తేటగీతి పద్యాలు

తేటగీతి పద్యాలు 



నేటి అమృత ఘడియాల తేటగీతి పద్యాలు

తే. ఇంట నున్నది వదిలేసి ఇష్ట మనుచు
బిక్ష కై తిరిగే వాడు, గీత చెప్ప
ఇంట గెలవ లేక సలహా ఇచ్చు వాడు
భార్యను సుఖ పెట్టక వెర్రి బాధ చూడు
.....
తే. తీర్ధమే తరింప గలుగు తీరు ముఖ్య 
దేహ మానసికమ్ము శుద్ధి దివ్య తేజ
న్యాయ ధర్మప్రవర్తన చక్క జేయ
దైవ సంకల్ప నిర్వహణ నియు తృప్తి
.......
తే. బాధ తేనె తుట్టెయగుట, భయము నింపి
బొంగరం తిర్గి నట్లునే, ఒరిగి పోయి
కరుణ లేని కాలమగుటే కన్న పేగు
చేయ లేక ఉండ నులేక చింత బ్రతుకు
......
తే. మాట గొప్ప చేతలు లేక మాయ చేయ
గోడ తగిలిన బంతిగా గోడు తెలిప
దారి తెలియని బ్రతుకని దీన పలుకు
మౌన హృదయ వాస్తవముయే మౌఖ్య మగుట
......
తే. చికిత మానవ మోక్షపు చక్ర గతియు
చెప్ప నలవికాని మతియు చింత స్థితియు
భయము వికసిత మగుతయే బంధ మందు
ఏది మంచి తెలిప మని ఎవరి నడగ
.......
తే. మనిషిగా నిలవాలన్న మనసు పంచు
మనిషిగా ఎదగాలన్న మమత పంచు
మనిషిగా కొన సాగాలి మంచి చెలిమి
మాటవిని నడుచుట మంచి మనిషి తెలివి
.....
తే. మౌని పరిమళం అశ్వాద మౌని దోషి
దొంగ పూలు కోసియు దోచె దొరగ బ్రతుకు
చిన్న మేధావి చేస్తేను పెద్ద తప్పు
నేడు దొరికితే నే దొంగ లేక దొరయు 
.......
తే. వేచి విసిగు వేసారితి వివర మేది
కాచి వడపోసి తెలిపినా కదలి కేది
నేటి తీరు మారక నుండు నీడ ఏది
చెప్ప నలవిలేని బ్రతుకు చింత ఇదియు
.......
తే. అనుభవాలు తడుముతుంది అభినయనము
కలతలు వలన నలిగెను కాపురమ్ము
తలపు వలపుచుట్టు తిరుగు తుంది నిజము
ప్రశ్న కలలు చెరుగు తుంది ప్రగతి కోరి
......
తే. మౌనము తపస్సు చింతన మౌఖ్య మవదు
అంత రంగాన్ని తెలిపేటి ఆశ యదియు
అర్ధ వంత మైనది మౌన ఆలక తీరు
మౌనమే ఆత్మ సాక్షాత్క  రౌను నిజము
.......
తే. పుటలు కదలిక చదువుయే పుస్తకమ్ము
కొత్త ఆలోచనలు పుట్టు కొలువు నందు
మెదడు పరుగులు విధిరాత మోపు అయిన
దేహ దారుధ్య మస్తకం దివ్య మగుట
......

నేటి అమృత ఘడియాల తగన  పద్యాలు

 

త. మాటైన చెప్పాలి మాయైన మోయ్యాలి

కూడైన చూపాలి కూల్చైన ఉంచాలి 

వేటైన ఉండాలి వేల్పైన చెయ్యాలి

తోడైన ఉండాలి తీటైన మార్చాలి

......

త. సన్యాస ఆరాధ్య  సాహిత్య మేదేది

విన్యాస తీర్ధమ్ము విశ్వాస మేదేది

అన్యాయ మాపేటి ఆహ్వాన మేదేది

తిన్మాయ తీర్చేటి తత్త్వమ్ము ఏదేది

......

త. ఏరోజు కారోజు ఏర్పాటు కాదేది

ఆరోహ మారోహ ఆర్భాట మేదేది

ఊరేను మారేను ఊహేను ఏదేది

చేరేను కోరేను చింతేల సేవేది

......


అదిగదిగో అక్కడా .... అటువస్తున్నాడు శ్రీహరి

తూర్పు వీధిలో సూర్యప్రభ వాహనం మీద వచ్చేది వాడే శ్రీహరి

సోమ వీధిలో చెంద్ర ప్రభ వాహనం మీద వచ్చేది వాడే శ్రీహరి  

అదిగదిగో అక్కడా .... అటువస్తున్నాడు శ్రీహరి

రండి హారతు లిచ్చియు మనమూ తరించు దాము రండి 


--(())--


ప్రాంజలి ప్రభ -- అంతర్జాల పత్రిక   

బ్రహ్మోత్సవ సంకీర్తన (4 ) తేటగీతి పద్యాలతో

రచయిత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

   

    ( బ్రహ్మోత్సవాలలో ప్రజలు ఎంత భక్తి శ్రద్ధలతో పాల్గొంటారో ఈ కీర్తనలో వివరిస్తున్నారు  ఈ బ్రహ్మోత్సవాలు అప్పుడు, ఇప్పుడు కూడా వర్ష ఋతువులోనే జరుగుతున్నాయి. )

ప్రాంజలి ప్రభ -- అంతర్జాల పత్రిక   

బ్రహ్మోత్సవ సంకీర్తన (3 ) తేటగీతి పద్యాలతో

రచయిత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

నరులు నాలుగు దిక్కులనుండి కదలి 

కడలి పొంగులా పరుగులు తీస్తు వచ్చి 

వాన లున్నను, ఎండలున్నాను భయము 

లేక గోవింద హరి గోవింద అనుచు కదిలె ....  ...2 


తల్లి తండ్రులు తనయులు బంధువుళ్లు 

చుట్టు పక్కటి వారును కలసి మెలసి 

శతసహస్త్రయోజన వాసులుముడుపులను

చేత బట్టియు వత్తురు కదలి కదలి    ....  ...న 

                             

ముడుపులు తలమీదను ఉంచి, నామ జపము 

చేస్తు, కడుమంచి మణులతో కరులుఁ తురగ

ములు, వడిగొని చెలఁగుచు వత్తురు కదలుచు

దైవ దర్శన మునకు కాంతు లతొ కదిలె     .... న 


చక్ర వర్తులు రాజులు చతురతకల్గి 

వారు వీరని వాదన పడక కదిలి  

వేంకటపతిని దరుశింపఁ ప్రజలు వచ్చి 

బ్రహ్మ ఉత్సవములను చూసియు కదిలిరి   .... న 

--(())--

ప్రాంజలి ప్రభ -- అంతర్జాల పత్రిక   

బ్రహ్మోత్సవ సంకీర్తన (2 ) తేటగీతి పద్యాలతో

రచయిత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


పురుషులలొ పుణ్య పురుషుడు ఏగు చుండే 

సర్వ శోభిత సౌభాగ్య మంత వెల్గు  

ఇంపు సొంపుగ వెంకటేశ్వర డుండె

జయతు గోవింద వేంకట రమణ జయతు   

 .॥పల్లవి॥


చక్కని పలుకు కులుకుల చెలుల తోన 

చుక్కల నెలరాజు వెలుగు కళల తోన 

చెక్కిలి మెరుపు హృదయపు చూపు తోన

మక్కువ చెలుల శ్రీ వేంకటేశ్వ రుండు  ..... ... పు     

 ॥పురు॥

అలయుచు వసుధ, నలమేలుమంగఁ గూడి

యెలమిఁ దిరుతేరు పై నేఁగి ఉన్న వాఁడె

బలిమి పెండ్లి కొడుకుగాను వెలుగు చుండె  

నిలువు జక్కఁదనముతోన ఉండె మూర్తి 

 ॥పురు॥


హరి రధములో ముద్దుగుమ్మలతొ కదులు 

గిరిన యంతయు గంధపు వాసనలతొ 

మరియు మురిపెంబు జూపుచు తిరిగి నావు  

సిరులు ఇచ్చేటి వేంకటేశ్వరుడుగాను  

॥పురు॥

--(())--


లలిత కోమల మోహన లహరి లీల 

రమ్య భవ్య దివ్య చరణం రసమయమగు 

నీదు యపురూప యానంద నిర్మల మగు 

ఊహలు యనన్య లక్ష్యమై యుజ్వల మగు 

 

 నీదు పాద దర్శనముయే నీడ నిచ్చు 

మనసు పరవశము యమోఘ మార్గ మిచ్చు 

జీవిత  సుకృతం విధిధన్య జీవ మగును 

నీకు శరణమ్ము  వందనం నియమ భక్తి


ఇష్ట మార్గ యంకితముగా యిఁ 0తి సహన

పూజ యంకిత యర్పిత పుడమి నందు 

 నిత్య యారాధన కళలు నిన్ను కోరి 

హృదయ నమ్మకం జీవనమ్ము కృష్ణ


గజ్జె శబ్ద  శోభిల్లుతూ గళము విప్పి 

పసుపు పారాణిల మెరియు పూత పూసి

నీదు పాద పద్మాలకు నిలకడగను 

కైవల్య పదము ఇమ్మని కోరిక ఇది 


దివ్యచరణాలు చూడగా వినయ వాంఛ 

తోను నా రెండు నయనాలు తోడు కోరె 

తనివితీరా మది అనుభూతి  కథలగుట 

పారమార్ధాలు లేనట్టి పాల బ్రతుకు


......


Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ