం కూడా సాఫీగా వస్తుంది.
👉బాలింతలకు పాలు బాగా పడుతాయి.
👉మూలవ్యాధితో ఉన్నవారికి రక్తస్రావం తగ్గుతుంది.
👉నిద్ర బాగా వస్తుంది.
👉శరీరంలో ఏ కండరము నొప్పి అయినా సరే కొన్ని గంటల్లో తగ్గిస్తుంది.
5). లవంగాలు:
👉ఇవి పళ్ళకి, కంఠానికి సంబంధించిన వ్యాధులలో చాలా బాగా పని చేస్తుంది.
👉చిగుళ్ల నుండి రక్తం కారే వారు ఒక లవంగం బుగ్గన పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే చిగుళ్ళు గట్టిపడుతాయి.
👉నోటి దుర్వాసన దూరం అవుతుంది.
👉పిప్పి పన్ను మొదటి దశలో లవంగాన్ని మెత్తటి పొడి చేసి పన్ను భాగంలో నింపి ఒక గంటసేపు అలాగే ఉంచగలిగితే వెంటనే పోటు తగ్గి దంతక్షయం కలుగకుండా ఉంటుంది.
👉వేడి నీళ్లలో నాలుగు లవంగాలు వేసి ఆ నీళ్లను ఒక్కో స్పూన్ తాగుతూ ఉంటే కలరా,అతిసారం వంటి వ్యాధుల కారణంగా వచ్చే దప్పిక తగ్గుతుంది.
👉అజీర్ణం, కడుపులో గ్యాస్ చేరడం వంటి సమస్యలకు లవంగాలు చూర్ణం (500mg) 10 నిమిషాలలో ఫలితం చూపుతుంది.
6). ఏలకులు:
👉అతిసారం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా లేని వారికి ఒక గ్లాస్ పాలలో రెండు గ్రాముల యాలకుల పొడిని కలిపి ఇస్తే బలం చేకూరుతుంది.
👉యాలకుల కి కిడ్నీల మీద పని చేసే ప్రభావం కలిగి ఉంటుంది.
👉ప్రతిరోజూ యాలకుల పొడిని తీసుకుంటే మూత్రం అధికంగా వచ్చి మూత్రంలో రాళ్లు పోతాయి.
👉గుండె దడ వచ్చే వ్యక్తుల్లో యాలకుల పొడి వలన గుండె దడ తగ్గుతుంది.
👉మాటమాటకి తల తిరిగే వ్యక్తులకు యాలకులను చక్కెర పొడి మరియూ నేతితో కలిపి తీసుకోవడం ద్వారా ఈ సమస్య పోతుంది.
8). దాల్చిని చెక్క:
👉ఇది పళ్లకు, చిగుళ్ల కు సంబంధించిన సమస్యలకు బాగా పని చేస్తుంది.
👉దీని వలన ఆహారం జీర్ణం బాగా అవుతుంది.
👉తినే ఆహారంలో దాల్చిని చెక్క చేర్చడం వల్ల కాన్సర్, అల్సర్లు రాకుండా ఉంటాయి.
👉టైఫాయిడ్ జ్వరం ఉన్నపుడు ఈ పొడిని వేడి నీళ్లలో కాసేపు ఉంచి ఆ నీటిని వేడి చేసి ఇస్తే జ్వరం తగ్గుతుంది.
👉సూక్ష్మజీవుల వలన కలిగే విషప్రభావం తగ్గుతుంది.
👉రక్త స్రావం కాకుండా ఆపుతుంది.
👉చీటికీ మాటికీ నోటిలో పుండ్లు వచ్చే వారికి ఈ దాల్చిని చెక్క చూర్ణం చాలా మంచిగా పని చేస్తుంది.
10). గసగసాలు:
👉వీటిని ఒక గ్లాస్ వేడి నీళ్లలో ఒక గంటసేపు ఉంచి ఆ తర్వాత తాగితే తలనొప్పి తగ్గుతుంది.
👉అలసట వల్ల కలిగిన వంటి నొప్పులు కూడా తగ్గుతాయి.
👉వీటి పొడి మజ్జిగలో కలిపి తాగితే నీళ్ల విరేచనాలు అరగంటలో తగ్గిపోతాయి.
👉అరగ్రాము పొడి పాలతో కలిపి తాగితే నిద్ర బాగా పడుతుంది.
👉గొంతు వాచి నొప్పిగా ఉన్నప్పుడు వీటి కషాయం తో పుక్కిలిస్తే నొప్పి తగ్గుతుంది.
11). ఆవాలు:
👉ఆవాలను పొడి చేసి బెల్లంతో కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి పిల్లలకు తినిపిస్తే రాత్రిళ్ళు పక్క తడిపే అలవాటు తగ్గుతుంది.
👉ఆవాల పొడిని నీళ్లతో కలిపి పైకి పూయడం వల్ల చర్మ రోగాలు పోతాయి.
👉ఆవాలను నిప్పులపై వేసి పొగ పట్టడం ద్వారా ఊపిరి తిత్తుల వ్యాధులు నయం అవుతాయి.
👉ఊళ్ళో ఆటలమ్మ వచ్చినపుడు ఈ పొగ వేయడం చాలా మంచిది.
👉ఆవనూనెతో కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.
✍️పైన తెలిపిన అంశాల కన్నా ఇంకా ఎక్కువగా మేలు చేసే గొప్ప గుణాలు కలిగి ఉన్నాయి. మీకు అవగాహన కలిపించడం కోసం ఇక్కడ కొన్ని ముఖ్యమైన గుణాలు మాత్రమే చెప్పడం జరిగింది. ఇంతకు ముందు పెట్టిన పోస్టులలో మరికొన్ని ముఖ్యమైన వంటగదిలోని ఔషధాల గురించి వివరించడం జరిగింది. వాటిని కూడా ఒకసారి చూడండి.
🙏ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏
--(())--
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
*కొన్ని ఆరోగ్య సూత్రాలు
ఆరోగ్యకరమైన జీవనానికి కొన్ని నిర్దుష్ట చర్యలు
1. ఉదయం నిద్ర లేస్తూ భగవంతునికి , తల్లి తండ్రులకు నమస్కరించండి
,
2. నిద్రలేచిన వెంటనే పళ్ళు తోముకోకుండానే రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు త్రాగండి
.
3. బరువు తగ్గాలి అనుకుంటే అందులో కొంచెం నిమ్మరసం , తేనె వేసుకుని త్రాగండి
.
4. మలవిసర్జన సమయంలో పళ్ళను గట్టిగా నొక్కిపెట్టడం వలన వృద్ధాప్యంలో కూడా పళ్ళు గట్టిగా ఉంటాయి
.
5. దంతధావన సమయంలో చల్లని నీటిని నోటినిండా తీసుకుని పుక్కిలిస్తూ చల్లని నీటిని రెండు చేతులతో కళ్లపై చల్లుకుంటే కళ్ళ ఆరోగ్యం బాగుంటుంది
.
.
6. స్నానం చేసే నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపితే వంటిదుర్గంధం తగ్గుతుంది . తాజాదనం ఫీల్ అవుతారు
.
7. ఆరోగ్యమైన జీవితం కోసం సాత్విక , ప్రాకృతిక , సహజ ఆహారం తినండి .
.
8. శరీర సమతౌల్యం, శక్తి, చర్మ సౌదర్యం కోసం రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీటిని త్రాగండి.
.
9. నీరు ఎప్పుడు త్రాగినా కూర్చుని త్రాగండి . అందువలన మీకు మోకాళ్ళనొప్పి రాదు.
.
10. వ్యాధులకు అత్యుత్తమ చికిత్స - ఉపవాసం
.
11. దీర్ఘకాల ఉపవాసం అనారోగ్యకరం.
.
12. ఉపవాసం వలన శరీరం లోని మలినాలు ( టాక్సిన్స్ ) బయటకు గెంటివేయబడతాయి
.
13. సామర్ధ్యం అనుసరించి, అవుసరం అయినంత ఆహారం తీసుకోండి.
.
14. అధికమయిన ఆహారం అజీర్ణం కలగచేస్తుంది . అనారోగ్యాన్ని కలుగచేస్తుంది
.
15. సకాలంలో ఆహారం తీసుకోండి. అందువలన జీవన గడియారం సక్రమంగా ఉంటుంది .
.
(కాలభోజనం ఆరోగ్యకారణం)
.
16. భోజనానికి సరిగ్గా ముందు , భోజనం చేసినవెంటనే నీరు త్రాగకండి. నీటికి భోజనానికి మధ్య కనీసం ఒక అరగంట వ్యవధి ఇవ్వండి .
.
17. భోజనాన్ని క్రింద కూర్చుని తినడం ఉత్తమ అలవాటు . డైనింగ్ టేబుల్ వాడుతూ ఉంటె కుర్చీలో మఠం వేసుకుని కూర్చుని తినండి .
.
18. భోజనం చేస్తూ మాట్లాడకండి . అన్నం భగవత్ప్రసాదంగా భావించి ఆయనకు సమర్పించి తినండి
.
19. టి . వి . చూస్తూ భోజనం చెయ్యకండి
.
20. భోజనం చివరిలో ఐసుక్రీం వంటి చల్లని పదార్ధాలు తినకండి
.
21. ఇత్తడి బిందెలో నీరు మంచిది . రాగి బిందె నీరు వరుసగా మూడునెలలు త్రాగితే ఒక నెల విరామం ఇవ్వండి
.
22. వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోండి. అది మీకు నడుమునొప్పి రాకుండా చేస్తుంది
.
23. ఉదయం అల్పాహారం లో మొలకలు ( పీచుపదార్ధాలు) ఉండేలా చూసుకోండి . పండ్లను తినండి. సలాడ్లు తినండి
.
24. భోజనంలో ఆకుకూరలు , కాయగూరలు ఎక్కువ ఉండేలా చూసుకోండి. నూనెలు తగ్గించి బదులుగా ఆవునెయ్యి వాడండి . అది బరువును పెంచదు.
.
25. ఉప్పు, నూనె, కారం ఆహారానికి రుచిని మీకు అనారోగ్యాన్నీ చేకూరుస్తాయి అని మరువవద్దు .
.
26. మితంగా తినండి . బ్రతకడం కోసం తినండి . తినడం కోసం బ్రతకకండి .
.
27. ఇవ్వడం లో ఉన్న ఆనందం పొందండి .
.
28. రాత్రి నిద్రకు కనీసం రెండు గంటల ముందు భోజనం పూర్తి చెయ్యండి . రాత్రి ఎనిమిది గంటలలోపులో భోజనం ముగించండి . మీ కాలేయం రాత్రి 11 . 00 నుండి ఉదయం
4 . 00 వరకూ విశ్రాతి తీసుకునే అవకాశం ఇవ్వండి .
.
29. నిద్రకు మెత్తటి పరుపులు , ఎత్తు ఎక్కువ ఉన్న తలగడలు హాని కలిగిస్తాయి అని గుర్తించండి .
.
30. ఎడమవైపుకు తిరిగి పడుకొండి . అందువలన మీ జీర్ణక్రియకు దోహదపడే “కుడి స్వరం” లో శ్వాస ఆడుతుంది . కుడి ముక్కు నుండి శ్వాసలు జరగడం వలన ఉష్ణశక్తి ( సూర్యనాడి ) జనిస్తుంది
.
31. వ్యాదిరహిత జీవనానికి మానసిక శాంతి అవుసరం . ఆనందం గా ఉంటూ ఉండండి.
.
32. విచారాన్ని వెంటబెట్టుకుని తిరగకండి
.
33. నిన్నటి విచారం , రేపటి ఆందోళన మీ నేటి జీవిత ప్రశాంతతకు భంగం కలిగించనివ్వకండి
.
34. చింత , ఆందోళన మీకు గుండె సంబంధ వ్యాధులను కలిగిస్తాయి
.
35. ఆందోళన , భయము మీలో వాత సంబంధ వ్యాధులను కలిగిస్తాయి
.
36. ఈర్ష్య, కోపం మీలో పిత్తాన్ని ప్రకోపింపచేసి జీర్ణ సంబంధ వ్యాధులను కలిగిస్తాయి
.
37. దురాశ , అధిక ఆందోళన , ఒత్తిడి మీలో కఫాన్ని ప్రకోపింపచేసి శ్వాస సంబంధ వ్యాధులను కలుగచేస్తాయి
.
38. Stress is the main cause of all diseases
.
39. నిద్రపోయేముందు “ నీ ఒడిలో నన్ను పడుకో బెట్టుకో ! నాకు చక్కని స్వల్పకాలిక లయను ప్రసాదించు” అని దైవాన్ని ప్రార్ధించండి .
.
40. ఆరోజు మీ జీవితం లో ఏమి సాధించారో ఒక్కసారి పరిశీలించుకోండి . మరుసటిరోజు మంచిపనులు చేసేలా చూడమని ఆయన్ను ప్రార్ధించండి
.
41. పెద్దలను గౌరవించడం ఒక అలవాటు చేసుకోండి
.
42. పిల్లలను ప్రేమగా పిలవడం నేర్చుకోండి
.
43. ఆంటీ , అంకుల్ వంటి ఇంగ్లీష్ పిలుపులకు బదులు ఆప్యాయతను తెలియచేసే వరుసలతో పిలవండి
.
44. మీరు సౌమ్యంగా ఉంటె లోకం అంతా సౌమ్యంగా ఉంటుంది
.
చక్కని జీవితానికి ఈ మార్గాలు..
మీ నేస్తం.
--(())--
🙏🏻*ప్రసాదాల లోగుట్టు* (*medical benfits of hindu prasadam*)🙏🏻
ప్రతి ప్రసాదానికి విశిష్టత ఉంది . ఈ ప్రసాదాల్లో ఉన్న మిశ్రమాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు .
*జీర్ణశక్తిని పెంచే ' కబెట్టె పొంగళి*
" బియ్యం , పెసరపొప్పు , జీలకర్ర , ఇంగువ , నెయ్యి , అల్లం , శొంఠిపొడి , ఉప్పు , కరివేపాకు , జీడిపప్పుల మిశ్రమంలో తయారయ్యే కట్టెపొంగలి రోగనిరోధకశక్తిని , జీర్ణశక్తిని పెంచు తుంది . మంచి ఆకలిని కలిగిస్తుంది .
*జీర్ణకోశ వ్యాధుల నివారిణి ' పులిహోర*
' బియ్యం , చింతపండుపులుసు , శనగపప్పు , మినపప్పు , ఆవాలు , జీలకర్ర , ఎండుమిర్చి ఉప్పు , ఇంగువ , పసుపు , బెల్లం , నూనె , వేరుశన గలు , జీడిపప్పు మిశ్రమంతో తయారు చేసే పులిహోర జీర్ణశక్తిని పెంచుతుంది . జీర్ణకోశ వ్యాధులను నివారిస్తుంది .
*మేధస్సును పెంచే దద్ధోజనం*
' బియ్యం , పెరుగు , ఇంగువ , కొత్తిమీర , అల్లం , - మిర్చి కొంఠి పొడిల మిశ్ర మంతో తయారు చేసే ఈ - ప్రసాదం మేధస్సును పెంచుతుంది . శరీరానికి కి మంచి శక్తిని ఇచ్చి ఆరో గ్యాన్ని కల్గిస్తుంది .
*వార్ధక్యాన్ని నిలువరించే ' కదంబ '*
బియ్యం , చింతపండు , ఎండుమిర్చి పోపులు , ఇంగువ , నూనె , ఉప్పు , కందిపప్పు పసుపు , బెల్లం , నెయ్యి , బెండకాయ , వంకాయ , గుమ్మడికాయ , చిక్కుళ్లు , బీన్స్ , దోసకాయ , క్యారెట్ , టమోటా , చిలకడదుంపల మిశ్రమంలో తయారు చేసే కదంబ ప్రసాదం అత్యంత బలవర్థకం . సప్తధాతువుల పోషణ చేస్తుంది . వార్ధక్యాన్ని నిలువరిస్తుంది . అన్ని వయస్సుల వారికి మంచి పౌష్టికాహారం .
*శ్లేష్మాన్ని తగ్గించే ' పూర్ణాలు "*
పచ్చిశనగపప్పు , బెల్లం , కొబ్బరి చురుము , యాలకుల మిశ్ర మంతో ఈ ప్రసాదం సప్తధాతు వుల పోషణ చేస్తుంది . శ్లేష్మాన్ని తగ్గిస్తుంది . మంచి బలవర్ధకం .
*రోగనిరోధకశక్తిని పెంచే చలిమిడి*
' బియ్యం పిండి , బెల్లం , యాలుకలు , నెయ్యి , పచ్చకర్పూరం , జీడిపప్పు , ఎండుకొబ్బరికో రుతో తయారుచేసే చలిమిడి మంచి బలవర్ధకం
*కొబ్బరి పాల పాయసం*
కొబ్బరి పాలు పచ్చ కర్పూరం యాలకుల పొడి బాదంపప్పు కుంకుమపువ్వు పంచదార ఆవు పాలు _కలకండ_ పొడి తో చేసే ఈ ప్రసాదం వెంటనే శక్తినిస్తుంది. మంచి బలవర్ధకం. శ్రేష్మాన్ని హరిస్తుంది.
🙏🏻గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
*రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు*
*1. బీట్ రూట్ :::: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో
బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.*
*2. క్యారెట్ :::: క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .*
*3. బొప్పాయి :::: బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.*
*4. వెల్లుల్లి :::: శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు*
5. ఆకుకూరలు :::: శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.*
*6. దానిమ్మ :::: ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.*
*7. ఆప్రికాట్ ::ఐరన్ అధికంగా ఉన్నపండ్లలో మరొకటి ఆప్రికాట్ .రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.*
*8.ఎండు ద్రాక్ష ::రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ నునేచురల్ గా పెంచుతుంది.*
*9.ఖర్జూరం :::: ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.*
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
బెల్లం తినడం వల్ల కలిగే18
ప్రయోజనాలు
* * *
1.బెల్లం తినడం వల్ల గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది
2.భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపించడం సహజం. అన్నిటిని మించి బెల్లాన్ని సేవించినట్లయితే మనం ఆరోగ్యం గా ఉండవచ్చు.
3.జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది
4 బెల్లం శరీరంలో ని రక్తాన్ని శుద్ధి చేసి మెటబొలిజం ని క్రమబద్దీకరణ చేస్తుంది.ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు లేదా నీటి తో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటుందో వారు ప్రతిరోజూ ఈ బెల్లాన్ని భోజనం అనంతరం తప్పనిసరి చేయాలి.
5.బెల్లం లో వుండే ప్రముఖ ధాతువు ఇనుము. కావున బెల్లాన్ని ఎనీమియా రోగులకు ఇచ్చినచో మంచి ఫలితం ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళలు బెల్లాన్ని సేవించడం అత్యావశ్యకమైనది.
6.చర్మం కోసం, బెల్లం రక్తం లోని ప్రమాదకరమైన టాక్సిన్ల ను దూరం చేసి చర్మానికి మంచి మెరుపు నిచ్చి మొటిమలు ని నివారిస్తుంది
.
7.బెల్లం యొక్క గుణం వేడిచేయడం.కావున దీనిని మనం జలుబు ,దగ్గు, రొంప
లాంటివాటికి ఉపశమనం ఇస్తుంది.జలుబు వలన బెల్లం తినలేనట్లయితే చాయ్ లేదా లడ్డు లో కూడా వాటిని కలిపి సేవించవచ్చు.
8.శక్తి కోసం, బాగా నీరసం బలహీనత లక్షణాలు కనిపించగానే,బెల్లం సేవించినట్లయితే మీ ఎనర్జీ లెవెల్ త్వరగా పెరుగుతుంది. దీని వల్ల షుగర్ లెవెల్ కూడా పెరగదు. రోజంతా పనిచేసిన తర్వాత మీకు అలసట గా అనిపిస్తే వెంటనే బెల్లాన్ని తినేయండి.
9.బెల్లం శరీర ఉష్ణోగ్రత ని నియంత్రణ లో ఉంచుతుంది. దీని ఆంటి అలెర్జీక్ తత్వం వలన దమ్ము ఆస్తమా రోగులు తీసుకొంటే మంచి ఫలితాలు వుంటాయి.
10.మోకాళ్ళ నొప్పుల కి విశ్రాంతి, బెల్లం ముక్క తో కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.
11.బెల్లం తో కలిసి చేసిన పరమాన్నం తింటే గొంతు మరియుమాట హయిగా వస్తాయి.
12.బెల్లాన్ని నల్లనువ్వుల తో పాటు లడ్డు చేసుకోని తింటే చలికాలంలో ఆస్తమా ఇబ్బంది పెట్టదు.
13.శీతకాలంలో నంజు బాగా తయారైతే బెల్లాన్ని పాపిడి రూపంలో చేసుకుని సేవించండి.
14.బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకొంటే చెవి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.
15.భోజన ము తర్వాత బెల్లం తీసుకొంటే అసిడిటీ తగ్గిపోతుంది
16.ఐదు గ్రాముల శొంఠి పది గ్రాముల బెల్లం ఉండలు గా చేసి తీసుకొంటే జాండిస్ (పీలియావ్యాధి)పచ్చ కామెర్లు వారికి లాభసాటిగా ఉంటుంది.
17.బెల్లం హాల్వా తీసుకొంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
18.అయిదు గ్రాముల బెల్లం అంతే పరిమాణంలో ని ఆవాల నూనె( మస్తర్డ్ ఆయిల్) తో కలిపి తీసుకొంటే శ్వాస సంభందిత వ్యాధులు నయమవుతాయి.
మంచి మాటలు,మంచి విషయాలు, మన మంచి మిత్రులకు షేర్ చేద్దాం..
Co
✍️ఈ క్రింది మా నియమాలని పాటించే ప్రతి ఒక్కరూ కారోనాను జయించిన విజేతలు అవుతారు
👉ఉదయం సూర్యుడు నిద్ర లేవక ముందే మీరు నిద్ర లేవండి.
👉గోరు వెచ్చని నీళ్లు ఒక లీటర్ త్రాగండి.
👉నీళ్లు త్రాగిన ఐదు నుండి పది నిమిషాల కాల వ్యవధిలో మోషన్ వచ్చేలా ధ్యాస పెట్టండి. తప్పకుండా మోషన్ వస్తుంది.
👉ఆ తర్వాత 45 నిమిషాల నుండి ఒక గంట వరకు వ్యాయామం చేయండి.
👉 ఆ తర్వాత మళ్ళీ 500ml నుండి ఒక లీటర్ వరకు నీళ్లు త్రాగండి.
👉అవసరం అయితే మళ్ళీ ఒకసారి మోషన్ మీద దృష్టి పెట్టండి. ఉదయం రెండుసార్లు మోషన్ వెళ్లడం వల్ల పొట్ట మొత్తం కాళీ అవుతుంది.
👉టీ, కాఫీలు లు త్రాగకండి. కషాయం తీసుకోండి. (కషాయం తయారు విధానం మరియు కావలసిన పదార్థాలు ముందు పోస్టులో తెలపడం జరిగింది. దయచేసి ఒకసారి చూడగలరు).
👉ఉదయం తీసుకునే అల్పాహారంలో నూనెలతో చేసిన పదార్థాలు తీసుకోకండి.. త్వరగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి.
👉అలాగే ఉదయం మాంసాహారం కానీ మసాలాలతో చేసిన ఆహారం కానీ తీసుకోకూడదు.
👉ఉదయం మొలకెత్తిన విత్తనాలు, చిరు ధాన్యాలు లేక వెజిటబుల్ జ్యూస్ కాని తీసుకోవాలి.
👉క్యారెట్, బీట్రూట్, టమోటా, కీర, బీర, సొరకాయ మొదలైన జ్యూస్ లు మంచివి.
👉మధ్యాహ్నం చేసే భోజనంలో అన్నం తక్కువగా తీసుకోవాలి, కూరలు మాత్రం ఎక్కువగా తీసుకోవాలి.
👉కూరలలో పీచు అధికంగా ఉన్న కూరగాయలు, మరియు ఆకు కూరలు తీసుకోవాలి. పచ్చని కూరగాయలు మరియు పచ్చని ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి.
👉సాయంత్రం 5 నుండి ఆరు గంటల మధ్య మళ్ళీ ఒకసారి వ్యాయామం చేయండి. ఒక గ్లాస్ పండ్ల జ్యూస్ తాగండి.
👉 రాత్రి 7 నుండి 7:30 గంటల మధ్య అల్పాహారం తీసుకోవాలి.. ఈ అల్పాహారం లో పండ్లు తీసుకోవడం చాలా మంచిది.
👉నిద్రకు అర్ధ గంట ముందు సోంపు, వాము, జీలకర్ర, మెంతులు అన్ని కలిపి చేసిన పొడి ని మజ్జిగలో లేదా గోరు వెచ్చని నీళ్లలో కలిపి త్రాగితే మంచిది.
👉9 గంటల లోపు నిద్రపోవాలి.
👉ప్రతిరోజూ తప్పకుండా ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి.
👉ప్రతి గంట కి ఒక గ్లాస్ నీళ్లు త్రాగండి.. రాగి పాత్రలో నీళ్లు త్రాగడం చాలా మంచిది.
👉ప్రతి రోజు ఖార్జురా , ఎండు ద్రాక్ష ను తీసుకోండి.
👉వారానికి ఒకసారి కాకర కాయ జ్యూస్ త్రాగండి.
👉ప్రతి సోమవారం పాస్టింగ్ ఉండండి. ఎందుకంటే ఆదివారం తీసుకున్న ఆహారం మొత్తం జీర్ణం అవ్వడానికి ఇది ఉతమైన మార్గం. చాలా ఆరోగ్యకరం.
👉ప్రతి మంగళవారం కేవలం పండ్లు మరియు పండ్ల జ్యూస్ లు తీసుకోండి.
👉వేప ఆకు, జామ ఆకు, కానుగ ఆకు, నేరేడు ఆకు, తులసి ఆకు, పుదీనా ఆకు.. ఒక్కో రోజు ఒక్కో రకం ఆకులు 4 నుండి 7 తీసుకుని నమిలి మింగాలి.
👉వారానికి రెండు సార్లు అయినా గోధుమ గడ్డి జ్యూస్ తీసుకోండి.
👉జలుబు, దగ్గు ఉంటే వెంటనే నీళ్లలో పసుపు, మెంతోప్లస్ లేక అమృతాంజన్ మరియు ఉప్పురాళ్లు కొన్ని వేసి బాగా ఆవిరి పట్టించండి.
👉సి విటమిన్ అధికంగా ఉన్న పండ్లు బాగా తీసుకోండి. ( నిమ్మ, బత్తాయి, కమలా, నారింజ, అనాస)
👉ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆముదం తో పొట్టను విరేచన క్రియ ద్వారా శుద్ధి చేసుకోండి.
👉అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి నువ్వుల నూనెతో తలంటి స్నానం చేయండి.
👉బయట కొని తినే అలవాట్లు మానుకోండి. వీలైనంతవరకు ఇంట్లో తయారు చేసుకుని తినండి.
👉సిరిధాన్యాలతో చేసిన జావలు, వంటలు చాలా మంచిది.
👉వారంలో కనీసం మూడు సార్లు అయినా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి.
👉వంటలకు వినియోగించే నూనె స్వచ్ఛంగా మనం ఆడించుకుని వాడితే చాలా ఉత్తమం. నూనెలో శెనెగ నూనె మంచిది.
👉షాంపూల వాడకం తగ్గించి కుంకుడుకాయ, శీకాయ లను వాడండి.
👉సీజన్లో లభించే పండ్లను తప్పకుండా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల వాతావరణం లో మార్పుల కారణంగా వచ్చే జబ్బులను నివారించుకోవచ్చు.
👉ఒకసారి మీకు మీరే ఒక క్వశ్చన్ వేసుకుని చూడండి. జంతువులు ఏవి బడితే అవి తింటాయి. ఏ నీళ్లు దొరికితే అవి త్రాగుతాయి. మరి అవి రోగాల బారిన పడటం చాలా తక్కువ.
👉 మరి మనం అన్నీ మనకు అనుకూలంగా మార్చుకుని ఆరోగ్యం కోసం ఎన్నో మార్పులు చేర్పులు చేసి మరీ తీసుకుంటున్నా రోగాలు చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి.
👉కారణం కేవలం మారిన మన జీవన శైలి మరియు మనం తీసుకునే ఆహారం.
👉మా నుండి ఒక గొప్ప నిజం చెప్పనా.. మన పూర్వీకుల జీవనశైలిని మరియు ఆహారపు అలవాట్లను మనం ఇప్పటికి అనుసరించి ఉండి ఉంటే... ఇలాంటి కారోనాలు ఎన్ని వచ్చినా కూడా తట్టుకునే శక్తి మన శరీరానికి ఉండేది.
👉కనీసం ఇప్పటికైనా మారి మేము పైన సూచించిన నియమాలను పాటించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. తద్వారా మీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకోండి.
👉 కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది.. ఈ సమయంలో తప్పకుండా మాస్క్ లు ధరించండి, సామాజిక దూరం తప్పకుండా పాటించండి, ఇల్లు, ఇంటి పరిసరాలు బ్లీచింగ్ లేదా డెటాల్ తో శుభ్రంగా ఉంచుకోండి. చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రం చేసుకోండి. ప్రతి రోజు స్నానం చేయండి. వీటితో పాటు పై నియమాలను పాటించండి.
👉మా నియమాలను ఎవరైతే తప్పకుండా పాటిస్తారో వారికి ఇమ్మ్యూనిటి ( రోగ నిరోధక శక్తి) పెరిగి ఆరోగ్యంగా వుండటంతో పాటు ఆయుష్షు కూడా పెరుగుతుంది. అంతేకాదు ఈ కరోనా కూడా మిమ్మల్ని ఏమి చేయదు.
👉ఆయుర్వేదం తోడుగా మనో ధైర్యం తో ముందుకు నడుద్దాం.. ప్రభుత్వ నియమాలని పాటిద్దాం. కారోనా నుండి మనల్ని మన దేశాన్ని కాపాడుకుందాము.
🙏ముఖ్య విన్నపం: ఇది చాలా ముఖ్యమైన సందేశం. ప్రతి ఒక్కరు ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏
🔱 సూర్యమంత్రం🔱
నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే!
ఆయురారోగ్య ఐశ్వర్యo దేహి దేహిదేవః జగత్పతే!!
🙏అర్థం🙏
ఓ సూర్యదేవ! జగత్ పరిపాలకా! నీకిదే నా నమస్కారము. నీవు సర్వరోగములను తొలగించువాడవు. శాంతిని వొసంగువాడవు.
మాకు ఆయువును, ఆరోగ్యమును, సంపదను అనుగ్రహించుము.
సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం సూర్యుడు కి నమస్కారం చేసే వారిలో ఇతరుల కన్నా రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది నమస్కార ముద్ర కూడా ఒక ఆసనం ,అలా నమస్కారం చేస్తూ 12 సూర్య నామాలు చదివే సమయం లేదా ఇక్కడ ఇచ్చిన ఈ శ్లోకమ్ కనీసం 12 సార్లు అయిన జపిస్తూ సూర్యుడు ఎదురుగా నిల్చుని నమస్కారం చేస్తే నమస్కార ప్రియుడు అయిన సూర్యుడు సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహిస్తారు.. అలాగే ఇతరులతో పోలిస్తే సూర్య నమస్కారం చేసే వారి చుట్టూ రేఖీ అధికంగా ఉంటుంది.. ఈ రెండు వాక్యల చిన్న శ్లోకం పిల్లలకు అలవాటు చేయండి పిల్లలు ఇలా సూర్య నమస్కారం చేయడం వల్ల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది క్రమశిక్షణ అలవాటు అవుతుంది.. పిల్లలు తల్లితండ్రుల మాట వింటారు..
సూర్య ద్వాదశ నామాలు
1.ఓం మిత్రాయనమః
2.ఓం రవయేనమః
3.ఓం సూర్యాయనమః
4.ఓం భానువేనమః
5. ఓం ఖగాయనమః
6. ఓం పూష్ణేనమః
7. ఓం హిరణ్య గర్భాయనమః
8.ఓం మరీచయేనమః
9.ఓం ఆదిత్యా యనమః
10.ఓం సవిత్రేనమః
11. ఓం అర్కాయనమః
12. ఓం భాస్కరాయనమః
ఈ ద్వాదశ నామాలు కూడా స్మరించుకుంటే సూర్యనారాయణుడు ఆశీర్వాదం లభిస్తుంది.
🌷🙏 నమో సూర్య నారాయణ🙏🌷
: తీవ్రమైన గ్యాస్ సమస్య నివారణ :
👉 ప్రస్తుత కాలంలో చాలామంది తీవ్రమైన గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
👉దీనికి ప్రధాన కారణం సరైనటువంటి ఆహారం సరైనవేళల్లో తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం .
ఇప్పుడు నేను చెప్పబోవు ఈ అద్భుత చిట్కా మిమ్మల్ని గ్యాస్ సమస్య నుంచి మిమ్మల్ని అద్భుతంగా బయటపడవేయును.
✍️కావాల్సిన పదార్థాలు:
👉వాము 250 గ్రాములు .
👉జీలకర్ర 250 గ్రాములు .
👉ధనియాలు 250 గ్రాములు .
👉 మూడింటిని వేరువేరుగా నూనె కాని నీరు కాని వేయకుండా కడాయిలో ఒక నిమిషంపాటు సన్నటి సెగ మీద వేయించి మూడింటిని కలిపి మెత్తటి చూర్ణంగా చేయవలెను .
👉 ఆ చూర్ణమును ఒక డబ్బా యందు గాలి పోకుండా నిలువ చేసుకొనవలెను .
👉ఒక గ్లాసు నీటిని బాగా మరిగించి పొయ్యి మీద నుంచి కిందకి దింపిన తరువాత 2 స్పూనుల చూర్ణాన్ని మరిగించిన నీటిలో వేసి మూత పెట్టవలెను కొంచం ఆగి గోరువెచ్చగా అయినతరువాత వడకట్టుకొని తాగవలెను.
👉ఇలా ప్రతి ఉదయం బ్రష్ చేసిన వెంటనే మరియు సాయంత్రం ఆహారానికి గంట ముందు మరలా చేసుకుని తాగవలెను.
👉పైన చెప్పిన యోగం 40 రోజులపాటు చేసినచో మీ గ్యాస్ సమస్య సంపూర్ణంగా పోవును .
👉అలాగే ఆహారం తీసికొనుటకు అర్థగంట ముందు చిన్న అల్లం ముక్క కు ఉప్పు అద్ది నోటి యందు ఉంచుకుని రసం మింగుతూ ఉండవలెను .
👉దీనివలన జీర్ణక్రియ మెరుగుపడి ఆహారం సంపూర్ణంగా జీర్ణం అగును.
✍️అజీర్ణ సమస్యతో బాధపడువారు పాటించవలసిన ఆహార నియామాలు -
1. తీసుకోవాల్సిన ఆహారము:
👉తేలికయిన పాతబియ్యపు అన్నం .
👉పాతబియ్యపు నూకల జావ ,
👉బార్లీ జావ ,
👉 పెసలు ,
👉పేలాలు ,
👉పెసరకట్టు ,
👉మేక మాంసం ,
👉చిన్న చేపలు ,
👉అల్లం ,
👉ఉప్పు ,
👉తక్కువ కారం ,
👉లేత ముల్లంగి ,
👉వెల్లుల్లి ,
👉ఉల్లిపాయ ,
👉లేత అరటికాయలు ,
👉లేత మునగ కాయ ,
👉పొట్లకాయ ,
👉బీరకాయ ,
👉లేత వంకాయ ,
👉కాకరకాయ ,
👉దోసకాయ ,
👉చుక్కకూర ,
👉పెరుగు తోటకూర ,
👉పొన్నగంటి కూర ,
👉మెంతికూర ,
👉ఉసిరి ,
👉దానిమ్మ ,
👉నారింజ పండు ,
👉బత్తాయి ,
👉మజ్జిగ ,
👉పలచని మిరియాల చారు ,
👉తాంబూలం ,
👉వేడినీరు ,
👉తేనె ,
👉చేదు ,
👉నూనె తక్కువ పదార్దాలు ,
👉వగరు ,
👉వ్యాయమం చేయవలెను .
✍️తీసుకోకూడని ఆహారం:
👉కొత్త బియ్యపు అన్నం ,
👉పెద్ద చేపలు ,
👉బచ్చలికూర ,
👉అధికంగా నీరు తాగరాదు ,
👉ఆలు,
👉 పెండలం ,
👉చామ ,
👉 నేరేడు పండ్లు ,
👉గోధుమలు ,
👉 పాలతో చేసిన పదార్థాలు ,
👉చారపప్పు ,
👉 జీడిపప్పు ,
👉నూనె అధికంగా ఉపయోగించి చేసే పదార్దాలు ,
👉వేపుళ్లు ,
👉పాతపచ్చళ్లు ,
👉ఉడకని పదార్దాలు ,
👉ముందు తినిన ఆహారం జీర్ణం కాక మునుపే మరలా తినరాదు .
👉అమిత భోజనం ,
👉నిద్ర మేలుకుని ఉండటం ,
👉మలమూత్ర నిరోధం .
👉 టీ మరియు కాఫీ నిషిద్దం మొదలైనవి.
పైన సూచించిన విధంగా నియమాలను పాటిస్తే తప్పకుండా గ్యాస్ట్రిక్, అజీర్ణ సమస్యలు తప్పకుండా మీ నుండి దూరం అవుతాయి.
✍️పైన తెలిపిన సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే ఒకసారి మాకు మీ సమస్య తీవ్రత వివరాలు మాకు తెలుపండి. మా వద్ద మీకు మంచి పరిస్కారం చూపే అద్భుతమైన మందులు కలవు. మీకు ఫలితం కలగలేదు అంటే మీ డబ్బులు మీకు తిరిగి ఇవ్వడం జరుగును.
వాత,పిత్త, కఫాలు పెరిగినపుడు కనిపించు వ్యాధులు -
ఆయుర్వేదం లో వాత, పిత్త, కఫ అనే శరీర తత్వాలని బట్టి వైద్యం చేయడం మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ వాత, పిత్త మరియు కఫ దోషాల వల్ల కలిగే సమస్యలు ఏంటి?
✍️వాతం పెరిగినపుడు కలుగు వ్యాధులు :
👉 గోళ్లు పగలడం
👉అరికాళ్ళు పగలడం .
👉అరికాళ్లు పోట్లు .
👉కాళ్లు వంకరగా ఉండటం.
👉పాదాలు మొద్దుబారడం .
👉పాదాలలో నొప్పి.
👉చీలమండలు నొప్పి.
👉పిక్కల యందు నొప్పి.
👉సయాటికా .
👉మోకాళ్లనొప్పి .
👉మోకాళ్ళు సలుపులు .
👉తొడలు కృశించడం.
👉తొడలు బిగబట్టి ఉండటం.
👉కుంటితనం.
👉గుద భ్రంశం .
👉వృషణాలలో నొప్పి.
👉గజ్జల్లో నొప్పి.
👉గుద స్థానంలో నొప్పి.
👉జననేంద్రియాలు స్తంభించడం .
👉పిరుదుల్లో నొప్పి.
👉మలబేధం .
👉 ఉదావర్థం .
👉 కాళ్ళు వంకరగా ఉండే అవిటితనం.
👉గూని.
👉మరుగుజ్జుతనం .
…
మిత్రులందరికీ నమస్కారం...🙏🙏
అద్భుతమైన పోషకాల గల ఈ జ్యూస్ లు మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేయగలవు.
షుగర్, బీపీ, థైరాయిడ్, హార్మోనల్ ఇన్ బ్యాలన్స్, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు,బలహీనత, రక్తహీనత మొదలైన సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈ క్రింది జ్యూస్ లు చాలా మంచి రిలీఫ్ ను ఇస్తాయి.
సంతోషంగా జీవించాలి అంటే.. ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అన్నం,పప్పులు, నూనెలు, మాంసం,పండ్లు తింటున్నా పోషకారలోపంతో బాధపడేవారు వున్నారు.
ఎన్నో అనారోగ్యాలకు కారణం ఈ పోషకాహార లోపం. విటమిన్లు, మినరల్స్ లోపాన్ని సరిచేయాలి అంటే న్యూట్రిషన్ సప్లిమెంట్ లు తీసుకోవడం కంటే ఆహారంలో కొంచెం మార్పులు చేసుకుని కొద్దిగా మన జీవనశైలిని మార్చుకోవడం మంచిది.
చిన్న ప్రయత్నంతో గొప్పమేలు చేసే కూరగాయలు, ఆకుకూరల రసాలతో పోషకాహార లోపాలకి, శారీరక సమస్యలకి చెక్ పెట్టొచ్చు.
విటమిన్లు, మినరల్స్ తో పాటు అధిక ఫైబర్ ని అందించే కొన్ని అద్భుతమైన జ్యూస్ లు మీకోసం చెప్తున్నాము.
1). ఆకు కూరల జ్యూస్:
తయారీకి కావల్సిన పదార్థాలు:
పుదీనా, కొత్తిమీర, తులసి ఆకులు,తేనె,నిమ్మచెక్క, మంచు నీళ్లు . అన్ని ఆకులు కలిపి గుప్పెడు ఉంటే చాలు.
తయారీ విధానం:
ఈ ఆకులన్ని మిక్సీ పట్టాలి.తర్వాత నీళ్లు కలిపి పలుచగా చేయాలి. ఒక నిమ్మచెక్కని పిండి రుచికి తగినంత తేనె కలిపి నెమ్మదిగా తాగాలి.
2). కూరగాయలు జ్యూస్:
తయారీకి కావలసిన పదార్థాలు:
టమోటా, బీర, గుమ్మడి, కీరకాయ,పొట్లకాయ లతో పాటు జ్యూస్ కి అనువైన అన్ని కాయలను ఉపయోగించవచ్చు.
తయారీ విధానం:
కూరగాయలను ముక్కలుగా కోసి వాటిని మిక్సీలో వేసి అందులో తగినన్ని నీళ్లు కలిపి పలుచగా చేసి ఒక నిమ్మచెక్కని అందులో పిండాలి. రుచి కోసం కొద్దిగా తేనె ని కలపాలి. ఈ జ్యూస్ ని కనీసం వారానికి ఒకసారి అయినా తీసుకోవాలి.
3).మునగాకు జ్యూస్:
తయారీకి కావాల్సిన పదార్థాలు:
మునగాకు, కరివేపాకు, తేనె, నిమ్మ చెక్క, మంచి నీళ్ళు.
తయారీ విధానం:
ముందుగా ఆకుల్ని మిక్సీ పట్టాలి. దానికి తగినన్ని నీళ్లు కలిపి పలుచగా చేసుకుని అందులో నిమ్మచెక్కని పిండి తేనె కలుపుకుని తాగాలి.
4). పాలకూర జ్యూస్:
తయారికి కావాల్సిన పదార్థాలు: పాలకూర, కరివేపాకు, తేనె, నిమ్మచెక్క మరియు మంచి నీళ్ళు.
తయారీ విధానం:
ఆకులను మిక్సీ పట్టి తగినన్ని నీళ్లు కలిపి పలుచగా చేసి అందులో నిమ్మచెక్కని పిండి కొద్దిగా తేనె కలిపి తాగాలి.
5).గోధుమ గడ్డి జ్యూస్:
ఎనిమిది రోజుల వయసున్న గోధుమ గడ్డిని ముక్కలుగా కత్తిరించుకుని ఆ ముక్కల్ని మిక్సీలో వేసి బాగా మెత్తగా చేయాలి. తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి వడగట్టాలి.
ఈ జ్యూస్ ని ఉదయం అల్పాహారం కి అరగంట ముందు అలాగే రాత్రి భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి.
6).తవుడు జ్యూస్:
ఉదయం తాగాలి అంటే రాత్రి పూట 3 స్పూన్ల తవుడుని గ్లాసు నీళ్లలో నానబెట్టి ఉంచుకోవాలి.
ఉదయం ఈ మిశ్రమాన్ని వడగట్టి అందులోకి ఒక నిమ్మచెక్క పిండి కొద్దిగా తేనె కలిపి తాగాలి.
7).క్యారెట్, బీట్రూట్ జ్యూస్:
బీట్రూట్, క్యారెట్ ముక్కలకు కొన్ని నీళ్లు కలిపి మిక్సీ పట్టి అందులో ఒక నిమ్మచెక్కని పిండి కొంచెం తేనెను కలిపి త్రాగాలి.
షుగర్ ఉన్నవారు ఈ జ్యూస్ తీసుకోకూడదు. అలాగే షుగర్ ఉన్నవారు పై జ్యూస్ లు తాగాలి అనుకుంటే తేనె కలుపుకోకుండా తీసుకోవాలి.
ఇలాంటి మరెన్నో ఆహార నియమాలు మీకు చెప్పడానికి మేము సిద్ధంగా వున్నాము. ఎలాంటి మందులు మరియు న్యూట్రిషన్ సప్లిమెంట్స్ లేకుండా మనకు అందుబాటులో ఉండే అద్భుతమైన వనరులతో మన ఇంట్లో మనం తయారుచేసుకుని మన జీవన శైలిని కొద్దిగా మార్చగకుంటూ మన ఆరోగ్యాన్ని మరియూ ఆయుష్షుని కాపాడుకుందాము. ఆసక్తి ఉన్న మిత్రులకు ఇంకా చాలా విలువైన ఆరోగ్య నియమాలు మరియు శారీరక నియమాలను రోజువారీ దినచర్యగా ఎలా వినియోంచుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలో వివరిస్తాము. దీనికోసం మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఏంటంటే మా గ్రూపులో చేరవలసి ఉంటుంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము.
--(())--
👉 ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి.. భానుడు భగ భగ మని మంటలు కురిపిస్తున్నాడు.
👉ఈ పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వృద్ధులు, పసిపిల్లల తో పాటు యువకులు మరియూ మధ్య వయసు కల వారు కూడా వడదెబ్బ సమస్య అంచున పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి..
👉ఆహారంలో మార్పులు తప్పకుండా చేసుకోవాలి.
👉మన శరీరంలో నీటి నిల్వలు మరియూ ఎలక్ట్రో లైట్స్ తగ్గకుండా చూసుకోవాలి.
👉వేడి గాలుల కారణంగా శరీరంలో వుండే నీరు మరియూ ఖనిజ లవణాలు చెమట రూపంలో బయటికి పోతాయి. దీంతో చాలా నీరసం వచ్చి లేవలేని స్థితి కి వచ్చేస్తాము.
👉తలనొప్పి, కళ్ళు తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, వాంతులు రావడం, నోరు ఆరిపోవడం, కండరాల నొప్పులు మరియు మూత్ర సమస్యలు అన్ని కలిపి వస్తాయి. దీనినే వడదెబ్బ అంటాము.
👉ఈ సమయంలో ఎక్కువగా పుచ్చకాయ తీసుకోవాలి. ఇందులో పీచు, పొటాషియం మరియు పిండి పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల తక్షణ శక్తిని ఇస్తుంది.
👉నిమ్మ జాతి పండ్లు ప్రస్తుతం మన శరీరానికి చాలా అవసరం. పొటాషియం, ఫైటో న్యూట్రీయంట్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ సి పుష్కలంగా వుండటం వల్ల తక్షణ శక్తి ని ఇవ్వడంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
👉వడదెబ్బ తగిలిన వెంటనే ఉప్పు మరియు పంచదార కలిపిన నీళ్లను త్రాగించాలి.
👉 వదులుగా వుండే నూలు దుస్తులను ధరించి చల్లని గాలి తగిలే ప్రదేశం లో ఉంచాలి.
👉ఒకవేళ తప్పనిసరి బయటికి వెళ్లాల్సి వస్తే గొడుగుతో పాటు, నూలు వస్తువులు మరియు కళ్ళజోడు లాంటివి ధరించి వెళ్ళండి.
👉మజ్జిగ బాగా పల్చగా చేసుకుని త్రాగాలి. అందులో కరివేప, కొత్తిమీర మరియు పుదీనా వేసి త్రాగితే మరీ మంచిది.
👉జల్ జీరా నీళ్లు , నిమ్మగడ్డి పానీయం మరియు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.
👉పచ్చళ్ళూ, మసాలా పదార్థాలు, నూనె వంటలు మరియూ తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోకండి.
👉అంబిలి, రాగి జావ మరియు గంజి లాంటివి సేవించడం చాలా ఉత్తమం.
👉ఉల్లిపాయను ఎక్కువగా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా పెరుగు అన్నం, జావ లతో ఈ ఉల్లిపాయను తీసుకుంటే వేడిని తగ్గించడంతో పాటు ఒంట్లో ని గ్యాస్ ని కూడా తగ్గిస్తుంది.
👉ప్రతి గంట కి ఒకసారి నీళ్లను త్రాగండి.
👉బయట దొరికే శీతల పానీయాల కంటే మన ఇంట్లో తయారు చేసుకునే పండ్ల రసాలు త్రాగడం మంచిది.
👉మట్టి కుండలో నీళ్లు చాలా మంచివి.
👉ఒంట్లో వేడి మరీ ఎక్కువగా వున్నప్పుడు నూలు గుడ్డని చల్లని నీళ్లలో తడిపి శరీరం మొత్తం 10 నుండి 15 నిమిషాల పాటు తుడుచుకోవడం మంచిది.
--(())--
అద్భుతమైన ఔషధాల గని ఈ అలోవీరా.
ఓపిక పెట్టి చివరి వరకు చదవండి. మీకొరకు, మీ కోసం.. మా ఈ ప్రయత్నం.
👉అలోవెరా అతిముఖ్యమైన 75 విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది.
👉ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి డయాబెటిస్ (మధుమేహం) వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స గా పనిచేస్తాయి.
👉ఆలోవీరా మీ చర్మ ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని పెంచడంలో అద్భుతంగా తోడ్పడుతుంది.
✍️మెరిసే, ఆరోగ్యకరమైన చర్మం కోసం:
👉చర్మాన్ని తేమగా మరియు ఆరోగ్యంగా ఉంచే సహజ పదార్ధాలలో అలోవెరా ఉత్తమమమైనది.
👉 అధిక మొత్తంలో ఆలోవీరా లో ఉన్న కాస్మొటిక్స్ చర్మాన్ని మెరుగ్గా, ఎక్కువకాలం తేమగా ఉంచుతాయి .
👉పొడిబారిన చర్మాన్ని బాగు చేయడానికి కూడా కలబంద ఉపయోగపడుతుంది.
👉ఆలోవీరా మొటిమలు, మచ్చలు, స్ట్రెచ్ మార్క్స్ (చర్మపు చారలు) తగ్గించడానికి కూడా ఉపయోగించవచ్చు.
👉ఆలోవీరా చర్మంపై వచ్చే మంట, దురద మరియు కాలిన గాయాలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది.
👉హెర్పెస్ మరియు సోరియాసిస్ యొక్క చికిత్సలలో కలబంద ప్రభావవంతంగా పనిచేస్తుంది.
👉అలోవెరాలో ఉన్న ఫార్ములా, మొటిమలకు చికిత్స చేయడంలో సాధారణ క్రీమ్ కంటే ప్రభావవంతంగా పని చేస్తుంది.
👉ఆలోవీరాలో చర్మాన్ని మృదువుగా చేసే లక్షణాలు ఉన్నాయి.
👉అందువల్ల ప్రత్యేకించి మొటిమల కోసం వాడే చాలా మాయిశ్చరైజర్లలో దీన్ని కలుపుతారు.
👉ఆలోవీరా మంటలు, దురదలకు చికిత్సగా ఉపయోగపడుతుంది.
👉ఆలోవీరాను ఓసిమమ్ ఆయిల్‌తో కలుపుకుంటే అది మొటిమలపై మరింత సమర్ధవంతంగా పోరాడుతుంది.
✍️మొటిమలపై కలబందను ఎలా ఉపయోగించవచ్చో చూడండి.
👉రాత్రిపూట కలబందను నేరుగా మొటిమలపై రాసుకుని ఉదయం ముఖం కడుక్కోవాలి.
👉కలబందను నిమ్మరసంతో కలపడం కూడా సహాయపడుతుంది.
👉దీన్ని 8: 1 నిష్పత్తిలో చేయండి (కలబంద 8 భాగాలు నిమ్మరసం 1 భాగం).
👉ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకోండి.
👉కంటి ప్రాంతానికి, ముఖం యొక్క ఇతర సున్నితమైన భాగాలకు రాయకండి.
👉దీన్ని 10 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై మీ ముఖాన్ని నీటితో బాగా కడగండి.
👉ముఖంపై ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.
👉 కలబందను ప్రతీ రోజు తీసుకున్న వారిలో మూడు నెలల తరువాత, మఖంపై ముడతలు తగ్గి చర్మం మృదువుగా మారింది.
👉కలబందలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించే అసేమన్నన్ అనే సమ్మేళనం ఉంది.
👉ఈ విధంగా, వృద్ధాప్యం యొక్క సంకేతాలను ఆలస్యం చేయడానికి కలబంద సహాయపడుతుంది.
✍️ఎండా కాలంలో కమిలిన చర్మాన్ని మెరుగు పరచడానికి / సన్ ట్యాన్ నివారణకు:
👉ఎండలో తిరిగినప్పుడు చర్మం పై పొరల్లోని చర్మకణాల రంగు మారి చర్మం నల్లగా కమిలిపోయి మచ్చలు ఏర్పడతాయి.
👉అంటే సూర్యకాంతిలోని అల్ట్రా వయోలెట్ (UV) కిరణాల వల్ల చర్మం రంగు మారడం అన్నమాట.
👉సన్ టాన్ నివారించడంలో కలబంద చక్కగా పని చేస్తుంది.
👉కలబంద గుజ్జును చర్మంపై రాసుకుని గుండ్రంగా మర్దనా (మసాజ్) చేయాలి.
👉అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
👉ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
✍️గాయాలకు మందుగా పని చేస్తుంది.
👉కలబంద యొక్క ప్రధాన ప్రయోజనాల్లో గాయాలను తగ్గించడం ఒకటి.
👉ఫైబ్రోబ్లాస్ట్స్ (కొల్లాజెన్ ఉత్పత్తి చేసే కణాలు) విస్తరణను ప్రోత్సహించడం ద్వారా ఇది వైద్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
👉కలబంద గజ్జిని కూడా నయం చేస్తుంది. గజ్జి అనేది అంటువ్యాధి, చర్మ వ్యాధి.
👉తీవ్రమైన దురద మరియు ఎర్రటి మచ్చలు దీని లక్షణాలు.
👉గజ్జి చికిత్సలో కలబంద బెంజైల్ బెంజోయేట్ లాగా ప్రభావవంతంగా పని చేస్తుంది.
👉కలబంద రేడియేషన్ వల్ల ఏర్పడే చర్మపు ఇబ్బందులను నయం చేస్తుంది.
👉అధిక-స్థాయి రేడియేషన్ చికిత్స పొందిన వారికి కలబంద ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది.
✍️స్ట్రెచ్ మార్క్స్ తగ్గించడానికి సహాయపడుతుంది:
👉చాలా మంది ఆడవారు ప్రసవం అయిన తర్వాత చాలా రకాల సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు.
అందులో ఒకటి పొట్టపై కనపడే గీతలు/చారలు.
👉అయితే, వీటిని తగ్గించడానికి కలబంద చాలా బాగా సహాయపడుతుంది.
👉కలబంద రసంలో వీట్ జెర్మ్, ఆలివ్ నూనె, కోకో బటర్‌ను కలిపి చారలపై రాయాలి.
👉అరగంట తర్వాత చల్లని నీటితో కడగాలి.
✍️జుట్టు పొడవుగా పెరగడానికి:
👉కలబంద (ఆలోవెరా) అనేక జుట్టు సమస్యలతో సమర్థవంతంగా పోరాడుతుంది.
👉అది కూడా ఎక్కువ ఖర్చు లేకుండానే! ఆలోవెరాలో 75 పోషక విలువలు ఉన్నాయి.
👉 అంతే కాక, ఈ మొక్కలో 100 కి పైగా సూక్ష్మపోషకాలు కూడా ఉన్నాయి.
👉ఆలోవెరాలోని ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ మాడుపై ఉండే పాడైన కణాలను బాగుచేస్తాయి.
👉కుదుళ్ళ ఆరోగ్యాన్ని బాగుచేసి, త్వరగా జుట్టుపెరిగేలా చేస్తుంది.
👉ఆలోవెరాను జుట్టుకి రాయటం వలన జుట్టు వెంటనే మృదువుగా,మెత్తగా మారుతుంది.
👉మృదువైన జుట్టుతో హెయిర్ స్టైలింగ్ సులభమై, జుట్టును వదిలి ఉంచుకోవచ్చు.
👉ఆలోవెరా లోని ఫంగల్ వ్యతిరేక లక్షణం చుండ్రును నివారిస్తుంది.
👉కొబ్బరినూనె, ఆలోవెరాను సమానంగా కలిపితే మీ మ్యాజిక్ ప్యాక్ తయారవుతుంది.
👉వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ ను జుట్టుకి రాసుకుని నెమ్మదిగా మసాజ్ చేయండి. ముఖ్యంగా చివర్లలో ఎక్కువగా రాయండి.
👉 సరిగ్గా తల అంతా పట్టించి, ఒక గంట తర్వాత కడిగేయండి.
👉ఈ అద్భుతమైన కండీషనింగ్ చిట్కా మీ జుట్టు తేమను కోల్పోకుండా చేసి కాపాడుతుంది.
✍️చుండ్రును నివారిస్తుంది:
👉చుండ్రు సమస్యను నివారించడానికి అలోవెరా (కలబంద) చాలా బాగా పనిచేస్తుంది.
👉కలబందలో ఉండే పెక్టిన్ తలలో కొత్త కణాలను మరియు కణజాలాలను ఉత్తత్తి చేయడానికి, జుట్టును శుభ్రంగా మరియు మెత్తగా చేయడానికి గొప్పగా సహాయపడుతుంది.
👉తలలో చనిపోయిన కణాలను (డెడ్ స్కిన్ సెల్స్) తొలగించడం వల్ల కొత్త జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
✍️ఊబకాయం తగ్గించడానికి సహాయపడుతుంది:
👉కలబందను ఆహారంలో చేర్చడం ఊబకాయం తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
👉కలబంద మానవ శరీరంలో ఆహారం వల్ల వచ్చే ఊబకాయం తెచ్చే నష్టాలను కూడా తగ్గిస్తుంది.
👉మరీ ముఖ్యంగా, కలబంద గుజ్జు పొడి సబ్కటానియస్ మరియు విసెరల్ కొవ్వు బరువును గణనీయంగా తగ్గిస్తుంది.
✍️మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది:
👉ప్రేగులకి సంబందించిన సమస్యలలో అజీర్తి ఒకటి.
👉 కలబంద వాడకం ప్రేగులలో ఇబ్బంది ఉన్న వ్యక్తులలో నొప్పి మరియు అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.
👉కలబంద మలబద్దకంతో బాధపడుతున్న వారిలో నొప్పిని తగ్గిస్తుంది.
👉కలబంద పాలను సాధారణంగా విరోచనాలకు మందుగా ఉపయోగిస్తారు.
👉దీనికి కారణం కలబంద పాలు ఆంత్రాక్వినోన్ గ్లైకోసైడ్లను కలిగి ఉండడం.
👉కలబంద కలిగిన మందులతో చికిత్స చేసినప్పుడు దీర్ఘకాలిక మలబద్దకం ఉన్నవారికలో ఎంతో మెరుగుదల కనిపించింది.
✍️డయాబెటిస్ పై ప్రభావం చూపుతుంది :
👉కలబంద వాడకంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించవచ్చు.
👉కలబంద తరచుగా తీసుకున్న వారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 46.6 mg / dL తగ్గాయి.
👉గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ స్థాయిలపై కూడా కలబంద ప్రభావం చూపింది.
👉కలబందను ఉపయోగించిన వారిలో 4 వారాలలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని మారడమే కాక, వారి అసాధారణ లిపిడ్ ప్రొఫైల్స్ కూడా తగ్గాయి.
👉ఈ మొక్కలో గ్లూకోమన్నన్, హైడ్రోఫిలిక్ ఫైబర్ మరియు ఫైటోస్టెరాల్ ఉన్నాయి, ఇవి ఈ ప్రభావాలకు కారణమవుతాయి.
👉ఆసక్తికరంగా, అలోవెరా జెల్ మాత్రమే కాకుండా కలబంద ఆకుల గుజ్జు కూడా ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొన్నారు.
👉డయాబెటిస్ చికిత్స కోసం కలబందను ఉపయోగించడం చాలా సులభం.
👉మీరు రోజుకు రెండుసార్లు ఒక టీస్పూన్ కలబంద రసం తీసుకోవచ్చు.
👉ఇది ఇన్సులిన్ ప్రవాహాన్ని క్రమబద్ధీకరిస్తుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
👉అలోవెరా కణాలలోని మాక్రోఫేజ్ పనితీరును మెరుగుపరుస్తుంది, ఇవి రోగనిరోధక వ్యవస్థ యొక్క ముఖ్యమైన భాగాలు.
✍️జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది:
👉జీర్ణక్రియ సరిగా లేకపోవడం చాలా రకాల రుగ్మతలకి కారణం అవుతుంది.
👉కలబంద జీర్ణక్రియను మెరుగు పరచడానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది.
👉కలబందతో GERD (గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి) లక్షణాలకు కూడా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చికిత్స చేయవచ్చు.
👉దీని ప్రభావాలు ఒమెప్రజోల్ మరియు రానిటిడిన్ కంటే మెరుగైనవిగా గుర్తించబడ్డాయి, ఈ రెండు మందులు తరచుగా GERD కి సూచించబడతాయి.
👉ఈ మొక్క మీ జీర్ణశయాంతర ప్రేగులను ‘గ్యాస్ట్రిక్ యాసిడ్ యాంటీ-సెక్రటరీ యాక్టివిటీ’ యొక్క చెడు ప్రభావాల నుండి రక్షిస్తుంది.
✍️కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:
👉ఈ మొక్క గ్లూకోజ్, కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ సీరం స్థాయిలపై ప్రభావం చూపుతుంది.
👉రక్తంలో రెండు రకాల కొవ్వులు ఉంటాయి: ఒకటి మంచిది, మరొకటి చెడు కొలెస్ట్రాల్.
👉మంచి కొలెస్ట్రాల్ రక్తములో ఉండే చెడు కొలెస్ట్రాలను (LDL) కాలేయానికి చెరవేసి, ఆపైన శరీరం నుండి బయటకు పంపించేందుకు సహాయపడుతుంది.
👉కానీ ఈ లిపోప్రొటీన్ అధికంగా ఉండటం మీ ఆరోగ్యానికి మంచిదికాదు.
👉ఎందుకంటే, కొంత మందికి జన్యుపరమైన సమస్యలు ఉండటం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశాలు ఉండవచ్చు.
👉దీనిని సమతుల్యంగా ఉంచుకోవడంలో కలబంద మీకు సహాయపడుతుంది.
👉కలబంద కొలెస్ట్రాల్ పై చాలా ప్రభావవంతంగా ఉంటుంది, ఎందుకంటే ఇది రెండు రకాల లిపోప్రోటీన్ల మధ్య తగిన సమతౌల్యాన్ని ఉంచుతుంది.
✍️గుండె జబ్బులకు:
👉కలబందలోని ఉన్న అనేక అమైనో ఆమ్లాలలో ఆర్జినైన్ ఒకటి. నిజానికి, ఇది మీ గుండెకు చాలా ముఖ్యమైనది.
👉ఆర్జినైన్ అనేది ఒక రకంగా అత్యవసరమైన అమైనో ఆమ్లం అయినప్పటికీ దీనిని మన శరీరం తక్కువగా ఉత్పత్తి చేస్తుంది.
👉వీటిని వేరుశెనగ, వాల్నట్స్ (అక్రోట్లను), మరియు కలబందలో కూడా పొందవచ్చు.
👉సరైన రక్త ప్రసరణ మెటాబొలిక్ రేటును పెంచి శరీరంలో వ్యర్థ్యాలను తొలగిస్తుంది
✍️దురద, మంటలను తగ్గిస్తుంది:
👉కొన్ని అధ్యయనాలలో, కలబంద దురద మరియు మంటలపై చక్కటి ప్రభావాన్ని చూపిందని తెలిసింది.
👉కొంతమంది వాలంటీర్లతో కూడిన ఒక అధ్యయనంలో, హైడ్రోకార్టిసోన్ క్రీమ్ కంటే అలోవెరా జెల్ మంట మరియు దురదతో పోరాడటంలో మంచి ప్రభావాన్ని చూపింది.
👉కలబంద మంటను కూడా నిరోధించవచ్చని అధ్యయనాలు చూపించాయి
✍️కీళ్లనొప్పులు మరియు మోకాళ్ళ నొప్పులకు:
👉అలోవెరాలోని లక్షణాలు ఆస్టియో ఆర్థరైటిస్ (ముసలితనంలో వచ్చే కీళ్ళ వ్యాధి) చికిత్సలో కూడా సహాయపడతాయి.
👉ఆర్థరైటిస్ వంటి సందర్భాల్లో నొప్పి నివారణకు నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు సూచించబడతాయి.
👉కలబంద మొక్కను వాపు మరియు ఎర్రబడిన కీళ్ళపై పూయడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది.
✍️దంత సంరక్షణకు:
👉కలబంద చిగుళ్ళలో రక్తస్రావం మరియు వాపును తగ్గిస్తుంది.
👉ఇది నోటిని శుభ్రపరిచేటప్పుడు చేరుకోవడానికి కష్టంగా ఉండే ప్రాంతాల్లో కూడా శక్తివంతమైన మందుగా పనిచేస్తుంది.
👉నోటి పగుళ్లు లేదా విడిపోయిన మూలలకు చికిత్స చేయడానికి కూడా పనిచేస్తుంది.
👉రియడోంటైటిస్ నోటికి వచ్చే ఒక ఇన్ఫ్లమేటరీ వ్యాధి.
👉కలబంద తీసుకోవడం వల్ల ఈ వ్యాధి సంబంధిత లక్షణాలు తగ్గుతాయి.
👉అలోవెరా క్లోర్‌హెక్సిడైన్ తో సమాన ప్రభావాన్ని చూపించడం వల్ల దీన్ని సాధారణంగా మౌత్ వాష్‌లలో ఉపయోగిస్తారు.
👉కలబంద గల ఒక టూత్ జెల్ కావిటీస్ (దంతాలలో ఏర్పడే రంధ్రాలు) కలిగించే బ్యాక్టీరియాను నియంత్రించడంలో టూత్‌పేస్ట్ కంటే కూడా చాలా ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది.
👉సున్నితమైన దంతాలు లేదా చిగుళ్ళు ఉన్నవారికి కలబంద ఉత్తమ ప్రత్యామ్నాయం.
👉టూత్‌పేస్టులలో ఉండే కఠినమైన రాపిడి కలబందలో లేదు.
👉కలబందలో గల యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు దంత సంరక్షణలో చక్కని పాత్ర వహిస్తాయి.
✍️దగ్గు, జలుబు, మరియు గొంతు నొప్పులకు:
👉కలబంద గుజ్జు దగ్గు, జలుబు, మరియు గొంతు నొప్పులను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది.
👉దీనిలో గల యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దగ్గు, గొంతు నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడతాయి.
👉కలబంద గుజ్జును తీసుకుని కొద్దిగా తేనె కలపండి. ఎందుకంటే కలబంద చాలా చేదుగా ఉంటుంది.
👉రెండిటినీ కలిపి తినండి. ఇది దగ్గు జలుబులకు చక్కని ఇంటి చిట్కా.
🙏ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏
--(())--
సేకరణ ప్రాంజలి ప్రభ....
****************************
నేటి నా పాట పాట సంఖ్య:-595.
*****************************
రచన:- మహేష్ వూటుకూరి ✍️
9640713717.
దోర్నాల.
ప్రకాశం జిల్లా.
02/04/2023.
*****************
పాట సందర్భంపై నా విశ్లేషణ.
***************************
సరసానికి సరదాలు తోడైన సమయంలో
అనుకోని విధంగా విరహం లా వేచివుండేలా పానకంలో పుడకలా గోతికాడి నక్కలా ఒకరి సరదాలను మరికొందరు వినోదం గా చూస్తు ఆటంకం కలిగిస్తున్నార నే విధంగా పాటలో ఆటలో అరటిపండు సామెతలా సాగుతున్న ఇద్దరి మద్య సాగే మాస్ సంభాషణలు
ఆటలో భాగంగా పాటగా ఐటం సాంగ్ పాట.!!
********************************************
పల్లవి:-
*******
లాహే లాహే లాంతరు వెలుగులో
దొరికావే బందరు లడ్డులా..
రాయే రాయే జంతరు మంతరు జిలుగులో
జబర్దస్త్ చేసేద్దాము రాయే రాయే రవ్వల లడ్డు!!
గుడి బైట గువ్వల జంట
పడి పడి ఆడే ఆటే ఆడెద్దాము రాయే రాయే
వదిలేదేలేదే వయ్యారి
అదిలిస్తానే నీ అందాలనే చెకుముకి సుందరి
కుదురింది ఇన్నాళ్లకి నీకొంప కొల్లేరు కావాల్సిందే
కోనంకి మంజరి..
గంప కింద కోడిపెట్ట గుడ్డు కొట్టేయ్యాల్సిందే
గుండు మల్లెల సంగతేదో తేల్చేయ్యాల్సిందే
పండులోని రసమంతా జుర్రకోవాల్సిందే
నిండు జాబిల్లి వెన్నెలనంతా సొంతం చేసుకోవాల్సిందే!!
లాహే లాహే లాంతరు వెలుగులో
దొరికావే బందరు లడ్డు లా..!!
చరణం:-
********
ఊరంతా నిద్దుర పోతోంది
రేయంతా మన కోసమేనంటోంది
పువ్వులన్ని రమ్మంటున్నయ్
దివ్వెలన్ని చూస్తున్నయ్
కొవ్వంతా కరిగించే చుమ్మా చుమ్మా బొమ్మ చూడాల్సిందే.!!
ముడుచుకొని పడుకున్న ముసలోల్లంతా
మన పడుచుదనం సయ్యాటను చూడాలని
కంతల్లోని ఎలుకల్లా ఎట్లాచూస్తున్నారో చూడు
సొంత మనుషులై వుండి సంత లా ఇదేం పాడుబుద్దిరో.!
పల్లవి:-
*******
లాహే లాహే లాంతరు వెలుగులో
దొరికావే బందరు లడ్డూలా..
చరణం:-
**********
చీకటేమో వెళ్ళిపోతోందే చింతామణి
చింతలేమో తీర్చలేదు సొగసులా భామామణి
వేల కళ్ళు చూస్తుంటే కోలాటం కాదులే కదా
లోనలోన ఆరాటానికి ఇదేమి పట్టదు కదా!!
సమయం కుదరని సరసం రంజుతనం
యమరంజుగా విందు చేస్తానులే
మయూరంలా పురివిప్పిన నీ యవ్వనసీమపై
ఏడుజన్మల బంధంతో ముడివేస్తానులే
ఈ మాటకై ఎదురుచూస్తున్నానులే
ఆ ఆటకై నిదుర రాకున్నాదిలే
వేటగాడి వలలో పడ్డావులే
అటు ఇటు ఎటు వైపు పోనీయనులే
అంతా నీదేనులే అంతు చూస్తానులే ...
పల్లవి:-
*********
లాహే లాహే లాంతరు వెలుగులో
దొరికావే బందరు లడ్డూలా..
***************************
Comments
Post a Comment