ప్రాంజలి ప్రభ..17/03*

 



Indian Gods and Goddesses: Bal Goapala Krishna - Vrindavan - Gokul


.......


సమస్యను పరిష్కరించడం.....ప్రాంజలి ప్రభ

కం. కోకిల పుట్టదె కాకికి
ఆ కమలేక్షుణు ప్రభావ మదియే కనరా
ఈ కలి ప్రభావ మిదియే
కాకర పూ పూచి నిమ్మకాయలు కాచున్ 
......
కం. వంకర టింకర బుద్ధులు 
చక్రము లాగా కదులుట చేష్టలు గానే 
వికటకవి వాక్కు వింతయు   
కాకర పూ పూచి నిమ్మకాయలు కాచున్
.......
మాత్రాబద్ధము 
కాకర పూ పూచి నిమ్మకాయలు కాచున్ 
గోకర పూ పూచి  దబ్బకాయలు కాచున్ 
చీకటి పూ పూచి నిబ్బరమ్ముగ  కాచున్   
వాకిట పూ పూచి పిల్పులే మది కాచున్
.....
 శ్రీ గణేశ హృదయం

* విశ్వాత్మకం యస్య శరీరమేకం
తస్మాచ్చ వక్త్రం పరమాత్మరూపమ్ |
తుండం తదేవం హి తయోః ప్రయోగే
తం వక్రతుండం ప్రణమామి నిత్యమ్
....
.  నేటి సూక్తి : యోగసాధనలో ఏకాగ్రత - ఏకాగ్రత ఆలోచనకు సంబంధించినదైనప్పుడు, అది మెదడు నందలి ఏదో ఒక స్థానంలోనూ, భావావేశానికి సంబంధించినదైనప్పుడు హృదయస్థానంలోనూ సామాన్యంగా జరుగుతూ వుంటుంది. తీవ్రస్థాయి నందుకొన్న దీని విస్తృత రూపమే యోగ సాధన యందలి ఏకాగ్రత. 
 .....

శ్రీ గురుభ్యోనమః

ఫాల్గున బహుళాష్టమి వైశిష్ట్యం

ఫాల్గున శుక్లాష్టమి నాడు అమ్మవారు పార్వతీరూపంలోనూ , ఫాల్గున కృష్ణాష్టమి నాడు శీతలాదేవిగానూ సంచరిస్తుంది. ఈ రెండు అష్టములలోనూ అమ్మవారిని భక్తితో పుష్పాలతో, కుంకుమతో పూజించి, అన్ననైవేద్యంతో సంతృప్తి పరచాలి.

 ఈ క్రింది శ్లోకాలు పఠించాలి. అలా చేసిన వారికి ఎంత కష్టమైన పని అయినా ఆరునెలలులోగా పూర్తి అవుతుంది. క్లిష్ట కార్యాలు పూర్తి చేసుకోవటానికి ఇంతకు మించిన సులభోపాయం మరొకటి లేదు.

ఆ శ్లోకాలు ఇవి. 
శ్లో||
శీతలే ! త్వం జగన్మాతా,శీతలే! త్వం జగత్పితా |
శీతలే! త్వం జగద్ధాత్రీ, శీతలాయై నమోనమః ||
శ్లో||
వందేహం శీతలాదేవీం, రాసభస్ధాం దిగంబరామ్ |
మార్జనీ కలశోపేతాం విస్పోటక వినాశనీమ్ ||

****

వర్ణన........
సత్యము యొక్క గొప్పతనాన్ని వర్ణించండి.
వర్ణన........ సీస పద్యము  
సత్యము యొక్క గొప్పతనాన్ని వర్ణించండి.

సీ:: అత్యున్నత స్థాయి ఆనతి  స్పృహయని  
      సమయాన్ని వినియోగ  స్వీయ జ్ఞాని   
      నిత్య ఆత్మజ్ఞాని  నిజముతెలుపుటయే 
      జ్ఞానమే ఆత్మగా జ్ఞప్తి పరచు 
      తర్కవితర్కము దారిచూపు మహిమ 
      నిత్యస్వభావము నియమ దీక్ష 
      అంతర్గత జపము ఆరాధ్యదైవము
      స్వీయ సాక్షాత్కార శీఘ్ర గతియు 

తే:: స్వచ్ఛ మైన పలుకులన్ని సత్యమవుత      
      తాను నిస్వార్ధ బుద్దిగా తత్వ బోధ 
      మనసు అర్ధాన్ని తెలిపేటి మాన్య మిత్ర 
      బతికి బతికించు వినమ్రత బంధ వాక్కు 
        ***

" తేటగీతి( పంచపాది )...
--
సత్యమేయిచ్చుసౌఖ్యము నిత్యముగను
సత్యమునుదీక్షగనుఁజేయ శాంతిఁగల్గు
సత్య మార్గమే దీపిక సజ్జనులకు
సత్యమునుమించి చరియింప, శమనహాని
సత్యవంతులేధన్యులు చదివిఁజూడ !!! "
----
నేటి సమస్య:పూరణ a  -03 -2023  
మేకుకు మేతబెట్ట నది యేమనకుండగ గావు కావనెన్

ఉ.తేకుడు పట్టియున్నదిలె తేటగ మార్చుట తప్పదిప్పుడున్     
పాకుడు వల్ల జారుటయు పాదము పట్టియు నెమ్మ దించుతన్   
కాకులు పిండమేయనియు కానక వచ్చియు గంతులేసియున్   
మేకుకు మేతబెట్ట నది యేమనకుండగ గావు కావనెన్
(మల్లాప్రగడ రామకృష్ణ)
 
........


_*🙏గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః.....*_
_*గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః....🙏*_

_*ఈ శ్లోకం అందరికీ తెలుసు కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది...మొదట ఎవరు పలికారు....ఎందుకు పలికారు.....దాని వెనుక ఉన్న కథ....*_

_*పూర్వం కౌత్సుడు అనే పేద పిల్లవాన్ని విద్యాధరుడు అనే గురువు గారు తన ఆశ్రమానికి పిలుచుకు వచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు. ఒకసారి గురువు గారు పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్ళాడు. గురువు గారు తిరిగి వచ్చేవరకు కౌత్సుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు.*_

_*గురువు గారు తిరిగివచ్చిన కొన్ని రోజులకు కౌత్సుడి చదువు పూర్తయింది. కౌత్సుణ్ణి తీసుకెళ్లాడానికి తల్లిదండ్రులు వచ్చారు. కానీ కౌత్సుడు తాను గురువు గారి దగ్గరే ఉంటానని ఇంటికి రానని ఖరాఖండిగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కి పంపాడు.*_

_*వాళ్ళు వెళ్లిన తరువాత గురువు కారణం అడిగాడు.అప్పుడు కౌత్సుడు ఇలా చెప్పాడు "గురువు గారూ మీరు కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్ళినపుడు మీ జాతకం చూసాను.మీరు సమీప భవిష్యత్తులో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్లలేను." అని చెప్పాడు.*_

_*కొన్ని రోజులకు గురువు గారికి క్షయ రోగం వచ్చింది.ఆ కాలంలో క్షయకు చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్లి దాన ధర్మాలు ,పుణ్య కార్యాలు చేయాలని గురుశిష్యులు కాశీకి వెళ్లారు. గురువుగారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్ళను అసహ్యించుకున్నారు. కానీ కౌత్సుడు గురువు గారికి సేవలు చేస్తూనే ఉన్నాడు.ఎంతోమంది గురువు గారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌత్సుడు మాత్రం గురువు గారిని వదలలేదు.*_

_*కౌత్సుడి గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలనుకున్నారు. మొదట బ్రహ్మ మారువేషంలో వెళ్లి గురువుని వదిలేయమని సలహా ఇచ్చాడు. కౌత్సుడు  బ్రహ్మ చెప్పిన మాటలు వినలేదు. మరలా విష్ణువు మారు వేషంలో వచ్చి సలహా ఇచ్చినా కూడా కౌత్సుడు వినలేదు. చివరికి పరమేశ్వరుడు వచ్చినా వినలేదు. మెచ్చిన పరమేశ్వరుడు ఏదయినా సహాయం కావాలా అని అడిగాడు. మరెవరూ గురువును వదిలేయమనే సలహా ఇవ్వడానికి రాకుండా కాపలా కాయమన్నాడు.*_ 

_*అతని గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. కౌత్సుడికి మోక్షం ఇస్తాం అన్నారు. అప్పుడు కౌత్సుడు వారితో నాకు మీ గురించి చెప్పి ఈ రోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ, నా గురువే నాకు విష్ణువు, నా గురువే నాకు మహేశ్వరుడు. మీరు సాక్షాత్కారం అవడానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఇలా శ్లోకం చెప్పాడు.*_

_*గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః*_
_*గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః*_

_*తన గురువు గారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు. గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువుగారికి మోక్షం ప్రసాదించారు. ఆనందంతో కౌత్సుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు.*_

_*ఇదీ ఈ శ్లోకం వెనుక ఉన్న కథ....*_

_*కొన్ని ముఖ్య శ్లోకల విలువలు, అర్ధాలు అందరము తెలుసుకోవాలి, మనము అందరం మన తరువాత వాళ్ళకి కూడా తెలియజేయాలి🙏*_
........
అన్నమయ్య సంకీర్తన


చాలదా మాజన్మము నీ
-పాలింటివారమై బ్రదుకఁగఁగలిగ!!


కమలాసనాదులుగాననినీపై
మమకారముసేయ మార్గము గలిగె
అమరేంద్రాదులకందరానినీ -కొమరై
ననామము కొనియాడఁగలిగె!!

    
సనకాదులును గానఁజాలనినిన్నుఁ
తనివోక మతిలోనఁ దలపోయఁగలిగె
ఘనమునీంద్రులకు నగమ్యమైవున్న-
నిను సంతతమును వర్ణింపఁగలిగె!!

    
పరమమై భవ్యమై పరగిననీ -
యిర విట్టిదని మాకు నెఱుఁగంగఁగలిగె
తిరువేంకటాచలాధిప నిన్ను యీ -
ధరమీఁదఁ బలుమారు దరిసింపఁగలిగె!!
   
.......
గరుడ పురాణం ప్రకారం 21 ఘోర నరకాలు.

శ్రీ గరుడ పురాణం
9 వ అధ్యాయము

21 అతిఘోర నరకాలు ఇవి.
1.తమిస్రము 
2.అంధ తమిస్రము
3. రౌరవం 
4. మహారౌరవం 
5.కుంభీపాకము 
6.సూచీముఖం
7.అసిపత్రవనము 
8.అవీచి 
9.అంధకూపము
10.వైతరణీ 
11.పుయోధ
12. కృమిభోజనం
13. ప్రాణరోధ 
14.కాలసూత్రము
15.సందర్శము 
16. తప్తోర్మీ 
17.వజ్రకంటకం 
18. శాల్మలి 
19. వినాశము
20. నానాభక్షణము 
21.రేతః పానము
ఇవి కాకుండా మరికొన్ని (సేకరణ)

22. దండకాసుర
23. అవదనిరోధన
24.పర్యావర్తన
25.శూలాప్రోతము
26.అవీచిమీంత
27.క్షారకర్దమ


Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ