ప్రాంజలి ప్రభ..15/04




ఆరోగ్యం మరియు ఆయుష్షుని పెంచే అవిసె గింజలు


👉అవిసె గింజలను తినడానికి ఉత్తమమైన మార్గం మొలకలు. 

👉నానబెట్టి మొలకెత్తించిన అవిసె గింజలను తీసుకోవడం ద్వారా వాటిలోని పోషకాలను పూర్తి స్థాయిలో పొందవచ్చు. 

👉వీటిని కేవలం 10 నిమిషాలు నానబెడితే చాలు మొలకెత్తడానికి.

👉వీటిని పొడిచేసి తీసుకోవడం మంచిది. 

👉వీటిని తినేటప్పుడు చాలా ఎక్కువ నీరు తాగటం మర్చిపోవద్దు.

👉అవిసె గింజల నూనెను వేడి చేయరాదు. వేడి చేస్తే దానిలోని పోషకాలు తగ్గిపోతాయి. 

👉కానీ అవిసె గింజలను హాయిగా వేయించుకొని తినవచ్చు.

👉వీటిని ఉదయం అల్పాహారంలో వీటిని తీసుకోవడం ఎంతో మంచిది.

👉అవిసె గింజలు మేలురకం కొవ్వులకీ, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలకు పెట్టింది పేరు. 

👉వీటిని తినడం వల్ల స్త్రీ హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ లోపం లేకుండా ఉంటుంది.

👉 దీనిలోని అల్ఫాలినోలెనిక్ అనే పోషకం కండరాలకు బలాన్ని ఇస్తుంది.

👉అవిసె గింజలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. 

👉వీటిలోని కరిగే పీచుపదార్థం ఆకలి మరియు తినాలనే కోరికను తగ్గించడానికి సహాయపడుతుంది.

👉 అవిసె గింజలలో గల పీచుపదార్థం వల్ల కడుపు నిండినట్లు అనిపించి శరీర బరువును తగ్గిస్తుంది.

👉వీటిలో అధిక స్థాయిలో మ్యుసిలెజ్ గమ్ కంటెంట్ ఉంటుంది. 

👉ఈ రకమైన పీచు పదార్ధం నీటిలో కరిగే గుణం కలిగి ఉంటుంది. 

👉దీనివల్ల ప్రేగులలో అద్భుతమైన లాభాలను కలిగిస్తుంది. 

👉ఇది శరీరంలో అధిక కొవ్వును తగ్గించుకోవడానికి ఉపయోగ పడుతుంది.

👉అధిక రక్తపోటు తగ్గించడానికి ఈ అవిసె గింజలు ఎంతో ఉపయోగపడతాయి. 

👉అవిసె గింజలను రోజూ తీసుకోవడం వలన మధుమేహంతో బాధపడే వ్యక్తుల ఆరోగ్యం నిదానంగా మెరుగుపడుతుంది. 

👉20 శాతం వరకు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

👉మరీ ముఖ్యంగా ఈ గింజలలోని ముసిలేజ్ జీర్ణక్రియను నెమ్మదిపరచి రక్తంలో గ్లూకోజ్ కలవడాన్ని నియంత్రిస్తుంది. 

👉అవిసె గింజలు
ద్వారా మొటిమలను అరికట్టవచ్చు.

👉పొడి చర్మం, సోరియాసిస్ మరియు తామర వంటి ఇతర చర్మ వ్యాధులు అవిసె గింజల ద్వారా నిరోధించబడతాయి.

👉ఒక టీస్పూన్ అవిసె గింజల నూనెకు రెండు టేబుల్ స్పూన్ల ముడి తేనె, ఒక టీస్పూన్ తాజా నిమ్మరసం కలిపి ముఖంపై రోజూ ఉదయాన్నే ఫేస్ ప్యాక్ లాగా వేయాలి. 

👉దీనివల్ల చర్మం పై ముడతలు పోతాయి మరియు చర్మం మెరుస్తుంది. చర్మ రంద్రాలు తెరుచుకుంటాయి.

👉అవిసె గింజలలో ప్రోటీన్, కాల్షియం, జింక్, మెగ్నీషియం, ఇనుము మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలూ ఉంటాయి. 

👉అవిసె గింజలను రోజూ తీసుకోవడం వలన జుట్టు ఆరోగ్యంగా బలంగా ఉంటుంది.

👉ఏదైనా తగు మోతాదులో తీసుకోవాలి. మోతాదుకు మించి తీసుకోకూడదు. 

🙏


*ముముక్షు ప్రకరణము / నాల్గవ అధ్యాయము / శమ విచార సంతోష సత్సాంగత్యం నిరూపణము*

4-53

న పతత్యవటే జ్ఞస్తు విషయాసఙ్గరూపిణి 

కః కిల జ్ఞాతసరణిః శ్వభ్రం సమనుధావతి.

జ్ఞాని విషయాసంగ రూపమగు గోతియందు పడడు, ఏలయనఁగా మార్గ నెఱింగిన ఎవడు గోతివైపునకు పరుగిడును? 

4-54

దృశ్యతే లోకసామాన్యో యథాప్రాప్తానువృత్తిమాన్‌ ఇష్టానిష్టఫలప్రాప్తౌ హృదయే నాపరాజితః.

జ్ఞాని యథాప్రాప్తములగు కార్యముల నాచరించుచు పైకి ఇతర మనుజులవలెనే కానిపించును. కాని, ఇష్ట అనిష్ట ఫలప్రాప్తి యందు హృదయమున ఏమాత్రము వికారము నొందక (మాయచే జయింపబడక) యే యుండును. 

4-55

అహం జగదితిప్రౌఢో ద్రష్టృదృశ్యపిశాచకః 

పిశాచోఽ  ర్కోదయేనేన స్వయం శామ్యత్యయత్నతః. 

జ్ఞానసూర్యుఁడుదయింప 'నేను' ఈ జగత్తు ఇత్యాదిరూపమగు ప్రబల మైనట్టి ద్రష్టృదృశ్యపిశాచము, సూర్యోదయముచే పిశాచమువలె అప్రయత్నముగనే శమించిపోయి కేవలము శుద్ధాత్మయే శేషించును.



కాలయాపన మాశానామ్ వర్ధనం ఫలఖండనం
విరక్తేశ్వర చిహ్నాని జానీయా న్మతిమాన్నరః  ......  59

తా:-- పనిచేయకుండా కాలయాపన చేయడం ,ఆశలను పెరగనీయడం, ఫలితములను సున్నా చేయడం; యివి విరక్తులైన రాజులకు చిహ్నములు. రాజోద్యోగులు,అధికారులు కూడా యీ లక్షణములేకలిగి కార్యార్థులను పీడించుట కాలములందున వున్నదేనని బుద్ధిమంతులు తెలుసుకోగలరు.

సౌజన్యం యది కిం బ లేన మహిమా యద్యస్తి కిం మండనై:
సద్విద్యా యది కిం ధనై పర యశో యద్యస్తి కిం మృత్యునా   ..... 60

అర్థము: అత్యాశ కలిగియున్న వేరు దుర్గుణం అక్కరలేదు, కొండెములు చెప్పుగుణం కలిగి వున్న నితర పాపము లేదు.సత్యము చెప్పు గుణమున్న వేరు తపస్సు  అక్కరలేదు. మంచి మనస్సుకలిగి యున్న తీర్థ త్రలక్కరలేదు.శాంతము కలిగియున్న వేరు బలము అక్కరలేదు.మహిమ యుండిన భూషణం తో పనిలేదు. మంచి విద్య యున్న ధనముతో
పని లేదు.అపకీర్తి కలిగిన మృత్యు వు తో పనిలేదు.(చావు తో పనిలేదు ). .(భర్తృహరి సుభాషితము)

నిత్యం సంఘర్షణలతో సతమత మయ్యే మానవుని మనస్సే ఒక కురుక్షేత్రం. శరీరమే రథం దాన్ని నడిపించే
యింద్రియాలే అశ్వాలు. సమస్యా పూరితమైన అహంకారమే అర్జునుడు, పరిష్కారం చూపే బుద్ధి, వివేకాలే
శ్రీకృష్ణుడు. అంటే చేతనా చేతన మనుష్యుల మధ్య సంవాదమే భగవద్గీత.

పచ్చనైన పైరుమీద పట్టినట్టి చీడ పీడ
అచ్చ తెలుగు సొగసు మీద ఆంగ్లభాష పడగనీడ
విష సంస్కృతి కోరల్లో విలపించిన భాషా
పట్టదేమి పాలకులకు తెలుగుతల్లి ఘోష   ........  61

--((**))--


పుష్ప మాత్రం విచిమయాత్
మూల చ్చేదం న కారయేత్
మాలాకార యివారామే
న యాథాంగ కారకః          ......   62

అర్థము:-- రాజు ప్రజలను రక్షించి, వారిని నొప్పింప కుండానే పన్నులను తీసుకొన వలెను. తోటమాలి మొక్కలకు నీరు పోసి, రక్షించి పెంచి వాటినుండి పువ్వులను కోసి మాలలు కట్టునట్లుగా ప్రవర్తించ వలెను, గానీ తామే పెరిగిన చెట్లను వేర్లతో సహా నరికి వేసి కాల్చి బొగ్గుల నమ్ము వాని వలె రాజు ప్రవర్తించ రాదు. ఇది అన్ని కాలములలో పాటించ వలిసిన నీతి

అల్లన లింగమంత్రి సుతుఁడత్రిజ గోత్రజుడాదిశాఖ కం
చెర్ల కులోద్భవు౦డన బ్రసిద్ధుడనై భవదంకితంబుగా
నెల్ల కవుల్ నుతిఁ౦ప రచియించితి గోపకవీంద్రుడన్ జగ
ద్వల్లభ నీకు దాసుడను దాశరథీ కరుణాపయోనిధీ!
-----------------------------------
వగవకు గడిచిన దానికి
బొగడకు దుర్మతులనెపుడు పొసగని పనికై
యెగి దీనత నొందకుమీ
తగ దైవగతి౦ బొసంగు ధరను కుమారా!

తా:--గడిచి పోయిన దానిని గురించి చింతి౦ప వద్దు, దుష్టులను పొగడవద్దు, నీకు
సాధ్యము కాని దానిని పొందలేక పోతినని చింతించుట పనికి రాదు, భగవండిచ్చినదానితో తృప్తి చెందుము కుమారా!
--------------------------------------
న కాలే మ్రియతే జంతు: విద్ధ: శర శతైరపి
కుశాగ్రే నైవ సంసృష్ట: ప్రాప్తకాలో న జీవతి

అర్థము:--కాలము రానిదే నూరు బాణములు తగిలిననూ ఏ ప్రాణి యైననూ
చనిపోదు కాలము దాపురించినచో గడ్డి పరక కారణముగా నైనా ప్రాణములు పోవునుగడ్డి పరక కారణముగా నైనా ప్రాణములు పోవును.

-------------------విదురనీతి--------------

భాగవతము 

(పోతనగారు) 

⇠ విరాట్స్వరూపము తెలుపుట⇢ 
2-16-వ. వచనము 
వినుము; భగవంతుండైన హరి విరాడ్విగ్రహంబు నందు భూత భవిష్యద్వర్తమానం బైన విశ్వంబు విలోక్యమానం బగు ధరణీసలిల తేజస్సమీరణ గగనాహంకార మహత్తత్వంబు లనియెడి సప్తావ రణంబుల చేత నావృతం బగు మహాండకోశం బైన శరీరంబు నందు ధారణాశ్రయం బయిన వైరాజపురుషుండు దేజరిల్లు; నమ్మ హాత్మునికిఁ బాదమూలంబు పాతాళంబు; పార్ష్ణిభాగ పాదాగ్ర భాగం బులు రసాతలంబు; గుల్ఫంబులు మహాతలంబు; జంఘలు తలాతలంబు; జానుద్వయంబు సుతలం; బూరువులు వితలాత లంబు; జఘనంబు మహీతలంబు; నాభీవివరంబు నభస్థ్సలంబు; వక్షంబు గ్రహతారకా ముఖ జ్యోతిస్సమూహ సమేతం బగు నక్షత్రలోకంబు; గ్రీవంబు మహర్లోకంబు; ముఖంబు జనలోకంబు; లలాటంబు తపోలోకంబు; శీర్షంబు సత్యలోకంబు; బాహుదం డంబు లింద్రాదులు; గర్ణంబులు దిశలు; శ్రవణేంద్రియంబు శబ్దంబు; నాసాపుటంబు లశ్వనీదేవతలు; ఘ్రాణేంద్రియంబు గంధంబు; వదనంబు వహ్ని; నేత్రంబు లంతరిక్షంబు; చక్షురింద్రి యంబు సూర్యుండు; రేయింబగళ్ళు ఱెప్పలు; భ్రూయుగ్మ విజృంభణంబు బ్రహ్మపదంబు; తాలువులు జలంబు; జిహ్వేంద్రి యంబు రసంబు; భాషణంబులు సకల వేదంబులు; దంష్ట్రలు దండధరుండు; దంతంబులు పుత్రాది స్నేహకళలు; నగవులు జనోన్మాద కరంబు లయిన మాయావిశేషంబులు; కటాక్షంబుల నంత సర్గంబులు; పెదవులు వ్రీడాలోభంబులు; స్తనంబులు ధర్మంబులు; వె న్నధర్మమార్గంబు; మేఢ్రంబు ప్రజాపతి; వృష ణంబులు మిత్రావరుణులు; జఠరంబు సముద్రంబులు; శల్య సంఘంబులు గిరులు; నాడీనివహంబులు నదులు; తనూరుహం బులు తరువులు; నిశ్వాసంబులు వాయువులు; ప్రాయంబు నిరవధికంబయిన కాలంబు; కర్మంబులు నానావిధజంతునివహ సంవృత సంసరణంబులు; శిరోజంబులు మేఘంబులు; కట్టు పుట్టంబులు సంధ్యలు; హృదయంబు ప్రధానంబు; సర్వవికారం బులకు నాశ్రయంబైన మనంబు చంద్రుండు; చిత్తంబు మహత్త త్త్వం; బహంకారంబు రుద్రుండు; నఖంబు లశ్వాశ్వత ర్యుష్ట్రగ జంబులు; కటిప్రదేశంబు పశుమృగాదులు; విచిత్రంబులైన యాలాప నైపుణ్యంబులు పక్షులు; బుద్ధి మనువు; నివాసంబు పురుషుండు; షడ్జాదులైన స్వరవిశేషంబులు గంధర్వ విద్యాధర చారణాప్సర స్సమూహంబులు; స్మృతి ప్రహ్లాదుండు; వీర్యంబు దైత్య దానవానీకంబై యుండు; మఱియు న మ్మాహావిభునకు ముఖంబు బ్రాహ్మణులును, భుజంబులు క్షత్రియులును, నూరు లు వైశ్యులును, జరణంబులు శూద్రులును, నామంబులు నానా విధంబులయిన వసురుద్రాది దేవతాభి ధానంబులును; ద్రవ్యం బులు హవిర్భాగంబులును; కర్మంబులు యజ్ఞప్రయోగంబులు నునగు; నిట్టి సర్వమయుండైన పరమేశ్వరుని విగ్రహంబు ము ముక్షువయినవాడు మనంబున ననుసంధానంబు సేయవలయు" నని వక్కాణించి వెండియు నిట్లనియె. 



 ఆనందం పొందే మార్గం

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩

అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్‌ వినిర్మలం| కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్‌ జలం కతకరేణువత్‌ ||

చిల్లగింజపొడి మురికి నీటిని పరిశుభ్రం చేసి నీటిలోనే కలిసిపోతూ ఉన్నట్లుగా అజ్ఞానం చేత కలుషితమైన జీవుని జ్ఞానాభ్యాసం అనేటటువంటిది బాగా పరిశుద్ధునిగా చేసి గురువు ఇచ్చిన జ్ఞానం అనేది తనంతట తానుగానే లీనమైపోతూ ఉంది.

 అంతఃకరణ చతుష్టయంతో విచ్ఛిన్నం అవుతూ ఉండే ఆత్మే జీవుడుగా నిలుస్తున్నాడు. పారమార్థికమైనటువంటి విజ్ఞానం సరిగా లేకపోవటం వల్లే మానవుడు మనస్సుతో జీవిస్తూ అహంకారంతో సంచరిస్తూ ఉన్నాడు. అహంకారమే జీవుడుగా అయి జీవిస్తున్నాడు. ఇహలోక జీవభ్రాంతితో పరలోకాన్ని, శాంతిని విడిచిపెడుతూ ఉన్నాడు. కావున మానవుడు మనస్సుకు జీవభ్రాంతితో చేకూరుతున్న వ్యయ ప్రయాసల్ని, అశాంతిని తొలగించుకోవటానికి జ్ఞానాభ్యాసాన్ని నిరంతరం కొనసాగించవలసిన అవసరం కలుగుతుంది. దానికోసమే మానవుడు ధ్యానాన్ని స్వీకరించి ఆత్మతో జీవించటానికి ప్రయత్నం చేయవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. నేనే ఆత్మను అనే భావంతో మానవుడు జీవించాలని నిరంతరం ఎంత ప్రయత్నం చేసినా, ఆలోచనా ప్రవాహాలు, అవసరాలు, స్వలాభాకాంక్షలు జ్ఞానానుభవాన్ని భంగం చేస్తూనే ఉంటాయి. గాఢ నిద్రలో (సుషుప్త్యవస్థలో) మాత్రమే అనగా అజ్ఞానంలో మనస్సు ఆత్మలో లీనం అవుతూ ఉంది. కాన మనస్సుని ఆ విధంగా జ్ఞానంలో ఉన్నప్పుడు లీనమయ్యేటట్లు చెయ్యాలి.

జాగ్రత్‌, స్వప్న, సుషుప్త్యవస్థలు అన్నిటిలోను, లోపల బయట అంతటాకూడా నిండి ఉన్నటువంటిది, సర్వావస్థలను ప్రకాశింప చేస్తూ ఉన్నటువంటిది అయిన చైతన్య స్వరూపం ఏదయితే ఉందో ఆ బ్రహ్మాన్ని నేనే అనే అనుభూతిని పొందటం అనేదే మోక్షం, అసలైన ఆనందం. అది నిరంతర జ్ఞానసాధన చేతనే సాధ్యం అవుతుంది. కనుక అటువంటి జ్ఞానం చేత అజ్ఞానాన్ని తొలగించాలి.

మనస్సు అనేది సంకల్ప వికల్పాలతో నిరంతరం చరిస్తూ ఉంటుంది. సెకండులో వందవ వంతు కాలంలో కూడా అది నిలువదు. అట్లా సంచరించటమే దాని సహజ స్వభావం అయి ఉంది. అటువంటి మనస్సుకి జ్ఞానేంద్రియాలనే అయిదు గుర్రాలు అయిదు ఆయుధాలై ఉండటం వల్ల అవి బహిర్ముఖం అయి వస్తు విషయ జ్ఞానంతో ఆనందిస్తూ గడపటానికి ప్రయత్నం చేస్తుంటాయి. కోరికల పుట్టతో పరిపరి విధాల సంచరిస్తూ మనిషికి శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి. అటువంటి మనస్సుకి, ఇంద్రియాలకి గురుజ్ఞానం అనే దాన్ని తోడుగా చేయటం వల్ల మనస్సు, ఇంద్రియాలు అంతర్ముఖంగా ఉన్న దృశ్యాల్ని తిలకిస్తాయి.

దానితో మానవుని లోపలే ఉన్న విచిత్రమైన ఆత్మజ్యోతిని, అనంతమైన నాదాన్ని, నిశ్శబ్దమైన ప్రశాంతతను, అది శబ్దమైన పరావాణిని, అనంతమైన అమృతత్త్వాన్ని ఆస్వాదించాలనేది జ్ఞానసాధకునికి ఏర్పడుతుంది.

ఏనుగు తొండాన్ని ఒక్క సెకండు కూడా కదలకుండా ఏనుగు నిలుపలేదు. కాని మావటివాడు దానికి ఒక కర్రముక్కను అందిస్తే చాలు ఆ ఏనుగు ఆ కర్ర ముక్కను పట్టుకుని తొండాన్ని కదపకుండా నడుస్తుంది. గొడ్డు బయట దొరికే రుచికరమైన దొంగమేత తింటానికి అలవాటుపడి, చిరుతిళ్లకు మరిగి నిరంతరం బయట పొలాలలోకి పోయి మేసి వస్తూ ఉంటుంది. దాన్ని అట్లా బయటకు వెళ్లనియ్యకుండా పట్టుకొని కట్టుకొయ్యకు కట్టిపడేస్తే నాలుగు రోజులు ఆహారం సరిగా తీసుకోవటానికి మొరాయిస్తుందే కాని క్రమేపి ఉన్న ఆహారంతోనే తృప్తిపడి జీవించటానికి అలవాటు పడుతుంది. ఇంటిముందుకు వచ్చే కుక్కకు రోజు ఆహారం వేస్తూ ఉంటే అది రోజూ ఇంటి ముందుకు వచ్చి నిలబడటానికే అలవాటుపడుతుంది. అదే విధంగా క్రమంతప్పకుండా వస్తూ ఉన్నదానికి ఆహారాన్ని వెయ్యటం మానేస్తే అదే రావటం మానేస్తుంది.

అదే విధంగా ఈ మనస్సును గురుజ్ఞాన సాధనలో నిలిపి ఆనందింప చేయటానికి ప్రయత్నం చేస్తే ప్రారంభంలో ఎక్కడెక్కడికో పోవటానికి మనస్సు ప్రయత్నం చేస్తూనే గడుపుతుంది. దాన్ని నిశితంగా పరీక్షిస్తూ దాని వెంట సాక్షిమాత్రంగా పయనించి దాని స్వభావాన్ని అర్థం చేసుకొని, దాన్ని మళ్ళీ మళ్ళీ బుజ్జగించి వెనుకకు, గురుజ్ఞానం మీదకు తీసుకువచ్చి, జ్ఞానంలో జీవించేటట్లు చేస్తుంటే మనస్సు అంతర్ముఖమై విచిత్రాలలో లీనమయి క్రమేపీ మిత్రుడుగా మారుతుంది.

మనస్సును ఈ విధంగా నిగ్రహింప వలసింది మళ్ళీ మనస్సే అయి ఉండటం వల్ల మనస్సు కొంతసేపు లయం చెందుతూనే మళ్ళీ ప్రకోపిస్తూ బహిర్ముఖంగా నడుస్తుంటుందే కాని పూర్తిగా నశించదు. మనస్సును సంపూర్ణంగా నశింప చేసినప్పుడు మాత్రమే జ్ఞానం చేత శుద్ధమైన మనస్సు ఆత్మగా నిలవటానికి వీలుకుదురుతుంది. మనస్సు ఆత్మలో లయం కావాలంటే విచారణ ద్వారా వీలుకుదురుతుంది. ఆత్మానాత్మ వివేచనతోనే జ్ఞానోదయం అనేది ప్రతి ఇంద్రియానికి చేకూరుతుంది. ప్రతి ఇంద్రియంలోను అణువణువు మార్పుచెందుతూ వస్తేకాని మనస్సు లయం కాదు. దాన్ని సాధించటం కోసం మనస్సునకు వస్తు…

****************************

నేటి నా పాట పాట సంఖ్య:-608

*****************************

 రచన:- మహేష్ వూటుకూరి  ✍️

9640713717.

దోర్నాల.

 ప్రకాశం జిల్లా.

 15/04/2023.

***************

 పాట సందర్భంపై నా విశ్లేషణ.

***************************

శ్రీ వాల్మీకి మహర్షి  తను వ్రాసిన రామయణ మహాగ్రంధంలో  శ్రీరాముడు సీతమ్మ ల

రూపాలను  చక్కగా వర్ణించిన  భావాలను

 బట్టి ఇలా ఉంటారని ఇన్నాళ్లకు చక్కని చిత్రాలను

 రూపొందించి మా చల్లని  రామయ్య మా చక్కని సీతమ్మ 

అని పాడుకునే పాటలు మాటలు నిజమని ఋజువు కావడం ఆనందకరమైన సందర్భంలో 

ఆ చిత్ర రాజాలను చూసి సీతారాముల పై ఈ పాట వ్రాయడం మరింత ఆనందంగా ఉంది. 

జై సీతారామా.. నిత్యం  జై శ్రీరాం అనే నా నోట ఈ పాట.

*************************************************

పల్లవి:-

**********

సీతా రామా   ఓ.. సీతారామా

 సీతారామా మా సీతారామా

మీ రూపం చూడు భాగ్యం 

ఇలా ఇన్నాళ్ళకు కలిగి 

ధన్యం చెందింది మా జన్మం!!


సీతారామ ఓ.. సీతారామా

సీతా రామా మా సీతారామా

మీ జననం ఎన్ని యుగాలకైనా ఆదర్శం

మీ పయనం ఎన్ని మతాలు పుట్టిన

మీ సమభావ తత్వం సరితూగలేవు..


సీతారామా

 ఓ.. ఓ.. ఓ.. సీతారామా...

మీ రూపం చూడు భాగ్యం!!

చరణం:-

********

దశరధ తనయా దశావతార 

విశ్వ దర్శన  మహానుభావ

ఆదర్శవంత మహాపురుషా 

పరమ పూజ్య పురుషోత్తమా..


సాద్వి సీతమ్మ తో 

చిద్విలాస నీ మోమున 

కోటి సూర్యుల తేజస్సుల మయం


అద్వితీయమైన మీ కళ్యాణం

విశ్వమానవాళికి కమనీయం

రమణీయం ఆదర్శ ప్రాయం..


వంశాభివృద్దికి మీ అంశ ఆలోచనలు

అనుసరించినా  సమస్తం

సర్వేజనాసుఖినోభవంతుగా వర్ధిల్లునుగా!!

పల్లవి:-

**********

 సీతారామా ఓఓ సీతారామా

చరణం:-

********

కఠోర ధీక్ష  కఠిన నియమం

సర్వం సర్వస్వం త్యజించడం

నిత్యం సత్యం అనుసరింఛడం

ఎంత కష్టమైనా నిష్టగా నిరంతరంగా

అనుసరించినా సీతారామా మీకే సాద్యం

అందుకే అయినారు దైవం 

ఆదర్శ మూర్తిత్వం మీకు పాదాభివందనం.


 ఏకపత్ని వ్రతం ఒకే మాటగా నిలవడం

ఒకే బాటగా అనుసరించడం 

మారు మాటాడక శిరసావహించడం

 మీకే సాద్యం  ఓ సీతారామా

 ఓ.. ఓ... ఓ.. ఓ... సీతారామా

 మా దైవమా మా ధర్మమా...

పల్లవి:-

**********

సీతారామా ఓ.. ఓ.. సీతారామా

 మీ రూపం చూడు భాగ్యం

 ఇలా ఇన్నాళ్లకు  కలిగిచూడు

ధన్యం చెందింది మా జన్మం ...!!

**************************

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ