[12:21 pm, 30/1/2025] Mallapragada Ramakrishna: సార్థకనామ మురళీవృత్తము
*
*
[12:21 pm, 30/1/2025] Mallapragada Ramakrishna:
[12:22 pm, 30/1/2025] Mallapragada Ramakrishna: మాణవక, ప్రకృతి వృత్తములు ఆవృత్త వృత్తములు
*
UII UU IIU - మాణవక
IIU UII UU - ప్రకృతి
*
మాణవక - భ/త/లగ UII UU IIU
8 అనుష్టుప్పు 103
*
మోహన రావా కలగా
దాహము నాకే చలిలో
వాహిని గాదా తలఁపే
నాహృదయమ్మే వలపే
*
పైవృత్తము ప్రకృతిగా:
*
ప్రకృతి (మణిచిత్ర, సుభగ) - స/భ/గగ IIU UII UU
8 అనుష్టుప్పు 52
*
కలగా మోహన రావా
చలిలో దాహము నాకే
తలఁపే వాహిని గాదా
వలపే నాహృదయమ్మే
*
మాణవక:
*
చిన్నది నీకై విరిరా
ఎన్నఁగ నీవే సిరిరా
పున్నమి నేఁడే దరి రా
వెన్నెల కాంతుల్ ఝరిరా
*
పై పద్యము ప్రకృతిగా:
*
విరిరా చిన్నది నీకై
సిరిరా యెన్నఁగ నీవే
దరి రా పున్నమి నేఁడే
ఝరిరా వెన్నెల కాంతుల్
*
[12:23 pm, 30/1/2025] Mallapragada Ramakrishna: స్రగ్విణీ భుజంగప్రయాతములు ఆవృత్త వృత్తములు
*
UIU UIU UIU UIU - స్రగ్విణి
IUU IUU - IUU IUU - భుజంగప్రయాతము
*
స్రగ్విణీ - (ర)4 UIU UIU - UIU UIU
12 జగతి 1171
*
మాధవా రా సదా - మాయలో నాశలే
శ్రీధరుండా మదిం - జిందు నీ ప్రేమమే
బాధ నాదే యిదే - భావియా ఱాయిగా
శోధనమ్మే విధీ - శోభ లేదే ప్రియా
*
పై పద్యము భుజంగప్రయాతముగా:
*
భుజంగప్రయాతము - (య)4 IUU IUU - IUU IUU
12 జగతి 586
*
సదా మాయలో నా-శలే మాధవా రా
మదిం జిందు నీ ప్రే-మమే శ్రీధరుండా
యిదే భావియా ఱా-యిగా బాధ నాదే
విధీ శోభ లేదే - ప్రియా శోధనమ్మే
*
స్రగ్విణి:[12:16 pm, 30/1/2025] Mallapragada Ramakrishna: సృజన - త/న/య/య/స UUI IIII - UUI UUIIU
15 అతిశక్వరి 12925
*
ఈమన్ను జలధియు - నీదొడ్డ శైలమ్ములతో
నీమత్తు లిడు విరు - లీవర్ణ జాలమ్ములతో
నీమాయ సృజనలు - నేనెట్లు చెప్పగలనో
నామార్గ మది యెటు - నాకెప్డు చెప్పగలవో
*
నీవేమొ కడలివి - నేనో తరంగమ్ము గదా
నీవేమొ గగనము - నేనో కురంగమ్ము గదా
నీవేమొ వెలుఁగువు - నేనో దివాంధమ్ము గదా
నీవేమొ యమితము - నేనేమొ యల్పమ్ము గదా
*
నాజన్మ దినమిది - నాస్వామి దీవించుమయా
ఈజన్మ కిది సరి - యీనాఁడు నవ్వించుమయా
పూజార్హమగు విరి - పున్నెమ్ము నాకిమ్ము ప్రభూ
రాజిల్ల బ్రతుకున+ - ప్రార్థింతు నోదివ్య విభూ
*
[12:21 pm, 30/1/2025] Mallapragada Ramakrishna: సార్థకనామ మురళీవృత్తము
*
మురలీ(ళీ) - (మ)5/ర/(ల)4
మ/మ/మ/మ/మ/ర/న/ల
UUU UUU - UUU UUU - UUU UIU IIII
22 ఆకృతి 3997697
*
స్వామీ నాకా నీవే
సర్వమ్మై నిండంగా
సంతృప్తిం బొందితిన్ నిజముగ
రాముండై కృష్ణుండై
రక్షించంగా రావా
రమ్యమ్మై నిల్వఁగా ధ్వజముగ
శ్రీమంతుండీవేగా
చేమంతుల్ నీకిత్తుం
జిద్రూపా యూఁదరా మురళిని
శ్యామా ప్రేమానందా
సాయమ్మీయంగా రా
చల్లంగా+ పాడుమా సరళిని
*
[12:21 pm, 30/1/2025] Mallapragada Ramakrishna: ఆయురారోగ్య కుటుంబక్షేమ సుఖసంతోష సర్వాభివృద్ధిగా ఒకప్పుడు మీరే కల్పించిన మురళీ నామక లఘ్వంత నూత్నవృత్తానికి 'కృష్ణమురళి' అని పునర్నామ్నీకరించి సప్తపాదిగా సమర్పిస్తున్న జన్మదిన శుభాకాంక్షలు...
పూజ్యశ్రీ జెజ్జాలాం --
భోనిధ్యౌపమ్యంబౌ –
పుణ్యావాసాన్వవాయమునను
ప్రాజ్యాంధ్రాంగ్లాద్యాని –
ర్వాపామోఘామేయ –
ప్రజ్ఞాశాలిత్వ మందితిరి శు
భజ్యోత్స్నాపూరమ్మా –
వాహిల్లన్ సాహిత్యో –
పాస్తిన్ వైదుష్యపూర్ణులరయి
సుజ్యోతిష్మత్తన్ సం –
శోభిల్లన్ ఛందశ్శా –
స్త్రోద్బోధన్ విశ్వసాహితికి స
మజ్యాహేతూద్ధార –
మ్మై వర్తిల్లన్ వ్యాసా –
మ్నాయాళిన్ గూర్చి యాంధ్రమునకు
సాజ్యాగ్న్యాధానాత్మా –
శాబంధేష్టిన్ గూర్పన్ –
సర్వారోగ్యాయురాహితముగ
సుజ్యాయశ్శ్రేయఃప్ర –
స్ఫూర్తిన్ మిమ్మున్ విశ్వే –
శుం డోమున్ మోహనాఖ్యసుమతి
[12:22 pm, 30/1/2025] Mallapragada Ramakrishna: మాణవక, ప్రకృతి వృత్తములు ఆవృత్త వృత్తములు
*
UII UU IIU - మాణవక
IIU UII UU - ప్రకృతి
*
మాణవక - భ/త/లగ UII UU IIU
8 అనుష్టుప్పు 103
*
మోహన రావా కలగా
దాహము నాకే చలిలో
వాహిని గాదా తలఁపే
నాహృదయమ్మే వలపే
*
పైవృత్తము ప్రకృతిగా:
*
ప్రకృతి (మణిచిత్ర, సుభగ) - స/భ/గగ IIU UII UU
8 అనుష్టుప్పు 52
*
కలగా మోహన రావా
చలిలో దాహము నాకే
తలఁపే వాహిని గాదా
వలపే నాహృదయమ్మే
*
మాణవక:
*
చిన్నది నీకై విరిరా
ఎన్నఁగ నీవే సిరిరా
పున్నమి నేఁడే దరి రా
వెన్నెల కాంతుల్ ఝరిరా
*
పై పద్యము ప్రకృతిగా:
*
విరిరా చిన్నది నీకై
సిరిరా యెన్నఁగ నీవే
దరి రా పున్నమి నేఁడే
ఝరిరా వెన్నెల కాంతుల్
*
[12:23 pm, 30/1/2025] Mallapragada Ramakrishna: స్రగ్విణీ భుజంగప్రయాతములు ఆవృత్త వృత్తములు
*
UIU UIU UIU UIU - స్రగ్విణి
IUU IUU - IUU IUU - భుజంగప్రయాతము
*
స్రగ్విణీ - (ర)4 UIU UIU - UIU UIU
12 జగతి 1171
*
మాధవా రా సదా - మాయలో నాశలే
శ్రీధరుండా మదిం - జిందు నీ ప్రేమమే
బాధ నాదే యిదే - భావియా ఱాయిగా
శోధనమ్మే విధీ - శోభ లేదే ప్రియా
*
పై పద్యము భుజంగప్రయాతముగా:
*
భుజంగప్రయాతము - (య)4 IUU IUU - IUU IUU
12 జగతి 586
*
సదా మాయలో నా-శలే మాధవా రా
మదిం జిందు నీ ప్రే-మమే శ్రీధరుండా
యిదే భావియా ఱా-యిగా బాధ నాదే
విధీ శోభ లేదే - ప్రియా శోధనమ్మే
*
స్రగ్విణి:
*
దివ్యమేగా నదీ - తీరమే గానమే
నవ్యమేగా సదా-నందమే యో సఖా
భవ్యమేగా యిదే - భావనమ్మే హృదిన్
సవ్యమేగా సుధా - సారమే మోజులో
*
పై పద్యము భుజంగప్రయాతముగా:
*
నదీ తీరమే గా-నమే దివ్యమేగా
సదానందమే యో - సఖా నవ్యమేగా
యిదే భావనమ్మే - హృదిన్ భవ్యమేగా
సుధా సారమే మో-జులో సవ్యమేగా
*
సూచన: నంది తిమ్మన పారిజాతాపహరణములో స్రగ్విణీ గర్భిత భుజంగప్రయాతము గలదు. అందులో రెండు పద్యములు విడివిడిగా అవిచ్ఛిన్నముగా ఉంటాయి. తనయ వృత్తపు పాదములు మాతృక వృత్తపు రెండు పాదములలో ఉంటాయి. నాఉదాహరణములలో ఒకే పాదము రెండు వృత్తములకు సరిపోతుంది. పద్యములు ఒక విధముగా ఒక్కటే!
*
*
దివ్యమేగా నదీ - తీరమే గానమే
నవ్యమేగా సదా-నందమే యో సఖా
భవ్యమేగా యిదే - భావనమ్మే హృదిన్
సవ్యమేగా సుధా - సారమే మోజులో
*
పై పద్యము భుజంగప్రయాతముగా:
*
నదీ తీరమే గా-నమే దివ్యమేగా
సదానందమే యో - సఖా నవ్యమేగా
యిదే భావనమ్మే - హృదిన్ భవ్యమేగా
సుధా సారమే మో-జులో సవ్యమేగా
*
సూచన: నంది తిమ్మన పారిజాతాపహరణములో స్రగ్విణీ గర్భిత భుజంగప్రయాతము గలదు. అందులో రెండు పద్యములు విడివిడిగా అవిచ్ఛిన్నముగా ఉంటాయి. తనయ వృత్తపు పాదములు మాతృక వృత్తపు రెండు పాదములలో ఉంటాయి. నాఉదాహరణములలో ఒకే పాదము రెండు వృత్తములకు సరిపోతుంది. పద్యములు ఒక విధముగా ఒక్కటే!
*
[12:23 pm, 30/1/2025] Mallapragada Ramakrishna: కల్పిత వృత్తము జలపాతము = రమల్ ముసమ్మన్ మఖ్‌బూన్ అస్లమ్
*
జలపాతము - స/భ/త/య/గగ IIUU IIUU - IIUU UU
14 శక్వరి 820
*
కనులేమో కలువంగా+ కథ యేమో దేవీ
తనువేమో పిలువంగా+ తలఁపేమో దేవీ
వనమందా విరులే నీ పరువమ్మే గాదా
వినలేదా మధురమ్మా పికమేమో దేవీ
తెలినవ్వో కిరణాలే తిరునాళ్లీ నాకే
కలలీ పాటలయందే కలదేమో దేవీ
మలుపందా జలపాత మ్మది చిత్రమ్మేగా
చలనమ్మా యనిలమ్మే సడులేమో దేవీ
వ్యధతో నీ బ్రతుకేలా వసివాడుం గాదా
మది నాతో+ పలుకంగా మధువేమో దేవీ
మృదువై మోహనమై రా యిఁక హర్షమ్మేగా
నిధి నీవే సుధ నీకై నెనరేమో దేవీ
*
[12:24 pm, 30/1/2025] Mallapragada Ramakrishna: నాలుగు రుబాయీలు
*
ఆగంగయు నేడ్చుచుండె నయ్యో వినరే
ఆగంగయు నల్లనయ్యె నాహా కనరే
రోగమ్ముల పాపమ్ముల రొచ్చయ్యెనుగా
సాఁగెన్ మలినమ్ముతోడ శాపంబనరే
*
నీపాపపు టాకారము నీనీడ గదా
నీపుణ్యము వచ్చుచుండు నీతోడఁ గదా
నీపాపము గంగలోన నీరమ్మగునా
దాపంగ వృథా మనస్సు తాఁజెప్పు గదా
*
మాటాడుము పిల్చుచుండు మౌనాత్మ సదా
పాటించుట దాని యాన భవ్యమ్ము గదా
వేటాడుట వద్దు, మారు ప్రేమాకృతిగా
ఆటాడుట యేల దైవ మాలించు సదా
*
జీవమ్మది గంగవోలె చిందాడునుగా
భావమ్మది కాళింది ప్రవాహమ్మగుఁగా
ఆవాహిని నీలోనిది యాదేవునిదే
నీవే యా కుంభమేళ నీరమ్ములుగా
*
[12:24 pm, 30/1/2025] Mallapragada Ramakrishna: క్రింద ఒక ఆటవెలది. ఏ పాదమునకు ఆ పాదము స్వతంత్రముగా ఉన్నది ఈ పద్యములో. ఆటవెలది లక్షణములు మారకుండునట్లు దీనిని నాలుగు విధములుగా అమర్చ వచ్చును. అవి -
*
ఆటవెలది
1234 పాదములు -
దండ మయ్య నీకు - దండమ్ము గణపయ్య
దండ నొకటి వేతు - దయను జూడు
నిండు మనసుతోడ - నిన్ను నే గొల్తురా
అండ నీవె నాకు - ననిశ మిందు
*
3412 పాదములు -
నిండు మనసుతోడ - నిన్ను నే గొల్తురా
అండ నీవె నాకు - ననిశ మిందు
దండ మయ్య నీకు - దండమ్ము గణపయ్య
దండ నొకటి వేతు - దయను జూడు
*
3214 పాద*ములు -
నిండు మనసుతోడ - నిన్ను నే గొల్తురా
దండ నొకటి వేతు - దయను జూడు
దండ మయ్య నీకు - దండమ్ము గణపయ్య
అండ నీవె నాకు - ననిశ మిందు
*
1432 పాదములు -
దండ మయ్య నీకు - దండమ్ము గణపయ్య
అండ నీవె నాకు - ననిశ మిందు
నిండు మనసుతోడ - నిన్ను నే గొల్తురా
దండ నొకటి వేతు - దయను జూడు
*
ఆటవెలది లక్షణాలలో ముఖ్యమైనది - సరి పాదములు కుఱుచ, బేసి పాదములు నిడుద. ఒక నిముసము ఆ నియమమును తొలగిస్తే, ఆటవెలదిని పై నాలుగు విధములుగా మాత్రమే కాక ఇంకను 20 విధములుగా వ్రాయ వీలగును. అనగా మనకు మొత్తము 24 విధములు (4! = 4x3x2x1 = 24) లభిస్తుంది. ఆ అమరికలను క్రింద ఇస్తున్నాను -
*
1234 2341 3412 4123
1243 2431 4312 3124
1324 3241 2413 4132
1342 3421 4213 2134
1432 4321 3214 2143
1423 4231 2314 3142
*
ఇందులోనుండి మచ్చున కొకటి క్రింద -
*
4231 పాదములు - కు/కు/ని/ని -
అండ నీవె నాకు - ననిశ మిందు
దండ నొకటి వేతు - దయను జూడు
నిండు మనసుతోడ - నిన్ను నే గొల్తురా
దండ మయ్య నీకు - దండమ్ము గణపయ్య
*
[12:26 pm, 30/1/2025] Mallapragada Ramakrishna: స్వాగతవృత్తపు ఆవృత్త వృత్తము నవరాగిణి
*
UIUIII UIIUU - స్వాగత వృత్తము
UUIUI IIUIIU - నవరాగిణి
*
స్వాగతము - ర/న/భ/గగ UIUIII UIIUU
11 త్రిష్టుప్పు 443
*
పాడ గీతి రస - భాసురమై రా
పాడుచుందు రహి - వైణికనై రా
పైడి వీణ యిట - పల్కిడునోయీ
నీలవర్ణ రమ-ణీయముగా రా
*
పై వృత్తము నవరాగిణిగా:
*
నవరాగిణి - త/భ/జ/లగ UUIUI IIUIIU
11 త్రిష్టుప్పు 885
*
రా పాడ గీతి - రస భాసురమై
రా పాడుచుందు - రహి వైణికనై
ఈ పైడి వీణ - యిట పల్కిడునోయ్
రా నీలవర్ణ - రమణీయముగా
*
మఱి కొన్ని నవరాగిణులు:
*
నామానసమ్ము - నవమే నభమే
ప్రేమాలయమ్ము - శ్రియమే ప్రియమే
సోమాగ్ని నాకు - సుఖమే శుభమే
ఏమేమొ దల్తు - నిహమే వరమే
*
పూవందు ముల్లు - ముదమా వెతయా
నీవుండ నద్ది - నిధియౌను గదా
భావమ్ము పూవు - పలు రేకులతో
నీవిప్రలంభ - మిది ముల్లు గదా
*
నాచిన్ని పాప - నగుమోము సదా
రోచిస్సుతోడి - ధ్రువతార గదా
ఆచేతులేమొ - యరవిందములే
నాచింతనమ్ము - నవ రాగిణియే
[12:26 pm, 30/1/2025] Mallapragada Ramakrishna: కల్పిత వృత్తము కార్మబ్బు = రమల్ ముసమ్మన్ మఖ్‌బూన్ ఒస్-సద్ర్
*
కార్మబ్బు - స/భ/మ/య/స/గ IIUU IIUU / UIUU IIUU
16 అష్టి 12852
పాదమధ్యములో విరామయతి నియతము.
*
కలయేనా నిజమేనా కానఁగా భావము లేదే
శిలయే నాచెలియేనా చింతతో జీవము లేదే
సడి నీసవ్వడి యేమో జాలమేమో కనరావే
తడి నా యీ కనులంతా తాపమే మోదము లేదే
ప్రణయమ్మో యొక తీరే భావియంతా ఖుసియేగా
మనఁగా నా విరహమ్మే మానినీ మార్గము లేదే
దినమంతా వెలుఁగేగా దీప్తిలో చీఁకటులేగా
వనమంతా విరులేగా వాణిలో గానము లేదే
మలపైఁ జూదఁగ నా కార్మబ్బుతో మించుల తీవల్
ఇలపై వానల నీళ్లే యెందుకో శాంతము లేదే
ఫలితమ్మే కనరాదే భారమౌ నీ పయనమ్మే
అలుపా మోహన నీకా యాశలో శ్వాసము లేదే
*
[12:27 pm, 30/1/2025] Mallapragada Ramakrishna: నెమ్మి కందములు - 781-785
*
మీసముల బొమ్మ మీరే
పూసలతో దండ నుండు - బొమ్మయు నేనే
యాసగ+ పాపయు గీచెను
చూసితిరా చిత్ర కళను - జొక్కెను హృదియే - 781
*
పారెనుగా నీరెఱ్ఱఁగ
ధారలుగా వాన పడెను - దడదడమనుచున్
నీరముపై బాలలు కడు
కోరికతో+ తేల్చినారు - గుంపుగ+ పడవల్ - 782
*
కన్నులు రెండవి చూచును
తిన్నంగా నెదురు నుండు - దృశ్యము లెన్నో
యెన్నఁగ మూడవది తలిది
చెన్నుగఁ గాంచుచును గాచు - శిశువును శివుఁడై - 783
*
ఆకసమున నా చంద్రుఁడు
ప్రాకటముగ+ పెరుఁగు+ తరుగు - ప్రతి రోజు గదా
చీఁకటి వెలుఁగై యింటను
ప్రాకటముగ+ పెరుఁగు శిశువు - ప్రతి రోజు గదా - 784
*
[12:28 pm, 30/1/2025] Mallapragada Ramakrishna: ఆవృత్త తేటగితి
*
UI IIUI UIU UI UI - తేటగీతి-1
UI UUI UIU III UI - తేటగీతి-2
*
తేటగీతి-1
*
రత్నమే, ఱాయి కాదురా - రసిక నేను
యత్నమే చేయి నిచ్చు చే-యనగు వింత
నూత్నమై రాత్రి చిల్కు రా - నును వెలుంగు
పత్నియే నేను నీకు నీ - వలపు చాలు
*
తేటగీతి-2
*
రా రసిక నేను రత్నమే, - ఱాయి కాదు
చేయనగు వింత, యత్నమే - చేయి నిచ్చు
రా నును వెలుంగు నూత్నమై - రాత్రి చిల్కు
నీవలపు చాలు పత్నియే - నేను నీకు
*
[12:29 pm, 30/1/2025] Mallapragada Ramakrishna: రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ గారి శిశువు పద్యములకు నా స్వేచ్ఛానువాదములు. పద్యములను, వాటి అనువాదములను శ్రీ Parimi Sreeramanath గారు నిన్న ప్రచురించినారు.
*
శా. ప్రాతస్సంత్యజ మందిరం, శ్రయ ధనోన్మత్తానవజ్ఞా శతం
మౌనేనాపి సహస్వ, శోషయ తనుం సేవాసు వా మా శుచః।
ఉద్బాహుద్వయముచ్చకైరుపహసన్ లంబాలకం కేవలం
సాయం త్వా మభిగచ్ఛతు ప్రియతమా కక్షావలంబీ శిశుః॥
*
ప్రాతఃకాలమునందు వీడి గృహమున్ - భాగ్యాఢ్యునింజేరి సు-
ప్రీతుం జేయఁగ నెంతయో సహనమున్ - విక్షోభముం బొంది యా
జీతమ్మొంది దినాంతమందు గృహముం - జేరంగ నీభార్యతో+
చేతుల్ చాచి కచమ్ము లాడ, నగు నా - చిన్నారి నిన్ జేరుతన్!
*
మందాక్రాంతము.
డోలా మధ్యే శిశుమభినవైః హాసలేశైర్విలాసాన్
అభ్యస్యంతీమనిమిషదృశా పశ్యతోః సూతిగేహే।
పిత్రోర్మోదం గ్రసతి సహసాభ్యుద్గత ప్రాక్పరా సు-
జ్యేష్ఠాఽపత్య స్మృతిజనిత శుక్ నిష్ప్రతీకార తీవ్రా॥
*
శిశుశార్దూలము.
ఆందోళమ్మున - నందములతో - హాసమ్ము చిందించఁగా+
కందోయిన్ మెల - కాంచిరి గదా - కందున్ మహానందమై
అందావేళను - హా యదురుతో - నాతల్లిదండ్రుల్ మదిన్
ముందే పోయిన - మొల్క చెలువౌ - మోమెందుకో కన్బడెన్
*
సూచన: ఇది శార్దూలవిక్రీడితములో 6,7 అక్షరాలను తొలగించగా వచ్చిన వృత్తము. గణములు: మ/స/న/మ/య/లగ.
UUUII - UIIIU - UUI UUIU దీనికి 8, 7, 10 మాత్రలు. దీని లయ మందాక్రాంతము వంటిది. అందులోని ర/ర/గ కు బదులు ఇందులో త/త/గ. 17 అత్యష్టి 37337
*
రదన ముకుళైః ద్విత్ర్రైర్నూత్నోద్గమాత్ప్రియ దంశనైః
సపది శిశునా మాతా దష్టస్తనీ కృత శీత్కృతిః।
‘కి’మితి సహసా పత్యా పృష్టా, ‘నకించి’దితీక్షణే
నమయతి మనాగోష్ఠోపాంతస్ఖలన్మధుర స్మితా॥
*
హరిణీ.
ననలవలె నా - నవ్యమ్మౌ చిన్న పల్లులతోడన్
జనుమొనల నా-సక్తిన్ జీకన్ సవిత్రి యయో యనన్
జనకుఁడపు డో - జాయా యేమీ స్వరమ్మనగా+ త్రపన్
జనని నగుచున్ - సంతృప్తిన్ మస్తమూఁపెను నవ్వుచున్
*
శా. స్నిహ్యద్బంధు వియోగ శూన్య మనసోర్బాష్పస్ఖలత్ కంఠయోః
దంపత్యోర్యతమానయోర్చతముదైవాన్యోన్య మాశ్వాసనే।
హస్తాభ్యామవలంబ్య జానుయుగతో(?) మాస్ఫాలయన్ పుత్రకః
చక్రే సస్మిత కౌతుకైర్జగదిదం నైకాంతదుఃఖాకులమ్॥
*
నెయ్యమ్మున్ విరజిమ్ము బంధువులు హా - నేఁడిందు లేరాయెనే
అయ్యారే కనులిందు నశ్రుమయమే - యాతల్లి కాతండ్రికిన్
వయ్యారమ్ముగ+ చేత+ కాలినిడి యా - భారమ్ము తగ్గించఁగా
సయ్యాటం జిఱు నందనముగా - సల్పెం గదా బిడ్డయున్
*
శిఖరిణీ.
నిషిద్ధాన్యేవాసౌ పరిమృశతి వస్తూని నచతై
రభగ్నైః సంతుష్యత్యథ హసతి తర్జాసు బహుళమ్।
కథం నిర్వ్యోఢవ్యో గృహవిధిరనేనేతి వివశాం
శిశౌ, పత్నీం పశ్యన్ వికసితముఖో నందతి యువా॥
*
"అసాధ్యుండే తా - నగపడిన దెల్లం గొనునుగా
ప్రశాంతమ్మై వానిన్ - బగులఁగను జేయున్ ముదముతో
రసించంగానౌనే" - రమణి నుడి నాలించుచు+ తా
హసించెన్ నాథుం, డీ - యనుభవము లింటింట నగుఁగా
*
శా.
అంతః పంజర వర్తినశ్శుకశిశో రాలాపనైర్మోహితో
వేగాత్క్రీడనకాని గేహపురతో విక్రేతుకామో వణిక్।
అక్లిష్టాం గృహరంగవల్లి, మవిపర్యస్తం చ వస్తుక్రమం
పశ్యన్నేవ, వహన్నళింద నిహితాం పేటీం పునః ప్రస్థితః॥
*
ఇంటం గీరపు పల్కులన్ వినెఁ గదా - హృద్యమ్ముగా దాను వె-
న్వెంటన్ మోహమున బొమ్మ లమ్మఁ దలఁచెన్ - బేహారి యత్యాశతో+
కంటం గానవు రంగవల్లి చెఱుపుల్ - కల్లోలమై వస్తువుల్
గుంటల్ లేరిట నంచు బుట్ట గొని సాఁ-గుం జింతతో నెండలో
*
[12:30 pm, 30/1/2025] Mallapragada Ramakrishna: నాందీముఖీ, నిర్మల ఆవృత్త వృత్తములు
*
IIIIIIUUIUUIUU - నాందీముఖీ
UIUUIUUIIIIIIU - నిర్మల
*
నాందీముఖీ - న/న/త/త/గగ IIII IIU - UIU UIUU
14 శక్వరి 2368
*
నగవుల సిరులే - నాకు బంధమ్ములేనా
రగిలెడు చితులే - రాకలో నందమౌరా
యిఁగ నిట నిరులం - దేకగా నుంటినోయీ
సుగముల సొగసే - శోకమై నన్ను గ్రుచ్చున్
*
పై వృత్తము నిర్మలగా:
*
నిర్మల - ర/ర/భ/న/లగ UIU UIU - UIII -IIIU
14 శక్వరి 8083
*
నాకు బంధమ్ములే - నా నగవుల సిరులే
రాకలో నందమౌ-రా రగిలెడు చితులే
యేకగా నుంటినో-యీ యిఁగ నిట నిరులన్
శోకమై నన్ను గ్రు-చ్చున్ సుగముల సొగసే
*
నేను నీకే కదా - నిర్మలము తలఁపులే
ధ్యాన మానామమే - ధ్వాంతమున వెలుఁగులో
వానలో నెండలో - బాట నిఁక పయనమే
మౌనమో గానమో - మానసము మధురమే
*
రమ్మురా మోహనా - రాగముల తలఁపుతో
నిమ్మురా నీవు నా - కిష్టమగు వలపునే
సొమ్ము నీ ప్రేమయే - సొంపు నిడు బ్రతుకులో
కొమ్మలో గువ్వలా - కోర్కె యిట మనసులో
*
[12:31 pm, 30/1/2025] Mallapragada Ramakrishna: కల్పిత వృత్తము భగవతి, మాలతి అవృత్త వృత్తములు
*
IIIIUIIUIUIU - మాలతీ
IIUIUIUIIIIU - భగవతీ
*
మాలతీ - న/జ/జ/ర IIII UII - UIUIU
12 జగతి 1392
భగవతీ - స/జ/భ/స IIUI UI - UII IIU
12 జగతి 1964
మాలతీ వృత్తములో 4,4 - 8 మాత్రలు
భగవతీ వృత్తములో 8 - 4,4 మాత్రలు
*
మాలతీ
*
మనసు సదా కను - మంజులమ్ముగా
ప్రణయములో మన+ - పారవశ్యమౌ
కొన యెపుడో నిను+ - కోరుచుందునే
కను మఱుగై చన - కాదు భావజా
*
పై వృత్తము భాగవతిగా:
*
కను మంజులమ్ము-గా మనసు సదా
మన+ పారవశ్య-మౌ ప్రణయములో
నిను+ కోరుచుందు-నే కొన యెపుడో
చన కాదు భావ-జా కను మఱుగై
*
మాలతీ
*
జగములలో+ కొన-సాఁగినవొకో
సుగములతో నిను - జూచుకొందునే
యుగములుగాఁ గన - నొక్క రూపుకై
భగవతిగా విను - ప్రక్క నుండవే
*
పై వృత్తము భగవతిగా:
*
కొనసాఁగినావొ-కో జగములలో
నిను జూచుకొందు - నే సుగములతో
కన నొక్క రూపు-కై యుగములుగా
విను ప్రక్కనుండ-వే భగవతిగా
*
ప్రముదితవదన, ముకుళితకళీకావళి ఆవృత్త వృత్తములు
*
UIUIII IIIUIU - ముకుళితకళికావళి
IIII IIU IUUIU - ప్రముదితవదనా
*
ప్రముదితవదనా - న/న/ర/ర UIUIII - IIIUIU
12 జగతి 1216
*
ప్రముదితవదనా - రహిన్ ధామమే
అమర విలసిత - మ్మగుం బ్రేమమే
సముదమగుఁ గదా - సదా యామమే
అమరు నగవుతో - హలా నామమే
*
పై పద్యము ముకుళిత కళికావళిగా:
*
ముకుళితకళికావళి - ర/న/న/ర UIUIII - IIIUIU (రథోద్ధత వర్గము)
12 జగతి 1531
*
ధామమే ప్రముది-తవదనా రహిన్
ప్రేమమే యమర - విలసితమ్మగున్
యామమే సముద-మగుఁ గదా సదా
నామమే యమరు - నగవుతో హలా
*
రా సఖీ త్వరగ - రజని తప్తమే
భాసమై వఱలె - భవన దీపమే
హాసమే దొరలె - నరయ లోతుగా
వాసిగా మరలు - వలపు కామమై
*
పై పద్యము ప్రముదితవదనగ:
*
త్వరగ రజని త-ప్తమే రా సఖీ
వఱలె భవన దీ-పమే భాసమై
దొరలె నరయ లో-తుగా హాసమే
మరలు వలపు కా-మమై వాసిగా
*
ముద్రాలంకారముతో ముకుళిత కళికావళి:
*
మెండుగా ననలె - మృదులమై వనిన్
దండగా ముకుళి-త కళికావళిన్
నిండుగా+ కురుల - నెలయఁ జేయనా
కండ చక్కెరయె - కళిక తేఁటికిన్
*
*****
ద్రుతవిలంబితపు ఆవృత్త వృత్తము ప్రమితాక్షరము!
*
III UII UII UIU - ద్రుతవిలంబితము
II UIUI IIUIIU - ప్రమితాక్షరము
*
ద్రుతవిలంబితము, ప్రమితాక్షరము రెండింటిలో మొత్తము 16 మాత్రలు. కాని ప్రమితాక్షరములో మాత్రమే మనకు 4 చతుర్మాత్రలు లభ్యము. ద్రుతవిలంబితములో పాదము 7, 9 మాత్రలుగా విఱుగుతుంది.
*
ద్రుతవిలంబితము - న/భ/భ/ర III UII - UII UIU
12 జగతి 1464
*
మమతతోఁ గను-మా మధురమ్ముగా
నమితుఁడై మన-నా మిధునమ్ముగా
సుమములే సొగ-సో మధువాటిలో
ప్రముదమై యిటు - రా ముదమీయఁగా
*
పై ద్రుతవిలంబితము ప్రమితాక్షరముగా:
*
ప్రమితాక్షరము - స/జ/స/స IIU IUI - IIU IIU
12 జగతి 1772
*
మధురమ్ముగా మ-మతతోఁ గనుమా
మిధునమ్ముగా న-మితుఁడై మననా
మధువాటిలో సు-మములే సొగసో
ముదమీయఁగా ప్ర-ముదమై యిటు రా
*
ప్రమితాక్షరములో కందమును గర్భితము చేయ వీలగును. క్రింద ఒక ఉదాహరణము:
*
ప్రమితాక్షరము:
*
ఇది నాకు హాయి - హృదయ మ్మదియో
మధురాబ్ధిలోన - మసలెం బ్రియమై
మృదువైన భావ - మిదియే నిధియే
నిదురించలేను - నిను దల్చుచు నేన్
*
పై ప్రమితాక్షరము కందముగా:
*
ఇది నాకు హాయి హృదయ
మ్మదియో మధురాబ్ధిలోన - మసలెం బ్రియమై
మృదువైన భావ మిదియే
నిధియే నిదురించలేను - నిను దల్చుచు నేన్
*
******
విమలయొక్క ఆవృత్త వృత్తము ప్రభవ
*
చంపకమాలలోని రెండు వంతులు ఈ విమల వృత్తము. దీని ఇతర నామములు కురరీరితా, ప్రమదా, మణికంటక, ధృతి. ఇందులో వరుసగా 4,5, 5,4 మాత్రలు గలవు. దీని ఆవృత్త వృత్తమునకు వరుసగా 5,4, 4,5 మాత్రలు! దీనిని నేను ప్రభవ అని పిలువ దలచినాను. క్రింద వ్రాసిన అన్ని ఉదాహరణములకు రెందు వృత్తముల లక్షణములు ఉన్నాయి.
*
విమలా - న/జ/భ/జ/లగ IIII UIU - IIIU IIU
14 శక్వరి 7088
*
మనసున నుందువే - మమతతో సకియా
కనఁగను మోములో+ - కమలమే కనులా
వినఁగను+ పాడనా - విమల మా చెవులే
దినమున రాత్రిలో+ - తెరువు చూతునుగా
*
పై వృత్తము ప్రభవగా:
*
ప్రభవ - న/భ/భ/స/లగ IIIU IIU - IIII UIU
14 శక్వరి 6072
*
మమతతో సకియా - మనసున నుందువే
కమలమే కనులా - కనఁగను మోములో
విమల మా చెవులే - వినఁగను+ పాడనా
తెరువు చూతునుగా - దినమున రాత్రిలో
*
నభములో శశియున్ - నగవలె నుండెనా
శుభముగా హరుఁడున్ - సొగసున నిండెనా
ప్రభవమౌ నిఁకపై - భగునకు+ ప్రేమమే
విభవమే యిఁకపై - ద్విగుణిత శోభతో
*
పై వృత్తము విమలగా:
*
నగవలె నుండెనా - నభములో శశియున్
సొగసున నిండెనా - శుభముగా హరుఁడున్
భగునకు+ ప్రేమమే - ప్రభవమౌ నిఁకపై
ద్విగుణిత శోభతో - విభవమే యిఁకపై
*
ప్రాసయతితో:
*
వలపను నిప్పులో - శలభమై పడఁగా+
తలఁపులు ధూమ మా - వెలిఁగెడు మంటలో
కులికెడు చంద్రుఁడా - చెలువు చంపునురా
చలనము లేక నే - శిలగా నుండనా
*
పై వృత్తము విమలగా
*
శలభమై పడఁగా - వలపను నిప్పులో
వెలిఁగెడు మంటలో+ - తలఁపులు ధూమమా
చెలువు చంపునురా - కులికెడు చంద్రుఁడా
శిలగా నుండనా - చలనము లేక నేన్
*
+ సంధి గుర్తు
*
*****
ప్రముదితవదన, ముకుళితకళీకావళి ఆవృత్త వృత్తములు
*
UIUIII IIIUIU - ముకుళితకళికావళి
IIII IIU IUUIU - ప్రముదితవదనా
*
ప్రముదితవదనా - న/న/ర/ర UIUIII - IIIUIU
12 జగతి 1216
*
ప్రముదితవదనా - రహిన్ ధామమే
అమర విలసిత - మ్మగుం బ్రేమమే
సముదమగుఁ గదా - సదా యామమే
అమరు నగవుతో - హలా నామమే
*
పై పద్యము ముకుళిత కళికావళిగా:
*
ముకుళితకళికావళి - ర/న/న/ర UIUIII - IIIUIU (రథోద్ధత వర్గము)
12 జగతి 1531
*
ధామమే ప్రముది-తవదనా రహిన్
ప్రేమమే యమర - విలసితమ్మగున్
యామమే సముద-మగుఁ గదా సదా
నామమే యమరు - నగవుతో హలా
*
రా సఖీ త్వరగ - రజని తప్తమే
భాసమై వఱలె - భవన దీపమే
హాసమే దొరలె - నరయ లోతుగా
వాసిగా మరలు - వలపు కామమై
*
పై పద్యము ప్రముదితవదనగ:
*
త్వరగ రజని త-ప్తమే రా సఖీ
వఱలె భవన దీ-పమే భాసమై
దొరలె నరయ లో-తుగా హాసమే
మరలు వలపు కా-మమై వాసిగా
*
ముద్రాలంకారముతో ముకుళిత కళికావళి:
*
మెండుగా ననలె - మృదులమై వనిన్
దండగా ముకుళి-త కళికావళిన్
నిండుగా+ కురుల - నెలయఁ జేయనా
కండ చక్కెరయె - కళిక తేఁటికిన్
*
******
శకుంతల:
గీతి.
తుజ్ఝణ ఆNE హిఅఅం మమ ఉణ కామో దివాపి రాత్రిపి
ణిగ్ధిణ తవేఇ బలిఅం తుఇ వుత్తమణోహర హాఇం అంగాఇం
- అభిజ్ఞానశాకుంతలము, 3.15
సంస్కృత ఛాయ:
తవ న జానే హృదయం మమ పునః కామో దివాపి రాత్రావపి
నిర్ఘృణ తపతి బలీయస్త్వవయి వృత్తమనోరథాన్వంగాని
నా స్వేచ్ఛానువాదము:
గీతి.
ఉదయము రాత్రి తపింతును
హృదయము నిర్ఘృణ యెఱుంగ నిది నిజమే
మదిలో నాశల కేంద్ర
మ్మది నీవే యందు నేను మారాజా
*
దుష్యంతుడు:
గీతి.
తపతి తనుగాత్రి మదనస్వామనిశం మాం పునర్దహత్యేవ
గ్లపయతి యథా శశాంకం న తథాహి కుముద్వతీం దివసః
- అభిజ్ఞానశాకుంతలము, 3.16
*
నా స్వేచ్ఛానువాదము:
గీతి.
ఆమెను దపించె మదనుఁడు
కాముఁడు నన్నో దహించెఁ గద యిటులన్
సోముఁడు మాడ్చె+ కుముద్వతి
నామిహిరునికన్న నెక్కువై వింతన్
*
ఇక్కడ దుష్యంతుడు చంద్రుడు, శకుంతల కలువ భామ.
*
సూచన: గీతిలో పాదపు చివర ఆర్యాగీతి (కందము) కంటె రెండు మాత్రలు తక్కువ.
*****
తెలుగునాడు నీది
తెలుగునాడు నాది
తెలుగు నుడియు మనది
తెలుగు వెలుగు మనదే … పల్లవి
*
తూరుపు కనుమల కొండలనుండి
శ్రీగిరి కానల కోనలవఱకు
నిర్మల్‌నుండి కుప్పంవఱకు
కళింగనుండి పులికాట్‌వఱకు
తెలుగునాడు నీది
తెలుగునాడు నాది
తెలుగు నుడియు మనది
తెలుగు వెలుగు మనదే … 1
*
కృష్ణయు పెన్నయు గోదావరియు
తుంగభద్రయు వంశధారయు
పొంగుచు పరుగిడు సముద్రమునకు
జీవము నొసగెడు నిధు లీ నదులు
తెలుగునాడు నీది
తెలుగునాడు నాది
తెలుగు నుడియు మనది
తెలుగు వెలుగు మనదే … 2
*
తేనెలు పూసిన తీయని పలుకులు
పానము జేయగ నమృతపు చినుకులు
పాటలు మాటలు పన్నీటి యూటలు
పద్యము గద్యము లందపు తేటలు
తెలుగునాడు నీది
తెలుగునాడు నాది
తెలుగు నుడియు మనది
తెలుగు వెలుగు మనదే … 3
*
బుద్ధుని బోధన జాటిన నాడిది
బుద్ధిని తెలివిని బెంచిన నాడిది
గీతము నృత్యము నేర్పిన నాడిది
ప్రీతికి బ్రేమకు గుడియగు నాడిది
తెలుగునాడు నీది
తెలుగునాడు నాది
తెలుగు నుడియు మనది
తెలుగు వెలుగు మనదే … 4
*
చెఱుగని సంస్కృతి జేర్చుచు పోదాం
మఱువక క్రొత్తవి నేర్చుచు పోదాం
మురియుచు శాంతిగ ముందుకు పోదాం
బంగరు భావిని పొందగ పోదాం
తెలుగునాడు నీది
తెలుగునాడు నాది
తెలుగు నుడియు మనది
తెలుగు వెలుగు మనదే … 5
*
ల్పిత వృత్తము వనమోహిని = ముతదారిక్ ముసమ్మన్ మఖ్‌బూన్ ఒస్-సద్ర్
*
తోటకములోని మూడవ స-గణము ఇందులో గగము.
*
వనమోహిని - స/స/త/లగ IIU IIU - UU IIU
11 త్రిష్టుప్పు 796
*
నిజమై భువిపై నీవే కవియా
నిజముం గనఁగా నీవే రవియా
అజరామరమీ యాశాలతలా
సృజనాత్మకమౌ చిత్రా లవియా
వరమీ బ్రతుకా శ్వాసానిలమై
ఇరులే యెపుడా, యిల్లే గవియా
నిఱుపేదగ నానేత్రాశ్రువులే
నెఱ జీవితమా నీవే ఛవియా
కటువీ ధర చీఁకట్లే దినమా
యెటు జూడఁగ నీకీ యాటవియా
ఇట మోహన నీకృత్య మ్మెదియో
చటులోక్తుల భాష్యమ్మే హవియా
*
*****
రాగాల రారాజు త్యాగరాజు
*
మా Frederick, MDలో మార్చి 19, 2006 త్యాగరాజ-పురందరదాస ఆరాధన సందర్భముగా నన్ను మాటలాడమన్నప్పుడు నేను అప్పటికప్పుడే వ్రాసి చదివిన సార్థకనామ గణాక్షర త్యాగరాజ వృత్తము:
*
త్యాగరాజ: త/త/య/గ/ర/ర/జ
*
త్యాగరాజ- త/త/య/త/త/ర/ల
UUI UUI IUU - UUI UUI UIUI
19 అతిధృతి 346213
*
బంగారు సీతమ్మను వేడుం -
బ్రాణాల+ పాదాల నుంచి పాడు
పొంగారు భక్తిం బులకించున్ -
బూజించి శ్రీరాము నెప్పు డెంచు
సంగీత సామ్రాజ్యపు ఱేఁడై -
సంతోష ముప్పొంగ వ్రాయు గీతి
రంగేశు శ్రీరాముని గొల్చున్ -
రాగాల రారాజు త్యాగరాజు
*****
మందాక్రాంతపు ఆవృత్త వృత్తము విరహి
*
UUUU IIIIIU UIU UIU U - మందాక్రాంతము 17 అత్యష్టి 18929
UUU IIIIIU UIU UIU UU - విరహి
*
విరహి - మ/న/స/ర/ర/గగ UUU IIIIIU - UIU UIU UU
17 అత్యష్టి 9465
*
దేవీ ప్రేమము మనసులో - దీపమై ప్రజ్వలించెన్గా
భావావేశము కవితగా - భాసురమ్మై వెలింగెన్గా
జీవానందము నిజముగా+ - చేతనమ్మై చలించెన్గా
నీవే నాకని తలువఁగా - నెమ్మి కన్నుల్ చెమర్చెన్గా
*
దారిద్ర్యమ్మున ధనముకై - తాను వెళ్లెన్ విదేశమ్ముల్
దూరమ్మందున నుడుపమా - త్రోవలోఁ గాంచినావేమో
దారిం జెప్పుము వలపుతో+ - చిక్కి ఖేదాత్మగా నుంటిన్
ఘోరమ్మీ విరహకథయున్ - గొంతులో వెల్గగా నయ్యెన్
*
కోపమ్మొందుచు వరుసముం - గొండపై నుండఁగాఁ జెప్పన్
శాపగ్రస్తుఁడు విరహియై - శాలినిం బాసి యక్షుండే
కూపమ్మందు జనకజ తా+ - కూర్మితోఁ జేసెనో స్నానం
బా పేర్వుం గృహముగఁ గొనెన్ - యక్షుఁ డావేళ రామాద్రిన్
*
దోధకపు ఆవృత్త వృత్తము గగనము
*
UII UII UII UU - దోధకము
IIU IIU IIU UU - గగనము (విష్టంభము)
*
దోధకము - భ/భ/భ/గగ UII UII - UII UU
11 త్రిష్టుప్పు 439
*
రా మనమిక్కడ - రామ యనెన్గా
నా మనమందలి - నామము నీదే
రా మొనగాఁడగు - రాముఁడు వచ్చున్
లే మెనయుంగద - లేమిని బాపన్
*
పై వృత్తమును గగనముగా:
*
గగనము (విష్టంభము) - స/స/స/గగ IIU IIU - IIU UU
11 త్రిష్టుప్పు 220
*
మనమిక్కడ రా-మ యనెన్గా రా
మనమందలి నా-మము నీదేనా
మొనగాఁడగు రా-ముఁడు వచ్చున్ రా
మెనయుంగద లే-మిని బాపన్ లే
*
వనజాక్షుని భా-వనలే నాలో
గుణవంతుని యా - గుడియే నాలో
దినమందున రా-తిరిలో వాఁడే
కనుగొంటిని నా - కతలో వాఁడే
*
చిరకాలపు నా - చెలికాఁడా రా
నెఱ నమ్మితిరా - నిఖిలాధారా
మఱుగెందుకు రా - మధురాధీశా
వరమీయఁగ రా - వర రాధేశా
*
ప్రాసయతితో:
*
గగనస్థలిలో+ - పొగగా మంచే
రగిలించెనుగా - వగలో నిప్పే
యిఁగ యేమగునో - మిగులింకేమో
జగమందున నా - సుగమే లేదో
*
reactions:
1పద్మనాభ వృత్తపు ఆవృత్త వృత్తము కేశవ వృత్తము
*
UUI UUI UUI UUI UUI UUI UUI UU - పద్మనాభ వృత్తము
UIU UIU UIU UIU UIU UIU UIU UU
- కేశవ వృత్తము
పద్మనాభ - (త)7/గగ
UUI UUI UUI UUI - UUI UUI UUI UU
23 వికృతి 1198373
*
రా నన్ను బ్రోవంగ+ ప్రేమమ్ముతో నీవు
ప్రాణమ్ము గావంగ నీవిప్డు దేవా
ఈ మన్నులో జన్మ యీ మన్నులో+ చావు
హేమమ్ము నాకేల నాకాశ లేదో
నామమ్ములన్ గుండెలోనుంతువా యెప్డు
నా మానసమ్మొక్క దేవాలయమ్మౌ
రా మాధవా కేశవా యచ్యుతా స్వామి
రామామణీశా హరీ పద్మనాభా
*
పై పద్యము కేశవ వృత్తముగా:
*
కేశవ - (ర)7/గగ
UIU UIU UIU UIU - UIU UIU UIU UU
23 వికృతి 599187
*
నన్ను బ్రోవంగ+ ప్రేమమ్ముతో నీవు ప్రా-
ణమ్ము గావంగ నీవిప్డు దేవా రా
మన్నులో జన్మ యీ మన్నులో+ చావు హే-
మమ్ము నాకేల నాకాశ లేదోయీ
మమ్ములన్ గుండెలో నుంతువా యెప్డు నా
మానసమ్మొక్క దేవాలయమ్మౌనా
మాధవా కేశవా యచ్యుతా స్వామి రా-
మామణీశా హరీ పద్మనాభా రా
*
నన్ను నీవెందుకో వీడినా విట్టులే
న్యాయమా చెప్పవా నేస్తమా నీవే
వన్నెతో రోజులే పౌర్ణమీ రాత్రులే
వాణిలో పాటలే మ్రోఁగ నిచ్చావే
ఎన్నఁగా నాకు నేకాంతమే తోడుగా
హేయమీ జన్మమే ప్రేమమే లేదే
నిన్న నేఁడాయెనే నేఁడు రేపౌనుగా
నేను నేనే సుమా నిద్రయో రాదే
*
ప్రాసయతితో:
*
ఎందు వీక్షించఁగా నంద మానందమే
బిందువుల్ చేరఁగా సింధువే కాదా
వందగా పక్షులే విందుగా కేకలే
సందెలో వన్నెలే యిందు రారాదా
చిందు నాతేనెలన్+ పొందఁగా+ తుమ్మెదల్
గంధమే గాలిలో నందనమ్మేనా
మంద గానమ్ములే వంద చందమ్ములే
అందమే వానికై మందిరమ్మేనా
*
+ సంధి గుర్తు
*
******
కల్పిత వృత్తము కాలాగ్ని-1,2 = రజౙ్ ముసద్దస్ xxx
*
ఈ ఛందము Persian Metres data base లో కనిపించినది. కాని Metres List లో నాకు కనబడలేదు. చివర IUUకు బదులు IIU తో ఒక ఛందము ఉన్నది.
*
కాలాగ్ని-1 - త/మ/జ/గగ UUIU . UUIU . IUU
11 త్రిష్టుప్పు 325
*
కొండంత నిన్నే కోరినాను గాదా
ఉండంగ నీతో నోర్చినాను గాదా
మెండైన బాధల్ మిక్కుటమ్ము నాలో
పుండైన గుండెన్ మోసినాను గాదా
పూలన్ని నేఁడా ముండ్లెగా కనంగా
కాలాగ్నిలో నే+ కాలినాను గాదా
లీలామయా చాలించు కిన్క నాపై
లోలమ్ముగా నే+ క్రుంగినాను గాదా
నీమోములో నాకెన్ని దర్శనాలో
ప్రేమమ్ముతో నే వేడినాను గాదా
ఈమోహనమ్మౌ పృథ్వి నా వరాలా
నామానసమ్మా నవ్వినాను గాదా
*
కాలాగ్ని-2 - త/మ/జ/లగ UUIU . UUIU . IIU
11 త్రిష్టుప్పు 837
*
కొండంత నిన్నే కోరినాను గదా
ఉండంగ నీతో నోర్చినాను గదా
మెండైన బాధల్ మిక్కుటమ్ము సదా
పుండైన గుండెన్ మోసినాను గదా
పూలన్ని నేఁడా ముండ్లెగా కనఁగా
కాలాగ్నిలో నే+ కాలినాను గదా
లీలామయా చాలించు కిన్క నిటుల్
లోలమ్ముగా నే+ క్రుంగినాను గదా
నీమోములో నాకెట్టి దర్శనమో
ప్రేమమ్ముతో నే వేడినాను గదా
ఈమోహనమ్మౌ పృథ్వి నా వరమే
నామానసమ్మా నవ్వినాను గదా
*
******
వనమయూరపు ఆవృత్త వృత్తము హిహకము
*
UIII UIII UIII UU - వనమయూరము (ఇందువదనా)
IIIU IIIU IIIU UU - హిహికము
*
వనమయూరము (ఇందువదనా) - భ/జ/స/న/గగ
14 శక్వరి 3823
*
రా సమయ మయ్యెఁ గద - రాసమణి వచ్చున్
రా సమము దీనివలె - రాసకము లేదే
రా సముదయమ్ము గన - రంజనము కల్గున్
రా సముఖమందు ఘన - రాజకపు ఱేఁడే
*
పై వనమయూర వృత్తమును హిహికముగా:
*
హిహకము - న/భ/జ/స/గగ IIIU IIIU - IIIU UU
14 శక్వరి 1912
*
సమయ మయ్యెఁ గద రా-సమణి వచ్చున్ రా
సమము దీనివలె రా-సకము లేదే రా
సముదయమ్ము గన రం-జనము కల్గున్ రా
సముఖమందు ఘన రా-జకపు ఱేఁడే రా
*
మనసులో నెపుడు నీ - మధుర రూపమ్మే
దినములో నెపుడు నీ - తెలుఁగు గీతమ్మే
వనమయూరము గదా - వనిత నాట్యమ్మే
కనఁగ రా యిపుడు నా - కనుల పర్వమ్మే
*
కొలనులో కమల మా - కొమరి నేత్రమ్మా
అలలుగా నళికుల - మ్మతివ కేశమ్మా
తలఁపులో+ కవిత లా - తరుణి గానమ్మా
చెలిని జూడంగ నా - చెలువుకే సిగ్గా
*
వలపులో విరహ మీ - బ్రతుకులో చేఁదే
కలయఁగా నగనిచో+ - కల కనం గాదే
శిలయు తా నడచునో - చెలిని గానంగా
నెలుక ప్రాణములతో - హిహక మాటాడున్
(హిహకము = పిల్లి)
*
సూచన + సంధి గుర్తు
*
విధేయుడు - మోహన
****
వృత్త సంఖ్య 2025 తో నూతన వృత్తము హోర
*
హోర - మ/జ/న/స UU UIU - IIII IIU
12 జగతి 2025
*
ఈరోజే గదా యిఱు మొగములతో+
తేరెక్కుం గదా దెరువునఁ బ్రభువై
హోరాధీశ్వరుం డొగి వసుమతిపై
హారమ్మిత్తు నేన్ హరుసపు మణులన్
*
కాలమ్మొక్క చక్రము తిరుగుఁ గదా
యీలోకమ్ములో నిరుసున నెపుడున్
ప్రాలేయమ్ముతో+ పలు వెలుఁగులతో
కేళీరంగమై కెలవుల కిరవై
*
ప్రేమారామమే పృథివి నిజముగా
సోమార్చిస్సులే సుగమొసఁగునుగా
సీమాతీతమై సిరులు కలుగునో
యేమో యెట్టులో యిఁక భవ మిలపై
******
ల్పిత వృత్తము మల్లారి = హజౙ్ ముసమ్మన్ xxx
*
Happy New Year!
*
శ్లోకములు
*
నవసంవత్సరములో
నవమౌ యనుభూతులే
భువియే దివమగునో
భువి యుద్ధపు రంగమో
(న-విపులా)
*
స్మృతియౌనిఁక యీయేఁడే
గతమౌనిది మెల్లఁగా
బ్రతుకందిఁక యేఁడేమో
కత వ్రాయును గ్రొత్తగా
*
నల్లని రాత్రి చూడంగాఁ
దెల్లని హిమ మెల్లెడన్
మెల్లఁగ వచ్చె మెల్లంగా
నుల్ల మలర్చ నబ్దమే
*****
గురులఘువుల దర్పణ సాదృశ్యముతో శ్లోకము
*
*****
చంపకమాల ఆవృత్త వృత్తము సుధా
*
UII UIU III UII UII UIUIU - చంపకమాల
xxx xxx xxx xII UII UIUIU IIII UIU IIIU - సుధా
సుధా - స/స/జ/భ/స/జ/స IIU IIUI UIU - IIII UIU IIIU
21 ప్రకృతి 965980
*
మనమందున నిన్ను దల్తురా - మనగను రమ్మురా మగువతో
క్షణమయ్యె మహా యుగమ్ముగా - కనగను లేవుగా కరుణతో
ప్రణయమ్మున నన్ను ముంతువా - వననిధిలో+ తరంగములుగా
అనయమ్మిట నీవె వెల్గురా - అనుపమ భావ వీచికలుగా
*
చంపకమాల - న/జ/భ/జ/జ/జ/ర IIII UIU IIIU - IIU IIUI UIU
21 ప్రకృతి 711600
*
మనగను రమ్మురా మగువతో - మనమందున నిన్ను దల్తురా
కనగను లేవుగా కరుణతో - క్షణమయ్యె మహా యుగమ్ముగా
వననిధిలో+ తరంగములుగా - ప్రణయమ్మున నన్ను ముంతువా
అనుపమ భావ వీచికలుగా - ననయమ్మిట నీవె వెల్గురా
*****
అనురాగ (చిత్రవేణి) = రమల్ ముసమ్మన్ మష్‌కూల్
*
మానినియొక్క ఆవృత్త వృత్తము హరితకీ లేక అయమానము
*
UII UII UII UII UII UII UIIU - మానిని (మదిరా)
IIU IIU IIU IIU IIU IIU IIUU - హరితకీ (అయమానము)
*
హరితకి ఆయుర్వేదములో ఉపయోగించబడే మందుకు చెట్టు.
*
మానిని (మదిరా) - (భ)7/గ UII UII - UII UII - UII UII - UIIU
22 ఆకృతి 1797559
*
రా నను జూడఁగ - రాణను వేగము - ప్రాణము నీవు బి-రాన సఖీ
హా నిను గోరితి - నానిధి యంటిని - యాణివి నాకిల - నానికయా
ఆ నన వోలెడు - నా నవరాగము - లా నయగారము - లానతి నేన్
లే నను నింపఁగ - లేనగ వంపఁగ - లీనము సేయఁగ - లేనడతో
*
హరితకీ (అయమానము) - (స)7/గ IIU IIU - IIU IIU - IIU IIU - IIUU
22 ఆకృతి 898780
*
పైన ఉండే మానిని వృత్తము అయమానముగా:
*
నను జూడఁగ రా-ణను వేగము ప్రా-ణము నీవు బిరా-న సఖీ రా
నిను గోరితి నా - నిధి యంటిని యా-ణివి నాకిల నా-నిక యాహా
నన వోలెడు నా - నవరాగము లా - నయగారము లా-నతి నేనా
నను నింపఁగ లే-నగ వంపఁగ లీ-నము సేయఁగ లే-నడతో లే
*
అక్షరసామ్య యతితో
*
మురళీధర య-ద్భుత గీతముతో - ముదమీయఁగ సొం-పులతో రా
ధర నిన్నె సదా - తలబోతునురా - ధరణీశ్వర ముం-దర రారా
కరుణామయుఁడా - కరివర్ణుఁడ దు-ష్కర మీబ్రతుకే - కరమీరా
మఱుఁగేల హరీ - మధురాధిపతీ - మధునాశన యీ - మది నీదే
*
ప్రాస యతితో
*
ముదమందున నా - వ్యధలో వరమై - మదిలోఁ గలవా - మధుహారీ
నిధి నీవని స-న్నిధిలో ననఁగా - వదలంగ+ కృ-పాంబుధి మేలో
పద మిచ్చట పా-డెద నిప్పుడు రా - హృది నిండునుగా - హృదయేశా
ఉదయమ్మున నీ - వదనమ్మె గదా - యెద నుండును సం-పదవోలెన్
*
సూచన: + సంధి గుర్తు
*
*****
మంగళమహాశ్రీ ఆవృత్త వృత్తము ప్రభవ
*
UIII UIII UIII UIII UIII UIII UU - మంగళ మహాశ్రీ
IIIU IIIU IIIU IIIU IIIU IIIU UU - ప్రభవ
*
ప్రభవ కూడ మహాశ్రీవలె పంచమాత్రా యుక్తమే!
*
ప్రభవ - న/భ/జ/స/న/భ/జ/స/గగ
IIIU IIIU - IIIU IIIU - IIIU IIIU UU
26 ఉత్కృతి 7829368
*
నభములో నుడుపమా - నదములో+ కనులతో - నవముగా+ కనెదవా నిన్నే
విభవమే యిది గదా - ప్రియముగా నవనిపై - విరులుగా జననమా నాకై
శుభముగా మనికిలో - సుదతితో వలపుతో - సుగముగా జరుగునో యేమో
ప్రభవమా దినము నా - రమణితో యెపుడొ యీ - రజనిలోఁ దెలుపు నాకిప్డే
*
సూచన: + సంధి గుర్తు
*
విధేయుడు -
****
మంజుభాషిణి ఆవృత్త వృత్తము జీవసారము
*
IIUI UIII UIUIU - మంజుభాషిణి
xxxxxxIII UIUIUII UIU - జీవసారము
*
మంజుభాషిణి - స/జ/స/జ/గ IIUI UIII - UIUIU
13 అతిజగతి 2796
*
మది నిండఁగా మధుర-మై వచించుమా
తుది లేదుగా సుధకు+ - తోడుఁ గన్నచో
హృది పొంగఁగా+ పదము - లిందు+ చిందవా
నది రీతిగా ముదము - నాద పూరమో
*
దీనినే ఆవృత్త వృత్తము జీవసారముగా:
*
*
విధేయుడు - మోహన
All reactions:22
****
నర్కుటక వృత్తమునకు ఆవృత్త వృత్తము క్రొవ్విరి
*
నర్కుటక (నర్దటక, కోకిలక) వృత్తము పురాతనమైనది. దీనిని వరాహమిహిరుడు మొదట వాడినట్లున్నది. మాలతీమాధవములో కూడ భవభూతి ఉపయోగించెను. కన్నడములో తొలి వృత్త శాసనము నర్కుటకమే! భాగవతములో మొత్తము శ్రుతిగీత ఈవృత్తములో వ్రాయబడినది. దీనికి చివర IUIU చేరిస్తే మనకు చంపకమాల లభిస్తుంది. బహుశా మాఘుడు దీనిని (ధృతశ్రీ) ఈ విధముగా కల్పించి యుండవచ్చును.
*
IIII UIU III UII UIIU - నర్కుటక
III UII UIIU IIII UIU - క్రొవ్విరి
*
నర్కుటక - న/జ/భ/జ/జ/లగ IIII UIU III - UII UIIU
17 అత్యష్టి 711600
*
వనమున+ కోకిలా వలపు - వాఁడని క్రొవ్విరియే
తనరెడు వానిదే తలఁపు - త్రచ్చిన డెందములో
వినఁగను రాఁడుగా పిలుపు - వీనుల విన్బడదో
కనులిట మెల్లఁగా+ కలలు - కన్బడ మూయవుగా
*
పై పద్యమును క్రొవ్విరిగా:
*
క్రొవ్విరి - న/భ/భ/భ/స/లగ III UII UIIU - IIII UIU
17 అత్యష్టి 48568
*
వలపు వాఁడని క్రొవ్విరియే - వనమున+ కోకిలా
తలఁపు త్రచ్చిన డెందములో+ - తనరెడు వానిదే
పిలుపు వీనుల విన్బడదో - వినఁగను రాఁడుగా
కలలు కన్బడ మూయవుగా - కనులిట మెల్లఁగా
*
నర్కుటకము:
మఱచితి వేలరా మనసు - మానక నీవనెరా
కఱచెడు పాములే కనని - కాముని బాణములే
వెఱపున నుంటిరా వినవు - పిచ్చిగ యోచనలే
తెఱపియు లేదొకో దినము - తీయని బాధ కదా
*
క్రొవ్విరి:
మనసు మానక నీవనెరా - మఱచితి వేలరా
కనని కాముని బాణములే - కఱచెడు పాములే
వినవు పిచ్చిగ యోచనలే - వెఱపున నుంటిరా
దినము తీయని బాధ కదా - తెఱపియు లేదొకో
*
అపురూపమైన వృత్తము నందన వృత్తము!
*
ఈ వృత్తము నాకు తెలిసి పురాతన కావ్యములలో భట్టికావ్యములో మాత్రమే కనిపిస్తుంది. ఈకావ్యము ఏడవ శతాబ్దపు నాటిదని భావన. దీని నడక కొద్దిగా చంపకమాలవలె ఉంటుంది.
*
నందన - న/జ/భ/జ/ర/ర
IIII UIU III UIUIU UIU
18 ధృతి 76720
*
అహృత ఘనేశ్వరస్య యుధి యః సమేతమాయో ధనం
తమహిమతో విలోక్య విబుధైః కృతోత్తమాయోధనమ్
విభవమదేన నిహ్నుతహ్రియాఽఽతిమాత్రసంపన్నకం
వ్యథయతి సత్పథాదధిగతాఽఽథవేహ సంపన్న కమ్
- భట్టికావ్యము (రావణవధ) 10-37
*
యుద్ధములో కుబేరుని సంపదను వశము చేసికొనినాడు; దేవతలతో పోరాటము సలిపినాడు; ధనమదముతో సిగ్గును వీడినాడు; సన్మార్గమునుండి అపహరించిన సంపదలు దూరము చేయును గదా! (ఇది హనుమంతుడు చెప్పినది.) భట్టికావ్యము ఒక లక్షణ గ్రంథము కూడ. ఇక్కడ పాదాంతములో యమకాలంకారమును గమనించండి.
*
Comments
Post a Comment