మహిళా దినోత్సవ సందర్భముగా దేవీ కృపా అందరికీ చెందాలని "శివరాత్రి" నాడు గా పద్యాలు

రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ 


దిగంబరా శివా కపర్ది దివ్య తేజ శంభు మహా

యుఘందరా భవా మహర్ది యుజ్వలా సుశాంతి మహా

జగంబు లేలు నీలకంఠ జాగు రౌను కాంతి మహా

యుగంబు లన్ని యీశ్వరేచ్చ యున్నతీ మనస్సు దేవీ


నవీన దివ్యతేజ మాయ నాట్యమాడు నీదరిన్ గా

నవీణ భవ్యమార్గ శక్తి నమ్మకమ్ము నీదరిన్ గా

నివాసముండు మామదిన్ వినీల సంతసా ధరిన్ గా

భవాని శక్తి యుక్తిగా శుభాలు పంచెడిది దేవీ


భవాయ శంకరా శుభంగ దేవరా సుమంగళా ధరిన్ గా

శివాయ గొల్చెదన్ మనోవశీకరా నవాత్మ  యోగా  

శివాభ్యు వైభవమ్ముగాను శీఘ్రమే వినమ్ర యోగా

భవాని భాగ్యమే సమర్ధ బంధమే సుఖమ్ము దేవీ


నమస్కరించినమ్మ నన్ను  గాంచుమా మనస్సు గన్ నీ

సమాధనమ్ముగాను నేను సాధనే యశస్సు గన్ నీ

ప్రమాణ సేవలక్ష్యమేను ప్రాభవమ్ము గాను మౌనీ

సమాన వాక్కు దీక్ష ధక్ష సామరస్య నిష్ట దేవీ


వికాస మందునే సుభాంగి విశ్వమాయమార్చు టే స్వే

చ్ఛకోరుటే విధానపర్వ చక్రమై సమాజ సేవా

స్వకీర్తి పొందుటే ను బేల స్వర్ణమవ్వుటేను ప్రేమా 

ప్రకాశ లక్ష్యమై స్వకార్య ప్రాభ వమ్ము గాను దేవీ


ఫలాలు నిండుగాను పొందు ఫా లనేత్రునీ దయా పూ

జ్య లీల సేవభాగ్యమౌను జాతి నంతకూ కృపా స్ఫూ

ర్తి లీల కార్యసిద్దిగాను యిచ్ఛకోరు మంత్రమే సూ

త్రలీల సర్వ సృష్టి గాను తత్వ బోధ గాను దేవీ


స్వధర్మమే మనస్సు గాను సాధ్య సాధ్యమౌను ప్రేమా

విధానమే యశస్సు గాను విశ్వమాయగాను ప్రేమా

సుధామధూ సుకన్య గాను సూత్రప్రాయమౌను ప్రేమా

మదీవిశాలగమ్యమౌను మాట బట్టి సాగు దేవీ


కృపాకటాక్ష దీక్ష నివ్వ కాల నెంచదివ్య ప్రాప్తీ

ఉపాసనా వినమ్రమౌను యూహలే నిజమ్ము ప్రాప్తీ

నుపాయ మార్గమే జగాన నూకలై మదీయ ప్రాప్తీ

జపాతపమ్ముగానునెంచ జాగృతీ విధమ్ము దేవీ


హరీ హరా యనే మనుష్య హాయిగాను పూజ నెంచే

ధరీ కృతా మదీయ భావ ధర్మ నిష్ఠ గాను నెంచే

స్వరాగ మాలికా స్వబంధ సర్వ దృష్టి గాను నెంచే

పరాత్పరా కృపా కటాక్ష పందె మౌను యేల దేవీ


మురారి ! కేశవా ! హరీ ! రఘూత్తమా ! రమేశ ! హృద్యా 

సరోజ నేత్ర ! మాధవా ! చకార కుక్షి సన్నుతాంగా 

సురేశ వంద్య ! శ్రీపతీ ! సుధామ భక్త పూజితాంగా 

పరాత్పరా ! పరాంతపా ! ప్రణామి పార్థ నేత దేవీ


స్త్రీల యమాయకత్వముయె శీఘ్రము యున్నత తత్వ లక్ష్యమే

స్త్రీల సమ్మనతా భవము శీలము బట్టియు పొందు సౌఖ్యమే

స్త్రీలు గృహంగమే హృదయ చిన్మయ చూపులు ప్రేమ మోక్షమే

స్త్రీ లగు రాక్త మాంసముల బిడ్డల రూపమె వేంకటేశ్వరా


మానవ రక్షనే సహన మార్గము నెంచియు శాంతి దూతగా

దానవ హింస యాపగల ధాత్రిని బద్దత తెల్పు యుక్తిగా

జాన కి చిక్కి యోగమగు జాతికి సేవలు ధర్మ శక్తిగా

వానల గంధమే గతియు వాకిట కాంతులు వేంకటేశ్వరా


కళ్ళన నీరుదాగ మతి కానిది జూచిన బైట కొచ్చుటే

కాళ్ళన వేగసంపదగు కాలము మాదిరి తిర్గ గల్గుటే

వెళ్లకు పట్టు శక్తిగను విన్నది వ్రాయుట యుక్తి తెల్పుటే

వాళ్లకు వీళ్లుగా జతయు వాక్కుల నేస్తము వేంకటేశ్వరా


ధర్మము శాశ్వతంమ్మగుట దారిగ దానము దైవ చూపులే

మర్మము తెల్వ లేక విధి మాయకు చిక్కుట యేల కాలమో

కర్మ యనేది యున్న కలి కాల మహత్యము వెంటనుండుటే

శర్మగ చెప్పగల్గు మది శాంతము వివ్వుము వేంకటేశ్వరా


పాత్రగ విద్య నేర్పుకవి పాఠమె యవ్వుట నిత్యసత్యమే

మాత్రల లక్ష్యమే బతుకు మార్చమ నోమయ సత్య భావమే

సూత్రము ఎల్లవేళలగు సూచన ప్రాయము భావ తత్త్వమే

రాత్రులు సఖ్యతే పగలు రక్షణ సేవలు వేంకటేశ్వరా


లేనిది నైఖ్యభావమగు లేత తలంపుకు మొగ్గు చూపుటే

నైనది కాలనిర్ణయము నైతిక బాధ్యత లేక పోవుటే

కానిది సర్వులందు యెక కామ్యత లక్ష్యము కాని దవ్వుటే

మౌనము సర్భనాశనముమౌఖ్యము దాచెను వేంకటేశ్వరా


ప్రకృతి పాఠమే మనిషి పాలన లాలన వైనతీయమే

సుకృతి నీడలే విధియు సూత్రము యవ్వుట కాల నీతియే

వికృతి ప్రాభవమ్ము కలి విశ్వము నందున మాయ యాటలే

ఆకృతి దైవమే కనులు యాసలు తీర్చడి వేంకటేశ్వరా


అక్రమ పొత్తులే నసలె యాసలు రేపుచు యాట పట్టుగా

సక్రమ వారితో పడక సాటు కుతంత్రము చేయు పట్టుగా

విక్రమ వంతులే నడక వేగిర చెందక కుంటి పట్టుగా

చక్రము తిప్ప జాతి కళ జాగిలమేయగు వేంకటేశ్వరా


పార్వత మ్మ నిన్ను గొల్చు భక్తి తత్త్వమే నమశ్శివాయ

కార్య దక్ష తోడు నీడ కాల కంఠగా నమశ్శివాయ

సర్వ ధర్మ రక్ష గాను సంతసే మదీ నమశ్శివాయ

గర్వ మనచి దుఃఖ మాపు గమ్య లక్ష్య మై నమశ్శివాయ


పాపరాశి నంత తరిమె పాఠ్య మవ్వుటే నమశ్శివాయ

దీపకాంతి నంద జేయు దివ్యశక్తిగా నమశ్శివాయ

రూప మేర గొలువ కళలు పూజ్య మవ్వుటే నమశ్శివాయ

శాప మాపి రక్ష జేయు శాంతి దిక్కుగా నమశ్శివాయ


వీచె గాలి పూచె పువ్వు  వీలు గంధమే నమశ్శివాయ

చూచె మనసు కురిసె చినుకు చుక్క చిక్కులే నమశ్శివాయ

కాచె సొగసు మెరిసె మెరుపు కాల మార్పుయే నమశ్శివాయ

తూచె విలువ పెంచు తరువు తూక మవ్వుటే నమశ్శివాయ


అంబ తోడ కలసి బతుకు యర్ధ యీ శ్వరై నమశ్శివాయ

అంబ వరములిచ్చె భువికి వచ్చె  పరమశివ నమశ్శివాయ 

అంబ యున్ననాడె శక్తి మగని తోడుగా నమశ్శివాయ 

అంబ చేరు పూర్ణరూపు ఆశ చిన్న దే నమశ్శివాయ


గతము తెలపకమది కదులె కాన రాకయే నమశ్శివాయ

మతిని పనిగ చేయ తృప్తి మార్గ కళలగుట నమశ్శివాయ

గతియు తప్పు ఒప్పు లగుట కాల మార్పులే నమశ్శివాయ

యతిగప్రకృతితెలుపగలుగు యాటయిదియగుట నమశ్శివాయ


పెంచ తరువు పెరిగె మొక్క పిలుపు లవ్వుటే నమశ్శివాయ 

పంచ మమత వెలిగె చుక్క పాఠమవ్వుటే నమశ్శివాయ

మంచి చదువు ఒదిగె మనసు మాట తవ్వుటే నమశ్శివాయ

యెంచ బతుకు ఎదిగె వయసు యేరు యవ్వుటే నమశ్శివాయ


కలియుగమ్ము కష్టములగు కాల నిర్ణయం నమశ్శివాయ

బలియు సజ్జనా తెలివగు భక్తిని బలిమిన్ నమశ్శివాయ

దలత నామ మయిన విధిగ దాత గానులే నమశ్శివాయ

జలమునందుకూడ ఘనుడు జయము జూపుటే నమశ్శివాయ


 శుద్ధి లేక యున్న రోగి శోక మని నమశ్శివాయ 

వృద్ధి యందడెందు కొద్ది యైనమార్పుయే నమశ్శివాయ

బుద్ధి లేక యున్న నిత్య భోగి  శూన్యుడై నమశ్శివాయ

సిద్ధి పొందడెందు చిన్న సూరి యగు నమశ్శివాయ


పొద్దు నట్టి లేచి తెగువ పోరు విద్యగా నమశ్శివాయ

వద్దు నన్న పోర గాండ్ల వరుస గొచ్చె నే నమశ్శివాయ

సద్ది సంక గట్టి పత్ని సాగ నంపె యే నమశ్శివాయ

పద్దు చూసి సద్దు జేసి పాడి యావుయే నమశ్శివాయ


మనము యేకమే సత్యము మానమ్ము తెల్పుత నిత్యమ్ము కాదా

గుణము తెల్పగల్గే విధి గుర్తింపు లక్ష్యము గోప్యమ్ము కాదా

క్షణము తృప్తి సంతృప్తియు క్షేమమ్ము కాలము తత్త్వమ్ము కాదా

అణుకువా మదీ శోభయు యాశ్చర్య యాశ్రిత గాంధమ్ము దేవీ


పడతి మాటలే నిత్యము పాఠమ్ము నీడగు నేస్తమ్ము గానే

అడవి గుండెలే సత్యమనో శక్తి యాశయ సాధ్యమ్ము గానే

మడమ తిప్పకే మౌనము మాధుర్య    సేవల తత్త్వమ్ము గానే

అడుగులే విదీగమ్యము యాశ్చర్య కాలము ధర్మమ్ము దేవీ


అవధి లేనివిశ్వాసము ఆకాశ మంతయు ఔనత్య మౌనే

నవవిధాల ధీరత్వము నానంద విశ్వము సౌందర్య మౌనే

భవము భావనా తోరణ బాంధవ్య దీపము చైతన్య మౌనే

జవము అంతరంగమ్మగు జాధ్యమ్ము లక్ష్యము సర్వము దేవీ


గురువు బోధలే సర్వము గుర్తించు కాలము నేడున్ను కాదా

తరువు లాగబత్కేయగు  తాపమ్ము తీర్చెడి కాలమ్ము కాదా

తరుణమే సుఖమ్మై గతి తన్మాయి చిక్కుట కాలమ్ము కాదా

మరణ పుట్టుకే జీవము మమ్మేలు చున్నది కాలమ్ము దేవీ


మగువ చూపులై వెంటనె మాధుర్య భావముకల్పించు టేలా

తెగువ చేష్టలై చెంతకె తెల్పేటి సౌఖ్యపు మాటల్లు యేలా

తగువ చూపకే నవ్వులె తన్మాయ కళ్ళకు చిక్కేను యేలా

తగదు తొందరా యేలను తత్త్వమ్ము ప్రేమను యాకర్ష దేవీ


కులము యన్నదే సంస్కృతి గుర్తింపు యెప్పుడు మారేది కాదే

కులము నెంచ బుద్దే యనుకూలమ్ము నాటక మేనీతి కాదే 

కులము గొప్ప తెల్పేదియు గూడార్ధ భావము వేనోళ్లు కాదే 

కులము వృత్తిసేవామది గుమ్మమ్ము నిత్యము కాంతుల్లు దేవీ


మలిన సేవలే యేలను ముఖ్యమ్ము నేటికి యాశ్చర్య మౌతూ

కళలు వల్ల జీవమ్మగు కాలమ్ము తోడగు యాకర్ష మౌతూ

తలచు మాటలే బుద్దికి తోడ్పాటు రక్షణ జీవత్వ మౌతూ

మలము మూత్రమే మేనుకు మాత్రల్లె నుండుట సత్యమ్ము దేవీ


పదవి యన్నదే రోగము పాఠాలు చెప్పిన సంతృప్తి లేదే

పదవి మోహమే యోగము పాకాన చేరుట తప్పేది లేదే

పదవి ముప్పుయున్నా విధి పాశమ్ము నెంచుట తప్పేమి లేదే

పదవి నీడలే బాధ్యత పాదాలు పట్టుట యేమాయ దేవీ


గడప బయ్యటే నీళ్లను కర్తవ్య మాన్యులు నుంచుటే సేవా

కడుపు నింపుటే ధన్యుల కర్తవ్య మేయగు నిత్యమ్ము సేవా

ముడుపు కట్టుటే ముందర ముఖ్యమ్ము మౌనపు నేస్తమ్ము సేవా

అడుగు ధర్మమై సత్యము యాకాంక్ష  కాలము ధైర్యమ్ము దేవీ


భావమే మనోహరమ్ముగా బంధుత్వా సాహిత్య శోభన్

చేవ గల్గి రాగమాలలే చందంగా సంగీత శోభన్

తీవలై నటించు ప్రేమగన్ దీక్షంగా నీవమ్మ శోభన్

బ్రోవమా మదీయ భావమే బూజించే మార్గమ్ము దేవీ 


శాస్త్రమౌను జీవ మార్గమై సత్సంగం జ్ఞానంబు నీయన్

శాస్త్రియై సమాన సంఘమై సాఫల్యా సారంబు గ్రోలన్

భస్త్ర రీతి గోంచు చున్ విదీ వాగర్ధ్యా భావాల నేర్పున్ 

శాస్త్రభాతి జేయు యమ్మదీ సద్విధ్యా లొప్పార దేవీ


పుట్టినట్టు నాడి పట్టగా పూజ్యంమౌసర్వమ్ము దేవీ 

పట్టుబట్టి వేడి పుట్టగా  పాఠ్యమ్మౌ విశ్వమ్ము దేవీ

చేట్టుపుట్ట మానసంబుయే జీవంమౌ మూలమ్ము దేవీ

గట్టుచేర్చ గాడినుంచెడీ గమ్యమ్మౌ సౌఖ్యమ్ము దేవీ


ఆకారమ్ము సర్వసద్విధీ ధాత్రుత్వా జ్ఞానమ్ము లొందన్

భీకరమ్ము విద్య చీల్చగన్ పూర్ణత్వ సంప్రాప్త లొందన్

శీకరమ్ము పోలికన్ సుధీ శ్రీశక్తీ ప్రేమించి పంచున్

నీకరమ్ము శ్రీకరమ్ము గన్ నీ సాటే లేదమ్మ దేవీ


బధ్యముల్ సృజించ నెంచుటన్ పాఠ్యంబౌ స్నేహంబు నందున్

విద్యలన్ నెపొంద నీదయా విశ్వమ్మై పుణ్యంబు నందున్

వేద్యులౌ సు సంపదా సుదీ వేరీతున్ దక్కింపు పొందున్

జోధ్యమే వినమ్ర కాలమే జోతల్గా సంతృప్తి దేవీ


నీ పదాబ్జమున్ స్మరింపగన్ నిత్యంబౌ నుల్లంబు నందున్

బాప సంతసమ్ము చేరుటన్ భాసిల్లే పుణ్యంబు జూడన్

దాపముల్ చెకర్మ తప్పులున్ ధన్యంబౌ యీజన్మ నందున్

జూపు సత్ఫ దమ్ము వెల్గులన్ శోభల్లే నిత్యంబు దేవీ


వేదమాతగాను పుణ్యమై విద్యుత్తూ కల్గించులోకా

మోదమౌ సమర్ధ తీర్పుగన్ ముక్తిన్ గన్ చేయూత లోకా

బేధమేంచకే సహాయమున్ విద్యా విశ్వాసమ్మే లోకా

బాధ తత్త్వమున్ సమూలమున్ బంధవ్యం మార్చేటి దేవీ

...

సౌర్యమే విశాల సాహసం సత్యమ్ము ముత్యమ్ము గానే

కార్యమే వినోద రంగమై కాలమ్ము మౌనమ్ము గా నౌ

దార్యమే సమాన దేశమై దాస్యమ్ము యేశక్తి గానే

ధైర్యమే మనస్సు మార్గమై ధర్మమ్ము నిత్యమ్ము దేవీ


కంటి నీటి చుక్కలే విదీ  కారమ్ము పట్టా సరాగా

మింటి తాకు మత్తులై సుధీ మిధ్యా సమాధాన మేగా

వంటి వాలకమ్ము యే మదీ వాశ్చల్య భావమ్ము యేగా

చంటి పాప మల్లె చేష్టలే చైతన్య మే జూపు దేవీ


పాము నోటబడ్డ కప్పగా పాఠాలు యెన్నైన చెప్పా

సామ దానమన్న గొప్పగా సాక్ష్యాలు నార్జించి చెప్పా

కామ కౌగిలందు మత్తుగా కాలాన్ని మింగేసి చెప్పా

ఆమనే సకాల ధైర్యమే యానంద పొట్లాట దేవీ


దూషనౌనుజాల నయ్యగా దూరాన జూపౌమనస్సే 

భాషయేజయమ్ముగుర్తుగా భావమ్ము కుందాయశస్సే 

దోషిగాను నెంచియేవిదీ కోపమ్ము తాపా వయస్సే 

భూషణమ్ము నేలవయ్యగా ముఖ్యమ్ము మౌనమ్ము దేవీ


నవ్వుచిందె మోము భావనా నర్తించు వేదంబు లల్లెన్

జివ్వుమన్ మనస్సు పొంగులే జిత్తంబు చిన్మాయ లల్లెన్

గువ్వలై సహాయ సంతసం గుర్తించ శబ్దంబు లల్లెన్ 

సవ్వడించ కాల నిర్ణయం సంప్రీతి కల్పించు దేవీ


జ్ఞానదాత్రి పల్కు యీశ్వరీ సారస్య వారాశి వమ్మా

మౌనమౌ స్వరూప సుందరీ మా హేయి వై శక్తి నిమ్మా

ధ్యానమేను నిత్య మార్గమే ధన్యంబు నాజన్మ నమ్మా

కానమమ్మ నన్ను పూజ్యుల్ కావ్యార్ధ మే గొప్ప దేవీ


ధన్యవాదమౌను సేవలే దారిద్ర్య నీర్మూళ మార్గా

మాన్య హోదయేను కానుకా మాధుర్య నెత్రాల మార్గా

కన్య చూపులౌను దేహమై కాలమ్ము నీడల్లె మార్గా

జన్యు మార్పులౌను దాహమై జ్ఞానంబు పంచేది దేవీ


కృష్ణుడే మనంబు నుండగా కీడేమి లేకుండ వీలున్ 

కృష్ణ రూపమౌను గాంచినన్ దృప్తీ కణంగా సవీలున్ 

*కృష్ణ!* నీదు దివ్య రూపమే కృష్ణత్వ భావమ్ము వీలున్ 

కృష్ణుడై సహాయ లీలలే దృష్టత్వ ఛే దించి దేవీ


రామకృష్ణుని లీలల్ స్ఫూర్తీ రమ్యత్వ చేయూత శోభల్

శోమ లీలలు గానే స్ఫూర్తీ స్తోత్రమ్ము తో పూజ శోభల్

ప్రేమ రాగ మనస్సే స్ఫూర్తీ ప్రేమత్వ లక్ష్యమ్ము శోభల్ 

శ్యామ సుందర లీలే స్ఫూర్తీ సాధ్యాయ దీపమ్ము దేవీ


నా మనోగత శక్తీ  నీవే నాదంబు గానంబు నీవై

ప్రేమ రూపము యుక్తీ నీవే వేదార్ధ సారంబు నీవై

క్షేమమే యగు భక్తీ నీవే కీర్తింతు రూపంబు నీవై 

శ్రీ మయంబగు ముక్తీ నీవే శ్రీ శక్తి రూపంబు దేవీ


సర్వ జీవుల నాదమ్మేలే సంగీత సాహిత్య రాజ్ణీ

నిర్వ హించును లోకార్ధమ్మై నీ దృష్టి నీశక్తి రాజ్ణీ

సార్వ భౌముని సర్వార్ధమ్మే సంతోష సంతృప్తి రాజ్ణీ

పర్వమై సహ పాండిత్యమ్మే పాఠమ్ము పత్రాక్షి దేవీ


జ్ఞాన నేత్రము కల్పించే విజ్ఞానమ్ము పంచేటి ప్రేమా 

ధ్యానమేగతి సౌలభ్యమ్మే దానమ్ము చేసేటి ప్రేమా 

మానమే విధి మార్గంబేగా మానుష్య తత్త్వమ్ము ప్రేమా 

మౌనమే మది వాశ్చల్యమ్మే మోక్షమ్ము నిచ్చేటి దేవీ


శోభితా నన సిందూరా శ్రీస్తోత్రస్య మూల్యమ్ము నేత్రే

ప్రాభవమ్మగు సూర్యాధిత్యా ప్రాధాన్యతా శక్తి నేత్రే

వైభవమ్మగు చంద్రాదిత్యా వైఫల్య పూర్ణత్వ నేత్రే

లాభమే శుభ జీవంమౌనే లాలిత్వ భావమ్ము దేవీ


మానవుల్ కళ విశ్వాసమ్మే మాధుర్యమ్మే భూతళమ్మే

దానవుల్ కళ సూర్మార్గం మేధారూప  మ్మై లోకంబు కమ్మే

ప్రాణముల్ సహ వాశ్చల్యమ్మై ప్రావిన్యమ్మే సీతళమ్మే

మానమే విధి మౌనమ్మే సా మాన్యమ్ము మోదమ్ము దేవీ


రక్త  వర్ణము భక్తీ రక్తీ రమ్యత్వమ్మే స్వాహ తృప్తీ 

రక్షుడై గుణ దీక్షా దక్షా రౌరత్వమ్ము  ధణాఢ్య తృప్తీ 

భక్తులే కథ చెప్పేకామ్యమ్ బంధుత్వ బంధవ్య తృప్తీ 

భుక్తికే గతి దాంపత్యమ్మే ప్రోత్సాహ వైనమ్ము  దేవీ


ఈ ప్రపంచమె తెల్పే విద్యా యీశా మహేశా సువాక్కుల్

దాపముల్ నశియిమ్చే వేగన్ ధన్యంబు నాజన్మ వాక్కుల్

కోపమున్ వదిలించే వేగన్ క్రోదమ్ము మాపేటి వాక్కుల్

జూపు సత్పదమున్ తేజమ్మై శో భాళి నిత్యంబు దేవీ 


అమ్మ నీకృపతో మామార్పే ఆశ్చర్య కావ్యమ్ము లిచ్చెన్

కమ్మనౌ పదముల్ రాహించున్ కర్తవ్య లక్ష్యమ్ము తెల్పెన్

నెమ్మి కూర్చగనే తేజమ్మై  నీకే నమోవాక్కు నాకున్

రమ్ము నాకిడుగా వేగంధీరత్వమ్ము సంప్రీతి దేవీ 


ర స మ త  త గ గ యతి..10



Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ