
(
****
అవ్యక్తం నామరూపాలు పొంది జీవునిగా వ్యక్తమయింది.
వాటిని వదిలించుకుంటే జీవుడే 'దేవుడు'.
###########################
'నేను' పుట్టక ముందు ఏ ప్రశ్నకు తావు లేదు.
'నేను' పుట్టిన తర్వాత కలిగిన ప్రశ్నకు సమాధానమే లేదు.
నవదుర్గలు -- ఆధ్యాత్మిక విశిష్టతలు:-
*--*
1. శైలపుత్రి:- ఆధ్యాత్మిక సాధన మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించును అని తెలియజేసేదే ''శైలపుత్రి''.
2. బ్రహ్మచారిణి:- నిరంతరం బ్రహ్మ తత్వంతో (శూన్యంతో), మూలాత్మతో అనుసంధానం అయి ఉండమని తెలియజేసేదే "బ్రహ్మచారిణి" తత్వం.
3. చంద్రఘంట:- ఎవరైతే మనస్సు నియంత్రణ కలిగి ఉంటారో వారికి 'త్రినేత్ర దృష్టి' ప్రాప్తిస్తుంది అని తెలియచేసే తత్వమే "చంద్రఘంట".
4. కూష్మాండ:- విశ్వంలోని అన్ని చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదించే మార్గాన్ని అందించే తత్వమే "కూష్మాండ".
5. స్కంద మాత:- సాధకులు తమలోని అరిషడ్వర్గాలను జయించాలి అని తెలియచేసే తత్వమే "స్కందమాత".
6. కాత్యాయని:- తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో త్రిగుణాలకు (సత్వ, రజో, తమో గుణాలకు) అతీతంగా సాధన చేయాలి అని తెలియజేసేదే "కాత్యాయని".
7. కాళరాత్రి:- ప్రతి అంతం... ఒక నవ ఆరంభానికి సంకేతం అని తెలియజేసేదే "కాళరాత్రి".
8. మహాగౌరీ:- మన ఆత్మ సాధన (ధ్యానం) మహా పాపాలను కూడా హరిస్తుంది అని తెలియజేసేదే "మహాగౌరీ".
9. సిద్దిధాత్రి:- ఆధ్యాత్మికత సర్వసిద్ధులను కలుగచేయును అని తెలియజేసే తత్వమే "సిద్ధిధాత్రి".
10 ఉపనిషత్తులు..... వాటి సారాంశం..... క్లుప్తంగా
1) ఈశావాస్యోపనిషత్:--
సర్వం ఆత్మగా దర్శించినప్పుడు, సర్వాన్ని ఏకత్వ భావనతో చూసినప్పుడు, శోకం మటుమాయమవుతుందని ఈ ఉపనిషత్ చెప్తుంది.
------------------------------
2) కేనోపనిషత్:--
ప్రతి కదలిక చైతన్యం నుండే ఉద్భవిస్తుంది, చైతన్యం వ్యక్తం కాదు, అవ్యక్తం కాదు, రెండింటికి భిన్నమైనది. ప్రతి ఆలోచన ఈ చైతన్యం నుండే ఉద్భవిస్తుందని ఈ ఉపనిషత్ చెప్తుంది.
-----------------------
3) కఠోపనిషత్:--
ఆత్మ తత్వాన్ని దర్శించినవారే నీకు అనుభవాన్ని ప్రసాదించగలరు.
-----------------------
4) ప్రశ్న ఉపనిషత్:--
నామ, రూప, క్రియలతో నిండిన ఈ సృష్టి స్వచ్ఛమైన పురుషతత్వం నుండి వచ్చింది. గంగ, యమున నదులన్నీ నామరూపాలతో ఉంటాయి. సముద్రంలో కలిసాక నామరూపాలను వదిలేస్తాయి. అలాగే పురుష చైతన్యంతో లీనమయ్యాక ఆ కలయిక ఆత్మగానే, మనకు ఏకంగా సాక్షాత్కరిస్తుంది.
---------------------------
5) ముండకోపనిషత్:--
నీవు చూసే ఈ ప్రపంచం అంతా బ్రహ్మస్వరూపమే, అది పరిపూర్ణంగా నీ చైతన్యమే. ఎక్కడ చూచినా, ఏమి చూచినా, నీకు నువ్వే దర్శనమిస్తుంటావని చెప్తుంది.
-------------------------------
6) మాండూక్య ఉపనిషత్:--
జాగృత్, స్వప్న, సుషుప్తావస్థ అనే 3 అవస్థలు మానవునికి ఉంటాయి., 3 అవస్థలు లేవు. అంతా కలిసి తురియావస్థలోనే ఉందని తెలుస్తుంది.
చూసేవాడు, చూడబడేది, ఇలా రెండు లేవు, రెండూ ఒక్కటే అని చెప్తుంది.
---------------------------
7) తైత్తరేయ ఉపనిషత్:--
మనలో ఉన్న పంచకోశాలు, ఒక్కొక్క పొరలాగా, విప్పుకుంటూ పోయి ఆనందమయ కోశం కూడా దాటి చివరికి కోశాలన్నీ నాకు వేరుగా లేవు, అవన్నీ నా స్వరూపాలే అని చెప్తుంది.
-------------------------------
8) ఐతరేయ ఉపనిషత్:--
ఆత్మను అనేకత్వంగా కాక, ఏకత్వంగా చూడటం నేర్చుకోవాలి., దృష్టి ని ఏకత్వం వైపు మళ్లించాలి.
జీవ జగత్ రూపమైన సృష్టి అంతా ఒక సంకేతం అని శాస్త్రం వర్ణిస్తుంది, ఇదే శాస్త్ర రహస్యం అంటుంది ఐతరేయం.
----–---------------------
9) చాంధోగ్య ఉపనిషత్:--
అంతా ఏకత్వమే అని గ్రహించాక, నేను అనగా శరీర ఇంద్రియాలకు అతీతంగా ఉన్న చైతన్యం అని, ఏకాత్మ రూపమైన ఆ పరమాత్మే నువ్వేనని చెప్తుంది., తత్వమసి అని చెప్తుంది చాందోగ్యం.
------------------------
10) బృహదారణ్యక ఉపనిషత్:--
మనం చేయవలసిన సాధన బాహ్యంగా కాదు, సాధన అంతరంలో చేయాలని 'అహం బ్రహ్మాస్మి' అనే సిద్ధాంతం ఈ ఉపనిషత్ చెప్తుంది.
***-*
ద్వంద్వాలే లేకపోతే నాటకమే లేదు. మంచి చెడులు, పాప పుణ్యాలు, సుఖదుఃఖాలు, మానవమానాలు, జరా మరణాలు... ద్వంద్వాలన్నీ ఉంటాయి., అవి చిరంజీవులు.
###########################
ద్వంద్వాలే లేకపోతే నాటకమే లేదు. మంచి చెడులు, పాప పుణ్యాలు, సుఖదుఃఖాలు, మానవమానాలు, జరా మరణాలు... ద్వంద్వాలన్నీ ఉంటాయి., అవి చిరంజీవులు.
###########################
పీచు మిఠాయి చూడ్డానికి పెద్దదిలా కనిపిస్తుంది. అదిమి అదిమి చూస్తే చిన్నది అయిపోతుంది. ఈ జీవితము అంతే..
తరచి తరచి చూస్తే రెప్పపాటే జీవితం.
****
అందరూ తమ బాధలు తీర్చమని దేవుణ్ణి అడిగేవాళ్ళే గాని.,
ఆ బాధలు ఇచ్చిందే దేవుడని ఎవరు గ్రహించలేకపోతున్నారు.
###########################
మనల్ని అంటుకుని ఉన్నంతకాలం గోళ్లను, వెంట్రుకలను ముస్తాబు చేస్తాము. కత్తిరించి మన నుంచి వేరుపడగానే వాటిని మైలగా పరిగణిస్తాము.
➡️ ఆత్మ నుండి విడివడిన దేహం కూడా అంతే. శవంగా (మైల పదార్థంగా) పరిగణిస్తాము.
****
గడియారం కనిపెట్టక ముందే కాలం ఉంది.
ప్రపంచం పుట్టకముందే ఆత్మ ఉంది.
###########################
శక్తి అందరికీ పరిచయమే.
శక్తుడు (ఆత్మ) ఎప్పటికీ అపరిచితుడే.
###########################
మెలకువ వస్తే గాని తెలియదు ఇదొక కల అని.
సాక్షాత్కారం అయితే గాని తెలియదు 'నేనే దైవం' అని.
###########################
ప్రతి సంఘటనకు కామా పెట్టుకుంటూ పోతే - అది జీవనయానం.
ఏ క్షణానికాక్షణం ఫుల్ స్టాప్ పెట్టేస్తుంటే - అది ఆధ్యాత్మికయానం.
****
ఆగిపోయిన గడియారం రోజులో ఒక్కసారి కచ్చితమైన కాలాన్ని చూపిస్తుంది.
ఆగిపోయిన మనస్సు రోజులో ఒక్కసారి ఖచ్చితంగా దైవాన్ని దర్శిస్తుంది.
###########################
వ్యతిరేక పరిస్థితులకు సైతం మానసికంగా సిద్దపడి ఉన్నట్లయితే అదే నిర్భయ స్థితి., అదే 'మహా సిద్ధి'.
****
ఈ సృష్టి ఎందుకు జరిగింది? అని అడగడం ఎలాంటిదంటే;
నేను ఎందుకు ఇలాంటి కలను కన్నాను? అని అడగడం లాంటిదే.
###########################
'భగవంతుణ్ణి పొందాలి' అన్నది వదిలి భగవంతుణ్ణి పొందాలనుకున్నది ఎవరో చూడు.
****
కర్మ ముందా? జన్మ ముందా?
👉 అజ్ఞానం ముందు.
అజ్ఞానం వల్ల జన్మ., జన్మ వలన కర్మలు.
👉 జ్ఞానం అంతిమం.
జ్ఞానం వల్ల నిష్కామ కర్మ., నిష్కామ కర్మ వలన జన్మరాహిత్యం.
##########################
అన్నింటిని తెలుసుకునే 'తన'ను తెలుసుకోవడమే "ఆత్మజ్ఞానం".
****
శిష్యుడు:- సాక్షాత్కారం అనేది క్రమంగా (Gradual) కలుగుతుందా? హఠాత్తుగా (Sudden) కలుగుతుందా?
సద్గురు:-
కాయ పండడం క్రమంగా జరుగుతుంది.
పండు రాలడం హఠాత్తుగా జరుగుతుంది.
➡️ కాయ పండడం - సాధన.
➡️ పండు రాలడం - సిద్ధి.
****
జ్ఞానం వలన స్వభావాలు, వ్యవహారాలు తారుమారు కావు. అన్ని యధావిధిగానే ఉంటాయి. మరి మార్పు వచ్చేది 'అవగాహన'లో మాత్రమే.
############################
శక్తిలో అందరూ ఉన్నారు కాబట్టి., అందరిలోనూ శక్తి ఉన్నది.
నేనులో (పరమాత్మలో) అందరూ ఉన్నారు కాబట్టి., అందరిలోనూ (జీవాత్మలలో) నేను ఉన్నది.
##############################
జగత్ రూపంగా ఉన్నది దేవుడే అని గ్రహించు. ఈ ప్రపంచానికి ఎంత మేలు చేయగలవో చెయ్యి., అదంతా భగవత్ సేవే అవుతుంది.
****
➡️ దేవుడే జీవుని వేషం వేయడం.
➡️ వేషం వేసిన సంగతి మరచి దేవుడిని వెతకడం.
➡️ గురువు ద్వారా ఆ గుట్టు తెలుసుకోవడం.
అనాదిగా సాగుతున్న ఆట ఇదే.
****
కథ కంచికి, మనం ఇంటికి:-
కంచి = భూ లింగం
➡️ "కథ కంచికి" అనగా మరణించిన మన భౌతిక దేహాన్ని ఈ భూలోకంలోనే వదిలేస్తామని
➡️ "మనం ఇంటికి" అనగా ఆత్మ పదార్థం తన స్వస్వరూపమైన మహా మూల చైతన్యానికి చేరుతుందని అంతరార్థం.
****
కాలము-దూరము-వేగము అనేవి పక్షికే గాని 'ఆకాశాని'కి కాదు.,
జననము-జీవితము-మరణము అనేవి తనువుకే గాని 'తన'కు కాదు.
****
Comments
Post a Comment