Snowcandy's Gallery — Fanart of Satyavati,Mahabharat,by Snowcandy....


నేటి కవిత్వం - పంచచామర 
రచాయిట:  మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  
ప్రాంజలి ప్రభ. మత్తకోకిల యతి 10

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ

దానశీల యశోవిశాలుని ధర్మపాలు సుధీమణిన్
దీనపోషుని సత్యభాషుని దివ్యవేషుని ధీరునిన్
మాననీయుడు ప్రేమ పాత్రుడు భవ్వ ధీరుడు వీరునన్
శ్రీ నికేతన రామకృష్ణ ను నృసింహ నిన్నెపు డంచెదన్

వణ్యజంతువు లక్షణం మరుపేకదా మరి గోవిందా
అణ్యభావము లేకయే మదిగోప్యమే నిజ ప్రేమయే
సూణ్యమవ్వక గోపికామయ గోపబాలుర ప్రేమయే
జణ్యుమారక ధర్మరక్షణ సేవభావము ప్రేమయే

భాగ్యపోషక భాగ్యలక్ష్మి కి ప్రేమపాత్రుడు మానస
త్యాగలక్ష్యక బోధతాత్విక ధర్మరక్షక. విజ్ణుడే
లగ్నమైనది జీవలక్ష్యమనే  మనస్సును రక్షకా
భగ్నమైనది. బాగుచేసియు. నిత్యసత్యపు సత్క్రపన్

పేరుతెచ్చిన దూరు దెచ్చిన బృధ్వి భర్తవు నాయకా
ఆరునూరుగ వేడుకొంటిని గీతబోధక నాయకా
వీరపోషక చారుహాసక చిద్విలాసక నాయకా
శ్రీ రమాధిప రుక్మిణీపతి భూరిధర్మపు నాయకా

అల్పచర్యలు  చూపు రూపములన్ని యొక్కని వౌటచే 
కల్పితంబులు కావులే మది బాగుచేసియు లక్ష్యమే 
తల్లితండ్రుల ప్రేమలే మది లీలలే వినయంబుగా 
కల్లొలత్వము కామ్యతత్వము కృష్ణతత్వము మార్చునే 

15-02-2020 

వెన్నెలంతయు కమ్ముకున్నను కాల మాయకు చిక్కెనే
వన్నె చిన్నెల చిందు చూపులు చిన్నబోయిన దక్కునే
కన్నె మోనము ఖంగు తిన్నను వట్టి చూపులు కక్కెనే
చిన్న పెద్దయు అడ్డువచ్చిన ఆశ పాశము ఏడ్చెనే

దాహమే ఇక తీరదా అని పేరుపేరున కోరగా
అహమే ఇక అడ్డువచ్చిన ఆకలాకలి కోరగా
మోహమే ఇక వెంబడించిన కింద మీదను కోరగా
ఊహయే ఇక నన్ను చేరగ ఏది ఏమని కోరగా

జీవ హానియు వద్దురా మరి మూగ ప్రేమను పొందుదాం
దివ్వ మైనది జీవితమ్ములె శాంతి దూతగ. మారురా
కావ్యమై  కదిలేవులే నిను నన్నునూ కరుణా దయా
సవ్యమై మది లోక రక్షక మమ్ము చూసేటి దైవమే

డబ్బు జబ్బుయు వద్దువద్దును అన్నముంటెను చాలుగా
డబ్బు మాటలు గబ్బులేపును రుబ్బినా అవి మారునా
జబ్బు జబ్బని నోట అన్నను మందు పట్టక తగ్గునా
నిబ్బరమ్ముగ ఉండ గల్గిన ముందు అంతయు కార్యమే

ప్రాభవం మరి హృద్యమే వనికే కదా నిను నన్నునూ
వైభవం మరి కావ్యమే కధగాకదా కళ కానుకా
జబ్బుయే మది మార్చుటే విధి ఆటగా నిను నన్నునూ
డబ్బుయే నిను నన్నునూ మది మార్చకే తిధి దైవమా

మత్తకోకిల..కొమ్మ

కొమ్మ కొమ్మ యు రాచుకున్నాను వేడిపుట్టును తెల్సుకో
బొమ్మ బొమ్మయు పెళ్లి ఆటలు నిజ మవ్వును తెల్సుకో
అమ్మ అత్తయు నవ్వులాటలు కాపురం అని తెల్సుకో
బామ్మ తాతయు సత్య వాక్కులు జీవితం అని తెల్సుకో

మత్తకోకిల ..ఆశ

ఆశ పాశము అట్ట హాసము వద్దుఅన్నను చేరుటే
విశ్వ మోహము సత్ప్రవర్తన సంఘ మార్పలు వచ్చుటే
ఈశ్వరుడు  యె లోక రక్షక ధర్మ పాలక ధీరుడే
విశ్వ మోహిని వింత ఆటకు రామ తత్వము గెల్చుటే
🔥👀💥

మత్తకోకిల శాంతిగా

భక్తి యే మన శాంతిగా సుమయం సుసద్విని యోగమే
రక్తి యే సుఖ శాంతికి వినయం వినమ్రత యోగమే
శక్తి యే విధి శాంతి కి సఫలం సమగ్రత యోగమే
యుక్తి యే సతి శాంతి కి పతి ధర్మమే గతి యోగమే

🥀🌷🍁🌺🏵

మత్తకోకిల జవాన్

స్వార్ధ మన్నది జాతి సంపద కానె కాదియు మమ ని
స్వార్ధమే మది శాంతి సౌఖ్యము ప్రేమ పాశము దేశమే
అర్ధమే గతి పోరుసల్పుట దేశ రక్షణ కొరకే
వ్యర్థ మన్నది చేయకుండగ సైని కుండుగా రక్షణే

మత్తకోకిల సాహిత్యం

సాహితీ సుమ మాలికా సమ గౌరవం ఇక ఇచ్చుటే
వాహిణీ వర వేదికా కధ కావ్వ పాలనా నుంచుంటే
సాహిత్యం జప హోమ ద్రవ్యము ధర్మరక్షణ మార్గమే
దాహమే కవి సార్వభౌముల శాంతికోరుట లక్ష్యం గా
 

పైట చెంగులొ గాలి దూరియు గోలచేయుట ఎందుకో
ఆట కాదిది యవ్వనమ్మున ఉర్కు పర్గులు ఎందుకో
మాట చిందక గాలి సవ్వడి భరించే ఎద ఎందుకో
కాట లాగున ఉండ లేకయు నీతి ఒప్పుట ఎందుకో

అమ్మ ఎప్పుడు శాంతి నిచ్చియు ఓర్పు పంచియు జీవితా
శమ్మునే సుమ గంధమై మమరక్షణే నిజ శక్తియై
కామితార్ధము బిడ్డకోర్కలు తీర్చుటే సతి  ధర్మమై
అమ్మకష్టము తీర్చలేనిది ఆదరించుట ఉత్తమం




ప్రాంజలి ప్రభ 
నేటి కవిత్వం - సృష్టిలో  " స్త్రీ " 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

సంసారంలో దించే ఆకర్షణ 
 సుఖాలు పంచే శరీర పోషణ
సెగలు చల్ల బరిచే వ్యామోహం 
చూవుల్లో మైమరిపించే సౌందర్యం
 
సంతోషంతో పంచే ఆకర్షణ 
వినోద భావం సకాల పోషణ 
కధలు చెప్పి పలుకే వ్యామోహం
మొహంతో మాయనుపెంచే సౌందర్యం 
 
 ఆరోగ్యంతో చూసే  ఆకర్షణ
మనస్సు మార్చే విశేష పోషణ 
నగలు పిచ్చి  కులుకే వ్యామోహం 
 దాహంతో దప్పిక తీర్చే సౌందర్యం

ఆనందంతో ముంచే ఆకర్షణ 
వయస్సు పెంచే మదీయ పోషణ 
 వగల మారి పిలుపే వ్యామోహం 
 కాలంతో సర్దుకుపోయే సౌందర్యం 

మనసుతో వ్యక్త  పరిచే ప్రేమ మాధుర్యం 
వయసుతో స్వేశ్చ తెలిపే ప్రేమ మాధుర్యం 
సొగసుతో  గాయ పరిచే ప్రేమ మాధుర్యం  
కళలతో యుక్తి  తెలిపే ప్రేమ మాధుర్యం
   
ఒకరికి ఒకరు కలుసుకొనే స్నేహాపర్వం 
మనసుకి మనసు మలచుకొనే స్నేహపర్వం 
వయసుకి వయసు కలుపుకొనే  స్నేహపర్వం 
మగనికి మగువ తలచుకొనే స్నేహపర్వం 

చల్లని వాతావరణంలో కల్పించే సంతోషం  
వెచ్చని ఆనందరణంలో పోషించే సంతోషం 
నవ్వుల సేవాతరుణంలో కల్పించే సంతోషం 
మంచిని పెంచేటి రణంలో పోషించే సంతోషం  

ప్రేమను పంచే కళ నైపుణ్యం  
వాత్సల్యమనే తీపి దనం 
సరాగాలతో వలపుల మయం
చీకటిలో వేడిసెగలు చల్లార్చే వయనం

తపస్సును భగ్నం చేసే సాంగత్యం 
శుఘంధ పుష్పాల సుమధుర పరిమళం 
తనువును అందించే సుఖ సౌఖ్యం     
మనసులో ఉన్న మాయను తొలగించే మర్మం 

విద్యా విషయంలో సహాయం 
విశ్రాంతి విషయంలో కల్పుకోలుతనం 
శ్రమకు చేదోడుగా నిలబడటం 
ఆలోచనపరంగా మనస్సుకు నిర్మలం 

కళ్ళ చూపుల్లో  కరుణ తత్త్వం 
శ్రేయస్సు కొరకు పలుకు సత్యం  
సిరులను పెంచే సున్నిత తత్త్వం 
పలకరింపులో మధురాతి మాధుర్యం  
బిడ్డలను ఉన్నతులుగా మార్చే వ్యక్తిత్వం 

ఇక చెప్పాలంటే 
స్త్రీ యే సత్యం - స్త్రీ యే నేస్తం - స్త్రీ యే నిత్యం 
స్త్రీ యే శక్తి - స్త్రీ యే ముక్తి - స్త్రీ యే యుక్తి  
స్త్రీయే  మైనం - స్త్రీ యే మౌనం - స్త్రీ యే మైకం 
స్త్రీ యే  వైరం - స్త్రీ యే వేదం - స్త్రీ యే కాలం 

స్త్రీలు వర్ణించాలంటే  నా శక్తి కవిత్వం చాలదు 
మిరే చెప్పండి ఇంకా స్త్రీల విషయాలు 
స్త్రీ  లేందే  మనం లేము - మనం లేందే స్త్రీ ఉండ లేదు 
ఇదే లోకం - ఇదే గమ్యం - ఇదే మర్మం 
  
--(())--
  
జ   స  జ  స  య  లగ  -పృథ్వి --11  
IUI  IIU IUI  IIU IUU IU 

ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక "అమ్మ దినోత్సవ" సందర్భముగా అందరికి శుభాకాంక్షలు 
Radha ' s love for Krishna

అమ్మ పాదాలకు నమస్కారిస్తూ 
నేటి కవిత్వం - పృథ్వి
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

మనస్సు మమతానురాగము సుధా మనోధైర్యమే 
ఉషస్సు సమయానుకూలమున నే కవిత్వముగా 
యశస్సు  అనుకూల తృప్తి కరుణే తరించే నిధీ 
వయస్సు  మనసే భ్రమించి తరుణం సమర్ధమ్ముగా  
     
సమత్వ సుఖ సంతసమ్మె చిరకాలమే బత్కుటే 
కళత్వ మది వేదసమ్మె  బతుకంతయే మారుటే 
చమత్క రము సమ్మోహమ్మె విషవాంఛలే పొందుటే 
ప్రమత్త రణ రంగసమ్మె పదభాష్యమే చిందుటే 

కలమ్ము  కవి  కావ్యసమ్మె  అభిమానమే పెంచుటే 
మనమ్ము  మది పుల్కరించి సమసంతసం పంచుటే 
జపమ్ము  మన శాంతి సౌఖ్య విషవాసనే  పెర్గుటే 
గళమ్ము  ప్రతి ఒక్కరొక్క సుఖలాస్యమే జీవితం 

--(())--



ప్రాంజలి ప్రభను ఆదరిస్తున్న ప్రతిఒక్కరికి ఉదయభానుని ఆశీస్సులు, అమ్మ ఆశీస్సులు కలగాలని  శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా 
ఈ వారం వ్రాసిన కొన్ని పద్యాలు  ప్రాంజలి ప్రభను చదవండి - చదవమనిచెప్పండి - స్నేహాన్ని పెంచుకోండి   

శివ సంకల్ప విహీనుడు 
శివ పూజనములను జేసి శ్రేయము గోనునే 
భువియే మెచ్చని శటునిన్ 
శివుడివిది మెచ్చుకొనును జెపుమా నాధా

జ్ఞాన సువిజ్ఞాన తృప్తుడు 
గానకును వికారమింత కర్మేంద్రియముల్ 
తానుజయించి, శిలమణి స 
మాన మనెడి యోగి జనుల మన్నన పొందున్

ఎవడు నిరాశ పరుండో, 
ఏవండు మమతా రహితుడొ, ఎవడు నిగర్విన్ 
ఎవడు సమత్వము గలుగో 
ఎవని మతి నిలుచొ యతండె యిలశాంతించున్

పలికినదాచరణమ్మున 
నిలబడకుండినను వాని నిష్టాభినయం 
బులు జనము నమ్మవచ్చును 
గలనైనను శివుడు నమ్మగలడా ప్రేమా 

కోరిక, వైరము, దుఃఖము, 
మీరిన మురిపెము, శరీర మెరుపును, ధృతియున్ 
చేరిన చైతన్యము, సవి 
కారము క్షేత్రమని నీవు కనుమా ప్రేమా

కళలో నెదిగినవానికి 
నిలలో జనులెల్లమెత్తురేవ్వరినేనిన్ 
కళలో బ్రవీణ్యమ్మును 
కలిగించిన వాని విడువ గాదుర నాధా

హే  విశ్వరూప దేవా 
నీ వదనంబులు, భుజములు , నేత్రోదరముల్ 
వేవేలు అనంతంబే 
నీ విశ్వాకార మహిమ నేనేర్వగలేన్

భగవంతుడు తనకిచ్చిన 
యగణితమగు నిధికి గురున కవమానమ్మున్ 
బగబట్టి చేయువానికి 
తగిన పాలితమిచ్చి తీరు దైవము బిడ్డా
Krishna Collecting Lotus for Radha - Miniature Painting from Rajasthan, India

UUU  UII III UUI UUI UU - 10  
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక - కవిత్వం - మందాక్రాంత 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

సంకల్పం విశ్వ చరితము సౌభాగ్య సౌందర్య సాహి 
త్యా కావ్యం ధర్మ చరితము త్యాగర్ద ధర్మార్ధ సాదృ
శ్యా కామ్యం సత్య చరితము సర్వార్ధ సాంఘీక  సాన్ని
త్యం కర్తవ్యా సహ చరితము ఆనంద సంతృప్తి సేవే 

సంసారం  సాగరము వలె పొంగేను కుంగేను   కాదా 
విశ్వాసం కాలముల వలె  నేర్పుల్లొ మార్పుల్లొ  కాదా 
ప్రాధాన్యం మానసము వలె సంతోష దుఃఖాలు కాదా 
ప్రేమానందం పరిణయపు సాంగత్య సారూప్య మేలే 

కారుణ్యం కాపురము లలొ సంభోగ సౌందర్య  కాదా 
ధారుడ్యం సాహసము లలొ  ఏకత్వ సంతృప్తి కాదా 
ప్రావిణ్యం  ప్రేమ సమములొ ఆలింగ తత్వమ్ము కదా  
బంధుత్వం ఓర్పు ఒరవడి  ఒక్కింత ఉండేటి మేలే     

--(())--


ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  
ఓం నమశివాయ 

కాలాన్ ద్వైత ప్రభొక్తారం,
ధర్మ కాంతి ప్రభోజనమ్
ప్రేమ జగద్గురుం సదా,
ప్రేమరం లోక ప్రేమరమ్

సంఘాన్ ద్వైత ప్రశొక్తారం
సత్య వాక్కు ప్రభామయమ్
యుక్తి జగద్గురుం సదా,
నాయకం లోక నాయకం

విశ్వాన్ ద్వైత ప్రమోక్తారం
ముక్తి జగద్గురుం సదా,
నీతి సూక్తి ప్రయుక్తయుమ్
నాటకం లోక నాటకం

"ఆర్షాऽऽద్వైత ప్రవక్తారం ,
విశ్వశాంతి ప్రబోధినీమ్ !
నౌమి జగద్గురుం సదా ,
శంకరం లోకశంకరమ్!!!"

ప్రాంజలి ప్రభ (1)
త్రిగుణ ప్రకృతి నెవ్వరు
సగుణ సకర్మలకు బానిసలగు వారిన్
తగదను భ్రమింప జేయగ
జమందీ గుణమునొందు జ్ఞానుడుమెలున్

నేటి ప్రాంజలి ప్రభ పద్యము -2
శ్రీవేంకటేశ్వరునితో తెలిపే అమ్మవారు

ఎంతో మంచిగ పలికితి
అంతంబే లేని నాదు ఐశ్వర్యములన్
కొంత ప్రధాన్యత గలిగిన
వింతగఁ ఉన్నది తెలిపెద వినుమా నాధా
  
--(())--
----
"శ్రీ సత్యదేవ మూర్తీ !
నీసన్నిధియే యెదురుగ  నెమ్మది నమ్మితి..
మాసత్కామ్యములనెఱిఁగి
గాసఁటఁ బడుభక్తులఁబ్రోవు గమ్యమునిడుచున్!!!"


ప్రాంజలి ప్రభ పద్యము 
చూడు నాయనా 

నేనే చేసిన వాడను 
నానా గుణకర్మలగని నాలుగుభాగాల్ 
ఈ నా కర్మల కర్తను 
నేనే అయినా యెఱుంగు నేను అకర్తన్ 

అన్నాడు ఆ పరమాత్ముడు 



III  III III III III UU 
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక  
నేటి కవిత్వం -పాళాశదళ 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

చిరు నగవుల పలుకులు  మనసునకు ఉల్లా 
స రుస రుసలు పకపకలు సుమ లత సల్లా 
ప  రమ వలపుల తలపుల మమతలు  ఉల్లం 
పరి పరి విధముల నలిగి మరుగుట కాదా

కరములు కలయిక గుబులు గుబులుగ కాదా 
అర మరికలు కధల సెగ ఉరవడి కాదా 
మురిపములు మది తెరచి మరచుటకు కదా
తరుణము ఇదియు పలుకు కులుకులకె కాదా 

ఇరువురు కలసి కలియుగ  వినిమయ ధర్మం 
పరువపు మెరుపు కలియుగ వినయపు సత్యం 
తరువుల వలె ను కలియుగ కరుణను నిత్యం 
కఱువుల తొలగె  కలియుగ  పలుకుల యుద్ధం 
   
--(())-- 

  నేటి కవిత : 
రచన : మల్లాప్రగడ శ్రీదేవి  రామకృష్ణ

నేను చెప్పే కధలన్నీ నీకు అర్ధము కావో 
ఏది మైన నీవు నాకు నచ్చావు 

నన్నును నమ్మినట్లు  నీవు ఉన్నావనుకోనా
ఎదో మనసుకు నచ్చిన  పిచ్చిదను కోనా
పువ్వు విరిసింది నాకోసమే ననుంకుంటా
నవ్వును చూపి ఆహ్వానిస్తావని అనుకుంటా
కెవ్వు మని కేక వేసింది భయమను కుంటా
లవ్వు అంటూ నీవు ప్రేమనందిస్తా వనుకుంటా 

కోడి పిల్లలతో పరిగెడుతూ 
కోడి గుడ్లు విసిరి సంబర పడుతూ 
కోడి ఈకలను తలలో గుచ్చుకొని ఎగురుతూ 
కోడిలా కూస్తూ రైలు లా కదులు తూ 
  
గడియారంలా నా వెనుక తిరుగుతూ 
రేడియో లా ఏవో పాటలు పాడుతూ 
కరంటు తీగపై గబ్బిలంలా వ్రేలాడతూ 
బకెట్టులొ కూర్చొని బావిలో దిగుతూ 
ఆడిన ఆటలు మరిచావు 

ఈనాటి పుణ్యమో నీవు నాకు దక్కావు
దుర్మాగాన్ని అంతం చేసి నన్ను చేరదీసావు
అనీ  ఒకటే ఏడుస్తావు,
ఏమని చెప్పేది, ఎలాచెప్పేది

నీ ప్రేమకోసం తపిస్తున్నా
ఓర్పుతో ఓదార్పుతో నీ తోనే ఉన్నా
నిన్ను కాపాడి చదివిన చదువు
గుర్తు చేయాలని తపిస్తూ ఉన్నా       

నేను చెప్పే కధలన్నీ నీకు అర్ధము కావో 
ఏది మైన నీవు నాకు నచ్చావు 

--(())--

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

om sri raam 






ర   స   స  త   జ  జ  గ   చంద్రకళ -10  
UIU IIU  IIU   UUI  iUI IUI  U 
నేటి కవిత్వం - చంద్రకళ 
రచయత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

తల్లడిల్లుట మానవ సంతానం సహనమ్మును చూపదే  
అల్ల రల్లరి ఆటలతో కాలాన్ని వినోదమ్ము గా అనే  
రళ్ల కోసము  తల్లియు తండ్రిన్నే విదిల్చియు తాపమే  
యుల్లమే లలితా సుమమాధుర్యమ్ము తరించుయు పల్కులే 

కల్లరీడుతొ  చెప్పెడి ఒక్కోమాట సహాయపు భావమే 
కల్ల మాటలతో సమయోచమ్ముగ సుహాసిని మార్గమే   
నెల్ల చూపియు బాధను పెట్టే రోగము అంతయు చూపుటే 
యెల్లఁరూ తెలిపే తరుణం ప్రేమమ్ము సుఖాలను పంచుటే    

కళ్లచూపుకు గుల్లలగా మారేటి విషాదము చెప్పెడి  
యుల్లమే జలమై వినువారందర్కి సుతారముగా మనో 
జల్లులే విధిరాతలుగా సంతోషముగా సమరాగమే
వెల్లువిర్శి యు శోధనయే వేదమ్ము మనస్సును చూపుటే   


Por que cuando nos convertimos en madres nuestro bebe no trae un manual de instrucciones, nos dejamos llevar por lo que nos cuentan nuestras madres, o

IIUI  UII  UII UI  UII (కొత్తది ) 

నేటి కవిత్వం - నడిరేయి 
రచయత :మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

నడిరేయి చక్కని పున్నమి నాటి వెన్నెల 
హృదయాన  కోర్కలు తీరుగ ఆశ కమ్మిన  
మృదుభాష పల్కులు తో  పొదరింటి శోభతొ  
శృతి చెప్పి పొంతన చూపియు సంత సమ్ముగ      

జడివాన  మబ్బుల కమ్మిన  రాత్రి వెన్నెల 
తెలికోక  రైకయు ముస్గులొ అందచంబన 
మధురమ్ము సోయగ మోహము శృతి చేసియు 
తొలిమేలి చూపుల ఘర్షణ కల్ప వృక్షమె           

మదిదోచి  మాయను పెంచిన శోభ వెన్నెల 
రవళింప గీతపు నాట్యము  సేవ సన్నిధి 
మనువాంఛ తెల్పియు హాసము చూపు పెన్నిధి 
చిరుహాస మోములు కల్సియు  ఒక్కటౌవుట   

విధిఆట చూపియు సంతస మిచ్చు వెన్నెల  
రసకేళి మువ్వల జంటల శబ్ద భేదియు 
సడిఆకు గాలుల సవ్వడి ఇంకఇంకని  
నభిసారిక ప్రియ వేల్పుల  మేలు కొల్పులు  
--(())--

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ