70 to 102 .. chandassu


   






న   భ   ర  స  జ   జ  గ  
70..III   UII  UIU IIU  IUI   IUI  U  - తరల - 11 
నేటి కవిత్వం :-  తరల శృంగారం  
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

గళ గలే చిరుహాస సేవగ  మాయతో మన సంతయే 
అలల పొంగులు, గుప్పు గుప్పున పొంగుటే తమకాన్ని జ  
ల్లులుగ లాలన పాలనా రుచులే మనోమయమే సహా
ఫలము చూపియు సమ్మోహమ్ముయు పెంచియూ లలితమ్ముగా 

సలపరింతయు చూపకే పస చిత్తు చేయక ఉండవే 
కలువ కెంతయు ముందుచూపుగ సొంత సొమ్మును జుఱ్ఱుకో  
నిలువ లేకయు ఉండలేకన మత్తు కమ్మియు ఉన్నదే 
కులుకు లంతయు ఖర్చుచేయక విందుచేయుము తొందరే   

పలుకు చేష్టలు ఆపవే తపమా సుదాచరణం వేషమే 
కళలు చూపియు మొహమాటకు నన్ను నేమియు చేయకే  
తలపు వేఱుగ నుంచకే మనమధ్య మమేకము సంభవం 
బలిమి చూపకు బండగా సబలా మనస్సును పంచవే 

నలక వల్లనె జీవితమ్మును పాడు చేయుటనే మనో   
గిలక తిర్గుట ఎందుకే సహనాన్ని చూపుట మంచిదే  
పలక మారియు ఉండకే తలవంపు తేక మనస్సునే 
చిలక వే మనమధ్య యే ఇక మంచిరోజులు వచ్చునే 


 --(())--




Mallapragada's Sundarakanda (Ramayanam) Pranjali Prabha : ప్రాంజలిప్రభ  - సుందర కాండ తెలుగు వచస్సు (58వ సర్గ...

71..భ  భ   ర   స   జ   జ  గ  - భూతిలత -11 
 UII  UII  UIU  IIU  IUI  IUIU 

నేటి కవిత్వం - భూతిలత 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

రాముడు చక్కని వాడులే మహిలో మనస్సును పంచెను 
లే మమతన్నది  కాల మాయ జయించి వేదము పల్కుగా 
సామము దండన భేదమే మరచీ  మనుష్య సహాయమే 
చేసియు పూజల తో మనో ఫలమంతయే నెరవేర్చెనే 

ఏమని చెప్పెద కాలమాయ జయించు రాముని శక్తినే 
క్షేమము కోరును వేడుకున్నటి వారినందరినీ మనో 
ప్రేమను పంచియు దేహమే సమపాళ్లుగా ఉపయోగమే
కామము తీర్చియు మానమే సమపోషణాలయ కాలమే  

సౌమ్యపు హాసపు పల్కులే విన యోన్నతమ్ముగ మారునే 
కామ్యపు చూపులు ఎప్పుడూ చెడు వాసనే మది నర్కమే 
సొమ్ములు ఆశయ ఎప్పుడూ కలయే సకాలపు సేవలే 
సొమ్ముగ నీతిగ బత్కుటే సమయోజనం సమ ఉళ్ళమే 
--(())--

Om Namah Shivaya (Sanskrit: ॐ नमः शिवाय; IAST: ॐ Namaḥ Śivāya) is one of the most popular Hindu mantras and the most important mantra in Shaivism.

72..UUII - UIUI - UIIU - IIUU
నేటి కవిత్వం - విజ్ఞానము 
రచయిత= మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

విజ్ఞానము కొంత శోభ - అర్ధముచే కనుగోటం 
అజ్ఞానము తన్ను తాను - అల్పుడనే అనుకోటం
సామర్ధ్యము నాది నాకే - తెల్సుననే దియుగర్వం
వాచాలత తోడు నీడ గా  - కలవా లని సత్యం


సంకల్పము ఉంటె ఎంతొ - దివ్య బలం మనవెంటే
ఆకర్ష ణ ఉంటె ఏం తొ   -  ప్రేమ బలం మనసంతా
సంఘర్షణ ఉంటె - కల్లోలం మమతే మనచుట్టూ
వికర్షణ ఉంటె శాంతి - లేక ఉండే భ్రమ సృష్టే   


దివ్యత్వము సామ దాన - భేదములే నవజీవం
సాకారము  ప్రేమ శక్తి - కామములే  నవరూపం
ప్రామాణిక సేవా భావ  - తత్వములే నవదీపం
జ్ఞానం మన ప్రేమ తత్వ - నిర్మలమే నవదీక్ష


సందేహము ఎప్పుడూ = మనస్సు వేధించుట కాదా
ఆనందము ఎప్పుడూ  -మనస్సు కేశాంతము కాదా
దేవాలయ ప్రాంగణం = మనస్సుకే వేదము కాదా
సాహిత్యము ప్రాణ భాష -  ప్రేరణగా కధ  కాదా 


--((*))--




73..శంఖ - న/న/(ర)14 IIII IIUI (UUI)13 U 
నేటి కవిత్వం -  శంఖ 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
:
పరువము పదిలమ్ము 
చేరేను చేయూత - చెప్పేను పంచేను 
కారుణ్య భావమ్ము - కమ్మేను నిత్యమ్ము 
గారాము చేసియు - మాయమ్ము చూపియు  
ధీ రంగడా 

కరుణయు కనువిందు  
కారాట చేసేను - వేటాట చూపేను  
పోరాట  సల్పేను - నిత్యమ్ము సేవించి  
ఆరాట మయ్యేను - తత్వమ్ము బోధించి 
హా రంగడా 

సిరివలెఁ గనుముందు 
రారమ్ము గోపాల - రత్నాల దీపాల 
నీరేయి నీకోస - మీమేడ నేనుంచి  
నీరాకకై యుంటి - నీవెప్పు డేతెంతు 
వో రంగఁడా 

వసిగొను హరిమోము 
లాసమ్ము లందమ్ము - రాసమ్ము లందమ్ము 
వేసమ్ము లందమ్ము - బృందమ్ము లందమ్ము 
హాసమ్ము లందమ్ము - హారమ్ము లందమ్ము 
నాశౌరికిన్

అరుణుడు వలె వచ్చి 
మారమ్ము చేనీక వేదమ్ము  గానుండు 
కార్యార్ధి ఆనంద మందించి మాధుర్య 
సౌర్యమ్ము  కల్పించి ఆడించు సౌందర్య 
సర్వోన్నతా    

అరుణుఁడు సనె సందె 
వేళయ్యె దీపమ్ము - వెల్గించి శంఖమ్ము 
మేలై ధ్వనించంగ - మేఘారవమ్ముగా 
కేళీవినోదుండు - కృష్ణుండు రంజిల్లఁ 
బూ రించుమా 
--(())-- 

Woman With Pecock par l'artiste Rajeshwar Nyalapalli | Peintures acryliques

74..న/స/న/భ/న/గ IIIII UIII - UIII IIU 
నేటి కవిత్వం - హరిహయ 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
  
చిరునగవు కోరుటయు - కోపమును వదిలే 
అరమరిక లేకయును  - సంతసము తెలిపే 
చరవిడిచి ఉండుటయు - శాంతమును నిలిపే 
మరొమలుపు మధ్యనయు - వేదనము తొలిగే 

కరములతొ చుట్టియును - వేదమును తెలిపే 
తరుణమును నష్టమును  - పర్చకయు విలువే 
తరుగునటు చేయకయు - ఆకలియు  మదిలో 
పెరగకయు శాంతమును  - చూపుటయె జగతీ

పరువములు సుస్థిరము -  కాదను అనుటయే 
సరిగమలు  సాశ్వితము  - ఆచరణ అణువే 
భరణములు కోరినను - ఆశలకు పొవు టే 
చురకలను తెల్పుటయు - కాలపు సెగలులే 

గరళపు  జీవితము - తప్పదు యెవరికినీ
జరజరల సాగుటయు - జీవితపు జలమే 
చరణము తప్పదియు - ఏకము అగుటకే 
మరణము ఉండునులె - ఏనిముషమునకో    
  
పయనమున నొంటరిగఁ - బాడుచును నడతున్ 
పయనమునఁ బాంథులకు - స్వాగతము నిడుదున్ 
పయనమున దైవమునుఁ - బ్రార్థనలఁ గొలుతున్ 
పయనమున గమ్యమును - వాఁడె తను దెలుపున్ 

వినయమున వాదమును  - మాపుటయు కుదురున్ 
వినయమున కామమును  - గెల్చుటయు కుదురున్ 
వినయమున మొనమును - చేరుటయు  కుదురున్ 
వినయమున  కాలమును - గెల్చుటయు కుదురన్ 

--(())-- 
    
హరిహయమువోలె నొక - యశ్వమును గని రా 
వరయువతు లిర్వురును - వారినిధి సికతన్ 
శరధివలె నల్లనిదొ - చందువలెఁ దెలుపో 
యిరుగురును వాలమును - నిర్దెసలఁ గనిరో! 
(వినతా-కద్రువల కథ) 

ఉదయమయెఁ బ్రేమశశి - యుర్వి కడు మురిసెన్ 
ముదమొసఁగఁ బ్రేమలతఁ - బుష్పములు విరిసెన్ 
హృదయమునఁ బ్రేమ మధు-వృష్టి యది కురిసెన్ 
నదమువలెఁ బ్రేమసుధ - నామదిని బరవెన్ 

సుమతి నెపు డివ్వఁగను - సుందరుని దలఁతున్ 
కుమతి వలదంచు గురు - కోవిదుని గొలుతున్ 
విమలమతియై మనము - ప్రేమమణి యవఁగా 
కమలదళనేత్ర నను - గావుమయ దయతో 


పొత్తపి వేంకటరమణకవి కల్పించిన వృత్తములలో హరిహయ వృత్తము ఒకటి. హరిహయము అంటే ఇంద్రుని గుఱ్ఱము, ఉచ్ఛైశ్రవము. దీని లయ వనమయూరమును బోలినది. ప్రతి పాదములో మూడు పంచమాత్రలు, చివర ఒక చతుర్మాత్ర, నలల/భల - భల/స. క్రింద నా ఉదాహరణములు - 
హరిహయ - న/స/న/భ/న/గ IIIII UIII - UIII IIU 
16 అష్టి 32224 


Radha Krishna Paintings (RK-2249)

75..న  జ  భ  జ  జ  లగ     7 -13 పదకోకిల కాంకము  
III IUI UIU IUI IUI IU 
నేటి కవిత్వము - పదకోకిల 
రచయత:: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

అలము సమప్రభా మదీయ భావ అనంత సుధా  
మలుపు  సహాయ  మాయ ఆశ పాశము కల్గుటయే   
అలక ను తీర్చి సంతసమ్ముగా సమభావముగా  
అలుపు లేకయే నిత్య సత్య ఆకలి తెల్పుట కదా 
కల కల తో సుఖాలయం సుదర్శన చక్రముగా 
తళ తళ మెర్పు మెర్సియే సుఖీభవ సంతసమే
గల గల జాలువారు తేట నీరు సుమాలికకే 
వెలవెల పోక ఇంక ఏదొ  చందన పూతలుగా 

చిలకలు చిల్కి చిల్కి సిగ్గులన్నియు పంచుటయే 
కులుకులు ఎంత చేసినా ఇదేన ఇదే ననుటే 
వలపుల యవ్వనం సురాగ మాలిక అందముగా  
తలపులు తీరి తామసం తరించుట జీవితమే 
పలుకుల భావమే వినోద సేవలు లాలనగా 
కలుపులు తీసినట్లు చెడ్డ చేష్టలు తుంచుటయే 
మలుపులు ఎన్ని ఉన్ననూ సుఖమే మమతా 
వలయము చుట్టునూ సుహాస సేవల జీవితమే   

--(())--
  

Hindu Cosmos

76.. మ  న   య   త  న  మ  -  క్షమాహరా -10  
UUU III IUU UUI III  UUU 
నేటి కవిత్వం - ఆకాశం 
రచయిత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఆకాశం కలవటమే జ్ఞానం సృష్టి మొదలు ఏర్పాటే 
ఆకాశం పవణునితో చేరేదే మనసు తొ కల్సిండూ  
ఆకాశం వెలుగులతో కల్సే బుద్ది వయసు యే మాయా 
ఆకాశం  జలములతో అగ్నీ శక్తి  కలియుటే విశ్వం 

ఆకాశం  మనసులతో చిత్తం ప్రేమ అనుటయే ధర్మం 
ఆకాశం  పుడమి వలే శబ్దం ఓర్పు కలుగుటే సత్యం 
ఆకాశం  గడపలతో  విస్వవ్యా పితముగ  కారుణ్యం 
ఆకాశం  చిరునగవే  హృద్యన్మాయ తొ కలసే విద్యా 

ఆకాశం పవణునితో వ్యానం ధర్మమయముయే నిత్యం   
ఆకాశం పవణునితొ స్సమ్మానం సకరణమే సత్యం 
ఆకాశం వెలుగులతొ వ్వుద్దానం క్షకరణమే యోగం 

ఆకాశం పుడమితొ ఏకాంతం కల్వుటయు మన: శాంతే  

జ్ఞానముతో జీవించుము 
జ్ఞానమునకు మూలమోక్క సత్యమె సుమ్మీ 
ధ్యానించుము తత్వమ్మును 
ప్రాణము సుఖముండు మంగళంబగు నాధా  

--(())--

FOR SALE:  TITLE: FLUTE (V)  ARTIST:   Sekhar Roy  YEAR: 2012  MEDIUM: Acrylic on canvas  SIZE: 48 x 42 x 00 inches   Original Work $2000.00

77. సుశీలా - జ/స/జ/స/జ/స
IUI IIU - IUI IIU - IUI IIU
18 ధృతి 120670

నేటి కవిత్వం - సుశీల 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

వసంత వనిలో సుఖాల మదిలో సహాయ సహనం
అసీమ కరణా  విశాల సమయం వినోద పరువం
అసాధ్య మయెగా అకాల పయనం వివాద చరితం
రసించు తఱిరా  అనంత వలయం సుహాస నిలయం

రసార్ధ హృదయా  సువర్ణ మయమే సమర్థ వినయం 
వసించు నిటులన్  మృదంగ నటనే సకాల భరితం
హసించు దరిరా సహాయ మదిలో తపస్సు యుగళం
సుశీల వినతా సుహాస భరణం ఉషస్సు  తరుణం 

మదిన్ బదిలమై ఒకే సరళమై తరించు యుగమే  
ముద మ్మదియెగా మనం విడిపడే సమం చెయకయే    
వ్యధల్ దొలఁగు నీ  మనోఫలకమే చిరాయు వలెనే 
సదా తలఁతు నిన్ జరా మరణమే సుఖం కలుగునులే  

హృదిన్ నదులుగా - సుధల్ గురియుఁగా - మదిన్ కలవగా  
నిదానముగ నే - పదమ్ములను బా-డెదన్ లలితమై
అదే నవము నా - కదే భవము నా - కదే ధ్రువముగా
సరాగ సమయం - సుధామధురమే - ప్రెమా అనుటయే  

మరాళములతో - మయూరములతో - మలంగు సతి యా
సరస్వతిని నా - సరోజముఖి నే - సదా తలఁతుఁగా
వరాల నొసఁగన్ - స్వరాల నొసఁగన్ - పదమ్ము లొసఁగన్
విరాజితములై - ప్రియమ్ముగ మదిన్ - వెలుంగు నవియున్

--(())--

Seven Mind-Blowing Reasons Why Krishna Painting Wallpaper Hd For Mobile Is Using This Technique For Exposure | Krishna Painting Wallpaper Hd For Mobile


78..అష్టపది - 40 (ద్విపద) 
==
ఈశరత్తున ధాత్రి - హృద్యమ్ముగాదా 
రాశులై పత్రాలు - రమణమ్ముగాదా 
==
ఆకులమ్మేలకో - యతిమోహనమ్మే 
యాకురాలెడు కాల - మవని స్వప్నమ్మే (ధ్రువము) .. 1
==
వర్ణాలతో వెల్గు - వరభూషణమ్మా 
స్వర్ణమ్ముతో నిండు - చారు చిత్రమ్మా 
ఆకులమ్మేలకో - యతిమోహనమ్మే 
యాకురాలెడు కాల - మవని స్వప్నమ్మే .. (2)
==
తెరవోలెఁ బొగమంచు - తెలవారుచుండ 
సుగమైన చలిగాలి - సొంపుతో నిండ 
ఆకులమ్మేలకో - యతిమోహనమ్మే 
యాకురాలెడు కాల - మవని స్వప్నమ్మే .. (3) 
==
దక్షిణమ్మున కేగె - ధ్వానమ్ముతోడ 
వీక్షించ నందమ్మె - విహగాలఁ జూడ 
ఆకులమ్మేలకో - యతిమోహనమ్మే 
యాకురాలెడు కాల - మవని స్వప్నమ్మే .. (4)
==
పశ్చిమమ్ముననుండి - పవనమ్ము వీచె 
నిశ్చలమ్ముగ నింగి - నీలమై తోచె 
ఆకులమ్మేలకో - యతిమోహనమ్మే 
యాకురాలెడు కాల - మవని స్వప్నమ్మే .. (5)
==
అరుణుండు వీడఁగా - నాకాశమందు 
ధరణి చీఁకటి మున్గెఁ - ద్వరితమై యెందు 
ఆకులమ్మేలకో - యతిమోహనమ్మే 
యాకురాలెడు కాల - మవని స్వప్నమ్మే .. (6)
==
శారదాంబరమందుఁ - జ్వలియించు కాంతి 
నీరదమ్ములు లేని - నిశ్శబ్ద శాంతి 
ఆకులమ్మేలకో - యతిమోహనమ్మే 
యాకురాలెడు కాల - మవని స్వప్నమ్మే .. (7) 
==
మధుచంద్ర యామినీ - మధురోహకారీ 
మృదు మోహనాకారి - మిలనోపకారీ 
ఆకులమ్మేలకో - యతిమోహనమ్మే 
యాకురాలెడు కాల - మవని స్వప్నమ్మే .. ( 8 )
==
విధేయుడు - 
***



79..నేటి కవిత్వం : అంబురహ .. భ భ భ  ర స నగ 

నీకును నాకును ఏమియు లేదని తెల్పు టెందుకులే వినో 
దం కళ  బత్కుకు ఎంచియు బత్కెద, కాల మాయకు చిక్కినా 
ఆకలి కేకలు లేకయు చూసెద, మౌన మెందుకులే,  సహా 
యం కుడి ఎడ్మగ చేసెద, ఓ లలనా మనస్సును కాంచవే

లేకయు ఉన్నది ఎందుకు తెల్పల, ఏదొ ఆశయ ముందిలే 
ఏకము అవ్వుట సేవలు చేసి యె, సామ రస్యముగా సహా
యం కమణీయము, మానస నాధుడ, చింత ఎందుకులే అకా
లా కల మాయను చేయక ఉండులె, ఇద్దరం ఒక టవ్వటం 

గోకుడు ఆపుము కాలము నీదెగ, ఎప్పుడన్నాను అప్పుడే 
నాకుడు ఎందుకు ఆకలి తీర్చిన, తొందరెందుకు, ఈ వియో 
గం కల ఊహగ భావము చేయగ, నీవు అన్నది యే, సుధా 
ఆకును వక్కను కల్పియు కిల్లిగ, ఇచ్చెదా మదనా కదా      

కాలము లన్నియు సాగుట కావ్యమార్గముగా కథే 
జ్వాలలు సాగుట యెప్పుడు జాగృతే విధిగా కథే
మాలలు చేయుట తప్పదు మానసమ్ము గతీ కథే 
హేళన జీవిత మవ్వుట హీనమార్గముగా దేవీ         
   
   
  --(())--
80..UUU-III-UIU-IUUI

రంద్రాన్వేషణలు వద్దురో కుటుంబాన 
క్షుద్రామంత్రములు వద్దురో సమంబేన  

భద్రామాయలవి చూడరో కుటుంబాన
నిద్రా స్వేచ్ఛ గతి నీకురో సమంబేన
క్షుద్రా మానసుల ప్రేమరో కుటుంబాన
భద్రా మీయదు వినండరో సమంబేన

చిద్రామౌ మన మనస్సురో కుటుంబాన
ఇంద్రాదీ నిజము పూజరో సమంబేన
యంత్రమ్మే కదిలి గోలరో  కుటుంబాన
మంత్రమ్మే మనసుమార్చెరోసమంబేన

తంత్రమ్మే  జగతి నీతిరో  కుటుంబాన
శ్రోత్రమ్మే మనిషి బత్కురో సమంబేన
మాట్లాడే విషయ పద్దురో కుటుంబాన
పోట్లాడే మనసు వద్దురో సమంబేన

తిట్లాటే మనకు ముద్దురోకుటుంబాన
చీట్లాటే అసలు హద్దురో సమంబేన

వృత్తము:: మ. న. ర య గ 

***     


 81- విహారిణీ  - స/జ/త/గగ IIUI UI - UUI UU గు/బు - గు/బు 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

విరజాజి వెన్నెలంత మనుష్యులకు నేను అన్నదే సేవచేసే 
చిరుహాస మంత సందర్భ భావాలను తెల్పుచుండె యవ్వారమంతా  
కరుణా మయంగ సంతోషపర్చే సమయోచనంగ  సంతృప్తి కల్గిం
చు ఋణానుభందమే హాయిగొల్పే వికసించి మాయతోల్చేందు కేలే 

కిరణాల శక్తి మొహాన్ని చేధించు సకాల ధర్మ తత్వాన్ని పంచే 
చిరునామ బత్కి బత్కించు మార్గం సహనాన్ని పొంది ఉండేందు కిల్లే 
తరుణాన్ని సద్విని య్యోగ పర్చేందుకు కాల సత్య ధర్మాన్ని తెల్పే    
పరువాన్ని యుక్తి మార్గమ్ము వైపుంచి విశాల విస్వభావాన్ని పంచే 

అనురాగ వాణి - యానంద రాగ - స్వనమందు మ్రోఁగె - జల్లంగ రేయిన్ 
నిను నో విహారి-ణీ నేను జూతున్ - మనదౌను హాయి - మాయామయమ్మై 
కనుమాయ చేసి - ఆనంద పర్చు - విధి యాట  అంత - సౌఖ్యంబు రేయిన్
అణువంత పంచి - ఆహ్లాద పర్చి - నిది వేట కొర్కు - సంతోష రేయిన్   

విధిపత్ని నన్ను - ప్రేమమ్ముతోడన్ - జదివించు తల్లి - చైతన్యరూపీ 
హృదయమ్ములోన - నృత్యమ్ము లాడన్ సదయాంతరంగ - సత్యార్థి రావా 
మది వేదనంత - భారమ్ము కాగా - మదిచూడు తండ్రి - వేదమ్ము చెప్పే 
నిధిచుట్టు పెర్గు ఆశే జపమ్మూ - విధియాడు నాట్య భావాన్ని తెల్పే   

ఇలపైన నాకు - లెన్నెన్నొ రంగుల్ - లలితమ్ముగాను - లాస్యమ్ము లాడెన్ 
చలిగాలిలోన - సంధ్యల్ వెలింగెన్  - మలమీద మంచు - మాణిక్య మయ్యెన్ 

విహారిణీ - స/జ/త/గగ IIUI UI - UUI UU గు/బు - గు/బు 
11 త్రిష్టుప్పు 300 

వాగ్వల్లభలో పేర్కొనబడిన ఈ "విహారిణీ" వృత్తపు లయ ఇంచుమించు ఇంద్రవజ్రలాటిది. ఇంద్రవజ్రపు లయ - 5,4 - 5,4 మాత్రలయితే విహారిణిలో 5,3 - 5.4 మాత్రలు ఉన్నాయి. క్రొత్త గణముల ప్రకారము ఇది గురు/బుధ - గురు/బుధ గణముల అమరిక గలిగినది. విహారిణీ వృత్తమునకు నా ఉదాహరణములు - 

--(())--

*82..

సరస్వతీమనోహరీ- జ/ర/జ/ర/జ/ర/జ/ర 

IUIU IUIU - IUIU IUIU - IUIU IUIU


*

విరించి హృద్వినోదినీ - విశాల విశ్వ మోహినీ -   విశుద్ధ వేద మాతృకా   

సురాగ్రణీ శుభంకరీ - సుభాషిణీ సుహాసినీ - సుమించ నిమ్ము విద్యలన్ -  


ననంతమే న మార్గమే.. నమస్సుగా సమర్థతా .. నమశ్శివా నమో నమః 

వినమ్రమే  వినోదమే..వివాదమే విమర్శయే..విశాల విశ్వ మోహనా 


సరస్వతీ మనోహరీ - స్వరప్రవాహ లోలినీ - సచిత్ర వాగ్వినోదినీ 

వరమ్ము లిమ్ము ప్రేమతో - వరిష్ఠ భక్తి నిచ్చెదన్ - వరప్రసూన మాలలన్  (1)


కళావతీ కళామతీ - కళాద్యుతీ కళాకృతీ - కళాప్రతీ కళాధృతీ 


విలాసినీ విమోచనీ - విరాగిణీ విహారిణీ - వినోదినీ విరించనీ 


కళానిధీ కలాంబుధీ - కళాహృదీ కలావధీ - కళౌషధీ కళాసుధీ 


విలోలినీ విజృంభిణీ - విదారిణీ వికాసినీ - ప్రియమ్ముగా బిరాన రా  (2) 


 పరంబులిమ్ము ప్రేమతో.. వనములన్ని విచ్చెగా.. వరాలజల్లు యీశ్వరా 

విరాగమా విమోహమా.. విరంగమా విభాగమా..విమర్శజల్లు యీశ్వరా 


విధేయుడు - మల్లాప్రగడ రామకృష్ణ 

*

83..విజయ - జ/ర/జ/య IUIUIU - IUIIUU

12 జగతి 854

*

సరస్వతీ యనన్ - సదా విజయమ్మే 

పరాత్పరీ యనన్..ప్రధానము నమ్మే 

నిరంతర మ్మిలన్ - నినే తలతున్గా 

వరంద్యుతిమ్మిలన్.. వనే తలతుంగా 


స్వరప్రపంచ మీ-శ్వరీకృపయేగా 

విరాట్స్వరూపిణీ - వికాసము నీవే 

జ్వరప్రపంచ మీ.. శ్వరీకృపయేగా 

ధర యనంత మీ.. శ్వరే కృపయేగా 

*

నిరాయుధమ్ముకై - నిరీక్షణయేనా 

పరాఙ్ముఖమ్ముగాఁ - పరీక్షలు వద్దే 

స్వరాగరమ్యతే.. స్వనిర్మలమేనా 

పరాత్పరమ్ముగా.. ప్రధాన మనద్దే 


ధరిత్రిపై జనుల్ - తరించఁగనౌనా 

సురాసురేశ్వరీ - సుభద్రతతోడన్ 

కరుణయే కనెన్.. కనుంగ గనౌనా 

తరుణమే విధిన్.. తనంతతతోడున్ 


ప్రయాణ మిట్టులం - బ్రయాసలకేనా 

జయమ్ము నీయుమా - జగత్తున మాకై 

భయమ్ము బాపుమా - భవమ్మున బాగై 

జయా దయామయీ - జపమ్ములు నీకే 


వియోగ మంత్రమే..

విభాగముగానా 

అయోగ్య వాదమే.. అనంతము గానా 

ప్రయాగ తంత్రమే.. ప్రభంజన గానా 

నయానా భయ్యమే.. నామమ్మ గానా 


వినూత్నమైన యా - విమోచన మెప్డో 

తినంగ నేమియుం - దృణమ్మిట లేదా 

కనంగ నామదిం - గవిత్వము రాదే 

అనూహ్యమైన దీ - యశాంతియు భూమిన్ 


విధేయుడు -మల్లాప్రగడ రామకృష్ణ 

*****

84..సంహతికా = కామిల్ మురబ్బా సాలిమ్  

*

సంహతికా - స/జ/జ/గ IIUIU IIUIU

10 పంక్తి 374

*

భువిలోని యందము నీవెగా.. రవి జూవు కాంతియు నీవెగా 

కవి నృత్య రంగము నీవెగా.. భవ తత్వ మోహము నీవెగా 


ధ్రువతార నిశ్చల రూపమా.. అవకాశ విద్యల భావమా 

భవమందు బంధము నీవెగా.. నవ రంద్ర సౌఖ్యత భావమా 


మనమందుఁ గోవెల కట్టగాఁ .. కనలేని శోకము తట్టగా 

గన నందు స్తంభము నీవెగా.. వినలేని బంధము జట్టుగా 


స్వనమందు రాగము నిండఁగా.. ధనమందు రోగము నిండగా 

విను కర్ణ రంధ్రము నీవెగా.. క్షణ మార్గ మోక్షము నీవెగా 


హృదయమ్ము తారల నింగి యా.. వదనమ్ము పొందుట నింగి యా 

మృదు కాంతి పుంజము నీవెగా.. శృతి పొందు శాంతియు నీవె గా 


వదనమ్ము మోహన చంద్రుఁడా.. కధలన్ని తెల్పెదా ఇంద్రుడా 

మది కోర్కె బింబము నీవెగా.. విధి వాక్కు నిత్యము నీవెగా 


విధేయుడు - మల్లాప్రగడ రామకృష్ణ

 "

(85.)..శ్రీ మాతా (భ ర భ భ భ మ.. యతి - 10) (1)


మానస నైజమున్ సూక్తులు మార్చక నిత్యము పాటించేన్ 

లోనన నీరు వేడెక్కట లుప్తము చేయును శీఘ్రమ్మున్ 

మానము జన్మతో వచ్చెను మచ్చలు యున్నను వోర్పుగన్ 

యైనను మార్చ శక్తీ మది దైవయుపాసన శ్రీదేవీ


సత్యము జ్ఞానసంపాదన సాధ్య మనస్తపు విశ్వాసా 

నిత్యమనో హరీ ప్రార్ధన నీడనకాశము సర్వార్ధా 

ముత్యము వల్లె మెర్సీ మది మభ్యసహాయము పూర్ణార్ధా 

సత్యసమర్ధ గోవిందుని సాధ్యము సర్వము శ్రీదేవీ


శ్రీ రమ! సీతవై రాముని చిత్తము నందున నీవేగా 

కూరిమి రాధవై కృష్ణుని గూడిన నిన్నె దలంచంగా 

వేరుగ పేరులే మారెను వేదము నీవెగ గాయత్రీ! 

చేరితి పాదపద్మమ్ముల చెంతను భక్తిని శ్రీమాతా!

***

(86)..అంగన (భ భ భ భ భ మ.. యతి - 7,13) (2)


శ్రీమతి సేవలు సీగ్రపరమ్మగు శ్రీపతి లక్ష్యమ్మే 

కామిత భావము కామ్యమనోమయ కాల సమానమ్మే 

స్వామి సహాయవిశాల శుభమ్మగు సాధ్యము విశ్వమ్మున్ 

నీమమ రక్షయు నిశ్చయ భావము  నిర్మల శ్రీదేవీ


రాముని బంటును రాముని దూతను రాజ్యము నందుండెన్ 

శోముని లీలలు శోభవివేకము స్తోత్రముగా మెచ్చేన్ 

రామునిశక్తియు రాముని యుక్తియు రామునిదీక్షయు పెంపొందెన్ 

రాముని మార్గము నేస్తము తోడును రమ్యత చూపుట శ్రీదేవీ


బంధమునొందియుబాధలు తీర్చెడి బాధ్యత ధర్మమ్మై 

పొందిక భావము కోరిక నిత్యము భోజ్యము సత్యమ్మై 

అందున లక్ష్యము యానతి జవ్వన రాజ్యము కాలమ్మై 

చందన సౌఖ్యము చర్చిత కైతలు జాతర శ్రీదేవీ

**

(87)..చిత్రలేఖ (మ  న  న త  త  మ .. యతి - (12)..(3)


తల్లీ నీపదములు కడు వెల్గొంద తేజో మయంబౌచున్ 

కల్లోలంబులను కడు వోర్పే కళ న్బౌను క్షేమమ్మున్ 

సల్లాపంబులు జరుపుచు సంతోషమై సంఘమేకూడున్ 

జల్లంగన్ సమయ సహన ముంచే సరోజాక్షి శ్రీదేవీ


శ్రీరామా ననుచు పలుకు తత్త్వం శ్రి తిన్మాయ పోగొట్టున్ 

శ్రీరామా గుణము దయయు నిత్యా శ్రి ధైర్యమ్ము కల్గించున్ 

శ్రీరామా భయము తొలచ భాగ్య శ్రి సర్వమ్ము లక్ష్యమ్మున్ 

శ్రీరామా సకల హృదయ భావ్యం శ్రి శీగ్రమ్ము  శ్రీదేవీ

****

(88)..ఇంద్ర  (జ  జ య  గ .. యతి - 6) 4


సమాజ ప్రహాశము సర్వార్ధ

మ్ము మానస నోముయె, సమ్మోహ

మ్ము మాధురి సొమ్ముయె, సద్భావ 

మ్ము మాయల కాముడు శ్రీదేవీ


సునేత్రి వహో శుభ గాయిత్రీ 

వినోదముగా విలసిలంగన్ 

మనోహరమై మహినిన్ భాసి 

ల్లు నీ నయనాలుగ శ్రీదేవీ


సకావ్య సుధాసమరమ్మో నే 

వికాసముగా విధిగ విశ్వా

స కాల ప్రభాసము సమ్మోహ

మ్ము గాను సుధాసుఖ శ్రీదేవీ

***

(89)..కోమలలతా (మ త స త త గ .. యతి - 10) (5)


అగ్గిచ్చే ముక్కంటి గమనం లాలించి పాలించుటన్ 

నిగ్గూ తెల్చే లీలలగటన్ నిశ్చిత్వ లక్ష్యమ్ము గన్ 

బుగ్గీపాలయ్యేను కధనం భూశక్తి తోడవ్వుటన్ 

తగ్గే ప్రేమంమౌను సహజం తన్మాయ లోకంబునన్


ఆధ్యంతంబుల్ ప్రేమ సహనం సామర్ధ్య లక్ష్యమ్ముగన్ 

 హృద్యంబుల్ ప్రాముఖ్యమగుటే స్త్రీసేవ బంధమ్ముగన్

సాధ్యంబుల్ విశ్వాసముగనే సాధుత్వ సంతృప్తిగన్

పద్యంబుల్ వ్రాసే సమయమే పాఠ్యమ్ము జీవమ్ముగన్

***

గోలల్ పెక్కౌటన్ విధిగనే  గూర్చంగ సంతోషమున్ 

లీలల్ జర్గే సత్య మగుటన్  లేరెవ్వరున్ సాటిగా

మేలౌనిత్యంబౌను కథ  సామీప్యంబుకున్ స్ఫూర్తిగా 

కాలమ్మే మౌనమ్ము  గనగా నాహ్లాదమిచ్చున్ గదా

***

(90).నీల ( భ భ మ గ గ .. యతి - 7) (7)


అమ్మవు నీ కృపయే లోకాల్  చల్లన్ 

నమ్మిన వారికి నాశంమ్ముల్ నాపున్ 

గ్రమ్మున బాపును కష్టంబుల్ నా కున్ 

నేమ్మిగ వేడిద నిన్నే శ్రీదేవీ 

***

కాలము నీదయ కర్తవ్యమ్మేలే 

జ్వాలల తీరును చాపల్యమ్మేలే 

పాలన మాయలు దాహమ్గా నేలే 

గాలులు కమ్మిన గ్రాసం శ్రీదేవీ 

***

విద్యలు నీస్థితి విశ్వమ్మే లీలా 

చోద్యము మాగతి శోకమ్మే లీలా 

సాధ్యము సంగతి సామర్ధ్యం లీలా 

వేద్య సమర్థుల విద్యా శ్రీదేవీ

***

దీపము వెల్గుల దివ్యత్వంమోనే 

కోపము మాటున కోర్కే చాటౌనే 

శాపము మాగతి శాశ్వత్వమ్మౌనే 

పాపపు కర్మయు పాఠ్యం శ్రీదేవీ

***

నేతలు చూపెడి నేస్తంబున్ కోరే 

రోతగ నున్నను ప్రోశ్చాహం చేరే 

మేతను మేసియు న్యాయంబే మారే 

గీతను నిత్యము తెల్పే శ్రీదేవీ

***

 91.కోవిదార  --( భ త ర స త స జ వ ..23/10..)(6)


సాధన సాహిత్యమే విదీ సమయాతత్త్వర్ధముగనే మహేశ్వరి పూ

జ్యాదయ భాష్యమ్ము గా నిధీ జపమే భాగ్యమ్ము మనసౌను యీశ్వరి సే 

వా ధరణీ వోర్పుయే స్థితీ వరదా వాగ్దేవి పలుకౌను శోభితి గా 

శోధన ధర్మమ్ముగా మదీ వినయా సౌజన్య  పరమై నమస్సతతమ్

***

 కొందరి క్రూరత్వమేసమీకరణం దౌర్జన్యముగనే జయమ్మగా 

నందము తత్భావమేసుధీ నయనమ్మే చూపు కళే జరించు నా 

వందన మేధ్యాస సేధ్య భావముగా పద్యాల సహనమ్ము గాను యీ 

నందముఁ బొందుత్వ ధర్మమే నటనా సామర్ధ్య ముగనే నమస్సతతమ్

***

(92) వీరంతా ( జ  స మ గ   యతి.. 7)


భవాని పలుకే బంధమ్మే లే 

శివయ్య నటనా సీఘ్రమ్మేలే 

సవాక్కు లొలికే సందర్బంగా 

సువీక్షణము చూపే శ్రీదేవీ 


భవంబు తొలగన్ భారమ్మున్ గా 

జవంబు నిండుగన్ సామాన్యం గా 

రవంబు కలిగెన్ రౌద్రoమ్మే గా 

నవాభ్యు దయమై లే శ్రీదేవీ


అనామిక గనే ఆదర్శమ్మే 

వినాశము గనే విశ్వాసమ్మే 

ధనాశ వలెనే దౌర్జణ్యమ్మే 

సనాతనముగానే శ్రీదేవీ

***

(93) అమోఘ మాలిక ( జ  ర య గ  గ.. యతి.. 7 )


సువాక్కు సంభవం సుగమ్యా మం దున్ 

సువీక్ష ణంబులే శుభం బీయంగన్ 

సువాస హక్కులే సుదర్మం నందున్ 

నవీన మార్గమే నమో శ్రీదేవీ


అనాది నుండియే అలక్ష్యంమేలే 

వినాశ భావమే విలక్ష్యంమేలే 

ధనాశ నిత్యమై దరిద్రంమ్మేలే 

ప్రణమ్ము భవాబ్ది పదం శ్రీదేవీ


విశిష్ట బుద్దిగా వివాదమ్మేలే 

ప్రసిద్ధి తీర్పుయే ప్రభావమ్మేలే 

నశించు భయ్యమే నమాభ్యంమ్మేలే 

వసించు మోక్షమే విద్యా శ్రీదేవీ

*****

94..మాణవకము = రజౙ్ మొరబ్బా మత్వీ

*

మాణవకము - భ/త/లగ UIIU UIIU 

8 అనుష్టుప్పు 103

*

సాంద్రపు కాసారము రా.. శాంతమ్ము కాలంమగురా 

చంద్రికలో స్నానము రా.. ముద్రికలో మౌనమురా 


మంద్రముగా గానములే .. బంధమ్ముగా 

సంద్రములో వేగము రా.. పందెమ్ము లో భాగమురా 


పాటలలో రాగములే.. మాటలలో మాయలులే 

ఆటలకై తాళము రా.. వేటలకై భోగము లే 


మేటిగ నక్షత్రములే.. ధీటుగా ధర్మమ్ముయులే 

పేటికలో హారము రా.. ధాటికగా హోమమురా 


ఈహములో నీతలఁపే.. దాహముతో నీమలుపే 

దేహములో దాహము రా.. స్నేహములో సాక్షమురా 


వాహినిలో యానములే. మోహముతో మార్గములే 

మోహన మీ ప్రేమము రా.. మోక్షము మీ పుణ్యమురా . 

*

విధేయుడు - మల్లాప్రగడ రామకృష్ణ 

94.Must-read article (త)n/గ వృత్తములు, n=1,8

*

n=1 UUIU 4 ప్రతిష్ఠ 5 తారా 

*

తారామణీ / యీరేయిలో / నీరాకకై / నీరైతినే 

*

n=2 UUI UUIU 7 ఉష్ణిక్కు 37 రాజరాజీ 

*

ఓరాజరాజేశ్వరీ 

ధారిత్రిఁ గాపాడుమా 

వారించుమా కీడు ను-

ద్ధారమ్ము సేయంగ రా 

*

n=3 UUI UUI UUIU 10 పంక్తి 293 విశాలాంతికా, తారామతీ

*

(నాలుగు గణములనుండి మాత్రమే నేను యతిని ఉంచుతాను.)

*

ఔరా హరిశ్చంద్ర భూజానికై 

మారాణి తారామతీ నీకు నా 

వారాశిగా బాధలే యక్కటా 

తీరమ్ము చేర్చుంగదా దైవమే 

*


n=95. UUI UUI - UUI UUIU 13 అతిజగతి 2341 ధాత (కల్పితము)

*

ఏతావు నీయున్కి - యీగుండెలో నిల్వరా 

సీతాపతీ నాకు - చెప్పంగ రావేలరా 

నాతప్పు లెన్నైన - నన్వీడకో దేవరా 

ధాతా ప్రజానేత - ధైర్యమ్ము నాకీయరా 


శ్వేతాంబరమ్మేను.. శ్రేయంబు కోరేనులే 

పీతాంబ రమ్మేను.. పీయూష తీర్చేనులే 

శాంతాం కరమ్మేను.. సామాన్య మార్పేనులే 

నేతాం మనమ్మేను.. నేస్తమ్ము నేర్పేనులే 


****

n=96.. UUI UUI - UUI UUI UUIU 16 అష్టి 18725 రామావతారము (కల్పితము)

*

ప్రేమస్వరూపమ్ము - వేవేగ చూపంగ రావేలకో 

నామానసమ్మందు - నాదమ్ము నింపంగ నీకౌనుగా 

శ్యామాంగ నాకిమ్ము - సచ్ఛీల మార్గమ్ము సంతోషమై 

రామావతారా వి-రాజిల్లఁగా జీవనమ్మీ భువిన్ 

*

రావయ్య నీవయ్య.. రాజ్యమ్ము గా నీవె కామ్యమ్ము గా 

మీవిద్య మాయందు.. మీసౌమ్యమై మాకు కాలమ్ముగా 

భావమ్ము నీదేను.. బంధమ్ముయే నీది లక్ష్యమ్ము గా 

చావైన మాకర్మ.. జాధ్యమ్ము యేమాది దీనమ్ముగా 


**---

n=97. UUI UUI UUI - UUI UUI UUIU 19 అతిధృతి 149797 శోభాకృతి (కల్పితము)

*

నీవేగదా నాకు సర్వమ్ము - నీవేగదా నాకు గర్వమ్మురా 

నీవేగదా నాదు దీపమ్ము - నీవేగదా నాదు రూపమ్మురా 

నీవేగదా నావసంతమ్ము - నీవేగదా నాశరత్కాలమే 

నీవేగదా నామనమ్మందు - నీవేగదా యెల్ల శోభాకృతీ 

*

నీరూపు నాలోన నున్నాది.. నీ దాహమేతీర్చ గాపొందెరా 

సారూప్య లక్ష్యమ్ము నానుండి.. సామర్థ్య మేనీది గాపొందెరా 

దారుధ్య దేహమ్ము నీదేను.. దాహమ్ము తీరేను గాపొందెరా 

ప్రారంభ వైనమ్ము గొప్పేను.. ప్రా ముఖ్యమిచ్చావు గా పొందెరా 


98..తగణం.. దండకం +


రామయ్య నీవయ్య రంగయ్య నీవయ్య 

సోమయ్య చిత్రమ్ము సోకు విచిత్రమ్ము 

భీమయ్య రూపమ్ము  భీబచ్చ దేహమ్ము 

ఏమయ్య నేనన్న యేలాగు చెప్పయ్య 


కారుణ్య భావమ్ము కాలమ్ము నీదయ్య 

దారిద్ర మేలయ్య దాహమ్ము మాదయ్య 

మారమ్ము కాదయ్య మానమ్ము నేర్పయ్య 

ఆరోగ్య మీవయ్య యాసేల మాకయ్య 

 

రావయ్య మాయింట రమ్యమ్ము చేకూర్చ

సేవయ్య మేమంత క్షేమమ్ము చేకూర్చు 

లేవయ్య మాపిల్పు లీనమ్ము చేకూర్చు 

నీవయ్య మాయాస నీడల్లె చేకూర్చు 


సారంగ, స్రగ్విణీ, భుజంగప్రయాత వృత్తములతో త-గణ దండకము: 

*

శ్రీదేవి నీవమ్మ శ్రీనాథుఁ బూగొమ్మ 

మోదమ్ము లీయమ్మ ముందుండు మాకమ్మ 

నాదాల వారాశి నావైపు జూడమ్మ 

పాదాల నేఁగొల్తుఁ బాష్పాలతో నీకు 

రా

జీవమై శ్వాసమై శ్రేయమై చిన్మయీ 

భావమై గీతమై భవ్యమై దివ్యమై 

రావమై రాగిణీ రత్నమై నవ్యమై 

కావఁగా దేవిరో కంబుకంఠీ తలీ 

రా 

ప్రియాంగీ శుభాంగీ ఋతాంశస్వరూపా 

భయమ్మేల మాకీ భవమ్మందు మాతా 

రయమ్మిందు రారే రమా గౌరి వాణీ 

జయమ్మెప్డు మాకే జగమ్మందుఁ గాదా 

నమస్తే నమస్తే నమస్తే నమః

*

సూచన: ఇలా వ్రాస్తే, వృత్తములయందలి యతిప్రాసల సొంపు, దండకపు నిడివి రెండు ఉంటాయి.


విధేయుడు - మల్లాప్రగడ రామకృష్ణ 

****

99 ..n=7 UUIUUI - UUIUUI - UUIUUI - UUIU 22 ఆకృతి 1198373 రత్న (కల్పితము)


లాలిత్వమే జీవి - లాలించి దీవించు - పాలించు రాజ్యమ్ము - మేలౌనులే 

గాలేను నాయందు - మేలేను మీయందు - జాలేను చూపేను - కాలమ్ములే     

వాలేను నీడేను - కాలేను కట్టేను - జ్వాలళ్ళు కమ్మెను - మాలౌనులే      

తాలింపు తప్పాదు - తాలింపు ఆకులు - లాలింపు యిప్పూడు - వేళమ్ములే    

  

ఓనందగోపాల - నానందరూపాల - వేణూనినాదాల - స్వానమ్ముతో 

రానన్ను జూడంగఁ - బ్రాణమ్ము నింపంగ - జ్ఞానమ్ము నీయంగ - రాణమ్ముతో 

ధ్యానింతు నిన్నెప్డు - స్నానాలతో రత్న - సూనాలతో రమ్య - గానమ్ముతో 

దీనుండనై యుంటి - దానమ్ము నీప్రేమ - లీనుండ నీలోన - మానమ్ముతో 


ఇందులో అశ్వధాటిలోని సరి గణములైన UIIIకు బదులు UUI. అందువలన అశ్వధాటివలె ప్రాసయతిని వాడినాను. 

*

****

100. n=8 UUI UUI UUI UUI - UUI UUI UUI UUIU 25 అభికృతి 

*

క్షేమమ్ము చూపెట్టి నీతుల్లె భోదించి - కామ్యమ్ము చేయించి కన్నీరు తొల్గింపుగా 

ప్రేమమ్ము తో స్పందనావల్లె యాశించి - రమ్యమ్ము యీగుండెలో యుంచునుండుఁగదా       

ప్రేమమ్ము నేడేజగమ్మందు రేరాజు -  ప్రేమమ్ములో మార్పులే యుండవే హంసమా  

ప్రేమమ్ముకే దైవమే తోడు యీరోజు - ప్రేమమ్ము దాహము దేహమ్ము తృప్తేనులే     

(mallapragada ramakrishna)

ఓరాజహంసా మనమ్మందు నాకెప్పు - డూర్ధ్వమ్ముగా దైవమో యంచు నుండుంగదా 

నారాజు వాఁడే జగమ్మందు రారాజు -  నాగుండెలో స్పందనమ్మందు వాఁడుండునే 

రేరాజులో మార్పు క్షీణమ్ము వృద్ధమ్ము  - ప్రేమమ్ములో మార్పులే యుండవే హంసమా 

చేరంగ నారాజుతో నిన్ను సాయమ్ము - చేయంగ నేఁగోరుచుంటిన్ దయం జూపవే 

 రాజహంస (ధర్మవరం కృష్ణాచార్యులచే కల్పితము)


 ప్రాంజలి ప్రభ..101

కల్పిత వృత్తము చాపము = రజౙ్ ముసమ్మన్ మత్వీ ఒస్-సద్ర్ వజ్-జర్బ్

*

చాపము - భ/ర/య/స UIIU IUIU UIIU  

12 జగతి 1623

*

తప్పులె తెప్పలుగా సాగుటయే 

ఒప్పులె కుప్పలుగా యాగుటయే

నిప్పు లె తిప్పలుగా నీడలు యే 

ముప్పులె నెప్పులుగా ముఖ్యముయే 


ఇప్పుడె ముట్టబెట్టు దీపం త్వరగా 

గుప్పన నిమ్ము వెల్గు చాపం త్వరగా 

చెప్పుట యాపగల్గు చింతల్ త్వరగా 

తప్పులు తెల్ప గల్గు తత్త్వం త్వరగా 


తప్పులలోన మున్గినామే ధరపై 

చప్పున జల్లచేయి తాపం త్వరగా 

తప్పుడు మాటవళ్ల నేమో ధరపై 

అప్పులలోన చిక్కినామే విధి గా 


రేపవ నందనమ్ము లోకం ముదమై 

ఆపగ రమ్ము యుద్ధ శాపం త్వరగా 

ఓపిక లేని తీరు ఓర్పే ముదమై 

ధూపము మాదిరైన లోకం త్వరగా 


జీవుల జంపుచుండు జీవుల్గలరే 

నీవిక కడ్గవేల పాపం త్వరగా 

పావులు గాను మార మార్గముననే 

చావులు నెంచలేక శాపం త్వరగా 


బాంబుల వర్షమందు చావే విధిగా 

సాంబుడి కేల రాదు కోపం త్వరగా 

మంబర వీధి నందు మాయే విధిగా 

అంబుజ నాధు డేల కోపం త్వరగా 


ఆవిజయమ్ము దాహమా చూచెదవా 

నీవిక కూల్చవేల యూపం త్వరగా 

నావిజయమ్ము దేశమా చూచెదనా 

నామది మార్చవేళ శాపం త్వరగా 


సూచన: ఇది వ్యావహారిక భాషలో వ్రాయబడినది. కాఫియాలో చివరి అక్షరమునకు ముందున్న అక్షరపు స్వరము అన్ని చోటులలో ఒకటే కాదు. సామాన్యముగా ఇది అంగీకృతము కాదు. కాని దీనికి ఉదాహరణములు ఉన్నాయి. మచ్చునకు ఉదా. 


మత్లా: 

దిల్-ఎ-నాదాఁ తుఝే హుఆ క్యా హై 

ఆఖిర్ ఇస్ దర్ద్ కీ దవా క్యా హై 

- గాలిబ్ 

*

విధేయుడు -మల్లాప్రగడ రామకృష్ణ

****

ప్రాంజలి ప్రభ.. 102

సారంగ, స్రగ్విణీ, భుజంగప్రయాత వృత్తములతో త-గణ దండకము: 

*

శ్రీదేవి నీవమ్మ శ్రీనాథుఁ బూగొమ్మ 

మోదమ్ము లీయమ్మ ముందుండు మాకమ్మ 

శ్రీశక్తి నీదమ్మ శ్రీవల్లి రూపమ్ము 

ఓం శక్తి నీవమ్మ ఓంకార ధ్యానమ్ము 


నాదాల వారాశి నావైపు జూడమ్మ 

పాదాల నేఁగొల్తుఁ బాష్పాలతో నీకు 

వాదాలు లేవమ్మ వాక్యమ్ము నీదమ్మ

మోదాలు మావమ్మ మోక్షమ్ము నీదమ్మ


రాజీవమై శ్వాసమై శ్రేయమై చిన్మయీ 

నాజీవితం నీదియై నామమై తన్మయీ 

భావమై గీతమై భవ్యమై దివ్యమై 

కావుమా మమ్ముగా కార్యమై కాలమై 


రావమై రాగిణీ రత్నమై నవ్యమై 

కావఁగా దేవిరో కంబుకంఠీ తలీ 

భావమై భవ్యతే బంధమై బాధ్యతే 

తావుగా తత్విణీ తన్మయమ్మేవిదీ 


రా ప్రియాంగీ శుభాంగీ ఋతాంశస్వరూపా

భయమ్మేల మాకీ భవమ్మందు మాతా 

రయమ్మిందు రారే రమా గౌరి వాణీ 

జయమ్మెప్డు మాకే జగమ్మందుఁ గాదా 

నమస్తే నమస్తే నమస్తే నమః

*

సూచన: ఇలా వ్రాస్తే, వృత్తములయందలి యతిప్రాసల సొంపు, దండకపు నిడివి రెండు ఉంటాయి.


విధేయుడు - మల్లాప్రగాడ రామకృష్ణ 

****-

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ