పూ.. ల.. వా.. న.. దత్తపది పూరించుట 


తేగీ.పూల హంగులు పుడమికి పూజ్య మగుట 

 లలన లలితము శోభను గాంచ గలుగు 

వాలు చూపులు వలయము వాకి టిoట 

నయన యందాలు మన్మధ నాట్య మాడ

**+**

భార్య కాదది నా తొలి బాము గాని 

 నోరువిప్పి బుసలుకొట్ట నొప్పి నాకు 

కర్మ ననుసరించిన కాల గమ్య మేను 

భర్తగా భరించియు బోధ బంధ నీతి

*****

భంగుకు చిక్కిమూర్ఖతయు బంధము తెంచియు దుష్టబుద్ధిగన్ 

అంగన సౌఖ్య మేతలచి ఆశల లోలుడు గాను మారుటన్ 

యంగము చూచెడే మనిషి యానతి హింసకు దారి చూపగన్ 

రంగులు ప్రాణముల్ గొనెను రాజిలు భూమిని నెత్తురోడగన్

*****


వారుగ వీరుగ తెలిపే 

 కారుణ్య భవమ్ముగాను కాలము రీతిన్ 

చేరువ చెలిమియు సఖితో 

*సారము లోన దుముక  నతిసారము వచ్చున్* 

*****

కాపాడే భవబంధమున్ గనజనుల్ కామ్యమ్ము తీర్చేoదుగన్ 

పాపాత్ముల్నియె దున్మి నారుగననన్ పాశమ్ము కృష్ణాత్మగన్ 

శాపాలన్నియుతొల్గ నేస్తముగను న్ సాధ్యమ్ము ధర్మమ్ముగన్ 

దీపాదివ్యకలౌనుపండుగదియే దివ్యత్వ దీపావళిన్

*****-

తొలగు వెతలంబు తిమిరము తోడు గనియె 

మోదపు వెలుగు విరియుట మోక్ష మగుయె 

వెడలు నిస్పృహ నిస్సార వేల్పు లగుయె 

కాంతి మదినెల్ల కోవెలె కాలమగుయె

******-

కం.ప్రకృతి భలే యందాలగు 

వికృతి సమమ్నగుటయిచ్ఛ వినయము మార్పున్ 

ఆకృతి గాప్రావీణ్యము 

సుకృతి మనోహరముగాను సూత్రమ్ముగనే

*******

కం.పలుకుల మాయల తెలివికి 

థలుకుల కేనుగు చులకన థామస మందేన్ 

మలుపుగ చిక్కెఎలుకలకు 

ఎలుకలు తమకలుగు లోని కేనుగు నీడ్చెన్

******

తేగీ.కనబడని గాలి కథలుగా కలలు గాను 

ఊహలకు వర్ణణలుచేరి ఊయలగుట 

గతమనే వర్తమానము కనుల మాయ 

అవతరిస్తూ సమయ గ్రంథ అలలు తీరు

*******

తే. గీ.కడలి నీరుదాహతపన కాల మలుపు 

రగిలె మంట చల్లార్చ సరాగతీరు 

మొగలి పొద సరసం క్షమ మోక్ష మగుట 

సెగల సంద్రము నదిచేర సిరులు మారు

******

తే. గీ.పరిమలించే వయసుగంధ భరిత తత్వ 

మలిన మాయ మహత్యము మాన చరిత 

మధుర తలపు మనోహర మగువ తలపు 

మానవత్వమహోన్నత మాయ లిఖిత

-*****

కం.కన్నులు కానని కాలము 

చన్నుల భాధలకుతగ్గ చాపగ మాయల్ 

మన్నును మిన్నును సాక్షిగ

కన్న కుమారుండు మగడు గాగ వరించెన్

******

కం.విధిగాజీవన లక్ష్యము 

మదిపాలనధర్మమేను మార్గము రక్తిన్ 

చెదిరిన మనసుకు సుఖమే 

విధవాగమనంబు మిగుల వేడుక జేసెన్

******

పొరపొర యంటును కట్టే 

దొరతనముగనే కదులుచు దోభూచుగనే 

సొరతీగయు బీరకలవ 

సొరచెట్టున బీరకాయ సొంపుగ గాచెన్

********

బూరను ఊదిన ఉబ్బును 

దోరగ పండును చిలకయు దోభూచులుగన్ 

తేరగ యెక్కిళ్ళుగనే 

 సారముగాను సొరచెట్టు సాగుగ గాచెన్

******

కం.ఉపకారము చేయనిదే 

ఉపయోగము లేనితిండి ఉన్నత కాదా 

అపవాదు పలుకు యేలను 

విపరీతపులుసుకూర విస్తర తినియెన్

******

వెల వెల పోయెను వెలుగే 

తలపే తహతహలుగాను తన్మయ రీతిన్ 

తెల తెలవారగ జరిగే 

నెల బాలుని జూచి బాల నెల బాలాయెన్

********

ఉ.ఆకలి జీవసాగరమనస్సగు శక్తికి మూలమేయగున్ 

ఆకలి హృద్యతాపము యనాదిగ తర్చగ నేటి విద్యయున్ 

ఆకలి చంపనీక విధి యాడెడి పాశము బట్టి మార్పుగన్ 

ఆకలి యాయసంమలుపు యాశ్రిత సంగమ సేవతీర్చగన్

**----***


16.కాముని మాటలు వినుమా 

బీముని చేష్టల మలుపులు భీకర మగుటే 

శోముని లీలలు గనుమా 

రాముని తమ్ముడు విదురుడు రంభయె చెప్పెన్

******

17.రాముడు చెప్పు చుండమది రాజ్యయశస్సుని తప్పలేక యా 

రాముడు లంక వైభవము రాసిగ తెల్సియు విశ్వ నాధుగన్ 

జాముని లీలలే యవియు జాతర యుద్ధమనస్సగు రావణా కళా 

రాముడు లంకలోపలికి రానని  పల్కె నదేమి చిత్రమో


18.ఉ.మక్కువ వల్లనే మనసు మాయలు కమ్మియు చేయు చేష్టలే 

ఎక్కువ మారి కోపముతొ యెల్లరి నెంచియు చెప్ప లేకయున్ 

చిక్కిన చేతి వాటమును చింతలు వచ్చిన చెప్ప కుండగన్ 

అక్కను చంపె నొక్కడును అందరి ముందర సంత సంబునన్


19.గురువంటే బరువనకే 

పరువంటే బ్రతుకనేర్చ పాఠము యనకే 

తరువంటే సుఖమనకే 

చెరువంటే విధిగయాట చింతల్ యనకే


20.కర్మళు చేయనేంచిమది గమ్యము మార్చక పుణ్య పాపముల్ 

శర్మగ నిత్య సత్యమన శాపము కోపము చూప గల్గగన్ 

మర్మము తెల్పలేకయు సమానము చూపకపోయినా సుధీ 

ధర్మము ధర్మమంచు నిట ధర్మము చేసిన పాపమౌ జూమీ


అయిదు రుబాయీలు

*

నేనిక్కడ నీవక్కడ నెయ్య మ్మిదియే 

కానంగను లేము గాదె కన్నుల్ నదియే 

ఏనాఁడిక నిన్ను జూతు నింకెప్డొ గదా 

ఆనవ్వులు నాకోరిక లాశాంబుధియే 

*

ఆనాఁటి పురాణమ్ముల యాదర్శములే 

యీనాఁటికి నెట్లో యిల నీమోసములే 

యేనాఁడిట శాశ్వతమ్ములేవో నిజమై 

వైనమ్ములు మారుచుండు వైవిధ్యములే 

*

మారాజులు పాదుషాలు మాయమ్ము గదా 

నీరోజున నీమంత్రుల యేమార్పు గదా 

యారాముని బంధించిరి యాకోవెలలో 

క్రూరమ్ముగ నేలుచుండ ఘోరమ్ము గదా 

*

ఆకాశము రంగులీనె నందమ్ములతో 

చీఁకట్లిఁక తారకాళి చిత్రమ్ములతో 

నేకాంతములోన నేను హృల్లేఖలతో 

లోకేశుఁడు గాంచునేమొ రోచిస్సులతో 

*

ఆచోటను దగ్గె రోగి యావేదనతో 

పేచీ యిటఁ ద్రాగుబోతు ప్రేలాపనతో 

నీచోటను సిగ్గు వీడె నీవామ కటా 

యీచీఁకటిలో దేవుం డెందో దయతో

*

సమస్య:
రోమంబుల్ వడిదెచ్చి వండిన గడున్ రుచ్యంబుగా మెక్కెనే
....
కామాంబే విధి వాంఛలుగాను పరుగే కర్తవ్య కాలమ్మునన్      
క్షేమంబే సహనమ్ముగాను చలనమ్మే సేవ దృక్పదమున్
గ్రామంబే సహకార మధ్యమముగా గ్రాహ్యంబు ఆహారమున్ 
రో; మంబుల్ వడిదెచ్చి వండిన గడున్ రుచ్యంబుగా మెక్కెనే
(మల్లాప్రగడ రామకృష్ణ)  
******
అమ్మకృపా కటాక్షముయు ఆశ్రిత పుత్తడి సంపదేయగన్ 
అమ్మయె కల్పవల్లిగను యక్కువ చేర్చెడి యెoదరున్ననన్ 
అమ్మకి సాటి రారుకద ఆలన దేవత లెందరుండినన్ 
అమ్మదిశాంతరాలకు మనస్సును పంచెడి సృష్టి ధర్మమున్

స్వచ్ఛత లీల మానుషయశస్సున మాధురి హావ భావమున్ 
మచ్చిక చూపులేలుకళ మాయల మర్మముమంత్రమేయగున్ 
విచ్చిన పువ్వులే పలుకు వీనులవిందుశుభమ్ము కూర్చగన్ 
నచ్చిన మోముచేరమది నాట్యమయూరియు నిత్యకాంతిగన్

ధార్మిక జీవనం గడుపు దాతగ దారిని జూప గల్గగన్ 
కూర్మిక వైమమే బ్రతుకు కూడుయు గుడ్డయు వాసమేయగున్ 
మార్మిక మాయలై మనిషి మానస వేటలు మర్మలేయగున్ 
కర్మల బంధమై పలుకు కాలము నిత్యము జీవనమ్ముగన్
******
జనుల కొరకు సర్వ జాగృతి చేయగా 
మనసు దాన చర్య మార్గ మగుట 
యున్న దంత పంచ యున్నత లక్ష్యము 
రాజు పేద యయ్యె రమ్య చరిత

వెన్నెల వెలుగుల నీడలు 
కన్నెల కులుకులు కళకళ కాల మలుపుగన్ 
వన్నెలు మాయలు కమ్మిన 
నన్నెన కథలగు పలుకులు నమ్మక మలుపుల్

ఉ.చిక్కులు తెచ్చసంబరవిచిత్ర సమోన్నతియే సకోపముల్ 
మక్కువ లేనిజేష్టలగు మానస మాయలు వింతలేయగున్ 
తక్కువ యెక్కువై పలుకు తత్త్వమనస్సగు సాహసమ్ముగన్ 
 అక్కట!పుష్ప సాయక! మహా కఠినాత్మలు పో మృగేక్షణల్

యేమి యన్నను మౌనము యేల నీకు 
కామి తార్ధమనసు గనే కాల మేది 
చక్కచక్యము యనునది చెలిమి నీడ 
కాకి కోకిల యగునటే కాశి బోవ

సర్వుల మాతయే సహజ శక్తియు సత్యము నిత్యసత్యమున్ 
పూర్వుల యోగవిద్యలలొ పుణ్యము సఖ్యత  భావమేయగున్  
నేర్వగ సేవఁజేయఁగను నేత్రపు లక్ష్యము ప్రేమ భావమున్ 
గుర్వులసుద్దులా విసెపు go గోపూజేచ్ఛన్ 
----
ఆశయం యున్న ఫలములు ఆత్రమౌను 
ఆశ తో పసిడి మనసు అలక పూను 
పసిడి పరుగిడ సాగెను  ఫలిత మేమి
చరిత చెప్ప పసిడిగోల చేరు వయ్యె

మాత మనసునిబట్టికదిలే మార్గమౌను 
నేత కళలగు విధిగాను నిత్య మౌను 
చేత సమరమే మనసుగా చింత గాను 
కూతురే గద కూల్చెను కొత్త యిల్లు

బాధలెన్ని యున్న భర్తయే స్త్రీగతి 
వాదులాటలన్నవరుస మిన్న 
చేద బావి నీరు చేరువగు చెలిమి 
రాధ పెండ్లి యాడె రంభ సుతుని

ఉ.చుక్కని చూడగా చురుకు చూపులు కమ్మియు చూడ చక్కగా 
మక్కువ తోను మాటలగు మానస తృప్తియు చేతలే సుధీ
ఎక్కువ టెక్కు నున్నదిగ యెళ్ళరు మెచ్చగ దక్క నేస్తమున్ 
నక్కను పెండ్లియాడె నొక నాయుడు నల్వురు మెచ్చుకోలుగా

భార్య కాదది నా తొలి బాము గాని 
 నోరువిప్పి బుసలుకొట్ట నొప్పి నాకు 
కర్మ ననుసరించిన కాల గమ్య మేను 
భర్తగా భరించియు బోధ బంధ నీతి

పూ.. ల.. వా.. న.. దత్తపది పూరించుట 

పూల హంగులు పుడమికి పూజ్య మగుట 
 లలన లలితము శోభను గాంచ గలుగు 
వాలు చూపులు వలయము వాకి టిoట 
నయన యందాలు మన్మధ నాట్య మాడ

భంగుకు చిక్కిమూర్ఖతయు బంధము తెంచియు దుష్ట బుద్ధిగన్ 
అంగన సౌఖమే తలచి ఆశల లోలుడు గాను మార్గన్ 
యంగము లేచెడేమనిషి యానతి హింసకు దారి చూపగన్ 
రంగులు ప్రాణముల్ గొనెను రాజిలు భూమిని నెత్తురోడగన్

ఈ విరహమ్ము బోధిగను నీదయ గానుక దాహతృప్తిగన్
మోవిక సౌఖ్యమేగతియు మోహమునీడగ దేహమేయగున్
జీవితమోక స్వర్గమగు సీమ యనంతము సర్వమేయగున్
యోవనమేనుయోగమగు యోగతినిత్యము సత్యమేయగున్

దత్తపది..హక్కు, దక్కు, విధి, నిధి 

ఉ.హక్కులు రాజ్యనేతగను హారతి సత్యపు వాక్కులేయగున్ 
దక్కుట పెక్కటిళ్ళక విధానము శాంతిగ మార్గమేయగున్ 
ఎక్కువ నష్టమే నిధులు యెల్లరి క్షేమము దోపిడేయగున్ 
చుక్కలు నంటుటే ధరలు చూపుల మార్పుల రాజ కీయమున్

భోగము నాపలేక మది బోధను తెల్పక యుండ లేకయున్ 
రోగము నెంచి యున్న విది రోషము యాపక నుండ గల్గగన్ 
రాగము తీయువాని కను రాగములేదట నె0దు చేతనో
యాగము లన్ని తంత్రములు యాసల వెల్లువ జీవ భావమున్

 దైవమ్మాయన లేదనే భవముగన్ దైవత్వ పృథ్యాదిగన్ 
వైవశ్వమ్మున భక్తియే సమముగన్ వైరూప్య లక్ష్యమ్ముగన్ 
భావైక్యమ్మగు శక్తిగన్ సుఖముగన్ బాంధవ్య చైతన్యమున్ 
శ్రీవత్సాoకితమౌను శీఘ్రముగనేశ్రీ శక్తి యుక్తేసుధీ

 పాలపర్తి బహుకళల పావనమ్ము 
నీల మేఘకృష్ణునిజన్మ నీడ లగుట 
సకల ఆశ్టైశ్వరాలుగా సమయ తృప్తి 
ప్రాంజలి ఘటించి శుభమెంచ ప్రగతి గీత

కర్మళు చేయనేంచిమది గమ్యము మార్చక పుణ్య పాపముల్ 
శర్మగ నిత్య సత్యమన శాపము కోపము చూప గల్గగన్ 
మర్మము తెల్పలేకయు సమానము చూపకపోయినా సుధీ 
ధర్మము ధర్మమంచు నిట ధర్మము చేసిన పాపమౌ జూమీ

గురువంటే బరువనకే 
పరువంటే బ్రతుకనేర్చ పాఠము యనకే 
తరువంటే సుఖమనకే 
చెరువంటే విధిగయాట చింతల్ యనకే

ఉ.మక్కువ వల్లనే మనసు మాయలు కమ్మియు చేయు చేష్టలే 
ఎక్కువ మారి కోపముతొ యెల్లరి నెంచియు చెప్ప లేకయున్ 
చిక్కిన చేతి వాటమును చింతలు వచ్చిన చెప్ప కుండగన్ 
అక్కను చంపె నొక్కడును అందరి ముందర సంత సంబునన్

రాముడు చెప్పు చుండమది రాజ్యయశస్సుని తప్పలేక యా 
రాముడు లంక వైభవము రాసిగ తెల్సియు విశ్వ నాధుగన్ 
జాముని లీలలే యవియు జాతర యుద్ధమనస్సగు రావణా కళా 
రాముడు లంకలోపలికి రానని  పల్కె నదేమి చిత్రమో

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ