ప్రాంజలి ప్రభ


నాటి కవిత
.
శ్రీధరా గుణమివ్వు - శ్రీధరా మనసివ్వు
శ్రీధరా వరమివ్వు - శ్రీధరా రారా

శ్రీమతీ గుణమందు - శ్రీమతీ రణమందు
శ్రీమతీ  తెలివంత - శ్రీమతీ మేలే

ఆశలే జగమంత - ఆశలే అణువంత
ఆశలే వెలుగంత - ఆశలే కాదా

ఙివితం వయసంత - జీవితం భ్రమలంత
జీవితం మనసంత -  జీవితం అంతం

రాముఁడే మనమందు - రాముఁడే హృదియందు -
రాముఁడే తలఁపందు - రాముఁడా ఱేఁడే

కాముఁడే పొడయందు - కాముఁడే నడయందు -
కాముఁడే వలఁపందు - కాముఁడా ఱేఁడే

భీముఁడై నను జేరు - రాముఁడై నను బిల్చు -
కాముఁడై నను గూడు - స్వామి నా ఱేఁడే

కొరికే వలదందు - కొరికే తనువంత
కొరికే మనసంత  - కొరికే స్నేహం

మెచ్చునో, కలలందు - వచ్చునో, విరిదండఁ -
దెచ్చునో, యనురాగ - మిచ్చునో లేదో

మెచ్చునో, నను జూడ - వచ్చునో, చెలువమ్ముఁ -
దెచ్చునో, యొక ముద్దు - నిచ్చునో లేదో

మెచ్చునో, దరి జేర - వచ్చునో, చిఱునవ్వుఁ -
దెచ్చునో, పరిరంభ - మిచ్చునో లేదో

మెచ్చునో, వనమాలి - వచ్చునో, యొక కాన్కఁ -
దెచ్చునో, పులకింత - లిచ్చునో లేదో

మెచ్చునో యువకంత  - వచ్చునో వెలుగంత
దెచ్చునో చణువంత - లిచ్చునో లేదో

మెచ్చునో బ్రతుకంత - వచ్చునో కలయంత
దెచ్చునో మనువంత - లిచ్చునో లేదో           

--((***))--



నేటి కవిత
ప్రాంజలి ప్రభ
ఇప్పుడు అవసరమా


సరిగమలతో సరసాలు

పదనిసలతో పలుకులు
గమనములతో హస్యములు
కోపములకు తొందరులు
ఇప్పుడు అవసరమా

పండువెన్నెల్లో చల్లగాలులు

తనువును తడిపే చిరుజల్లులు
మనస్సును తాకే కోకిల కూతలు
చీకటిలో దోబూచి ఆటలు
ఇప్పుడు అవసరమా

సెలయేరుల సవ్వడులు

థళుక్ థలుక్ మెరిసే వెలుగులు
పువ్వుల పరిమళాలు
మనుగడ కోసం కూనిరాగాలు
ఇప్పుడవసరమా

అదేపనిగా కదిలించుట వీణ తీగలు

సమయమే కదాఅని వాయించుట మృదంగాలు
పైకి కిందకు ఊపుతూ వయోలన్ శబ్ధాలు
చెవులకు తాకే మృదు హస్య మాటలు
ఇప్పుడు అవసరమా

చూపుట నిగ నిగ లాడే నీలి నేత్రాలు

చూపుట వయ్యారముగా నడుము ఊపులు
ఊపుతూ చూపుట మోగలిరేకుల పూలజడలు
నూలుపోగు వస్త్రాలతో హంస నడకలు
ఇప్పుడు అవసరమా

యేవయసులో కోరికలు ఆవయసులో 

తీర్చుకొనుట అవసరము కదా
అవునూ అవసరమే తొందరపాటు 
అనవసరము కదా
కదా......కదా....... కదా .. కదా
మాతృశ్రీ వందన పుష్పాలు -32
 
కుల కులాల దేశము చూశా
మత మతాల మర్మము చూశా
శుభ శుభాల తత్వము చూశా  
యుగ యుగాల ఆశను చూశా, జగతి లీళలో

మెరుపుతో మేఘం పన్నీరు చూశా, శ్రావణ మాసంలో   
దిగులుతో నైనం కన్నీరు చూశా
పగలుతో రేయి పొట్లాట చూశా
నగలతో దేహ మెర్పులు చూశా 

ప్రేమతో చెలిమి తీవ్రత చూశా
భోధతో బలిమి భద్రత చూశా
విద్యతో కలిమి శుభ్రత చూశా
ఆశతో పుడమి ఆత్రుత చూశా, తెలుగు భాషలో

మత్తు వచ్చి అజ్ఞాన మోసం చూశా 
చిత్తు చేసె సుజ్ఞాత వైనం చూశా
నిత్య మాయ అజ్ఞాత కార్యం చూశా
విత్తు విచ్చి విజ్ఞాన తేజం చూశా, సామాన్య శాస్త్రంలో

నమ్మకంలో నాన్న ప్రేమను చూశా
విస్మయంలో బిడ్డ ప్రేమను చూశా
చిన్మయంలో కృష్ణ ప్రేమను చూశా
పెంపకంలో అమ్మ ప్రేమను చూశా, జీవన గమ్యంలో 

తల్లి మాట సువార్తలుగా చూశా
బిడ్డ గోల మహాసెగగా చూశా 
నవ్వు వచ్చు మహాపలుకు చూశా
మల్లె పూల సువాసనను చూశా, శృంగార లీలలో 

పగలు సెగ పర్వతాన్ని చూశా
మనిషి పగ దాతృత్వాన్ని చూశా
వినయ వల బంధుత్వాన్ని చూశా
దిగులు పడు యవ్వనాన్ని చూశా, మగువ మత్తులో

మనసు మార్చే మనిషిని చూశా
దిగులు పెంచే వయసుని చూశా
తెగులు పట్టె తరువుని చూశా
అలుక తీర్చే ఆకలిని చూశా, శ్రీమతి వడిలో

--(())--
 మాతృశ్రీ వందన పుష్పాలు -31

నిండుపున్నమి వెల్గులెన్నో చూశా
చెండు వువ్వుల కాంతులెన్నో చూశా
అమ్మ మాటల్లొ మంచి ఎంతో చూశా
పండువెన్నెల వన్నెలెన్నో చూశా, తెల్లారే వేళలో 

లత వెలుగు తరువులో చూశా
మది మెఱుపు యువతలో చూశా
కళ విలువ యువకలో చూశా  
నది పరుగు కడలిలో చూశా, వర్షపు వేళలో

మలి ముద్దు మనసుయందు చూశా
చలి ముద్దు సెగలు యందు చూశా
గిలి ముద్దు నళిని యందు చూశా
తొలి ముద్దు పెదవియందు చూశా మొదటి రాత్రిలో 

వెలుగు పరిచిన రవి చూశా
కధలు తెలిపిన కవి చూశా
చెలిమి కలిపిన చెలి చూశా
నళిని వలచిన శశి చూశా, అంబరం ఆశలో
--(())--


మాతృ శ్రీ వందన పుష్పాలు -30

రంగుల గులాబి పువ్వుల హంగు
విందుల వినోద నవ్వుల హంగు
లోకులు అనేటి అప్పుల హంగు
జీవులు తినేటి తిట్టుల. హంగు

సమకూర్చుచుండు హామీ తో హంగు
వినిమార్పుచేసి పోటీ తో హంగు
బతు కంత నీతి సూత్రాలే హంగు
చితి మంట ఆశ పాశం తో హంగు

మనసు మనసు కలయిక తో హంగు
వయసు వయసు పరుగుల తో హంగు
సొగసు సొగసు ఉరకల తో హంగు
తనువు తనువు తపనల తో హంగు

కొలిచే సాధనం గా నిలిచే శక్తి తో హంగు
కళలే బోధనం  గా పలికే యుక్తి తో హంగు
బతుకే శోభనం గా నిలిచే ముక్తి తో హంగు
మనలో శక్తి యంతా ధరణీ భక్తి తో హంగు

:::() ::


మాతృశ్రీ వందన పుష్పాలు -29 
  
మేనితో వెలుగొందు భవదీయ చిత్కళ
ప్రేమతో మనసిచ్చు రమణీయ చిత్కళ
ఆశతో పురికొల్పు లత మాయ చిత్కళ
ఆటతో మొదలెట్టు గతచిహ్న చిత్కళ

మాయ విజేతలుగా మహనీయుల చిత్కళ
దేహ వినోదులుగా చిరుహాసుల చిత్కళ
మోహ నిరోధులుగా మునివర్యుల చిత్కళ
చిత్ర విచిత్రులగా నటనా పర చిత్కళ

ఆనందలహరిలో ఓలలాడుచూ చిత్కళ
సేవాపధకములో తప్పు ఒప్పులూ చిత్కళ
మోహాంధకరములే చిక్కి శల్యమే చిత్కళ
విశ్వాస సుమములే తల్లి మాటలే చిత్కళ    

మెరుపుతీగను బోలు మనసు మెరుపు చిత్కళ
పుడమితల్లిని బోలు సొగసు మఱుపు చిత్కళ
కలువపువ్వును బోలు మగువ మదియు చిత్కళ
ఒకరికొక్కరు బోలు తరుణ తమక చిత్కళ

--(())--


మాతృశ్రీ వందన పుష్పాలు -28 

ఆకాశంలోని నక్షత్రాలును లెక్కించ గలరా 
ఏకాంతంలోని నిక్షేపాలను లెక్కింప గలరా
ప్రారభ్ధంలోని ఉద్వేగాలను లెక్కింప గలరా
కారుణ్యంలోని ధర్మార్ధాలను లెక్కింప గలరా 

వదనమ్మునే బందు స్థానమ్ముగా లెక్కింప గలరా
మనసమ్మునే బిందు సాధ్యముగా లెక్కింప గలరా
పఠనమ్మునే చేసి సాంఖ్యముగా లెక్కింప గలరా
శపధమ్మునే చేసి హృద్యముగా లెక్కింప గలరా

మనుష్య కళా స్థానమును ధ్యానించి లెక్కింప గలరా
వసిష్ఠ తపో స్థానమును గుర్తించి లెక్కింప గలరా
చరిత్ర వినీ స్థానమును కల్పించి లెక్కింప గలరా
ధరిత్రి మహా స్థానమును పొందాక లెక్కింప గలరా

చిత్రాతి చిత్రముగా భవిషత్తుని లెక్కింప గలరా
ఆనంద ఆత్రముగా అతిహాస్యము లెక్కింప గలరా
విశ్వాస విస్మయమే నిజ భాష్యము లెక్కింప గలరా
నిర్మాణ నిర్మలమే గుణ మార్గము లెక్కింప గలరా  
    
 


మాతృ శ్రీ వందన పుష్పాలు -27 
కిరణాల చలవతో అమృతమ్ము కురిపించు
పవనాల విలువతో గగనమ్ము కురిపించు
పారువాలా కథలతో మనసమ్ము కురిపించు
హృదయాల తపనతో మధురమ్ము కురిపించు

భవరోగ పీడితుల పై కరుణ రసం కురిపించు
మన:శాంతి పీడితుల పై వినయ రసం కురిపించు
మధుమోహ పీడితుల పై మమత రసం కురిపించు
అనురాగ పీడితుల పై ఆధర రసం కురిపించు

ముసి ముసి నవ్వుల చూపు మత్తు కురిపించు
భలె భలె పువ్వుల రూపు మత్తు కురిపించు
గల గల మువ్వల ఊపు మత్తు కురిపించు
దబ దబ సమ్మెట దెబ్బ మత్తు కురిపించు

దర్పమ్ము తొలగించి ఆనందమ్ము కల్పించు
వైరమ్ము మరిపించి బ్రహ్మాండమ్ము కల్పించు

స్నేహమ్ము కలిగించి సద్భావమ్ము కల్పించు
 ప్రేమమ్ము కురిపించి సంతోషమ్ము కల్పించు
 
 


మాతృ శ్రీ వందన పుష్పాలు -26

బాల భాను కాంతి పుంజాలు వెదజల్లు
రామ భాణ కాంతి లోకాలు వెదజల్లు
రామ నామ కాంతి దేహాల్లొ వెదజల్లు
విశ్వ మాయ కాంతి దేశాల్లొ వెదజల్లు

అంబరం దేహ కాంతి వర్ణాల్లొ వెదజల్లు
పృధ్యియే మోహ కాంతి దేహాల్లొ వెదజల్లు
శాంతమే దాహ కాంతి ఊహల్లొ వెదజల్లు
కాలమే మాయ కాంతి విస్తర్లొ వెదజల్లు

మేని వెలుగు వింత కాంతులు వెదజల్లు
ఆశ పరుగు కొత్త పొంతలు వెదజల్లు
కాల మలుపు తిప్పె చిందులు వెదజల్లు
చూపు కలిపి ఒప్పు మాటలు వెదజల్లు

ప్రేమికులు గా మారి మనసు పై నవ్వు వెదజల్లు
శ్రామికులు గా మారి పనులు లో శక్తి వెదజల్లు
ప్రార్ధనలు  గా మారి భోజన లో భక్తి వెదజల్లు
మాతృ పనిగా చేసి బోధను లో యుక్తి వెదజల్లు


మాతృశ్రీ వందన పుష్పాలు =25

  
శ్వేత ముఖ దేహ కాంతుల నొప్పి మహిత
స్వేచ్ఛ పద వాక్కు వెల్గుల నొప్పు మహిత
జ్వాల మయ మస్త కాంతులు తెల్పు మహిత
ప్రేమ మయ వేద బోధలు తెల్పు మహిత

వాక్కుల సృష్టి కర్త మదిలో ఉండే మహిత
దాహము తీర్చు భర్త మదిలో ఉండే మహిత
దేహము ఇచ్చి పుచ్చు మదిలో  ఉండే మహిత
దానము చేసి సేవ మదిలో ఉండే మహిత

వశిన్యాదులైన దేవతలతో కలసి ఉండే మహిత
చరితార్థులైన మౌనులతో కలసి ఉండే మహిత
చదువార్జులైన విద్యలతో కలసి ఉండే మహిత
సముపార్జులైన శక్తులతో కలసి ఉండే మహిత

కవి కావ్యాలతో మన:శాంతి కల్పిస్తూ ఉండే మహిత
మది భాష్యాలతో మనసంత మెప్పిస్తూ వుండే మహిత 
గుణ లక్ష్యాలతో విధి మార్పు చేయిస్తూ వుండే మహిత
చిరు హాస్యాలతో వయసంత గుప్పిస్తూ వుండే మహిత

--(())--
 మాతృశ్రీ వందన పుష్పాలు =24

అరుణ వర్ణంబుల తోడ అలరారు అందం 
కరుణ హృద్యంబుల తోడ  కనుచూపు అందం
శరణ వాదంబుల తోడ కనిపించు అందం
చరణ వాక్యంబుల తోడ పలికేటి అందం

కవి వరులు పొందెదరు బ్రహ్మ బ్రహ్మతేజంబు
రవి కిరణ కాంతులు ను స్వచ్ఛ స్వేత తేజంబు
లత వికసితా మెరుపు హర్ష వర్ణ తేజంబు
జనని పిలుపే మనసు సత్య వాక్కు తేజంబు

గంభీర వాక్పటిమ శృంగార రస లహరి
ఉత్తేజ ఉత్సవము సంతృప్తి కధ లహరి
సమ్మోహ సాహిత్యము విశ్వాస తిధి లహరి
సద్భావ కారుణ్యము నిక్షేప విధి లహరి

వాక్పటిమను చూసి సజ్జనులు రంజిల్లు
రక్షణమును చూసి దుర్జనులు భీతిల్లు  
భక్షణమును చూసి ఉద్వేగులు భీతిల్లు
తల్లితనమును చూసి సమ్మోహులు రంజిల్లు

 


*మాతృశ్రీ వందన పుష్పాలు -23

 అక్షర సత్యానికి ఆహారం పుస్తక పఠనం
మస్తక భక్షానికి ఆహారం మనస్సు పఠనం
ఆర్ధిక పత్యానికి ఆహారం యశస్సు పఠనం
వెల్గుల తత్వానికి ఆహారం తమస్సు పఠనం

పండిత పామర సాహిత్యానికి వెలుగు ఆదరణ
నాయక నాయకి సామీప్యానికి వెలుగు ఆదరణ
శ్రీమతి శ్రీపతి ప్రాధాన్యానికి వెలుగు ఆదరణ
ప్రేమకు పెళ్ళికి స్నేహత్వానికి వెలుగు ఆదరణ

నిరంతర అధ్యయనానికి సాధన శోధన ముఖ్యం
సమాంతర అభ్యుదయానికి ప్రకృతి భావన ముఖ్యం
కధాపర ఆత్మభావానికి ఆకృతి ఆకలి ముఖ్యం
యధావిధి గా తన్మయానికి శ్రీపతి శ్రీమతి ముఖ్యం

రాసేది పదం చెప్పేది భావం వినేది సత్యం
కనేది చిత్రం అనేది గాత్రం తినేది మౌనం
చేసేది మోసం తెల్పేది నిజం పెర్గేది కోపం
అందుకే పదాల పెదాల పొందిక హాసం అమ్మే

 


*మాతృశ్రీ వందన పుష్పాలు -22 


మదము, దొంగతనము, మంకుబుద్ది,  చురుకుగా
విసుకు, లేకితనము, మొండిబుద్ధి , గరుకుగా
చవట, గొప్పతనము, జంకుబుద్ధి , తళుకుగా
సహజ, పెంపుతనము, తల్లిబుద్ధి , తెలివికె

మొరటువాని తోడ సరసమాడుట రోతగా
పిరికివాని తోడ నడకసాగుట రోతగా
గుణము లేని వాని చెలిమి సాగుట రోతగా
ఫలము లేక తల్లి బలము పెంచుట తెల్వియె

మధుర మంజుల వాక్కులు మంగళముగా
వినయ సంపద పల్కులు రాగములుగా
కళల సంద్రపు ఘోషలు వేదములుగా
కళలు సాధన కోర్కలు తల్లి చలవే    .......

వినయ వినమ్రత వివేక విశ్వ భావములుగా
సమయ సమున్నత సమాన సశ్య సాధనలుగా
కరుణ కమనీయ విశాల దృశ్య వేదికలుగా
తెలుగు వెలుగే టి విభాగ స్మృతి అమ్మ చలవే


--(())--
****
విత్తు భూమిన పాతి నీరు పోసి వృక్షం  చేస్తా
 కవి అక్షర పదాల సత్య వాక్యాలను సృష్టిస్తా

 వినయ జీవితము చర్చించి భవిష్యత్తు చూపిస్తా
 జీవిత భాగస్వామిని ప్రేమగ  చేరదీస్తా

 నిత్య ఆత్మీయ స్నేహితునిగా అభిమానిస్తా
 అందమైన బొమ్మ వేసి అందరిని ఆకర్షిస్తా

 అందాన్ని చూసి ఆనందంగా ఆస్వాదిస్తా
 ముఖ్యమంత్రిగా అవకాశంతొ నే అనుభవిస్తా

రైతు కష్టాన్ని గుర్తించియే రుణాలాందిస్తా
 పల్లె పట్టణాల్లో జనులకు నీటి వసతి కల్పిస్తా 

న్యాయన్ని రక్షించి  అధర్మపరులనే శిక్షి స్తా
విద్యార్థుల విద్య బట్టి ఉద్యోగాలు  కల్పిస్తా 

విలువలనుబట్టి యె నిత్యమనసుతో సహకరిస్తా
 అధికార అనధికారులనే అదుపులోకి తెస్తా 

 ప్రజలకు అవినీతిలేని రాజ్యాన్ని అంద చేస్తా
 ధైర్యంతో నాకు ఇవ్వండి పరిపాలిస్తా

గజల్ .. కర్తవ్యమ్ నెమ్మదిగా నెరవేరుద్దాం  

ప్రయాణానికి సహకరిస్తూ కదులుదాం నెమ్మదిగా 
ప్రమాణానికి అనుకరిస్తూ మెదలుదాం నెమ్మదిగా 

చేయాలన్నవి చేయలేనివి ప్రయత్నిస్తూ చేరువుగా
విమర్శలు రాకుండా పనులన్నీ చేద్దాం నెమ్మదిగా

బ్రతుకు భారమన్న వారికి సహకరిస్తూ ఓదార్పుగా
చేయూత నిచ్చి ఆదుకుంటూ కదులుదాం నెమ్మదిగా
   
తెలుగు తల్లి, బాష ,ను గౌరవిస్తూ, స్వచ్చమైన తేటగా
మంచిని పెంచుదాం కలసి మెలసి సాగుదాం నెమ్మదిగా

రోగులకు సహకరిస్తూ, కలాన్ని అనుకరించే గాలిలాగా
కదులుతూ మానవత్వాన్ని బ్రతికించుదాం నెమ్మదిగా

శతృభావం వదలి అందరిపై కరుణ భావం చూడాలిగా 
సాటి మానవులపై స్నేహభావంతో కదలాలి నెమ్మదిగా  

==(())==


మొరటువానితోడ సరసమాడుట రోత
పిరికిపంద వెంట నరుగ రోత
నీతిలేని వాని నేస్తంబు రోతరా

   
   

జంధ్యాల పాపయ్య శాస్త్రి
గారి తెలుగు బాల శతకము*
1
తెనుగుదనమువంటి తీయందనము లేదు,
తెనుగు కవులవంటి ఘనులు లేరు
తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా
లలిత సుగుణజాల! తెలుగుబాల!
2.
కష్టపెట్టబోకు కన్నతల్లి మనస్సు
నష్టపెట్టబోకు నాన్నపనులు
తల్లిదండ్రులన్నదైవసన్నిభులురా
లలిత సుగుణజాల! తెలుగుబాల!
3.
డేశసేవకంటె దేవతార్చన లేదు
స్వార్దపరతకంటె చావు మేలు
సానుభూతికంటె స్వర్గంబు లేదురా
లలిత సుగుణజాల! తెలుగుబాల!
4.
అందమైన సూక్తి అరుణోదయంబట్లు
బాల మానసముల మేలుకొల్పు
సూక్తిలేని మాట శ్రుతిలేని పాటరా
లలిత సుగుణజాల! తెలుగుబాల!
5.
రక్తిలేని యాట రాత్రి నిద్దురచేటు
భక్తిలేని పూజ పత్రిచేటు
నీతిలేని చదువు జీతాలచేటురా
లలిత సుగుణజాల! తెలుగుబాల!
6.
వినయ, మార్జవంబు, నీరత్వ, మనుకంప
దీక్ష, సత్యసూక్తి, డేశభక్తి
మండనమ్ము లివ్వి మంచి విద్యార్థికి
లలిత సుగుణజాల! తెలుగుబాల!
7.
మదము, దొంగతనము, మంకుబుద్ది, అసూయ
విసుగు, పిరికితనము, విరుగబాటు
సహజ వుణము లివ్వి చవట విద్యార్థికి
లలిత సుగుణజాల! తెలుగుబాల!
8.
మొరటువానితోడ సరసమాడుట రోత
పిరికిపంద వెంట నరుగ రోత
నీతిలేని వాని నేస్తంబు రోతరా
లలిత సుగుణజాల! తెలుగుబాల!
9.
ఎద్దు నెక్కె శివుడు, గ్రద్ద నెక్కెను విష్ణు
హంస నెక్కె బ్రహ్మ అందముగను
బధ్దకంపు మొద్దు బల్లపై నెక్కెరా
లలిత సుగుణజాల! తెలుగుబాల!
10.
బడికి నడువలేడు, పాఠాలు వినలేడు
చిన్నపద్య మొప్ప జెప్ప లేడు
రాజ రాజుబిడ్డ నేటి విద్యార్థిరా
లలిత సుగుణజాల! తెలుగుబాల!
 11.
పరమ సుందరంబు ఫలములు, సంసార
విష మహీజమునకు వెలయు రెండు
సాదుసంగమంబు, సత్కావ్యపఠనంబు
లలిత సుగుణజాల! తెలుగుబాల!
12.
అతిథిజనుల వీడి అభ్యాగతుల వీడి
దేవతలకు నిడక తినెడివాని
చెప్పనగు ధరిత్రి "జీవస్మ్రుతుం"డని
లలిత సుగుణజాల! తెలుగుబాల!
13.
జనులకొరకు ధర్మశాలలు గట్టించి
బీదసాద నెంతొ యాదరించి
పేరుగన్న కర్మవీరుడమృతజీవి
లలిత సుగుణజాల! తెలుగుబాల!
14.
హంసలందు బకము హాస్యాస్పదంబగు
మణుల గాజుపూస గణుతి గనదు
చదువురాని మొద్దు సభల రాణింపదు
లలిత సుగుణజాల! తెలుగుబాల!
15.
జవ్వనంబు గలిగి, సౌందర్యమును గల్గి,
కలిమి గలిగి, విద్య గనని జనులు
గంధరహిత కింశుక ప్రసూనంబులు
లలిత సుగుణజాల! తెలుగుబాల
16.
బ్రతికినన్నినాళ్ళు ఫలము లిచ్చుటె గాదు
చచ్చికూడ చీల్చి యిచ్చు తనువు
త్యాగభావమునకు తరువులే గురువులు
లలిత సుగుణజాల! తెలుగుబాల!
17.
జూలు చుట్టు కొన్న వాలమల్లార్చిన
కొండకొమ్మ మీద కూరుచున్న
కరుల గుండె లదర గర్జించునా నక్క
లలిత సుగుణజాల! తెలుగుబాల!
18.
తగిలినంతమేర దహియించుకొనిపోవు
చెడ్డవాని చెలిమి చిచ్చువోలె
మంచివాని మైత్రి మలయమారుత వీచి
లలిత సుగుణజాల! తెలుగుబాల!
19.
అది పయోధి దోష మడుగున మణు లిడి
తృణగ ణమ్ము తల ధరించు టనిన
మణుల విలువ పోదు తృణముల కది రాదు
లలిత సుగుణజాల! తెలుగుబాల!
20.
ఫణిని మట్టుపెట్టి బాలు గాపాడిన
ముంగి జంపె నొక్క మూర్ఖురాలు
మంద మతుల కెపుడు ముందుచూ పుండదు
లలిత సుగుణజాల! తెలుగుబాల!
21.
సాధుసంగమమున సామాన్యుడును గూడ
మంచి గుణములను గ్రిహించుచుండు
పుష్పసౌరభంబు పొందదా దారంబు
లలిత సుగుణజాల! తెలుగుబాల!
22.
అడవి గాల్చువేళ నగ్నికి సాయమై
నట్టి గాలి దీప మార్పి వేయు
బీద పడిన వేళ లేదురా స్నేహంబు
లలిత సుగుణజాల! తెలుగుబాల!
23.
మధుకరంబు వచ్చి మకరందమును ద్రావు
సరసిజంబు క్రింద తిరుగు కప్ప
కాంచ లేరు జడులు కావ్య సౌందర్యంబు
లలిత సుగుణజాల! తెలుగుబాల!
24.
విరుల జేరి హరుని శిరసు నెక్కిన చీమ
చంద మామతోడ సరస మాడె
ఉత్తమాశ్రయమున నున్నతస్థితి గల్గు
లలిత సుగుణజాల! తెలుగుబాల!
25.
నీట, కుంజరమును నిలబెట్టు మొసలిని
బైట పిచ్చికుక్క పరిభవించు
స్థానబల మఖండ శక్తి ప్రదమ్మురా
లలిత సుగుణజాల! తెలుగుబాల!
💐********💐*******💐*******💐******💐


6. నాని నీనాను నేనును నానినాను
నాన నేనును నిన్నూనినున్న నన్ను
నెన్న నున్నను నిన్నెన్న నున్న నాన
నిన్న నేనన్న నున్న నన్నెన్ను నన్ని

7. 
9. జలకలకలకులకులకుల
జలదకలక జలజములుకజలమలకపయో
ఫలనిలవలలన యలస
త్ఫలదాయక ఫలిత లలిత పూర్వవివేకా

10. శరశర కాండకాండ హరిచందన చందన నాగనాగ సుం
దరధర చంద్రచంద్ర శ్రిత నారదనారద తారతార భూ
ధరధర రాజరాజ హయదానవ దానవ కాశ కాశ స
త్పురపురమారమార హర భూధరభూధర కాలకాలహా
 


 --((*))--

తళుకుంబంగరమేను వజ్రమయమౌ దంతంబు హస్తంబునం
దళుకున్ముత్తెపుమోదకంబు దగ శృంగారంబుగాఁ జేసి ని
చ్చలుఁ బుాజించుటచేఁ బ్రసన్నుఁడయి నిష్ర్పత్యుాహసంసిద్ధిచే
వెలయించు న్గృతి నేకదంతుఁడు గృపావేశంబుతో నెప్పుడున్.

ధరణీదేవుల రామయమంత్రి "దశావతారచరిత్రము" నుండి గణేశవందన.

love and trust Always listen to what true love says,   never ignore or avoid it.  When it comes to you,   it comes in the purest form.    it has some

నేటి కవిత్వం - 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

కైపున్న కామికుల కోర్కళుడె గాక 
ఏమన్న జూదరులు ఆశలుడె గాక
కాదన్న వేటయును చేయుదురు గాక   
పైకొన్నదుఃఖముల పాలుపడెఁ గాక

కారుణ్య భావాలు ఎక్కడివి ప్రాణులకు 
ద్వేషాన్ని చూపేటి లక్ష్యములు ప్రాణులకు 
ప్రేమంటు మోసాలు చేసెడివి ప్రాణులకు 
ఏకాంతసౌఖ్యంబు లెక్కడివి ప్రాణులకు
  
ధైర్యమగు జన్మంబు ఏడాకుల పందిరికి 
కార్యమగు దేహంబు కోర్కలకు పందిరియు 
సౌర్యము చూపేటి ఆశలకు పందిరియు    
యేకమగు పుణ్యంబు లేడాఁగల విందరికి

మరుమల్లె సహకార పొందికయు ఎందరికి 
చిరుగాలి  ఉపయోగ మైనదియు ఎందరికి 
మదిలోన ఉపకార మైనదియు ఎందరికి 
హితవైనమమకార మెందుఁగల దిందరికి

కధలన్ని తెల్పుటకు విధియేది మనుషులకు  
మదిలోన మారకము శిలయేమి కదులుటకు 
చిరునామ శోధకుల కలయేమి తెలుపుటకు 
మతిలోని వేడుకలు మరియేమి మనుజులకు

--(())--


Radha Krishna Paintings (RK-2234)

నేటి 
                                             --(())--     
    


నేటి కవిత్వం 
మల్లపరగడ శ్రీ దేవి రామకృష్ణ 

తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు
ఆశ వున్న వారు ఆవ కాశ మొదలురు 
ఇది నాబ లం మనస్సు తో కనగలరు
దొంగ తాళ మే ఇక అనే చెడు గుడులె        

కుక్క తోక వంకర ఎవ్వరు మార్చలేరు 
నక్క బుద్ధి ఎప్పుడు తొందర తీర్చలేరు 
వక్క నోటి శుద్ధిని చేయును ఓర్వలేరు 
అక్క మాట తమ్ముని ఆటను కూర్చలేరు  

తీర్చే మనస్సు కు ఏడుపు అనవసరం
తీర్చలేని మనస్సు కు ఏడుపు అనవసరం
అర్ధంలేని ఆలోచనకు ఏడుపు అనవసరం
జ్ణాన అర్ధాంగి సంపదకు ఏడుపు అనవసరం

తృప్తి నీ వెంట ఉంటే ఏడుపు అనవసరం
బీద గొప్ప లో తృప్తి ఉంటే ఏడుపు అనవసరం
శక్తి మంతుడు క్ష మించిన ఏడుపు అనవసరం
క్షమించ గల శక్తి పౌరుడు ఏడుపు అనవసరం

పదాల పట్టు చూసి ఏడుపు అనవసరం
సత్యం పలుకు చూసి ఏడుపు అనవసరం
నిన్ను నీవు గుర్తించక ఏడుపు అనవసరం
నీలొ ఉన్న దేవున్ని గుర్తించక ఏడుపు అనవసరం

--(())--

Amit Bhar is a famous Indian watercolor painting artist. Amit Bhar was born in Hooghly chinsurah (west Bengal). Even as a child his first love was art. At the age of sixteen while at the Calcutta Govt. Art College, Amit was blessed with the guidance of Shri Paresh Das, a noted artist and gold medallist. Subsequently he gained further insights into art under the famous Subal Jana and Niloy Ghosh, who together enriched his style. He was also inspired by Bikash Bhattacharya and Suhas Roy durin...


Who was Jodha Bai?

నేటి 

నేటి కవిత్వం - జీవ నాడి
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ

నేటి కవిత్వం - మయూరసారి -4 రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ దాన శీల వేద విద్య తీర్పే వన్నె నిత్య సవ్య పూల వల్లే మాన వైభ వమ్ము ఏరి కోరే ఉన్న నీతి ఉన్న జాతి సేవే కార్య సాధ కున్కి ఏక శక్తే కార నమ్ము లేక వృద్హి చేసే వారు వీరు లేరు ఏక భుక్తే ఏరు లాగ మారుట మనస్సే నమ్మ కమ్ము వమ్ము చేయ కండీ నమ్మి సేవ నమ్మ కమ్ము తోనే కమ్ము కొచ్చి వమ్ము చేసే మాయే చిమ్ము చీపు రొచ్చుటే కరోనా నిత్య విద్య సత్య శోధకున్కీ తత్వ మల్లె ముత్య మల్లె ఉండే కాంతి నిత్య శాంతి ఇచ్చు మందే బ్రాంతి లేక వింత మాయ మాపే జీవుడే నవీన భావ మే, దే వుండు లేడనే గళం తొ తెల్పే కాని ఆశ తీర్చు వైద్యుడే, దే వుండుయే అనేటి మాట వచ్చే --(())--

హద్దు
Art - India: maritana — LiveJournal

      
ఏలికేయిది ఇప్పుడేలను ఏల చెప్పెద ఏడ్పుగా
జాలి లేకను దుష్ట బుద్దియు జడ్జ మేలను ఏడ్పుగా
మేలు చేయు మనస్సు లేకయు మేక చన్నుల ఏడ్పుగా
గాలి అమ్ముచు నీరు అమ్ముచు గాయ పార్చెది ఏడ్పుగా

ఊహ లన్నియు గాలిమేడలు ఉండుటేలను మార్పుగా
మొహ మన్నది వీధిలాంటిది మేలు చేయుట మార్పుగా 
దాహ మన్నది నిత్య సత్యము ధర్మ మార్గము మార్పుగా 
దేహ వాంఛలు విశ్వ వైనము దినమార్గము మార్పుగా 
    
పొందు జీతము రాదు ఏలను పోరు చేయని నీడగా
విందు లక్ష్యము జన్య భావము వేగ కాలము నీడగా
యందు వైనము సేవమార్గము నిత్య సత్యము నీడగా 
చిందు లన్నియు పొందుకోరియు చేదు కాలము నీడగా

చెప్ప లేకయు చెప్పు ఒప్పుయు చెప్పుచుంటిని దేహమై
ఒప్పు మాటల నేవి ఓటమి ఓర్పు చూపుట దేహ మై    
తప్పు లేకయు తన్మయత్వము తోను తెల్పుట దేహమై 
నిప్పు లాంటిది నిర్ణయమ్ముయు  నిత్యజీవిత దేహమై   
(((****)))


ప్రాంజలి ప్రభ ... జ్ఞానము ... కవిత -- 02 -01 -2023  
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 

సహజ ధుఃఖము రోగము శాంతి కోరు 
సహజ శాంతియు సౌఖ్యము స్వాతి తీరు  
మనసు వికసిత వేదము పగలు మారు 
పనులు పరిమిత వనరుల ప్రగతి వేరు 

మన కళే జీవితము విధి మారు తీరు 
మనసు కారుణ్య భావము  మార్గ పోరు  
వయసు పొంగులు తప్పని వలపు పేరు 
మన పరిస్ధితి కలలాగ కదులు తీరు 

కర్మఫలమును  వశముగా కాల పోరు  
ప్రజ్ఞ భావము జీవుడు ప్రగతి పేరు  
వాసు దేవుడే  జీవుడు వ్యాధి జారు  
అతడె అంతర్యా మిగ కలి సాగు నీరు     

వశము చెందేటి జీవుని వాల కమ్ము 
ఫలము పొందేటి ఆశలు ప్రాప కమ్ము 
కలల నెరవేర లేదని కధలు కమ్ము 
కళల వృధ్ధియె జీవిత నిర్మలమ్ము

మనిషి జన్మయు ప్రేమను మానసమ్ము 
పగలు భిన్నము రాత్రియు పొందు దమ్ము  
మనుసు మమతాను రాగము మార్గ సొమ్ము 
సులభ సాధ్యము అనుకుంటె శుభము జిమ్ము 

(((***))))

ప్రాంజలి ప్రభ ... నేటి కవిత్వం - సరసా ... కవిత -- 03 -01 -2023  
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 

ప్రాంజలి ప్రభ ... నేటి కవిత్వం - బిగువు   ... "మత్తకోకిల.. -- 04 -01 -2023  
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 
 

సాగు తుండ సుధా మధూ పర సాగరమ్ము కళ శోషగా 
వేగు చుక్క వినోద సుందరి వేళ కళ్లుగ ఊతమై
మాగు చున్న సహాయ చేరువ మచ్చ మాపుట మాధురై 
రాగ యుక్తము రంగరించియు రవ్వ వెల్గుణ రక్తిగా 
          
మంగళాకార మౌన మేలను మానసమ్మును పంచెదా 
భంగు ఏలను సిగ్గు ఏలను భోగ మాధురి పొందుటే
చెంగు మార్చు మనోబలమ్ముకు చేరు వైతిని ఇష్టమై
ఖంగు కాదు మనస్సు నందు సుఖాన్ని పొందుట కాలమై              

మంగళంబగు రూపు నీది సుమాన్య పావని ..దండముల్!
సంగరంబుననిన్నెదుర్కొనుసాటి వీరుఁడు నుండెనా?!
భంగమున్నెఱుంగవయ్య సుభక్తి రాగములందునన్..
రంగధామము నీదు గేహము రామభక్తి నిధానమౌ!!!"

--(())--

ప్రాంజలి ప్రభ ... నేటి కవిత్వం - రాజ్యము  ... "మత్తకోకిల.. -- 05 -01 -2023  
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 
 
నాటి రాజ్యము మేధ మంగళ నాట్య మాయుట నీడగా  
నేటి మార్పుయు రాజకీయము రంగు మార్చును నీడగా   
నాటి కాంక్షలు నీతి ధేయము  రాజు తెల్పుట నీడగా 
నేటి దాహము దండ నీతియు చిత్ర మవ్వుట  నీడగా 

నాటి కావ్యము సర్వపోషణ  సాలభంజిక నీడగా 
నేటి సౌమ్యము భక్ష భోజ్జము నవ్య సూచన నీడగా
నాటి రంగ అధిష్ట వేత్తల నీచు లాటలు నీడగా  
నేటి జీవన కుమ్మలాటలు నింద వాక్కులు నీడగా
   
నాటి సామ్యము సంఘ దృష్టి యనాది సూచన నీడగా    
నేటి భావ్యము చంపు కొమ్మనె నిత్య కృత్యము నీడగా
నాటి లాభము అందమంతయు ఆరపోసెడి నీడగా  
నేటి ఆకృతి పిప్పిచేయుట నింద దుస్థితి నీడగా
   
(((***)))


ప్రాంజలి ప్రభ ... నేటి కవిత్వం - నిత్యమంగళ -...6 .... 6-01-2023


మిశ్రజాతిలో సామాన్యముగా మూడు, నాలుగు మాత్రలను ఉపయోగిస్తారు, మొత్తము ఏడు మాత్రలు. ఈ ఏడు మాత్రల ప్రక్కన, మఱొక నాలుగు మాత్రలను కలిపితే మనకు మిశ్రజాతి త్రిపుట తాళపు (లీల) మూస లభిస్తుంది. అలా సృష్టించిన వృత్తమే ఈ నిత్యమంగళ వృత్తము. ప్రతి పాదములో 16 అక్షరాలు. క్రింద నా ఉదాహరణములు -

విధేయుడు - 


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: 
ప్రాంజలి ప్రభ ... నేటి కవిత్వం - నిత్యమంగళ -...7.... 7-01-2023
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక సమాచారం 
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 
కవిత్వం..  శివోహం 

అగ్ని లక్ష్యమె చైతన్య యాత్ర పెంచు
స్థాయి శక్తియే ఈశ్వర సృష్టి కనుక
పరిధి దాటియు పోలేక ధర్మ బుధ్ధి 
తగిన రీతిలో సేవలు చేసి బతుకు

 కొలది కాలము నందలి కాంతి తోను 
పెదవి అగ్నిగుండము గను జ్వాల మిలిత
జడల చుట్టిన చల్లని చంద్ర కాంతి
నరులు ఈశ్వర నికొలుచు తూర్పు కాంతి

 చెవులు సర్ప శిరోరత్న మేఘ మాల
మెలిక కోరల సర్పము కూర్చి ఉన్న 
ఎగుడు ముత్యపు ఈశ్వర ముఖము కాంతి
నడక ప్రధాన గుణ లయ కర్త నేత్ర

నల్ల తుమ్మెద వర్షపు మేను కాంతి 
మొల్ల పూవుల వీనుల తెల్లనిదియు 
హిమము ఆవు పాల వలె విభూతి కాంతి
నురుగు వలె కనబడు శివ నేత్ర కాంతి

మన్మధుని శరీరము దహించేటి  జ్వాల
నేత్ర కలిగియు నిర్మల మైన తేజ
శివుని అర్చించె యోగుల భక్తి కాంతి 
కలిగి కుంకుమ పూపూత తిలక కాంతి

(((())))

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ