ప్రాంజలి ప్రభ...28/03

 




మ*గానం: శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు*

రేకు: 353-6

సంపుటము: 4-314

రేకు రాగము: సామంతం.


ఇన్నిటా ఇంతటా ఇరవొకటే

వెన్నుని నామమే వేదంబాయె!!


నలినదళాక్షుని నామకీర్తనము

కలిగి లోకమునఁ కలదొకటే

యిల నిదియే భజియింపఁగఁ పుణ్యులు

చెలఁగి తలఁప సంజీవని యాయె!!


కోరిక నచ్యుత గోవిందాయని

ధీరులు దలఁపఁగఁ తెరువొకటే

ఘోరదురితహర గోవర్ధనధర

నారాయణ యని నమ్మఁగఁగలిగె!!


తిరువేంకటగిరి దేవుని నామము

ధరఁతలపగ ఆధారమిదే

గరుడధ్వజుని సుఖప్రదనామము

నరులకెల్లఁ ప్రాణము తానాయె!!

***

భావము:-

- శ్రీ అమరవాది సుబ్రమణ్య దీక్షితులు గారు

     విష్ణునామ సంకీర్తనా వైభవాన్ని వివరిస్తున్నారు అన్నమయ్య. నారాయణ అని పలికినంత మాత్రమున అజామీళుడు నరకాన్ని తప్పించుకొని వైకుంఠం చేరినట్లు భాగవతం చెబుతున్నది. వెన్నుని నామమే వేదం. ఎంత గడించినా, ఎన్ని పదవులు పొందినా, ఎంత చదివినా విష్ణు నామమే  గతి.... ఇది సత్యం.

ఇన్నిటికి, ఇంతటికీ అత్యుత్తమమైన స్థానము ఏది తెలుసునా? శ్రీమన్నారాయణుని నామ సంకీర్తనమొక్కటే. అదే వేదం వలె అందరికీ ముక్తినిస్తున్నది.

1. ప్రపంచము అని పిలువబడే ఈ లోకమున అరవింద దళనేత్రుడైన ఆ శ్రీహరి నామమొక్కటే గతిగా కలదని గ్రహించండి. పుణ్యాత్ములైన భక్తులు ఇది గ్రహించి, విజృంభించి ఆ నామ సంకీర్తన భజియింపగా అది సంజీవని వలె వారికి మేలు చేసింది. మీరెందుకు అట్లు చేయరాదు?

2. ధీరోదాత్తలైన వారు ఇష్టపూర్వకముగా ఓ అచ్యుతా! ఓ గోవిందా! అని ధ్యానిస్తూ జీవించుటకు ఆ నామసంకీర్తనయే మార్గం అయింది. అది వారు చేసిన ఘోర పాపములను నిర్మూలించివేసింది. గోవర్ధనగిరి ధారియైన శ్రీకృష్ణ పరమాత్మయే నారాయణుడే దురితదూరుడని నమ్మిన సర్వమూ నెరవేరుతుంది. ఆ నామము అంత గొప్పది.

3.  తిరుమలనాధుడైన శ్రీవేంకటేశ్వరుని నామమే ఈ భూలోకంలో ఆధారముగా నిలిచినది. గరుత్మంతుడు తన ధ్వజమున కలిగిన ఆ మహానుభావుని సుఖప్రదమైన నామము తానే ప్రజలందరికీ ప్రాణం వలె జీవనాధారమైనది.

****


నేటి నా పాట పొట సంఖ్య:.
**********
 25/03/2023.
******
పాట సందర్భంపై నా విశ్లేషణ.
**********
ప్రేమ లోతుల్లో కి వెళ్ళిన ప్రేమికుల హృదయ స్పందనలో అణువణువు
అమృతం నిండి  భావాలు పారిజాత పుష్పాలు గా వికశించి మధురమైన భావాలుగా పరిమళాలుగావెదజల్లుతు  కాలమంతటిలో హాయిని ఒంపుతు పగలు రాత్రి ని  ప్రేమ ప్రపంచంలా మార్చిన ప్రేమికుల ప్రణయం మధురామృతాలు కురిపించిన పాట..
****************
 పల్లవి:-
****
నీ నీ  నామం సుమనోహరం  ... మధురం మధురం...

నీ...నీ...  ... రూపం  ... బహు సుందరం  అపురూపం .. అపురూపం నాకు  అపురూపం!!

నీతో  సాగిన ప్రణయం ... జన్మంతటికి సరిపోవు సంతసం.. సంతసం నాకెంతో సంతసం....!

 రా.. రా.. రా.. రమ్మని ...  నీ  కమ్మని పిలుపు వినిపించగా ... ఎంత దూరమైనా  సాగుతున్నా
నిను వెతుకుతున్నా .. అంతటా  అన్నింటా ఎంతో ఇష్టంగా...!!

 నీ నీ నీ నామం సుమనోహరం .. నా హృదయం లో.. నీ రూపం పదిలం పదిలం..!!
చరణం:-
***
నీ స్వరం ప్రేమగా పిలువగా ...ఎదలోని భావం  కదిలింది ఉప్పెనై
ఎగసి సొగసై  నిను చేరుకోవాలనే ...తపనై తన్మయమై..

ప్రేమతో కలువగా ... కలువలా వికిశించాను నేనుగా ... అణువణువు హరితవనముగా
సుమగంధ పరిమళముగా...!!

రామ నామస్మరణములా  నీ ప్రేమ తపమై  జపమై ... నా లోన చేరి లోలోన ఏదేదో చేస్తు
నిరంతరం నీ ద్యాసలో ద్యానమై ... తపించి జపించి తరించుతున్న తనువురా
నేను  నీ జాను  రా....
పల్లవి:-
***
 నీ నీ నామం సుమనోహరం  నీ నీ నీ   రూపం బహు సుందరం అపురూపం!!
చరణం:-
**
రాగం పలుకు కోయిలనై   వెన్నెలలో నీకై పాడుతున్నా
ప్రియా ప్రియా సరాగాల ప్రియ రాగాలను
వినిపించుకో....  వీనుల విందైనా... నా ప్రేమ ప్రియ సందేశం.....
వచ్చేసి వాలిపో...
కనుల ముందు నీ సుందర రూపం  రా.....రా.... రాజకుమారా
 నీకై ....వేచి వున్నా...   వేకువలా...
 వేగమై.... రా.... నా.... వేడుకోలు వినరా....
ప్రియతమా నా హృదయమా...
 ఈ ...ఈ ...ఈ.. ఉదయమల్లే  ఉషస్సులా  ప్రకాశించురా...
ఝు ఝు  ఝుం  ఝుమ్మన్న నాదమల్లే  సై ..సై... సై ...అంటు సాగిరా సుందరా..

 నీ ... నీ....  రాకకై ఎదురుచూస్తున్నానా నిరీక్షణా చిగురించాలిరా  
నిను చూసిన ఆనందంలో...
పల్లవి:-
****
 నీ నీ నామం సుమనోహరం  నీ నీ నీ రూపం బహు సుందరం అపురూపం.
***************

*. నేటి హస్యం 

గురువు :పిల్లలు నేను ఒక ప్రశ్న అడుగుతాను సమాదానము చెప్పండి 
            
             దేవుడు చేసే పని ఏమిటి ? 
పిల్లలు

1 . గురువు స్థానంలో ఉండి బోధ చేయటం  కదా మాష్టారు
2.  జనన మరణాలు సృష్టించటం కదా మాష్టార్  
౩. ప్రళయాన్ని శృష్టించి ఆడుకోవటం కదా సార్ 

గురువు: రేపటి లోపు సమాధానములు వ్రాసు కొని రండి 

మరునాడు : అందరు తమకు తెలిసినవి వ్రాసుకొని వచ్చారు. 

గురువు:: ఎం రామకృష్ణ నీవు సమాధానము ఏమి వ్రాసుకు రాలేదు ఏమిటి ? 
ముందు మీరు సమాధానము చెప్పండి తర్వాత నేను చెపుతాను అన్నాడు అందరి ముందు 

గురువు : ఎం చెప్పాలో తెలియక ఒక్క అరుపు అరిచి పిల్లలకు పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి అన్నాడు . 
రామకృష్ణ : నేను చెపుతాను గురువుగారు నాకు అనుమతిస్తే 

గురువు : చెప్పు 

ఏమీ లేదు నేను సమాధానము చెప్పే వాడ్ని కనుక ఒక్క క్షణం గురువు స్థానంలో ఉంటా అన్నాడు 

గురువు : సరే అట్లాగే అని పిల్లల మధ్య కూర్చున్నాడు. 

రామకృష్ణ : దేవుడు చేసే పని అహంకారులను క్రింద కూర్చో పెట్టడం , అనుకువగా ఉన్న వారిని అందలం ఎక్కించటం .

ఆ..........                 ఆ.....................  

--((**))--
****************************
నేటి నా పాట పాట సంఖ్య:-589.
******************************
రచన:-మహేష్ వూటుకూరి ✍️
9640713717.
దోర్నాల.
 ప్రకాశం జిల్లా.
26/03/2023.
****************
పాట సందర్భంపై నా విశ్లేషణ:-
**************************
 తోటి మనుషుల చేతిలో ఓడిపోయి
 బ్రతుకుపై ఆశ పోయి నిరాశలో కూరుకుపోయి
ఎటో వెళ్ళిపోయి  అంతులేని విషాదంలో  చేరిపోయిన
 బతికి చెడ్డ ఓ మనిషి ఆవేదనే ఈ పాట.. అశక్తత
ఆవరించి నిస్పృహ లో  దుఖ్ఖంలో దయనీయస్థితిలో
 హృదయం లోని ఆవేదనే ఈ పాట.
*******************************
పల్లవి:-
***********
నేనొక ఏ బలం లేనోడిని
నేనొక ఏ బలగం లేనోడిని
పూట గడవని పేదోడిని 
పగలైనా రేయైనా కష్టం వెతుకుతు
కడుపు నింపుకునే 
గుడిసె వాసిని
గుడిలోని దేవుడే దిక్కైనోడిని..!

 !!  నేనొక బలం లేనోడిని
నేనొక  ఏ బలగం లేనోడిని!!

కాగితం లా ఎగిరిపోతు
గాలివాటు బ్రతుకులా సాగేపోతు
దిక్కులన్ని  తెలిసినోడినే కాని
ఏ హక్కు లేనోడిని ఏకాకిని
నేనో బికారిని..!!
 
గాలిబుడగలా పేలిపోతు
కాగితం పువ్వులా రాలిపోతు
వాడిపోయిన వాడిని
ఎవ్వరేమన్నా ఏమిచేయలేని వేడిలేనోడిని!!
 పల్లవి:-
********
!!నేనొక ఏబలం లేనోడిని
నేనొక  ఏ బలగం లేనోడిని!!
చరణం:-
********
గలగల నదిలా సాగేవాడిని
జలగల మద్యచిక్కి చితికిపోతిని
వలవల ఏడ్చినా ఏం లాభం లేకపోతిని
బ్రతుకు ఆశ చచ్చి ఇలా రోడ్డున పడితిని

కర్మఫలమో  కాలం శాపమో
మర్మం తెలియక గాయం అయినా గేయాన్ని
నిర్మలమైన సరస్సులో బండలు వేసి 
బతుకులో అలజడి రేపిన అరాచకం హాయిగుంది

నమ్మకానికే ఆలయమైన  హృదయం
వేదనతో నిండిపోయింది 
ఆత్మవిశ్వాసమే చిగురుటాకులా వణికిపోతు
గజగజ లాడుతు వీధిలో  నిలుచుంది...!!

ధర్మానికి ఈ దుస్థితి 
సూచిస్తోంది రేపటి పరిస్థితి
మంచి అంటే చేతకాని తనమని
చెడు వాదన చేటు చేస్తోంది
చెదలా పట్టి సంఘాన్ని నిర్వీర్యం చేస్తోంది
 చేసేసింది!!
!!నేనొక ఏ బలం లేనోడిని 
నేనొక ఏ బలగం లేనోడిని!!
*************************

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ