నేటి కవిత 
ప్రాంజలి పభ 
మల్లాపగడ రామకృష్ణ


రాత్రి పగలు అనుభవించే వాళ్ళం
వెలుగు చూడలేని మానవులం 
రెపరపలాడే కొండగాలిని తట్టుకోలెం 
ఏ వాసనో కనుక్కోలేని మానవులం 

కాలుష్య పెనుభుతానికి చిక్కినవాళ్ళం 
వృక్ష సంపదను నరికే మానవులం 
స్థలమేలేని ఇరుకు ఇళ్ళల్లో ఉండేవాళ్ళం  
స్వచ్చ వాయువు పిల్చలేని మానవులం 

ఉదయభానుని చూడలేని వాళ్ళం 
అమావాస్య చీకటి కమ్మిన మానవులం 
పుత్తడి ఆశలో చిక్కి నలిగే వాళ్ళం 
ఖజానాకోసం మోసపోయ్యే మానవులం 

నీడ రహస్యంతో ఉనికి కోల్పోయే వాళ్ళం 
మనసు మనిషికి చిక్కి బతికే మానవులం 
జీవితాన్ననుభవించి నిష్క్ర మించే వాళ్ళం 
తెరల మాయను తప్పించుకోలేని మానవులం 

అలల్లాగా కదుల్తూ ఆటుపోటు తట్టుకోనేవాళ్ళం 
కరవ్యదీక్షతో దేశసేవకు అంకితమైన మానవులం
భవిషత్ మార్గం బంగారుబాటగా మార్చేవాళ్ళం 
నిత్యం అమ్మా అయ్యా ప్రేమను పొందే మానవులం 

జీవితాన్ని పల్లేరు నుండి నల్లేరుగా మార్చేవాళ్ళం   
కర్మభద్దులమై నిత్య దీపారాధన చేసే మానవులం 
పంచభూతాల ప్రకృతి సహాయంతో బ్రతికేవాళ్ళం 
కాలాని కనుగునంగా  ధర్మంగా ఉండే మానవులం 
--((*))--


వ్యాకరణ కవితా పాఠాలు 

11 త్రిష్టుప్పు 75
u i u i u u  - i u u u u 
పల్లవ మ్మయెన్గాఁ - బ్రసూనమ్ముల్గా
చల్లనమ్మ యెన్గాఁ  - ప్రసూనమ్ముల్గా
శోభనమ్ము యెన్గాఁ - సహాయమ్ముల్గా
ఆశయమ్ము యెన్గాఁ - విహారమ్ము ల్గా    

నుల్లమందు నాశల్ - హొయల్ మీఱంగా
కల్ల బొల్లి మాటల్ - వినయ్ మీఱంగా
నల్ల మందు జీవమ్ - భయల్  మీఱంగా 
చల్ల గుండు ఆశల్ -    కలల్ మీఱంగా  

మల్లియల్ సుమించెన్ - మనమ్మం దెల్లన్
తల్లిగన్ కుటుంబమ్ - సమమ్మం దెల్లన్
జల్లుగన్ తరించున్ - తపమ్మం దెల్లన్
విల్లుగన్  చలించున్ - భయ మ్మం దెల్లన్     

వల్లవీ విలాసం - బవంగా రావా
వెచ్చనీ కలాపం - వినంగా రావా 
వెల్గుతో వినోదం - కణంగా రావా 
పృద్వితో అమోఘం - ఫలంగా రావా  

అంద మీ మనమ్మున్ - హరించెన్ గాదా
పొందుకే వినమ్మున్  - భరించెన్ గాదా 
సర్దుకో తపమ్మున్  - తరించెన్ గాదా 
ఒప్పుకో సమమ్మున్ - ఒరించున్ గాదా 

చంద మీ హృదిన్ సం-చరించెన్ గాదా
రాగమే శృతిన్ రా - గరంజిన్ గాదా
మొహమే కృతిన్  మో - హరంజిన్ గాదా 
దాహమే దృతిన్  దే - హరంజిన్ గాదా 

విందుగా సుసంధ్యల్ - విభావ మ్మిచ్చున్
అందమే సుఘంద్యల్ - సహాయ మ్మిచ్చున్
ప్రేమయే మనంబ్యల్ - ముభావమ్మిచ్చున్ 
కామమే సుమంభ్యుల్ - ప్రభాతమ్మిచ్చున్ 
   
సుందరిన్ దలంచన్ - సుమమ్ముల్ విచ్చున్
అందమున్ భరించున్ - మనమ్ముల్ విచ్చున్ 
కాలమున్ సుమించున్ - కళమ్ముల్ విచ్చున్
దేహమున్ తరించున్ - దాహముల్ విచ్చున్ 

రాగవీణ మ్రోఁగెన్ - రసమ్ముల్ జిందన్
ప్రేమవీణ మ్రోగెన్ - ప్రేమమ్ముల్ జిందన్
శబ్దఘోష మ్రోగెన్ - భయమ్ముల్ జిందెన్
అమ్మ పల్కు మ్రోగెన్ - సమమ్ముల్ జిందెన్  
   
నాగమై నటించెన్ - నవమ్మై దేహ
భావమై భరించెన్ - భవమ్మై దేహ
వేదమై జపించెన్ -  ప్రభమ్మై దేహ
రాగమై పాడించెన్ - సుఖ మ్మై దేహ

మ్మాగకుండ నీకై - హజారమ్మందున్
ఆశ వద్దు నీకై - కుటుంబమ్మందున్
మాట దాటి పోకై - పదంబమ్మందున్
వేద వాక్కు నీకై - సమం బమ్మందున్    

యోగవేళ వచ్చెన్ - యుగాదిన్ నేఁడే
అమ్మవేళ వచ్చెన్ - మనోదిన్ నేడే 
నాన్నవేళ కమ్మెన్ - శ్రమోదిన్  నేడే 
కమ్ము కున్న చిచ్చున్ - అనాదిన్ నేడే  

నింగిలోఁ గనంగా - నిశిన్ జంద్రుండున్
భూమిలో ఘనంగా - భువిన్ భద్రుండున్ 
ప్రేమలో మనంగా - వినయ్ కామించున్ 
సేవలో తరించీ - శుభమ్ ఆసించున్   

రంగులన్ వెలింగెన్ - స్రజమ్మై తారల్
ముగ్గులన్ వెలుంగున్ - ప్రజమ్ము బాదల్ 
సిగ్గులన్ వెలుంగున్ - సుఖమ్ము సోధల్ 
తల్లిగన్ వెలింగెన్ - బ్రమమ్మే కాలమ్ 

శృంగమందు మంచుల్ - హృదిన్ శోకమ్మే
కాల మందు శోభల్ - హృదిన్ శోకమ్మే
బృంగియందు వేదమ్ - శృతిన్ శోకమ్మే 
తృప్తియందు కామమ్ - భృతిన్ శోకమ్మే 

రంగడిందు లేఁడే - రమించన్ రాఁడే
వేద మాయ కాదే  - శ్రమించున్ రాడే 
దేశ సేవ ఇందే - జపించున్ రాడే 
ఆశ మోహ మందే - తపించున్ రాడే 
   
విధేయుడు - మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

నేటి హాస్యం (1)




నేటి కవిత: సులభమా-దుర్లభమా

సులభం వచ్చుట మానవజన్మ
దుర్లభం ధనం సంపాదించుటలో నీతి
సులభం కవిత్వ అర్ధం తో ఆచరణ
దుర్లభం కవిత్వంతో జీవన విధానం

సులభం మిత్రద్రోహితో జీవన పయనం
దుర్లభం శీలమే ఫణం పెట్టే స్త్రీ సంగమం
సులభం నమ్మించి మోసం చేయడం
దుర్లభం దుర్మార్గులను మంచిగా మార్చడం

సులభం ప్రేమగా పలకరించడం
దుర్లభం మాటపై నిలిచి ‌‌‌‌‌‌బతకటం
సులభం బంధానీకి లొంగి పోవడం
దుర్లభం ఆశ పరులను మార్చటం

సులభం మాటలతో మభ్యపెట్టడం
దుర్లభం గౌరవ మర్యాదలతో నమ్మించడం
సులభం పెళ్ళాం మాట ధిక్కరించడం
దుర్లభం సంతానాన్ని చక్కదిద్దడం


  • --(())--
నేటి కవిత : రాత్రి

కల్లొల  మనసున చల్లని రాత్రి
వెన్నెల కురిసిన పున్నమి రాత్రి
చక్కని వయసుకు ముద్దుల రాత్రి
యామిని సొగసుకు మెచ్చిన రాత్రి

చెక్కిట తలపులు పూచిన రాత్రి
సిగ్గులు కలసియు దోచిన రాత్రి 
పువ్వులు నలిగియు నవ్విన రాత్రి
క్రీడల జయములు చిమ్మిన రాత్రి

కాలము కలిపిన కమ్మని రాత్రి
మౌనము విడిచిన మొగ్గల రాత్రి
మానము ఒకటిగ చేసిన రాత్రి
భావము సనిదప తెల్పిన రాత్రి
ప్రతిభాదర్శనము -

ఈ వృత్తమును వాగ్వల్లభకారుడు పేర్కొన్నాడు. దీని అమరిక 6/4 - 6/4 మాత్రలు. ఇది క్రొత్త గణములైన గు/బు - గు/బు అమరికకు సరిపోతుంది. క్రింద నా ఉదాహరణములు -

బుధ గణములు -
మూడు మాత్రలు - [III, UI, IU]
నాలుగు మాత్రలు - [UII, IIU, UU, IIII]

గురు గణములు -
నాలుగు మాత్రలు - [IUI]
ఐదు మాత్రలు – [UUI, IIUI, UIU, UIII, IIIII, IIIU, IUU, IUII]
ఆఱు మాత్రలు - [UUU, UUII, UIIU, IIUU, UIIII, IIUII, IIIIU, IIIIII]

ప్రతిభాదర్శనము - స/భ/త/న/గగ IIUU IIU - UIIII UU
14 శక్వరి 3892

నియమమ్మున్ విడకన్ - నీవు మెలఁగుచుండన్
భయ మేలా మనసా - భార మతని కిమ్మా
దయతోడన్ హితమున్ - దానె యొసఁగుఁ గాదా
జయ మెప్డున్ గలుఁగున్ - సర్వ మతఁడె చూచున్

జననాథా యనఘా - సారసదళ నేత్రా
మనమిందున్ నిలిచెన్ - మాధవ నిను గానన్
వినవేలా చెవులన్ - బ్రేమనుడుల స్వామీ
వనమాలీ వడి రా - ప్రార్థనలివి నీకే

వదలంగా నగునా - ప్రాణ మెపుడు నీవే
మదిలోనన్ మెదిలెన్ - మల్లెల మధురమ్ముల్
సుధలీయన్ సుదతీ - సుందరముగ రావా
వదనమ్మున్ గనఁగా - వంతలు నను వీడున్

ప్రతిభాదర్శన మా - పండితులకుఁ జెల్లున్
ప్రతి మానిసి కగు నా - పద్యములను నల్లన్
గతి యామెయె మనకున్ - గమ్యములను జూపున్
సతత మ్మిలఁ దలువన్ - శారదనగుమోమున్
--((*))--

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - 
నేటి నాకవిత   

కనురెప్పలను వదలదు 
కనికరం చూప నివ్వదు 
గుర్తింపు వచ్చే దాకా మారదు 
వచ్చినా దబ్బున వదలదు 

అవునన్నా కాదన్నా మారదు 
వర్షం లా కారక మానదు
పంతానికి వాడక తప్పదు 
కొందరి ఆయుధమనక తప్పదు 

ప్రేమ కురవక మానదు 
మనసు మురిసిపోక తప్పదు 
మారో నాటక మనక తప్పదు 
కాపురంలో పోరు తప్పదు 

కష్టాలలో వద్దన్నా వచ్చేది 
సుఖాలలో చిగురించినా వచ్చేది 
స్నేహసౌరభాలకు ఇది ఒకనాంది 
హృదయం హృదయం కలుగుటకు పునాది 

అది ఏమిటో చెప్పగలరా      
వనమయూరము - భ/జ/స/న/గగ UIII UIII – UIII UU
14 శక్వరి 3823

కేళికలు చాలునిఁక - కృష్ణ నిశి వచ్చెన్
లీలలను జూపఁగను - రేపదియు వచ్చున్
కాలమయె నుత్పలపు - కన్నులను మూయన్
లాలినిదె పాడెదను - లాలసము నిండన్

కాలముకు పూజలిక -  ఆకలికి మార్గం
సేవలకు మార్గములు - దాహముకు దారే
వేదమును పల్కుటయె - ఆశయము దారే
దానమును చేయుటయె - ధర్మముకు దారే

సాహసము చేయుటయె - సాధనకు మార్గం  
కోపమును చూపుటయె - వాదనకు మార్గం 
వేషమును వేయుటయె - గెల్చుటకు మార్గం
తాళమును వేయుటయె- రాగముకు మార్గం

బింబములు నీడలుగ - వచ్చుటయె మార్గం
మేళములు మొగుటయె - సందడికి మార్గం
ప్రేమలకు పెళ్ళియునె -  రక్షణకు  మార్గం
 తాపముకు కార్యముయె - సత్వరమె మార్గం

--(())--
7 సూర్యగణములు, గురువు
యతి- ఐదవ గణము మొదటి యక్షరము

కారులోన సాగుచుండు కలికివీవు తెలుసులే
జోరుగాను నడుప బండి చూచినాను నేఁడటన్‌
జేరఁదలచు గమ్యమేమొ చెప్పనాకు మెల్లఁగాఁ
జేరుకోగ వేగ వేగఁ జేయకుందె సాయమున్‌

క్షణము లోనఁ జేర్చఁగలను కాలహరణమవకెటుల్‌
వణకుఁబుట్టదెట్టివిధిని వడిగ నిన్నుఁ జేర్చినన్‌
మనము కన్న వేగమౌను మాత ద్రుతియు నిజముగా
తనియఁజేయఁగలదు నిన్ను ధరణి నంత ద్రిప్పుచున్‌

చూడఁదలఁచువన్ని నీవు చూడఁగలవు శీఘ్రమే
వేడుకొసఁగు నెంతగానొ పృథివి నున్నవెన్నియో
ఆడవచ్చు పాడవచ్చు హాయిమీర నెల్లెడన్‌
వీడకుండ నిముసమైన వెంటనుండ నేనునున్‌

దాటవచ్చు జలధులన్ని తల్లి శక్తి తోడనే
ఆటుపోటులెన్ని యున్న నంబురాశులందునన్‌
నీటుగాను భీతి లేక నింగి పైన నెగురుచున్‌
దాటుకొంచు వెళ్ళవచ్చు తలఁచినట్టి సీమకున్‌‌

అడ్డఁగలుగు వారొకరును నవని పైన లేరులే
దుడ్డుఁ గూడ నడుగఁబోరు దొరలమనుచు మధ్యలో
బిడ్డ! నిన్నుఁ గొనుచు నేను బృథివినంతఁ ద్రిప్పఁగా
దొడ్డ తల్లి వచ్చెననుచు దోయిలొగ్గి నిలుచుటే

అడుగఁబోరు కాగితాల నరయఁ దలఁచి గమనముల్
అడుగఁబోరు ప్రశ్నలేవి యడ్డమైన రీతిగాఁ
గడుముదమున స్వాగతించి కావలసినవొసఁగుటే
వడివడిగను దారిఁజూపి వలయు చోట కరుగఁగా

గారవమ్మె యెచటనైన కన్నతల్లి కిడినటే
కూరదెట్టి భీతి, శంక క్రొత్త దేశమైననున్‌
శారదాంబ బిడ్డవనుచు సౌఖ్యమందఁ జేయుటే
మేరలేని ప్రేమతోడ, మేదినినెట కేగినన్‌ ‌


గగనమణి -

ఆధారము - పొత్తపి వేంకటరమణకవి లక్షణశిరోమణి
వర్గము - స్రగ్విణి
నడక - పంచమాత్రలు
యతి - (1, 10)

గగనమణి - న/స/న/భ/న/లగ
17 అత్యష్టి 64992

గగనమణి తూరుపున - గాంతులకుఁ గరగి యా
పొగలవలె మంచుతెర - భూమిపయిఁ దొలగఁగా
జగమయెను మెల్లమెల - జాగృతము, సరసిలో
మొగములను విచ్చె గద - మోదమిడఁ గమలముల్

కమలముల కన్నులను - గాంత లల తెఱచి యా
కమలముఖు డెందమున - గంపిలఁగఁ దలఁచుచున్
గమలముల మ్రుగ్గులిడఁ - గాలనిడి రపుడు బల్
గమలములఁ దుమ్మెదలు - గానమును సలుపఁగా

సలుపులయె నీయెడఁదఁ - జారుమతి యెచటనో
వలయముల కన్నులవి - వంతలకు నిలయమో
కలలవఁగ నాశ లిటఁ - గామునికి హరుసమో
చెలి యయెను జెల్వముల - శిల్పముగఁ గదలకన్

కదలె విరి మారుతపు - కౌగిలిని దలఁచుచున్
గదలె నది యా కడలి - కౌగిలిని దలఁచుచున్
గదలె జలరాశి శశి - కౌగిలిని దలఁచుచున్
కదలె హృది యా కలికి - కౌగిలిని దలఁచుచున్

తలఁచె మది నా శిశువు - దల్లి యొడి మమతలన్
దలఁచె మదిఁ బ్రేమికుఁడు - దాను చెలి చెలువమున్
దలఁచె మదిఁ దాత్వికుఁడు - దైవమును బగితితోఁ
దలఁచె మది దేవుఁ డటఁ - దన్మయపు సృజనలన్

సూచన - ప్రతి పద్యపు చివరి పదము తఱువాతి పద్యపు మొదటి పదము. అనగా పద్యములు ముక్తపదగ్రస్తములు.

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


ఇది ఒక ద్విపద, ద్విపదతో ద్విపద. ప్రతి పాదములో ఒక ద్విపద పాదము, దాని తఱువాత ఒక ఇంద్ర గణము, ఒక సూర్య గణము. మూడవ, ఐదవ గణములతో అక్షరసామ్య యతి. నాలుగవ, ఆఱవ గణములైన సూర్య గణములకు అంత్య ప్రాస ఒక అదనపు ఆభరణము. ప్రాస నియతము. 

అక్షరగీతి - ఇం/ఇం - ఇం/సూ - ఇం/సూ 

అక్షర మ్మీ గీతి - అనురాగవల్లి - అమృతాల తల్లి 
వీక్షించు మోయమ్మ - ప్రియముగాఁ బలికి - ప్రేమనే చిలికి 

వ్రాయించు వాఁడుండ - వ్రాయుటే మేలు - వ్రాయు నీ కేలు 
చేయించు వాఁడుండఁ - జేయుటే మేలు - సేయు నీ కేలు 

నిదురలోఁ గలలోన - నీకె వేచితిని - నిన్ను జూచితిని 
నిదురలోఁ గల వీడె - నేను లేచితిని - నీకె వేచితిని 

కదలుచున్ నడచె నా - కడలి సేరంగఁ - గౌగిలించంగ 
నదియు కాదామె యా-నంద గీతమ్ము - నాద రూపమ్ము 

తాండవ మ్మాడె నా - తరుణేందుమౌళి - తరుణితోఁ గేళి 
పండు వెన్నెలలోనఁ - బరిపూర్ణుఁ డాడెఁ - బదములన్ బాడె 

మదిర నీకేలరా - మధువు నేనిత్తు - మానసమ్మిత్తు 
వ్యధలు నీకేలరా - వనిత నేనుండ - వలపుతో నిండ 

పోగొట్టుకొంటిరా - పొగమంచులోనఁ - బొదరింటిలోన 
నాగవేషణ యెల్ల - నన్ను కన్గొనుట - నగుచు నే మనుట 

రాగవీణను మీటె - రమణి రంజిల్ల - రవము రాజిల్ల 
యోగ మేమిటొ నాది - యురికి యొప్పారె - నురము విప్పారె 

పైన ఉండే అక్షరగీతికి మధ్యాక్కర లక్షణాలు కూడ ఉన్నాయి. అసలు ఈ గీతి సృష్టికి కీలకము మధ్యాక్కరను ఇలా వ్రాయడమే. 




నేటి గీతం -కరోనా
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
ఎవరికి ఎవరో ఎవరికి ఎరుక అన కోయ్
సుఖదుఃఖాల తో పంచుకొని బతకా లోయ్
తెలియదు నాకు తికమక అని  అన వలదోయ్
తెలిసినది తెలిపి తెలియనిది తెలుసుకోవాలోయ్
నేల వీడి ఎదగాలని కదులుతుంది కరోనా
జీవులపై నాట్య మాడ కలుగు తుంది కరోనా
మృత్యు వంతు చూడాలని ప్రేరణతో ఉంది కరోనా
మాయా లోకానికి రమ్ము రమ్మంటున్నది కరోనా
అమ్మ ఊసు ధ్యాస చేసి, నాన్న మాట చెవి కెక్కిం చి
గగన వీధులు తిరగకుండా ఇంటి యందు ఉండి
ఆరోగ్య పరిరక్షణలో బ్యాక్టీరియా కూడా
నిల్వ ఉండ కుండా చూడా లోయ్
ఉసి గొల్పే వాటి జోలికి,
తరుణాన్ని వ్యర్ధ పరిచే పనులు చేయ కోయ్
విధి ఆడుతున్న వింత నాటకానికి పావు కాకోయ్
ప్రభుత్వ సూచనలు పాటించి, పరిశుభ్రత పరిరక్షణ
అందరి కోసం నీవు చేయగల పనులన్నీ చేసేయ్
తిధి వార నక్షత్రాలు కూడు పెట్ట వోయ్
క్రమశిక్షణ పట్టుదల కృషి మీదే ఆధారపడి
జీవిత సమరం చెయ్యా లోయ్
నిన్ను నీవు నమ్ము కో నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా ప్రవర్తించకో య్. .... ఎవరికి....
నేను నాకోసం, నా కుటుంబం కోసం, నా చుట్టూ ఉన్న వారికోసం మరియు నా దేశం కోసం
ఇంట్లో నే ఉంటాను, కుటుంబంలోనే ఉంటాను ఎవ్వరినీ కలవను, కలవనివ్వను, కరోనా మహమ్మారిని అరికట్టడంలో నా బాధ్యతను నేను నిర్వ హిస్తాను
భారత మాత ముద్దు బిడ్డగా ప్రతిజ్ణ చేసి చెపుతున్నాయ్
పెద్దలు మాటలు పెడచెవిన పెట్టక జీవితాన్ని సాగించా లోయ్
ఎవరికి ఎవరో ఎవరికి ఎరుక అనకోయ్
సుఖదుఃఖాల తో పంచుకొని బతకాలోయ్
--(())--


సరివారు ఉన్నారు గిరి దాటరాదు
సిరివారు ఉన్నారు దరి చేరరాదు 

మరునాడు వస్తేను సిరిమాట రాదు
చిరుణామ ఇస్తాను దరి చేర రాదు 
 
కలవారు అన్నారు మరి మాట వద్దు 
 కధ చేరు అన్నారు విధి ఆట వద్దు 
మగవారు చెప్పారు ఇది తప్పు వద్దు
తగువారు చెప్పారు ఇది ముప్పు వద్దు
  
కోరింది కోరింది నీ లేత వయసు
పిల్చింది పిల్చింది నీ లేత సొగసు  
కర్గిన్డి  కర్గిన్డి నీ లేత మనసు
మారింది మారింది నాకొంటె మనసు
     
కలలు రాని వేళే లేదు నిద్రలో
గెలలు రాని రోజే లేదు అర్టిలో 
వలలు లేని నావా లేదు సంద్రంలో
అలలు లేని సంద్రం లేదు పృథ్విలో 

హృదయం పలుకుతుందీ.. 
ఆ ముదిత మూగ నయనాలలో
సమయం వణుకుతుందీ
ఆ సరిత యోగ సమయాలలో 

వలయం తిరుగుతుంది 
ఆ నదిలొ గుండ సమయాలలో
తరుణం అడుగుతుంది 
ఆ పనిలొ ప్రేమ అడుగులలో     

Tenemos 7 chakras principales, los cuales no son perceptibles físicamente ni los podemos ver, sólo SENTIR.:

శ్రీ రామ తగణం  పద్యాలు (1)

1. శ్రీ రామ నీనామమే మాకు గుండే బలంగా చెసేదీ లె
    శ్రీ పాద పద్మాల పూజా  నివేదం మనస్సే సుశాంతీ లె
    శ్రీ భక్తి సేవాంతరం మాకు శాంతీ సుసౌఖ్యం నిజంగా నె 
    శ్రీ ప్రేమ భావాల తత్వాన్ని మేమందరం ఆచరించే లె 


2. శ్రీమాత సంకల్ప సాధ్యమె నిత్యా లతా తలంపే లె 
     శ్రీ వల్లభా కల్ప విద్యాను పంచే గురుం భోధ వల్లా నె 
     శ్రీ విద్య సీఘ్రంగ నేర్పించె  సంసార నిర్వాహ శక్తేలె 
     శ్రీ గీత బోధామృతం సంఘ ప్రేమాను రాగాల భంధా లె


3. వేదాంత సిద్ధాంత, సంపూర్ణ విస్వాస, ముంచాలి ఈ పూట 
    దైవాంశ మానుష్య, సద్బుద్ధి గణాంక, శక్తీయె ఈ పూట 
    ఏకాగ్ర తాశక్తి, బంధాన్ని జ్ఞానంగ, చేయాలి ఈ పూట 
    ఆశించి లాభంగ చేయొద్దు, దానాలు స్నేహాలు ఈపూట   

4. శ్రీనాధ సేవించి, ఆకర్ష కల్పించి, కారుణ్య చూపే లె
      శ్రీ సేవ నందించి, విశ్రాంతి కల్పించి, సంఘర్ష వద్దూ లె
      శ్రీవాసి పల్వంగ, న్యాయాన్ని బోధించి, సందేహ తోల్గించె
      శ్రీ మాత పూజించి, దీపాలు వెల్గించి, సంతోష కల్పించె

5. భోగాలు జోలొద్దు, రోగాలు మార్వద్దు, ఈలోక వింతా లె
     కారాలు నూరొద్దు, కోపాలు తేవద్దు, ఈపూట అంతా  లె
     మారాలు చేయద్దు, శాపాలు పెట్టొద్దు, ఏపూట వద్దూ లె
     రాముణ్ణి మర్వద్దు, ధర్మాన్ని పాటించు ఈనాడు నీవే లె

6. చెప్పొద్దు కోరద్దు, మారొద్దు సందర్భ, సందేశ సంఘం లొ
    చెయ్యాలి మొయ్యాలి ఎన్నెన్నొ, విస్వాస భావంతొ లొకం లొ
    ఆవేశ ఆలోచ నాపండి, ఆరాట పోరాట మార్గం లొ
    ఒక్కొక్క మాటల్లొ  ఉండేటి సత్యాన్ని పొందాలి నిత్యంగ

7. కళ్ళల్లొ కన్నీళ్లు, చేతుల్లొ చప్పట్లు, కాళ్లల్లో చెప్పూలు
    పువ్వుల్లో నవ్వుళ్ళు, కొప్పుల్లో పువ్వుళ్ళు, పువ్వుల్లే ఆకర్ష
    వెల్గుల్లొ చూపుళ్ళు, చూపుల్లొ రాగాలు, రాగాల్లొ శ్లోకాలు,
    శ్లోకాల్లొ ధర్మాలు, ధర్మాలె కావ్యాలు, కావ్యాలె సత్యాలు

8. వాకిట్లొ ముగ్గూలె, లోగిల్లొ చిందూలె, చీకట్లొ ఆట్లాటె
    అంగట్లొ అప్పుల్లె, తాకట్లొ ఆస్తుల్లు, సందట్లొ ఆర్భాటు
    ఎండల్లొ చన్నీళ్ళు, వాణల్లొ వేడ్నిళ్లు, నిద్రాకి దుప్పట్లు
   కుంపట్లొ మంటళ్లు, అత్తింట్లొ ముచ్చట్లు, పుట్టింట్లొ చప్పట్లు 

9. ఈ పూట కేమేమి -ఈ రాత్రి వెన్నెల్లొ - నవ్వు ల్లె పువ్వుల్లొ
    నావెల్గు నీవేగ - నాతృప్తి నీ వేగ  - ఈ వేష మెచ్చేన 
    ఈ మాట ఏ తీర్పు- ఈ ఆశ ఏ మాయ- ఈ బొమ్మ నీదేను   
    రారాసు రామా- నువే నాప్రియా నిన్ను పొందాలి ఇప్పట్లొ 

  
10. ప్రాణమ్ము నీదేను, ప్రాణమ్ము మాయేను  - ప్రాణమ్ము బ్రహ్మమ్ము
      ప్రాణమ్ము ధైర్యమ్ము, ప్రాణమ్ము మోక్షమ్ము ప్రాణమ్ము దేహమ్ము    
      ను వ్వాడు  యీసంధ్య వెల్గుల్లొ - నమ్మించు యీసృష్టి వెల్గుల్లొ
      మాట్లాడు  ఈ మంచి వెల్గు ల్లొ - ప్రేమంత చూపాలి  ఈ రాత్రి వెల్గుల్లొ 

    
       
           
           

బిడ్డాలు కోడండ్రు భంధంతొ కొండంత భాద్యత భావంగనేనున్ నినున్ వేడితిన్ నీ ప్రెమమ్మూను పొందాలి శ్రీ రంగ
Illustration by Brigitte May:

Cute Baby Elephant Dj Wearing Headphones and Glasses on Blue. By Jeff Bartels:
ప్రోత్సాహ ఉద్బోధ కల్పించి సంపాద మార్గాన్ని చూపించి
Tenemos 7 chakras principales, los cuales no son perceptibles físicamente ni los podemos ver, sólo SENTIR.:




   

     
        
  


Shiv Abhishek Art Print by Kamal Rao. All prints are professionally printed, packaged, and shipped within 3 - 4 business days. Choose from multiple sizes and hundreds of frame and mat options.


నేటి కవిత్వం - సర్వ విశ్వధాః!!
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

విరి మల్లెలే నిత్య గంధం సతి సౌఖ్య వరప్రభ 
సరాగ మాలిక ప్రేమ  నమస్తే  భవ్య మాయగా 

సిరి నిచ్చెనే సత్య భావం  పతి విద్య వరప్రభ  
విశాల పాలనా యుక్తి  నమస్తే  నిత్య సేవగా  

గిరి దర్శనా భక్తి లక్ష్యం  ప్రతి ఒక్క వర ప్రభ 
సమాన ఏలికా ముక్తి  నమస్తే సత్య లీలగా  

దరి చేరినా వారి కోర్కే విని తీర్చు వర ప్రభ 
సహాయ సేవలే శక్తి నమస్తే  విద్య వాదిగా    

అరి భంజకా వీర రుద్రా హర  హాలా హల ప్రభ 
సరోజ రాగమే భద్ర నమస్తే  రుద్ర సంహితా   

సరి మార్గమే వీర భద్రా  మది గోల మయ ప్రభ 
 విశాల భావమే ప్రజ్ఞా  నమస్తే పార్వతీ పతీ  

కరివస్త్రవిభూషిన్ భోః గిరికన్యా వరప్రద !
మురారివందిత ! ప్రాజ్ఞ నమస్తే సర్వ విశ్వధాః!!!

--(())--




యత్నం నా యజ్ఞం 

మొసలి నోటనుబడ్డ కరిరాజు మొరలిడగ 
బిరాన పరగెత్తి బ్రోచావు, వరదుడవు! 

అరుపులే వినబడున? ఆర్తి కనబడదా? 
ఏమాయె నీ కరుణ? ఎందుకీ జాగరణ? 

ముదుసలిచ్చిన పండ్లు ముదమార తిన్నావు, 
యెదలోన చోటిచ్చి ఆదుకున్నావు! 
నా కర్మఫలములు ఇంక పండనే లేదు, 
పచ్చి కాయలు స్వామి, నీకెట్ల పెట్టమంటావు? 

పాదాల చెంతనే చిత్తాన్ని నాటాను, 
పందిరై నీవుంటే పరిపక్వమౌతాను, 
ఆత్మ అర్పణ చేసి సంతృప్తి పడతాను! 

అరుపులే వినబడున? ఆర్తి కనబడదా? 
ఏమాయె నీ కరుణ? ఎందుకీ జాగరణ? 

ఊగు సాయము సేయు ఉడుతనే గమనించి 
ఆదరించానంటూ చేవ్రాలు ఇచ్చావే! 
నా లోన కదలిక కనిపంచదా స్వామి? 
రాత మార్చను రాకుంటివిదియేమి? 

అటుకులిచ్చిన వాడే ఆప్తుడని అంటే, 
అదేం కుదరదు, ఒప్పుకోను, నేనూ నీతో 
దాగుడుమూతలాడుతూ దారి తప్పాను! 

కాలం కళ్ళు కప్పి నీనుండి వేరుచేసింది, 
కలి చేతుల్లోకి కర్కశంగా విసిరివేసింది! 

దూరమై విలపిస్తున్నాను, 
చేరువవ్వాలని తపిస్తున్నాను! 

నాకు తెలిసిందొకటే వేదం, ఆర్తి నాదం! 
నాకు తెలిసిందోకటే మంత్రం, హరే రామ, హరే కృష్ణ! 

--())--


           స     భ    ర     న    మ   య    ల గ మత్తేభవిక్రీడితము - 13  .
           iiU  UII   UIU   III  UUU  IUU  IU 

          నేటి కవిత్వం :  మత్తేభవిక్రీడితము
          మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 



Juily Gite | Paintings by Juily Gite | Juily Gite Painting - SuchitrraArts.com

* మధురవాణి 

భర్తతో పలికిన పలుకు 

శృంగార రాయుడవై ఏలుకో - శ్రీ  నాధా    
అందాలు సొంతములై చేసుకో -   శ్రీ  నాధా   
స్నేహలు శాంతములై చూసుకో - శ్రీ  నాధా  
మందార మాధురినై  ఉన్నానే - శ్రీ  నాధా 

వైద్యునితో పలికిన పలుకు
పట్టి చూడరా నాడి  - గుండె  వేగమెంతో 
కట్టి చూడరా కట్టు   - దెబ్బ  రక్తమెంతో  
మందు వాడరా యోగి  -  డబ్బు  రోగ  మెంతో       
జబ్బు పోవురా  రోగి -  చింత మార్పు ఎంతో 

ప్రియుడితో పలికిన పలుకు 

అతడెంతో గడసరి   -   మనసంతా ఊపిరి 
మనసెంతో మగసిరి  -  మనువంతా  ఊపిరి 
వలపంతా పెడసరి  -  వయసంతా ఊపిరి
తనువంతా తడిపొడి -  తెలుపంతా ఊపిరి  

అనురాగ దీపాలు వెలిగించి నానే 
అపురూప శిల్పాలు తొలగించి నానే 
కనుపాప  కాంతుల కనువిందు నేనే 
అపురూప నేర్పుల  అణువంత నేనే     
     
చెప్పింది ఊకొట్టు  - చెప్పకపోతే ఒట్టు 
నమ్మింది ఊకొట్టు  - నమ్మకపోతే ఒట్టు 
నవ్వింది  ఊకొట్టు  - నవ్వకపోతే    ఒట్టు 
ఏడ్చింది  ఊకొట్టు  - ఏడవకపోతే   ఒట్టు     

సోకిన తరుణం - మానసోల్లాసం 
చూసిన సమయం - ఆనందోల్లాసం  
పూచిన  తరుణం - పుష్పోల్లాసం   
వాచిన  సమయం - బ్రమరోల్లాసం 

గిలిగింత పెట్టింది - నవ్వు వచ్చింది 
అలకంత చెప్పింది - మబ్బు మెచ్చింది
మనసంత విప్పింది - డబ్బు గుంజింది 
వయసెంత తెల్పింది - కళ్ళు కమ్మింది  

తియ్యటి మాటలతోటి  - తీరునటయ్యా  ఆకలి   
కమ్మని  పాటల  తోటి   - మారునటయ్యా  ఆకలి 
ఇప్పటి  ఆటల తోటి    -  బ్రాంతి నటయ్యా ఆకలి 
నమ్మెటి గీతము తోటి  -  శాంతి నటయ్యా  ఆకలి 

--(())--



Radha Krishna in a Secret Rendezvous on a Rainy Night - Reprints of Miniature Paintings (Reprint on Paper - Unframed)

య  మ న  స   ర   ర  గ - మేఘవిస్ఫూర్జిత -12  
IUU  UUU  III  IIU  UIU  UIU U 

నేటి కవిత్వం - మేఘవిస్ఫూర్జిత
రచయత:మాలాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

--(())--


Bijay Parida - Krishna & Yashodha 5 (Geru) - The Krishna Lila tells the story of Krishna, the eighth avatar of Lord Vishnu. Filled endearing, inspiring and terrifying scenes, it narrates the antics of Krishna as a baby, his role as the protector of the inhabitants of Vrindavan, and his adventures as a youth. Parida captures the beauty of the Ras Lila amid celebratory scenes of Krishna dancing with the <i>gopis</i>.

నేటి కవిత్వం - అమ్మలుగన్నఅమ్మ 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
UII  UIU  IUI   IUI IUI 

అమ్మలుగన్న ముగ్గురమ్మల మూలపు అమ్మ
కమ్మని మాటలే అహర్నిశమే  కళ లమ్మ 
నమ్మకమే నిరంతరం నిలిపే మమతమ్మ 
కమ్ముకొనే విషాద సంఘట మాపిన అమ్మ   

ధర్మము తెల్పి నిత్యశోభకు మూలము అమ్మ
అర్ధమువచ్చు సత్యమార్గము చూపునుఅమ్మ
కర్మ ను బట్టి ఓర్పు నేర్పును చూపిన అమ్మ
మర్మము యేలఉన్న పాపము చేయని అమ్మ 

ఆకలి తీర్చి సంతసమ్మును పంచును అమ్మ
సౌఖ్యము చూపి విద్య నేర్పిన దేవత అమ్మ
అక్కసు చూపకే నిరీక్షణతో మమతమ్మ  
మక్కువచూపియే అనేకము చెప్పిన అమ్మ  

కష్టము తెల్పకే. వివేకము చూపును అమ్మ
ఇష్టము గా పనే సకాల ము చేయును అమ్మ
నష్టము అన్నదే ఎకాలము చెప్పదు అమ్మ 
సృష్టికి కారణం  ప్రెమమ్మును చూపెది అమ్మ 

బిడ్డకు  సేవ యుక్తి ముక్తికి మూలము అమ్మ
నవ్వుల మాటలే సకాల ము తెల్పును అమ్మ
సవ్వడి చేయకే సుఖాలను పంచును అమ్మ
తల్లి కి తండ్రికీ సహాయము చేయును అమ్మ

--(())--


Lakshmi is considered another aspect of the same supreme goddess principle in the Shaktism tradition of Hinduism #Ashta Lakshmi hindu art #Ashta Lakshmi wealth #Ashta Lakshmi goddesses #Ashta Lakshmi haram #Ashta Lakshmi tanjore painting  #Ashta Lakshmi vaddanam #Ashta Lakshmi bangle #Ashta Lakshmi decoration #Ashta Lakshmi necklace

న   న  న  న  న  స .... అతివినయ ...10    
III  III  III  III  III  IIU  
నేటి కవిత్వం - అతివినయం 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

వినగ వినగ పలుకు వినయపు మది మలుపే 
తినగ తినగ  బలుపు అహముతొ  మది కులుకే 
అనగ అనగ బడలి కొదలి  బరువు తెలికే 
మునగ మునగ  బతుకు వలపు కలల మెరుపే 

కనులు కలయిక కధలు కధలుగ కులుకుటే 
చనువు పెరిగియు బతుకు సుఖములు నలుగుటే 
తనువు తనువు  తపనలు తడిపొడి చిగురులే 
అణువు అణువు కలయిక జననము పెరుగుటే  
  
చినుకు చినుకుల  ఉడుకు పరుగులు సహజమే 
కునుకు అనక గిలక  గబ గబ కదులుటయే 
వణుకు వదలిన సెగలు వెనుక చిలుకుటయే 
మిణుకు మిణుకు వెలుతురుయు  వలపులకే   

మనసు మనసు మరుగుటయు జపము తపములకే   
మనము మనము అనుటయు బతుకుల చిగురుకే 
వినను వినను అనుట బతుకులు చితుకుటకే 
అనను కనను వినను అనుట మరణమునకే 

--(())_-


UII UUI  III IUU  UUI  UII



నేటి కవిత్వము - కరోనా
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

కమ్మెను  పొంగింది మదిలొ కరోనా ప్రాణాలు గుప్పెట
తుమ్ముల జళ్లూ అణుకువ భయంగా  ప్రాణాలు  తీసెను
ఏమని చెప్పేదని మనిషి  భయంతో  ఇంటింట ఉండగ   
లేమని ఉన్నంత వరకు భయంగా  ప్రాణాలు రక్షణ

వేచితి ఇంట్లో తడవ ముడవంగా  చేసేది లేకయు 
దోచితి మా నవ్వు బలము భయంగా ప్రేమంత నిద్రగ
కాచితి మాయా జలముగ పరంగా మాకంత భాధయె   
యాచితి  కన్నీరు  వరస పరంగా  మాకేను వచ్చేను

కళ్లల రోగాల తడియు భయంగా  ఏమేమి చెప్పక
ఇళ్లలొ  ఉన్నా కలలను  భయంగా  వచ్చేను చెప్పక
మూల్గెను ఆశా వలలను భయంగా  జీవించు టందుకె
వేళల గాలాల మడియు భయంగా వెన్నంటి ఉండెను

సంతత పోఈ ఇకను భయమేనా అన్కు౦టె తప్పుయె 
యాతన చేరీ  ఇకను  భయమేనా  అన్కు౦టె ఒప్పయె
చింతల తోటే ఇకను  భయ మేనా అన్కు౦టె ముప్పుయె
విత్తము కొర్కే ఒకటిగ  భయంగా  అన్కు౦టె తప్పయె   

ఒక్కరు దేవా మనసు మరిచావా  మమ్మేల చూడవు 
ఒక్కరు ప్రేమా అనియు విడిచావా  ప్రేమంత మర్చెను
ఒక్కరు దేహన్ని ఇక విడువాలా  అంద ర్తొ  చెప్పఁగ 
ఒక్కరు మృత్యు0జయముగ పోరాడి  ప్త్రాణాల్తొ వచ్చెను 

--(())--



krishna art #krishna - krishna painting | krishna | krishna radha painting | krishna images | krishna quotes | krishna wallpapers | krishna drawing | krishna art
24-05-2020 
నేటి పద్య సౌరభము - లేఖలు 

ఉ ::  లేఖలు మాయ చేయునులె కారణ మేదియు లేదులే మన  
        స్సు ఖగుడేలె కాల వశ బట్టి సహాయము చేయులే మన 
        స్సు ఖచరం సమస్య లసు తక్షణమే చిరు నవ్వులా  మన
        స్సు  ఖనిగా సుధా సరసమై సుఖమిచ్చియు సంబరాలులే 

 ఉ :: కాకము కాదులే మనకు వేదన సంతస భావమే  ఇక 
        స్వీకరమే వయస్సు  ముసుగే జత కోరిక సంబరమ్ములే 
        ఏకము అవ్వుటే కలియు వాంఛను తీర్చుట సాహసమ్ముగా 
        మక్కువ చూపుటే మనము చేయునదే ఇది తత్వమే ఇదీ 

ఉ :: తేకువ చూపుటే యువత లక్షణమే మది వేటలో  మనో 
        వాక్కులుగా సమన్వయ ముగా సహచర్యము గా విశేష 
        మ్మే కళ  చూపగా సమ మమేకము సఖ్యతగా వివేకమే 
        ఎక్కువ చూపుటే వినయ ధర్మము వేదము సాక్షియేకదా 
     
                                      __(())__


2

నన్ను ముఖ్య మంత్రిని చెయ్యండి...గజిల్...
రచన మల్లాప్రగడ 

విత్తు భూమిన పాతి నీరు పోసి వృక్షం  చేస్తా
 కవి అక్షర పదాల సత్య వాక్యాలను సృష్టిస్తా

 వినయ జీవితము చర్చించి భవిష్యత్తు చూపిస్తా
 జీవిత భాగస్వామిని ప్రేమగ  చేరదీస్తా

 నిత్య ఆత్మీయ స్నేహితునిగా అభిమానిస్తా
 అందమైన బొమ్మ వేసి అందరిని ఆకర్షిస్తా

 అందాన్ని చూసి ఆనందంగా ఆస్వాదిస్తా
 ముఖ్యమంత్రిగా అవకాశంతొ నే అనుభవిస్తా

రైతు కష్టాన్ని గుర్తించియే రుణాలాందిస్తా
 పల్లె పట్టణాల్లో జనులకు నీటి వసతి కల్పిస్తా 

న్యాయన్ని రక్షించి  అధర్మపరులనే శిక్షి స్తా
విద్యార్థుల విద్య బట్టి ఉద్యోగాలు  కల్పిస్తా 

విలువలనుబట్టి యె నిత్యమనసుతో సహకరిస్తా
 అధికార అనధికారులనే అదుపులోకి తెస్తా 

 ప్రజలకు అవినీతిలేని రాజ్యాన్ని అంద చేస్తా
 ధైర్యంతో నాకు ఇవ్వండి పరిపాలిస్తా

గజల్ .. కర్తవ్యమ్ నెమ్మదిగా నెరవేరుద్దాం  

ప్రయాణానికి సహకరిస్తూ కదులుదాం నెమ్మదిగా 
ప్రమాణానికి అనుకరిస్తూ మెదలుదాం నెమ్మదిగా 

చేయాలన్నవి చేయలేనివి ప్రయత్నిస్తూ చేరువుగా
విమర్శలు రాకుండా పనులన్నీ చేద్దాం నెమ్మదిగా

బ్రతుకు భారమన్న వారికి సహకరిస్తూ ఓదార్పుగా
చేయూత నిచ్చి ఆదుకుంటూ కదులుదాం నెమ్మదిగా
   
తెలుగు తల్లి, బాష ,ను గౌరవిస్తూ, స్వచ్చమైన తేటగా
మంచిని పెంచుదాం కలసి మెలసి సాగుదాం నెమ్మదిగా

రోగులకు సహకరిస్తూ, కలాన్ని అనుకరించే గాలిలాగా
కదులుతూ మానవత్వాన్ని బ్రతికించుదాం నెమ్మదిగా

శతృభావం వదలి అందరిపై కరుణ భావం చూడాలిగా 
సాటి మానవులపై స్నేహభావంతో కదలాలి నెమ్మదిగా  

==(())==


 

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ