శ్రీగురుభ్యోనమః శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ
ఈ శతకము వివిధ రకముల వృత్తములలో వ్రాయదళచినాను.
క్రొత్త, పాత, సహస్ర ఛందస్సు తో (1000) వృత్తములు.
, వ్రాయాలని ఆ అమ్మవారి, అయ్యవారి, దయతో శంకల్పించాను
'దేవీ.. శ్రీదేవీ !' సహస్ర ఛందస్సు తో (1000) పద్య లతలు
001..విభా -త, ర, గ, గ.
లోకంబు వర్ణనే లోకుల్! లోక్యంబు తెల్పుటే దేవీ!
మూకంబు నాట్యమే సోకుల్! మౌనంబు దేహమే దేవీ!
శోకంబు తెల్పుటే పల్కుల్! శోధ్యమే రాజ్యమే దేవీ!
పాకంబు బత్కుయే దేవీ! పాశంబు బత్కుయే దేవీ!!
002..వాంతభారః -న, త, గ, గ.
సమయ సందర్భ మౌనే! సకల మాంగళ్య దేవీ!
విమల లక్ష్యమ్ము గానే! విజయ విశ్వమ్ము దేవీ!
సమర సామర్ధ్య మేనే! సహన తత్త్వమ్ము దేవీ!
కమల కావ్యమ్ము దేవీ! కనుల జాలమ్ము దేవీ !!
003..తుంగా -న, న, గ, గ.
కనుల కలలు తీరే! కలువ బతుకు దేవీ!
పనుల పలుకు తీరే! పరువు కరువు దేవీ!
వణకు వలపు తీరే! వయసు మెరుపు దేవీ!
క్షణము క్షమయు దేవీ! తృణము ఋణము దేవీ!!
004..వృత్తముఖీ -న, భ, గ , గ.
హరిహరీ యని వేడెన్! సరిగమా విధి దేవీ!
సిరుల కోరిక గల్గెన్! తెలుపలేకను దేవీ!
మొరల మోక్షము గోల్తున్! మొఖము నీదయ దేవీ!
కమలనాధునిజేరీ! కరుణ జూపు శ్రీ దేవీ!!
005..గోపనదీ.. న మ గ గ
కళల కర్తవ్యమ్మే లే! కథలు కావ్యమ్మే దేవీ!
పలుకు ప్రాధాన్యమ్మే లే! పదవి పాఠ్యమ్మే దేవీ!
తెలుపు వర్ణమ్మే తెల్పే! నలుపు వర్ణమ్మే దేవీ!
కలలు వచ్చేలే నిత్యం! కలువ లీలే శ్రీదేవీ!!
006..చతురీహా -జ, భ, గ , గ.
మనోమయమ్మగు విద్యా! మహాత్మ శక్తిగ దేవీ!
క్షణమ్ము లీలలు గానే! క్షమత్వ శక్తిగ దేవీ!
ప్రణమ్ము నీదయ యుక్తీ! ప్రకాశ శక్తిగ దేవీ!
గుణమ్ము నీకృప గానే! సుఖమ్ము నివ్వుము దేవీ!!
007..సింహలేఖ -జ,ర, గ, గ.
పరాకు జూపకే మాపై ! ప్రధాన పూజయే దేవీ!
స్థిరమ్ము నిమ్ముమా మాకే! స్థిరాస్తి మీదయా దేవీ!
వరాలు కోరనన్ మేమే! విరోధి మార్చుమా దేవీ!
పరాగ లీలలే మీవీ! పరాత్పరీ మదీ దేవీ!!
008..శ్యామా -త,స గ,గ.
పూర్వర్ధముగనే తెల్పే! సత్యమ్ము పలికే దేవీ!
ధైర్యమ్ము బృతుకే నేర్పే! ధర్మమ్ము మదిగా దేవీ!
సర్వార్ధముగనే అర్ధం! న్యాయమ్ము తెలిపే దేవీ!
కార్యర్ధ ముగనే సర్వం! కర్తవ్య ముగనే దేవీ!!
009..వారిశాలా -జ,త,గ,గ.
అహమ్ము మాదేను నేస్తం ! అనామి కయ్యేము దేవీ!
సహాయమేచేయు మాకే! భరించె కష్టమ్ము దేవీ!
ప్రహసమే కాదు మేమే! ప్రమాణ మై చేష్ట దేవీ!
విహారిగా మిమ్ము కొల్చే! విచార మార్గమ్ము దేవీ!!
010..వితానయోగః -జ,మ ,గ,గ.
సదా సుఖమ్మే భాగ్యంబే! సకాల నేత్రం శ్రీదేవీ!
చిదాత్మ ప్రేమా నేస్తంబే! వశాల వైనం శ్రీదీవీ!
యదార్ధ సౌరీ దేహంబే! సహాయ మార్గం శ్రీదేవీ!
విధాన విద్యా ప్రాణమ్మే! నిజాల లక్ష్యం శ్రీదేవీ!!
విరాజికరా -జ, య, గ గ.
ప్రభాసితమౌనీ మోమున్ ప్రకాసితగా శ్రీదేవీ
బ్రభాతమునందున్ గాంచన్ ప్రభావముగా శ్రీదేవీ
శుభంబులు కల్గున్ శౌరీ! సుధామయము శ్రీదేవీ
ప్రభాతివి నీవే నిత్యం ప్రధానముగా శ్రీదేవీ !.//
భారంగీ -జ,స,గ ,గ.
మనస్సు !చిరదోషంబుల్ మనోమయము శ్రీదేవీ
చరిత్ర వినగా కాలున్ ధరిత్రి గను శ్రీదేవీ
నిరంతరము నిన్ దల్తున్ వినమ్రతయు శ్రీదేవీ
స్థిరాత్మగ మదిన్ నిత్యం స్థిరమ్ము గను శ్రీదేవీ !//
సారవదనా -త,జ, గ, గ.
ఓ పాప వినాశ!రావా! ఓ దీపపు కాంతి దేవీ
నీ పాదము పట్టితిన్ నా నీ మాటలు కోర దేవీ
శాపాలను ద్రుంచ వయ్యా!పాపాలను మాపు దేవీ
తాపత్రయ దూర!నిత్యం కాలమ్ముయు పంచు దేవీ !//
కరాళీ -త,త, గ, గ.
శ్రీమాత నిత్యం !విహారీ! శ్రీ శక్తి విశ్వమ్ము దేవీ
భవాంబుధిన్ దాటుదారిన్ సమమ్ము సంఘమ్ము దేవీ
నీవే కటాక్షింపుమమ్మా ! నీవేను మాదిక్కు దేవీ
సేవింతు నిన్నెప్డు నిత్యం క్షేమమ్ము కోరేను దేవీ //
సంధ్యా -త,న,గ,గ.
మోహంబు దొలగగా దా మౌనంబు తలపు దేవీ
సోహంబని వినతిన్ సం తాపంబు కలలు దేవీ
దేహంబు విడిచి దల్తున్ దాహంబు మరచె దేవీ
జోహారనుచును నిత్యం ప్రేమమ్ము తెలుపు దేవీ /
పాంచాలాంఘ్రి -న, య, గ, గ.
ఒకపరి విద్యా పొందా ఒడుదుడు కేలే దేవీ
శకటము మల్లే జీవీ సహనము చూపే దేవీ
మకుటము పొందా యాశా మకతిక బుద్ధీ దేవీ
సకలము యిoతే యేమీ చరితముగా శ్రీదేవీ
కరరికా -న,ర, గ, గ.
విరసమెందుకమ్మా !మా వినయమేను దేవీ
కరము వీడకమ్మా !మీ పదము పట్టె దేవీ
పరువు యేల నమ్మా మీ పలుకు చాలు దేవీ
కరుణ జూపు మమ్మా మా మనసు చూడు దేవీ
రుద్రాళీగణలయనీ - న, స, గ,గ.
ఘనతి వని నిన్ దల్తున్ కలసి బతుకున్ దేవీ
క్షణికమగు భాగ్యంబుల్ కథలమయమే దేవీ
కనను సిరి!నీ రూపున్ కనుల పరమే దేవీ
గన నిలిచితిన్ సేవా తరుణముయె శ్రీదేవీ
కృష్ణగతికా -భ,జ,గ,గ.
పాదములు పట్టి కొల్తున్ పాశముయె మాది దేవీ
వేదనలు తీర్చ వమ్మా ! వీణ మదివైతి దేవీ
నీదయను జూప రాదా! మాహృదయమంత దేవీ
నాదరికి రావ!మాతా మామనసునున్న దేవీ
చిత్రపదా-భ, భ, గ, గ.
కోరను గోర్కెలు శౌరీ! పోరును సల్పను దేవీ
భారము నీదని దల్తున్ భాగ్యము నీదయ దేవీ
సారెకు మ్రొక్కుచు నిన్నే సాధన చేసెద దేవీ
చేరితి నీదరి మాతా చేసితి పూజలు దేవీ
21.. ఇంద్రఫలా -భ, మ, గ, గ.
పుట్టెడు కష్టంబుల్ కల్గెన్! పున్నమి నాడే ప్రాణమ్మై!
నెట్టగ మా జీవంబంచున్! నీదయ మాకే స్నేహమ్మై!
గట్టిగ నీ పాదాబ్జంబుల్! నేడును పట్టా దాహమ్మై!
పట్టితి మేలొందన్ నిత్యం! పాలన నీదే శ్రీదేవీ !//
22.. వాత్యా -భ,య,గ,గ.
నీలఘన మేఘరూపా! మీ కృపయు మాలో నింపా !
పాలకుడ వీవే దేవీ ! పాశమగు సేవే నింపా!
దాలిమిని జూపంగన్ రా! దాస్యమును మార్చే దేవీ!
కాలమును చూపే తల్లీ! కామ్యము గనే శ్రీదేవీ!!
23.. పతిసీరా, సరళ -మ, భ, గ, గ.
సంసారంబున్ త్యజియింతున్! సద్భావమ్మున్ పలుకైతిన్!
దాసోహంబంచును భక్తిన్! ధ్యానమ్మే నాకును శక్తిన్!
నీ సేవల్ చేయగ నిల్తున్! నీ దర్మంమ్మే సత్యము వీలున్!
నీ సాన్నిధ్యంబున దేవీ! నీ కావ్యంబే మతి దేవీ !.//
24.. హంసరుత -మ,న,గ,గ.
జీవత్మా!సిరి!గ విద్యా ! జీవమ్మే మదిగ మ్రొక్కా!
భావావేశముగ పిల్తున్! బాంధవ్యమ్ గతిగ మ్రొక్కా!
రావమ్మా !వరద!కావన్! రాజ్యమ్మే జపము మ్రొక్కా!
నీవే మా గురువు దేవీ! నీ చూపే జయము దేవీ !.//
25. క్షమా -మ,ర,గ,గ.
శ్రీరమ్య యంచు నిన్ దల్తున్! శ్రీ శక్తి నీవుగన్ దల్తున్!
జేరంగన్ సన్నిధానంబున్! జీవమ్మున్ సేవ నిత్యమున్!
భారంబున్ దీర్పగన్ రావా! భాగ్యమ్మున్ కల్పించున్ దేవీ!
గారంబున్ జూపుచున్! దేవీ కాలంబున్ ప్రేమగన్ దేవీ !.//
26.. మేరురూపా - మ,స,గ,గ.
దీనత్వంబున పల్కంగా! సూరత్వంబున సాగంగా!
నీనామంబును సద్భక్తిన్! కారుణ్యంబున పాడంగా!
ప్రాణంబుల్ నిలుపన్ రావా!ప్రారంభంబున సేవా!
శ్రీమాతా !కరుణన్ మాపై!.శ్రీశక్తీ దయశ్రీదేవీ //
27.. భూమధారి -య, య, గ, గ.
ప్రదీప్తంబులౌ నీ శోభల్! ప్రమాదంబులౌ మా చేతల్!
సదా వెల్గులీయంగా నీ విధానంబులే శ్రీదేవీ
పదాబ్జంబులన్ మ్రొక్కంగా ప్రధానంబులున్ మా సేవల్
ముదంబొందితిన్ శ్రీ మాతా !.ముభావమ్ము గన్ శ్రీదేవీ //
28.. కులాధారా -య, ర, గ, గ.
విపత్తుల్ బాప రావమ్మా ! ప్రభావమ్మే ను జ్ఞానాంబా!
జపమ్ముల్ జేసి నీ చెంతన్! తపమ్ముల్ గాను జ్ఞానాంబా!
బ్రపత్తిన్ జాటెదన్ శ్రద్ధన్! సమాసాధ్యా సు జ్ఞానాంబా!
కృపార్థిన్ గాంచుమా!మమ్మూ !.దయార్ధిన్ బ్రోవు శ్రీదేవీ //
29.. మనోలా -య, స, గ, గ.
సుమాలాంకృతకంఠా!నిన్! వికా సమ్ము విదీ శ్రీదేవీ!
బ్రమోదంబుగపూజింతున్! విశాలమ్ము సుదీ శ్రీదేవీ!
సదాశ్రేయము పొందన్ భా గ్యదా క్షేమము శ్రీదేవీ
సదా!మ్రొక్కెదనో దేవీ !. సహాయమ్ముగ శ్రీదేవీ
30.. సింహలీలా -ర,జ,గ,గ.
సామగానలోల!దేవీ ! సానుకూల పూజ దేవీ!
క్షేమమీయరావ!దేవీ ! కాలమౌనుసేవ దేవీ!
కామితంబు దీర్చు శౌరీ! కావ్య మార్పు కూర్పు దేవీ!
సోమసూర్య నేత్ర!దేవీ ! జీవకోటినేత్ర దేవీ
31..మౌళిమాలికా -ర, య, గ, గ.
గానలోలితా !రావేలా! గమ్యమేనులే శ్రీమాతా
వేణువూదుచున్ శ్రీనాధా! విశ్వవాకిటన్ శ్రీలక్ష్మీ
దీననైతినమ్మా ! రావా ! దివ్యతేజమున్ శ్రీదుర్గా
మౌనమేలనోయీ!దేవీ ! మాయమార్చుమా శ్రీదేవీ //
32.. పద్మమాలా -ర, ర, గ, గ.
చక్కనౌ నీదు రూపంబున్, శక్యతే మాకున్ నిత్యంబున్
సొక్కుచున్ గాంచిరా మౌనుల్, సొమ్ముగన్ పెంచిరి బుద్దుల్
మ్రొక్కగా భక్తిగన్ నిన్నే మోక్షమే శక్తిగన్ దేవీ
ప్రక్కనే నిల్తువో దేవీ . మోక్కులే నీకు శ్రీదేవీ //
౩౩.. వృష-ర, స, గ, గ.
దుర్మదాంధుల ద్రుంచంగా దుష్టబుద్ధిని మార్చమ్గా
కర్మలన్నియు కాల్చంగా కక్షలన్నియు కూల్చంగా
ధర్మమార్గము జూపంగా ధ్యాన తత్వము చెప్పంగా
నిర్మలాత్మవు శ్రీ మాతా !సర్వ నేస్తము శ్రీదేవి //
34. దిగీశః, ఈశ, ముద్ర. స, జ, గ, గ.
విన వేల?శౌరి!బాధల్, కనలేవ ? కావ్య బోధల్
యనఘా!భజింతు నిన్నే, మనసా వచించ దేవీ
ప్రణతిన్ కరంబు మోడ్తున్, సహనమ్ముపంచు దేవీ
గనరావ!నన్ను దేవీ, క్షణమౌను సంఘ దేవీ !//
35.కౌచమారః -స, త, గ.
కరుణావార్థీ!సుదేవీ ! కమనీయమ్మే సమర్ధీ
దరిచేరంగా దయాళూ! తరుణమ్మౌనే వికాశీ
మురళీలోలా!పదంబుల్, కరుణాలీలా నిజంబుల్
నిరతంబున్ గొల్తు దేవీ ! సహనంబున్ నిత్య దేవీ //
36.
కుమారలలిత -స, న, గ, గ.
దరిచేర హృదయమ్మే! సిరిరాణి !సహనమ్మే !
చరణమ్మే తరుణమ్మే! సురరక్ష!కరుణాత్మా!
గరుడాద్రి నిలయా నిన్! చిరుహాస వినయమ్మే
విరజాజి రసకీర్తీ!శరణంబనెద దేవీ !//
37.
పతిమోహ -స, భ, గ, గ.
మరుమల్లే వరదాయీ! గిరిధారీ!నరసింగీ !
సురపూజ్యా!కనరావా!సురదేవీ వినరావా!
మరుగేలా!తరియించన్! కలలాయే సమయమ్మున్
వరమీవా!హరి మాయా! కవి వీరా వరదేవీ !//
38.
అనిర్భరః -స, మ, గ, గ.
వనమాలా ధారీ!సౌరీ !విజయమ్మే దాహమ్మే!
వినవేమమ్మా నా బాధల్! సహనమ్మే మాలోసేవల్!
కనుపించంగా రావమ్మా కథలన్నీ మార్చాలమ్మా !
ప్రణుతింతున్ భక్తిన్ మాతా ! కనలమే శక్తిన్ దేవీ //
39.
యుగధారి -స, య, గ, గ.
వినుతింతు నిన్నే శౌరీ!కనలేని కామ్యoమేలే!
ముని సేవితా శ్రీమాతా ఆణువంత ప్రేమే దేవీ !
గణుతింపవా గోమాతా క్షణమైన కాలంమేలే !
ఫణితల్ప నిత్యా మాతా ప్రణవమ్ము విద్యా దేవీ !//
40.
పరిధారా -స, ర, గ, గ.
ముదమీయంగ రావమ్మా !కళలన్నీ తీర్చాలమ్మా!
మదిలో నమ్మితిన్ నిన్నే! తలపే తెల్పితిన్ దేవీ!
బదిలం బొప్ప గోమాతా !హృదయంమౌను శ్రీమాతా
పదముల్ మ్రొక్కెదన్ దేవీ పదము ల్ దిక్కే శ్రీదేవీ !//
మేఘధ్వని పూరః :: ( త య మ మ గ గ .. యతి 7 )
విద్యానిలయంబై వెల్గొ౦దున్ మోమున్, సాధ్యాసమయంమై సంతోషం దేవీ
పద్యాల పదాంబుల్ వాగ్దేవీ నిమ్మా, హృద్యంబుగ వ్రాయన్ హెచ్చౌ శబ్దాల్ నై
వేధయ్మములుగా సేవింతున్ శ్రీమాతా, వేదాంతము నిత్యం విద్యార్ధీ దేవీ
ప్రాధాన్యములుగా ప్రావీణ్యంమే మోమున్, సాధ్యమ్మగు సత్యం న్యాయం శ్రీదేవీ
వివర విలసితం (త న స మ.. యతి.. 6)
అమ్మా లలిత హసితా సింధూరంబుల్! ప్రేమా మనసు మమతా సమ్మోహంబుల్!
దిమ్మా మహిత నిలకు కామ్యర్ధంబుల్! ప్రేమా సహిత ప్రతిభ సర్వార్ధంబుల్!
రమ్మా దయగ రయముగన్ శ్రీమాతా! ప్రేమా కరుణ ప్రగతిగన్ శ్రీ శక్తీ
చిమ్మంగ పలు జిలుగు తోన్ వేవేలం! ప్రేమమ్ము కళ ప్రభలు గాన్ శ్రీదేవీ
ఆరాధినీ ( త మ మ గ గ.. యతి.. 7)
ఆరాధనల్ నే జేయంగా తల్లీ! దీపారాధనల్ సందీప్తoబై వెల్లంగా
పారాయణమ్ నే జేయంగా తల్లీ! యీ పాపాత్ములన్ దీక్షాదేవీ ప్రాణంబే!
గౌరీ మహాదేవీ కావంగన్ రావా వీరేశ్వరీ దుర్గా ప్రీతిన్ శ్రీమాతా!
సౌరీ మహా మాయా సౌజన్యం దేవీ! ధైర్యమ్ముయే ధర్మా సత్యం శ్రీదేవీ
లోద్ర శిఖా విలంబిత మధ్యా ( మ స స గ గ.. యతి.. 7)
సర్వాధారి యుమా జననీ దేవీ! సన్మాయమ్ము సుమా జపతీ దేవీ!
గర్వంబున్ విడువంగ వినమ్రంబై! సర్వంబున్ మనసమ్ము సమాస్రంబై!
పర్వంబుల్ జరిపింపగ, పూజింతున్! సర్వార్ధమ్ము విశాల విధానంబై!
నిర్వేదంబు చనన్ నిను శ్రీమాతా! నిస్తేజంబు గనన్ నిను శ్రీదేవీ!
విపుల భుజ:: ( న జ య గ ., యతి . 7 )
వికసితపద్మ విశాలాక్ష్మీ, సకలము నీవె జగంబందున్
వికసిత బుద్ధి విధీ దీక్షా, సకలము నిత్య సమా రీతిన్
ప్రకటన మోచు ప్రకీర్తి0పన్, ప్రకటిత ధర్మ ప్రకాశ౦బున్
త్రికరణమౌ నటి శ్రీమాతా, నియమముగా మది శ్రీదేవీ
41.. నిర్వింధ్యా -జ, స, మ.
మనస్సు !విధి మార్గమ్మేగా మనమ్ము మది కాలమ్మే గా
కణాలు విధి గంబున్ గావన్, రుణాలు మది ప్రేమాంమౌనే
క్షణాలు ని చరించన్ నీవే, ప్రణమ్ము సహనంమ్మే దేవీ
మృణాళిక !కృపాళూ! దేవీ , నినాదము కృపా శ్రీదేవీ !//
42.. అభిరామా -త, జ, య.
చిన్నారిగ సేవలమందున్, మూన్నాళ్ళగ నేస్తము గుండెన్
వెన్నల్ తినుచుండెడి శౌరీ! విద్యల్ కథలుండెది దేవీ
విన్నాణముగా భజియింతున్, క్షేమమ్ముగనే బ్రతుకౌనే
బున్నెంబుల బొందగ దేవీ ! ప్రేమమ్ముయు బొందగ దేవీ //
43.. రంభా -త, న, మ.
దుర్మార్గ దమన శూరాత్మీ ! విశ్వాస కరుణ ప్రేమాత్మా
శ్రీరమ్య యనిన నీవేగా, శ్రీశక్తి యనిన నీవేగా
నేరూపమయిన నీదేగా, నేదీపమయిన నీ కాంతీ
మా రేడువయిన శ్రీమాతా ! మా లక్ష్మి వయిన శ్రీదేవీ //
44.. కామా -త,న,య.
శ్రీరంగపురనిలయా!నీ ధీరత్వమును బొగడంగా
చేరంగ పలికిన లీలల్ భారంబులు దొలుగు దేవీ !
ప్రారంభ మనునది సేవల్ ధారుడ్యమనునది దేవీ
మోక్షంబు కనులవి దేవీ, మోహమ్ము ఆయనునది దేవీ
45.. సువర్ణరుచిరా -త, భ, య.
తాపంబులే కలిగె నమ్మా ! శాపంబులే కలిగేనమ్మా
నా పాపముల్ దొలగ దోయీ! నాకోపముల్ దొలఁగఁ దోయీ
నీపాదముల్ శరణుదేవీ ! నీ లక్ష్యముల్ శరణు దేవీ
కాపాడ వా మనసు దేవీ ! కాలమ్మునీదుదయ దేవీ //
51.. అనుకూలా -భ,త, న, గ, గ. యతి -7.
దోసము లెన్నో దొలగగ నిన్నే, వాసిగ మ్రొక్కన్ బలములు కల్గున్ !
దాసిగ నిల్తున్ దయగొన లేవా, చేసెద సేవల్ స్థిరముగ దేవీ !
మాసిన దేహం బ్రతుకున లేవా, చూసిన వేగం శుభమగు దేవీ!
రాసిన వైనం జయమగు దేవీ , వ్రాసిన రూపం కళలగు దేవీ !!
52. భుజంగశిశురుతము. న, న, య.
పిలుపులు వినుము నిన్నే, పిలిచితి వరద!రావా!
తలపులు కనుట నిన్నే, తకధిమ కరుణ రావా!
కళకళ మనుట నిన్నే, కధలుగా కవిత రావా !
నిలిపితి మదిని శౌరీ!, వలపుల దొరవు దేవీ !//
53.. రుచిరా -న, భ, య.
ఘనముగా జని జయమ్మే , తనయుడా పరుల గూల్చన్!
మనముగా మది భయమ్మే, మనసుగా విజయమిచ్చున్!
క్షణముగా విధి మనమ్మే, కణముగా జాయము నిచ్చున్!
వినతితో పొగడిరే నిన్ , గనుచు గోపికలు దేవీ !//
54.. మాయాసారీ -న, య, మ.
కఱకుదనం బేలా!నాపై, విరసము జూపంగా మేలా!
చురుకుదనం యేలా, నాపై, సుఖమగు జాడ్యమ్మే యేలా !
జరుగుదలే యేలా నాపై, జయమగు బాంధవ్యంమేలే !
దరిసెన మీయంగా లేవా! గరుడ విహంగా!శ్రీదేవీ !//
55.. సారంగశ్యామా -న, య, య.
వరదుడ! నీమ్రోల నుంటిన్ , జిరునగవుల్ జిల్క వమ్మా !
తరుణము నీ మ్రోల యుంటిన్ , కరుణయుగల్ చూపవమ్మా!
చిరునగ వే చూపు చుంటిన్ , కిరణములై పల్కులమ్మా!
దరిసెన భాగ్యంబు నీవా! పరమును జూపంగ దేవీ !//
56.
గుర్వీ, బింబం -న,స,య.
కరివరద కాంచవమ్మా? మనసగుట మాయనమ్మా?
సిరివరుని కోపమమ్మా ? వినపలుకు దహమమ్మా?
నరకపుశరీర!మాయే ! కనుగొనుట బాధ నమ్మా?
కరుణకల చూపు మమ్మా, మనుగడ కావు మమ్మా?
57.
శంబరధారీ -భ, త, య.
పెన్నిధి వీవే గుణశీలా,సన్నిధిగానే సమ మాటే!
చెన్నుగ సేవల్ గొనుమమ్మా, మన్నన నీదే గణమమ్మా!
పున్నెము లిచ్చే కళలందున్, మన్నిక చూపే కథలందున్!
విన్నపమాలించుము మమ్మా, యున్నది తెలిపాములె మమ్మా!
58.
స్నిగ్ధ - భ, మ, మ.
శ్రీకరి శ్రీమాతా సా మర్ధీ, శ్రీలత శ్రీశక్తీ సాధ్యా శ్రీ,!
నీకర ముల్ భద్రo బీయంగన్. నీకథ యే మాపై నిత్యమ్మున్,!
చేకొను మయ్యా!నా సేవల్ శౌరీ,!కరుణావార్థీ!శ్రీ మాతా !
నీకళ యే మాలో సత్యమ్మున్, నీ కరుణా కాలమ్మే దేవీ!
59.
నివాస - భ, య, య.
సన్నుతిగ పూజించగానిన్, కన్నులమయమ్మేను దేవీ!
వన్నెల సరాగంబు తోడన్, నున్నటి విధానంబు గానున్!
వెన్నెలలు జిల్కించ రావా, మన్ననయు మాపైన దేవీ
కన్నులను వెల్గించు దేవీ, నిన్నునుయుపాసించు దేవీ!
60..
కర్మిష్టా -భ, స, మ.
చూడుము!మనసే !!నిత్యమ్మున్, సూత్రము యగుటే సత్యమ్మున్!
వీడకు కరమున్ శ్రీమాతా, నేస్తము యగటన్ శ్రీదేవీ!
తోడుగ జన రావా!నిన్నే, కానుక కథ కాదా దేవీ!
వేడుచు నిలుచుంటిన్ దేవీ, కోరెద దయతో శ్రీదేవీ!
66..ఖేలాధ్యం - మ, స, మ.
రావమ్మా మము చూచే శక్తీ! సేవమ్మా మది చూచే భక్తీ!
కావమ్మా విధి మార్గం యుక్తీ!గోవమ్మా యిది దీక్షా భక్తీ!
జీవుల్ కాలము సేవా ముక్తీ! సేవల్ నీ దయ యే శ్రీదేవీ!
గావంగా జను దెంచే శౌరీ!నీవే నాప్రభు వమ్మా దేవీ !//
67.విశల్యం, ప్రమీల -య, య, య.
పరాకేల నమ్మా !మదీ !సుందరా!నీదు సాన్నిధ్యమే ర
క్ష!రాజీవ నేత్రా! విదీ ! శ్రీకరా!నన్ను పాలింపు దేవీ !
సరాగమ్ము నమ్మా నిధీ వంతునా పొందు ప్రామాన్యమే ర
క్ష సాహిత్య ధాత్రీ స్థితీ శ్రీ పరా నన్ను దీవింపు దేవీ!!
68.రుక్మవతి -ర, త, మ.
సంపదల్ కోరంగ రానమ్మా ! సంఘమున్ నామేను నీదమ్మా!
ఇంపుగన్ నీరూప తేజంబున్!నిత్యమున్ నీవెల్గు మాకమ్మా
సొంపులన్ గాంచంగ నీ మ్రోలన్! కావ్యమున్ వ్రాయంగ నీ శక్తి న్!
బెంపుగన్ నే జేరితిన్ దేవీ ఇ ష్టమున్ నీసేవ శ్రీదేవీ !//
69.విద్యా -స, జ, య.
పరశక్తి !భక్తిగ గొల్తున్! పరయుక్తి నాకును ఇమ్మున్!
గరుశక్తి !చెంతను నిల్తున్! గురుముక్తి నాకును పెంచున్!
వరదా!భజింతును నిన్నే శరణంబు కోరితి దేవీ !
కరుణా మనస్సును మీకే పరవాన కోరితి దేవీ!
70.సంబుద్ధి - స, త, య.
గిరిమాతా !వేగమె రావా! సిరి పంచా నేస్తము రావా!
మురళీలీలా!వినలేవా!మనసైనా యీ కథ నీదే!
మొరలన్ శ్రీశక్తి నివాసా!కథలన్ శ్రీ ముక్తి నివాసా!
సురపూజ్యా!మానస !దేవీ ! నరపూజ్యా కాలము దేవీ //
71.సుగంధి -స, న, య.
విరిమాలలు గొని నీకైత్వరగా నిలిచితి దేవీ !
కరుణా మయి కృపమాపై త్వరగా నిలుపుము దేవీ!
గురురూప!కనుము నన్నున్ బరశక్తి !వరద!దేవీ !
అరునోదయమగు దేవీ కరుణమ్ము మనసు దేవీ!
72.కలహము -స, భ, మ.
సురలున్ యోగులు నీ మ్రోలన్, నిరతంబున్ బడి మ్రొక్కంగా!
వరముల్ కోరియు నీ రూపుఁన్, సమయమ్మున్ మది కోరంగా!
పరమున్ జూపెడి నీప్రేమన్దరముల్ తల్తురు శ్రీదేవీ !
స్థిరమున్ తెల్పుము నీశక్తీ సమయం తల్తురు శ్రీదేవీ!
73.యతనం -స, య, య.
దురితాత్ములన్ సంహరించన్! చిరుహాసమ్మున్ చూపగల్గున్!
ధరయందు పాదంబు మోపన్!తరుణమ్ము నేస్తంబు మాకున్!
గరమేల నమ్మా !మనస్సే ! శరణమ్ము నమ్మా మనస్సే!
తరియించెలోకంబు దేవీ కరుణించ నున్నావు దేవీ !//
74.ఇంద్ర /తాంద్రీ -జ జ య గ.
యతి -6.
కదంబ విరుల్ గరిమన్ దెత్తున్, మదంబు మదిన్ మమతన్ నిత్తున్!
బదంబడి నిన్ బ్రణతిన్ గొల్తున్! విదంబగు నిన్ వీధిగన్ గొల్తున్!
వదాన్యుడ వీ వని నీ మ్రోలన్! సుధాంబుది వీ సుధ వి మ్రోలన్!
బదంబుల నే పడుదున్ దేవీ మదమ్మగు నే మది శ్రీదేవీ !//
75.జలౌఘావేగా నిరూపణమ్-జ త ర గ.యతి -6
వినిర్మలాంగా!విశోకదూతా ! సమర్ధలాంగా సశోక మాతా!
మనోధిశాయీ!మహాప్రతాపీ నినాదమేలే వినోద మాతా !
ఘనావతారా!కవీ!సమాతా !వినాసకాలే విదీ విధానీ!
సనాతనార్యా!జయంబు దేవీ, విధానపర్వం వివాద దేవీ !//
76.మౌక్తికమాలా - భ, త, న, గ, గ.యతి - 7.
ఈసహనమ్మేను యిరుసుగానే, నీదయ నే కోరి నిలిచి యుంటిన్
ఈసహకార్యమ్ము యిమిడియుండే, కాదనకమ్మా !కనులలొ దేవీ !
ఈ సహవాసమ్ము యిదియు యిచ్ఛే వేదన తీర్పంగ వినతి దేవీ
నీ దయ మాప్రాప్తి నిజము తెల్పా పాదములేదిక్కు వరద!దేవీ !
77.సత్యవతీ - భ, త, త, గ, గ.యతి -8.
బాలను నన్నేలవా!భాగ్యదాతా!కాలము నీదైననూ కామ్య తార్ధీ!
కాలము నీవే నిరాకారమాతా !మాలలు నీకే సమాజంలొ దేవీ!
జాలము లేలా? సుధాసారదీప్తీ! హేళన కాదే విదీ సేవ దేవీ!
పాలన సేయంగ రావమ్మా !దేవీ !/మూలము నీవే నుసామూ దేవీ /
78.లక్షణ లీల - భ, త, మ, గ, గ.యతి - 8.
భారము నీదే సుధీ !వైభోగంబుల్, కాలము నీదే విదీ సౌభాగ్యంబుల్
కోరను మాతా ననున్ ఘోరంబౌస్థితీ కాలము మాయమ్ము గా సందేహంబుల్
ధారణ ధర్మమ్ము గనే సమ్మోహంబుల్ సారపయోధిన్ క్రమించంగన్
తోడై గాలముగ నీదే సుధీ సద్భావంబుల్ధీరతనీవా!మమస్సే !శ్రీదేవీ !//
79.నభో - భ, న, భ, గ, గ.యతి - 7.
జీవన మొసగు చిన్మయరూపీ ! భావన తెలుపు భాగ్యము దేవీ
మావగ కనుము మానసమే !జీవమ్ము మలువు శీఘ్రము దేవీ!
సేవలు కొనుము శ్రీకర!మమ్మున్
బ్రోవుచు నిడుము ముక్తిని దేవీ !
కావుము మనసు కాలము నీదే, పావుల బతుకు పాశము దేవీ!
80.తోవకము - భ, భ, భ, గ, గ.యతి - 7.
కన్నుల నేస్తము కాలము నందున్, సన్నుతి జేయుచు సారెకు దల్తున్.
మన్నిక వైనము మార్గము చూపుల్, సన్నిధి సేవకు సమ్మతి నీవా!
వన్నెల చిన్నది వాకిట సేవల్! పున్నెము నిచ్చెడి పూజ్యుడవీవే!
యున్నది లక్ష్యము యుజ్వల మౌనే! మన్నన సేయుము మానస దేవీ !//
విశ్వ రూపిణి సర్వాత్మే విశ్వ భూతైక నాయికి లలితా!
శశ్య శ్యామల సౌందర్యా శ్రావ్య లక్ష్యైక నాయికి లలితా!
పాశ్య ధారిణి సద్భావం ప్రాణ శ్రీమాత నాయికి లలితా!
లాశ్య మాడని విశ్వాసం లౌక్య ప్రేమమ్ము నాయికి లలితా!!
అనంత రూపిణి శివే, జగదానంద దాయిని, లలితా!
ప్రణమ్ము మోహిని శివే ప్రణతీ సత్య దాయిని లలితా!
వినమ్ర దాయిని శివే వినతీ ధర్మ దాయిని లలితా!
తనమ్ము గాయిని శివే తపతీ న్యాయ దాయిని లలితా!!
జ్ఞాత్వ జ్ఞాన జ్ఞేయ రూపే,మహా జ్ఞాన ప్రకాశిని,లలితా!
సత్య ధర్మ ప్రేమ రూపే, సహా యమ్ము సుహాసిని, లలితా!
నిత్య తత్వ మోక్ష రూపే, విదీ వాక్కు ప్రభోదిని, లలితా!
ముత్య మల్లె మెర్పు రూపే, ముఖ్య దుష్ట వినాసిని లలితా!!
లోక సంహార రసికే,కాళికే, భద్ర కాళికే, లలితా!!
శోక సామర్త తిలకే, కోటికే, గమ్య ధారిణీ లలితా!
యోగ సామ్రాజ్య మోహిణీ, యోగ్యతే సర్వ తంత్రిణీ లలితా!
రోగ ప్రత్యక్ష వాసిణీ, మోక్షతే జన్మ మృత్యువే లలితా
లోక సంత్రాణ రసికే' మంగళే, సర్వ మంగళే,లలితా!
కాల సంతోష రమణీ, సంభవం, సత్య సందడే, లలితా!
ధ్యాన మాధుర్య తపసీ, శంకటే నిత్య చండికే, లలితా!
జ్ఞాన సామ్రాజ్య జనణీ, కంచి కామాక్షి పంతమే లలితా!!
సృష్టి పరాధీనే,విశ్వనాథే విద్య సర్వమ్ము శంకటే, లలితా!
ధర్మ దృష్టి సహాయమ్మే, ధన్యజీవమ్ము దర్శనే, లలితా!
ధైర్య పుష్టి ప్రమాణమ్మే, దైవతూర్పేను లక్ష్యమై లలితా!
సర్వ నిష్ట ప్రయాణమే, సాధ్య సాధ్యమ్ము వాక్కులే లలితా!
సంవిద్వహ్ని హుతాశేష,సృష్టి సంపాదితా కృతే,లలితా!!
సందర్బమ్ము సుతా శేష, దృష్టి విద్యావతీ శృతీ లలితా!
సంకోచెమ్ము సుదీ శేష, సత్య వాగ్దేవిగా దృతీ లలితా!
సద్భావ్యమ్ము మదీ శేష, సర్వ మంగళ్యమై స్థితీ లలితా
పంక్తి రధ (త జ య గ.. యతి.. 6)
సంతోషమునొంద సహాయమ్మే! సంక్షోభములన్ సడలించంగన్
సద్భావమ్ము తెల్ప సపర్య మ్మే! సంక్షేమములన్ జరిపించంగన్
పంతాలగు నేస్త ప్రధానమ్మే! సంక్షి ప్తములై జనకష్టంబుల్
సంతానము యేజయ శ్రీమాతా!సంక్షేమమిడున్ జయశ్రీదేవి
శoప (త న మ మ.. యతి. 9)
ధ్యానమ్ము తలపు వల్లే దారే జేరే! దాహంబు విడువగాదారే శ్రీదేవీ!
మౌనమ్ము మలుపు వల్లే మోక్షం జేరే! మోహంబు విడువగా సమ్మోహం దేవీ!
దానమ్ము సుఖము వల్లే ధర్మం జేరే!దాత్రుత్వ మయము వేదాంతం దేవీ!
ప్రాణమ్ము పలుకు వల్లే ప్రెశ్నే లే ప్రోత్సా హంబిడుమ కృపన్ మాతా శ్రీదేవీ!
వసుంధరా.. జ భ త ర స గ .. 16/9
విశేష బంధము విద్యా వివేక సాధన బుద్ధీ
ప్రశాంతి భోధయు సత్యం ప్రభావమై సాధన శక్తీ
అశేష లక్ష్యము సేవా ప్రమోదమై శోధన యుక్తీ
విశాల దర్శన రూపం వివేక విద్యల దేవీ
విరాజికరా -జ, య, గ గ.
ప్రభాసితమౌనీ మోమున్ ప్రకాసితగా శ్రీదేవీ
బ్రభాతమునందున్ గాంచన్ ప్రభావముగా శ్రీదేవీ
శుభంబులు కల్గున్ శౌరీ! సుధామయము శ్రీదేవీ
ప్రభాతివి నీవే నిత్యం ప్రధానముగా శ్రీదేవీ !.//
భారంగీ -జ,స,గ ,గ.
మనస్సు !చిరదోషంబుల్ మనోమయము శ్రీదేవీ
చరిత్ర వినగా కాలున్ ధరిత్రి గను శ్రీదేవీ
నిరంతరము నిన్ దల్తున్ వినమ్రతయు శ్రీదేవీ
స్థిరాత్మగ మదిన్ నిత్యం స్థిరమ్ము గను శ్రీదేవీ !//
సారవదనా -త,జ, గ, గ.
ఓ పాప వినాశ!రావా! ఓ దీపపు కాంతి దేవీ
నీ పాదము పట్టితిన్ నా నీ మాటలు కోర దేవీ
శాపాలను ద్రుంచ వయ్యా!పాపాలను మాపు దేవీ
తాపత్రయ దూర!నిత్యం కాలమ్ముయు పంచు దేవీ !//
కరాళీ -త,త, గ, గ.
శ్రీమాత నిత్యం !విహారీ! శ్రీ శక్తి విశ్వమ్ము దేవీ
భవాంబుధిన్ దాటుదారిన్ సమమ్ము సంఘమ్ము దేవీ
నీవే కటాక్షింపుమమ్మా ! నీవేను మాదిక్కు దేవీ
సేవింతు నిన్నెప్డు నిత్యం క్షేమమ్ము కోరేను దేవీ //
సంధ్యా -త,న,గ,గ.
మోహంబు దొలగగా దా మౌనంబు తలపు దేవీ
సోహంబని వినతిన్ సం తాపంబు కలలు దేవీ
దేహంబు విడిచి దల్తున్ దాహంబు మరచె దేవీ
జోహారనుచును నిత్యం ప్రేమమ్ము తెలుపు దేవీ /
పాంచాలాంఘ్రి -న, య, గ, గ.
ఒకపరి విద్యా పొందా ఒడుదుడు కేలే దేవీ
శకటము మల్లే జీవీ సహనము చూపే దేవీ
మకుటము పొందా యాశా మకతిక బుద్ధీ దేవీ
సకలము యిoతే యేమీ చరితముగా శ్రీదేవీ
కరరికా -న,ర, గ, గ.
విరసమెందుకమ్మా !మా వినయమేను దేవీ
కరము వీడకమ్మా !మీ పదము పట్టె దేవీ
పరువు యేల నమ్మా మీ పలుకు చాలు దేవీ
కరుణ జూపు మమ్మా మా మనసు చూడు దేవీ
రుద్రాళీగణలయనీ - న, స, గ,గ.
ఘనతి వని నిన్ దల్తున్ కలసి బతుకున్ దేవీ
క్షణికమగు భాగ్యంబుల్ కథలమయమే దేవీ
కనను సిరి!నీ రూపున్ కనుల పరమే దేవీ
గన నిలిచితిన్ సేవా తరుణముయె శ్రీదేవీ
కృష్ణగతికా -భ,జ,గ,గ.
పాదములు పట్టి కొల్తున్ పాశముయె మాది దేవీ
వేదనలు తీర్చ వమ్మా ! వీణ మదివైతి దేవీ
నీదయను జూప రాదా! మాహృదయమంత దేవీ
నాదరికి రావ!మాతా మామనసునున్న దేవీ
చిత్రపదా-భ, భ, గ, గ.
కోరను గోర్కెలు శౌరీ! పోరును సల్పను దేవీ
భారము నీదని దల్తున్ భాగ్యము నీదయ దేవీ
సారెకు మ్రొక్కుచు నిన్నే సాధన చేసెద దేవీ
చేరితి నీదరి మాతా చేసితి పూజలు దేవీ
కువలయమాలా (మ న య గ యతి.. 7)
నీవే సృష్టి జనని సర్వేశీ, నీదే విద్య జనని శ్రీదేవీ
యావేశంబులను హరింపంగన్, నీదేశంబుయిది నినాదంబున్
నీవే శక్తి భువుని నంబా నే సేవింపంగ మురిసి శ్రీదేవీ
నీవే నిత్య మహిమ జూపా నే దాసుండంగ మురిసి శ్రీదేవీ
నిర్మేధ.. (న త మ గ...యతి.. 7)
దొరిత కార్యంబు ద్రుంచన్ దేవీ, వివిధ కార్యంబు విద్యా దేవీ
మెరుపు వేగంబు మేలున్ గూర్పన్, సువిధ ధైర్యంబు సూత్రం దేవీ
మెరుగ సేయంగ మేదిన్ దేవీ, నవవిధానంబు గా శ్రీదేవీ
సరుగునన్ రా వెసన్ శ్రీమాతా, భవిత భూగ్యంప్ర భా శ్రీదేవీ
బంధక (భ ణ మ గ.. యతి.. 6)
తెల్లని సుదతి వీణా పాణీ, చల్లగ పలుకు గా శ్రీ దేవీ
కొల్లలు పలుకు లర్విన్ దేవీ, అల్లిక పిలుపులే శ్రీదేవీ
వెల్లువగ కవి విధ్వన్ముఖ్యల్, మెల్లని ప్రభలుగా శ్రీదేవీ
సల్లలితవిషయాల్ శ్రీమాతా, వెల్లువ కళలుగా శ్రీదేవీ
మధ్యా ధార :(మ భ మ గ యతి.. 7)
సంతోషం చేరిన సమ్మోహంబౌ, పద్యంబుల్ నీకయి వ్రాయన్ భక్తిన్
పంతాలే మీరియు పాశంబౌనే, హృద్యంబై పార్వతి హెలంబౌగా, సంతాపం చేరెది సంసారంబౌ,
పద్యంబుల్ ప్రీతి శివా శ్రీమాతా, ఎంతైనా మార్చెది శ్రీదేవీ
చౌ పదము.. న భ భ గ గ..
సమయమే సహ జమ్మగు దేవీ, వదలనే విధి వాక్కగు దేవీ
అమరి కే సహనమ్మగు దేవీ, మెదలకే కథ తెల్పితి దేవీ
సమరమే సభలందున దేవీ, పదవికే కధలల్లితి దేవీ
సమయమే మది యాటలు దేవీ, పదునుగా విధి పాఠము దేవీ.
మీ
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ, Rtd. Accounts officer, ప్రాంజలి ప్రభ, హైదరాబాద్
..కృతజ్ఞతలు తెల్పుతూ
లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను*
శ్రీగురుభ్యోనమః శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ
ఈ శతకము వివిధ రకముల వృత్తములలో వ్రాయదళచినాను.
క్రొత్త, పాత, సహస్ర ఛందస్సు తో (1000) వృత్తములు.
, వ్రాయాలని ఆ అమ్మవారి, అయ్యవారి, దయతో శంకల్పించాను
'దేవీ.. శ్రీదేవీ !' సహస్ర ఛందస్సు తో (1000) పద్యాల మాలిక
Comments
Post a Comment