శ్రీ వేంకటేశ్వర శతకము

 

ऊँ ! " అస్మదాత్మీయవిద్వత్కవిబంధుస్నేహితులందరికి విజయదశమీపర్వ శుభాకాంక్షలు + శుభాశయాలు !!! "

చం ప్రగతికి నీవె యంకుర సువర్ణ పదాలగు వెల్లువే సుధీ
పగలును రాత్రి గంధములు భవ్యపరాత్పర లీలలున్ సదా
పగలను మార్చి బంధములు బంచ   ప్రకాశ ప్రభావమే మదిన్
మగసిరియర్ధ మోహములు మాన్య మనోమహి వేంకటేశ్వరా ..o01

పుట్టుక యర్థమే యిదియు పూజ్యుల   పల్కులు తెల్ప గల్గుటే
మట్టిని నమ్మియే మనము మానస నేస్తము నిచ్చి పుచ్చుటే
వట్టిగ మాట లేవలదు బంచుడి విద్యలు  జన్మ మెందుటన్
బుట్టుక సార్థకమ్మనగ పున్నమి వెన్నెల వేంకటేశ్వరా ..o02

ఉ.మ్రొక్కెద ఎల్లవేళలను మోక్షము కోరిక నాదు జన్మగా
దక్కిన విద్య పంచుటయు  దారిని చూపుట నాదు లక్ష్యమై
చిక్కిన ప్రేమ పాశమున చింతను చిక్కిన ధైర్య సంపదే
మక్కువతోడ నీదరికిమానక వచ్చెద వేంకటేశ్వరా..o03

ఉ. కాలము వెల్ల బుచ్చ కలి  కాలము వెంటన కాల మంతయున్
 గోలలు చేసి వెంటపడు గోప్యము లేకను బత్కు నంతయున్
 హేళణ జేయు మానసము హీనత మార్చని జీవితమ్మదే

 యేలె సతీ పతీ యన యెల్లరు మెచ్చగ వేంకటేశ్వరా.. O04

ఉ.ఆగదదేది నాది యని యాలన పాలన కొంత నేర్పుకే
వేగిర నున్న మానసము వీనులు విందుగ చింత మార్పుకే
 మాగిన పండుగా రుచియు మానస ప్రక్రియ సర్వ సృష్టికే
 మూగిన కామ చేష్టలను ముఖ్యము మార్చుము వేంకటేశ్వరా..005

ఉ. జీవిత సత్యమే పలుకు జీవన మార్గము నెంచలేక యే
 భావము తెల్ప నమ్మకము బాధ్యత నెంచియు సేవ చేయుటే
యేవిధి నైనచేయుటయు నేమియటన్ననవేమి చేయకే
దేవర మెచ్చునట్లు మన దేవల మందున వేంకటేశ్వరా..006

శాంతముకోరి నిన్నుమది చక్కని వాంఛను తెల్పి యుంటినే 
పంతము లేల నీకు మది పాలన లాలన పాఠమే కదా
పొంతన లేని మా పలుకు పోరుగ నేరుగ మీకు తెల్పగా
స్వాంతము చక్కదిద్దియను శాసన జేయుము వేంకటేశ్వరా..007

ఉం.ఖంగని శబ్ద ఘోషలగు ఖర్చుల కష్టములేలపెర్గెనే
చెంగని దూకబుద్దిమది చింతని తెల్చిన దొడ్డ బుద్ధిగా
ముంగిట వచ్చి మొక్కితియు ముందర లక్ష్యము తెల్పలేకయే
సంగతి యేది యైననిక సంతసముంచుము వేంకటేశ్వరా..008

ఉ.అచ్చట నిత్యకాంతులట అంబుజనాధుని కోరవచ్చెనే
ముచ్చట గొల్పు చూపులట బుద్ధి వికాసపు మార్గమందునే
ముచ్చట చూపు భక్తులగు ముందర మోక్షము కోరియుండుటే 
చెచ్చెర ధర్మపాలనను జే నయనాలగు వేంకటేశ్వరా..009 

ఉ.పాపము చేయువారు తమపాపము లన్నియు పంచగల్గుటే
ప్రాపితమైన కష్టమును ప్రాంజ లి తెల్పుచు వేడియుండిరే
మోపరి యైన వారిమది మోక్ష ము నిచ్చెడి బుద్ధి నీదయా
పాపమంచేయకుండ తగు బాటను చూపుము వేంకటేశ్వరా 010

స్త్రీ గతి నిర్విరామమగు లీలల గీతల బోధనేయగున్
స్త్రీ విధి సర్వ రక్షగసుధీర్గపు సత్యము తెల్పగల్గుటే
స్త్రీ మది నెంచలేరగుట శీఘ్రము బంధపు జ్ఞాననేతలై
స్త్రీ రమ జన్మ సాఫలత చిన్మయమౌధర  వేంకటేశ్వరా .011

చం. తడిపొడి బత్కునూరువిధి తాపము నమ్మియు తిండినేతినే
గడసరి వాని కోర్కెలగు కామిత బుద్ధికి యాశ తీర్చుటే
గొడవల మధ్య జీవితము గొప్పగ జూపియు కాంతి రూపమున్ 
పొడిచెను ప్రొద్దుటూరున,నభోమణి రాతిరి వేంకటేశ్వరా 012

ఉ. రూకలు కోరి నేదలచి రోయుచు నీ దరి చేరి యుంటినే
మూకలు భక్తులేయనిన మూలుగు చున్నను నాదు జన్మ  మీ
వాకిట సేవ చేసెదను వచ్చిన పైకము కుమ్మరింతునో
మీకడ ముక్తి చాలును సమీపము చూపులు వేంకటేశ్వరా..013

ఉ.సారము లేనిజీవనము సాధన నోచని భక్తి మార్గమున్
భారము బంధ మైననిక బాధ్యత వీడక ప్రస్తుతించెదన్
బేరములాడ లేనిదియు భీకర మైనను నాదు కొందువే 
కూరిమి కోరియుంటినయ గోగణపాలప  వేంకటేశ్వరా..014

ఉ.తెచ్చితి మొక్కులే ధనము తెచ్చితి పూలను పూజచేయగన్
మచ్చుకి కష్ట మైనమది మార్గము నీకును తెల్పగల్గుటన్
వచ్చితి నీదునామమును భక్తిగధ్యానము చేయుటందుకే 
ముచ్చట తీర్చుమయ్య హరి మోహనరూపుడ వేంకటేశ్వరా..015

 ఉ.ఉగ్రము మాని శాంతిగ,మ హోజ్వల కాంతియు మాకు బంచుమో
నిగ్రహ మే మనోమయవి నిత్యము మాయను మాలొ మార్చుమా 
యగ్రమహాను బావుడవు ఆధ్యము నాదరణే ను సత్యమై
జాగృతి నెంచి సేవలగు జాతర చేసెద వేంకటేశ్వరా..16

చం.క్రమముగ పూర్ణ బింబమయి కాలము మార్పుగ కూర్పు బట్టియే
విముకము నెంచ వీలవక వేగిర బంధము మార్చ నీడయై 
నిముషము నైన ప్రార్థనయు నెయ్యము వియ్యము బంధు వ ర్గమే
సముఖము నున్న వేడిగని సామ్యము సౌఖ్యము వేంకటేశ్వరా..17

నేనుగ నిన్ను కోరితిని నేస్తపు నీడయు నెల్లవేళలన్
మానుగ నైతి ఓర్పుగని మానస బుద్ధిని పంచగల్గితిన్
 వానిని వీని నేననను వాంఛలు నున్నను  కాల తీర్పుగన్
నానుడి గాలమై మనసు నాట్యము నిత్యము వేంకటేశ్వరా..18

కృత్యము కింత భీతి మది? కిమ్మని తోఁచదదేమి నీకు?నో
నిత్యము ప్రేమ నందు నొక నీడగ నుండుట, చెందెనేనియున్
సత్య వడంకదే? నభము సారము మ్రోయును వార్ధులింకవే?
ముత్యము సాప్త బింబము సు ముఖ్యము గానులె వేంకటేశ్వరా..19
చం..
మనువు మనస్సు శక్తిగను మార్గము భార్య సహాయ యుక్తి పై
చనువు సుఖమ్ము చూపులగు జాడ్యము ప్రేమయు బంధ మోక్షమై
యనువు పరమ్ము సంగమము నాశల వెల్లువ తృప్తి కాంక్ష యే
తనువు తపమ్ము మిత్రులగు తాపము తత్వము వేంకటేశ్వరా..20

ఏ నిధి దర్శనం బగుట నే మలుపే యగు జీవ చక్రమే
జ్ఞానము నమ్మకమ్మునగు సంతతు రూపము విద్యబోధయే
దీనుని కర్మలే జయము దీపపు వెల్గుల సేవ చేయుటే
సూనుని గాను నీకగును చోద్యము కాదయ వేంకటేశ్వరా. O21

చం.నిలకడ పల్కులే బలుకు నిందల నాపుటపాత్రధారి, యా
తలపులు తెల్పుటే కథల తంత్రము కాలము సాధనమ్ముగాఁ 
విలువలు  నిల్పుటే విషయ వింతలు నాటక మాడుబుద్ధిగా 
పొలతుక కోసమై జరిగె పోరులె నీదయ వేంకటేశ్వరా -022

ఉ.భారతి విద్యవాంఛలను భవ్యము సవ్యము నెంచగల్గినన్
దారుణ మైన నేస్తమగు ధైర్యము  స్ధైర్యము నిత్య సత్య మై 
తారును ముద్దు పెట్టుకొనె దార ముదంబున భర్తకాంచగన్.
సారము సర్వరక్షగుట సాధ్యము చేయుము వేంకటేశ్వరా.023

శాంతిని లేనిదౌ గతిని సాధన శోధన ప్రాణ సంకగన్
కాంతిగనూరిలో స్థితియు కానివి జోరుగ పోరుసల్పగన్
బ్రాంతిగదుస్థితిన్ సమయ భాగ్యము లేకయె దీనమార్గమన్ 
దొంతరగాను నిల్చితిని తోషము గూర్పవె వేంకటేశ్వరా,..024
***
ముక్తికి నొసంగువాడవని ముం గిట నుంటిని దారిచూపుమా
భక్తిగ కొల్చెదా పిలుపు పాలన కోసము వేచియుంటినే
శక్తియు సన్నగిల్లుటయు సాధనభక్తియు తగ్గిపోవుచున్
భక్తులు పొందవచ్చు నిజపాఠమునీదయ వేంకటేశ్వరా..25

 ఉ.నేనుగ నొక్కటొక్కటిగ నిర్మలభావము తెల్పగల్గితిన్
నేనుగ మక్కువెక్కువగ నిశ్చయలక్ష్యము ముందరుంచితిన్
నేనుగ తక్కువెక్కువగ చిత్తము నేకము చేసి కోరితిన్
నేనుగనొక్కసారి మది నీదయ కోరితి వేంకటేశ్వరా..26

 మన్నును నమ్మితే సుఖము మానస  మందున శోభసాగునో
మిన్నును చూచినా సుఖము మీదను కప్పుగ శాంతికూర్చగన్
కన్నులు దేహమందు సుఖ కామ్యపు చూపుకు శ్రేయమో యగున్
చెన్నగు వాక్కులే సుఖము చింతను దీర్చును వేంకటేశ్వరా..27

ఉ. ఏలనొ పెక్కుకష్టముల కెవ్వరు తీర్పులు నివ్వలేరు న 
మ్మాలి జయమ్ము గా తరణమానస పక్వము సర్వులందు నే
డేల యథేచ్ఛగా పలుకు హీనుల జీవిత మార్పులేవి నే
రాలకు మార్పు లేన్నటికి రావు మనోలయ వేంకటేశ్వరా..28

చం। ఇది యొక పిచ్చియే నిజముగా - హృదిలో నొక ప్రేమ నాదమే
బెదరుట యెందుకో జగతివే- బ్రియ మావిధి వ్రాయు వేదమే
నదివలె సాఁగు నా బ్రతుకునన్ నగవే యలలౌచు మ్రోఁయఁగా
ముదముల నావలో మధురమో - పులకింతము వేంకటేశ్వరా..29

చం। జననపు నామ మా మరణ శాశ్వతమందిది యొక్క చిత్రమే
ప్రణవపు నామమా స్మరణ - ప్రాభవమంచన లిప్తమాత్రమే
దిన మొక రాత్రిగా నగునుదివ్య దినమ్మది రాత్రి వీడఁగా
మనమున నెన్నియో తలఁపు మైమరపించును వేంకటేశ్వరా..30

ఉ.భక్తిని నమ్మలేననియు భౌతిక మార్పులవెన్నివచ్చినా
 రక్తిగ జీవనంబదియు రక్కసి యూహలు కమ్మి యున్న నీ
 శక్తిని చాటుచుండెడద సత్ఫరమైనను ముక్తి కోరి నీ
 భక్తికి దాసునౌ నటుల బాధ్యత నీదియె వేంకటేశ్వరా..31

ఉ.నా మది కాశభాష్యమగు నాణ్యత లేకయు నాటుపోటుగన్ 
 ఏమని చెప్పెదా మనసు నెల్లలు దాటిన కోర్కెలేయగున్ 
నీమమ తోడనే పనులు నిన్నును నమ్మెద భక్తిముక్తిగన్
 ఏమరపాటు చేసినను నీయవె మోక్షము వేంకటేశ్వరా..32

ఉ.హింసను చేయమూర్ఖుని న హింసను ధీటుగ చెప్పగల్గితీ
ధ్వంసము చేయు దుష్టుని న దారిని   మార్చెడి బుద్ధినివ్వుమా
వంశమ బట్టి నేనడకభాసిలి తప్పులు సంచరించి తా
భ్రంశము జెందకుండుతగు భారము నీదయ వేంకటేశ్వరా..33


ఉన్నది లేదనే యనుచు నూరక యన్నను సేవ భావమే 
విన్నది వెంటనే మనసు వేడ్కగ నామము నిత్య మౌనమే 
పిన్నతనంబటంచు మది ప్రీతిగ గొల్చెడి నిత్యసత్యమే
మన్నన కోరెడిన్ మనసు మార్గము నీదయు వేంకటేశ్వరా..34

తీపిని తిన్నమా పలుకు తీయగ నుండదు దుష్టబుద్దులై
యోపిక చూపకే యరుపు నొప్పియు తెచ్చెడి మాటలేయగున్
దాపున నున్నవారిని సుతారము చూడక బాధపెట్టుటన్
కాపుగ మార్చుమా మదిని కాలము తోడను వేంకటేశ్వరా..35

బాధ్యత వీడిమధ్యమున బానిస లై చరి యిoచువారులన్
 ఆద్యము బాధ్యతే మరచి హాస్యము లాడుచు జీవమేలయున్
సాధ్యము చేయకే కథలు సాగుచు తిర్గెడి వారు నుండుటన్
హృద్యపు వేదనే గనుక వృద్దిని జూపుము వేంకటేశ్వరా..36

మాటలు వాస్తవాలనుచు మాయలు జూపుచు మాన్య చోర న
మ్మేటుల సాహసమ్ము కళ మేలని చెప్పెది పొట్ట కూటి బొ
మ్మాటుల సత్యమే యనుచు మానస వత్తిడి రూక లిచ్చి య
మ్మా నిజమే ననే మనిషి మార్పులవేలను వేంకటేశ్వరా..37

సత్యమె పల్కుమెప్పుడును సాధన మార్గము  తెల్పగల్గియున్
నిత్యము నిష్ఠయే శుభము నీడయు మంచియు నెల్లవేళనన్
పైత్యము కోపమై విధిన పైకము చుట్టును నుండుటేలనో
పత్యము నుండకే బ్రతుకు పాఠము చర్చలు వేంకటేశ్వరా..38

 ధన్యత కోరుటే బ్రతుకు దారిగయైనది జీవితమ్ము సా
మాన్యత భావమే మలుపు మానస నేస్తము ప్రేమ జూప కా
రుణ్యత లక్ష్యమే ధరణి క్రూరత భావము మార్చ గల్గు ప్రా
ధాన్యత వల్లనే మనసు దారిన నుండును వేంకటేశ్వరా..39

ఉ. ఇంతి సుఖమ్ము కోరుటది యీప్సితమే మది చోరబుద్దిగన్
వంతుగ శిక్ష వేయు బంధము మానస భర్తనౌటచే
శాంతినికోరి బంధమగు సౌఖ్యము వల్లన ఇచ్చి పుచ్చుటే
బ్రాంతిని మార్చవా బ్రతుకు బానిస యేలను వేంకటేశ్వరా .. 40

సృష్టిగ దిక్కు నీకృపయు శేష్టిని చూపుట నీదుధర్మమే
దృష్టిగ మొహమాయలను దూ రము చేయుట నీదు లక్ష్యమే
పుష్టిగ తిండి నుంచుటయు పూర్తిగ కాలము నీదు సత్యమే
ముష్టిగ భక్తినామదియు మూలము నీదయ వేంకటేశ్వరా ..41

ఉ. నీదయ లక్ష్మియే మనసు నీడల ధైర్యము సర్వ మార్గమై 
నీదయ  శౌర్యమే జయము నిత్యము మానస సత్యమార్గమై 
నీదయ మోక్షమై కళలునేర్పుగ సాగెను దాత మార్గమే 
నీదయ ఙ్ఞానమై మదినినిండగ చూడుము వేంకటేశ్వరా..42

చం. బడిచదువేను పాఠము ప్రభావమునెంచ మదీయ లక్ష్యమే 
గుడి మనసౌను వందనము కోవిద నిత్యము సేవ భాగ్యమే 
వడివడిమాట పొందుటయు వైనము కాలము నేర్పు పాఠమే          
ముడిపడియాట విధ్యయగు ముఖ్యమదేలను వేంకటేశ్వరా..43

ఉ.మన్నన యేలయో మనసు మార్గము బ్రోవుము మంగళాకరా 
సన్నిధి చెప్పుమాటలను సామము నేస్తము మోహనాకరా   
యున్నది చెప్ప గల్గు పని యుత్తమ లక్ష్యము చూపుదేవరా
విన్నది తెల్ప గల్గువిధి వేదము బోధలు వేంకటేశ్వరా..44

ఉ. మారణ హోమకాలమగు మార్గము చూపని సృష్టిధర్మమే 
దారుణ మైన దుఃఖమది దాపరికమ్మగు సర్వకాలమై 
కారణ మేదియున్నను సకార్యము చేయుట నిర్ణయమ్మదే
భారము నీదియే సకల బంధము నిల్పుము వేంకటేశ్వరా..45

 ఉ. అక్షర సంపదౌ బ్రతుకు కాశయ సాధన సర్వ తృప్తిగా 
లక్షణమే మనో గతము లాహిరి జీవిత సాహితీ సుధీ 
శిక్షణ కాలమాయయగు స్త్రీ పురుషా విధి సామరస్యమే 
తక్షణ మార్పు కోరుటయు తల్లియు తండ్రియు నక్షయమ్ముగా..46

ఉ. పుస్తక పాఠమున్ గతియు పూజ్యుల భావము తెల్వ గల్గగన్
మస్తక మాయయే గతియు మానస బుద్ధియు దొర్లుచుండగన్
 విస్తరి యున్న యాశలకు వీనుల విందుకు పొర్లు నాటగన్
జాస్తియు ప్రేమపాఠములు జాతర మార్చుము వేంకటేశ్వరా..47

చం.అగణితమైన బంధము సగమ్య సహాయ చరిత్ర యేసుధీ
జిగిబిగి గాను నున్నను సగీతను తెల్పుట నిత్య సత్యమే
దిగులుగనున్న కష్టమును దెల్పక యుండుట విద్య మార్గమే
సొగసుల కేను చిక్కితని సొమ్ముల నేస్తముగాను వేంకటేశ్వరా..48

 చం.దినకరుడాయె నిత్యము సుదీర్ఘపు దృష్టి భవమ్ము గల్గి యా
వినయపరాత్పరా మదియు వీ నులవిందు గనే పగల్లు న 
య్యనుదిన మా జపమ్ము గని యన్నియు తీర్చగ భాగ్యమే విదీ 
పనిగొని నిత్య మానవయుపాధిని కల్పన  వేంకటేశ్వరా..49

ఉ.అంబకు తోడునీడగసదా శయలక్ష్యము తీర్చగల్గియున్ 
డంబర లీలలే కళల టస్ఫుట వెల్లువ భూషణమ్ము భా
వంబర వీధి చూపుల విహారి మనోభవ ధర్మ మార్గ దీ 
పంబగు నిత్య సత్యపు విపంచిగ రక్షణ వేంకటేశ్వరా..50

ఉ.కన్నులు మాయతొల్గెను సకార్యము నందున దైవ నిర్ణయ
స్సన్నిధి అంబరాన కళ సాగెను వెన్నెల మధ్యరూపమున్
వెన్నెల మారుటే గ్రహణ వీక్షణ సంబ్రమ తొల్గిపోవగన్
మన్నిక దేహతాపమది మానస మందిర వేంకటేశ్వరా..51

ఉ. చిత్రము దైవలీలగను చిన్మయ రూపము నాది పుణ్యమై
పత్రము పుష్పమై మనసు పాలన సారము దీర్ఘ పూజ్యమై
సూత్రము నీ దయా హృదయ నూకలు కోరియు ప్రార్ధనే విధిన్
నేత్రపు సకష్టిలో కళలు నేర్పెడి విద్యగ వేంకటేశ్వరా..52

ఉ.చల్లన మంచిగంధమగు చిత్ర వి చిత్రము గానునుండుటే
చల్లన చంద్ర హాయిగను చల్లన గంధము కంటెనెక్కువే
చల్లన సజ్జనా పలుకు చల్లగ చంద్రుని కంటెనెక్కువే
చల్లని నీడశాంతిగతి చక్కని రూపము వేంకటేశ్వరా..53

ఉ.వచ్చెను వర్షమై పుడమి వాకిలి తీర్చియునాశ చూపులై
 మచ్చిక మేఘమైచినుకు మానవయాశలు తీర్చగల్గుటే
విచ్చిన పువ్వుకర్షక సవిధ్యయు చూపుట సంపదేయగన్
నచ్చియు నాడిపాడిరి సనాట్యము నీదయ వేంకటేశ్వరా..54

ఉ.  సంతసమగ్నిగా సమయ స్వాగతమేయగు నిత్య మాటలై
మంతనమాసనమ్మగును మానస మింద్రుడు మంగళమ్ముధు
మంతము తల్లిదండ్రుల సమార్ధ్యము దేవత సేవ పూజ్యతే
సంతస పూజ పుష్ప మగు సల్పగ  భాగ్యము వేంకటేశ్వరా..55

ఉ.ప్రాచ్యఁపు విద్యయే విధిగ ప్రాభవమే మది భక్తి తత్త్వమే 
వాచ్యము నర్చఁజేయ్దుకళ భాగ్యము బంధము సర్వ రక్షనే 
రుచ్యమనోవిధీ పలుకు రూఢిగ సఖ్యత సవ్య మవ్వుటే 
శోచ్యమ దేవ దేవ యిది శోకము మార్చుము వేంకటేశ్వరా..56

ఉ. ధర్మము సర్వతృప్తియగు ధార్మిక లక్ష్యము శ్రావ్య విద్యగా 
మర్మము తావులేని దగు మానవ పంతము తధ్య మధ్యమై 
కర్మలు చేయనిత్యమగు కాలము బట్టియు ముందు వెన్కగా 
పేర్మిగ రాజ్యమేయిదియు  వేదము వల్లన వేంకటేశ్వరా..57

 ఉ.చిత్రము దైవలీలగను చిన్మయ రూపము నాది పుణ్యమై
పత్రము పుష్పమై మనసు పాలన సారము దీర్ఘ పూజ్యమై
సూత్రము నీ దయా హృదయ సూక్తము కోరియు ప్రార్ధనే విధీ
నేత్రపు సృష్టిలో కళలు నేర్పెడి విద్యగ వేంకటేశ్వరా..58

 ఉ.చల్లని మంచిగంధమగు చక్కగవేడ్కగ గానునుండుటే
చల్లన చంద్ర హాయిగను చల్లన గంధము కంటెనెక్కువే
చల్లన సజ్జనా పలుకు చల్లగ చంద్రుని కంటెనెక్కువే
చల్లని నీడశాంతిగతి చక్కని రూపము వేంకటేశ్వరా..59

ఉ. చీకటి వేళ బత్కుగతి చింతయు చిత్రము సంపదేయగున్ 
వాకిలు వాకిలిన్ దిరిగి వాసన కుక్కల కష్ట మేయగున్ 
చాకిరి తప్పనీ పడతి జాస్తిగ సౌఖ్యము పొందలేకయున్ 
వేకువజామునందు శ్రుతిపేయమగున్ గద వేంకటేశ్వరా..60

ఉll పయ్యెద జక్కనొత్తుచును భౄలత ద్రిప్పుచు రెప్పలార్పుచున్,
చయ్యన దానవాళికటు సారెకుమోహములుప్పతిల్లగా
నెయ్యము జూపి యాసుధను నేర్పున మోహినివై,సురాళికిన్,
అయ్యడబోసి తీవెకద యార్తజనావన వేంకటేశ్వరా! .. 61

ఉll ధారుణి చాపకైవడిని తద్దయు జుట్టియు నబ్ది డాగు యా
క్రూరుని హేమనేత్రు వడికోరల జీల్చియు పుథ్వి నెల్ల పెం,
పారెడి శృంగమందు తగ భద్రత లాంఛనమై రహింపగా,
ధీర వరాహ రూపమున దీప్తిజెలంగవె వేంకటేశ్వరా! .. 62

 చంll హరిగిరి యెక్కడంచు కనకాక్షుని యన్న కుమారు నుద్ధతిన్,
కరకర పండ్లుగీటి యడుగన్ సకలంబున నుండు నన్న యా,
చిరుతని గావ కంబమున శ్రీనరకేసరివై జనించి నీ,
నరయుగ యూరులన్ బొదివి వానిని జీల్పవె వేంకటేశ్వరా .. 63

ఉll కూరిమి గుజ్జువై బలిని గొంకక నిద్ధర మూడడుంగులన్,
నేరుపుతోడ వేడి తగ నీ చరణద్వయి భూనభంబులన్,
ధీరత గొల్చి మూడవ పదిన్, బలిశీర్షముద్రొక్కివేడ్క పా,
కారి కొసంగవే సిరుల కామిత దాయిక వేంకటేశ్వరా! .. 64

 ఉll విందును యారగించి కృపవీడియు తండ్రిని ద్రుంచినట్టి యా,
మందుని కార్తవీర్యు దునుమాడియు కక్షను రాజులందరన్,
మ్రందగ జేసి వారి రుధిరంబును తండ్రికి తర్పణంబుగా,
క్రదిల జేయవే పరశురాముడవౌచును వేంకటేశ్వరా! .. 65 

 ఉll ఈ ధరగావగా ధశరథేసుని పుత్రుడవై జనించి యా,
గాధి తనూజు యాగమును గాచి యహల్య బ్రోచి యం
త గంగాధరు విల్లుద్రుంచి జనకాత్మను చట్టనుబట్టి లీల లం,
కాధిపు ద్రుంచి రాఘవుడవై విలసిల్లవె వేంకటేశ్వరా! .. 66

ఉll దేవకి గర్భమందునను దీప్తిజనించియు నందు పల్లెలో‌,
నీవల పూతనాదులను నేర్పున ద్రుంచియు వేణువూది బృం,
దావని రాసమున్ సలిపి తద్దయు రాముని గూడి కంసునిన్,
లావున ద్రుంపవే సొరిది కృష్ణుడవౌచును వేంకటేశ్వరా! .. 67

ఉllధారుణి జంతుహింసలను త్రాగుడు లౌచును ధర్మమొల్లకన్,
జారులు చోరులై మరియు సత్యము వీడియు బొంకులాడుచున్
దూఱుల బల్కుచున్ ప్రజలు దుర్మతులై చెడిపోవ బుద్ధుడై,
బోరన బుద్దులను గరపిబ్రోవవె వారల వేంకటేశ్వరా!  ..68

చంll ధరణిని యొంటి పాదమున ధర్మువు నిల్చియు నుండునంతలో,
నరయగ నద్దియున్ కలియుగాంత్యములో నశియింప ధర్మమున్, 
వరుసగ నాల్గు పాదముల వారక నిల్పగ కల్కిమూర్తివై 
సరగున దుష్టులన్ దునిమి సాధుల బ్రోవవె వేంకటేశ్వరా! 69

ఉll వాసిగ శౌనకాది మునివర్యులు యజ్ఞ ఫలంబు నందగా,
వాసితమైన సత్వగుణ భాసితు డెవ్వడొ దెల్పనా భృగున్,
థీసము నంప రుద్రుని విధిన్ పరిశోధనసల్పి యొల్లకన్,
రోసి వికుంఠ మేగి నిను రూఢిని గాంచడె వేంకటేశ్వరా! .. 70

ఉll అంతట లక్ష్మి తో సరసమాడెడి నిన్ గని క్రోధనేత్రుడై,
చింతిలి నీ యురం బవియజెచ్చెర దన్నిన లక్ష్మి యల్గి నీ,
చెంతను బాసినన్ మునికి చిత్రముగా పదసేవ సల్పుచున్,
పొంతన పాద నేత్రమును పూనిక నొత్తవె వేంకటేశ్వరా! .. 71

చంll మునికటు గర్వమెల్లదిగి మోకరిలంగను మ్రొక్కి శాంతుడై,
అనుపమ సత్వమూర్తి నమరావళి లోపల నీవెగా హరీ!
నినువలె బోలు దైవమిల నెచ్చటలేరు హవిస్సునందగా,
మునుకొని నీకె జెల్లునని మున్ ముని యేగడె వేంకటేశ్వరా!  ..72

ఉll ఆపయి లక్ష్మి కై వెదకి 'హా'యని యార్తరవంబు దోప సం,
తాపము మీరగా పరము దప్పియు భూమికి వచ్చి కానలన్,
తోపక గ్రుమ్మరన్ సిరియు దుఃఖిత యౌచును నీకునై మదిన్,
దీపితమౌ నుపాయమును తేకువ నెంచరె వేంకటేశ్వరా! .. 73

ఉll ధాతయు గోవునై హరుడు తద్దయు వత్సమునై చెలం గగా,
ప్రీతిని గొల్లభామగను శ్రీవిలసిల్లియు చోళరాజుయెం,
తేతనివార గోసరళి దెల్పగమెచ్చియు రాజు వేడ్కమై,
యాతని మందలన్ గలప యావు చరింపదె వేంకటేశ్వరా! .. 74

ఉll ఎండకు వానకున్ దడిసి యేర్చిన నెమ్మది వృక్ష మూల మం,
దుండెడు పుట్టలో విథిని దూరుచు వాసము చేయుచు న్నెదన్,
దండిగ క్షుత్పిపాసలకు తాళక నీవును క్లేశమొందగా,
అండగ నిల్చెగా సిరియు నయ్యెడ కానక వేంకటేశ్వరా! .. 75

ఉll కానకు నేగి యాపసుల కాపరి కందక క్రొత్తగోవు దా,
మానుగ నీదు పుట్టకడ మానక నిత్యము పర్వుపర్వునన్,
తాను పొదుంగు పాల్ గురిసి తాలిమి నీదగు క్షుత్తు బాపుచున్,
ధేనువు లందు చేరుకొని దీప్తి చరింపదె వేంకటేశ్వరా! .. 76

చంll ప్రతిదిన మెన్న యావుకడ పాలను గానక రాణి,
కాపరిన్, కతమెరుగంగ నోపునన కారణమేమి యటంచు నిత్యమున్,
జతగొని మేయుచుండు పసుసంతతి నంచని వాడు దెల్పగా,
చతురత మంతనంబున విచారము సేయడె వేంకటేశ్వరా!  ..77

చంll పసరము వెంటనంటి యెక వాసరమందున గొల్లడేగగా,
కసిమసి పుట్టజేరి నిను కమ్మని పాలను త్రాపుచుండగా,
పసువును యల్గి గొడ్డలిని బట్టియుమోదిన దెబ్బ గాటమై,
విసురున నీ తలన్ దగుల వేదన జెందవె వేంకటేశ్వరా! .. 78

చంllశిరమున గారు రక్తమును చిక్కగబట్టి కరంబుతో నినున్,
దురమున గొట్టినట్టి యలదుష్టుని భూతముగా శపించినన్,
కరములు మోడ్చి వాడడలి కావవె శాపము ద్రిప్పియన్న నా,
వరవుడవౌచు వుందువని వానిని యేలవె వేంకటేశ్వరా! ..79

చంll శ్రమమని దోచి యానెలవు చెయ్యన బాసి వరాహమూర్తి యా,
శ్రమమును జేరి స్వామిని ధరన్ యెక కొంత వసింపవేడి నే,
మమున వసింప యావకుళమాత యనుగ్రహమూని మాతయై,
కొమరునిగానినున్ తలచి కూరిమి బెంపదె వేంకటేశ్వరా! .. 80

చంll మును వనమాలికాంశ ముదమొప్ప యశోద కళన్ విరాజిలన్,
మనియెడి యీమె దా వకుళమాలిక గాగను కృష్ణు తేజమున్,
కనుగొన నీవవై చెలగు కారణ మౌటను నీకు తల్లియై,
చనువుగ నొప్పుచుండెకద సాధుజనావన వేంకటేశ్వరా! .. 81

చంll ఒకదినమందు వేట తమినొప్పుగ తల్లిని వేడికానలో,
మెకముల వేట సల్పి కడు మేనును డస్సి పిపాసచెంది చే,
రిక గల పూవుతోట గని లీలను జొచ్చి కొలంకు జేరు నిన్,
చకితయు నౌచు రాకొమరి చెయ్యన జూడదె వేంకటేశ్వరా!  ..82

ఉll ఆమని యాదినంబునను నంగజ పూజలు సల్ప నెచ్చెలీ,
స్తోమము గొల్వ రాకొమరి సోయగ మొప్పగ పుష్పతోటకున్,
నేమముతోడ వచ్చి మది నీప్సిత మేర్పడ నుత్సవంబులో,
కోమలి మున్గగా యెదను కూరిమి దోచవె.వేంకటేశ్వరా!  .. 83

ఉll నీవిరహంబు తాళకను నీరజ లోచన చోళపుత్రి యున్,
వావిరి చిల్కతో కబురు పంపియు తన్నును చెట్టబట్టగా,
భావముదెల్ప నీవిరళి బల్మరు యామెకు దెల్ప చిల్కచే,
భావజుడింపు మిమ్ములనుభద్రతగూర్చడె వేంకటేశ్వరా! .. 84

ఉll దేవమునీంద్రు పల్కువిని తేజముతో వకుళామతల్లి,
ప,ద్మావతి నీకు దేవి యగుమాడ్కి విచారముసల్పి ప్రేమతో,
దీవెనలిచ్చి ఛోళపురి దీప్తిని జేరగసోదెసానివై,
తావక వాక్యమందు భవితవ్యము దెల్పవె వేంకటేశ్వరా! .. 85

ఉll దేవతలందరున్ గలిసి తేజము మీరగ పెండ్లి పెద్దలై,
చేవ కుబేరుడర్థమిడ చెన్నువహించియు పెండ్లియై ధరన్,
నీవల పద్మతోడుత వినిర్మల ప్రేమము నొప్పగా వనిన్,
భావుకులై చరింప సిరిభామిని జూడదె వేంకటేశ్వరా!  .. 86

 చంll అలుక వహించి నీయెడల నార్తి సపత్నితొ కయ్యమాడగన్,
చెలుల వివాదమున్నుడుప చేతనుగాక కడింది కుందియున్,
శిలవగు చరిత నిల్వగను చేడెల చింతల వంతలన్నియున్,
చలమున బట్టి వందురుచు సాగిలి మ్రొక్కరె వేంకటేశ్వరా! .. 87

ఉll ఆ సురమౌని పల్కునను నర్చితులై శిలలౌచు
నొప్పగా, భాసుర శేషశైలమున భక్తజనావళి నేలుచున్
సదా, వాసిగ వడ్డికాసులను బట్టి శిరోజములందుచున్న
నీ,వాసము శ్రీనివాసమన వర్ధిలు చుండదె వేంకటేశ్వరా! ..88
 
ఉll కవ్వముగాగ మందరము కవ్వపు తాడల వాసుకై తగన్,
నివ్వటిలంగ క్షీరజలథిన్ సుధగోరి సురాసురల్ తమిన్,
మవ్వముగా మథింపగను మందర మబ్దిని మున్గ కూర్మమై,
నెవ్వగ మాన్పి వారలకు నీప్సిత మీయవె వేంకటేశ్వరా! .. 89

ఉll ధారుణి చాపకైవడిని తద్దయు జుట్టియు నబ్ది డాగు యా
క్రూరుని హేమనేత్రు వడికోరల జీల్చియు పుథ్వి నెల్ల పెం,
పారెడి శృంగమందు తగ భద్రత లాంఛనమై రహింపగా,
ధీర వరాహ రూపమున దీప్తిజెలంగవె వేంకటేశ్వరా! .. 90

ఉll పయ్యెద జక్కనొత్తుచును భౄలత ద్రిప్పుచు రెప్పలార్పుచున్,
చయ్యన దానవాళికటు సారెకుమోహములుప్పతిల్లగా
నెయ్యము జూపి యాసుధను నేర్పున మోహినివై,సురాళికిన్,
అయ్యడబోసి తీవెకద యార్తజనావన వేంకటేశ్వరా!  .. 91

ఉll చక్కసుషుప్తి జెందువిధి చక్కికినేగియు సోమకుండు మున్,
అక్కజమార వేదముల నల్లన మ్రుచ్చిలి యబ్దిడాగినన్,
చొక్కపు మీనమై జలధిజొచ్చియు రక్కసుద్రుంచి వేదముల్,
మక్కువదెచ్చి బ్రహ్మకును మానుగనీయవె వేంకటేశ్వరా! .. 92

ఉllగంగ కుజన్మభూమి శ్రితకాండము కెల్లను కల్పవాటి శ్రీ,
మంగకు కొంగుబంగరును మౌని హృదంబుజ షట్పదంబులున్,
సంగతులైన వారికిని సంసరణార్ణవ ముద్ధరింపగా
రంగగునావ నీపదములౌ గద శ్రీకర వేంకటేశ్వరా! .. 93

ఉll చక్కనివాడవంచు మరిచిక్కులు బెట్టె దవంచు యెందరో,
నిక్కముగాగ బల్కినను నెమ్మది యించుక నమ్మకేనియున్,
మక్కువ నమ్మియుంటి ననుమట్టుకు నేగతిబ్రోచెదో గదే,
చక్కని సామి నీదు పదసారస మేగతి వేంకటేశ్వరా! ..94

ఉll శ్రీరమణీ మనోరమణ శ్రీకరమౌని హృదబ్జ భృంగ శృం,
 గార గుణాన్వితా విమలకాంచన రత్న విభూషణా లస,
 ద్వారిద మంజులాంగ సురవందితకోటి మనోజరూప లా,
 క్షారుణ పాదపంకజ వృషాచలమందిర వేంకటేశ్వరా! .. 95

ఉll మక్కువ సప్తశైలముల మాటున దాగితి వేలకో గనన్,
మ్రొక్కులు దీర్చ వచ్చునెడ ముందుకు సాగగలేక భక్తులున్,
స్రుక్కుచునుండ నీకిదియ చూడ్కికి వేడుకయయ్య  నేవడిన్, 
చక్కగ నేలకున్ దిగియు చక్కికి రాగదె వేంకటేశ్వరా! .. 96

ఉllనీకును చెప్పెదా మనసు నేమియు చెప్పక చిత్ర మవ్వుటన్
ఆకలి కేకలే మనలొ ఆశలు పెర్గియు మంత్ర మవ్వుటన్ 
ఏకము అవ్వుటే ఎదలొ ఏలిక సాగుట తంత్ర మవ్వుటన్
వాకిలి తెర్చియే మనసు వాదము లన్నియు వేంకటేశ్వరా  97


చ. ముదమున కాటపట్టు, ధనమోహ మదద్విర దాంకుశంబు, సం  
   పదల కొటారు, కోరికల పంట, పరంబునకాది, వైరుల 
   న్నదల జయించు త్రోవ, విపదబ్ధికి నావ గదా సదా భవ 
  త్సడమల నామసంస్మరణ  కారణమే ! దయ వేంకటేశ్వరా !.. 98

ఉ. జీవన మింక బంకమున జిక్కిన మీను చలింప కెంతయున్
దావున నిల్చి జీవనమే తద్దయు గోరు విధంబు చొప్పడం
దావలమైన దాని గురితప్పని వాడు చరించు వాడయా
తావక భక్తి యోగమున కారణమే దయ వేంకటేశ్వరా .. 99

చ. హరిపద భక్తి నింద్రియజయాన్వితుడుత్తముంద్రియంబులన్ 
 మరుగక నిల్వ నుదినను మధ్యము, దింద్రియ పారవష్యుడై 
   పరగినచో నికృష్టుడని పల్కగా, దుర్మతి నైన నన్ను ణా 
    దారమున నెట్లు కాచేదవో! కారణ మీదయ వేంకటేశ్వరా .. 100   

చ.వనకరి చిక్కే మైనసకు, వాచవికిం జెడిపోయే మీను, దా 
    వినివికి జిక్కె జిల్వ, కనువేదురుజెందును లేళ్ళు; తావిలో 
 మనకి నశించే దేటి; తరమా యిరు మూటిని గెల్వ? నైదు సా 
    ధనముల నీవే కావడుగు కారణమే దయ వేంకటేశ్వరా .. 101

 ఉ. నీ మహనీయ తట్ట్వరస నిర్ణయ బోధ కధామృతబ్దిలో 
  డా మును గ్రుంకులాడక వృధా తను కష్టము జెంది మానవుం 
    డి మహిలోని తీర్ధముల నెల్ల మునిగిన దుర్వికార హృ 
    త్తమన వంకముల్ విడునే? కారణమే దయ వేంకటేశ్వరా .. 102

 ఉ.భానుడు తూర్పు నందు గనుపట్టినబావక చంద్ర తేజముల్
  హీనత జెందునట్లు జగదేక విరాజిత నీ పదమ్ముగా  
ధ్యానము సేయుచున్న బరదైన మారీచు లడంగ కుండునే? 
   దానవ గర్వ నిర్దళన కారణమే దయ వేంకటేశ్వరా .. 103

 ఉ.కాంచన వస్తు సంకలిత కల్మష మగ్నిపుటంబుబెట్టి నా 
     రించిన రీతి నాత్మ నిగిడించిన దుష్కర దుర్మలత్రయం 
     బంచిత భక్తియోగ దహనార్చి దగుల్పక పాయువే కన 
     త్కాంచన కుండలాభరణ! కారణమే దయ వేంకటేశ్వరా.. 104

 చ. దురిత లతానుసారి భవ దుఃఖ కదంబము రామనామ భీ 
      కరతర హేతిచే దెగి వికావికలై చనకుండ నేర్చునే? 
     దరికొని మండుచుండు శిఖి దార్కొనినన్ శలభాది కిటకో 
    త్కరము విలీనమై చందేకారణమే దయ వేంకటేశ్వరా .. 105

చ.  వరములుకోరి సమాన సుబంధ మే కలగన్ విధీ కళల్         
 చిర గరుడోరగ ప్రముఖ సంఘములో వెలుగన్ సదా భవత్ 
  స్పుర దరవింద పాదముల బూజ లోనర్చిన వారికెల్ల ద 
  త్పర మరచేత ధాత్రి గడ, కారణమే దయ వేంకటేశ్వరా ..106

చ.  కరుణ వినమ్ర సాధనలు కారణమ్ముగ మదీయ భావమే  
స్మరణ దనర్ప, వీనులను సత్కధలన్ వినుచుండ; నాస మీ 
యరుతను బెట్టు పూసరుళ కాసగోనన్, బరమాత్మ సాధనో 
త్కర మీది చేయవే క్రుపను కారణమే దయ వేంకటేశ్వరా.. 107

ఉ. అందిన ప్రేమపొంద మది నాశయ సాధన గార్యదీక్షగా
పొందిన తృప్తి నెంచకయు పోరును సల్పక జీవితమ్ముగా
వందన తత్వ మాయలగు వానల మల్లెను వచ్చు బంధువుల్
ముందు మనోభవమ్ము గతి ముఖ్యము సంతస వేంకటేశ్వరా..108 

ఉ. మోమునముద్దుమత్తగుచు మోహపు ముద్దగుచుండు ముద్దుగా
ప్రేమయు వద్దు వద్దనుచు ప్రీతి సుఘంధపు ముద్దు సద్దనే
మామిడి తీపి ముద్దు మది మంజుల దాహపుకైపు ముద్దుయే
ఆమని ఆశయమ్ముగను ఆత్రము జూపది వేంకటేశ్వరా .. 109

ఉ. ఇంతలు కన్నులుండ కళ ఇష్టమనో గతి పల్కరింపుగన్
పొంతన లేక కాంత కళ పోరు జవరాండ్రగ దారిచూపుటన్
వింతలు ఎన్ని అయ్యి నను వేరుగ వచ్చిన త్రోవ తెల్పుటన్
ఇంత భయంబులే కడుగ ఇప్సిత మైతిమి వేంకటేశ్వరా ..110

ఉ::ఆగుము రాక్షసా ఇపుడు ఆడుచు బాలుడు పట్టివేయునన్
వేగము దేనికో తెలుపు వచ్చిన వాడును కృష్ణుడే యగన్
యాగము కొచ్చియే భయమె యాతన కల్గుట సంభవమ్మునా
భాగ్యము కల్గుటే భయము బాధకు రక్కసి వేంకటేశ్వరా  .. 111

ఉ::దున్నలు తర్ముతూ మహిమ ధూపము ధర్మమే యగున్
చిన్నలు పెద్దలే కలసి  జూదము ఆడుట సత్యమే యగున్
విన్నవి చెప్పకే కలుగు వీపున పుండునె అందురేనటన్
అన్నలు దమ్ములింట గల యందరు దాతలు వేంకటేశ్వరా .. 112
ఉ. ఊడల మర్రిలాగ కళ ఉన్నత భావము తెల్గు భాషగా
వాడల విస్తరించుటయు వాసన బట్టియు తెల్పు భాషగా
మాడన వీధి దేవుడగు మానస భక్తిని నిల్పు భాషగా
పాడిన గీత భోదలగు పాశము వెల్గుల వేంకటేశ్వరా 
.....
పచ్చని చెట్టు కూల్చుటయు పాపమనే మది రాజకీయమై
నచ్చని వారి కీ డనుచు నమ్మక చేష్టలు ఓటు కోరుటే
చచ్చిన వారి కాలమును చెప్ప సహాయుము మింగ గల్గుటే
మెచ్చని మౌన హృధ్యమును మేపియు దోచుట వేంకటేశ్వరా 
.....
నెమ్మదిగాను శాంతి గను నీడను చేరియు గొప్పలు చెప్పకా
నమ్మిన వారి చెంత గను నానుడి మాటలు తెల్ప గుండగా
కమ్మిన కష్టనష్టములను కాలపు మార్పుగ నేంచినుండగా
కమ్మగ వేష భాష గను కామ్యత లక్ష్యము వేంకటేశ్వరా 
....
కడుపులు నిండు మాట కడు తీపి గనే సకలోత్స భావమే
కడుపులు మాడు మాట కడు చేదు గనే సమరోత్స భావమే
ముడుపులు పెట్టి చెప్పడి సమాన సహాయ సుఖమ్ము భావమే
తడిపొడి మాట దారి కడు కష్ట ముగా కళ వేంకటేశ్వరా 
....
అందము ఆరబోసి మది ఆత్రము తెల్పుతు చూడబుద్దిగా
చందన గంధమే యిదియు చేరుగనే పలికేటి మోహమై
అందని ద్రాక్షయే యిదియు ఆనతి కోరియు వచ్చి యుండుటన్
పొందుము సౌఖ్యమంత విధి పోరును వద్దును వేంకటేశ్వరా 
....
ప్రాణముయే మనోభవము ప్రాపక మేయగు మోహనమ్ముగా
వీనుల వేణి బంధమిది కీలక మార్గము విస్తరించుటే
మానస తృప్తి చెందగను మాలల పక్షులు చూడు నీడలై
కానన చిద్ర మే యిదియు కావడిగా సహవేంకటేశ్వరా 
.....
వాడెడి బుద్ధి కాలమిదియు వర్షపు నీరును వాడుటే ఇదీ
ఆడెడి ఆట చూడు మది ఆశల జల్లెడ నీరు తోడుటన్
తోడెడి లక్ష్యమే యిదియు తోడ్పడు మానస తిక్క పద్దతే
పాడెడి వారులేక తెలపే కథ నీదియు వేంకటేశ్వరా 
.....
చం.చిలుకల పల్కు లే బలుకు చింతయు మాపుట పాత్రధారి, యా
తలపులు తెల్పుటే కధల తంతయు కాలము సాధనమ్ముగాఁ 
విలువలు  నిల్పు టే విషయ వింతలు నాటక మాడుబుద్ధిగా 
పొలతుక కోసమై జరిగె బొబ్బిలి యుద్ధము వేంకటేశ్వరా 
......
భాద్యత తెల్పగల్గి సమభాద్యత పంచెడి తల్లి తండ్రులున్
ఉద్యమ లక్ష్యమై మనసు ఊహలు పంచెను సేవధర్మముల్
విద్యయు పొందిపంచుటయు కీర్తియు కాంక్షయు పొంది బత్కుటే 
సాధ్యము నిత్యసత్యమని సాధన చేయుట వేంకటేశ్వరా 
......
భారతి బంధమేను మన భాగ్య మనోహర విద్య కోర్కెయే 
ధారణ వాక్కు భావ మది దాశ్యము నిత్యము విద్య పోషనల్ 
సారము నేది చెప్పకయు సాధన చేయుట దైవమార్గమౌ 
భారము లేని జీవితము బాధ్యత  నీడన వేంకటేశ్వరా 

ఏడ్పు పుట్టుటే బతుకు ఏలననే మది బాధ తెల్పకే
తోడ్పడు బుద్ధి గాకలిగి పోరు విధానము నీల్పుటే విదీ
గాడ్పులు వేడిగా విసరగా సహకారము లేక సేవలై 
ఏడ్పులు సంతసమ్ము గలిగించు కమ్మని వేంకటేశ్వరా 
.....
సూర్యుని కాంతిగా కదిలె సూత్ర మనోహర ధారిశోభగన్
ఆర్యుని ఆశయమ్ము యిది అధ్యయ మార్గము సేవలిచ్చుటన్
కార్యములై సహాయమగు వ్యాప్తిగ పంచు మయూఖ రేఖలున్
సౌర్యుని ధర్మ నిర్ణయము సాహస లక్ష్యము వేంకటేశ్వరా
.....
జీవిత సామారస్యమిది జీవన గమ్యము కంద భావమై
జీవిత కాల నిర్ణయము గీత మనోహర గధ్య భావమై
జీవిత సేవ సాధనయు నీతిగ సత్యము నిత్య ధర్మమై
జీవిత లక్ష్య మైన మది నిర్మల మార్గము వేంకటేశ్వరా 
......
భాద్యత తెల్పగల్గి సమభాద్యత పంచెడి తల్లి తండ్రులున్
ఉద్యమ లక్ష్యమై మనసు ఊహలు పంచెను సేవధర్మముల్
విద్యయు పొందిపంచుటయు కీర్తియు కాంక్షయు పొంది బత్కుటే 
సాధ్యము నిత్యసత్యమని సాధన చేయుట వేంకటేశ్వరా



                         

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ