ప్రాంజలి ప్రభ 07 /04

Post anything (from anywhere!), customize everything, and find and follow what you love. Create your own Tumblr blog today.

*.  నేటి సూక్తి : లోనికి నెట్టే ఒత్తిడి ధ్యానసాధనకు కూర్చున్నప్పుడు, నిన్ను లోనికి నెట్టే ఒత్తిడి ఒకటి కలుగుతుంది. జాగ్రచ్చేతనను వీడి అంతశ్చేతనలో నీవు మేల్కొనడానికై కలిగే ఒత్తిడి అది. కాని, నిద్రారూపమైన అంతశ్చేతనకు మాత్రమే అలవాటుపడిన మనస్సు మొదట్లో ఆ ఒత్తిడిని నిద్రకు కలిగే ఒత్తిడిగానే భావిస్తుంది. పట్టుదలతో నెమ్మదిగా అభ్యాసం కొనసాగించిన మీదట గాని, నిద్ర క్రమేణా అంతశ్చేతనానుభవంగా మార్పు చెందదు. *

....
*.  మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా: |
భజన్త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ ||

*. తాత్పర్యం :
ఓ పృథాకుమారా! భ్రాంతులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీప్రకృతిని ఆశ్రయించియుందురు. వారు నన్ను ఆదియును, అవ్యయుడును అగు దేవదేవునిగా నెరిగియుండుటచే నా భక్తియుతసేవలో సంపూర్ణముగా నిమగ్నులై యుందురు.

సుభాషితం - 456
---------------
అహో సాహజికం        ప్రేమ దూరాదపి విరాజతే ౹
చకోరనయన ద్వంద్వ      మాహ్లాదయతి చంద్రమా ౹౹

       సహజమైన ప్రేమ దూరం నుంచేనైనా విరాజిల్లుతుంది.చంద్రుడు చకోర పక్షి రెండుకళ్ళన్ను సంతోషంగా చేస్తాడు.


శ్లో𝕝𝕝 ధర్మస్య దుర్లభో జ్ఞాతా సమ్యక్ వక్తా తతోఽపి చ।   

శ్రోతా తతోఽపి శ్రద్ధావాన్  కర్తా కోఽపి తతః సుధీః॥


తా𝕝𝕝 ధర్మం తెలిసినవారు చాలా అరుదు. ధర్మాన్ని చక్కగా వివరించేవారు ఇంకా అరుదు. వివరించేవారు లభించినా దానిని భక్తి శ్రద్ధలతో వినేవారు చాలా అరుదు. విని ఆ ధర్మాన్ని ఆచరించే బుద్ధిమంతులు అందరికంటే అరుదు.


అరుదు ధర్మాన్ని తెలిపేడి వారు మనకు  

అరుదు ధర్మాన్ని వివరించు వారు మనకు  

అరుదు ధర్మాన్ని చెప్పగా వినెడివారు 

అరుదు ధర్మాన్ని ఆచరించగల వారు    

****


🌻 3. ఆత్మ-విద్య లేదా అధ్యాత్మ-విద్య 🌻

ఉపనిషత్తులో ప్రకటించబడిన జ్ఞానం దుఃఖాన్ని తొలగించే శాస్త్రం. అందువల్ల, ఇది సాధారణంగా మనం సంపాదించే అభ్యాసానికి లేదా ప్రపంచంలోని విషయాలకు సంబంధించి మనం పొందే జ్ఞానానికి భిన్నమైన జ్ఞానం. ఈ పదం యొక్క సాధారణ అర్థంలో ఇది శాస్త్రం కాదు. వివిధ రకాలైన శాస్త్రాలు మరియు కళలు ఉన్నాయి. అవన్నీ తగినంత ముఖ్యమైనవి మరియు వాటి స్వంత మార్గంలో అద్భుతమైనవి. కానీ  అవి మానవ హృదయమూలం నుండి దుఃఖాన్ని తొలగించలేవు.

అవి ఒక నిర్దిష్టమైన పరిస్థితులలో ఉన్న, ఒక నిర్దుష్టమైన జన్మలో ఉన్న, ఒక నిర్దుష్టమైన తత్వం ఉన్న వ్యక్తి యొక్క సంతృప్తికి దోహదం మాత్రమే చేస్తాయి. కానీ అవి సంబంధిత వ్యక్తి యొక్క ఆత్మకు వరకు వెళ్లవు. ఆత్మ శాస్త్రం యొక్క అర్థంలో, ఉపనిషత్తును ఆత్మ విద్య లేదా అధ్యాత్మ విద్య అని కూడా అంటారు. గ్రహీత తెలిసినప్పుడు, గ్రహీతతో అనుసంధానించబడిన ప్రతిదీ కూడా తెలుస్తుంది.
భౌతికమయిన జన్మ వుంది. ప్రతి ఒక్కరూ దాని గుండా సాగుతారు. ఐతే అది నీకు సంక్లిష్టమయిన శారీరక మానసిక స్థితినిస్తుంది. అది నీకు ఆధ్యాత్మికంగా జన్మించడానికి అవకాశమిస్తుంది. పునర్జన్మ కలిగితే తప్ప నిజంగా జీవించినట్లు కాదు. ఒకటి కేవలం అవకాశం. బీజప్రాయం. వసంతం రానిదే బీజం మొక్కయి, పుష్పించదు. నా పూర్తి ప్రయత్నం మీకు సాధారణ మతాన్ని బోధించడం కాదు. కొత్త అస్తిత్వాన్ని, కొత్త మానవత్వాన్ని, కొత్త చైతన్యాన్ని యివ్వడం.

వ్యక్తి రెండు విషయాల గుండా సాగాలి. మొదటిది మరణం. పాతదానికి మరణం, గతానికి మరణం. యిప్పటి దాకా జీవించిన దానికి మరణం. రెండోది పునర్జన్మ. తాజాగా మొదలు పెట్టు. ఈ రోజే పుట్టినట్లు ఆరంభించు. అది కేవలం రూపకం కాదు. నిజంగా ఆరంభించు. ఆ భావన నీ అంతరాంతరాలలో పాదుకోనీ. అప్పుడు రాత్రి అంతమై దిగంతాలలో సూర్యుడు ఉదయిస్తాడు.

సశేషం ...

*అలిపిరి పేరును వెంటనే మార్చి పూర్వం ఉన్న పేరుని ఆధ్యాత్మిక పేరు పెట్టాలె. *
.
🌾అలిపిరి👏

కొండ క్రింద ఉన్న ఈ   "అలిపిరి" కి ఆ పేరు ఎలా వచ్చిందో మనలో చాలామందికి తెలియదు. 

🌾అసలు " అలిపిరి " అనే పేరే ఒక విచిత్రమైన పేరు లాగా ఉంది కదా ... ? మన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం ఇలా ఏ భాషలోనూ ఈ " అలిపిరి " అనే పదం లేదు.  

🌾అయితే, " అలిపిరి " అనే ఈ పదం ఎలా పుట్టింది ... ?  

🌾దీని వెనుక చరిత్ర ఏమిటి ... ? 
అనే విషయం మన చరిత్రని నిశితంగా గమనించినట్లయితే ఆశ్చర్యకరమైన యదార్థ సంఘటలను గురించి మనం తెలుసుకోవచ్చు. 

🌾పూర్వం ఐదు వందల సంవత్సరాల క్రితం," తిరుపతి " నగరం ఇప్పటిలాగా లేదు. 

🌾ఇప్పుడు " అలిపిరి " అని పిలుస్తున్న ప్రాంతానికి- 
"అలిపిరి" అన్న పేరు కూడా లేదు. 
అది ( 1656 - 1668 ) ప్రాంతం . 

🌾ఢిల్లీలో మొఘల్ చక్రవర్తులు పాలిస్తున్న సమయం. శ్రీ కృష్ణ దేవరాయల అనంతరం జరిగిన " రాక్షసి తంగడి & తళ్ళికోట " మొ || యుద్ధాల తర్వాత, విజయనగరం రాజుల ప్రాబల్యం తగ్గింది. అప్పుడు నిజాం నవాబు రాయల సీమ ప్రాంతాన్ని ఆక్రమించాడు.
  
🌾ఆ సమయంలో హిందువులను, హిందూ సానుభూతిపరులను, సాధుసంతులను చాలా దారుణంగా హింసించారు.  

🌾పదిహేడో శతాబ్దం చివరిలో ఢిల్లీ ఆదేశాల మేరకు, హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఫర్మానా ( ఆర్డర్ ) మేరకు సుల్తాన్ అబ్దుల్లా - కుతుబ్ షా & వజీర్ల సైన్యం, " ఆలీ " అనే అత్యంత కరడుగట్టిన మహమ్మదీయుని నేతృత్వంలో, కడప, కర్నూలు, నెల్లూరులలో దారుణంగా దాడులు చేసి దేవాలయాలను ధ్వంసం చేసారు. ఆ తరువాత " ఆలీ " సైన్యం తిరుపతికి చేరుకుంది. 

🌾అప్పుడు, తిరుపతి చిన్న గ్రామం.

🌾 ఇప్పుడు " మంచినీళ్ళ కుంట " అని చెప్పుకుంటున్న  
" నరసింహ తీర్థమే " అప్పటి తిరుపతి గ్రామం.  

🌾ఇక్కడ ఒక నరసింహ స్వామి మందిరం ఉంది, దానికి ప్రజలు నిత్యం ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తుండేవారు. చరిత్ర తెలిసిన పెద్దవారు ఇప్పటికీ దీనిని " నరసింహ తీర్థం రోడ్ " అనే పిలుస్తారు. 

🌾ఆలీని తిరుపతికి పైకి దండయాత్రకు పంపించటానికి మూల కారణాలు రెండు :  

🌺ఒకటి : శ్రీ వేంకటేశ్వర స్వామి వారు అత్యంత శక్తివంతమైన దేవుడు అనీ & తిరుమల లాంటి దివ్య క్షేత్రం ఇంకొకటి లేదు, భవిష్యత్తులో ఉండబోదు అనే వైభవమ్ విశ్వాసం భారత దేశం నేల నాలుగు చెరలా ఉండడం వలన, ఈ దేవాలయం పై దాడి చేసి స్వామి వారి స్వరూపాన్ని పెకలించి కొండపై నుంచి తొలగించేస్తే, హిందువుల దేవుడు బలహీనుడనీ తద్వారా, ప్రజలందరూ " అల్లా " యే గొప్ప దేవుడని భావించి, " ఇస్లాం " మతాన్ని విధిలేక స్వీకరిస్తారని వారి పిచ్చి ఆలోచన. 

🌹రెండోది : శ్రీ కృష్ణ దేవరాయలు, భక్తితో స్వామి వారికి సమర్పించుకున్న విలువ కట్టలేనన్ని వజ్రాలు, వైఢూర్యాలు, కనక పుష్యరాగాలు, కెంపులూ & అపారమయిన బంగారం దోచుకెళ్ళి వాళ్ళ ఖజానా నింపుకుందామని. 

🌾అయితే అప్పటి తిరుపతి గ్రామస్తులు, " ఆలీ " ( కమాండర్ ఇన్ చీఫ్ ) ని సమీపించి నీక్కావలసింది బంగారమే కదా ! మా తిరుపతి గ్రామంలో ఉన్న స్త్రీ & పురుషుల వద్ద వున్న బంగారం అంతా ఇచ్చేస్తాం, దానితో తృప్తిపడి వెనక్కి వెళ్ళిపో, కానీ మా స్వామి వారి జోలికి రావద్దు, ఆయన మా ప్రాణం కన్నా కూడా ఎక్కువ అని విన్నవించుకున్నారు.  

🌾దానికి ఆలీ అంగీకరించినట్లు నటించి వాళ్ళు స్వచ్చందంగా ఇచ్చిన బంగారం, ఆభరణాలు తీసుకుని, మీరు చెప్పింది బాగానే ఉంది కానీ, ఈ దేవాలయాన్ని దోచుకుని ధ్వంసం చెయ్యకపోతే నిజాం నవాబూ & ఢిల్లీ సుల్తాను నా తల తీసేస్తారు కాబట్టి, తప్పదు అని తన అపార బలగాలతో ముందుకు కదిలాడు. 

🌾సరిగ్గా ఇప్పుడు " అలిపిరి " అని పిలవబడుతున్న ప్రాంతాన్ని చేరుకోగానే, శ్రీ ఆది వరాహ స్వామి అవతారమైన శ్రీవారు వరాహ రూపంలో వచ్చి నిలువరించారు.

🌾 మొదట కొంచెం బెదిరినా కూడా ముందుకు కదిలాడు. అంతే హఠాత్తుగా ఎవరి ప్రమేయమూ లేకుండా అతని రెండు కళ్ళూ పోయాయి, దృష్టి పోవడంతో దిక్కులేని స్థితిలో ఎంతో విలపించాడు. 

🌾అప్పుడు , శ్రీ స్వామి వారి " అమృత వాణి " వాడికి వినబడింది, దైవం పైనే దాడికి సిద్ధపడ్డావా ? ఎంత ధైర్యం ... ? అని. అప్పుడు ఆలీ బిగ్గరగా రోదిస్తూ ... క్షమాభిక్ష అడిగి, నేత్ర దానం చెయ్యమని వేడుకున్నాడు.  

🌾అప్పుడు దయార్ద్రచిత్తుడయిన స్వామి వారు, నీవు వెనుదిరిగి వెళ్ళిపో, నీకు దృష్టి వస్తుందని ఆదేశించారు.

🌾 దానితో ఏమీ సాధించకుండానే రిక్త హస్తాలతో వెనుదిరిగాడు "ఆలీ".  

🌾ఉర్దూ లేక హిందీ భాషలో " ఫిర్ నా " అంటే వెనక్కి మళ్ళడం, " ఫిరే ' అంటే వెనక్కి మళ్ళాడు అని అర్థం. 

🌾ఎప్పుడు, ఎక్కడా ఓటమెరుగని పరమ ఆ దుర్మార్గుడైన ఆలీ వెనుతిరిగిన వెంటనే ఈ విషయం తెలుసుకున్న అందరూ " ఆలీ ఫిరే, ఆలీ ఫిరే " అని చెప్పుకునేవారు.  

🌾కొన్ని సంస్థానాలకి సంబంధించిన గ్రామాలలో అయితే తిరుపతి ఆలయం మీదకు దండయాత్రకు వెళ్లిన ఆలీ తిరుపతిలోని ఒక ప్రదేశం నుంచి ముందుకెళ్లలేక వెనుదిరిగాడు " ఆలీ ఫిరే ",  
"ఆలీ ఫిరే" అని సూచిస్తూ ... చాటింపులు సైతం వేయించారు. 
🌾" ఆలీ " ఏ ప్రాంతం నుంచి వెనక్కి మళ్ళాడో ఆ ప్రాంతాన్నే అప్పటివారు ప్రత్యేకంగా వచ్చి సందర్శించేవారు.🌾ఆ ప్రదేశాన్ని చూడటానికి వెళ్ళేటప్పుడు లేదా వెళ్లి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లారని ఎవరైనా అడిగినప్పుడు " అలీ ఫిరే"

🌾ప్రదేశానికి వెళ్తున్నామని చెప్పేవారు.  
కాలక్రమంగా ఆ ఆలీ ఫిరే అనే పదం - ఆలి పిరే గా రూపాంతరం చెంది ఇప్పుడు " అలిపిరి గా స్థిరపడింది.  

🌾ఇదీ మనమిప్పుడు " అలిపిరి " గా పిలుచుకునే ప్రదేశం యొక్క యదార్థమైన చరిత్ర.  
ఈ విధంగా శ్రీవారి మహిమ వలన ఆలీ వెనుదిరిగిన కారణంగా, ఈనాడు మనం చూస్తున్న " అలిపిరు ఏర్పడింది

కొనసాగుతుంది...

నేటి కవిత్వం - 
రచయత } మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 

నేను లేక బీజ మేది..నేను లేక వృక్ష మేది..
ఆశ లేక తిండి ఏది.... మాను లేక మేను లేదు 
శాంతి లేక సౌఖ్య మేది .... చేను లేక పండు ఏది 
కర్త లేక కర్మ ఏది -------  కర్మ లేక కర్త ఏది 
    
మనసు లేక రాగ మేది..మనసు లేక భోగ మేది..
చెలిమి లోన నాద మేది .... చెలిమి లోన శాంతి ఏది 
బలిమి లోన  మౌన మేది .... బలిమి లోన గాన మేది 
కలిమి లోన రోగ మేది ..... కలిమి లోన ఆశ ఏది 

తలపు లేక తాప మేది..తలపు లేక బంధ మేది..!?
మలుపు లేక మోక్ష మేది .... మలుపు లేక మాయ ఏది  
కలుపు లేక వృక్ష మేది  ---- కలుపు లేక దీవి ఏది 
వలపు లేక మోహ మేది.... .వలపు లేక గంధ మేది..

తపములేక సాధ్యమేది..తపములేక సౌఖ్యమేది..
జపము లేక జాతి ఏది .... జపము లేక నీతి యేది 
కపము లేక  మేను ఏది ..... కపము లేక  దగ్గు ఏది 
మెఱుపులేక మంత్రమేది..మెఱుపులేక జ్ఞానమేది

తోడులేక దీపమేది..తోడులేక స్వర్గ మేది..
తోడు లేక నీడ ఏది  ... తోడు లేక  నీతి ఏది
తోడు లేక ఆట ఏది ..  తోడు లేక మాట ఏది 
తోడు లేక వేట ఏది ...   తోడు లేక కోట ఏది   

ప్రేమఅడవి దారితప్పి..చెలిమివనము చేరుటేల..
మాటగుడియె మౌనంలో..ఉందన్నది చెప్పాలా..
నిప్పుపూల కడలిలోన..మునకలేగా జీవితం..
కనురెప్పల పాటలోని..స్వరమధురిమ అందేనా..
హంసధ్వని కల్యాణీ..మేళకర్త మాధవుడా..
 *** 

*రామ బాణము సకలమ్ము రక్ష కొరకు

అంబర దిశనా సంచరితమ్ము నిజము

దుష్ట దుర్భుద్ది సంహార స్ఫూర్తిగాను

హనుమ ఆరాధన మనసు ధైర్య సిరియు


*ఆవల జగతి ఉన్నది ఆశల వల    

రూప మేలేనిది కణాల చూపు జగతి 

అది తివాచీ ప్రపంచమందున విధిగను  

అన్వయించుకోవడమేను అసలు  జీవి


*నందమూరి నటన నయనాలు చూడు

స్ఫూర్తి సినిమా కళలు నిత్య సూత్ర మదియు

ధైర్య సాహస విన్యాస మౌఖ్య వినయ

జనుల ఆకర్ష భాష్యము జనిత లక్ష్య

*ఆవల జగతి ఉన్నది ఆశల వల    

రూప మేలేనిది కణాల చూపు జగతి 

అది తివాచీ ప్రపంచమందున విధిగను  

అన్వయించుకోవడమేను అసలు  జీవి


*ఒక్కరొక్కరి టక్కరి రోరి యనిరి

మొక్కిరి సిరి కోరి బికారి మెక్కిరి సిరి

చెక్కిరి వరి నారు కక్కిరి చుక్క చేరి

వెక్కిరింపు గడసరి యే వెర్రి మొర్రి

“పుష్పసౌరభం “ 

వలపే  పొంగును జాజులున్ నవవిదానిత్వమ్ము తృప్తే యగున్ 

కలలే కల్లలుగాకనే రతగురున్ కాంతున్ జపమ్మే యగున్ 

య లయంబే యగు సన్నజాజులకు గా యాటన్ విభావమ్ యగున్ 

తులమే జాలును తూలుతూ తనువు దాత్మా బొందగాసత్యమున్ ..

----

" చంపకమాలవృత్తే ( న జ భ జ జ జ ర..21/11 ..

--

రఘుకులసోమమీశ్వరవరాత్తమనోబలకామ్యలబ్ధినం ,

అఘహరదేవపాదకమలంమి థిలాధిపపుత్రినాయకం ,

అఘవికృతాసురేంద్రమదహంతృసుధన్వినముక్తలక్షితం ,

రఘును తమిష్ట మాతృపదరంజితభక్తిపరాయణం నమే( /భజే ) !!! "

----

" చంపకమాలవృత్తే ( న జ భ జ జ జ ర..21/11 ..

రమహృదయమ్ము దాహము సరామ సుధర్మ సకామ్య లక్ష్యమై  

గమకముయే ఉపాసన సుఖమ్ము ను కోరియు కాల గమ్యమై 

సమరము బాణ చేతను ధరించి విరోదు లతోను యుద్ధమై 

గమనము రామ సత్యము మనస్సు విశాలము భక్తి లక్షితం



అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :


భావము : మోక్షం, బంధాలకు రెండు దారులున్నాయి. ఓ జీవాత్మా! నీకేది సరైనదో ఎంచుకుని వెళ్లుము.
_____________________________________________
తాళం : బౌళి

ఏది వలసె నీవది సేయు - యిందులోన నో జీవాత్మ
పొదుగు మనలో అంతర్మాతయై - పరగిన శ్రీహరి పనుపునను

మనవంటి జీవులే - మహిలోన నొకకొన్ని
శునకములై కక్కుటములై - సూకరములు నైనవి
దినదినముఁ గర్మపాశములఁ - దిరిగెడి దుర్దశ లటు చూడు
సనకాదులై కొందరు జీవులు - శౌరిదాసులై రటు చూడు
||ఏది||
కన్నులుఁ గాళ్ళు మనవలెఁదనువులు - గైకొని కొందరు నరులు
పన్నిన తొత్తులు బంట్లునై మన - పనులు సేయుచునున్నారు
ఎన్నఁగ శ్రీహరి నెరుఁగక - యిడుమలఁ బొరలెడి దది చూడు
మన్నె హరిదాసులై నారద - ముఖ్యులు గెలిచిన దది చూడు
||ఏది||
ఇంతగాలమును యీ పుట్టుగులనె - యిటవలెఁ బొరలితి మిన్నాళ్ళు
ఇంతట శ్రీవేంకటేశుఁడు దలంచి - యీ జన్మంబున మము నేలె
వింతల బొరలిన నరకకూపముల - వెనకటి దైన్యము లటు చూడు
సంతసమున ముందరి మోక్షము - సర్వానందం బది చూడు
||ఏది||
_______________________________________________
ఓ జీవుడా! ఇక్కడ రెండు దారులు వున్నాయి. ఒకటి ఈ సంసారబంధ చక్రం లో తిరుగుతు అనేక జన్మలు ఎత్తుతూ వుండేది. రెండవది ఈ బంధాల నుంచి బయటపడి మోక్షం సంపాదించే దారి. నీ అంతర్మాతలో వున్న శ్రీహరి ఆదేశం పాటించి నీకేది మంచిదో ఎన్నుకుని ఆ దారిలో వెళ్లు.

నీవు చూస్తూ వున్నావు. మన లాంటి జీవులే వాటి పాపకర్మల బట్టి కొన్ని కుక్కలుగా, కోళ్ల గా, పందులుగా జన్మ ఎత్తి, అందుకనుగుణమైన దుస్థితి నిత్యం అనుభవించుచు తిరుగుతున్నాయి. మరికొందరు మనలాంటి జీవులే శ్రీహరిని భక్తి తో పూజించి, సేవించి సనకసనందనాది మునీంద్రులుగా మారి హరిదాసులై ముక్తిని పొందారు. మరి ఎటు వెళతావో నీ యిష్టం.

మరి ఇటు చూడు. కొంతమంది మనలాగే శరీరము, కాళ్లు, కనులు కలిగివుండి, వారిలాంటి మనుషులకే బానిసలై, సేవకులై పనులు చేస్తున్నారు. వీరికి భగవంతుడెవరో తెలియక ఇన్ని బాధలు పడుతున్నారు. మరి అటు చూడు. మరికొందరు మనలాంటి మానవులే జాగురూకులై మాధవుని నామసంకీర్తనం తో భజించి నారదాది మునులు గా మారి సంసార సమరం లో గెలిచి ముక్తులైనారు.

అనాది కాలము నుంచి ఇలాగ ఎన్నో జన్మలు దాల్చుచు సుఖదుఃఖాలు అనుభవించుచు భూమి పై ఇన్నాళ్లు పొరలుతున్నాము. ఈ జన్మ లో మన పై దయతలచి శ్రీవేంకటేశ్వరుడు అవతరించి, తనను భజించడం ద్వారా ముక్తి పొందండి అని దారి చూపించాడు. ఇన్ని జన్మలు నరకకూపములలో బడి అనుభవించిన బాధలు, కష్టాలు ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆనందదాయకమైన మోక్షము మన ముందరే వుంది. ఇక ఈ దారిని పయనించి జన్మరాహిత్యమైన వైకుంఠ సన్నిధి చేరుకుందాం.

మీ
pranjali prabha

*హిందూసాంప్రదాయంలో - ముత్తైదువ అలంకార అంతరార్థరహస్యాలు:-

💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐

 18-28-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

అII ఇక తామసకర్తయొక్క లక్షణములను వివరించుచున్నారు - 

అయుక్తః ప్రాకృతః స్తబ్ధః  శఠో నైష్కృతికో౽లసః

విషాదీ దీర్ఘసూత్రీ చ  కర్తా తామస ఉచ్యతే.

తా:- మనోనిగ్రహము (లేక చిత్తైకాగ్రత) లేనివాడును, పామర స్వభావము గల వాడును (అవివేకి), వినయము లేనివాడును, మోసగాడును, ఇతరులను వంచించి వారి జీవనములను పాడుచేయువాడును, సోమరితనముగలవాడును, ఎల్లప్పుడు దిగులుతో నుండువాడును, స్వల్పకాలములో చేయవలసినదానిని దీర్ఘకాలమునకైనను పూర్తిచేయనివాడును నగు కర్త తామసకర్త యని చెప్పబడుచున్నాడు.

వ్యాఖ్య:- అయుక్తః = మనస్సు బహిర్ముఖముగాను, చంచలముగాను నుండువాడు, ఆత్మయందు నిలుకడలేనివాడు, ఏకాగ్రత, నిగ్రహము లేకయుండువాడు అయుక్తుడనబడును. ఆత్మతో, భగవంతునితో గూడియుండనివాడు అయుక్తుడు. అట్టివాని మనస్సు నిగ్రహములేక బయటనే తిరుగాడుచుండును.  "ప్రాకృతః" - ప్రకృతిగుణములు కలవాడు ప్రాకృతుడు. సంస్కారము లేనివాడు పామరుడని అర్థము. ప్రతివాడును తనయందలి ప్రకృతిగుణములను తొలగించుకొని అప్రాకృతుడుగ, దైవస్వరూపుడుగ మారవలెను.

'నైష్కృతికః' = ఇతరుల కార్యములను చెడగొట్టువాడు. ఇతరులను వంచించువాడు. సామాన్యముగ జనులు నాలుగు రకములుగ నుందురు.

(1) తన సుఖమునుగూడ చూడక ఇతరులకు మేలుచేయువాడు.

(2) తన సుఖము చూచుకొనుచు ఇతరులకు హితమొనర్చువాడు.

(3) తనసుఖము కొఱకు పరులకు కీడుచేయువాడు.

(4) అనవసరముగా ఇతరులకు కీడుచేయువాడు. మొదటివాడు ఉత్తముడు. రెండవవాడు మధ్యముడు. మూడవవాడు అధముడు. నాల్గవవాడు అధమాధముడు. ఈశ్లోకమున తెలుపబడిన 'నైష్కృతికులు' చివరి రెండు తరగతులకు జెందినవారు.

"అలసః" - భగవానుడు సోమరితనమును తామసగుణముగజెప్పి దానిని పారద్రోలవలసినదిగా బోధించుచున్నారు. సోమరి ఏరంగమందును వృద్ధికి రానేరడు. అధ్యాత్మరంగమున సోమరులకు చోటేలేదు.

"విషాదీ" - తామసకర్త ప్రతికార్యమందును ఏడుపుమొగము పెట్టుకొని యుండును. వాస్తవముగ అనంతానందపరిపూర్ణుడగు మానవుడు విషాదయుక్తుడై మూలుగుచుండుట కేవలము అజ్ఞానమువలననే యగును. కావున గంభీరమగు స్వస్వరూపము నెరింగి విషాదమును పారద్రోలవలెను.

"దీర్ఘసూత్రీ"– మందకొడిగ ప్రవర్తించువాడు. తాబేలు నడకవంటి గమనము గలిగి చిన్నపనిని కూడా గంటలతరబడి చేయుచు, లేక అసలేచేయక "వాయిదా వేయుచునుండును. తామసకర్త 'తరువాత చూచెదములే' అను ప్రమత్తతతో గూడిన భావము గలిగియుండును.

        మహాభారతములోని శాంతిపర్వమున భీష్ముడు ధర్మరాజునకు "దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రి" అను మూడు చేపలను గూర్చి బోధించిన విషయమీసందర్భమున జ్ఞప్తికి తెచ్చుకొనుట యుక్తము.

 ఆ మూడు చేపలలో దీర్ఘదర్శి దూరపు ఆలోచనగలది. ప్రాప్తకాలజ్ఞుడు కొంత ప్రయత్నలోపముగలది. దీర్ఘసూత్రి ఏ ప్రయత్నము చేయని సోమరి. (కథలో అది బెస్తవాని వలలో పడి మరణించును). కాబట్టి ఇట్టి దీర్ఘసూత్రత్వమును, అలసత్వమును, సోమరితనమును ముముక్షువులు దరికిచేర్చరాదు. అమూల్యమగు మానవజన్మను బడసి భగవత్ప్రాప్తికై యత్నింపక సోమరిగ కాలము గడుపుట మహాప్రమాదకరమని యెరుంగవలెను.

ప్ర:- తామసకర్త ఎట్టివాడు?

ఉ:- (1) మనోనిగ్రహము (చిత్తైకాగ్రత) లేనివాడు, (2) పామరుడు, (3) మొద్ధు, వినయము లేనివాడు

(4) మోసగాడు, (5) ఇతరుల కార్యములను చెడగొట్టువాడు, (6) సోమరి, (7) ఎల్లప్పుడు ఏదియోచింతతో, దుఃఖముతో గూడియుండువాడు, (8) పనులను తెమల్చక దీర్ఘకాలము కొనసాగించువాడు - తామసకర్త యనబడును.

--(())--

 హిందుమహిళలకుమాత్రమెముత్తయిదువ లక్షణాలు మొత్తం అయిదు అలంకారాలు ఉన్న స్త్రీని ముత్తైదువ అంటారు అవి కాళ్ళకిపట్టీలు మెట్టెలు చేతులకి గాజులు మెడలో మంగళసూత్రం తలలో పువ్వులుచివరగానొసటన అంటే కనుబొమ్మలమధ్యసింధూరం కానీ కుంకుమకానీ..

మొదటగా కాళ్ళకు పట్టిలుమెట్టెలు ఎందుకో చూద్దాం:- కాళ్ళలో ఉండే సయాటికా నెర్వ్ మోకాళ్ళ దగ్గర నుంచి కింది వైపుకి టిబియా లేదా టైబియా అని పిలవబడుతుంది

ఇది తిరిగి పాదపు గుత్తి వరకు వచ్చిన తర్వాత రెండు రకాలైనటువంటి బ్రాంచెస్ గా విడిపోతుంది

ఒక శాఖ వేళ్ళ చివరి వరకు వెళ్లి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనకాల మడమ వరకు వెళ్లి అక్కడ అంతమవుతుంది

అంటే వేళ్ళ చివరలో ఇంకా మడమల చివర్లో టిబియా శాఖ తాలూకు నాడీ అంత్యాలు ఉంటాయి ఈనాడి నేరుగా కటివలయం దగ్గర ఉన్న గర్భాశయ మరియు మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంది అంటే స్త్రీలలో వారు ధరించేటువంటి పట్టీలు ఇంకా కాలి మెట్టెలు ఇవన్నీ కూడా ఈ టిబియా నాడిని రాపిడి లేదా ఒత్తిడి ద్వారా ప్రేరేపించి తద్వారా మూత్రాశయ నాడులను గర్భాశయ నాడులను కూడా ప్రేరేపిస్తాయి

ఫలితంగా వారిలో గర్భాశయ మరియు మూత్రాశయ పనితీరు అనేది చురుగ్గా ఉంటుంది గర్భాశయం పనితీరు బాగుండటం వల్ల బిడ్డను మోయడానికి సుఖప్రసవానికి కూడా సులువుగా ఉంటుంది అలాగే మూత్రాశయ పనితీరు బాగుండటం వల్ల ఎప్పటికప్పుడు దేహంలో నిల్వ ఉండకుండా మూత్రం మొత్తం బయటికి వెళ్లిపోతుంది దీని గురించి పూర్తి సమాచారం కావాలంటే tibia nerve అని గూగుల్లో వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది

ఇంకారెండవ అలంకార లక్షణం గాజులు:- గాజులు అంటే కేవలం మట్టి లేదా గాజు లేదా బంగారం గాజులు మాత్రమే ఈరోజుల్లో వేసుకునే ప్లాస్టిక్ గాజులు ఎంతమాత్రం కాదు మన చేతి మణికట్టు దగ్గర రేడియల్ నెర్వ అనే నరం నేరుగా గుండె యొక్క నరాల తోటి అంటే గుండె స్పందన కి సంబంధించిన నరాల తోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది వైద్యులు నాడీ స్పందన కూడా దీని తోటే గమనిస్తూ ఉంటారు ఈ నరం మన శరీరంలో పెరిగే లేదా తగ్గేటటువంటి బ్లడ్ ప్రెజర్ అంటే రక్త పోటుని అదుపులో ఉంచుతుంది అంటే దీనికి మసాజ్ చేయడం ద్వారా రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.అందుకనే స్త్రీలలో గాజులను వేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటూ వొచ్చింది అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం కలగాలి గాజులు అనేవి మరి పురుషులు వేసుకోరు కదా వారికి రక్తపోటు అవి రావా అని.పూర్వకాలం నుంచి కూడా వారు పొలం పనులు లేదా శారీరక శ్రమ అనేది ఎక్కువగా చేయడం వల్ల ఒకరకంగా చెప్పాలంటే తిండికి సరిపడా పని ఉండడంవల్ల వారిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉండేది దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువగా ఉండేది అందువల్ల వారికి గాజులు అవసరం అనేది లేకుండా పోయింది అయితే వారిలో కూడా కొంతమందికి రక్తపోటు సమస్యలు ఉన్నవారికి వెండి లేదా బంగారం లేదా రాగితో చేసినటువంటి కడియం ధరించమని చెప్పడం జరిగింది ఈ లోహాలతో చేసినవి శరీరానికి వేడిని గ్రహించి చల్లగా ఉంచుతాయి అందునా పొలం పనులు కాయకష్టం చేసే వాళ్ళు కాబట్టి గాజులు వేసుకుంటే పగిలిపోతాయి అనే ఉద్దేశంతో వీళ్ళకి కేవలం కడియాలలా ధృఢంగా ఉన్నవాటిని మాత్రమే సిఫార్సు చేయడం జరిగింది ఈనరం దాని యొక్క పనితీరు గురించి తెలియాలి అంటే గూగుల్లో Radial nerve అని వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది

మూడవది:- మెడలోమంగళసూత్రం దీని చివరున్న బంగారంతో చేసిన లాకెట్స్ రాపిడివల్ల ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది అయితే మళ్ళా మీకు ఒక అనుమానం రావచ్చు మరి మగవాళ్ళ సంగతి ఏమిటి అని మగవాళ్ళు రొమ్ము క్యాన్సర్ కి సహజంగానే నిరోధక వ్యవస్థను కలిగి ఉంటారు కాబట్టి మగవారిలో రొమ్ము సంబంధిత క్యాన్సర్ అనేది చాలా తక్కువ ఒకరకంగా చెప్పాలంటే అసలు ఉండనే ఉండదు ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా బంగారంతో చేసినటువంటి లాకెట్ల తాలూకు రాపిడి అనేదిఉపయోగపడుతుందిఇంకా చెప్పాలంటే స్నానం చేసే సమయంలో దీనిపై నుంచి వచ్చేటటువంటి వేడి నీరు ప్రవహించడం వల్ల చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి క్యాన్సర్ కి ట్రీట్మెంట్గా బంగారం ఉపయోగపడుతుందని ఈమధ్యనే తెలిపిన పరిశోధన కూడా గమనించవచ్చు 

                ఇక నాల్గవది :- తలలో పూవులు వీటి నుంచి వచ్చే సువాసనల వలన మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది ఇవి ఇద్దరి మధ్య ఆకర్షణకు తోడ్పడుతాయి .

ఇక అయిదవది:- చివరిదినొసటన సింధూరం పూర్వపు రోజుల్లో దీనిని సొంతంగా కుంకుమ రాయి నూరుకొని దానికి రేడియం పౌడర్ కలిపి రెండు కనుబొమ్మల మధ్యలో అలంకరించుకునే వారు ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే ఏడు చక్రాలలో మొదటి చక్రమైన ఆజ్ఞాచక్రం పై ఒత్తిడి కలుగచేయడం ద్వారా మనస్సును అదుపుచేయడం ప్రశాంతంగా ఉండడం జరిగేది ఇవే కాకుండా సైనస్ కు రాకుండా ముక్కపుల్లను చెవిపోట్లు దరికి చేరకుండా చెవి పోగులనూ ధరించేవారు! అవే పద్ధతులు నేటికీ పాటించడం ద్వారా కొన్ని రకాల వ్యాధులకు సహజంగా నిరోధాన్ని డెవలప్ చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా జీవనం కొనసాగించు కోవచ్చు..!

         

ఓం శ్రీ మాత్రే నమః

సేకరణ

1.ఉంగరాల చేతితో మొట్టేవాడు చెబితే వింటారు
2.ఉంచుకున్నవాడు మొగుడూ కాదు - పెంచుకున్నవాడు కొడుకూ కాదు
3. ఉంటే అమీరు - లేకుంటే పకీరు
4. ఉంటే ఉగాది - లేకుంటే శివరాత్రి
 
5.. ఉంటే ఊరు - పోతే పాడు
6. ఉంటే లిక్కి - పోతే కొడవలి
7. ఉండ ఇల్లు లేదు - పండ మంచం లేదు
8. ఉండమనలేక వూదర, పొమ్మనలేక పొగ పెత్తినట్లు
 
9. ఉండవే పెద్దమ్మా అంటే కుండ పుచ్చుకు నీళ్ళు తెస్తానందట
10. ఉండి చూడు వూరి అందం - నానాటికీ చూడు నా అందం అన్నట్లు
..........
*****హర విలాసము*****

హరవిలాసము, అది హరుని నివాసము,
పై కప్పు లేనిది,మంచు తో కప్పబడినది,
తీర్చి దిద్దిన ముగ్గులతో,కూర్చిన అలంకారాలతో,
భాసిల్ల హిమనగం, శోభిల్లే హర విలాసము..

బొట్టుబొట్టు రాలే నీటి చుక్క లే
పారే నదులై ఇలపై జాలు వారగా,
శృంగి,భుంగి ల నిరంతర పరి రక్షణలో హిమగిరిప్రశాంతముగా,
ప్రమథ గణములు నిరంతర 
సేవలకై అప్రమత్తులౌగా,
హరహర శంభో నామోచ్చారణతో,
హిమనగము ప్రతిధ్వనింపగ....

అష్ట దిక్పాలకులు ప్రాతః సమయాన స్వామి దర్శనముకు నిరీక్షించ,
నంది తన అంబా అను రంకెలతో
స్వామి కి శుభోదయం పలుక,
గణపతి కార్తికేయులు నిరంతర
మాతాపితరుల సేవలు సమీక్షించ,
అప్సరాంగనలు, ఆది దంపతుల అలంకరణకే సుమ మాలలల్లగా..

మునులు, ఋషులు వరుసలుగా,
సురులు,అసురులు గుంపులుగా కూడి స్తుతింప,
సకల భూత గణమెల్ల శివుని ఆజ్ఞ పాటింప సిద్ధ మౌగ,
త్రి నేత్రములు యోగ నిద్ర లో నుండి కనులు విచ్చుకొని సకల
దిక్కులూ పరిశీలించ,
సుమ మాలల తో స్వామి ని అలంకరించే జగదాంబ వేడుకతో..

చెరుకుపల్లి గాంగేయ శాస్త్రీ,రాజమండ్రీ..
 నేటి నా పాట పాట సంఖ్య 599
**********
రచన:-మహేష్ వూటుకూరి  ✍️
9640713717.
దోర్నాల.
 ప్రకాశం జిల్లా.
05/04/2023.
*****
పాట సందర్భంపై నా విశ్లేషణ.
**********
కలలా కరిగి పోతు
కథలో వినిపించేలా  రోజులు మారిపోయినా 
 ఉమ్మడి కుటుంబం  వ్యవస్థ అంతరించి పోలేదనేందుకు
ఉదాహరణగా కాదు వాస్తవంగా కళ్ళ ముందు సాక్షాత్కారమై ఒకరికొకరు అనురాగం పంచుకుంటు
 పెద్దలను గౌరవిస్తు  ఒకే మాటపై  నిలచి నిలిపి 
ఔదార్యం తో  నమ్మకం తో సాగుతు మాది 
వసుదైక కుటుంబం అంటు చాటుతున్న ప్రేమికులు ప్రేమస్వరూపాలు  అంతా ఒకటిగా కలిసి పాడుతున్న పాట..
***************
 పల్లవి:-
****
కుహు కుహు కుహు కుహూ  కోకిల రాగం
సప్త స్వరాల గంగా ప్రవాహం 
తన్మయమై  పరవశమైనది హృదయం..

ఒహొహో ఒహొహో వెన్నెల జలపాతం
నలుదిక్కుల మల్లెలు చల్లి మనసునే మురిపించేను
సుందర దృశ్యం మనోహరంమహదానందం!!

పచ్చిక అచ్చికల పచ్చదనం శోభయమానం
మనసు మురిసి పాడెను హృదయగీతం.!!

మెచ్చిన మనసొకటి  ఇచ్చెను వెచ్చని అభిమానం
కంచికి చేరిన కథ ఇంటికే తిరిగొచ్చేను
అందరం మనమందరం ప్రేమాభిమానాల
పెంపకాలం బ్రతుకంతా ఆనంద సాగరం.!!

కుహు కుహు కుహు కుహు కోకిల రాగం
ఒహొహో ఒహొహో వెన్నెల జలపాతం!!
చరణం:-
****
స్వచ్ఛమైన  స్వప్నం 
సాకారమై నిశ్చలమైన నీ ఒడి చేర్చేను
అమ్మలాగా  మారినా  కమ్మదనం  
జన్మజన్మల అనురాగం పంచేను!!

నిండు జాబిల్లి   కుండపోతగా
మల్లెలు కుమ్మరించి మనసంతా
మధుమాసం చేసేను!!
కన్నె తనం కౌగిళింత గొప్పతనం చాటేను!!
పల్లవి:-
***
కుహు కుహు కుహు కుహు కోకిల గానం
ఒహొహో ఒహొహో వెన్నెల జలపాతం.!!
చరణం:-
***
ఎల్లవేళలా నవ వసంతం నువ్వై రాగా
అల్లంత దూరం   దరి చేరి  ముత్యాల వానే కురిపించగా
ముసిముసి నవ్వులుగా  పసి హృదయాలు  పడి పడి నవ్వేనులే
పిల్లగాలి పిల్లన గ్రోవై  
హృదయాంతరంగాన్ని  మీటేనులే 
పల్లవి అల్లుకున్న బందం పాటలా పరవశించేనులే.!!

ఆస్వాదించిన తనువు  ఆహ్లాదం పంచిన మనువు
తొలకరి జల్లులో తడిసినంతా తన్మయమై తరించేనులే
ఈ జన్మకు ఈ ఆనందం మించిన క్షణం రాదులే
ఇంత సంతోషం పంచిన ఉమ్మడి కుటుంబం  నాకిచ్చిన
దైవానికి ఋణపడి వుంటా జన్మజన్మలకు...
పల్లవి:-
***
కుహు కుహు కుహు కుహు కోకిల రాగం
ఒహొహో ఒహొహో వెన్నెల జలపాతం!!
**************

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ