ప్రాంజలి ప్రభ 1౦/౦4/2023



అవకాశం ఇచ్చాడు కాని ద్రౌపది ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ, అరుస్తూ,అరుస్తూవున్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకునే వున్నాడు. ద్రౌపదిని రక్షించలేదు.

దీని ఫలితం ఏమిటంటే, మరణం కోరుకున్నప్పుడే  వరం వచ్చిన తరువాత కూడా, బాణాల అంపశయ్య దొరికింది.

జటాయువు స్త్రీని సన్మానించాడు. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, కాబట్టి చనిపోతున్నప్పుడు, అతనికి ప్రభు “శ్రీరాముడి” ఒడి అనే పాన్పు లభించింది!
ఇతరులుకు తప్పు జరిగిందని చూసి  కూడా ఎవరు కళ్ళు తిప్పు కుంటారో,  వారి గతి భీష్ముడిలా అవుతుంది. ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ, ఇతరుల కోసం పోరాడుతారో వారు, మహాత్మ జటాయువులా కీర్తి సంపాదిస్తారు .
"నిజం అనేది  కలత చెందుతుంది, కానీ ఓడిపోదు ."
"సత్యమేవ జయతే "

........

*చివరి వరకు ఎవరు పట్టుదలతో ఉంటారో వారే జయిస్తారు.

*ప్రకృతి నుండి అన్నింటినీ పొందాలని అనుకుంటాం. కానీ ప్రకృతి మన సర్వస్వాన్ని సంగ్రహించి శక్తిని పూర్తిగా హరించి, పక్కన పారేస్తుందని చివరికి తెలుస్తుంది.

భాగవతము

శ్రీగురుభ్యోనమః

"ఓం సత్యం పరం ధీమహి" అనునది నిజమైన గాయత్రి మంత్రం. పరమైనది, సత్యమైనది అను దానిని నేను ఆరాధన చేస్తున్నాను అని అర్ధము. ఈ మంత్రము బ్రహ్మమును చేరడానికి ఈయబడిన మంత్రము. 

"ఓం సత్యం పరం ధీమహి" అనునది ఏకపధ గాయత్రి. ప్రాపంచిక విషయముల యందు సంగము లేనివారు ఎక్కువగా ఈ మంత్రముచేస్తారు. "తత్సవితుర్వరేణ్యమ్ భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్"  ఇది మూడు పాదాల గాయత్రి. ఇది విశ్వామిత్రుని ద్వారా మనకు అంది వచ్చినది.

****

 శ్రీరమణీయం - (754)

"నువ్వు నువ్వుగా ఉండు' అనే బోధలోని ఆంతర్యం ఏమిటి !?"

'నేను మనిషిని' అని అనుకోకపోయినా మనందరం మనుషులమే. మనందరం దైవస్వరూపులమని వేదం చెప్తుంది. కాబట్టి నేను దైవాన్ని అనుకోకపోయినా మనం దైవస్వరూపులమే. తాము ఆత్మస్వరూపులం అన్న పరిపూర్ణ జ్ఞానం కలిగిన శ్రీరమణమహర్షి వంటి మహానుభావులు 'నువ్వు నువ్వుగా' ఉండమని బోధించారు. మనం మనంగా ఉండటమంటే నేను ఆత్మనని, అజ్ఞానినని, దైవాన్నని, దేహాన్నని ఏదీ అనుకోవాల్సిన అవసరం లేదు. వ్యవహారంలో తగినంత మితంగా ఉంటేచాలు. ఇప్పటికే ఆత్మస్వరూపులుగా ఉన్న మనం ఆత్మగా మారటానికి ఏ సాధనచేయనక్కర్లేదు. మనం చేయాల్సిన సాధన అంతా ఇప్పుడున్న అనాత్మభావనను తీసేసుకోవడానికే !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"

సాధనంతా ఆత్మగా మారటానికి కాదు.. అనాత్మభావన పోవటానికే !''- (అధ్యాయం -93)

***

"ఋభుగీత" (221) బ్రహ్మానందము" 16వ అధ్యాయము 

దోషాలను శుద్దిచేసే స్పిరిట్ మనలోనే ఉంది... అదే స్పిరిచ్యువాలిటి !

గుణాలను నమోదు చేసుకునే మనసే తిరిగి వాటికి ఫలితాలను కూడా అందిస్తుంది. మన ఆశ, కోపం, అసూయ, ద్వేషం అన్నింటినీ శుద్ధి చేసేది వాటికి తగిన ఫలితాలను అందించడం ద్వారానే. ఆ శుద్ధి కార్యక్రమాన్నే మనం మనకోణంలో చూసి శిక్షలుగా భావిస్తాము. మన దోషాలను శుద్దిచేసే స్పిరిట్ మనలోనే ఉంది. అదే మనని గుణరహితంగాచేసే స్పిరిచ్యువాలిటి. మన సుఖాలకు కారణం మనంచేసిన పుణ్యం, మన దుఃఖాలకు కారణం మనంచేసిన పాపం. అందరికీ వర్తించే ఈ శాశ్వతసత్యం స్మరణలో ఉంటే వేదన చెందకుండా మన పాప, పుణ్య కార్యాలను మనమే నియంత్రించుకుంటాము.  మనకు తెలిసినా , తెలియకపోయినా మనంచేసే పాప, పుణ్య ఫలాలు ఖచ్చితంగా మనతోనే ఉంటాయి !

***

 *112-మంద్రగీత* అధ్యాయము-10

దివ్య వైభవము

7. ఈ నా వైభవమును, వీరికి నాతో గల యోగమును గూర్చిన జ్ఞానమును ఆవశ్యకత బట్టి  కొందరు జీవులకు కూడా కల్పింతును. ఇప్పుడు నీకెట్లు కలిగించితినో వారికి అట్లే కల్పింతును. వారే మంత్ర ద్రష్టలు, శాస్త్రకర్తలు, ధర్మ మూర్తులై లోకమును కాపాడుటకు నిమిత్తమాత్రము అగుదురు. ఇట్టినా వైభవమును, వీరితో గల యోగమును తత్త్వముగ తెలిసినవాడు అచంచలమైన యోగస్థితి పొంది నా యందు వసించును.

8. ఎవరియందు ఏది ప్రత్యేకత వహింపవలెనో వారి యందు వైభవమును నా భావముగ కల్పించి నేనుగ నుందును. ఇట్లు ఈ సమస్తమునకు 'నేనే' ఉత్పత్తి కారణమనియు 'నా' యందే భావములుగ జగత్తులు వర్తించుచున్నవనియు స్మరించి నన్ను ఆరాధించువారు బుధులు అనబడుదురు. వారికందరికిని నా భావములే యుండును. లోకములందు జ్ఞానము జీవులకు ప్రకాశించుటకు వారే గురువులు.

9. వారు 'నేనే' చిత్తముగా జీవించుచు, వారు బోధించు బోధగా నన్నే అనేక కథల రూపమున చెప్పుకొనుచు, సంతోషించుచు, స్వేచ్ఛా విహారము చేయుచుందురు. ఆ కథలే సర్వమానవ పురాణ గాధలు.

10.నా కథల యందు ఇట్లు ప్రీతి కలిగి యోగస్థితిలోన ఆరాధించువారికి బుద్ధిరూపమున ప్రసన్నమై నా జ్ఞానమును వారియందు నిలుపుటకు క్రీడగొని యుందును. దీనినే నా అనుగ్రహమందురు. అది కలిగిన వానికి తెలియనిది ఏమియు లేదు.

11. వానియందు 'నేను' జాలిగొని వారిలోని నేనుగ జ్ఞానదీపమై ఉండి, అజ్ఞాన తిమిరము సమీపించకుండ చూచుకొందును.

****

*శివుడి నివాసం ఎలా ఉంటుంది?*

 *శివుడు కైలాస పర్వతం మీద ఉంటాడని అందరికీ తెలిసిందే.అయితే ఆ పరమేశ్వరుడు నివశించే ప్రాంతమంతా ఎంత* *శోభాయమానంగా ఉంటుంది?* *పరిసరాలలో ఏవేవి ఉంటాయి? అనే విషయాలతో పాటు ఇంద్రాది దేవతలు ఎక్కడెక్కడ ఉంటారు? అనే సమాచారాన్ని కూడా ఇస్తుంది ఈ కథా సందర్భం. ఇది లింగ పురాణం యాభై, యాభై ఒకటో అధ్యాయాలలో ఉంది. శివుడు దేవకూటం అనే పర్వత శిఖరం మీద ఉంటాడు. ఎత్త్తెన ఆ శిఖరం మీద భూతవనం అనే పేరున్న వనం ఉంది. దేవకూట పర్వతం సువర్ణ సహిత వైఢూర్య, మాణిక్య నీల గోమేధిక కాంతులతో విరాజిల్లుతుంటుంది.* *భూతవనం ఎంతో ప్రశాంతంగా చంపక, అశోక, పున్నాగ, వకుళ పారిజాతాది వృక్షాలతో నిండి ఉంటుంది. ఆ వృక్షాల మీద అనేక రకాల పక్షులు మధుర ధ్వనులు చేస్తూ ఉంటాయి. సుగుంధ భరిత పుష్పాలు నేల మీద రాలి కావాలని ఎవరో అలంకరించినట్టుగా ఉంటాయి. అక్కడక్కడ పుష్పాసనాలు కనిపిస్తాయి. చక్కటి సాధు జంతువులు ఆ వనమంతా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. స్వచ్ఛ జలాలతో ప్రవహించే నదులు, సెలయేళ్ళు పరిసరాలకు శోభను కలిగిస్తూ ఉంటాయి. నున్నగా ఉండి పెద్ద పెద్ద మానులతోనూ,* *విస్తరించిన కొమ్మలతోనూ ఉండే వృక్షాలు దట్టమైన నీడను కల్పిస్తూ ఉంటాయి.* 

 *దేవదేవుడైన శంకరుడి మందిరం మణి విభూషితంగానూ, బంగారు మయంగానూ, స్ఫటిక నిర్మితంగానూ ఉన్న గోపురాలతో అలరారుతూ ఉంటుంది. అక్కడ పట్టు వస్త్రాలను కప్పి ఉన్న మణిమయ సింహాసనాలు ఉంటాయి. ఆ సింహాసనాల పైనే పరమేశ్వరుడు ఆసీనుడై ఉంటాడు. బ్రహ్మ, ఇంద్ర, ఉపేంద్రులతో పూజలందుకుంటున్న భూతేంద్రులు, ప్రమథ గణాలు అక్కడ ఉంటాయి.* *భూతేంద్రులు, సిద్ధులు, ప్రమథులు, రుషులు, గంథర్వులు, బ్రహ్మాది దేవతలు మంగళవాద్య రవళుల నడుమ నిత్యం పరమేశ్వరుడిని కొలుస్తూ ఉంటారు. అక్కడికి సమీపంలో యక్షేశ్వరుడైన కుబేరుడు నివసిస్తూ ఉంటాడు. కుబేర నగరంలో కోటి సంఖ్యలో యక్షులతో పాటు పుణ్యాత్ములు నివసిస్తుంటారు.* *కుబేర శిఖరం నుంచి మందాకినీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదిలోకి దిగేందుకు అనువుగా కావలసిన చోట్ల బంగారు మెట్లు నిర్మితమై ఉంటాయి. మందాకిని నదిలో సుగంధ* *భరిత పుష్పాలు వికసించి మనోహరంగా ఉంటాయి. యక్ష, గంథర్వ, అప్సర స్త్రీలు, దేవ, దానవ, కిన్నెరులు ఆ నదిలో ఆనందంగా స్నాన పానాలను చేస్తుంటారు. మందాకినీ నదికి ఉత్తర భాగంలోను, కనక నందా నదికి తూర్పు భాగంలోనూ నందా నదికి నైరుతి దిక్కున ఉండే రుద్రపురిలో సాంబసదాశివుడు అమ్మ వారితో హాయిగా విహరిస్తుంటాడు అని లింగ పురాణం ఇలా శివ నివాస స్థానాన్ని పేర్కొంటోంది.* 

 *అలాగే ఇంద్రాదుల విషయానికొస్తే శీతాంతం అనే పర్వత శిఖరం మీద పారిజాత వనంలో దేవేంద్రుడు ఉంటాడు. దానికి తూర్పున ఉన్న కుముద పర్వతం శిఖరం మీద దానవులకు చెందిన ఎనిమిది పురాలు ఉంటాయి. సువర్ణ కోటరాద్రి మీద రాక్షసులకు చెందిన నలభై ఎనిమిది పట్టణాలు ఉంటాయి. అక్కడికి సమీపంలోనే ఉన్న మహనీలాచలం మీద అశ్వ ముఖులైన కిన్నెరుల పదిహేను పురాలు, వేణు సౌదాద్రి మీద విద్యాధరులు ఉండే మూడు నగరాలు, వైకుంఠం అనే పేరున్న పర్వతం మీద గరుత్మంతుడు నివాసం, కరంజాద్రి మీద నీలలోహిత రుద్రుని నివాసం, వసుధార నగరంలో అష్ట వసువుల నివాసాలు, రత్న ధారాద్రి మీద సప్త రుషుల సప్త భవనాలు ఉంటాయి. ఏక శృంగ పర్వతం మీద ప్రజాపతి నివాసం ఉంటుంది.* 

 *గజ శైలాద్రి మీద దుర్గ తదితర దేవతల నివాసాలు ఉంటాయి. హేమకక్షం అనే పేరున్న పర్వతం మీద ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అశ్వినీ దేవతల ఆవాసాలు ఉంటాయి. ఇదే పర్వతం మీద దేవతలకు చెందిన మరో ఎనభై నగరాలు కూడా ఉంటాయి. సునీలాద్రి మీద, పంచకుటాద్రి పైన రాక్షసులకు చెందిన అయిదు కోట్ల నివాసాలు ఉంటాయి. శతశృంగ పర్వతం మీద యక్షులకు చెందిన వంద పురాలు, తామ్రాభం అనే పర్వతం మీద సర్పరాజుల నివాసాలు, విశాఖాద్రి మీద కార్తికేయుడి పురం, హరికుటాద్రి మీద నారాయణ సౌధం, అంజనాద్రి మీద చారణుల నివాసాలు, సహస్ర శిఖర పర్వతం మీద ఉగ్రంగా ఉండే దైత్యుల ఏడు వేల పురాలు, పుష్ప కేతు పర్వతం మీద పన్నగుల నివాసాలు, తక్షకాద్రి పైన సూర్యచంద్ర, వాయు, నాగధికుల నాలుగు నివాసాలు ఉంటాయి.*

.........

పూర్వం లో అర్జునుడికి ఇచ్చిన మాట ప్రకారం కౌరవ పాండవ యుద్ధమైన కురుక్షేత్ర రణరంగంలో విజయుడి రథం  జెండాపై ”కపి రాజు ”హనుమంతుడు కొలువై ఉన్నాడు. యుద్ధం ప్రారంభం రోజున ఉభయ సైన్యాల మధ్య , అర్జునుని కోరికపై రధాన్ని నిలి పాడు పార్ధసారధి అయిన శ్రీ కృష్ణుడు. కిరీటి రధం దిగి, రెండు వైపులా ఉన్న సైన్యసమూహాన్ని చూశాడు అందరు బంధువులే, కావలసిన వారే. వీళ్ళందర్నీ చంపి, తాను రక్తపు కూడు తినాల్సి వస్తుంది అని బాధ పడ్డాడు. యుద్ధం చేయటం కంటే భిక్షంఎత్తు కొని హాయిగా జీవించ వచ్చు అని పించింది పాండవ మధ్యముడికి. మనసంతా వ్యాకులం అయింది. కర్తవ్యమ్ తోచటం లేడు . శ్రీ కృష్ణ పరమాత్మ  నే శరణు కోరి కర్తవ్యం బోధించమని వేడుకొన్నాడు.

ఈ యుద్ధ ఫలాన్ని అన్న గారైన యుదిష్టిరునికి కానుక గా ఇవ్వ వల్సిన వాడైన అర్జునుని మనో భావం గుర్తించిన శ్రీ కృష్ణ భగవాననుడు వెంటనే పద్దెనిమిది అధ్యాయాలభగవద్గీతా సారాన్ని వినిపించి యుద్దోన్ముఖుడిని చేశాడు. భగవానుని గీతను అనుసరించి , విషాదాన్ని త్యజించి యుద్ధం చేశాడు పార్ధుడు .

పార్దునికి , పార్ధ సారధి విని పిస్తున్న భగవద్గీత నంతటిని అర్జునుని రథపు జెండా పై కొలువై కూర్చున్న మారుతి శ్రద్ధగా విన్నాడు .మనసుకు దాన్ని అంతటిని పట్టించుకొన్నాడు .”శ్రీ కృష్ణా ! నీ గీతా సారం విని ధన్యుడనయాను మహాత్మా !”అని భక్తితో   నమస్కరించాడు . అప్పుడు గోపాల చక్రవర్తి శ్రీ కృష్ణ పరమాత్మ ”హనుమంతా !నేను చెప్పినవిషయాలను నా అనుమతి లేకుండా నువ్వు విన్నావు .దానికి నువ్వు పిశాచ రూపం పొందుతావు. నువ్వు విన్న గీతకు ”భాష్యం ”రచించు. దానితో నీ పిశాచ రూపం అంతరిస్తుంది ”అని శాపాన్ని , శాప విమోచనాన్ని తెలియజేశాడు పరమాత్మ .

........

పూర్వ జన్మలో మనం చేసిన పాపం ఏదైనా ఈ జన్మలో అదే రూపంలో అనుభవములోనికి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.. ఏలాగంటే?

ఒక రాజు ఒక రాత్రి తన జాతకం వ్రాయబడిన కాగితాన్ని చదువుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది..

'నేను పుట్టిన రోజే ప్రపంచం లో అనేకమంది పుట్టివుంటారు. కానీ వాళ్ళంతా రాజులు కాలేదు, నేనే ఎందుకయ్యాను?

ఈ గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది అని?

'మరుసటిరోజు సభలో పండితుల ముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్ళు చెప్పిన జవాబు రాజుకు తృప్తి ఇవ్వలేదు'...

అప్పుడు ఒక వృద్ధ పండితుడు రాజా, ఈ నగరానికి తూర్పున బయటవున్న అడవిలో ఒక సన్యాసి వున్నాడు. ఆయనను కలవండి. జవాబు దొరుకుతుంది 'అన్నాడు...రాజు వెళ్ళాడు..

అపుడు ఆ సన్యాసి బొగ్గు తింటుంటాడు.. అది చూసి రాజు ఆశ్చర్యపోయి , తన ప్రశ్న ఆయన ముందు పెడితే ఆయన అన్నాడు.. '' ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరం లో ఇలాంటిదే మరొక గుడిశె వుంది. అందులో ఒక సన్యాసి వున్నాడు , ఆయన్ను కలవండి.''

నిరాశపడినా, రాజు రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు.. రాజు ఆయన్ని చూసినపుడు, ఆ సన్యాసి మట్టి తింటూంటాడు..

రాజు కాస్త ఇబ్బందిపడ్డాడు. కానీ తన ప్రశ్ననైతే అడిగాడు. కానీ ఆ సన్యాసి రాజు మీద కోపంతో గట్టిగా అరచి అక్కడినుండి వెళ్ళిపొమ్మంటాడు...

రాజుకు కోపం వచ్చినా , సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు... తిరిగి వస్తుండగా ఆ సన్యాసి రాజుతో ఇలా అంటాడు..

''ఇదే దారిలో వెళితే ఒక గ్రామం వస్తుంది, అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా వుంటాడు, వెంటనే అతన్ని కలవండి..

'' రాజుకంతా గందరగోళంగా వుంది."అయినా అక్కడికెళతాడు..

చనిపోవడానికి సిద్ధంగా వున్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్న అడిగాడు...

అప్పుడు ఆ అబ్బాయి ఇలా చెపుతాడు...

గత జన్మ లో నలుగురు అన్నదమ్ములు ఒక రాత్రి అడవిలో దారితప్పి వుంటారు.. ఆకలేస్తుంటే వాళ్ళ దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టుక్రింద ఆగివుంటారు.. తినబోతుంటే

అక్కడికి బాగా ఆకలితో, నీరసంగా వున్న ఒక ముసలి ఆవిడ వచ్చి తనకూ కొంచెం ఆహారం ఇవ్వమని అడిగితే...

ఆ నలుగురిలో మొదటి వాడు కోపంతో '' నీకు ఇస్తే నేను బొగ్గు తినాలా ? '' అని కసురుకొంటాడు...

రెండవ వాడిని అడిగితే '' నీకు ఈ రొట్టె ఇస్తే నేను మట్టి తినాల్సిందే '' అని వెటకారంగా అంటాడు..

మూడవ వాడు '' రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా ఏంటే ముసలిదానా ? ''అని నీచంగా మాట్లాడాడు...

కానీ నాల్గవ వ్యక్తి మాత్రం '' ఆవ్వా , నీవు చాలా నీరసంగా వున్నావు.. ఈ రొట్టె తిను, '' అని తాను తినబోతున్న రొట్టెను మనస్ఫూర్తిగా ఇచ్చేసాడు...

ఆ నాల్గవ వ్యక్తివి నువ్వే రాజా అని అన్నాడు...

రాజు దిగ్భ్రాంతికి, ఆశ్చర్యానికి లోనయ్యాడు. అప్పుడు ఆ అబ్బాయి మరో మాట చెప్పి ప్రాణం వదిలాడు..

రాజా, ఇంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే ఆ నలుగురు వ్యక్తులు ఒకే తల్లికి పుట్టిన నలుగురు కొడుకులు... 

........

మనిషి తాను జీవించినంతకాలం సంతోషంగా ఉండాలనుకొంటాడు. సంతోషం కోసమే అన్నం తింటాడు. సంతోషం కోసమే ఆటలాడుకుంటాడు, నిద్రపోతాడు. సంతోషం కోసమే పెళ్ళి చేసుకొంటాడు,     పిల్లలు కావాలను కొంటాడు. చేసే పని, కూసే కూత, రాసే రాత... అంతా సంతోషం కోసమే..!

ఇంతకూ సంతోషం ఎక్కడ దొరుకుతుంది అనేది విలువైన ప్రశ్న. సంతోషం చిరునామా కోసం మనిషి వెదకని చోటులేదు. చేయని ప్రయత్నం లేదు. అయినా సంతోషం గగన కుసుమంగా ఎందుకు ఉన్నదో మనిషికి అర్థం కావడంలేదు.

ప్రపంచాన్ని నడిపేది డబ్బు. డబ్బు లేకుండా ఏ మనిషీ జీవించలేడు. అది ఎంత ఎక్కువగా నిల్వ ఉంటే అంత సౌఖ్యంగా జీవించగలననుకుంటాడు మనిషి.

కానీ..

డబ్బు సంతోషాన్ని ప్రసాదిస్తుందా అంటే అనుమానమే. లోకంలో పుష్కలంగా ధనరాశులు పోగు చేసిన సంపన్నులెందరో ఉన్నారు. కానీ వారందరికీ సౌఖ్యం దొరకవచ్చునేమోగానీ సంతోషం దొరక్కపోవచ్చు. కనుక సంతోషానికి డబ్బు కారణం కాదు...

అధికారం ఉంటే సంతోషం ఉంటుందా అంటే, అదీ నమ్మకం లేదు. లోకంలో ఏకచ్ఛత్రాధిపత్యంతో అధికారాన్ని సొంతం చేసుకొని పాలించిన వారెందరో ఉన్నారు. వాళ్లు ఎల్లవేళలా సంతోషంగా ఉన్నారనే దాఖలాలు లేవు...

అందంగా ఉంటే సంతోషం ఉంటుందా ? దానికీ రుజువు లేదు. ఎందరో అందగాళ్లు, సౌందర్యవంతులు మానసిక క్షోభలతో ఆత్మహత్యలు చేసుకొన్న చరిత్రలున్నాయి.

సకల విద్యలనూ ఆపోసన పడితే సంతోషం కలుగుతుందా అంటే అదీ సత్యం కాదు. ఎందరో విజ్ఞాన ఖనులైన మహానుభావులు అశాంతితో తనువులు చాలించారు.

కనుక సంతోషానికి మూలం సంపదలు, అధికారం, చదువు, అందం కావని అనుభవపూర్వకంగా మనిషికి అర్థమైంది. సంతోషానికి ధనికులు, పేదలు అనే భేదం లేదు. అందం, చదువు అనే బేరీజులు లేవు. వయోభేదం లేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా మనిషికి స్వాధీనమై ఉండేది సంతోషం.

పసిపిల్లలకు బొమ్మలతో ఆడుకోవడంలోనే సంతోషం. ఎదిగే పిల్లలకు ఆటపాటలతో గడపడం సంతోషం. యువకులకు తమ కలలను సాకారం చేసుకోవడమే సంతోషం. వృద్ధులకు తమ సంతానాన్ని చక్కగా చూసుకొంటూ ఉండటమే సంతోషం. కొందరికి ప్రకృతి ఆరాధన సంతోషం.  కొందరికి తీర్థక్షేత్రాలను సందర్శించడం సంతోషం. కొందరికి సంగీతం వినడం సంతోషం. కొందరికి సృజన చేయడమే పరమానందం. ఇలా సంతోషానికి ఒక నిర్వచనం లేదు. దానికి ఒక ఉనికి లేదు...

ప్రపంచంలోని అణువణువులోనూ సంతోషం నిండి ఉంది. దాన్ని చూడగలగడమే మనిషి పని

పరిమిత సంపాదనతో అన్నవస్త్రాదులను సమకూర్చుకొని సంతోష జీవనం గడుపుతున్నవాళ్లెందరో ఉన్నారు. వాళ్లకు పూరి గుడిసెలైనా, పక్కా భవనాలైనా ఒక్కటే. రాజప్రాసాదాల వంటి విలాస భవనాల్లో హంసతూలికాతల్పాలపైన పడుకున్నా కొందరు ముళ్లపాన్పు మీద పడుకొన్నట్లే నిద్ర కరవై, దుఃఖ జీవితాన్ని కొనసాగిస్తుంటారు..

ఉన్నంతలో గడుపుకొంటూ, తోటివారికి సహాయపడుతూ, దీనులపట్ల కారుణ్యాన్ని ప్రదర్శించేవారికి ఏ సంపదలతోనూ పని లేదు. సంపదలు ఎన్ని ఉన్నా ఎవరికీ ఏ విధంగా తోడ్పడని జీవితాలూ ఉన్నాయి..

మనిషి తన జీవితంలో అనుక్షణం సంతోషాన్ని ఆహ్వానించాలి. అసంతృప్తిని తరిమివేయాలి. కష్టాలకు, కడగండ్లకు, బాధలకు కుంగిపోరాదు. ఉన్నంతలో ఆనందాన్ని తోడుకోవాలి. ఆత్మీయులతో మనోభావాలను పంచుకొని సేదదీరాలి. అనవసరమైన భయాలను దరిజేరనీయరాదు. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. కోరి కోరి కష్టాలు తెచ్చుకోరాదు.

నీతిమంతమైన జీవితానికి దారులు వేసుకోవాలి. అనుచిత సంపాదన కోసం అర్రులు చాచకూడదు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందించే స్ఫూర్తితో జీవితాన్ని అమృతమయం చేసుకోవాలి. మానసికోన్నతికి దారులను అన్వేషించాలి..._

 అదే చిట్టచివరి సంతోషానికి చిరునామా...ఆనందం, సంతోషం ఈ చిన్ని జీవితానికి ఆయురారోగ్యాలు అందరమూ సుఖసంతోషాలతో జీవితాన్ని చక్కగా గడుపుదాం.

ఇదే జీవిత పరమార్ధం.

.......

ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకరోజు ఒకె ఒక్క క్షణం మనసు కొన్ని ప్రశ్నలు సంధిస్తుంది ..  అందరులా వచ్చి వెళ్లిపోవడమేనా జీవితం ? తెలిసినది ఎంత ? తెలుసుకోవలసినది ఎంత ? 

ఏది ముక్తి ? ఏది మోక్షం ? 

అది హిమాలయాల్లో దొరుకుతుందా ? 

గుడిలో మసీదులో చర్చులో దొరుకుతుందా ?? ఎక్కడ ? 

ధ్యానులకే దొరుకుతుందా , యోగులకే దొరుకుతుందా , 

సిద్దులకే దొరుకుతుందా ? మరి గృహస్తునికో ?????? 

 ఈ ఆలోచన క్రమంలో ఎన్నో నిద్రలేని రాత్రులు !!"

ఒక గురువుగారిని వీటికి సమాధానం చెప్పమని అభ్యర్దించాను .. 

"  వారు నువ్వు తెలుసుకోవడానికి ఎంతో సమయం ఉంది  అన్నప్రాశనలో నీకు ఆవకాయ ఎందుకు "

అన్నారు .. ఆ సమాధానంతో  మనసుకు సంతృప్తి కలగ లేదు .. 

ఎందరో ధ్యానులను , యోగులను , భిన్న ఆధ్యాత్మిక సంఘాలలో ఎందరో గురువులు చెప్పినది వింటూనే ఉన్నా .. 

ఇంతలో ఓ మహానుభావులుతో పరిచయం జరిగింది .. వారికి సిద్దులు లేవు మహిమలు లేవు ,, కాషాయము లేదు ,, ఆశ్రమాము లేదు .. వారు గృహస్తులు { కర్మయోగులు , జ్నానయోగులు }

వారి ధ్యారా నేను తెలుసుకున్న సత్యాలు 

మీతో పంచుకుంటూ ..... 

ముక్తి " మోక్షం " అంటే అందరూ భగవంతునిలో ఐక్యం అవ్వడం లేదా మరో జన్మ లేకుండా ఉండటం అంటారు" 

' స్దూల ' సూక్ష్మ ., కారణ , మహాకారణ తో  తయారు కాబడిన ఈ పదార్దములో  "ఆత్మకు మరణం లేదు " మరి ఐక్యత ఎక్కడ .. ??? ఎవరిలో ఐక్యత ?? 

 ఈ అనంతకోటి జీవరాశిలో ,, ఎన్నెన్నో లోకాలలో ఎక్కడో ఒక్క చోట  నీవు ఉండవలసినదే ... 

అది ఎక్కడ అనేది నీవు చేసే కర్మలపై 

ఆధారపడి ఉంటుంది ..  

అంటే ఎక్కడో ఒకచోట ఆత్మ ఉండే తీరుతుంది .. 

ఇక ముక్తి అంటే విడుదల "" 

మోక్షం అంటే  dukkha రహిత స్దితి "" 

విడుదల '' అంటే భార్య బిడ్డలు ఇల్లు సంసారం వదిలేసి స్వేచ్ఛగా ఎగిరి పొమ్మని కాదు .. నీకున్న దేహ ధర్మాలు నిర్వహించకుండా పండుబోతుగా పరుగులు తీయమని కాదు ... 

కార్యా కారణ సంభంధాలతో ఏ పని (కర్మ ) పూర్తి చేయాలని ఇక్కడికి వచ్చోవో , అది పూరించకుండా పరుగులు తీస్తే 

నువ్వు ఎందుకు వస్తున్నావు .. ఎందుకు వెళుతున్నావు .. ????? 

 ఒకవేళ నువ్వు ఎక్కడికో పరుగులు తీసినా  దుఖము లేని స్దితిలో  ఆశ , మొహం , కోరిక లేని స్దితిలో జీవించగలవా ? లేదు .. 

ఒకవేళ జీవించగలను అనుకుంటే నిన్ను నీవు మభ్యపెట్టుకున్నట్లే ..

మరి గృహస్తునికి ముక్తి ' మోక్షం ఎలా ? 

"చేసే ప్రతి పని నిష్కామముగా చేయడం " ఫలితం ఆశించకుండా చేయడం " సమర్పణా భావంతో చేయడం " కష్టం అయినా కన్నీళ్లు అయినా వాని ప్రసాదంగా 

భావించడం ... " ఎప్పుడయితే నీవు కర్మయోగిగా కదలిపోతూ ఉంటావో '' మెల మెల్లగా జ్నానమ్ నీకు జత చేరుతుంది 

ఈ  జ్నానాగ్ని లో నీ కర్మలు అన్నీ దగ్దం అయిపోతాయి ... 

 నీ చుట్టూ జరిగే ప్రతి సంఘటనకు సాక్షిగా మాత్రమే ఉంటావు ".. ఆనందమయునా ఆశ్రువులయినా ... 

దేహం తన ధర్మం తాను చేస్తూ ( ఇంటి వాచ్ మెన్ లా )

 ఇదేది నాది కాదన్న భావనతో మనస్సు , బుద్ది , వాక్కు ఏకమై సమస్దితిలో "" నేను అన్న అహం వదలి "" 

తూహుం తూహుం "" ( నువ్వు నువ్వు అంటూ )దుఖ.. రహితమయున సమస్దితి (సమాధి స్దితి ) అన్నిటికి అతీతమయున స్దితి  అదే నీకు నువ్వు విడుదల " అదే నువ్వు కోరుకున్న ముక్తి "

మరి ఈ స్డితికి నువ్వు చెరాలంటే "  సాధన " సాధన" సాధన " అహం నుండి తుహుం వరకు ...... ( నేను నేను కాదు అంతా నువ్వే నువ్వే)

[03/04, 5:34 pm] Mallapragada Sridevi: *కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు . . .!!*

*ఃఃైఃైఃైఃైఃైఃైఃైఃైఃైఃః*

హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.

*1. విద్యా ప్రాప్తికి:-*

పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!

సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!

*2. ఉద్యోగ ప్రాప్తికి :-*

హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!

ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!

*3. కార్య సాధనకు :-*

అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!

రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!

*4. గ్రహదోష నివారణకు :-*

మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ!

శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!

*5. ఆరోగ్యమునకు :-*

ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!

ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!

*6. సంతాన ప్రాప్తికి :-*

పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!

సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!

*7. వ్యాపారాభివృద్ధికి :-*

సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!

అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!

*8. వివాహ ప్రాప్తికి :-*

యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!

వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!

*ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 40 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.*

*-- సేకరణ.. ప్రాంజలి 👍ప్రభ

[03/04, 5:36 pm] Mallapragada Sridevi: *జన్మ నక్షత్రాన్ని బట్టి ఏ రత్నాన్ని ధరించాలి?*

*%0%0%0%0%0%0%0%*

రత్నధారణ విధానంలో పద్ధతులు అవసరమని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. జన్మ నక్షత్రాన్ని బట్టి.. అనగా 

*1). అశ్విని, మఖ, మూల నక్షత్రాలకు కేతువు అధిపతి అగుట వలన....*

*వైఢూర్యం*

*2). భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల వారికి శుక్రుడు నక్షత్ర అధిపతి అగుటవలన...*

 *వజ్రమును ధరించాలి.*

*3). కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రముగా కలవారు...*

 *కెంపును*

*4). రోహిణి, హస్త, శ్రవణం జన్మ నక్షత్రములుగా కలవారు....* 

*ముత్యమును*

*5). మృగశిర, చిత్త, ధనిష్ట జన్మ నక్షత్రములు కలవారు...*

*పగడమును* 

*6). ఆరుద్ర, స్వాతి, శతభిషం జన్మ నక్షత్ర ములు కలవారు...* 

*గోమేధికము*

*7). పునర్వసు, విశాఖ, పూర్వాబాధ్ర జన్మ నక్షత్రములు కలవారు...*

*పుష్యరాగమును*

*8). పుష్యమి, అనూరాధ, ఉత్తరాబాధ్ర జన్మ నక్షత్రములు కలవారు..*

 *నీలమును*

*9). ఆశ్లేష, జ్వేష్ట, రేవతి జన్మ నక్షత్రములు కలవారు..*

 *పచ్చను*  ధరించడం శుభ ఫలితాలనిస్తుందని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.


*సేకరణ :*

*



ధనం కాదు, కీర్తి ప్రతిష్టలు కాదు, విద్వత్తు (పాండిత్యం) కాదు, సౌశీల్యమొక్కటే కష్టాలనే దుర్భేద్యమైన అడ్డుగోడలను చీల్చుకొని పోగలిగినది. దీనిని జ్ఞప్తి లో ఉంచుకోండి.
 
ఇప్పటి వరకూ జన్మించిన ప్రతివారినీ మీరు ప్రార్ధించవచ్చు, కాని మీకు సహాయపడడానికి ఎవరొస్తారు?... మీకు మీరే సహాయకారిగా ఉండాలి. నీకెవరూ సహాయం చేయలేరు మిత్రమా... కాబట్టి ఆత్మను ఆధారంగా గ్రహించు. లే! భయపడకు! మొదట అస్పష్టం, అగ్రాహ్యం అనిపించినా, ఈ దుఃఖాల మధ్య నుండీ, ఈ బలహీనతల నడుమ ఆత్మను జాగృతమవనిద్దాం.

నేటి తరం వారిపై, ఆధునిక యువత పైనే నాకు విశ్వాసం. వారి నుండే నా కార్యనిర్వాహకులు రాగలరు. సింహాల వలె వారు సమస్యలన్నింటిని పరిష్కరిస్తారు.

మనిషికి సహాయం అంటూ ఏదీ లేదు. ఇంతకు ముందు ఎన్నడూ లేదు, ఇప్పడూ లేదు, ఇకపై ఉండదు. నీవు అనంత శక్తి సమన్వితుడవు, నీలోని శక్తి ద్వారానే నీ కప్టాల నుండి బయటపడాలి. నిన్ను నీవే రక్షించుకోవాలి. నీకు సహాయం చేసే వారెవరూ ఎన్నడూ లేరు. అలా ఉన్నారని భావించడం ఒక మధురభ్రాంతి. దీని వలన ఏ మేలూ ఒనగూరదు.

భగవంతుని వైపు వెళ్ళేలా చేసే ఏ కార్యమైనా సత్కార్యమే. అదే మన ధర్మం; మనల్ని అధోగతికి చేరేలా చేసే ఏ కార్యమైనా దుష్కార్యమే, అది మన ధర్మం కానే కాదు

లేచి నిలబడు, ధైర్యంగా బలిష్టంగా ఉండు. మొత్తం భాద్యతనంతా నీ భుజస్కంధాల మీదనే వేసుకో. నీ భవిష్యత్తుకు నీవే భాద్యుడవని తెలుసుకో. నీకు కావలసిన బలం , శక్తి... అన్నీ నీలోనే ఉన్నాయి.

.......

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ