సుభాషితం - 456
---------------
🌺అహో సాహజికం
ప్రేమ దూరాదపి విరాజతే ౹
చకోరనయన ద్వంద్వ
మాహ్లాదయతి చంద్రమా ౹౹🌺
సహజమైన ప్రేమ దూరం నుంచేనైనా విరాజిల్లుతుంది.చంద్రుడు చకోర పక్షి రెండుకళ్ళన్ను సంతోషంగా చేస్తాడు.
🌺✍🏼ప్రభ
6-4-2023.
🍀. నేటి సూక్తి : బ్రహ్మనిష్ఠ - బాహ్యకర్మ - అంతరమున చైతన్యం ఏకాగ్రమైవున్న తరుణంలోనే బాహ్య కర్మ నాచరించడం మొదట్లో సాధ్యం కాకపోయినా క్రమేణా తుదకు సాధ్యమే. చైతన్యం అట్టి సందర్భాలలో ద్విధావిభక్తమై ఒకటి అంతరమున బ్రహ్మనిష్ఠమై వుండగా రెండవది బాహ్యకర్మ నాచరించవచ్చు. లేదా, చైతన్యమంతా బ్రహ్మ నిష్ఠమై వుండి నిమిత్తమాత్రమైన ఉపకరణం ద్వారా దాని శక్తి బాహ్య కర్మాచరణ మొనర్పవచ్చు. 🍀
ఒక ప్రఖ్యాత శైవ క్షేత్రానికి
ఒక జర్నలిస్ట్ వెళ్ళింది,
ఏదైనా సెన్సషనల్ న్యూస్ వేసి మంచిపేరు తీసుకో వాలని
ఆమె కోరిక.
అక్కడే ఉన్న ఒక భక్తుడిని
ఇలా అడిగింది.
జర్నలిస్ట్ :మీ వయసు ఎంతుంటుందండి?
భక్తుడు :85 ఏళ్లు ఉంటాయండి
జర్నలిస్ట్ :ఎన్నేళ్లుగా గుడికి వస్తుంటారు?
భక్తుడు : నాకు బుద్ది వచ్చినప్పటి నుండి
జర్నలిస్ట్ : మరి దేవున్ని చూసారా?
భక్తుడు : లేదండి
జర్నలిస్ట్ : మరి ఎందుకు అంత నమ్మకంగా ప్రతిసారి గుడికి వెళుతున్నారు?
భక్తుడు :మీరెక్కడ నుండి వచ్చారు?
జర్నలిస్ట్ :సిటీ నుండి
భక్తుడు : అక్కడ ఎక్కువ కుక్కల్ని పెంచుకొంటారట కదా?
జర్నలిస్ట్ : అవును, చాలా ఇళ్లల్లో పెంచుకొంటారు
భక్తుడు :మాది చిన్న పల్లెటూరండి,
అక్కడ పంట చేల్లో దొంగలు పడకుండా కొంత మంది మామూలు కుక్కల్ని పెంచుకొంటారు,
జర్నలిస్ట్ : నేనడిగిన దానికి మీరు చెప్పేదానికి ఏమిటి సంబంధం?
భక్తుడు : రాతిళ్ళు పంట చేల దగ్గర ఎవరైనా దొంగ కనిపిస్తే
ఒక కుక్క మొరుగుతుంది,
అది చూసి చుట్టూ దూరంగా ఉన్న కుక్కలు కూడా మొరుగుతాయి,
కానీ దొంగని చూసింది ఒక కుక్క మాత్రమే,
కానీ మిగతా కుక్కలు దాని మీదున్న నమ్మకంతో నే మొరిగాయి తప్ప
అవేవి దొంగని చూడలేదు.
అలాగే వేల సంవత్సరాలనుండి ఎంతో మంది, ఋషులు, పుణ్యపురుషులు, రాజులు, తపస్సు తో దేవుడి నే చూసివచ్చిన వాళ్ళు
ఇలా ఎంతో మంది హిందూ ధర్మంలో పురాణపురుషులు చెప్పారు దేవుడు ఉన్నాడని,
అలాంటప్పుడు యోచనా శక్తి లేని కుక్కలే ఇంకొక కుక్క మీద నమ్మకంతో మొరిగాయి,
అలాంటిది ఆలోచించే శక్తి,
ఉన్న మనుషులం మనం
మన పూర్వీకులనే నమ్మలేమా !
తప్పకుండా మంచిమనస్సుతో ఎప్పటికైనా దేవుణ్ణి దర్శించుకొంటాను.
జర్నలిస్ట్ : క్షమించండి. మీ అనుభవం అంత, నా వయసు లేదు, తప్పు గా మాట్లాడిన జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను.
........
గణములు -న,న,మ,న యతి- 8
రకరకములుగా వ్రాయించెదను
ప్రకటన సలుపన్ రాజేశి కృప
ఒకటని కలదా యుత్సాహమిడ
చకచక కలమున్ సాగించునెడ
పలుకుదురెవియో వాగ్వాదముల
నిలుపకుమెదలో నీవొక్కటియుఁ
బలికెడి తలినే భావించుకొని
యలరుచు మదిలో నల్లన్ సబబు
తలిహృదయములోఁ దట్టించునవి
వెలువడ వడిగా విన్నాణముగ
వెలుఁగులనిడుటే విద్యార్థులకుఁ
బలుకుల తలివే ప్రాబల్కులయి
కలవరమిడువై గర్వాంధులకు
సలుపును ముదమే సచ్ఛీలురకు
తెలిపెడి విధమే ధీమాన్యముగాఁ
గొలువగ రహితో గోప్త్రీ పదము
పరుగుల నిడుటే వాగై సతము
హరిహరులయినన్ హర్షంబొదవఁ
బరిపరి వొగడన్ వాగ్వాదినిని
ధరణికి దగువే తట్టించెనని
మక తిక తిక మే ఏకం సమయ
చకచక తకధిమ్ చేసే వినయ
లకలక వినయం వల్లే ప్రణయ
సకలము కధ ఏ నేనే ప్రతిభ
వకటవ వరుసేచెప్పే ను కధ
సకటమువలె సాగేలే వ్యధలు
నకశిఖ పలుకే చేర్చే ను కధ
ఎకరముపొలమే దున్నేను మది
***
94. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।
శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥
445. ‘శాంతిః'- 1
శాంతము కలిగించునది శ్రీమాత అని అర్థము. శమమే గమ్యముగా కలది శాంతి. 'శం' అనగా శమము. శమము గమ్యముగా నుండుట ఒక సిద్ధి. సంకల్పమున, కార్యమున, కర్మమున శాంతముండుట అద్భుతమగు సిద్ధి. తొట్రుపాటు యున్నచోట శాంత ముండదు. శాంత మనస్కులకు సంకల్పములు కూడ శాంతి కలిగించునవే కలుగును. వాని నిర్వహణమున కూడ శాంతి యుండును. ఫలముల యందు కూడ శాంతియే వికసించును. ఇట్లు సమస్తము శాంతిమయముగ నుండుట అసామాన్యము. తుష్టి, పుష్టి, మతి, ధృతి కలవారికి మాత్రమే యిట్టి శాంతి లభ్యము కాగలదు. కోరిక యున్నచోట శాంతి లేదు. కర్తవ్యమున ప్రియము కలవారు, కర్తవ్యోన్ముఖులై మాత్రమే జీవించినచో వారిని శాంతి వరించును. నిష్కామ కర్మము, యజ్ఞార్థ జీవనము, దానము, తపస్సు ఇత్యాది విషయముల యందు నిమగ్నులై యున్నవారికి శాంతి లభించును.
సశేషం...
కాల మాయ (1 )
*. మనస్సు ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండు - ఈ అతుక్కొని ఉండటాన్ని వదిలివేయటం . ప్రతి రోజు కొత్తది, ప్రతి క్షణం కొత్తదే. ప్రతి క్షణానికీ మనం వేరే ప్రపంచంలో తిరుగుతాము, మరియు పై ఏదీ పట్టుకోకుండా సిద్ధంగా ఉండాలి.
బుద్ధుడు తన శిష్యులకు మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండకూడదని చెప్పేవాడు, ఎందుకంటే నాల్గవ రోజుకి ఇంట్లో ఉన్న అనుభూతి ప్రారంభ మవుతుంది. ఇంతలూఉన్నట్లు భావించే ముందు, ఒకరు ముందుకు సాగాలి. మనస్సు ఎప్పుడూ అంటి పెట్టుకుని ఉంటుంది - మరియు ఈ అతుక్కొని ఉండటాన్ని వదిలివేయడ0 మంచిది. ప్రతి రోజు కొత్తది, ప్రతి క్షణం కొత్తది, మరియు ప్రతి క్షణా నికీ మనం వేరే ప్రపంచంలోకి వెళతాము మరియు ఏదీ పట్టుకోకుండా సిద్ధంగా ఉండాలి. గతం అలవోకగా అదృశ్యం కావాలి; మీరు గతానికి నిరంతరం మరణించాలి.
కాబట్టి సమయాన్ని వృథా చేయకండి. పోయిన దానికి మరణించండి; అది ఇక లేదు. లేకపోతే, మీరు ఇప్పుడు లేనిదానిని అంటి పెట్టుకుని ఉంటే, కొత్తది వచ్చినప్పుడు కూడా మీరు పాతదానిని పట్టుకుని ఉంటారు. ఇలా మనసు కోల్పోతూ ఉంటుంది. వర్తమానానికి విస్వాసంగా ఉండండి. ఈ క్షణానికి కట్టుబడి ఉండండి - మరే ఇతర నిబద్ధత లేదు. ఒక్క నిబద్ధత సరిపోతుంది: ఈ క్షణానికి, ఇప్పుడు ఇక్కడ. సంతృప్తే సమంజసం, వ్యర్ధ కాలక్షేపం అనవసరం, వర్తమానం నిబద్దత, సత్ప్రవర్తన, నిష్ఠ గరిష్ఠగా యుంటే చాలు .
కొనసాగుతుంది...
ఓం లోకస్వామినే నమః | ॐ लोकस्वामिने नमः | OM Lokasvāmine namaḥ
చతుర్దశానాం లోకానామీశ్వరత్వాజ్జనార్దనః ।
లోకస్వామీత్యుచ్యతే స పురాణైర్విద్వదుత్తమైః ॥
చతుర్దశ లోకాలకును ఈశ్వరుడగు జనార్దనుడు లోకాలకు స్వామి కనుక లోకస్వామీ అని చెప్పబడును.
:: పోతన భాగవతము ద్వితీయ స్కంధము ::
వ. వినుము. చతుర్దశలోకంబులందు మీఁది యేడు లోకంబులు శ్రీమహావిష్ణువునకుం గటిప్రదేశంబున నుండి యూర్ద్వదేహ మనియును, గ్రింది యేడు లోకంబులు జఘనంబునుండి యధోదేహ మనియునుం బలుకుదురు. ప్రపంచ శరీరుండగు భగవంతుని ముఖంబువలన బ్రహ్మకులంబును, బాహువులవలన క్షత్రియకులంబును, నూరువుల వలన వైశ్యకులంబును, బాదంబులవలన శూద్రకులంబును జనియించెనని చెప్పుదురు; భూలోకంబు గటి ప్రదేశంబు, భువర్లోకంబు నాభి, సువర్లోకంబు హృదయంబు, మహర్లోకంబు వక్షంబు, జనలోకంబు గ్రీవంబు, తపోలోకంబు స్తనద్వయంబు, సనాతనంబును బ్రహ్మనివాసంబును నైన సత్యలోకంబు శిరము, జఘన ప్రదేశంబతలంబు, తొడలు వితలంబు, జానువులు సుతలంబు, జంఘలు తలాతలంబు, గుల్ఫంబులు మహీతలంబు, పదాగ్రంబులు రసాతలంబు, పాదతలంబు పాతాళంబు నని (లోకమయుంగా) భావింతురు... (89)
ఈ పదునాలుగు లోకాలలోనూ పై యేడు లోకాలును శ్రీ మహావిష్ణువునకు నడుమునుండి పై శరీరము. క్రింది యేడు లోకములును నడుము నుండి క్రింది శరీరము. ప్రపంచమే భగవంతుని శరీరము. ఆయన ముఖమునుండి బ్రహ్మ కులము, బాహువులనుండి క్షత్రియ కులము, తొడల నుండి వైశ్యకులము, పాదముల నుండి శూద్ర కులము పుట్టినవని వర్ణించెదరు.
ఆ మహా విష్ణువునకు కటి స్థలము భూలోకము (1), నాభి భువర్లోకము (2), హృదయము సువర్లోకము (3), వక్షము మహర్లోకము (4), కంఠము జనలోకము (5), స్తనములు తపోలోకము (6), శిరస్సు సనాతనమైన బ్రహ్మ నివసించెడి సత్య లోకము (7), జఘనము అతలము (8), తొడలు వితలము (9), మోకాళ్ళు సుతలము (10), పిక్కలు తలాతలము (11), చీలమండలము మహాతలము (12), కాలి మునివేళ్ళు రసాతలము (13), అరికాలు పాతాళము (14). ఈ కారణముగా ఆయనను లోకమయుడు అని భావించెదరు.
సశేషం...
నేటి హస్త్యం
అమ్మ అనసూయ గారు! మరోసారి ఆలోచించండి.
మీకు వ్రుద్దాప్యము,అనారోగ్యము,ఆర్దిక సమస్యలు.
మీ ఆయన చాలా మంచివారు.
ఈ పరిస్తితులలో విడాకులు సమంజసం కాదని నా అభిప్రాయము.
లాయర్ గారూ! నిజంగా మా ఆయన దేముడేనండీ!
ఆయన లేనిదే నా రోజు గడవదు.
నా అంతట నేనేమీ చేసుకోలేని నిస్సహాయురాల్ని. ఆయనంటే నాకు గౌరవం, ప్రేమ, అభిమానం, జాలి
?
ఆయనలోని అపరిచితుడు నా మనసును
తీవ్రాతి తీవ్రంగా గాయ పరుస్తున్నాడు.
ఎప్పుడు మేల్కుంటాడో తెలీదు.
నా యుక్తవయసు నుండి నా విషయాలు
చిలువలు పలువలుగా తెలుసుకుని, అనేక కట్టు కధలు వండి వార్చుకుని,
అభూత కల్పనల కన్నా గోప్ప పాత్రలు స్రుష్టించుకుని నాకు సంబందం లేని పాత్రలకు నాతో ముడి పెట్టి ప్రశ్నల పరంపరలతో నా మనసును
కకలా వికలం చేస్తున్నారు
ఆ ఓక్క క్షణం నెమ్మదిగా మట్లాడితే?
అవును.
నెమ్మదిగా మాట్లాడితే
ఇంత అవమానకర విషయాన్ని సహించేవంటే నువ్వు తప్పు చేసేవనీ, గట్టిగా మాట్లాడితే చింత చచ్చినా పులుపు చావలేదని నిలదీస్తారు!!!
నిరుద్యోగి ప్రయాణం -చిన్న కధ
written M. Ramakrishna
బాబు మనవృత్తి విద్యపై బ్రతుకు సాగించటం చాలా కష్టముగా ఉన్నది, నేను ఇప్పటి దాకా నిన్ను నీ చెల్లిని చదివించ గలగాను, చదువుకు తగ్గ ఉద్యోగము సంపాదించుకొని రాగలవని నిన్ను ఆశీర్వదించి పంపిస్తున్నాను అని చెప్పాడు తండ్రి, నీకు ఎటువంట పైకము కూడా సర్ద లేను అంటూ నీ మెడలో ఈ ఆంజనేయ లాకెట్ ఎర్రతాడులో వేసి ఇస్తున్నాను, ఇదే నీకు రక్షణగా ఉంటుంది అని చెప్పి నీకు కావలసిన బట్టలు తీసుకోని ఇక బయటకు నడువు అన్నాడు మాధవ రాప్, అప్పుడే లోపలనుంచి భార్య భారతి వస్తు ఏంచేస్తున్నారు మీరు చేతి కందిన కొడుకుని బతకమని పంపిస్తున్నారు అన్నది, నాకు ఇంకా ఓపిక ఉన్నది మనబాబు అసమర్ధుడుగా ఇక్కడ ఉండుట కన్నా సమర్థుడుగా 2 సంవత్సరాళ్లలో తిరిగి రాగలడు, ముందు వాడ్ని దీవించి విజయుడుగా తిరిగి రమ్మనమని చెప్పు అన్నాడు. భర్త మాట ఎదురు చెప్పక అమ్మవారి కుంకుమ పొట్లమ్ ఇచ్చి రోజూ పెట్టుకో అని దీవించి పంపింది మాధవ్ ని.
తల్లి తండ్రులకు నమస్కరించి చిన్న బ్యాగు చంకను పెట్టుకొని బయట ప్రపంచం లోకి అడుగు పెట్టాడు మాధవ్. నడిరోడ్డుమీద నడుస్తూ బయలు దేరాడు, అప్పుడే వెనుక బస్సు వేగముగా ప్రక్కనుండి పోవటం రోడ్డుకు ప్రక్కన ఉన్న చెట్టుకు గుద్దుకోవటం జరిగింది . అప్పటికప్పుడు మాధవ్ 108 కు 100 కు ఫోన్ చేసాడు. చేతనయినంత వరకు కొందరిని రక్షించ గలిగాడు.
ఒక్క సారిగా బస్సులోని వారందరు కేకలు పెట్టారు, మాధవ్ అక్కడే ఉన్న ఒక ఎద్దులబండి నెట్టుకుంటూ వెనక అద్దాలను పగలకొట్టాడు, కొందరిని దించగలిగాడు మరికొందరకి గాయాలు జరిగాయి . దీనికి కారణం అతివేగం, నిద్రతో నడపటం అన్నారు
అప్పుడే పోలీసువారు, ఫైరింజన్, రక్షకదళం, ప్రక్క ఊరి జనం రావటం అందరిని సురక్షణ దిశగా మార్చటం జరిగింది.
మాధవ్ నడక సాగించాడు ఒక పార్క్ వద్దకు చేరాడు అక్కడ పిల్లలు ఆడుకుంటునారు ఒక బాబు పరుగెడుతూ క్రిందపడ్డాడు, కాలికి బాగా దెబ్బ తగిలింది రక్తం కారుతున్నది, అందరు భయముతో చూస్తున్నారు అప్పుడే మాధవ్ అక్కడ ఉన్న ఒక చెట్టు ఆకు రసం తీసి పిండి తనచోక్కా చింపి కట్టు కట్టాడు, కాస్త కాళ్ళు విదిలించి ప్రక్కన ఉన్న బల్లపై కూర్చో పెట్టాడు, అప్పుడే పిల్లవాడి తల్లి వచ్చి వీడికి ఎన్ని సార్లు చెప్పినా బుద్ధి రాదు పెద్దవాళ్ళతో ఆడ కూడదంటే వినడు అంటూ గుంజుకుంటూ వెళ్ళింది. అందరూ ఎవరి దారి వారు వెళ్లిపోయారు. మాధవ్ నడక ప్రారంభించాడు.
చెత్త తీసుకెళ్తూ రిక్షా ఆగింది బాబు ఈ లైన్ చివరిదాకా నాకు సహాయ పడతావా నీ ఋణం ఉంచుకొనులే అని జేబులో నోటు తీసి ఇవ్వబోయాడు, మీదగ్గరే ఉంచండి పెద్ద వారులాగున్నారు మీకెందుకు ఇంత కష్టము అన్నాడు మాధవ్, నాకు కొడుకు ఉన్నాడు వాడు చేయడు నన్ను చేయనీయడు మాట్లాడితే చదువుకు తగ్గ ఉద్యోగము లేదు అంటూ దేశాన్ని తిట్టి పోస్తూ కుర్రోళ్లతో తిరుగుతాడు. రిక్షాను ఒకవైపు తోస్తూ ప్రతి ఇంటి గుమ్మంవద్దకు పోయి వారు తెచ్చే చెత్త కవర్లు రిక్షాలో ఉంచటం చేసాడు. బాబు ఇదిగో ఈ పైసలు తీసుకో అన్నాడు, చూడండి నీకొడుకే చేసాడని అనుకోండి నాదారిన నేను వెళ్తాను, మంచిది బాబు నీ సహాయమే నిన్ను మంచి మార్గాన నిలబెడుతుంది అని దీవించాడు
అప్పుడే వెనుక ఒక ఇసక లారీ వచ్చి ఆగింది పనికెళదాం నీవు కూడా వస్తావా అని అడిగారు, మీరు వెంటనే ఆ లారి మీదనుంచి దిగండి, ఇలా ప్రయాణం చేయటం మంచిది కాదు అని హెచ్చరించాడు మాధవ్, వస్తే "రా " లేకపోతే లేదు మాకు నీతులు చెప్పవద్దు అంటూ వెళ్లారు.
నడవలేక అక్కడ ఉన్న చెట్టు దగ్గర ఆగాడు మాధవ్, ఒకవయసు మళ్ళిన వాడు అక్కడకు వచ్చి ఆగాడు మాధవ్ అతన్ని మీరు ఇంత ఎండలో పనిచేయటం అవసరమా బాబు నీవు చిన్నవాడివి రెక్కలు వచ్చిన పక్షులు గూటిలో ఉండవు గుటిలో ఉండేది చిలక గోరింకలే అన్నాడు
అసలు మీరేం చేస్తారు అని అడిగాడు మాధవ్.
అదిగో ఆ కనబడుతున్న హోటల్ ల్లో ఫలహారాలు భోజనం రడీగా ఉన్నది అనే బోర్డు పట్టుకొని 12 గంటలనుండి 3 గంటలదాకా నుంచుంటే నాకు నాభార్యకు సరిపడే ఆహారము ఇస్తాడు అది చాలు మాకు బాబు అన్నాడు.
ఈరోజు నీపని నేను చేస్తాను మీరు ఈచెట్టుదగ్గర కూర్చోండి అని చెప్పి బోర్డు పట్టుకొని ఎండలో నుంచొని అహార పోట్లామ్ తెచ్చి ఇచ్చాడు.
బాబు నేను దీవెనలు తప్ప ఏమీ ఇవ్వలేను అవి చాలు మిమ్మల్ని దింపి నేను వెళతాను, నేనువెళతాను బాబు ఈప్రక్కనే గుడిసె అన్నాడు. పట్టుబట్టి గుడిసేదాకా దించి అక్కడ కాసిని మంచినీళ్లు త్రాగి బయలు దేరాడు.
నడుస్తూ పోతున్నప్పుడు ఒక్కసారిగా శబ్ధం విన్నాడు, వెనక్కి తిరిగి చూస్తే చిన్నలారీ ఫుట్ పాత్ ను కొట్టడం లారీ ముందు టైర్ బరష్టవ్వటం జరిగింది.
అసలు ఏమైనదో కనుక్కుందామని లారిదగ్గరకు వెళ్ళాను. లారీలో కొబ్బరి బోండాలు ఉన్నాయి. లారీ డ్రైవర్ ఒక్కడే ఉండటం వళ్ళ టైర్ మారుస్తున్నప్పుడు కష్టపడుతుంటే మాధవ్ కూడా సహాయం చేసి కొత్త టైరును ఎక్కించాడు. డ్రైవర్ సంతోషముతో ఈ ఐదు వందరూపాలు తీసుకో అని నా చేతిలోపెట్టాడు.
చూడండి నేను డబ్బు ఆశించి నీకు సహాయము చేయలేదు మానవతా దృక్పధంతో సహాయపడినాను అన్నాడు, అమాయకుడిలాఉన్నావు నీవు ఈ కలికాలంలో బ్రతకటం కష్టం.
నీ కష్టాన్ని నేనూ ఉంచుకోలేను అన్నాడు. నేను ఒక పని చేస్తా దానికి నీవు సమ్మతమై ఒప్పుకోవాలి అన్నాడు డ్రైవర్ .సరేచేప్పు అన్నాడు మాధవ్ . లారీ ఎక్కు చెపుతా అన్నాడు ఎక్కాడు మాధవ్ కదులుతున్నది లారీ, డ్రైవర్ నెమ్మదిగా చెబుతున్నాడు.
నేను ఈ కొబ్బరి బొండాలు ఇక్కడ జరిగే సంతలో కొన్ని ఒక వ్యాపారికి కాయ 5 రూపాయాలకు ఇచ్చి మిగతావి పక్కసంతలో వానికి ఇవ్వాలి. ఇంకా మిగులు తాయా అని అడిగాడు మాధవ్ . ఎందుకు మిగలవ్ 100కు పైగా ఉంటాయి అవి కూడా వాల్లకే ఇస్తాను డబ్బులు తీసుకుంటాను. మీ వోనరుకు చెబుతావా అని అడిగాడు.
మా ఓనరు కు చెబితే ఊరుకుంటాడా ఊరుకోడు అవి నేను త్రాగుడికి వాడుకుంటా అన్నాడు.
వెంటనే నీవు లారీ ఆపు నీవు తప్పు చేస్తున్నావు, నీకు ఇచ్చే రోజువారీ బేటా తీసుకోక, ఈ అక్రమ సంపాదన ఎందుకు దానివళ్ళ ఆరోగ్యం పాడు చేసుకోవటం ఎందుకు అన్నాడు.
ఒక్కసారిగా బ్రేక్ వేసాడు మాధవ్ మాటలకు
ఇంతవరకూ ఇలా చెప్పినవారు లేరు మొదటిసారిగా వింటున్నాను. ఈ రోజు నుంచి నేను న్యాయంగా బ్రతుకుతాను
నేను చెప్పిన పని చేస్తానంటే
ఇక్కడ సంతలో ఒక చెట్టు క్రింద 100 కొబ్బరి బొండాలు దింపుతాను, నీకు ఒక కత్తి కూడా ఇస్తాను, నీవు బ్రతకటాని మార్గాలు వెతుకుంటూ ఉన్నావు కాయ 3 రూపాయలకే ఇస్తా నీ ఇష్టమొచ్చిన రేటుకు అమ్ముకో అన్నాడు.
చూడు నీవు ధర్మం తప్పకూడదు, జాలి పడి తప్పు చేయ కూడదు నాదగ్గరకూడా 5 రూపాయలే తీసుకో కానీ ఇప్పుడు ఇవ్వలేను తిరిగి వచ్చేటప్పటికల్లా కాయలు అమ్మి నీ కత్తి ఇస్తా, అందుకు ఒప్పు కుంటేనే నేను తీసుకుంటా అన్నాడు మాధవ్ .
సంతలో చుట్టు దగ్గర ఆపడం జరిగింది. నేను కేవలం 3 గంటల్లో తిరిగివస్తా నాకు 500 ఇవ్వగలవా. ఇవ్వగలను, నేను మాట తప్పను. సరే అలా టీ తాగుదాం వస్తావా అని అడిగాడు డ్రైవర్.
నాకు అలవాటు లేదు నేను త్రాగాను అన్నాడు, ఈ లోకంలో ఎలా బ్రతుతాడో అమాయకుడిలా ఉన్నాడు నేను టీ త్రాగి వచ్చి వెళ్తాను అని చెప్పి హోటల్కు వెళ్ళాడు డ్రైవర్ .
అక్కడ కాగితపు అట్ట మీద బోండా 10 రూపాయలు మాత్రమే, 5 తీసుకున్నవారికి 40 రూపాయలు మాత్రమే అని వ్రాసాడు. అక్కడ ఉన్న ఒక వ్యాపారి మేము 20 రూపాయలకు అమ్ముతుంటే నీవు తక్కువకు అమ్మటం మంచిదికాదు గట్టిగా అన్నాడు.
నేను మీలాగా బ్రతుకు తెరువుకోసం వచ్చాను మొత్తం కాయలు మీరే తీసుకోని మీ ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకోండి అన్నాడు మాధవ్ .
ఇవిగో ఈ 800రూపాయలు తీసుకో నీవు చెప్పిన లెక్కేగా అన్నాడు.
అవి తీసుకోని హోటల్ కు బయలు దేరాడు. డ్రైవరుకు 500 రూపాయలు ఇచ్చి మిగిలిన వానితో కొంత అల్పాహా రము తిని సంచీ తీసుకొని జై భజరంగ్ బలీ అంటూ అరిచాడు డ్రైవర్ కూడా వంత పలికాడు.
నీవు ఎక్కడికి పోతావ్ పక్క సంత పెద్దది అక్కడ దిగి నీతెలివితో ఏదైనా వ్యాపారం చేయ్ .
నా మొదటి సంపాదనకు సహకరించినందుకు నిన్ను నేను ఎప్పటికీ మరచి పోలేను.
డ్రైవర్ గారు నేను మా గురువు గారు వ్రాసిన పాట పాడితే నీకేమన్నా ఇబ్బందా
పాడు బాబు పాడు నాకేం ఇబ్బంది లేదు, ఈ రోజు నాకు చాలా సంతోషముగా ఉన్నది
ఓ మనసా నీవెక్కడా, ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
విద్యాదేవిగ వెల్గెడిదెవరు?
నాట్యానందము నొందెడిదెవరు?
ఓ మనసా నీవెక్కడా, ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
లేదన్నట్టిది పల్కనిదెవరు?
ప్రేమే రూపుగఁ దోచెడిదెవరు?
ఓ మనసా నీవెక్కడా ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
అంతా తానయి నిండెడిదెవరు ?
ఐశ్వర్యంబుగ నుండెడి దెవరు ?
చింతా శోకముఁ బాపెడిదెవరు ?
శ్రేయంబైనది యిచ్చెడిదెవరు?
ఓ మనసా నీవెక్కడా, ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
కాంతిన్ గుండెల నింపెడిదెవరు?
కంటిన్ రెప్పగఁ గాచెడిదెవరు?
చెంతన్ గూర్చొని పల్కెడిదెవరు?
స్నేహంబెప్పుడు పంచెడిదెవరు?
ఓ మనసా నీవెక్కడా ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
బోధన్ జేయుచుఁ దెల్పెడిదెవరు?
ముక్తన్ జేయఁగఁ దల్చెడిదెవరు?
నీ ధైర్యంబునుఁ బెంచెడిదెవరు?
నీ మార్గంబెదొ చూపెడిదెవరు?
ఓ మనసా నీవెక్కడా, ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
నీ దైన్యంబునుఁ గూల్చెడిదెవరు?
నీకై శక్తిని నిచ్చెడిదెవరు?
ఓ మనసా నీవెక్కడా ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
అదిగో హనుమంతుడు గుడికి వెళ్లి వద్దాం నేను వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు దేవుని దర్శనం చేసుకొని మరీ లారీ నడుపుతాను
ఇద్దరూ కలసి వెళ్లారు అక్కడ రాములవారు హనుమంతుని ఆలింగనం చేసుకున్న చిత్రం చూసారు, తన్మయత్వం తో మునిగి పోయాడు మాధవ్
దర్శనం చేసుకొని అక్కడ కూర్చున్నారు
చూడు బాబు నీవు చదువుకున్న వాడిలా ఉన్నావు నాకు చదువులేక బండగా తయారయ్యాను చదువొక్కటే కాదు కుటుంబం అంత సక్రమ మార్గంలో ఉండాలి నమ్మకం మీద బ్రతకాలి అన్నాడు మాధవ్ .
రామాయణంలో రాములవారు హనుమంతుని నమ్మి ఉంగరం ఇచ్చారు, సముద్రము దాటి లంకలో ఉన్న సీతను దర్శించి ఆమెఇచ్చిన చూడామణి తెచ్చి చూపాడు అప్పుడు రాములవారు సర్వశ్రేష్ఠం సర్వోత్తమం సర్వోన్నతం అనదగిన ఒకానొక అపురూపమైన ఆలింగనం సౌభాగ్యాన్ని హనుమకు ఇచ్చడు.
ఆలింగనమే మనసులను కలిపేది డ్రైవర్ అంటూ ఒక్కసారి మాధవుని హత్తుకొని నీకు ఏ సహాయము కావాలన్న ఈ హనుమన్న ఉన్నాడని మరచి పోకు అంటూ లారీ ఎక్కాడు,
చంకను బ్యాగ్ పెట్టుకొని నడక ప్రారంభించాడు మాధవ్.
--((*))--
శ్రీరమణీయం -
"అనుభవం కావాలనే కోరిక పుట్టాలంటారు, ఆ కోరిక కూడా పోతేనే అనుభవం కలుగుతుందంటారు ఇదేమి పరిస్థితి !?"
శివదర్శనం కోసం అన్నింటినీ వదిలి, చివరికి శివదర్శనం కావాలన్న కోరిక కూడా వదిలితేనే అప్పుడు మనకు శివదర్శనం అవుతుంది. అర్ధనారీశ్వరిగా సదా శివుడితో ఉన్న ఉమామహేశ్వరికి శివుడ్ని చూడాలన్న కోరిక కలిగి తపస్సు చేసింది. ఒక తేజస్సు కనిపించింది. అది నా దృష్టి మేరలోనిదే కదా ! అనుకొని తపస్సు కొనసాగించి చివరికి తన స్థితియే శివుడని తెలుసుకుంది. నువ్వు చూడటమే కాదు, నువ్వు ఉండటం కూడా శివసాన్నిధ్యమే. మనం గుణ రహితులం కావాలంటే అసలు మనను ఆక్రమించుకున్న గుణాలేమిటో తెలియాలి. గుణాలు ఎలా తెలుస్తాయంటే మన ప్రవర్తన ద్వారానే. ఒక చంటి పిల్లవాడిని దుకాణానికి తీసుకెళితే వాడికి ఇష్టమైన వస్తువు వైపు చేయి లేస్తుంది. ఆ కదలికే అతడి గుణాన్ని తెలియజేస్తుంది. మరో కొలమానం అవసరం లేదు. మనం కూడా దుకాణానికి వెళ్ళి వంద డిజైన్లు చూసి నచ్చటం లేదంటే మనకి ఇష్టమైనదేదో మరో డిజైన్ ఉందనే అర్ధం. మనకు నచ్చటం మొదలైందంటేనే కోరిక మొదలైందని అర్ధం. ఒక వస్తువు గుణం ఏమిటంటే అది మనకు కావాలనిపించటమే. ఆ గుణమే మనని మననిగా ఉండనివ్వటం లేదు. ఇదంతా మనను గమనించుకుంటే అర్ధమవుతుంది. దీన్నే శ్రీరమణమహర్షి విచారణమార్గం అని చెప్పారు !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం }"
"గుణంలేకుండా చూస్తే సర్వమూ శివమయం !''
......
-ఆత్మహోమము
కనిపించేవాటి అస్తిత్వం ఎంత ?
మన కళ్ళముందు టీవిలో అనేక దృశ్యాలు కనిపిస్తుంటాయి. వాటి అస్తిత్వం ఎంత ? కాంతి-శబ్దాలే ప్రపంచం. కాంతి అంటే కళ్ళకు బయటకనిపించే కాంతికాదు. శబ్దం అంటే మన చెవులకు వినిపించే శబ్దంకాదు. కళ్ళుమూసుకున్నప్పుడు కూడా కనిపించే దృశ్యాలు, వచ్చే కలలు ఏ కాంతితో వస్తున్నాయో, చెవులతో పనిలేకుండా ఎదుటివారి సైగల్లో ఏ శబ్దం లేకుండా మీకు అర్థమయ్యేలా చేసే భాష ఏదైతే ఉందో అదే నిజమైన శబ్దం, కాంతి. రక్తపోటు అధికంగా ఉన్నవారికి లేనివస్తువులు ఉన్నట్లుగా కనిపిస్తుంటాయి. అలాగే మనసనే కాంతి తరంగం, సృష్టిలోని కాంతి తరంగం రియాక్ట్ అవడంవల్లనే మనకీ ప్రపంచం కనిపిస్తుంది. తరంగదైర్ఘ్యంలో తేడా వల్ల సృష్టిలో విభిన్నమైన శబ్దాలు వినిపిస్తున్నాయి !
........
Comments
Post a Comment