శ్రీ అన్నమయ్య సంకీర్తన

అన్నమయ్య సంకీర్తన


గానం. 

రేకు: 16-3
సంపుటము: 1-97
రేకు రాగము: నాట


ఎవ్వరెవ్వరివాడొ యీ జీవుఁడు
నెవ్వరికి నేమౌనొ యీ జీవుఁడు !!


ఎందరికిఁ కొడుకుగాఁడీజీవుఁడు వెనక
కెందరికిఁ తోబుట్టఁ డీజీవుఁడు
యెందరిని భ్రమయించఁడీజీవుఁడు దుఃఖ-
మెందరికిఁ గావింపఁడీజీవుఁడు !!


యెక్కడెక్కడఁ తిరుగఁడీజీవుఁడు వెనక-
ఎక్కడో తనజన్మ మీ జీవుఁడు
యెక్కడి చుట్టము యీ జీవుఁడు యొప్పు-
డెక్కడికి ఏగునో యీ జీవుఁడు !!


ఎన్నఁడును చేటులేనీజీవుఁడు వెనక-
ఎన్ని తనువులు మోవఁడీ జీవుఁడు
యెన్నఁగల తిరువేంకటేశుమాయలఁ తగిలి
యెన్నిపదవులఁ పొందఁడీజీవుడు!!

🕉🌞🌎🌙🌟🚩

భావము:-

     ఈ జీవుడు ఎన్నో జన్మములలో ఎందరికో జన్మించుచున్నాడు. జనన మరణాత్మకమైన సంసారచక్రములో పరిభ్రమించుచున్నాడు. ఇట్టి జీవుడు ఏ యే జన్మలలో ఎవరెవరికి ఏయే వావివరుసలలో సంబంధపడియున్నాడో నిర్ణయించుట కెవరి తరము ?
విచారించగా జీవులలో ఒకరితో నొకరికెట్టి సంబంధమును లేదు.


1. ఈ జీవుడెన్నో జన్మములలో ఎందరికో కొడుకై జన్మించినాడు. పూర్వము తానెందరికో తోబుట్టువుగా పుట్టినాడు. ఎందరినో ఎన్నో విధముల పుత్రమిత్ర కళత్రాది సంబంధములతో భ్రమింపజేసినాడు. ఎందరినో ఎన్నో రీతుల దుఃఖముల పాలు చేశారు.


2. ఈ జీవుడు తిరుగని చోటే లేదు. ముందటి జన్మల ఎన్నో చోట్ల పలు రూపులతో జన్మించి తిరిగియున్నాడు. తానున్న జన్మములో ఇతడెక్కడ పుట్టనున్నాడో? ఈ జన్మములో మాత్రము తనకీజీవుడేవిధముగా అనుగు చుట్టము కాగలడు ? ఇతడెప్పుడెక్కడికి పోవునో తెలియదుగదా !


3. ఇన్ని జన్మలు దాల్చుచున్నను, ఇన్నిసార్లు మరణించుచున్నను నిజముగా ఈ జీవునకు మాత్రము ఎట్టి చేటును లేదు. పూర్వమితడెన్నో తనువులు దాల్చినాడు. తాను దాల్చిన శరీరములే చేటందుచున్నవి గాని సనాతనుడైన జీవాత్మునకేమాత్రము చేటు లేదు. శ్రీవేంకటేశ్వరుని మహా మాయా ప్రభావమునకు లోబడి ఈ జీవుడెన్నో పదవులు పొందుచున్నాడు.

[అన్నమయ్య సంకీర్తన

రేకు: 5-3
సంపుటము: 1-32
రేకు రాగము: గుండక్రియ.

ఎంతటివారలు ఎవ్వరును హరి 
చింతించక నిశ్చింతులు కారు ||

అతిజితేంద్రియులు అనశనవ్రతులు
అతుల తపోధనులగు వారు 
చతురానన గురుస్మరణము దొరకక 
తతి నూరక పుణ్యతములు కారు ||

అనఘులు శాంతులు అధ్యాత్మతతులు
అనుపమపుణ్యులు యాజకులు 
వనజోదరుని అనవరతము తలచక 
వినుతిస్మృతికిని విబుధులు కారు ||

దురితవిదూరులు దుర్మతిహీనులు 
నిరతానందులు నిత్యులును 
తిరువేంకటగిరి దేవుని కొలువక 
పరమార్గమునకు బ్రహ్మలు కారు ||
***
భావము:-
     హరి భక్తి లేనిదే యెంతటివారికైనా నిశ్చింత కలుగదు అంటున్నారు అన్నమయ్య. నిశ్చింత లేకపోతే, ఇంద్రియ నిగ్రహం లేక పుణ్యసాధన జరుగదు. శాంతులు కానివారు సోమయాజులైనా లాభంలేదు. ఎల్లప్పుడు హరిని స్మరించకపోతే యెంత వేదం చదివినా నిరుపయోగమే.  వేంకటపతి దయలేక బ్రహ్మత్యమే రాదు అంటున్నారు.
     ఎంతటివారలైనా, యెవ్వరైనా శ్రీహరిని ధ్యానించక నిశ్చింతులు (ఆశావిరహితులు)కారు, కాలేరు.
1.  ఎంతో జితేంద్రియులైనా, అనశనవ్రతులు (ఎల్లప్పుడు వ్రత దీక్షాపరులు) అయినా, సాటిలేని తపోధనులు అయినా కానీ, చతుర్ముఖబ్రహ్మ తండ్రి శ్రీహరిని స్మరించక వూరకనే పుణ్యతములు కాలేరు.
2. అనఘులు (పాపరహితులు), శాంతమూర్తులు, ఆధ్యాత్మ చింతనా దక్షులు, సాటిలేని పుణ్యాత్ములు అనేక యజ్ఞములు చేసిన యాజకులు అయినా సరే, నళిననాభుని నిరంతరమూ స్మరించక హరిని స్తుతించే వేదములు ఆకళింపు చేసుకొనజాలరు.

3. చెడ్డపనుల దరికి చేరని దుర్మతి హీనులు (చెడు బుద్ధి లేని వారు), నిరంతర ఆనంద స్వరూపులైన నిత్యులు, బ్రహ్మత్వాన్ని పొందగలరా? వారు తిరువేంకటాధీశుని కొలువని వారైతే పరమార్గపు చింత రానేరాదు. ఇకవారు బ్రహ్మలెలా అవుతారు? కానేకారు.

.....

***

అన్నమాచార్య సంకీర్తన

రేకు: 39-3

సంపుటము: 1-239

కటకటా యిటుచేసెఁ గర్మబాధ

యెటువంటివారికిని నెడయ దీబాధ!!


॥పల్లవి॥


దినదినముఁ బ్రాణులకు దీపనముచే బాధ

తనుపోషణములు కందర్పబాధ

మనసుశాంతికి సదా మమకారములబాధ

తనివోనికోర్కులకు దైవగతిబాధ!!

॥కట॥

వెడయాసచూపులకు వేడుకలచే బాధ

కడువేడ్కలకు వియోగములబాధ

తొడవైనయెఱుకలకు దురితబుద్దులబాధ

జడియుఁబరచింతలకు సంసారబాధ!!

॥కట॥

ఆరిది నిశ్చయమతికి ననుమానములబాధ

సరిలేని జీవులకు జన్మబాధ

తిరువేంకటాచలాధిపునిఁ గని మని కొలుచు-

వెరవుచేతనె కాని వీడ దీబాధ!!

॥కట॥


కీర్తనలో అర్ధాలు:

--------------------------

గర్మబాధ = పనులవల్ల కలిగే బాధ

దీపనముచే = ఆకలిచే

కందర్పబాధ = మన్మథుడు బాధ

తనివోని = తృప్తిపడని

వెడయాసచూపులకు = తుచ్ఛమైన కోర్కెలతో చూసేవారికి

వెరవు = ఉపాయము

*****

భావామృతం 

-----------------------

అయ్యయ్యో ఈవిధంగా చేసిన పనులవల్ల కలిగిన బాధ ఎటువంటి వారికైనా తప్పదు కదా. ప్రతిదినమూ జీవులన్నిటికీ ఆకలిబాధ చేత శరీరాన్ని పోషించుకున్నందు వలన మన్మధుని బాధలు పీడిస్తున్నాయి. నాది అనే బాధ మనశ్శాంతికి పీడగా పరిణమిస్తుంది. తృప్తిపడని కోర్కెలు ఈ మమకారం వల్ల కలుగుతాయి. కాని దేవుని నిర్ణయం ఎలా వుంటుందో ఎవ్వరికీ తెలిదుకదా. తుచ్ఛమైన కోర్కెలతో చూసేవారికి సంతోషం కోసం వెంపర్లాడి బాధ కలుగుతుంది. ఆ అంతులేని వేడుకలు ఆగిపోక తప్పదు కదా. ఆ వియోగపు బాధ వేడుకలకూ తప్పదు. అప్పుడు కొంత జ్ఞానం కలుగుతుంది. మంచిదైన ఆ జ్ఞానానికి దుర్భుద్ధి పీడగా పరిణమిస్తుంది. దాని వలన సంసార తాపత్రయం కలిగి ముక్తిపై కోర్కెకు పీడ అవుతుంది. చిత్రముగా ఎలాగైనా సరే ముక్తి పొందాలి అనుకునే మనస్సుకు ముక్తి వస్తుందో రాదో అనే అనుమానం బాధ అవుతుంది. ఉత్తమ జన్మలు కలిగి అదీ ఒక బాధ అవుతుంది. శ్రీవేంకటేశ్వరుని దర్శించి కొలుస్తూ భయభక్తులతో వుంటే కాని ఈ పీడ వదలదు అంటు అన్నమయ్య కీర్తించాడు.

***

* అన్నమయ్య సంకీర్తన

రేకు: 1615-4
సంపుటము: 26-88.


చెల్లుబడి యింతగాఁ జేసితివమ్మా
పల్లదాన నుట్లకుఁ బండుగాయనమ్మా !!


కోలలెత్తుక వుట్లు గొట్టీ నేఁ డల్లవాఁడె
మేలు మేలు యశోద మీబాలుఁడు
బాలులఁ గూడుక వీదిఁ బారాడి నల్లవాఁడె
బేలుఁదనమున లెస్స పెంచితివోయమ్మా!! 


ఇంటివారు వుండఁగానే యిండ్లు చొచ్చీ వాఁడె
దంటతనా లివి మీకు తగునమ్మా
అంటఁబారి పట్టుకొంటే ఆయములు దాఁకించె
జుంటితేనేమోవు లివి చూడవమ్మా !! 


కాదుగూడదనఁబోతే కాఁగిలించీ నిదె వీఁదె
ఆదెస నీదేఁటినవ్వు లవునమ్మా
సాదై శ్రీ వేంకటాద్రి సరసమాడీనమ్మా
యీదెస మమ్మిటు గూడె నేమిచెప్పేమమ్మా !!

🕉🌞🌎🌙🌟🚩

కీర్తనలో అర్ధాలు

పల్లదాన = పౌరుషము

కోలలెత్తుక = పోడవైన కర్ర

దంటతనా = నేర్పరితనము

జుంటితేనేమోవు = తేనెలూరే ముఖము

ఇంతగా అధికారము చేస్తున్నావమ్మా. పౌరుషముతో ఉట్లకు పండులు కాస్తాయా అమ్మా. జయంజయం యశోద మీ అబ్బాయికి పొడవైన కర్రలతో వుట్లను కొట్టే నల్లవాడె. గోపబాలులతో కలిసి వీధిలో తిరిగే నల్లవాడిని మోసముతో పెంచావమ్మా. ఇంట్లోవారు ఉండగానే ఇళ్ళలోకి దూరిన వాడి నేర్పరితనము ఇవి మీకు తగునామ్మా. వెంబడించి పట్టుకొంటే రహస్యముగా తప్పించుకుంటాడు. తెనేలూరే ముఖము కల వాడిని చూడవమ్మా. కాదుకూడదన్న బోతే కౌగిలించుకుని వెళ్లతాడు.  అదే ధ్యాసతో ఇలా నవ్వులవునమ్మా. సరసమాడిన శ్రీవేంకటాద్రికే సాధ్యము. ఈ విధముగా మమ్మల్ని కలిసినాడు ఏమి చెప్పేమమ్మ ఈతని గురించి అంటు అన్నమయ్య కీర్తించాడు.

105..శ్రీ అన్నమాచార్య సంకీర్తన

రేకు రాగము: నాగవరాళి

విన్నవించి రమ్మనెను వెలఁది నీతో మమ్ము

వున్న దదే సిగ్గుతో నీ వొద్దనే సుమ్మీ!!

॥పల్లవి॥

చుక్కబొట్టు వెట్టుకొని సుదతి నీ పాదాలకు

మొక్కి యంటించెను తన ముద్రగాను

నిక్కముగఁ జూచుకో నీవు దనవాఁడవని

యిక్కువ గానుఁ బెట్టిన ఇదె గుఱి సుమ్మీ!!

॥విన్న॥

కొప్పు విరులు రాలఁగ కొమ్మ నీ తోడఁ బెనఁగి

చొప్పు వేసె నీవు దన సొమ్ముగాను

ముప్పిరి నెంచుకో నిన్ను ముందే తాఁ గైకొంటినని

చెప్పి చూపి పెట్టిన లచ్చెనలు సుమ్మీ!!

॥విన్న॥

అలమేలుమంగ నీ యక్కుమీఁద నేపొద్దు

నెలకొనీఁ దన కదే నెలవు గాను

యెలమి శ్రీ వేంకటేశ యీకె నీ మేనికి

సలిగెతో వలపుల శాసనము సుమ్మీ!!

॥విన్న॥

***

భావం :-

 మమ్మల్ని నీతో మనవి చేసి రమ్మంది ఆమె కానీ ఉన్నది అదే సిగ్గుతో నీ దగ్గరే సుమా. అందమైన పలువరుసగలది చుక్కబొట్టు పెట్టుకొని నీ పాదాలకు మొక్కి తన ముద్రగా నీకు అంటించింది.

నిశ్చయముగా చూచుకో నీవు తనవాడివని సూచనగా పెట్టిన గుర్తు ఇదే సుమా. తల వెంట్రుకల ముడి విడిపోగా ఆమె నీతో కలిసింది. తన సొమ్ముగా నీవు వేసిన బాటను పెనవేసుకొని నిన్ను ముందే తాను పొందానని చెప్పి చూపెట్టిన లక్షణములు ఇవే సుమా.

 అలమేల్మంగ నీ హృదయము మీద ఏ కాలములో స్ధిరపడినదో అదే తన స్ధానము కాగా సంతోషముగా శ్రీవేంకటేశ ఈమె నీ శరీరముపై చనువుతో వలపుల ఆజ్ఞను జారీచేసింది సుమా అంటు అన్నమయ్య కీర్తించాడు

***

104 *🧘‍♂️శ్రీ అన్నమయ్య సంకీర్తన🧘‍♀️*


ఎదుటనున్నాడు వీడె ఈ బాలుడు

మదిదెలియా మమ్మా ఏమరునో గాని !!


పరమ పురుషుడట పసుల గాచెనట

సరవులెంచిన వినా సంగతా యిది

హరియేతానట ముద్దులందరికి జేసెనట

యిరవాయ నమ్మ సుద్దులేట్టివోగాని!!


వేదాల కోడయడట వెన్నలు దొంగిలెనట

నాదించి విన్నవారికి నమ్మికాయిది

ఆదిమూల మితడట ఆడికెల చాతలట

కాదమ్మ యీ సుద్దులు ఎట్టి కథలో గాని!!


అల బ్రహ్మ తండ్రియట యశోదకు బిడ్డడట

కొలదొకరికి చెప్పా కూడునా యిది

తెలిపి శ్రీ వేంకటాద్రి దేవుడై నిలిచెనట

కలదమ్మ తనకెంతో కరుణో గాని!!


ఎదుటనున్నాడు వీడె ఈ బాలుడు

మదిదెలియా మమ్మా ఏమరునోగాని

ఎదుటనున్నాడు వీడె!!

***

 శ్రీ శ్రీనివాస గానామృతం


ll పల్లవి ll


నిను గాంచినవారు ధన్యులూ శ్రీరమణా

నీవువినా లేరు అన్యులు ఏ యుగమునా

నిను గాంచినవారు ధన్యులూ

నినువినలేరన్యులు

నీవే ప్రతి అణువణువునా

నిను మారువను నా మనమున!!

ll నినుగాంచిన ll


ll 1చరణం ll

ఆదికే అనాది నీవయా అంబుదిశయనా

సువిశాల హృదయుడవయ్యా సుందరవదనా

మమ్మేలగ వచ్చినావయా ఈ జగమునా

వేంకటేశ్వరుడవైనావు కలియుగమునా

మమ్మేలగ వచ్చినావు వేంకటేశుడైనావు 

నీసేవకే నా బ్రతుకూ అంకతమో నిరంజనా!!

ll నినుగాంచిన ll


ll 2చరణం ll

శతకోటి పుణ్యఫలములు నీ నామమునా

పాపములను బాపగరా రా వేగమునా

నిను చేరే దారిచూపరా ఓ సద్గుణా

కైవల్యా ప్రాప్తి నొసగరా ఓ నిర్గుణా

నిను చేరే దారిచూపు కైవల్యా ప్రాప్తి నొసగు 

నా స్వామిశ్రీనివాస దాసుని కావగ రావా

నాస్వామి శ్రీనివాసదాసుని కావగరావా!!


***

పల్లవి;-

****

సుప్రభాత కిరణంలా సత్యమేవ జయతే

సత్యమేవ జయతే 

మనిషి నిత్య భావమైతే

 మన మనస్థత్వం మహోదయమై

సమస్తం సర్వేజన సుఖినోభవంతై

మది మది సన్నిదై

మహానదిలా సాగును సమృద్ధి వైపుగా

సమున్నతమై నిలువమా ఆలయ శిఖరంలా మనమంతా..


సుప్రభాత కిరణమే సత్యమేవ జయతే

సత్యమేవ జయతే

మనిషి నిత్య భావమై(తే)

మన మనస్థత్వమే మహోదయమై

సమస్తం సర్వేజన సుఖినోభవంతై

చరాచరా జగతంతా సుభిక్షమైన  నవోదయమై

అవతరించదా....


చరణం:-1

****

 మనమనే సమ గీతం

సమ దృష్టికి సంకేతం

మనమనే సంకేతం

హృదయాలను ఉషస్సులతో

వెలుగై నింపునులే...


తమస్సును తొలచి 

జ్యోతి యై నిలుపునులే

అదే ఆనందమై విరబూయును

రవి కిరణంలా విశ్వమంతటా....

పల్లవి:-

***

సుప్రభాత కిరణమే సత్యమేవ జయతే

 సత్యమేవ జయతే మనిషి నిత్య భావమై

భాసిల్లగా

చరణం:-

****

అంతటా  మన భారతం సుసంపన్నమై

 అందరీలో మన కీర్తి విజయ కేతనమై  ఎగురదా

భూత భవిష్యత్ వర్తమాన మంతా అజేయమై

నిలువ గలం గెలువ గలం.


అనంత విశ్వం ఆనంద సందోహమై

అంతరాలను పటాపంచలు చేసే

సహజత్వం సహనత్వం చిగురించి

విరబూసి విరాజిల్లదా శాశ్వతమై

ధరిత్రి చరితా..

 

పల్లవి:-

***

సుప్రభాతమే సత్యమేవ జయతే

సత్యమేవ జయతే

మనిషి నిత్య భావమైతే

మనస్థత్వమే మహోదయమై

సమస్తం సర్వేజన సుఖినోభవంతై

 విరాజిల్లేనే విశ్వమంతటా...

చరణం:-

****

 నీ నా కరచాలనానికి తలదించదా కరవాలం

నీ నా ఆలింగనానికి పులకించదా  నవ భారతం

దూరం తొలగించేది ధర్మం ఒక్కటేరా

భారం కరిగించేది స్నేహ హస్తమేరా.


కడలి అయినా రవళి లా మారదా

ప్రేమతో  దరిచేరదా

రుధిరమైనా శాంతించదా  నమ్మకమే కలిగితే

బాదితులకు ఓదార్పే సగం ప్రాణం..


తగువులు ఎందుకు  మనలో

తెగువలు  చూపే సమయమా ఇది

 రేపు చూడగలమో లేదో తెలయని మనకెందుకు

 సంధియే  ప్రభంధం సమస్యలే సమసిపోతే...


సుప్రభాతమే సత్యమేవ జయతే

సత్యమేవ జయతే

 మనిషి నిత్య భావమైతే

మనస్థత్వమే మహోదయమై

సమస్తం సర్వేజన సుఖినోభవంతై

 విరాజిల్లదా విశ్వమంతా...

*******౮****


ll నినుగాంచిన ll


Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ