ప్రాంజలి ప్రభ ..09 /04*
న్యస్తాక్షరి.......
స్వ
ర్ణ
కా
రు
లు
పద్య పాదాది న రావాలి
పంచపది లో పూరించండి.
♣️♣️♣️
స్వరము నిస్వరము కదిలె సమయ కల వ
ర్ణనను తెలుపగలరు విధాన కరుణ కథ
కాల మునుబట్టి సహనపు కలలు మన గు
రువులు భోధన తృప్తియు ఋణ సుగుణము
లు విధి తెలుపుట విద్యయే ముఖ్య మౌను
దత్తపది...........
గంగ యమున కృష్ణ తుంగ
సీస పద్యము
కవులశ్వేచ్ఛ యనేది కావ్యపటిమబట్టి
హృదయమ్ము రంజింప హృద్య మేను
శాంతి ప్రశాంతిగా సామరస్యపు దృష్టి
మనుషుల రుగ్మత మాయ తెంచు
పలుకు గంగ ప్రవాహ ప్రగతి కోరి బతుకు
సందేశపు కథలు దేశ భక్తి
కాలనిర్ణయమును కలిసేటి జీవితం
కరుణ దయ హృదయ కావ్య జగతి
గంగ కదులుతూ దాహము గమ్య మగుట
యమున సహనముగా చేరి ఎల్లె కలిసె
కృష్ణ గోదావరి కలియు కృపతొ చూడు
తుంగ భద్ర ఉప్పొంగుట పుణ్య మగుట
....
🕉️🙏शुभोदयः।🙏🕉️
देयं भोज्यधनं सदा सुकृतिभिर्नो सञ्चितव्यं कदा
श्रीकर्णस्य बलेश्च विक्रमपतेरद्यापि कीर्तिः स्थिता ।
अस्माकं मधुदानभोगरहितं नष्टं चिरात् सञ्चितम्
निर्वाणादिति नैजपादयुगलं धर्षन्त्यहो मक्षिकाः ॥
దేయం భోజ్యధనం సదా సుకృతిభిర్నో సఞ్చితవ్యం కదా
శ్రీకర్ణస్య బలేశ్చ విక్రమపతేరద్యాపి కీర్తిః స్థితా।
అస్మాకం మధుదాన భోగరహితం నష్టౌ చిరాత్ సఞ్చితమ్
నిర్వాణాదితి పాణిపాదయుగళం ధర్షన్త్యహో మక్షికాః॥
యోగ్యులు తమ అవసరాలకు మించి ఉన్నదంతా దానధర్మాలకు ఇవ్వాలి. దాతృత్వం ద్వారా నేటికీ కర్ణుడు, బలి మరియు రాజు విక్రమాదిత్య మాత్రమే జీవించి ఉన్నారు. తేనెటీగలు భూమిపై నిరాశతో కాళ్లను కొట్టుకునే దుస్థితిని చూడండి. వాళ్ళు తమలో తాము “అయ్యో! మేము నిల్వ చేసిన తేనెను ఆస్వాదించలేదు లేదా దాతృత్వానికి ఇవ్వలేదు మరియు ఇప్పుడు ఎవరైనా దానిని తక్షణం మా నుండి తీసేసుకుంటున్నారు. మేము ఎప్పుడూ నష్టపోతున్నాము" అని బాధపడుతున్నాయి. భావము - అవసరానికి సరిపడినంత మాత్రమే ఉంచుకొని మిగిలినది దానం చెయ్యాలి.
......
*ప్రాఃజలి ప్రభ
పెద్దలను అర్ధం చేసుకోకుండా అపార్ధం చేసుకోకండి
*చిన్న సంఘటన*
పూర్వము *భారవి అనే కవి వుండేవాడు.*
ఆయన చిన్నతనం లోనే కవిత్వం చెప్పేవాడు. కావ్యాలు వ్రాసేవాడు.
ఊర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు.
భారవి తండ్రితో నీకొడుకు చాలా బాగా వ్రాస్తాడయ్యా అనేవారు.
ఆయన మాత్రం వాడింకా చిన్నవాడు యింకా నేర్చు కోవలిసింది చాలా వుంది. ఏదో వ్రాస్తాడులే అనేవాడు.
*భారవికి తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తి.*
తల్లి దగ్గర నాన్నగారు నన్ను తీసిపారేసినట్టు మాట్లాడుతారు.
వూర్లో వారంతా నన్ను మెచ్చుకుంటూ వుంటే తనేమో ఏమున్నది
యింకా వాడు చిన్నవాడు అన్నట్టు మాట్లాడుతారు.
అని చాలా సార్లు చెప్పుకున్నాడు.
*ఎన్నాళ్ళయినా తండ్రి ధోరణి మారక పోయే సరికి భారవికి తండ్రిమీద కసి పుట్టింది, ఆయనను చంపాలని నిశ్చయించుకున్నాడు*
ఒకరోజు రాత్రి ఆయన వంటింట్లో భోజనం చేస్తున్నాడు
భార్య వడ్డిస్తూ వుంది.
*భారవి, ఆయన పెరట్లోకి చెయ్యి కడుక్కునేందుకు వస్తే చంపెయ్యాలని పెద్ద బండరాయి పట్టుకొని పెరట్లో ఒక పక్క కాచుకొని కూర్చున్నాడు*
అప్పుడు భారవి తల్లి భర్తతో మీరెందుకు వాడిని అస్తమాను చిన్నబుచ్చినట్లు మాట్లాడుతారు?వాడు చాలా బాధ పడుతున్నాడు.
*వూరు ఊరంతా వాడిని మెచ్చుకుంటూ వుంటే మీరు మాత్రం వాడికేమీ తెలీదని అంటారట!*
అప్పుడు *తండ్రి నవ్వి.... పిచ్చిదానా! నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా?తండ్రి పొగిడితే బిడ్డకు ఆయుఃక్షీణం అంటారు. అంతే కాకుండా పొగడ్త మనిషిని పాడు చేస్తుంది, వాడి అభివృద్ధికి ఆటంకమవుతుంది. ఇంకా యెంతో పైకి రావలిసినవాడికి గర్వం పెరిగి తనంతవాడు లేడని విర్రవీగుతాడు, దానితో వాడి అభివృద్ధి ఆగిపోదా? అన్నాడు.*
అదివిని భారవికి బుర్ర తిరిగి పోయింది.
*పశ్చాత్తాపంతో రగిలి పోయాడు. వెంటనే బండ అక్కడ పారవేసి లోపలికి వెళ్లి తండ్రి పాదాలమీద పడి భోరున ఏడ్చాడు.*
తాను తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి నాకేదయినా శిక్ష వేయమని బ్రతిమాలుకున్నాడు.
"పశ్చాత్తాపం తో నీపాపం పోయింది! శిక్ష ఎందుకు? అని తండ్రి చెప్తున్నా వినకుండా తనకు శిక్ష వేయమని పట్టు బట్టాడు".
తండ్రి సరే అలాగయితే మీ అత్తవారింట్లో ఒక సంవత్సరం ఎవరికీ, చివరికి నీ భార్యకు కూడా ఎందుకు, ఏమిటి, ఏ కారణాలు చెప్పకుండా అక్కడవుండి రా! అన్నాడు.
*ఇంత చిన్న శిక్షనా? అన్నాడు భారవి.*
తండ్రి నవ్వి అది చాల్లే వెళ్ళుఅన్నాడు.
*భారవికి చిన్నతనంలోనే పెళ్లయింది. అప్పటికి యింకా భారవి భార్య కాపురానికి రాలేదు.*
సరేనని భారవి అత్తగారి వూరికి వెళ్ళాడు.
వాళ్ళు అల్లుడుగారు వచ్చారని చాలా మర్యాద చేశారు.
రోజుకో పిండివంట చేసి ఆదరించారు.నెల రోజులు గడుస్తున్నా అల్లుడు వెళ్ళటం లేదేమని
వాళ్ళు విసుక్కున్నారు.
చిన్న చిన్న పనులు చెయ్యమని చెప్పడం ప్రారంభించారు. మర్యాదలు తగ్గాయి. బావ మరుదులు పొలం పనులు కూడా పురమాయించారు.
*అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు..*
దేనికీ బదులు చెప్పకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు.
*అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు.భారవి భార్యకు చాలా బాధగా వుండేది. భర్తకు ఆవిడ మీరు మీ ఊరు వెళ్లిపోండని యెంతో చెప్పి చూసింది.*
భారవి సమాధానం చెప్పకుండా మౌనం వహించేవాడు.
*ఇలా సంవత్సరం గడిచింది. అప్పుడు భారవి యింక నేను మావూరికి పోయివస్తానని బయల్దేరాడు.*
ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్లాలని అంటున్నాడో వాళ్లకు అర్థం కాలేదు.
*భార్యకు, అత్తామామలకూ విషయం వివరించి నాశిక్ష పూర్తి అయింది అందుకని వెళుతున్నాను అని చెప్పాడు.*
ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు.
*భారవి తనతండ్రి వేసిన శిక్ష తనలో ఎంతో ఓర్పును, నేర్పును, సహనాన్ని, అవగాహనను పెంచాయని గ్రహించాడు.*
తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి! మీ అభివృద్ధిని కోరుకునే వారిలో ఆయనే ప్రథముడు.
*చిన్నప్పుడు తల్లి కోప్పడిందని, తండ్రి దండించాడని వారి మీద కోపం పెంచుకోకండి!*
అదంతా మీరు బాగుపడాలనీ, వృద్ధి లోకి రావాలనీ చేసి వుంటారని గుర్తు పెట్టుకోండి!
"తల్లిదండ్రులను ద్వేషించకండి!
అంతకంటే పాపం
ఇంకోటి వుండదు"🌞
🔯🔯🔯🔯🔯🔯
🤷♂🤷♂😊😊😔😔😊😊
"కల్ప వృక్ష చక్రము" లేదా "హృత్ చక్రము" 8 దళముల కమలముగా ఉన్నది. ఉన్న స్థాయి కుండలినీ యోగులు, ఈ కల్పవృక్ష చక్రము పై ధ్యానము చేయుట ఉత్తమము. ఈ చక్రము, అనాహత చక్రానికి క్రిందుగా, 2 నుండి 4 అంగుళముల క్రింద కలదు.
అనాహత చక్రానికి క్రింద "ఆనంద కందము" అనే కేంద్రము కలదు. ఇది ఆనందానికి కేంద్రము. పూర్వ ప్రాచీన గ్రంథాలలో ఈ కేంద్రాన్ని "కల్ప వృక్షము" (wish full filling tree) అనేవారు. కొన్ని ప్రాచీన గ్రంథాలలో ఈ కేంద్రాన్ని "చింతామణి" గా కూడా పిలిచేవారు. ఈ "చింతామణి" శబ్ద బ్రహ్మ తత్వాన్ని కలిగియుంటుంది.
శబ్ద బ్రహ్మం▶నాద బ్రహ్మం▶పరంబ్రహ్మ
ఈ చక్రం తెల్లని, బంగారు,ఎరుపు వర్ణాలతో ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ చక్ర జయం ద్వారా సాధకుడు తన కోరికలు తీర్చుకొనే శక్తిని సముపార్జిస్తాడు. ఈ చక్రానికి హృత్ పద్మము, హృత్ పుండరీకము, హృదయాంభోజము అనికూడా అంటారు.
"మనువు నుండి రేఖగా వచ్చుచున్న మార్గము పరమముగా అంగీకరించి అటు నిటు దాటకుండ చక్రనేమి యందు దిలీపుని ప్రజలు వర్తించుచున్నారు " అని కాళిదాసు రఘువంశమున వర్ణించెను.
వృత్తి ధర్మములు, వయో ధర్మములు, వర్ణ ధర్మములు సక్రమముగా పరిపాలింపబడుట చేత మానవులీ రేఖను తమ యందు స్పష్టపరచు కొనుచుందురు. అపుడు దేవతలను గౌరవించుటయు, దేవతలు జీవులకు సకాల వర్షమును సస్య గో క్షీరాది సంపదలను ప్రసాదించి గౌరవించుటయు జరుగును.
ఇట్లు పరస్పరము గౌరవించుటయే యజ్ఞమాచరించుట. " ఈ యజ్ఞమార్గమున దేవతలను గౌరవించుట వలననే దేవతలు మిమ్ము గౌరవించు చున్నారు", అని గీతలో కృష్ణుడు చెప్పెను.
🌹 🌹 🌹 🌹 🌹
రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి.. మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు కూడా పంపండి..
1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
= వాల్మీకి.
2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
= నారదుడు.
3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?
= తమసా నది.
4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?
=24,000.
5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?
=కుశలవులు.
6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
=సరయూ నది.
7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?
=కోసల రాజ్యం.
8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
=సుమంత్రుడు.
9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?
=కౌసల్య, సుమిత్ర, కైకేయి.
10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
=పుత్రకామేష్ఠి.
11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?
= కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.
12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానరుడెవరు?
=జాంబవంతుడు.
13. వాలి ఎవరి అంశతో జన్మించెను?
= దేవేంద్రుడు.
14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?
=హనుమంతుడు.
15. కౌసల్య కుమారుని పేరేమిటి?
=శ్రీరాముడు.
16. భరతుని తల్లి పేరేమిటి?
=కైకేయి.
17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?
=లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.
18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?
=వసిష్ఠుడు.
19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?
=12 సంవత్సరములు.
20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?
=మారీచ, సుబాహులు.
21. రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?
=బల-అతిబల.
22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
=సిద్ధాశ్రమం.
23. తాటక భర్త పేరేమిటి?
=సుందుడు.
24. తాటకను శపించిన మహర్షి ఎవరు?
=అగస్త్యుడు.
25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?
=భగీరథుడు.
26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?
=జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.
27. అహల్య భర్త ఎవరు?
=గౌతమ మహర్షి.
28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?
=శతానందుడు.
29. సీత ఎవరికి జన్మించెను?
=నాగటి చాలున జనకునికి దొరికెను.
30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?
=దేవరాతుడు.
31. శివధనుస్సును తయారు చేసినదెవరు?
=విశ్వకర్మ.
32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?
=మాండవి, శృతకీర్తి.
33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?
=జనకుడు.
34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?
=కుశధ్వజుడు.
35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?
=వైష్ణవ ధనుస్సు.
36. భరతుని మేనమామ పేరు ఏమిటి?
=యధాజిత్తు.
37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?
=మంధర.
38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?
=గిరివ్రజపురం, మేనమామ యింట.
39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?
=శృంగిబేరపురం.
40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?
=గారచెట్టు.
41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?
=భారద్వాజ ముని.
42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?
=మాల్యవతీ.
43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?
=తైలద్రోణములో.
44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?
=జాబాలి.
45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?
=నందిగ్రామము.
46. అత్రిమహాముని భార్య ఎవరు?
=అనసూయ.
47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?
=విరాధుడు.
48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?
=అగస్త్యుడు.
49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?
=గోదావరి.
50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?
=శూర్ఫణఖ.
51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?
=జనస్థానము.
52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?
=మారీచుడు.
53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
=బంగారులేడి.
54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?
=జటాయువు.
55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?
=దక్షిణపు దిక్కు.
56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?
=కబంధుని.
57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?
=మతంగ వనం, పంపానదీ.
58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?
=ఋష్యమూక పర్వతం.
59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?
=హనుమంతుడు.
60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
=అగ్ని సాక్షిగా.
61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?
=కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.
62. సుగ్రీవుని భార్య పేరు?
=రుమ.
63. వాలి భార్యపేరు?
=తార.
64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?
=కిష్కింధ.
65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?
=మాయావి.
66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?
=దుందుభి.
67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?
=మతంగముని.
68. వాలి కుమారుని పేరేమిటి?
=అంగదుడు.
69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?
=ఏడు.
70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?
=ప్రసవణగిరి.
71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=వినతుడు.
72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=అంగదుడు.
73. సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం పశ్చిమ దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?
=మామగారు, తార తండ్రి.
74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=శతబలుడు.
75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను?
=మాసం (ఒక నెల).
76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?
=దక్షిణ దిక్కు.
77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?
=తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.
78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?
=స్వయంప్రభ.
79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?
=సంపాతి.
80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?
=పుంజికస్థల.
81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?
=మహేంద్రపర్వతము.
82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?
=మైనాకుడు.
83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?
=సురస.
84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?
=సింహిక.
85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?
=నూరు యోజనములు.
86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?
=లంబ పర్వతం.
87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?
=అశోక వనం.
88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?
=రెండు.
89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?
=త్రిజట.
90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?
=రామ కథ.
91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?
=చూడామణి.
92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?
=ఎనభై వేలమంది.
93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?
=ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.
94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?
=విభీషణుడు.
95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?
=మధువనం.
96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?
=మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.
97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?
=ఆలింగన సౌభాగ్యం.
98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?
=నీలుడు.
99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?
=నికుంభిల.
100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?
=అగస్త్యుడు.
101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?
=ఇంద్రుడు.
102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?
=మాతలి.
103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?
=కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!
104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?
=హనుమంతుడు.
105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?
=శత్రుంజయం.
106. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?
=స్వయంగా తన భవనమునే యిచ్చెను.
107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?
=బ్రహ్మ.
108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?
=తన మెడలోని. ముత్యాలహారం.
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:


Comments
Post a Comment