జగణం.. I U I ( ఒక గురువు రెండు లఘువులు )
పాఠము.. ప్రాంజలి.. (4) (తొమ్మిది అక్షరాలు ప్రాస అంత్యాను ప్రాస ఉండాలి )
ఉదాహరణలు::
1..నిరంతర మే మది సాగు
పరం తపమే విధి వేగు
భరించు విధానము రేగు
వరించి జయమ్మన కాగు
2..విశాల వినమ్రతగాను
ప్రశాంతి సుఖోన్నతగాను
అశోకము శోభను గాను
పాశముయు బంధముగాను
3..విధాన సహాయము గాను
నిదాన మదీ సుమ గాను
ప్రధాన జపమ్ములు గాను
సుధా మధుపమ్ముగ గాను
4..మురారి ముభావము యేల
విరోధి భవమ్ముగ యేల
సరాగము రాగము యేల
చిరాకుగ నుండుట యేల
5..స్థితీ మది పెంచుటయేను
ప్రతీ విధియాడుటయేను
సతీ సహనమ్ము గ యేను
పతీ సహ కారిగ యేను
6..ప్రభుత్వము సంతత తృప్తి
ప్రభుత్వము యంత్రము దీప్తి
ప్రభుత్వము మంత్రము జాస్తి
ప్రభుత్వము తంత్రము నాస్తి
7..స్వరాంజలి వాణి నినాద
విరాజిల్లు గాన ప్రమోద
తరాల మనో స్వర మేధ
నిరంతర మౌన సమేధ
8..రుచించదు విద్యగ సేవ
విచిత్ర సహాయము సేవ
సుచిత్ర సుమిత్రగ సేవ
రచించు సకామ్యము సేవ
9.. ఎ మైనను మాయల బుద్ధి
ఎ మూల ఎతీ రు న సిద్ధి
ఎ మౌన ఎ రోగ ము శుద్ధి
ఎ మార్పు ఎ తీర్పున బుద్ధి
సగణం.. I I U ( రెండు లఘువులు ఒక గురువు )
పాఠము.. ప్రాంజలి.. (2) (తొమ్మిది అక్షరాలు ప్రాస అంత్యాను ప్రాస ఉండాలి )
ఉదాహరణలు
1..కలలే నిజమోనముయే
పలుకే విధి మాయలుయే
పిలుపే మది పుత్తడియే
తలపే ఉపకారము యే
2...విధియాడెడి నాటకమే
నిధి కోరెడి జీవితమే
మది కోరిక కారణమే
వ్యధమూలము నమ్మకమే
3...కనులే కమనీయముగా
తనువే సుఖశాంతులుగా
అణువై విధి బాధలుగా
మనమై నిధి యాటలుగా
4..మనసాయె వరాలుగనే
క్షణమాయ సుఖాలు గనే
ఋణమే జవరాలుగనే
మనమై ఒకటవ్వటనే
5..అతి శోధనలే మదిగా
వ్యతిరేకముగా విడిగా
స్థితినే మరిచేదడిగా
గతినే తెలిపే మడిగా
6..అవకాశము యే గతిగా
అవమానము యే స్థితిగా
అవని శ్రమయే మదిగా
నవనాడులుగా విధిగా
7..తొలిసారిమనం కలిసే
మలి చూపులు లేకురిసే
బలిగా చెలిగా మురిసే
చలిగా తలపే తడిసే
8...నయనాల కళే శుభమై
పయనమ్ము కధే జయమై
వయసంత సుఖం పరమై
భయమే తొలగే విధమై
9...విలువైన సహాయముగా
తలవంచక జైత్రముగా
అలుపేయనకే పనిగా
తలమాణికమై విధిగా
తగణం.. UU I ( రెండు గురువులు ఒక లఘువుల )
ఉదాహరణలు
1..వచ్చింది పోయింది కాలమ్ము
నచ్చింది చేసింది పుణ్యమ్ము
మెచ్చింది ఒప్పింది మార్గమ్ము
చచ్చింది బాధల్ తొ నిత్యమ్ము
2..పంచాక సంపాదనే యేది
ముంచాక గంభీరతా యేది
లంచాలు పొందాక మేలే ది
కంచాన యన్నమ్ము గా ఏది
3..దాహమ్ము ద్రోహమ్ము మారేను
దేహమ్ము లక్ష్యమ్ము తీరేను
మోహమ్ము మౌనమ్ము కోరేను
స్వాహా మనో భవ్య పారేను
4..హేమంత మాసమ్ము మోక్షమ్ము
చామంతి పూబంతి వైనమ్ము
ఏమంత రాగమ్ము దీర్ఘమ్ము
సామంత రాజ్యమ్ము వైరమ్ము
5...ఒక్కొక్క మార్గమ్ము మారేను
ఒక్కొక్క లక్ష్యమ్ము తీరేను
ఒక్కొక్క రాష్టమ్ము కోరేను
ఒక్కొక్క దేశమ్ము కోరేను
6...ఏమన్న చెప్పాలి కావ్యమ్ము
రామన్న దూతేను భవ్యమ్ము
సోమన్న మాటేను తత్త్వమ్ము
భీమన్న మార్గమ్ము నిత్యమ్ము
7..ఎవ్వా ని సంగీత విన్నాక
నవ్వాపి ఆశ్చర్య పడ్డాక
కవ్వమ్ము చిల్కేను కన్నాక
సవ్వారి యయ్యేను విన్నాక
8.. కారుణ్య భావమ్ము కన్నాక
దారుడ్య ధైర్యమ్ము విన్నాక
ఆరోగ్య మర్మమ్ము మారాక
వైరాగ్య లక్ష్యమ్ము చేరాక
9..ఏమాయ చేసావు యిన్నాళ్ళు
ఏమూల నున్నావు చాన్నాళ్ళు
ఏమేమి చూసావు లోగిళ్ళు
ఏమైన మారావు కొన్నాళ్ళు
Comments
Post a Comment