సంస్కృత ఛందస్సు: 

సంస్కృత ఛందస్సు (లేదా చందాస్త్రం) అనేది సంస్కృత కవిత్వంలో పద్యాల లయ, అక్షరాల సంఖ్య మరియు వాటి ఉచ్చారణ వ్యవధి (లఘువు, గురువు) ఆధారంగా ఒక నిర్దిష్ట క్రమ పద్ధతిని అధ్యయనం చేసే శాస్త్రం. ఇది వేదాంగాలలో ఒకటి. పద్యంలోని ప్రతి అక్షరాన్ని లఘువు (చిన్నది) లేదా గురువు (దీర్ఘం)గా వర్గీకరించి, ఈ గుర్తుల బైనరీ క్రమాన్ని బట్టి పద్యం యొక్క మీటర్‌ను నిర్ణయిస్తారు. 


ముఖ్య అంశాలు

లఘువు మరియు గురువు: 

సంస్కృత ఛందస్సులో అక్షరాలను లఘువు లేదా గురువుగా వర్గీకరిస్తారు. 

లఘువు: సాధారణంగా చిన్న అక్షరాలను సూచిస్తుంది. 

గురువు: ద్విమాత్రా కాలం లేదా దీర్ఘాక్షరాలను సూచిస్తుంది. 

గణములు: 

లఘు, గురు అక్షరాల సమూహాలను గణములు అంటారు. 

వేద మీటర్లు (ఛందాలు): 

సంస్కృతంలో ఏడు ప్రధాన వేద ప్రమాణాలు ఉన్నాయి: 

గాయత్రి

ఉష్ణిక్కు

అనుష్టుభ్

బృహతి

పంక్తి

త్రిష్టుభ్

జగతి


ఛందస్సు రకాలు: 

వృత్తం (అక్షరాలను బట్టి) మరియు వృత్తం కానివి (లఘువు, గురువుల క్రమాన్ని బట్టి) వంటి వివిధ రకాలున్నాయి. 

ఛందస్సు ప్రాముఖ్యత 

వేదాల పఠనానికి ఛందస్సు చాలా ముఖ్యమైనది.

ఇది హిందూ, బౌద్ధ గ్రంథాలలో కవితా రచనకు ప్రాథమికమైనది.

ప్రతి ఛందానికి దానికంటూ ఒక లయ, కదలిక మరియు సౌందర్యం ఉంటాయి.

అలాగే—వృత్త శ్రేణి – కృతి (20-అక్షరములు) తో 893 వ పద్యమునకు సంబంధించినది. – దాని గణాలు స/జ/జ/భ/ర/శ/వ (లగ) – దీన్ని సాధారణంగా సంస్కృత ‘కృతు’ లలో వాడుతారు. తెలుగునకు దీనికి సరిసమానమైన వృత్తం – ‘ప్రభాకలితము’ అనే ఉత్పలమాల గ్రూపు నకు చెందిన తెలుగు ‘కృతి -20’ వృత్త జాతికి చెందినది. తెలుగు కృతులకు ఈ గ్రూపు బాగా పనికి వస్తుంది. అందుకే తెలుగును వ్రాస్తూ- సంస్కృత ఛందస్సు వాడి, భాషా సంకరం చేయడం వలన పాఠకులకు అర్థం కాదు, పండితులకు ఒప్పుదల కాదు. 

ప్రభాకలితము—వృత్త పద్యము. 

ప్రభాకలితము పద్య లక్షణములు

1. వృత్తం రకానికి చెందినది

2. కృతి ఛందమునకు చెందిన 372080 వ వృత్తము.

3. 20 అక్షరములు ఉండును.

4. 27 మాత్రలు ఉండును.

5. మాత్రా శ్రేణి: I I I - I U I - I U I - U I I - U I U - I I U - I U

o మిశ్రగతి శ్రేణి (3-4) : I I I - I U I - I U - I U I - I U - I U I - I U - I U

o మిశ్రగతి శ్రేణి (4-3) : I I I I - U I - I U I - U I - I U I - U I - I U I - U

6. 4 పాదములు ఉండును.

7. ప్రాస నియమం కలదు

8. ప్రతి పాదమునందు 13 వ అక్షరము యతి స్థానము

9. ప్రతి పాదమునందు న , జ , జ , భ , ర , స , వ(లగ) గణములుండును.

తెలుగు చెందస్సు పాఠము.. (127)....ప్రాంజలి ప్రభ...


నీవే జీవమై - నీవే భావమై 

నీవే రాగమై - నీవే రావమై 

నీవే ధ్యానమై - నీవే ధ్యేయమై 

భావింతుంగదా - భావాతీతమై 


నీవే ధైర్యమై..నీవే దైవమై 

 నీవే సత్యమై.. నీవే నిత్యమై 

నీవే పత్యమై.. నీవే పైత్య మై 

నీవే ముత్యమై.. నీవే తత్త్వమై 


రాముండన్నచో - రాముండే గదా 

కాముండన్నచోఁ - గాముండే గదా 

నామమ్మద్ది యీ - నాడెందమ్ములో 

నేమో యెప్పుడో - యెట్లో చెప్పఁగా 


సోముండన్నచో.. శోభంబే కదా 

భీముండన్నచో.. భీ తిల్లే కదా 

నోముండన్నచో.. నోమమ్మే కదా 

రోమమ్మ న్నచో.. రో ర క్తే కదా 


నాదుఃఖమ్ములో - నాడెందమ్ములో 

నాదమ్మొక్కటే - నాకన్నీరుదే 

బాధం బాపఁగా - వాఁడే లేఁడుగా 

నాదేమున్నదో - నాదే కాదుగా 


కాలాతీతమే. కామానంద మే 

జ్వాలామార్గమే..జామా నందమే 

మాలా మర్మమే.. మాయా నందమే 

థాలా లేవులే.. తాపం తప్పదే 


పద్మిని విలోమ వృత్తము ధ్యేయ

ధ్యేయ - మ/య/త/గ UU UIU - UU UIU



తెలుగు చెందస్సు పాఠము.. (128)....ప్రాంజలి ప్రభ...


కాల మెదిగి కామ్య మెదియు కామము యిది యందమే 

 జ్వాల వెలుగు జాడ్య మలుపు జాతర యిది యందమే 

 మాల మెరుపు మాన తలపు మాయయు యిది యందమే 

థాల వలపు తాప బతుకు తన్మయ యిది యందమే 


కలలలోని నెలత నీవె యలరు తీవ యెనగ రా 

మలల పైని జలద మీవె మెలగ మించు మెరపు రా 

 వలపులోని చలన మీవె చలగులాడు సెలగ రా 

 తలపులోని తలపు నీవె తలుపు తీసి త్వరగ రా 


 చలపరింత కథలు చూప చెపల చిత్త చెలము రా 

 తలపులన్ని తెలియ చెప్ప తపన తీర్చ తపసి రా 

 వలపులన్ని వలస రూప వరస జూప వయసు రా 

మలుపు లన్ని మనసు చూప మదను మెత్త మగువ రా 


నామనసున ప్రేమసుమపు టామని యిది యందమై 

శ్యామలతల కోమలతలు కామలతల కావ్యమై 

సోమరుచుల వ్యోమనదియు భూమికి దిగె ముగ్ధమై 

తామసమగు నేమొ కొమర సామి కనఁగ సవ్యమై 

*

*తల షట్పదిగా ఉత్సాహ మందారం*



తెలుగు చెందస్సు పాఠము.. (129)....ప్రాంజలి ప్రభ...


సహాయ భావమ్ము సాహసమ్మేన్ 

ప్రహాస లక్ష్యమ్ము ప్రాభవమ్మేన్ 

విహారి సౌమ్యమ్ము వైభవమ్మేన్ 

సుహాసి వైనమ్ము సూత్రమమ్మేన్ 


పలాయనమ్మున్ పరాభవమ్మున్ 

శిలా శరమ్మున్ ధరింతు నెమ్మున్ 

విలోల మైనన్ భరింతు నెమ్మన్ 

విలాపమేనన్ తృషాగ్ని యేనన్ 


బిరాన రావా వరింతు నీకున్ 

సరాలతో నే స్మరింతు నీకున్ 

మఱో ప్రపంచమ్ము చూపరావన్ 

కరమ్ము లీవా తరింతు నీకున్ 


మనస్సులో నీతలంపులేగన్ 

దినమ్ము రాత్రుల్ చరింతు నీకున్ 

వినంగ రా మోహనస్వరమ్ముల్ 

ఘనమ్ముగా నాదరింతు నీకున్ 


జలౌఘవేగా (తృషాగ్ని) - జ/త/ర/గ IUI UU IUI UU 


తెలుగు చెందస్సు పాఠము.. (130)....ప్రాంజలి ప్రభ...


ప్రేమలో శ్వాసమ్ము  నీవమ్మా, ప్రేమగా నా శ్వాస నీదమ్మ,

 కోమలీ యందమ్ము నీవమ్మా, కోరికే తీర్చేది నీవమ్మా 


 నీ మనస్సా హంస యిల్లేగా, మీ తపస్సా స్వామి నీడేగా 

 స్వామికా ప్రాణమ్ము నీవమ్మా, స్నేహమే తృప్తిగా నీదమ్మా 


 ఆయుషస్సే వెల్గునీకమ్మా, ప్రాయము దాయమ్ము నీవమ్మా 

 కాయమిచ్చే తృప్తి నీదమ్మా, సాయమవ్వా గమ్య మేనమ్మా


వేయి మంత్రాలందు భావమ్మై, తీయనౌ గానమ్ము నీవమ్మా

 వేయి కావ్యాలందు లక్ష్యం బై, ప్రేమనే కుర్పించు నీవమ్మా 


 పాలలో ఫేనమ్ము నీవేగా, పూలలో గ్రంథము నీవమ్మా 

 నేలలో స్వర్ణమ్ము నీవేగా, జీవిలో పాఠ్యమ్ము నీవమ్మా  


వ్రాలునేమౌ మోహనుండే, నీ మ్రాల పుష్పాస్త్రమ్ము నీవమ్మా 

గాలి సమ్మోహనమ్ము నీవమ్మా, నీరు సర్వమ్ము తృప్తి నీవమ్మా 


రుక్మవతీ - ర/త/మ UIUU UIUU U 



తెలుగు చెందస్సు పాఠము.. (131)....ప్రాంజలి ప్రభ...


కాలమేనీదౌను విశ్వమ్ - జ్వాళలే నీ ఔనుగా - వాలకమ్మే నీవెగా 

 పాలనేత్రమ్మోన్ విశ్వమ్ - పాలనే నీ దౌనుగా - పాల నమ్మే నీవెగా 

మాల ధారీగా నీవే - మాలలో నీ నవ్వుగా - మాల సేవా నీవెగా 

వాలకమ్మే మాదేలే - వల్లె వాటం పువ్వుగా - వెళ్ళు వాయే నీవెగా 


శ్రీవి నీవీచిత్తమందే - జీవనమ్మే గంధమే - చేతనమ్మే నీవెగా 

దైవమే తాఁదల్చునేమో - దర్పణమ్మీ బంధమే  - దారిలోనం దీవెగా 

పూవులే యీతోటలో సొం-పూరె నీభామలో - మోవిపై గీతమ్ములే 

దేవలోకమ్మేగదా సం-దీప్తమై యీప్రేమలో - దివ్యమై చేతమ్ములే 

*

UIUU UIUU UIUU UIU + UIUU UIU


తెలుగు చెందస్సు పాఠము.. (132)....ప్రాంజలి ప్రభ...


నీవు లేకా నేను లేనే నీదయే నా దౌ నులే - నిన్నుగా నేనుగా నమ్మానులే 

 తావులేకా చెప్పలేకే కాని దైనా దమ్ములే - తప్పుగా ఒప్పుగా నమ్మానులే 

 చావలేకా బత్కలేకే చాటుగా నాదమ్ములే - చల్లగా వెచ్చగా నమ్మానులే 

 భావమైనా బంధమేలే బాధ్యతా వైనమ్ము లే - బావగా నేతగా నమ్మానులే 


నీవు లేవే శూన్యమేనా - నిక్కమై యీలోకమే - భూకమే - నేను నీకై శోకమే 

నీవు రావేకారణమ్మో - నేను నేనా చింతయే - వంతయే - నిండె డెందంబంతయే 

భావనాజీవమ్మునందే - భావియౌనా కావ్యమై - శ్రావ్యమై - పానపాత్రన్ సేవ్యమై 

దేవుఁడేమో మౌని సం-దేహ మాతండుండెనా - నిండెనా - దీప్తితోఁ దామండెనా 

*

UIUU UIUU UIUU UIU + UIU + UIUU UIU


*


తెలుగు చెందస్సు పాఠము.. (133)....ప్రాంజలి ప్రభ...

ఆనందమీ లోకమే యందమై, ప్రాణమ్ము యే దీపమై యందమై 
గానమ్ము నీ నాదమే యందమై, ధ్యానమ్ము యే దైవమై యందమై 

తేనెల్ స్రవించంగ మాధుర్యమే, మేనందు నుల్లాసమే యందమై,
స్త్రీ గన్ శ్రమించంగ సౌందర్యమే నాయందు యారోగ్యమే యందమై  

తారాగ ణమ్మభ్ర మార్గమ్ములో దూరాన నేకాంతమే యందమై 
చేరే గుణమ్ము స్వమార్గమ్ములో ధైర్యమ్ము నీకాంతమే యందమై 

పారెంగదా వెల్గు స్రోతమ్ములై యీరేయి సౌగంధ్యమే యందమై 
మారే మనస్సేను మంత్రమ్ములై చేసేటి సంగ్రామమే యందమై 

ఆలోలమీ గుండె హిందోళమై పూలందు నీహారమే యందమై 
కల్లోల మే హృద్య సందేహమై కాలమ్ము నీదారిగా యందమై 

నాలోన నోమోహనా యాశలే నీలోన నాప్రేమమే యందమై 
నాలోన నీ దుఃఖమే యాశలే నీలోన నా మార్గమే యందమై 

 ఈ లోకమే నాదిగా మార్గమై యీప్రాణమే స్నేహమై యందమై
 ఈ లౌక్యమే భక్తిగా మార్గమై ఈ శక్తియే నేస్తమై యందమై

ఓం శ్రీ రామ... శ్రీ మాత్రేనమః..
విశాలాంతికా లేక తారామతీ - త/త/త/గ UU . IUU . IUU . IU 

తెలుగు చెందస్సు పాఠము.. (133)....ప్రాంజలి ప్రభ...
మందారం  

అనాధ శిశువు కు అండగానిలుస్తా 
అంగవికులుల కే చేయూతనిస్తా
ఆకలై ఆర్ధికసాయమందిస్తా
ఆశయ అంతర్యామిని ప్రశ్నిస్తా 

అవివేకుడెదురైనా చేరదీస్తా
అలమటిస్తే అశ్రువులుకారుస్తా
తారసపడితేను ఙ్ఞానభొధచేస్తా 
గురువుల్ని  మేధావులను అభ్యర్ధిస్తా

బ్రతుకు యిచ్ఛ సన్మార్గంచూపిస్తా
నిత్యము అంతరంగాన్నిమారుస్తా
అవధులుదాటుతుంటే అడ్డగిస్తా
ఆదుర్దాపడతా సలహాలిస్తా 

అభ్యర్ధిస్తేనే  ఆశ్రమమిస్తా
అబలలకు  ఆసరాగా కలిపిస్తా
ఒకేకుటుంబమంటూనె జీవిస్తా  
అన్యోన్యంగ సహకార మందిస్తా
 
*****

Krishna Collecting Lotus for Radha - Miniature Painting from Rajasthan, India

UUU  UII III UUI UUI UU - 10  
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక - కవిత్వం - మందాక్రాంత 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

సంకల్పం విశ్వ చరితము సౌభాగ్య సౌందర్య సాహి 
త్యా కావ్యం ధర్మ చరితము త్యాగర్ద ధర్మార్ధ సాదృ
శ్యా కామ్యం సత్య చరితము సర్వార్ధ సాంఘీక  సాన్ని
త్యం కర్తవ్యా సహ చరితము ఆనంద సంతృప్తి సేవే 

సంసారం  సాగరము వలె పొంగేను కుంగేను   కాదా 
విశ్వాసం కాలముల వలె  నేర్పుల్లొ మార్పుల్లొ  కాదా 
ప్రాధాన్యం మానసము వలె సంతోష దుఃఖాలు కాదా 
ప్రేమానందం పరిణయపు సాంగత్య సారూప్య మేలే 

కారుణ్యం కాపురము లలొ సంభోగ సౌందర్య  కాదా 
ధారుడ్యం సాహసము లలొ  ఏకత్వ సంతృప్తి కాదా 
ప్రావిణ్యం  ప్రేమ సమములొ ఆలింగ తత్వమ్ము కదా  
బంధుత్వం ఓర్పు ఒరవడి  ఒక్కింత ఉండేటి మేలే     

--(())--


ప్రమోద మానస విలాస ద్యోతక_
సుహాసినీద్యుతి నివే దనంబున_
సకాల సేవల సుతార ధార్మిక....
నివాసి బాధ్యత నిజాల మర్మము....

విహారమందెను విరాగ మంతయు
జగాన మింగెను ప్రగాఢ విశ్వము
మనోమయమ్ముగ సహాయమే ఇది
ప్రగాఢ మానస ప్రభావ చిత్రము ...

రసార్ధ్రగీతిక నిషాను పెంచగ_
హుషారు పెర్గెను దిశాంత మందున
అనంత వాయువు ఆశయ మందును.
సుదీర్ఘ కాలము సునామి వచ్చుట..

విశాలమయ్యెను నిశీధి వాంఛలు_
నుషోదయంబయె రాక్షస క్రీడలు 
నిదాన మయ్యెను.చెకోర పక్షులు...
వినోదయంబుయె వినీల చేష్టలు 

నఖాల గాయపు సకార భావన_
ముఖాన గీసిన ప్రకాశ మందున_
అనాది నాదము సుధర్మ వాసము 
సునామి నీడలు వినాశ కాలము..

సుఖాల లాలస వికీర్ణ మైనది_
చకోర పక్షికి వెన్నెల దొరకెను_
అకాల మృత్యువు అనాది వేటయు..
వినాస బుద్దియు శిఖండి ఆటయు 

విభావరీదరి విఘాత మొందగ_
వికాస కాంక్షల ప్రలోభ మందున_
సరాగ శృతిలోసంగమ సరిగమ_
తనూద్వయమ్ముల తన్మయత్వము_

సరాగ చిన్మయ  సుశోభసంగమ 
తనూద్వయమ్ముల మనస్సు తన్మయ
పరాగ సంభవ పరాభవమ్ముయు
సరాగ సంభవ సమర్ధ సమ్మతి

*ఒకరోజు* జ. భ .. జ. భ ఎలాగుంది 
*****


మందారం 

నిన్ను నేను ప్రార్థించే ఒకందుకే దైవమా
నాలోనిది, లోభిత్వo, అనుమానం దైవమా

సంకుచితత్వాన్ని సమూలంగానే చేధించు
కష్టసుఖాలను తేలికగ పొందాలి దైవమా

భరించే శక్తిని తేలికగ నాకు ప్రసాదించు.
ప్రేమను నీ సేవలొ ఫలప్రదం చేయు దైవమా

పేదవారిని తిరస్కరించకుండా ఆదరించు
అధికార గర్వం లేని ప్రేమపెంచు దైవమా

నా హృదయాన్ని అహరహాలు జపం చేయ కరుణించు
ఇంతకన్న నాకు వేరే ఏమీ వద్దు దైవమా 

తలవంచకుండా వుండే బలాన్ని  అనుగ్రహించు.
కష్టాలను ఓదార్చు గుణము నాకివ్వు దైవమా 

ప్రేమతో నా సర్వస్వాన్నీ, నీకే అర్పితం దైవమా 
నీ ఇచ్ఛకు సమర్పించు శక్తినివ్వు దైవమా 
.......
మందారం 
సజ్జనులతొ సహవాసము దుష్టులకే  బహు దూరము
మెదడులోన విజ్ఞానము మోక్షానికి నిజ మార్గము

అందమైన దరహాసము అర్ధంకాని స్త్రీ తనము  
ఘనమైన స్నేహబంధము గడప దాట విజ్ఞానము
పూలలోన మకరందము స్త్రీలలోని సుకుమారము  
జీవితాన సంస్కారము సంప్రదాయ మమకారము 

పాటలోన తీయదనము పాశమైన బ్రతుకు తనము 
మాటలోన మంచితనము మనసులోన మేలి గుణము 
స్వచ్ఛమైన ప్రేమగుణము స్వేచ్చకోరు ఆడ తనము 
అందరితో సమభావము ఆశయ లక్ష్య మే జీవము 

చూపిస్తే మనిషితనము పలుకులోన మెత్త దనము 
కన్నవారిపై గౌరవము కట్టుకున్న భార్య మయము 
***
పరిధి .. తేటగీతి 

జననమునకు ముందు జరిగె జాతరేది 
మరణమునకు పిదప జూపు మార్గ మేది
ఎంత వారికైన పలుకు ఇష్ట మేది 
తప్పదిదియు యేమని చెప్ప తపన మేది  

జన్మనెత్తగానె యెడుపు జపము యేది 
మనకు జ్ఞాపకమ్ము బ్రతుకు మార్గ మేది 
ఇట్టి ప్రక్రియ తోడుగా జీవ మేది 
సృష్టి లోన బ్రతుకు దృష్టి కృషియు యేది 

బ్రతుకు బాటలోన మరపు భద్రతేది 
ఇన్ని అన్ని యనక ఎన్నొ ఇప్సితమది 
మరపు వలనె మాయమగుట మనసుస విధి  
ఎవరి దిలలొ మరపు లేని యెదల పరిధి  

మరపు వలనె బ్రతుకు మారు మానస విధి 
 బాధలన్ని మరచువేళ పయనము నిధి 
బాధలన్ని మనకు చేరు బ్రతుక పరిధి 
జీవితాంతము సుఖమయ్య చింతల గది  

ధనికు లైన గానిమనసు ధనము పరిధి 
చింత పడుదురెంతొయువక చిత్ర పరిధి   
ఇంట ఎవరొ చచ్చిన న్యాయ ఇచ్ఛ పరిధి 
మరపు వలనె గాద మరచి మాయ పరిధి 

బ్రతుకు చుందు బాహటముగ భాగ్య పరిధి 
జన్మ తోనె మరపుగాను జాగు పరిధి 
చింతలందు మనసు చిక్కి చెదురు పరిధి
దేవుడున్నాడు మనలతొ దీన పరిధి   

          ******


 

Art image of Radha Krishna

radha krishna | raadheraadhe | Flickr


మారని మమతాను రాగ మదీయ వేద మే 
తీరని  కరుణా కటాక్ష విక్షణా సహాయమే 
కోరిన మనువాడు శక్తి పుంజమే విశాల భా        
వామృత సహజాను సేవ తత్పరాను రాగమే

ఆరని అనురాగ శాంతి సొమ్ముయే సుధా మదీ
యా రమ సమ పోషణా లయాన్వితా సుహాసినీ 
ఆరదము కళాన్వి తాను రాగమే సుఖాన్వితా 
ప్రేరణ వినయాన్వితా సమర్ధ సేవ సంతసం 

సా రిగమను పల్కుటే ఉషోదయాన్ని పిల్చుటే 
భీరు తనుము తొల్చుటే మనో జయాన్ని పోల్చుటే 
నీరు తనము  చూచుటే  నిజాన్ని తెల్పి బత్కుటే 
మారు పలుకు  పల్కకే  మదీయ  భావ మిచ్చుటె 

మారుతము  మనల్ని జీవ సేవ చేయు నిచ్చునే 
ప్రేరితము మనల్ని  బత్కి  బత్కు నేర్ప టానికే  
పారునదులు చేరు భూమితత్వమున్ను కోరిటే 
దారుణ మను నన్నదీ ఏదియూ లేదు కృష్ణుడా  

భ స జ ర జ గ మదనదర్ప - .9.    
UII  IIU  IUI  UIU IUI  U 
*****

సమాన మైన మానసా  సహాయ సేవ తృప్తిగా 
సకాల మాయ మొహమే సుతారవేద తృప్తిగా    
సహాయ మోక్షమే మనస్సు  సాహసమ్ముఁ  తృప్తిగా
సరాగ  రాగ మాలికే  సంసయమ్ము తృప్తిగా 

అనాది నాదమే సమాన భక్తి తత్వ  తృప్తిగా 
అకాల వర్షమే సయోధ్య శక్తి తత్వ  తృప్తిగా 
అనంత సౌఖ్యమే అపూర్వ  యుక్తి తత్వ తృప్తిగా 
అలంకారమ్ముయే  విజేత రక్తి తత్వ  తృప్తిగా  
  
కరాళ నుట్యమే  అనేక  రక్తిగాను తృప్తిగా 
మకార బుద్ధియే  మనో మధుత్వమేను  తృప్తిగా 
వినాశి భావమే విరోధి యుక్తిగాను తృప్తిగా   
వివాద రక్తియే విషాద వైనమేను తృప్తిగా 

విశాల విశ్వమే సుధా వినోద నవ్వు తృప్తిగా   
వినోద లక్ష్యమే శరీర మార్పులే ను తృప్తిగా 
విహార వైనమే వివాద  కూర్పులే ను తృప్తిగా 
వివాహ వేడుకే అనంత ఓర్పులే ను తృప్తిగా 

జ  ర  జ  ర  జ  గ - పంచ చామర - 9 
IUI  UIU IUI  UIU  IUI  U 

******

   



ఈనాటి కవితను ద్రాక్షారామంనుండి వ్రాస్తున్నందుకు యెవరికి యెరుక
ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఉండాలని ఆపరమేశ్వరుని ప్రర్ధించుతానని యెవరికి యెరుక

యెవరికెవరు ఈలోకంలో యెవరికి యెరుక
యేసమయాన యేమి జరుగునో యెవరికి యెరుక
సముద్ర కెరటం తీరం దాటుతుందని యెవరికి యెరుక
నదీమతల్లి సంద్రంలో కలుస్తుందని యెవరికి యెరుక
తల్లి బిడ్డకు పంచేప్రేమని అడగదని యెవరిరకి యెరుక
తండ్రి చెప్ప లేని స్తితిలో ఉండునని యెవరికి యెరుక
గురువు చెప్పినపాఠాలు మరిచారని యెవరికి యెరుక
కన్నవారిని డబ్బుకోసం బిడ్డలే చంపునని యెవరికి యెరుక
 
ద్రాక్షరామం శివ సన్నిధినుండి వ్రాసానని యెవరికి యెరుక
కాలం గమ్యం ఆరోగ్యం యెప్పుడు మా‌రునని యెవరికి యెరుక
న్యాయం ఉండకపోయిన శిక్షిస్తారని యెవరికి యెరుక
శివుడాజ్ఞ లేనిదే చీమయినా కదలదని యెవరికి యెరుక
 
ఉన్నది పోయి ఉంచుకన్నది పోతుందని యెవరికి యెరుక
భార్యాభర్తలు ఇద్దరు కాదని ఒక్కరని యెవరికి యెరుక
అర్ధనారీశ్వర తత్వం తెలుసుకోలేరని యెవరికి యెరుక
అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను
ప్రాంజలిప్రభ
 


తెలుగు భాష నేర్చుకుందాం 15 /3 

600 ..అలిగిన అలలే స్వ సంద్రమే 
తలవని తరమే స్వ మాయలే 
పిలవని పరమే స్వ బుద్ధులే 
కలవని కధలే స్వ కర్మలే 

601..పలుకుల మనసే స్వభావమే 
థళుకుల మెరుపే స్వధర్మమే    
కులుకుల వరమే స్వలక్ష్యమే 
మలుపుల కరునే స్వ కర్మయే 
    
602.. ఒకటని ఒకటేను పొందుటే  
శకటము సెగ దెబ్బ ఉండుటే
తకధిమి తక తోం త నాట్యమే 
తికమక తిక ఉండు రోగమే 
    
603.. వికసిక కధలన్ని రాగమే 
మకతిక తరుణమ్ము శాంతమే 
తకధిమి కలలన్ని భావమే 
ఒకటికి ఒకటేను ఓర్పుయే  
      
604..సరిగమ సతి పాటలే మనో 
మురిపము మను వాడి నోడికే 
సిరి కలసియు వేడుకే కధా
చరితము మది సంతసం కదా 

605.. పదనిస పతి మాటలే కళా 
యద వినయపు సేవలే కధా 
కధ కళ కిల అవ్వుటే సదా  
రొద మది రమ కోరుటే కదా

న న ర ల గ ;; III III UIU IU 

మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ            
--(())--     

తెలుగు భాష నేర్చుకుందాం 15 /3

600 ..అలిగిన అలలే స్వ సంద్రమే
తలవని తరమే స్వ మాయలే
పిలవని పరమే స్వ బుద్ధులే
కలవని కధలే స్వ కర్మలే

601..పలుకుల మనసే స్వభావమే
థళుకుల మెరుపే స్వధర్మమే
కులుకుల వరమే స్వలక్ష్యమే
మలుపుల కరునే స్వ కర్మయే

602.. ఒకటని ఒకటేను పొందుటే
శకటము సెగ దెబ్బ ఉండుటే
తకధిమి తక తోం త నాట్యమే
తికమక తిక ఉండు రోగమే

603.. వికసిక కధలన్ని రాగమే
మకతిక తరుణమ్ము శాంతమే
తకధిమి కలలన్ని భావమే
ఒకటికి ఒకటేను ఓర్పుయే

604..సరిగమ సతి పాటలే మనో
మురిపము మను వాడి నోడికే
సిరి కలసియు వేడుకే కధా
చరితము మది సంతసం కదా

605.. పదనిస పతి మాటలే కళా
యద వినయపు సేవలే కధా
కధ కళ కిల అవ్వుటే సదా
రొద మది రమ కోరుటే కదా

న న ర ల గ ;; III III UIU IU

మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ
--(())--

సార్థకనామ గణాక్షర వృత్తము "భవహర"
*
భవహర - భ/య/జ/గ UIII UUI UIU
10 పంక్తి 335

కాల మయ కారుణ్య కావ్యమే మాల కథ మాధుర్య భావమే ఏల విధి యైశ్వర్య లక్ష్యమే తాళ మది తత్వంబు ధ్యానమే

కాలమది కామ్యంబు తీవ్రమై 
మాలకల మానంబు మార్గమే 
ఏల నిధి తీరంబు దీర్ఘమై 
తాళ తిధి తన్మాయ తత్వమే 
*
పావనము నీపాద మవ్యయా
జీవనము నీచేత నక్షయా
కావగను రా గమ్య దీపమై
దేవ యిట సందీప్త రూపమై
*
ఓభవహరా యొప్పిదమ్ముగా
శోభిలుచు రా సుందరమ్ముగా
వైభవము నీభస్మ ధూళియే
ఈభవము నీయిచ్ఛ, కేళియే
*
నీలగళ సాన్నిధ్యమే సదా
శ్రీల నీడు సచ్ఛీలమే గదా
ఫాలనయనా పాపనాశనా
మేలు నిడి మమ్మేలు మోహనా
*
ఆయుమకు నర్ధాంగుఁడైతివే
ఆయువుకు నర్థాంశుఁడైతివే
మాయమున నామానసమ్ములో
ధ్యేయమిఁక నీదివ్య నామమే
*
సుగంధి = రజ్ౙ్ ముసమ్మన్ మర్ఫూ మఖ్‌బూన్
*
సుగంధి - ర/జ/ర/జ/ర
15 అష్టి 10923 UIU . IUIU . IUIU . IUIU
*
మళ్లి రావనంచుఁ జెప్పె మానసమ్ము నాసఖీ
కల్లయంచెడంద చెప్పె+ కాఁతు నమ్ము నాసఖీ
--
తల్లడిల్ల శాంతి నీదు తైల చిత్రమే గదా
ఫుల్లమై కొనంగ నిత్తు+ పూసరమ్ము నాసఖీ
--
వాఁడు ప్రేమికుండు గాఁడు బాధ వాఁడెఱుంగఁడే
వాఁడు వేటగాఁడు గ్రుచ్చు వాడి యమ్ము నాసఖీ
--
వీడలేని నమ్మకమ్ము ప్రేమ నిల్చె వృక్షమై
మోడు పూయు+ తప్పకుండ మోదకమ్ము నాసఖీ
--
రాత్రివేళ నిద్రపోవ రమ్య మీధరిత్రియే
నేత్రమిందు నిద్రలేక నిశ్చలమ్ము నాసఖీ
--
ఆత్రమేల చావులేని యాశ మోహనమ్ముగా
గాత్రమందు గీతమొండు కంపితమ్ము నాసఖీ
--
విధేయుడు -
దేవప్రియా = రమల్ ముసమ్మన్ మహ్‌ౙూఫ్
*
వ్యావహారిక భాషలో
*
వెన్నెలంతా మూడు నాళ్లే ప్రేమ చింతేనాచెలీ
అన్నమంతా కొన్ని నాళ్లే ఆకలింతేనాచెలీ
--
అందమంతా మాధవమ్మే ఆగుగా ఆపై సఖీ
కందుతో ఈకుందులేనా కానుకింతేనాచెలీ
--
కూనిరాగమ్మే స్వరమ్మా కుళ్లు కూడే భక్ష్యమా
గోనె యౌనా పట్టుగా యీ క్రుళ్లగింతేనాచెలీ
--
వేణువంతా చిల్లులేగా వేళ్లతోనే పాటలే
దోణిలో ఈచిల్లులేనా దోవ యింతేనాచెలీ
--
ఆహ డెందమ్మగ్గియేనా ఆశలే ఆ కాష్ఠమా
మోహనమ్మీ శోకమేనా మోదమింతేనాచెలీ
*
సూచన: చింతేనాచెలీ అన్నదానిని చింతేనా చెలీ లేక చింతే నాచెలీ అని విడదీయవచ్చును. కొన్ని పదములకు అర్థములు: మాధవము = వసంతము; కందు = తాపము; కుందు, క్రుళ్లగింత = దుఃఖము; దోణి = పడవ, కాష్ఠము = కట్టె.
*






Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ