ప్రాంజలి ప్రభ..11/04
🌹. శ్రీ రుద్ర పంచముఖ ధ్యాన శ్లోకాలు - తాత్పర్యము 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
రుద్రాభిషేకంలో పంచముఖ ధ్యానంలోని శ్లోకాలు న్యాసంలో ప్రస్తావించబడ్డాయి. తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశానముఖ రూపాలలో ఉండే పరమేశ్వరునిశ్రీ రుద్ర ఐదు ధ్యాన శ్లోకాల రూపంలో బోధాయనులు రచించారు.
ఈ మహాన్యాస వివేచనము రావణ ప్రోక్త న్యాస ప్రక్రియలోనిది. దీనినే శివ పంచానన స్తోత్రం అని కూడా అంటారు.
🌻. తత్పురుష ముఖ ధ్యానమ్ 🌻
సంవర్తాగ్ని తటిప్రదీప్త కనక - ప్రస్పర్ధితేజోరుణం
గంభీర ధ్వని సామవేద జనకం - తామ్రాధరం సుందరం
అర్ధేందుద్యుతిలోలపింగళజటా - భారప్రబద్ధోరగం
వందే సిద్ధ సురాసురేంద్రనమితం - పూర్వం ముఖం శూలినః
🌻. తాత్పర్యము:
ప్రళయ కాలము నందలి అగ్ని తేజము తోనూ, మెరపుల తేజముతోను, బాగా కరిగిన బంగారు కాంతితోను పోటీ పదే తేజములే తన రూపముగా కలది, గంభీరధ్వనితో మిశ్రితము అగుతతో పాటు భయంకరమైన అగ్ని వలె ప్రకాశించు ఎర్రని పెదవి కలదియు, చంద్ర ఖండ కాంతితో చక చక మెరయు పింగళ వర్ణపు జడల గుంపును, దాని చుట్టూ గట్టిగా చుట్టిన సర్పములు కలదియు, సిద్ధులు, సురాసురుల చేత నమస్కరించబడుతున్న, శూలికి సంబంధించిన తూర్పున ఉన్న ముఖమును నమస్కరించుచున్నాను. (రజో గుణ ప్రధానమైన సృష్టి తత్వమును ఈ శ్లోకములో స్తుతి చేయబడినది)
🌻. అఘోర ముఖ ధ్యానమ్ 🌻
కాలాభ్రభ్రమరాంజనద్యుతినిభం - వ్యావృత్తపింగేక్షణం
కర్ణోద్భాసితభోగిమస్తకమణి - ప్రోద్భిన్న దంష్ట్రాంకురం
సర్పప్రోత కపాలశుక్తి శకల - వ్యాకీర్ణతాశేఖరం
వందే దక్షిణమీశ్వరస్య వదనం - చాతర్వనాదోదయం
🌻. తాత్పర్యము:
నల్లని మేఘములు, తుమ్మెదల కాటుక - వీటి కాంతిని పోలిన కాంతితో ప్రకాశించునదియు, మిక్కిలి మిట్టగా తిరుగుచుండు పింగా వర్ణపు కన్నులు కలదియు, చెవుల యందు మిక్కిలి ప్రకాశించుచుండు సర్ప శిరోరత్నములతో బాగా కలిసిపోవుచున్న కోరల మొలకలు కలదియు, సర్పములతో పాటు (హారముగా) కూర్చబడిన కపాలములతో, ముత్యపు చిప్పల ముక్కలతోను, ఎగుడు దిగుదగుచున్న నడకను పొందినదియు, వంకరలుగా నున్న కను బొమ్మల ముడులతో భయంకరముగా నున్న ఈశ్వరుని దక్షిణ ముఖమును నమస్కరించు చున్నాను. (తమో గుణ ప్రధాన లయ కర్త తత్వము ఇక్కడ స్తుతి చేయబడింది)
🌻. సద్యోజాత ముఖ ధ్యానమ్ 🌻
ప్రాలేయాచల మిందుకుంద ధవళం - గోక్షీరఫేన ప్రభం
భస్మాభ్యంగమనంగ దేహదహన - జ్వాలావళీలోచనం
విష్ణు బ్రహ్మ మరుద్గణార్చిత పదం - ఋగ్వేద నాదోదయం
వందేహం సకలం కళంకరహితం - స్థాణోర్ముఖం పశ్చిమం
🌻. తాత్పర్యము:
హిమవత్పర్వతము, చంద్రుడు, మొల్ల పూవు - వీని వలె తెల్లనిదియు, ఆవుపాల మీద నురుగు వలె తెల్లని కాంతి కలదియు, విభూతి పూయబదినదియు, మన్మథుని శరీరమును దహించు జ్వాలల పంక్తితో నిండిన కన్ను కలదియు, స్తోత్రము చేయుచున్న బ్రహ్మేన్ద్రాది దేవ సమూహముల చేతను, యోగుల చేతను శ్రద్ధతో అర్చించ బడుచున్నదియు, నిర్మలమైన నిండు వాదనముతో కనబడుచున్నదియును అగు శివుని పశ్చిమ నమస్కరించు చున్నాను. (సత్వ గుణ ప్రధాన రక్షణ కర్త తత్వమును ఈ శ్లోకములో స్తుతించ బడినది)
🌻. వామదేవ ముఖ ధ్యానమ్ 🌻
గౌరం కుంకుమ పంకితం సుతిలకం - వ్యాపాండు మండ స్థలం
భృవిక్షేప కటాక్ష వీక్షణలసత్ - సంసక్త కర్ణోత్పలం
స్నిగ్ధం బింబ ఫలాధరం ప్రహసితం - నీలాల కాలం కృతం
వందే యాజుష వేద ఘోష జనకం - వక్త్రం హరస్యోత్తరం
🌻. తాత్పర్యము:
గౌర (ఎరుపుతో కలిపిన తెలుపు) వర్ణము కలదియు, కుంకుమ పూ పూతతో నిన్దినదియు, అందమగు తిలకము కలదియు, విశేషముగా తెల్లదనము కళ చెక్కిళ్ళు కలదియు, కనుబొమ్మల కదలికతో ఒప్పుచుండు కడగంటి చూపుతో ప్రకాశించుటతో పాటు, చెవికి అలంకారముగా నున్న తెల్ల కలువ పూవు కలదియు, నున్నని దొండపండు పోలు ఎర్రని క్రింద పెదవిపై స్పష్టమగు నవ్వు కలదియు, నల్లని మున్గుతులచే అలంకరించబడిన, నిండు చంద్రుని మండలమును పోలుచు ప్రకాశించునదియు అగు శివుని ఉత్తరాముఖమును నమస్కరించు చున్నాను. (గుణ త్రయ మిశ్రమమగు ఈశ్వర తత్త్వము ఇక్కడ స్తుతించ బడినది)
🌻. ఈశాన ముఖ ధ్యానమ్ 🌻
వ్యక్తావ్యక్త నిరిపితించ పరమం - శస్త్రింశతత్వాధికం
తస్మాదుత్తర తత్త్వమక్షరమితి - ధ్యేయం సదా యోగిభిః
ఓంకారాది సమస్త మంత్ర జనకం - సూక్ష్మాతి సూక్ష్మంపరం వందే పంచమమీశ్వరస్య వదనం - ఖవ్యాపి తేజోమయం
🌻. తాత్పర్యము:
వ్యక్తము, అవ్యక్తము (స్పష్ట రూపము కలది, స్పష్ట రూపము లేనిది) అణు రెండు రెండు లక్షణముల కంటెను ఇతరమగు లక్షణము కలదియు, ముప్ఫై ఆరు తత్వముల రూపమున పరిణమించు నదియు, సకల తత్వముల కంటెను ఉన్నతమైనదియు అగు అనుత్తరము అను అక్షర (అకార) తత్వమును ఎల్లప్పుడును యోగులచే ధ్యానించబడ దగినదియు, తమో గుణ రహితంను, మూడు కన్నులు కలదియు, సూక్ష్మాతిసూక్ష్మమగు దాని కంటే గోప్పదియు, శాస్తమును, ఆకాశము నందంటను వ్యాపించు తేజమే తన రూపముగా కలదియు అగు ఈశ్వరుని ముఖమును నమస్కరింతును (గుణాతీత బ్రహ్మ తత్వమును ఇక్కడ స్తుతించబడినది)
🌹 🌹 🌹 🌹 🌹
🔱శ్రీపరమేశ్వర స్తోత్రమ్🔱
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
1)జగదీశ సుధీశ భవేశ విభో పరమేశ పరాత్పర పూత పితః !
ప్రణతం పతితం హతబుద్ధిబలం జనతారణ తారయ తాపితకమ్ !!
2)గుణహీనసుదీనమలీనమతిం త్వయి పాతరి దాతరి చాపరతిమ్ !
తమసా రజసా వృతవృత్తిమిమం జనతారణ తారయ తాపితకమ్ !!
3)మమ జీవన మీనమిమం పతితం మరుఘోరభువీహ సువీహమహో !
కరుణాబ్ధిచలోమిర్జలానయనం జనతారణ తారయ తాపితకమ్ !!
4)భవవారణ కారణ కర్మతతౌ భవసిన్ధుజలే శివ మగ్నమతః !
కరుణాఞ్చ సమర్ప్య తరిం త్వరితం జనతారణ తారయ తాపితకమ్ !!
5)అతినాశ్య జనుర్మమ పుణ్యరుచే దురితౌఘభరైః పరిపూర్ణభువః !
సుజఘణ్యమగణ్య మపుణ్యరుచిం జనతారణ తారయ తాపితకమ్ !!
6)భవకారక నారకహారక హే భవతారక పాతకదారక హే !
హర శఙ్కర కిఙ్కరకర్మచయం జనతారణ తారయ తాపితకమ్ !!
7)తృషితఞ్చరమస్మి సుధాం హిత మే ఽచ్యుత చిన్మయ దేహి వదాన్యవర !
అతిమోహవశేన వినష్టకృతం జనతారణ తారయ తాపితకమ్ !!
8)ప్రణమామి నమామి నమామి భవం భవజన్మకృతిప్రణిషూదనకమ్ !
గుణహీనమనన్తమితం శరణం జనతారణ తారయ తాపితకమ్ !!
ఇతి పరమేశ్వరస్తోత్రం సమ్పూర్ణమ్ !!
*
*శ్వాస - చక్రాలు:-*
ఈ శ్వాస ప్రతిరోజు ఉదయము సరిగ్గా 6 గంటలకు మొదలై
➡️ మూలాధార చక్రము నందు - 600 సార్లు
➡️ స్వాధిష్ఠాన చక్రము నందు - 6000 సార్లు
➡️ మణిపూరక చక్రము నందు - 6000సార్లు
➡️ అనాహత చక్రము నందు - 6000 సార్లు
➡️ విశుద్ధి చక్రము నందు - 1000 సార్లు
➡️ ఆజ్ఞా చక్రము నందు - 1000 సార్లు
➡️ సహస్రారము నందు - 1000 సార్లు
అనగా, రోజుకు 21600 సార్లు పయనిస్తోంది.
*శ్వాస - సాధన:-*
సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చొని, మృదువుగా కళ్లుమూసుకుని, మన నాశికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన శ్వాస తిరిగి అదే నాశికా రంధ్రాల ద్వారా బయటకు వెళ్లడాన్ని గమనిస్తుండాలి. ఇలా చేయగా, చేయగా మనస్సు యొక్క పరుగు క్రమేపీ తగ్గి క్రమక్రమంగా ఆగిపోతుంది. అప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన విశ్వమయప్రాణశక్తి లభ్యమౌతుంది.
మరి ఇంతటి శక్తివంతమైన శ్వాసకు సంబంధించిన సాధన చేసుకునేందుకు మనము ఏ హిమాలయాలకు, ఏ అరణ్యాలకు వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటూ, ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉంటూ, మనం చేసే పనులు ఏవి మానుకోకుండానే, ఖాళీగా ఉన్న సమయంలో ఈ అద్భుత సాధన సులువుగా చేసుకోవచ్చు. దీనిని చిన్న పిల్లల (5 సం"ల) నుండి ముసలి వారి దాకా ఎవరైనా చేయవచ్చును.
84 లక్షల జన్మల తరువాత లభ్యమైన ఈ మానవ జీవితమును వృధా చేయకుండా, వివేకవంతులముగా ,భగవన్నామ స్మరణ చేసుకుంటూ, భగవంతుని పాద పద్మములను అశ్రయిద్దాము🙏
జీవన విధానం
🌹🌹🌹🌹
ఆయుర్విత్తం గృహ చ్ఛిద్రం మంత్రమౌషధ సంగమౌ
దానమానావమానశ్చ నవ గోప్యా మనీషిభిః:
ఆయువు,అంటే వయస్సు చెప్పకూడదు అని ఒక అర్థం. జ్యోతిష్యం ప్రకారం అయ్యుష్హు ఎంతో తెలిసినా చెప్పకూడదు. యింటిలోని కలతలు, బయటి వారికి చెప్పకూడదు. మీరు చేసిన దానము కూడా నేనింత చేశానని చెప్పుకోకూడదు.
మనకు జరిగిన అవమానమును కూడా ఎవరికీ చెప్పకూడదు. సంగమము గురించి కూడా చెప్పకూడదు.
మంత్రమును, ఔషధము ఎలాగ తయారు చేసినదీ కూడా గోప్యముగానే వుంచుకొన వలయును.
ఈ తొమ్మిదింటినీ గోప్యముగా వుంచవలయునని కవి యొక్క భావము.
....మరింత వివరంగా చూద్దాం....
ఆయువు
భగవంతుడు అన్ని జంతువులకు ఇచ్చినట్లు శరీరం ఇచ్చినప్పటికీ ‘వివేకము’ అనే గొప్ప గుణం మనిషికి ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు. రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు. ఈమూడు కారణాలవల్ల మనిషి పిచ్చెక్కకుండా సుఖంగా ఉండగలుగుతున్నాడు. మరుక్షణంలో మనిషి ఛస్తాడని తెలిస్తే ముందు క్షణమే ఆలోచనతో చావడం ఖాయం. నిజంగా నీ ఆయుఃప్రమాణం ఇదీ అని తెలిసినా, నిబ్బరంగా ఉండి, దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై వాడిని బాధిస్తుంది. కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుష్షుది ప్రధాన పాత్ర. అది తెలిసినా గోప్యంగా ఉంచమన్నాడు శాస్తక్రారుడు.
విత్తం - ధనం
ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. దానివల్లఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎంత ధనం ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ఉన్నపుడు మనకు నష్టం జరుగదు. ‘లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మ్రింగబోడు’ అన్నట్లు నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే. ‘అతి సంచయేచ్ఛ తగదు’ అన్న నీతి చంద్రిక వాక్యం ధనం విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం. అయినా మన దగ్గర ఉన్నవిషయం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం. ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం. అతడు నలుగురికీ అన్న. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. ధర్మకార్యాలకు ధనం వినియోగించకపోతే పన్నుల మూలకంగా రాజు (ప్రభుత్వం) దాన్ని స్వాధీనపరచుకోవడమో, అగ్ని ప్రమాదాలవల్ల నష్టమో, దొంగలు దోచుకోవడమో జరుగుతుంది.
గృహచ్చిద్రం - ఇంట్లోని గొడవలు
ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. దానే్న ‘ఇంటిగుట్టు’ అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమ పూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. వాటిలో రహస్యాలను బహిరంగం చేయాలనుకోవడం తెలివితక్కువ పని. సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం- ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు. అందుకే మన పెద్దలు అనేవారు ... *ఇంట్లో గొడవ ఉంటె ఇల్లెక్కి అరవొద్దు, కంట్లో నలుసు పడితే కన్నును పోడుచుకొవద్దు* అని .
మంత్రం
‘‘మననం చేసేది మంత్రం’’- మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చెయ్యడం మన సంప్రదాయం. మంత్ర వైశిష్ట్యం తెలిసినవారికి చెప్పడంవల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కాని అపాత్రునికి చెప్పడంవల్ల నష్టమని భావన. దానిమీద భక్తిలేని వాడికి చెబితే అది అభాసుపాలవుతుంది. మంత్రంపై అచంచల నమ్మకం ఉండాలి.
ఔషధం
ప్రపంచంలో ప్రతి మొక్క ఔషధమే. ఇవాళ భయంకర రసాయనాలు ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఇవి అందరికి బహిరంగ పరచి ఎవ్వరంటేవారు తయారుచేయకూడదు. ఔషధం రహస్యంగా ఉంచడం మంచిదే.
సంగమం - శృంగారం
సంగమం అంటే కలయిక. మనం కొన్ని రహస్యమైన భేటీలు జరుపుతాం. అవి అధికారిక, అనధికారమైనవి ఏవైనా కావచ్చు. రహస్యంగా ఉంచడం ఉత్తమం. అలాగే గొప్పవారు అనుకునే వారి జీవితాల్లో ఎన్నో రహస్యలున్న సమావేశాలు ఉంటుంటాయి. అవి బహిర్గతమైనపుడు వారి వ్యక్తిత్వాలపై మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే సంగమం రహస్యంగా ఉంచడం మంచిది.
దానం
దానం అన్నింటిలో చాలా గొప్పది. అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదు. మనం చేసిన దానం రహస్యంగా ఉంచితే వెంటనే ఫలం ఇస్తుంది. దానినే గుప్త దానం అంటారు.
మానం
అంటే శరీరం. శరీరాన్ని బహిర్గతం చేయకూడదు. ఒళ్ళును ఎప్పుడూ దాచుకోవాలి. రవి కాంచని చోటు కవి కాంచున్ అంటారు. అంటే శరీరం అవయవాలు సూర్యుడు కూడా చూడడు అంట. అంత గుప్తంగా ఒళ్ళును దాచుకోవాలి. నేడు విదేశ సంస్కృతికి అలవాటుపడి ఆహార్యంలో అనేక వింత ధోరణులు చోటుచేసుకున్నాయి. ఇది మంచిది కాదు.
అవమానం
తనకు జరిగిన అవమానం మరిచిపోవాలి. అవమానాలను అస్తమానం మననం చేస్తే క్రోధం పెరుగుతుంది. దాంతో పగ.. అలా అంతే ఉండదు. ప్రపంచంలో ఉన్న ముళ్ళను మొత్తం మనం తొలగించలేం కానీ మన చెప్పులు వేసుకొని వెళ్ళడం సులభం. ఈ తొమ్మిది రహస్యలను కాపాడుకోవడం విజ్ఞుల లక్షణం అని పెద్దలు చెప్పిన జ్ఞానబోధ.
సేకరణ..
ఎప్పుడూ నిజాన్నే మాట్లాడడం. ఇది ఒక వ్రతం లాంటిది. గొప్ప ధర్మం. శ్రేయస్కరం కూడా. కాని ఒక్కొక్కప్పుడు సత్యం కూడా కఠోరంగా ఉంటుంది.
అందుకే "నిజం నిప్పు లాంటిది" అంటారు. దాన్ని దాచలేము కూడా. నిజం చెపితే నిష్ఠూరం కూడా కలుగుతుంది. అవతలి వారి మనసు గాయపడవచ్చు. వారు బాధపడవచ్చు, అలాంటి సందర్భాలలో వారికది ప్రియభాషణం కాకపోవచ్చు.
అంచేత "సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం".
సత్యాన్నే పలకాలి. ప్రియంగా పలకాలి. అప్రియమైన సత్యాన్ని పలకకుండా ఉండడమే మంచిది. అంటే నిజం చెపితే ఎవరికైనా ఏదైనా కీడు జరుగుతుందనుకున్నప్పుడు ఆ నిజం చెప్పవలసిన అవసరం లేనప్పుడు చెప్పకుండా ఉండడమే మంచిది.
అలాగే ఒక అసత్యం చెపితే ఎవరికయినా ఏదయినా మేలు జరుగుతుందన్నప్పుడు అసత్యమాడినా పరవాలేదు. అదే ధర్మరాజు "అశ్వత్థామా హతః (కుంజరః)" అని ఆడిన అసత్యం.
అలాంటి సందర్భాలలో, సమయాలలో సత్యం చెప్పకపోవడమే కాకుండా అసత్యమాడినా దోషం అంటదనేది శుక్రనీతి. కాని అది ఎల్లవేళలా పనికి రాదు.
"స్మితవక్త్రో మితభాషీ, అపూర్వభాషీచ రాఘవః" అని శ్రీరామచంద్రుని అష్టోత్తర శతనామావళిలో కీర్తించడం జరిగింది.
అంటే శ్రీరామచంద్రుడు ఎల్లప్పుడూ చిరునవ్వుతో మాట్లాడేవాడునూ, మితంగా భాషించేవాడునూ, అపూర్వంగా అంటే ఇంతకు ముందు ఎన్నడూ ఎవరూ ఎరుగని విధంగా మహోన్నతంగా భాషించేవాడునూ అని కొనియాడడం జరిగింది.
అందుకే అవతార పురుషుడై మానవులందరికీ మాటల్లోనూ, చేతల్లోనూ ఆదర్శప్రాయమైన మార్గాన్ని అవలంబించి చూపాడు.
అయితే ఈ వాక్కును నిగ్రహించుకోవడం ఎలా.. మనం మన మనసును నిగ్రహించుకుంటే వాక్కును నిగ్రహించుకోగలుగుతాము మనసు నిర్మలంగా, శుద్ధిగా ఉంటే వాక్కు కూడా నిర్మలంగా ఉంటుంది.
వాక్శుద్ధి కలుగుతుంది.
అటువంటి వాక్శుద్ధి కలవారు అన్నది జరిగి తీరుతుంది.
***
ఆది శంకరాచార్యులు 32వ ఏట శరీరాన్ని విడిచిపెట్టేలోపు చేసిన స్తోత్రాలు-రచనలు,-భాష్యాల వివరాలు.
గణేశ భుజంగ స్తోత్రం
గణేశ పంచరత్న స్తోత్రం
వరద గణేశ స్తోత్రం
గణేశాష్టకం
సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం
అర్థనాదీశ్వర స్తోత్రం
దశస్లోకి స్తుతి
దక్షిణామూర్తి స్తోత్రం
దక్షిణామూర్తి అష్టకం
దక్షిణామూర్తి వర్ణమాల స్తోత్రం
ద్వాదశ లింగ స్తోత్రం
కాల భైరవ అష్టకం
శ్రీ మృత్యుంజయ మానసిక పూజ స్తోత్రం
శివ అపరాధ క్షమాపణ స్తోత్రం
శివానందలహరి
శివ భుజంగ స్తోత్రం
శివ కేశాది పదాంత వర్ణన స్తోత్రం
శివ మానస పూజ
శివ నామావళి అష్టకం
శివ పాదాది కేశాంత వర్ణన స్తోత్రం
శివ పంచాక్షర స్తోత్రం
శివ పంచాక్షర నక్షత్రమాల
సువర్ణ మాల స్తుతి
ఉమా మహేశ్వర స్తోత్రం
వేదసార శివస్తోత్రం
శివాష్టకం
అన్నపూర్ణ అష్టకం
ఆనంద లహరి
అన్నపూర్ణ స్తోత్రం
అన్నపురణ స్తుతి
అంబాష్టకం
అంబాపంచరత్నం
భగవతి మానస పూజ
భవాని అష్టకం
భవాని భుజంగం
బ్రమరంబ అష్టకం
దేవి భుజంగ స్తోత్రం
దేవి చతుశ్శస్త్య ఉపచార పూజ
దేవి పంచరత్నం
దేవి అపరాధ క్షేమాపణా స్తోత్రం
దేవి అపరాధ భజన స్తోత్రం
గౌరీ దశకం
హరగౌరీ అష్టకం
కాళి అపరాధ భజన స్తోత్రం
కామ భుజంగ ప్రయత
కామబింబ అష్టకం
కనకధారా స్తోత్రం
శ్రీలలితా పంచరత్నం
మంత్రముత్రిక పుష్పమాలస్థావం
మాతృకా పుష్ప మాల స్తుతి
మీనాక్షి స్తోత్రం
మీనాక్షి పంచరత్నం
నవరత్నమాలిక
రాజరాజేశ్వరి అష్టకం
శారద భుజంగ ప్రయతా అష్టకం
సౌందర్యలహరి
శ్యామల నవరత్న మాలిక స్తోత్రం
త్రిపురాసుందరి అష్టకం
త్రిపురాసుందరి మనసపూజ స్తోత్రం
త్రిపురసుందరి వేదపద స్తోత్రం
అచుతాష్టకం
భగవాన్ మానసపూజ
భజగోవిందం
హరిమీడే స్తోత్రం
హరి నామావళి స్తోత్రం
హరి శరణాష్టకం
శ్రీ విష్ణు భుజంగ ప్రయతా స్తోత్రం
జగన్నాథాష్టకం
కృష్ణాష్టకం
లక్ష్మినృసింహ పంచరత్నం
నారాయణ స్తోత్రం
పాండురంగాష్టకం
రామ భుజంగ ప్రయతా స్తోత్రం
రంగనాథాష్టకం
లక్ష్మినృసింహ కరుణారస స్తోత్రం
లక్ష్మినృసింహ కరవలమబ స్తోత్రం
షట్పది స్తోత్రం
విష్ణు పాదాదికేశాంత స్తోత్రం
హనుమత్ పంచరత్నం
మాతృ పంచకం
కౌపీన పంచకం
కళ్యాణ వృష్టి
నవరత్నమాలిక
పుష్కరాష్టకం
మొహాముద్గ్రహ స్తోత్రం
కాశి పంచకం
కాశి స్తోత్రం
మణికర్ణికాష్టకం
ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
గంగాష్టకం
గంగా స్తోత్రం
నర్మదాష్టకం
యమునాష్టకం
అద్వైత అనుభూతి
అజ్ఞాన భోదిని
అమరు శతకం
అనాత్మశ్రీ వికర్హన
అపరోక్షానుభుతి
ఆత్మ-అనాత్మ వివేకం
ఆత్మ బోధం
ఆత్మజ్ఞాన ఉపదేసనవిధి
దృక్ దర్శన వివేకం
ఆత్మ పంచకం
అత్మశతకమ్
అద్వైత పంచకం
అత్మపూజ-పరపూజ
బాలబోధ సంగ్రహం
భోధసారం
అత్మచింతన
బ్రహ్మచింతన
బ్రాహ్మణా వలిమాల
ధ్యానాష్టకం
జ్ఞానగంగాష్టకం
గురు అష్టకం
జీవన ముక్త్యనందలహరి
యతి పంచకం
మణిరత్నమాల
మానిషా పంచకం
మాయా పంచకం
మతామ్నాయ
నిర్గుణ మనసపూజ
నిర్వాణ దశకం/సిధాంత బిందు
నిర్వాణ మంజరి
నిర్వాణ శతకం/ఆత్మ శతకం
పంచీకరణం
ప్రభోద సుధాకరం
ప్రశ్నోతర రత్నమాలిక
ప్రపంచసార తంత్రం
ప్రాతః స్మరణ స్తోత్రం
ప్రౌడానుభుతి
సదాచార సంతానం
సాధనా పంచకం/ఉపదేశ పంచకం
శంకర స్మృతి
సన్యాస పథ్థతి
సారతత్వ ఉపదేశం
సర్పత పంచారిక
సర్వసిధాంత సంగ్రహం
సర్వ వేదాంత సిద్దాంత సార సంగ్రహం
స్వాత్మ నిరూపణం
స్వాత్మ ప్రకాశికం
స్వరూపానుసంతానాష్టకం
తత్వ బోధం
తత్వ ఉపదేశం
ఉపదేశసహస్రి
వాక్యసిత
వాక్యవృతి
వేదాంత కేసరి
వేదాంత శతశ్లోకి
వివేకచూడామణి
ఏకస్లోకి
యోగ తారావళి
విష్ణు సహస్రనామ భాష్యం
లలిత త్రిశతి భాష్యం
యోగసూత్ర భాష్యం
భగవద్గీత భాష్యం
ఉపనిషద భాష్యం
బ్రహ్మసూత్ర భాష్యం

Comments
Post a Comment