ప్రాంజలి ప్రభ
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ 

కొత్తగా పెళ్ళైనవారు 
మనసు తారట్లాట 

ఉత్సాహ మనసే ఎగసి ఎగసి పడే  
- ఉల్లాస సెగలే వెంట వెంట పడే 
వాత్సల్య తలపే తొందర చేసే 
- సంతోష కథలే మనసును తట్టే 

బంగారు తనువే వెలుగు చెందే 
 - రాగాల మదిలో సవ్వడి చేసే 
సాకార నిలయే సమ్మోహం చేసే  
- ప్రేమర్ద హృదిలో మొహం పంచే  

పొంగారు దయతో ప్రేమను పంచే   
- సేమమ్ము గనవే తలుపును తీరుస్తా 
లాభమ్ము మనకే ఆనందం పొందుదాం  
- ఆమోద మనవే అమృతం అందిస్తా 

సాహిశ్చ రతిలో సంతోషాన్ని అందిస్తా  
- అందాలు పరిచెన్ ఆనందం పొందెన్  
పల్కిమ్చు నగువే పసందైనదని తెలుసుకో  
- సందేహ మడుగున్ సంతృప్తి తీరున్  

చర్చించ మనకే సమయం ఇది కాదే  
- తాపంబు గనవే   శాంతమ్ము పొందవే 
నీహాయి కొరకే నేనున్నాడని గమనించవే  
- స్నేహంబు తెలిపే సౌఖ్యంబు అందిస్తా 

తన్మాత్ర తలపే సౌభాగ్య వెలుగు 
 - భావాత్మ వెలుగే సంతోష మలుపు  
సద్భుద్ది తపనే ఆరోగ్యహేతువే  
- చామంతి చలువే పవళింపు హాయి 

అందాల లలనా అనురాగం పంచవే 
- ఆధార కలువా జలకాలాడుదామా 
దేవీ మధుమతీ   నాకీ అనుమతీ
ప్రేమార్ధ తరుణం మించకుండా చూడవా 

 చింతేల మదనా ఈ అనువంతా నీదే  
శ్రీకార పలుకూ అంగీకారమంటున్నాగా 
 - జిఘ్రంగ కులుకూ అవకాశమిస్తున్నా  
హృదయాన్ని కారములతో హత్తుకో  

తాత్పర్య మనసూ - ప్రోత్సాహ మియగా
మోహమ్ము విడదా - దాహమ్ము తరిగే 
చల్లాగ పిలిచే - వెచ్చాగ కదిలే 
సోకంత నలిపే - ప్రేమంత కరిగే

--((*))--

ఆవులు నాకుతుంటే ఆనందంగా పడుకున్న పులులు;
పులుల చన్నులు కుడుస్తున్న లేళ్ళు;
లేళ్ళు ఆడుతుంటే హాయిగా చూస్తున్న సింహాలు;
సింహాలు గోకుతుంటే సంతోషిస్తున్న ఏనుగులు;
ఏనుగుల ముందు ఆడుతున్న పాములు;
పాముల్ని లాలిస్తున్న డేగలు;
డేగల్తో ఆడుకుంటున్న ఎలకలు;
ఎలకల్ని పెంచే పిల్లులు!
వాటి మధ్య మణికంధరుడు

  ఆటవెలది Анимированное фото

నిన్న నేడు రేపు మనసు కలుపు 
మొగ్గ అగ్గి ఒగ్గు  మనసు వలపు 
స్మ్రుతి ధృతి భృతి మనసు తడుపు 
కళ్ళు  వళ్ళు తుళ్ళు మనసు గడుపు 

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం

అశ్వగతి -

అశ్వగతికి ఎన్నో పేరులు, అవి అశ్వగతి, అశ్వాక్రాంత, ఖగతి, నీల, పద్మముఖి, సంగత. నేను ముద్దుగా చిన్న మానిని అని పిలుస్తాను (మానినిలో ఏడు భ-గణములు, ఒక గురువు ఉంటే ఇందులో ఐదు భ-గణములు, ఒక గురువు). అశ్వగతికి ఎన్నో పేరులు మాత్రమే కాదు, ఎన్నో నడకలు కూడ!
అవి -
1) UII UII UII - UII UIIU
2) UII UII - UII UII - UIIU రెండేసి గణములకు యతి లేక ప్రాస యతి
3) UII UIIU - II - UII UIIU ఎనిమిదవ అక్షరముతో అక్షరసామ్య యతి, తఱువాతి రెండవ అక్షరముపై ప్రాసయతి (ఈ అమరికలో మొదటి ఏడు, చివరి ఏడు అక్షరములకు ఒకే అమరిక. వీటిని మధ్య ఉండే II వంతెన కలుపుతుంది). ఈ నడకలను ఇంతకు ముందే ఉదాహరణములతో తెలిపియున్నాను.

ఈ రోజు ఇందులోని "కలహంసి" నడకను నాలుగవ నడకగా వివరిస్తాను. ఈ నడక ప్రత్యేకత పాదములో మూడు ఆఱు మాత్రలు, ఒక చతుర్మాత్ర. ఈ విధములైన వివిధ గతులను పరిశోధించి సాహిత్యములో సంగీతమును గుర్తించుట కూడ ఛందస్సు అవసరమే. క్రింద అశ్వగతికి కలహంసి గతి -

అశ్వగతి - భ/భ/భ/భ/భ/గ - UIIU IIUII - UIIU IIU
16 అష్టి 28087

ఆమనిలో మధుయామిని - యందములో నురుఁగా
కామినితో మృదుయామిని - కామములో పరుగా
నామదిలో నవయామిని - నాదములో స్వరమా
యీ మనికిన్ రసయామిని - యీశ్వరు నా వరమా

నీలముగా గగనమ్మది - నీరధియో కనఁగా
నీలముగా నట తారలు - నీలమణి స్రజమా
నీలముగా జలరాశులు - నింగియయెన్ గనఁగా
నీలముగా నట మిన్నలు - నీల నభస్సదమా

దివ్వెలతో భువి నిండెను - దివ్యముగా వెలుఁగుల్
నవ్వులతో నటనమ్ముల - నాదములే యెలుఁగుల్
రవ్వలుగా నవకాంతులు - రంగులతో సరముల్
పువ్వులతో నతిగంధము - మోదపు కేసరముల్

జీవన మీ భువనమ్మునఁ - జిన్మయమై వెలుఁగన్
పావనమౌ హృదయమ్మున - పండుగగాఁ జెలఁగన్
భావనలో నొక కైతగ - పద్మముఖీ దరి రా
జీవితమే మధుధారగఁ - జిందిడ నా సిరి రా

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు





***
అడుగు అడుగూ కలపి - ప్రేమలతొ పిలువగా  
మనసు తలపే తెలిపి  - శ్రోతలను పిలవగా
వయసు వలపే మెరిసి  -  త్రోవలను
  
సెగలు వలె గాలితెర  - కమ్ముకొని దొలఁగఁగా
మది తలపే మరులు - గ్రోలి కల సరసిలో
గగన జలమే చినుకు - జారి మది తడపగా

చమరివాల -

ఆధారము - రమణకవి లక్షణశిరోమణి
వర్గము - వనమయూరము
నడక - పంచమాత్రలు
యతి - (1,11)

చమరివాల - న/న/న/జ/న/లగ IIIII IIIII - UIII IIU
17 అత్యష్టి 64512

అలలవలె శశికరము - లంబరపు కడలిన్
గలలు గన సమయ మిది - కౌముదిని గనుచున్
వలపు నును తలఁపులకు - వర్ణముల నిడుచున్
జెలియ హృది యలరఁగను - జేరు శుభ ఘడియల్

మధురముగ మధురముగ - మాటలను బలుకన్
హృదయమున వ్యధ దొలఁగె - నెక్కువయె ముదముల్
మృదు మధుర రవములను - మెల్లఁగను వినఁగన్
ఇది నిజమొ యిది కలయొ - యేమొ యిది యెఱుఁగన్

పడఁతి కురు లవి చమరి - వాలమన నమరెన్
ముడుల జడ ముదము లిడెఁ - బూలసరములతో
నడువఁగను నిటునటుల - నాగమన గదలెన్
వడిగ హృది దడదడల - స్వనము లవి జెలఁగెన్

యమున నది కదలుఁగద - హర్షమున నగుచున్
గమనమున మెలమెలగఁ - గన్నయను గనఁగన్
విమలమగు తరులతల - బృందముల నడుమన్
గమలదళ నయనుఁ డొక - గానమును నుడువన్

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


ఒక అపురూపమైన పద్యము -
మొదట క్రింద పద్యము -

యోగాంభోధీ - యుసురు నియరా - యుమ్మల మ్మెక్కువయ్యెన్
రాగాతీతా - రసము లొలుకన్ - రమ్ము నాకిమ్ము హాయిన్
వాగర్థమ్మా - వసుధ నెపుడున్ - బమ్మరించంగ రావా
వేగమ్మై రా - పిసరు దయతోఁ - బెమ్మి బ్రేమించగా నన్

ఇది ఒక మందాక్రాంతము, సంస్కృతములోవలె విఱుపు, అక్షర సామ్య యతులు. ఇందులో 15 రకములైన వృత్తములు అమరియున్నవి. అవి -

UUUU - లెగో 1
IIIIIU - లెగో 2
UIU UIUU - లెగో 3

ఈ లెగోలతో వృత్తములు -

1 => కన్యా , 2 => సరి , 3 => హంసమాలా

1 + 2 => హంసీ , 1 + 3 => శాలినీ, 2 + 3 => చంద్రలేఖా
1 + 2 + 3 => మందాక్రాంతా, 2 + 1 + 3 => పద్మ

పై వృత్తములన్నియు నా ఉదాహరణములో నున్నవి.
లెగో 2 + 3 లతో లాలసరాగ అనియు, లెగో 3 +2 లతో రాగలాలస అనియు నేను సార్థకనామ గణాక్షర వృత్తములను కల్పించియున్నాను. కాని వాటిలో యతి స్థానములు వేఱు, వాటి లయలు వనమయూరపు లయలు.

సోఁగు - రెండు లఘువుల వంతెనతో స్రగ్విణి -

స్రగ్విణీ వృత్తపు మధ్యలో రెండు లఘువులను ఉంచి కల్పించిన వృత్తము సోఁగు. సోఁగు అంటే సరము అని అర్థము. స్రగ్విణిలోని స్రక్ అంటే కూడ సరము అనియే అర్థము. ఈ వృత్తమును రెండు విధములుగా వ్రాయ వచ్చును. (1) UIU UIU - II - UIU UIU, (2) UIU UIU - IIUI UUIU. రెండింటికి క్రింద నా ఉదాహరణములు -

సోఁగు - ర/ర/స/య/లగ, 14 శక్వరి 4819
UIU UIU - II - UIU UIU యతి ప్రాసయతులతో

అంద మా ప్రొద్దులో - నర-వింద మా దొర్వులో
మందమౌ గాలిలో - మక-రంద మా పువ్వులో
నందెలోఁ జిందులో - యర-సందెలో రంగులో
విందుగా గాన మో - ప్రియ - డెందమున్ బొంగులో

మాధవా సూడరా - మధు-సూదనా కూడ రా
మోదమై యూఁదరా - భువ-నోదయ మ్మౌనురా
వేద మా వాక్కులే - విన - నాదముల్ విందులే
శ్రీధరా రమ్మురా - సిరి - నాదగున్ నమ్మురా

ముంచనా నవ్వులన్ - బుల-కించఁగాఁ బువ్వులన్
దించనా స్వర్గమున్ - దిల-కించఁగా దృశ్యమున్
బంచనా తేనియన్ - బలి-కించనా వీణియన్
ద్రుంచనా వంతలన్ - దొల-గించనా చింతలన్

నాగమై యాడెదన్ - నవ - రాగమున్ బాడెదన్
తీగగా మ్రోఁగెదన్ - దెలి - వాగుగాఁ బారెదన్
వేఁగుఁజుక్కయ్యెదన్ - విరి - సోఁగుగాఁ బూచెదన్
వేగ నిన్ దాఁకెదన్ - బ్రియ - యూఁగెదన్ దూఁగెదన్

పై ఉదాహరణములో వంతెనగా ఉండే రెండు లఘువులు లేకున్నను అది ప్రాసయతితో స్రగ్విణివలె అర్థవంతముగా నుంటుంది -

నాగమై యాడెదన్ - రాగమున్ బాడెదన్
తీగగా మ్రోఁగెదన్ - వాగుగాఁ బారెదన్
వేఁగుఁజుక్కయ్యెదన్ -సోఁగుగాఁ బూచెదన్
వేగ నిన్ దాఁకెదన్ - యూఁగెదన్ దూఁగెదన్

పంచమాత్రల UIU UIU - IIUI UUIU అమరికగా, అక్షరసామ్య యతితో

నింగిలో రంగులన్ - నిశిలోన నక్షత్రముల్
శృంగముల్ మంచులో - సిత గోపురాకారముల్
ముంగిలిన్ నీకునై - ముదమార నేనుంటిఁగా
రంగ రావేలకో - రసవీణ మ్రోఁగించఁగా

జాలమేలా ప్రియా - చలిలోన వేసారితిన్
చాలు చాలా కథల్ - సరసాలఁ జాలించరా
పూల నెత్తావులన్ - బులకించ వేళయ్యెరా
పాలు చల్లారురా - ఫల మారగించంగ రా

పున్నె మీ పున్నమిన్ - ముదమొంది నిన్ గాంచుటే
కన్నె డెందమ్ములోఁ - గవనమ్ము నీకై గదా
వన్నెతో గీతముల్ - ధ్వనియించె సన్నాయిగా
మున్ను రా మోహనా - మొగమిత్తు ముద్డాడఁగా

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

నేటి కవిత
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఉదయభానునికి హిమపాతానికి
కీచులాట

తూర్పున కాంతి కానరాకుండా
హిమం నన్నుదాటిపోలేవని ఉంది ఆశతో
కోడికూసే పల్లె మంచు మత్తులో నలిగే 
ఆకును కదలచకుండా ఆపె మంచు

ఆకురాలిన తరువులు వణకసాగే 
వలువలులేని శరీరాలు హత్తుకుపోయే
ప్రకృతి నడక సాగలేక ఆగే
గోదావరి కదలలేక కదలలేక కదిలే

గాలిని గమనించేవారులేక బాధపడే
పక్షులు కిల కిల శబ్దములు లేవే
మానవకళేబరాలు మత్తుకు బానిసై
కదలికలు లేక మూగపోయే

చెట్ల మధ్యన చొచ్చుకువచ్చె కిరణం
నలుగురు చేసె చలిని తరిమే మంట
సాటి మనుష్యుల సవ్వడితో మంచు కరిగి
ఉదయభానుని తేజానికి తట్టుకోలేక

సంబర పడకండి నిత్యం
రాత్రిళ్ళు మీయింటనే ఉంటా
నా చెలిమితో చెలగాటమాడుతా
వేడికి చలి -- చలికి వేడి
స్నేహం స్త్రీపురుషుల్లా
ఇదేకదా ఆదిపురుషుల
మానవుల కీచులాట

--(())--
 

💐నారాయణుడీతడు నరులాల💐 తాళ్ళపాక అన్నమాచార్య స్వామివారి కీర్తన.

నారాయణుడీతడు నరులాల
మీరు శరణనరో మిమ్ము గాచీని

తలచిన చోటను తానే ఉన్నాడు
వలెనను వారికి కైవసమెపుడు
కొలచెను మూడడుగుల జగమెల్లాను
కొలిచినవారిని చేకొనకుండునా

యెక్కడ పిలిచినా ఏమని పలికీ
మొక్కిన మన్నించు మునుముగను
రక్కసుల నణచి రక్షించు జగములు
దిక్కని నమ్మిన తిరముగా నేలడా

చూచిన యందెల్ల చూపును రూపము
వోచిక పొగడిన వుండు నోటను

యేచిన శ్రీవేంకటేశుడే యితడట
చేచేత పూజింప సేవలుగొనడా

ప్రాంజలి ప్రభ
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

బ్రతికి నన్నాళ్లు నీ భజన
శ్రృతికి వాకిళ్లు నీ మనసు
భ్రృతికి లోగిళ్లు నీ గుడియె
మృతికి  కౌగిళ్లు నీ గతియె
నమో నమో నారసింహా యా

మరణ కాలంలో నిన్ను మరుస్తానేమో
పలుకు వాదంలో నిన్ను తలుస్తానేమే
అలక కూపంలో చిక్కి పిలుస్తానేమో
చిగురు పాపంతో చేసి కలుస్తానేమో
నమో నమో నారసింహా యా

యమదూతల ఆగ్రహం ఉందీ
యమపాశము వెంటనే ఉందీ
పలుపాపము చేసియే బందీ
పలునష్టపు ఖర్చుయే ఉందీ
నమో నమో నారసింహా యా

అక్షర చెలిమి జన్మే చిరునామ
ఆకలి కడుపు తిండే కదనాన
వేదన మలుపు అంటే జరిమాన
బానిస బతుకు అంటే నజరాన
నమో నమో నారసింహా యా

ఎక్కడ పిలిచిన అక్కడకొస్తావు
రక్కసు మనసును మార్చుటకొస్తావు
మోక్కిన తలపున గుండెలొఉంటావు
దిక్కని కొలచినచో ఆదుకొంటావు
నమో నమో నారసింహా యా

చూచిన యందెల్ల చూపును రూపము
యాచన వత్తిల్ల కాపుకు దీపము
యోచన హృద్యంలొ సేవకు పీఠము
కాచిన పాలల్లొ దాగిన నెయ్యి యు
నమో నమో నారసింహా యా

--(())--
---
 ఓమ్




--------ఇది గూఢచిత్రం.-----
లచ్చి శంకరుండు లలిమీర గలిసిన
ఇదేమిటి లచ్చి శంకరుండు లలిమీర గలిసిన -
ఇదేట్లా సాధ్యం.
ముందు ఈ పద్యం చూడండి.

లక్ష్మి శివుని తోడ లలిమీరగూడిన
భువనకారకుండు పుట్టవలయు
లచ్చి శంకరుండు లలిమీర గలసిన
విష్ణుదేవుడుద్భవింప వలయు
ఇది పైకి అశ్లీలగా, భ్రాంతి కలిగించి, మెదడుకు పదును పెడుతున్నది. నిదానంగా
ఆలోచిస్తే విషయం అర్థమౌతుంది. లక్ష్మి కి పర్యాయపదాలు చూస్తే - కమల, లచ్చి,
రమా, ఇందిర .... ఉన్నాయి. .అలాగే శంకరునికి పర్యాయపదాలు - భవుడు,

ఈశ్వర,ఈశ,....
పై పద్యంలో మొదటి రెండు పాదాలు తీసుకుంటే
లక్ష్మి శివుని తోడ లలిమీరగూడిన
భువనకారకుండు పుట్టవలయు
లక్ష్మి పర్యాయపదం కమల,
శంకర పర్యాయపదం భవుడు,
లక్ష్మి కి శంకరుడు కలిసిన భువనకారకుడు పుట్టాలికదా
పర్యాయపదాలను తీసుకుంటే
కమల(లక్ష్మి) - భవుడు(శంకరుడు) ఈ రెండిటిని కలిపిన కమలభవుడు
అంటే భువనకారకుడు(బ్రహ్మ)కదా!
అలాదే చివరి రెండు పాదములు తీసుకొన్న
లచ్చి శంకరుండు లలిమీర గలసిన
విష్ణుదేవుడుద్భవింప వలయు
లక్ష్మి ని శంకరుడు కలిసిన విష్ణువు పుట్టాలి
పర్యాయపదాలను తీసుకుంటే

  • రమా(లక్ష్మి) - ఈశ(శంకరుడు) - రమేశ అంటే విష్ణువేకదా!
మరి ఇందులో అశ్లీలము లేదుకదా!
(శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారి వివరణ)
-----------------------------------
------------ఇది మరొక గూఢచిత్రము------------------
ఈ పద్యం చూడండి.

ఆననాధరగళ మూర్తు లతివ కజుఁడు
చంద్రకురువిందశంఖ చంచలలఁజేసి,
చెలఁగి, తచ్చిహ్న కాఠిన్య సితచలతలు
సొరిదిఁ కచకుచహాసదృష్టులుగఁ జేసె
(చాటుపద్యమణిమంజరి-1భా. పుట.108)
ఈ పద్యం తెనాలి రామకృష్ణునిదిగా ప్రసిద్ధమయినది.

పద్యంలోని క్రిందిపదాల వరుస చూడండి.
ఆనన-చంద్ర-చిహ్న - కచ
అధర- కురువింద- కాఠన్య- కుచ
గళ- శంఖ- సిత- హాస
మూర్తి-చంచల- చలత-దృష్టులు
ఈ వరుసక్రమంలో పదాలను గుర్తుంచుకొని వివరణలో గమనించండి.

బ్రహ్మదేవుడు వనితయొక్క
ముఖాన్ని(ఆననమును) చంద్రునితోను,
పెదవిని(అధరమును) పద్మరాగ(కురువింద)మణులతోను,
కంఠము(గళము)ను శంఖముతోను,
ఆకారమును(మూర్తిని) మెరుపు(చంచల)తోను,
క్రమంగా ఉంపమింప సృష్టించినాడు.
కానీ,
క్రమంగా వాటిలోని దోషాలను తర్వాత గమనించి, మరల విజృంభించి(చెలగి)
ముఖము చంద్రునితో చేశాడుకదా చంద్రునిలోని మచ్చ(నలుపు)ను
తొలగించటానికి ఆమె వెంట్రుకల(కచ)తోను,
పద్మరాగంలోని కఠినత్వాన్ని స్తనాలలోను,

శంఖంలోని తెల్లదనాన్ని(సిత) ఆమె నవ్వు(హాసం)లోను,
మెరుపులోని చంచలత్వాన్ని ఆమె చూపులలోను,
క్రమంగా రూపొందిచి తప్పు చేసినాడనే
అపవాదు నుండి తప్పించుకున్నాడు బ్రహ్మ.
(శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారి వివరణ)
-----------------శుభసాయంత్రం ----------------------------
25. నేటి కవిత   
ప్రాంజలి ప్రభ 
మల్లాప్రగడ రామకృష్ణ 

సత్యము నీ బాట ఐతే 
శాంతి నీకు తోడవుతుంది 
అసత్యము నీకు బాటైతే 
క్షణిక సంతోషం తోడవుతుంది 

మనసు చెలిమిని ఆసిస్తే   
చెలిమి నీకు రక్షణ అవుతుంది 
రాగం గుండెను గరిగిస్తే 
అనురాగం పొంగి పొర్లుతుంది 
   
గాయం కమిలి పోతే 
ఉపశమనం తోడవుతుంది 
ఆనందంతో చిలికితే 
సుధా మాధుర్యం పంచుతుంది 

సంద్రం కెరటం సహకరిస్తే 
నది కల్సి చల్లఁబడుతుంది
కనులలో కలలు తడిస్తే 
కళలు చూపి తృప్తి పడుతుంది 

హృదయం నలిగిపోతే 
స్పందన కరువవుతుంది 
మనసు బండ బారితే 
ఆరోగ్యం చెడి పోతుంది 

శృంగారం మితిమీరితే
ఆచ్చాదన తెగి పోతుంది   
మనసు ఉచ్చులో పడితే 
మౌనం కూడా తప్పు అంటుంది 

బతుకు ప్రశ్నకు దారేదంటే
ఆకలి తీర్చే మార్గం చూడమంటుంది
సమాధానము లేని ప్రశ్న అంటే 
అమ్మేలేదన్న మూర్ఖత్వం అవుతుంది 

సత్యము నీ బాట ఐతే 
శాంతి నీకు తోడవుతుంది 


--((*))--


26. నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ

ప్రసవవేదన అమ్మ ఎంత కష్టపడుతుందో 
అమ్మ గర్భాన చేరి కడుమార్లు చుట్టలుగా తిరిగి 
సుడిగుండాల కదిలించాను అమ్మ భరించింది

పెంకును పగల కొట్టుకొని 
కోడిపిల్ల బయటకు తొంగి  చూసినాట్లుగా   
టెంకను చిలికచేస్తూ 
మామిడి మోలక తలెత్తినట్లుగాను
అమ్మ పొట్టను చీల్చుకొని
బిడ్డగా పుడమి తల్లి వడిలోచేరాను

మాతృత్వంతో ముద్దాడి తన కష్టాలను మరచి 
ఆనందాన్ని పొంది పంచేది అమ్మ ఒక్కటే 
అమ్మ సాక్షాత్తు భగవంతున్నే కన్నానని 
భావించి లాలించి ముద్దాడి ప్రేమిస్తుంది 
పేగు బంధంతో ప్రేమను రంగరించి 
మురిపాలను అందించి అత్మజులుగా మార్చేది అమ్మ

మనోవాంఛ సంతానంద్వారా తీర్చుకోవాలని 
పెద్దలు తెలిపారు 
బిడ్డలుగా తల్లి తండ్రుల ఋణం తీర్చుకోవాలని 
పెద్దలు తెలిపారు
అనుదిన సంతోషణముల్ 
జనిత శ్రమ తాప దు:ఖ సంశోషణముల్
జనకుల సంభాషణముల్
తల్లి తండ్రుల కర్ణ యుగల సద్భూషణముల్ 
అవ్యక్త మధురోక్తముల్ 
యజ్న యాగాది పుణ్య క్రతువుల్ 
పుట్టిన బిడ్డ పొంద గలుగుతాడు 
జన్మ సార్ధకం చేసుకున్నవాడు 
నిజమైన బిడ్డ అని అన్నారు       
ధర్మో రక్షితి రక్షిత:
జనకుల్ రక్షితి రక్షిత:        

--((*))--


27. నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ

నేను నేను కాదు 
నాలో ప్రవహించేది రక్తము కాదు
కరుణ, దయ, త్యాగ ముంది 

నేను మీలో ఉన్నాను
మనస్సును కదుపుతున్నను
అమ్రుతఘడియల సత్యాన్ని 
కధగా కవితగా తెలపుతున్నాను      

నేను ప్రకృతితో తిరుగుతాను 
కాలాన్ని గమనించ లేను
ఇతరులను నొప్పించకుండా 
సమయాన్ని వ్యర్ధపరచకుండా   
ఏ మనస్సును భాదపెట్టకుండా
ఆధ్యాత్మిక విషయాలు తెలుపుతున్నాను 

మనిషిగా పుట్టుకలో ఏముంది 
అహం,స్వార్ధం, ఈర్ష్య, ద్వేషం 
లేకుండా ఉండటంలో ఉంది 
ప్రయత్నంలోనే విజయం దాగుంది  
అపార్ధంలోనే అపజయం దాగుంది 
నమ్మకం తో బ్రతుకుతున్నాను 
నమ్మకమే మనిషిగా గుర్తిపు ఇస్తుంది 
ప్రేమించి ప్రేమ పొందటంలోనే 
నిజమైన జీవితమని నాభావన 
     
నా పుట్టిన రోజు సందర్భముగా 
అనేకమంది శుభాకాంక్షలు 
తెలిపినవారికి హ్రుదయపూర్వక 
పెద్దలకు పాదాభివంద వందనములు
పిల్లలకు నా ఆసీర్వచనాలు 
అంజలి ఘటిస్తు ప్రాంజలి ప్రభను 
మీ అందుబాటులో ఉండుటకు 
నిత్యమూ కృషి చేస్తాను 
ప్రతిఒక్కరికి మరొక్కసారి 
ధన్యవాదములు 
తెలియపరుస్తున్నాను 

ఇట్లు ఇప్పుడే పుట్టిన మిత్రుడు 


   --((*))__
#shree #radhakrishna #radheradhe #krishna #Mirabai #nirmohiya

నేటి pranajli prabha  గీతం
ప్రాంజలి ప్రభ 
రచయత : మల్లప్రగడ శ్రీదేవి  రామకృష్ణ 

ఏమని చెప్పేది, మీకు ఎలా చెప్పేది  
ఈ మూగపోయిన గుండె భాద కృష్ణా 

మల్లె పువ్వులా రోజు పరిమళాలందించటం తప్పా  
అనురాగ బంధంతో బతకటం తప్పా 

ఏమని చెప్పేది, మీకు ఎలా చెప్పేది  
ఈ మూగపోయిన గుండె భాద కృష్ణా 

కట్టుకున్న పందిరేమో కాలదన్నే 
కన్నబిడ్డలలో  మమత ఎండిపోయే 
ఇవ్వాలనుకున్నది ఇవ్వలేను
పొందాలనుకున్నది పొందలేను
పెదవి విప్పి ఎవ్వరికీ చెప్పలేను  
పోదు పొద్దు ఎదురు చూడటం  తప్పా
పరమాత్ముని పిలుపుకోసం చూడటం  తప్పా
   
ఏమని చెప్పేది, మీకు ఎలా చెప్పేది  
ఈ మూగపోయిన గుండె భాద కృష్ణా 

మల్లె పువ్వులా రోజు పరిమళాలందించటం తప్పా  
అనురాగ బంధానికి కరుణతో బతకటం తప్పా 

ఏమని చెప్పేది, మీకు ఎలా చెప్పేది  
ఈ మూగపోయిన గుండె భాద కృష్ణా 

కన్నబిడ్డలకోసం సముద్రాన్నే ఈదాను 
ఎడారిలో దాహన్నందించి బ్రతికాను   
ఆశ మేర విధ్యనందించి పోషించాను  
రగిలి రగిలి నేను మిగిలి పోతున్నాను 
ఈ ధరిత్రి ఇంకెన్నాళ్ళు భరించవలసి ఉండునో 
అమ్మా వసుంధరా నన్నునీలో కలుపుకో మనటం తప్పా  
సుర్యు డొచ్చి నిద్రలేపి చంద్రుడొచ్చి నిద్ర పుచ్చే 
ఎవ్వరికీ అవసరము లేని ఈ బతుకును చాలిస్తానని అనటం తప్పా 
    
ఏమని చెప్పేది, మీకు ఎలా చెప్పేది  
ఈ మూగపోయిన గుండె భాద కృష్ణా 
మల్లె పువ్వులా రోజు పరిమళాలందించటం తప్పా  
అనురాగ బంధానికి కరుణతో బతకటం తప్పా 
ఏమని చెప్పేది, మీకు ఎలా చెప్పేది  
ఈ మూగపోయిన గుండె భాద కృష్ణా 

--((*))--
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
Another great find on #zulily! Baby Bubbles Print #zulilyfinds:
నేటి పద్య పుష్పాలు ( అమ్మా - ఆదిపరాశక్తి )
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ





2. కైవల్యం వలనే జడత్వ గుణమే మూఢత్వ తొల్గిమ్ చెనే
    భాందవ్యం వలనే నిజాన్ని తెలిపే సంగ్రామ సంధాయి గా
    కారుణ్యం వలెనే ప్రశాంతి వరమే బంధాన్ని సంతోషి గా
    మాతృత్వం వలెనే అహాన్ని తొలచీ జ్ఞానాన్ని పొందేదిగా

3. ఆత్మా జ్ఞానమునే విశాల పరిధీ విద్యుత్ సహాయమ్మునే 
  జీవాత్మా వయసే మదీయ వదనం వేదాంత భావాత్మమే
  సామాణ్యా వెతలే జయించి సహజంగా ప్రేమ పంచేందుకే
     అజ్ఞానం తొలచీ సహాయ పనులే స్త్రీ జన్మ కారుణ్యమే

 4. పాంచాలీ తనువే భరించి మనసే పాలించె శ్రీ పత్నిగా
     మాంచాలీ పసుపే చూపించె మగడే మానాన్ని రక్షించె లే  
     శ్రీలేఖా సుఖమే ఊరించి వడి కల్పించేను వాత్సాయి గా
    శ్రీపత్నీ మనసే అర్పించి సునిద్రా కల్పించె సౌభాగ్య గా

 5. స్త్రీసేవే మమతా మాధుర్య వదనం కారుణ్య ఖాటిన్యమే
      స్త్రీ శక్తీ పరమే విధాన మురిపించే లీల మాధుర్యమే
  స్త్రీ తేజస్సునకే అనూహ్య ప్రళయం సంభావ పర్యాంతమే
     స్త్రీ సౌఖ్యం కొరకే నిరంత రముగా వేటాడి వెంటాడుటే       

6.  తారంగం తలపే నవ అభ్యుదయా ఆశ్చర్య ఆర్భాటమే
    ప్రత్యేకం పవిత్రం తపస్సు వడిలో తన్మాత్ర అర్పించుటే
      లాలిత్వాకలితో సమంగ కదిలే స్త్రీ తత్వ సౌందర్యమే
పురుషాలింగముకే నిరంతరముగా  సందర్భ ప్రేమామృతం
No automatic alt text available.

7.శాంతంమ్మూ కరుణాలవల్లి కమనీయ ఉద్దేశ్య ప్రాణార్పితే
ప్రేమమ్మూ తలపే మదీయ వలపే సాద్యాయసాధ్యమ్ములే
     భావమ్మూ పదిలం మరోచరిత్రలే భందాల భావాలులే
కావ్యమ్మూ మహిళాసుఖాల సహనం సౌందర్య సాహిత్యమే

8. మాయా కల్పితమే సుశాంతి కొరకే కాలాన్ని సృష్టించె నే  
     వేదాంతం వలనే సుబ్రాన్తి కలిగే జీవాత్మ మిధ్యామయే
     సంపూర్ణా లయమే సహృద్య మనసే రూపజ్ఞ భావాత్మయే
   బిన్నాభిన్నమయం సదృష్టి తనువే సంకీర్ణ తన్మాత్ర యే  

9. లోకా వాసననే గ్రహించి బ్రతుకే సామాన్య రూపాంత రం
     శాస్త్రా వాసననే పఠించి కదిలే పాండిత్య భావాంత రం
     దేహావా సనకే  చలించి తనువే అర్పించె లోకాంతరం
     పై మూడే మనసే మధించు కనుకే దైవాన్ని ప్రార్ధించు టే

10.సంసారం సహజం సమానకధలే దాంపత్య పాండిత్యమే
  సంతానం రుణమే శుభంద మగుటే జ్ఞానాన్ని అందించుటే
       సౌభాగ్యం మనసే ప్రశాంతి వలనే కష్టాస హృద్బావమే
  సౌశీల్యం సహభందు శాంతి తలపే సాంగత్య సాహిత్యమే

11. బ్రాహ్మాణా అనగా తపస్సు శృతిగా వేదాంత బోథా వరం
       వేదాధ్యా యనమే వ్రతాది విషయం ప్రత్యక్ష సేవా వరం
       చిత్తాసుద్దివలే నిరంత రముగా సేవా సహాయం వరం
       నిత్యానిత్య పనే సమాన కథలే బోధామృతంగా వరం           

12.  సంసారం కొరకే సందేహ విడిచీ సంకీర్ణ భావోక్తి లే
        యోగాబ్యాసమునందు ఎంతొ తెలివే కల్పించె సంతృప్తి లే
        నిత్యానిత్యపనే కర్తవ్య సెగలె న్నిన్నాం ద పర్చేను లే
        శీతోష్ణాది ప్రభే మనస్సు తొలచీ విశ్రాంతి కల్పించె లే

13.ఈమాయా మనలో సద్రూపమునలేదే సృష్టి రూపాలుగా
     ఈలక్ష్యం ఒకటే మహాద్బుతముగా పొందాలి శాంతమ్ముగా
     ఈరూపం స్థిరమే వివేక మయమే దృష్టాంత పూర్వస్థితే
     ఈభ్రాంతే సమయం సమంగ మనలో ఆనంద భావ్యస్థితే

14. సత్యత్వా ధికమే నిరంతరముగా తపనే కర్మాలయే
      నాచ్చా దించినచో మనస్సు తనువే దేహాది సౌఖ్యాలులే
      వ్యత్యాసం తలచే మనస్సు తగువే చూపించి సాధించుటే
      పై మిధ్యా మనలో ప్రవేశ కళలే ప్రత్యేక ఆవాహమే

15. నిర్దేశ్యా ఉనికే ప్రభుత్వ ప్రబలే సాకార ఉద్దేశ్యమే
      సాకల్యం గమనం ప్రభుత్వ పనులే సంభావ గమ్యాలులే
      సాఫల్యం అనుటే పరంపరముగా వ్యూహాత్మ చర్యాలులే

      గ్రామాభ్యున్నతికే ప్రభుత్వ పథకాలెన్నోప్రజారక్షగా 

        
      మ: మధురో ల్లాసమ గామనో హృదయ మేప్రీతిన్ రసాస్వాదమే
      తను వోల్లాస భగా భవోన్నతయె విశ్రాంతిన్ యసోపాసమే
      వలపోల్లాస భయా మదోత్తతయె విభ్రాంతిన్ శ్వపార్శ్యంబునన్
      అతడే మోక్షము ఉన్నతోత్తతయె సపర్యా సమానోన్నమే   

   

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ