
శుభకృత్. సంవత్సరంలో అంత శుభాంగానే ఉన్నది జగతి ఉన్నట్లని అర్ధం.... ఇక రాబోయేది శోభకృత్ సంవత్సరం... అంటే మన జీవితాలు శోభాయమానంగా అంటే సుఖ సంతోషాలతో ఉంటాయని అర్ధం... మన ప్రాచీన సనాతన సాంప్రదాయమెంత గొప్పదో ఊహించుకోవచ్చు….
అందుకే ప్రతి ఒక్కరు రేపు ఉగాది పండగను పురస్కరించు కొని విధిగా షడ్రుచుల ఉగాది పచ్చడిని సేవించాలని వినతి...
షడ్రుచులు: తీపి ( బెల్లం ), వగరు ( మామిడి కాయ ), చేదు ( వేప పూవు ), పులుపు ( కొత్త చింత పండు రసం ), కారం ( మిరియాల పొడి ) చివరగా ఉప్పు
......
" చంద్రమౌళిం , గిరీశానం , సాంద్రశీతాంశుభూషణమ్..
ఇంద్రాదిసర్వసంసేవ్యం , నీలకంఠం సమాశ్రయే !!! "
......
గంగోదకవృత్తః -- ర ర ర ర ర ర ర ర..24/13...
--
శంభుమీశానమాద్యంగురుం శ్రీధరం శంకరం దక్షిణామూర్తిరూపాత్మకం ,
దంభమత్తేభచర్మాలంకారిణంతారకాధీశమౌళ్యంచితం త్ర్యంబకమ్..
జృంభితశ్రీమదప్రాభవారింమహాశేముషీదత్తనాథంశివం మోక్షదం ,
దంభమాత్సర్యదోషాదిశత్రుంగిరీంద్రాభిమాన్యంభజే కాలకంఠంసదా !!! "
----
కవిత్వం....అక్షర లక్ష్యం
న.ఊహ లయల భావ మదియు ఉన్న తమ్ముగా నమఃశివాయ
స్నేహ చరిత లక్ష్య మేను సేతు బంధమే నమఃశివాయ
ఆహు తవని కవి కలముయె ఆది బోధయే నమః శివాయ
బాహు బలము కాదు బుద్ధి సానుకూలతే నమః శివాయ
అక్షరం విత్తుగా నాటినా పంట మనసు
అక్షరాలు కళ లయితే ఆట చెలిమి
పూల తోట కవిత్వమ్ము పూజ్య మగుట
అక్షరాలు ముత్యాలుగా హార మెరుపు
అక్షర కిరణాలయితేను ఆస్తి గాను
అక్షరం తేనె చుక్కగా ఆశ పెంచు
జిహ్వకుపసందు కవితయు చేష్ట లగుట
అక్షరాలు రాగాలయి అలక దీర్చు
అక్షర ఇటుకలైతేను పొందు గృహము
అక్షరాలన్ని ఆకులై కదలు చుండు
అక్షరాలు తారకలైణ వెన్నలగుట
అక్షరాలు మేఘాలైతె చదువు జల్లు
అక్షరాలు ఆలోచనలైతె పలుకు
అక్షరాలు ప్రవాహమై జిలుకు వాన
అక్షర ప్రాంజలి చదువు అందరి మది
అక్షరాల సత్యము ఇది అచ్చు హల్లు
అక్షరములసమాహారమౌనుహృదయ
మక్షిభావాలసాకారమైనిలుచును
కుక్షిభరమగువిద్దెలకౌశలమును
సాక్ష్యమైనిచ్చువాగ్ఝరి శారదాంబ !!! "
----
శోభకృత్ శోభిల్లంగన్
సీసమాలిక.
శోభకృత్ వర్షమ్ము శోభిల్లనేతెంచె
నవవసంతపువెలుగునవనినిండ
మల్లికా సంపంగిలొద్దుగమందార
పూలన్ని పుడమిలో పులకరించ
కోకిలమ్మల గుంపు కోయనిపలుకగా
చూతఫలములజూడ లేతగాను
దివిలోయుగాదిలో దిక్తటుల కోనలో
శోభకృత్పర్వసంరంభమాయె
తరులలో ఝరులలో విరులలో గిరులలో
సౌహార్ద్ర భావముల్ సౌరులీన
పులుపువగరుచేదుపూతపల్లవములౌ
షడ్రుచులు జిహ్వతోషమునునింప
మధుమాసమేతెంచ మరువిల్లు చెలరేగ
సుమశరాలెగయగా సూటిగాను
ప్రేయసీ ప్రియులలో ప్రేమామృతముపొంగ
వాసంతయామినీ వన్నెలెగయ
తేగీ.
వసుధకేతెంచె శోభకృత్వత్సరమ్ము
పుడమినందెల్ల పుష్పాళి పులకరించ
భాసమానంబుగా వెల్గ భవ్యముగను
సరసిజాప్తుండు భానుండు సాంధ్యవిభుడు
అందరికీ అంతర్జాతీయ కవితా దినోత్సవ శుభాకాంక్షలు
మీ విదేయుడు మల్లాప్రగడ రామకృష్ణ
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: - ఓం నమ:శివాయ :
నేటి కవిత్వం
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
విరి మల్లెలే నిత్య గంధం సతి సౌఖ్య వరప్రభ
సరాగ మాలిక ప్రేమ నమస్తే భవ్య మాయగా
సిరి నిచ్చెనే సత్య భావం పతి విద్య వరప్రభ
విశాల పాలనా యుక్తి నమస్తే నిత్య సేవగా
గిరి దర్శనా భక్తి లక్ష్యం ప్రతి ఒక్క వర ప్రభ
సమాన ఏలికా ముక్తి నమస్తే సత్య లీలగా
దరి చేరినా వారి కోర్కే విని తీర్చు వర ప్రభ
సహాయ సేవలే శక్తి నమస్తే విద్య వాదిగా
అరి భంజకా వీర రుద్రా హర హాలా హల ప్రభ
సరోజ రాగమే భద్ర నమస్తే రుద్ర సంహితా
సరి మార్గమే వీర భద్రా మది గోల శివ ప్రభ
విశాల భావమే ప్రజ్ఞా నమస్తే పార్వతీ పతీ
కరివస్త్రవిభూషిన్ భోః గిరికన్యా వరప్రద !
మురారివందిత ! ప్రాజ్ఞ నమస్తే సర్వ విశ్వధాః!!!
ఓంకారంబతి సుందరం బదియె వేదోపాంగ సారంబుగా,
ప్రాకారంబులవే దిశాంతములుగా రాజిల్ల మోదంబుగా,
శ్రీకారంబగుచున్ శుభాలనిడు నిశ్శేషా విశేషంబుగా,
ఆకారంబులు లేని భావమగుటన్, ఆదివ్య మంత్రంబుగా!
--(())--
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ
ఉగాది...అందం అంటే..కొత్త కొత్త ఆశలతో.. తేటగీతి మాల
చీర కట్టులోను పలుకు చింత మాపు
నుదుటి బొట్టులోను కులుకు ఉడుకు తగ్గు
కల్మషం లేని మనసు లో కలలు తీర్చు
మనము చూసేటి చూపులో మాయ వద్దు
స్త్రీలు అంటేనె అందము శ్రీని పిలుపు
స్త్రీలు అంటేనె అద్భుతం. శ్రీల మలుపు
స్త్రీలు అంటేనె సింగార శీఘ్ర మెరుపు
స్త్రీలు ఉంటేనె ఆ ఇల్లు సిరులు పంట
స్త్రీలు లేనిదే సృష్టియె లేకపోవు
అసలు మానవ మనుగడే ఆశ వనిత
స్త్రీలు మగవాడి ఆధారమేను మేలు
స్త్రీలు అంటే బరువు కాదు చిత్ర మవదు
స్త్రీని కాపాడుట మన బాధ్యతయు కూడ
ఎందుకంటే వాళ్ళే మన దేవతలగు
స్త్రీకి సౌమ్యం గుణమ్ముయు చెరిత తెలుపు
శాంతి వాళ్ళ నైజమ్ము సహాయ పడుట
స్త్రీగురించి వాళ్ళలొ ఔన్నత్యంమ్ము సీత కన్ను
ఎంత రాసినా తక్కువే ఏల చెప్ప
స్త్రీని గౌరవించండి పూజించ పలుకు
ఇది యుగాది పండుగ కళ ఇంతి పిలుపు
*****
సువీణ రసగుళిక
తే. చెలిమి కామక్షి మీనాక్షి చేరు కున్న
ఉండ బట్టలేక జిలేబి దినదలిచియు
మర్మ మహిమ ఇంటికి చేరి మనసు పంచి
చల్లదనముకు వెచ్చజి లేబి తీపి
......
గుట్టు రట్టు కాక సుఖము గుర్తు తెచ్చు
ముద్దుల జిలేబి రుచియే ముత్య మంత
అలక తీర్చ తీపి జిలేబి ఆశ పెట్టు
తీపి చేదు రాద్దా౦తము తీపి గుర్తి
......
తే. వింత వేష మేల మగువ వేచి చూపు
మగని రాక కోసమ్మునా మాయ కాని
మధుర అనుభూతి తెలిపేటి మనసు నెంచి
చిరునగవులన్ని పంచుటే చెంత చేరి
గుబ్బల కదలికే మది కులుకు చేయు
కురులు కదలికే కైపును గుర్తు చేయు
అరటి ఊచతొడలు చూడ ఆత్ర మగుట
అల్లి బిల్లి కనులు చూపు ఆట పట్టు
.....
తే. జగము లేలే సొగసు నీది జపము ఇదియు
తలచిన కలవరమగుటే తపము మదియు
నాహృదయము ప్రేమ ను గాన నాట్య మాడ
ఎపుడొ తెలిసింది గుణముయే చెంత పిలుపు
......
తే.మనసు సుగుణ సువీణ గా మమత పంచ
మది తలపుల వలపులుగా మాయ జేసి
మగ మహారాజ కళ్లతో మదన లీల
మరులు గొలుపు శృంగారము మహిమ జూడు
...
వాన పడి వెలిసాక నే తొందర యగు
వేడి చేరి చూపుల కళ వింత చూడ
రాక పిలిచెను రేరాజు రమ్య పరచ
నేను నిన్ను కలయు రీతి నిజము ఇదియు
.....
తే. ధార పొంగుతూ కొండలు దాటి గట్టు
దాటి దాహ తృప్తి నితీర్చి ధరణి లోన
మెల్ల మెల్లగా కదులుతూ మొలకలు తడి
చేసి ధర్మమై కడలితో చెలెమి చేసె
.....
" కం.
--
త్రేతాయుగదైవమతఁడు
సీతారామవిభుఁడౌను చిరకాలమునన్
మాతాపితరులసేవకు
నారాముఁడుముకురముగదనాఁటికినేఁట్కిన్ !!! "
----
దత్తపదిని పూరించటం ....... ఉల్లి, తల్లి, చెల్లి, మళ్లి
ఉల్లి చేయు మేలు మనకు ఉడుకు పెంచు
తల్లి పలుకు నిజాయితీ తెల్పి పెంచు
చెల్లి ప్రేమలో మనసుయే చూడ నెంచు
మళ్లి మరచిపోలేనట్టి మగువ నెంచు
అల్లి బిల్లి వల్ల గల్లి కుళ్ళి పోవునా ఈశ్వరా
ఉల్లి కార్పించు కన్నీరు తొరిగి నొల్ల
తల్లి కార్చును కన్నీరు తనయ లల్ల
చెల్లి కార్చును కన్నీరు చెడుల వల్ల
మళ్లి తల్లి చెల్లి కలియు మనసు వల్ల
ఉల్లి లాగ సూర్యుడు మెర్యు ఉల్క లల్లె
తల్లిలా వేడి చల్లార్చు తనయు వల్లె
చెల్లెలో ఆశ తీర్చేటి చంద్రు డల్లె
మళ్లి మెచ్ఛు తల్లియుచెల్లి మనసు లల్లె
తల్లి పాలు త్రాగిన శక్తి తెలివి పెంచు
ఉల్లి కూరయవ్వనముకు ఉడుకు పెంచు
చెల్లి సంతోషం అన్నకు తెలుసి పంచు
మళ్ళి మళ్ళీ మలుపు వచ్చు మహిమ నెంచు
తల్లిని చూచు తనయులు తగ్గుచండు,
చెల్లి పిలుపులు చల్లబడి పోయె,
ఉల్లి రేటు చూడ ఉరుముచుండు,
మళ్ళి మళ్ళి మనసు బాధ పడుచుండు,
****
సీ.. మనుగడ చక్రమే మాయ మర్మ మగుట
నటనల బ్రతుకులో నాంది ఔను
సాధన నీడలో శోధన పరుగులు
నీదుకలలు కొన్ని నిజము ఔను
కులుకు లీలలు కొన్ని పుడకల మలుపులు
తెలుప గలుగు వేళ తీపి ఔను
లుకలుక కదలిక పుడమిన వెలుగులు
సాయంత్ర చీకటి సామ మౌను
తే. నీకు తెలుసనీ మనసాయ కిర్రు కిర్రు
కవి పలుకుల కథలు విని కుర్రొ మోర్రొ
లేదు కాదు అవును మంచి లేత జుర్రు
ప్రాంజలి ఘటించి తెలపదా ప్రభల గీత
.......
ऊँ !
"సుహృదాత్మీయకవిపండితేభ్యో నమః !!!
----
సీ.
----
ఆనాఁటి కాలాన యానందమొసఁగెడి
కార్యాలసరళియె కమ్రరీతిఁ
గనిపించె ముదమార కనులకుపంటయై
సంగీతసాహిత్యసారరుచిగ
మురిపాలనాట్యాలపోహళింపులబారు
సాగరుచోప్రాలసాధు కథలు
దృశ్యమాలికలుగ దీపించె కనులకు
నేఁడట్టి గాధలునెక్కడుండె
----
తేటగీతి..
----
నేఁటి కథలనుఁజూడఁగనేమియుండె
కడుపుచించుకొనఁగమనఁగాళ్ళఁబడును
దుష్టపాత్రయెవనితకునిష్టమాయె
సంస్కృతియు భాష తీరునుఁ జచ్చుఁబడియె.."
--
( నాఁడు - నేఁడు టీ.వీ.లపరిస్థితి )
----
అలల పరదాలు కప్పుతూ చరఖ వలెను
వలల వయ్యార విసురులు వరద వలెను
గరిక గుస గుసలు కసరె గళము వలెను
మనసు ఆటలాడు కళలు మగువ వలెను
.....
సొగసు సోకులే ముసురుతూ చొప్ప వలెను
వలపు వర్షమై జోగుతూ విధిగ వలెను
తలపు తక్కెటలే తుత్తు తపన వలెను
పరక రద్దులే నవ్వుతూ ప్రకృతి వలెను
***
తారల తోరణమ్ము మది తాపము పెంచుట మేలు కోరియే
దారము దారి చూపు విధి ధర్మమనోభవ లక్ష్యమే యగన్
పారని వేడుకల్ మిగులపాశము నీడలు కమ్ముచుండుటన్
హారపు మెర్పు నీడగను హర్షము చూపుట నిత్యసత్యమున్
దత్తపది.........కామము ప్రేమము ధామము సామము
ఉ. కామము కార్యసాధనకు కామ్యత మానస శాంతి కోరుటన్
ప్రేమము సంతసమ్ముగను ప్రేరణ చేయును ప్రోత్స హమ్ముగన్
ధామము సత్యసమ్మతిగను దానము దమ్మును పెంచగల్గుతన్
సామము సంభవించుటను సాధన శోధన కర్మవల్లనన్
..
తే. ఎవరు ఎన్నికా మము మార్చ ఏల కుదురు
అమరుని ప్రేమము మనసు కదలి వేయు
సహన సుఖధామము సమయం స్ఫూర్తి నిచ్చు
వింత సామము విద్యనే విడువ నీదు
****
కోరుకున్న దాన్ని దరి చూడక
ఆ కోకలు ఎత్తు తావెందుకు
చాటుకున్న దాన్ని ముద్దు చేయక
పెదాలు తిప్పు తావెందుకు
వయసు ఉడుకు అందుకోక
చల్లగా జారుకుంటా వెందుకు
అందుబాటులో నిది జుర్రుకోక
సమయం ఇది కాదంటావెందుకు
నాపై బాణాన్ని సంధించక
ఏదో కావాలని వెతుకుటెందుకు
వథులు సందేహింపక
సవ్యసాచి మరిచావెందుకు
ప్రారంభంలో సంధి చేయక
నీలోని ధైర్యాన్ని మరువకు
ఈరోజు పుష్పం కాదనమాక
గుబురు గుబాలింపు మరువకు
పుష్పమని వెనకాడక
అందుకోవటం మరువకు
గురిచూసి వదలక
ఆలస్యం చేయుటెందుకు
***
ఒంటరితనం చీకటి తోడున్న,
భయపెడుతుంది, ప్రకృతి తోడున్న
కాలచక్ర భ్రమణం, చీకటి వెలుగులున్న
మనుష్యుల జీవితం, మంచి చెడులున్న
ఉన్నత స్థితి మనిషి ప్రకాషిస్తున్న
సుఖదుఃఖాలు చీకట్లు కమ్ముతున్న
త్యాగం దయా ధర్మం చేస్తున్న
సత్యం మనసులో నిత్యం ప్రకాశిస్తున్న
బాల్యంలో మనసు కల్మరహితంగా నున్న
కౌమార యవ్వన దశల్లో భిన్న ప్రవర్తులున్న
సజ్జన సాంగత్యం తోడుగా ఉన్న
అభ్యుదయ పదమునే ప్రకాశిస్తున్న
శక్తి సామర్థ్యాలు అంచనా లేకున్న
బలహీనతలు చెప్పు కోలేకున్న
జీవన పధం లో అవకాశం రాకున్న
ఆవేశం లేక అవరోధాలను అధికమిస్తున్న
ఏళ్ల తరబడి శ్రమిస్తూనే ఉన్న
జ్ఞానం తో అజ్ఞానాన్ని తరుముతున్న
సబ్బుద్ధితో స్వయంకృషితో ఎదుగుతున్న
ప్రగతి ప్రతిబంధకాలను వదులుతున్న
Comments
Post a Comment