శ్లో𝕝𝕝    *భిత్వా పాషాణ పిఠరం*
         *ఛిత్వా ప్రాభఞ్జనీ యథా।*
         *పీత్వా పాతాళ పానీయం*
         *కుటజశ్చుమ్బతే నభః॥*

          * సూక్తిసుధానిధిః

తా𝕝𝕝 *కొండమల్లె మొక్క* తన ఎదుగుదలలో అడ్డుపడే బండరాళ్లనుసైతం లెక్కచేయక పెనుగాలను తట్టుకొని పాతాళముయందున్న నీటి అవశేషాలను తన వ్రేళ్లతో గ్రహించి ఆకాశాన్ని తాకాలనే ధ్యేయంతో మొలకెత్తుతుంది.
*జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా ఎదురొడ్డి ఉన్నతస్థానం పొందాలనుకునేవారికి ఇది ఒక స్ఫూర్తినిచ్చేది..

--------------
🌺వ్యసనానంతరం సౌఖ్యం
     స్వల్పమప్యధికం భవేత్ ౹
     కాషాయరసమాస్వాద్య
     స్వాద్వతీవాంబు విందతే ౹౹🌺
(సంగ్రహము )
       వ్యసనాల తరువాత వచ్చే కొంచం ప్రమాణ సౌఖ్యం కూడా విశేషంగా సుఖం అనిపిస్తుంది.చేదైన కషాయం సేవించిన వాడికి నీళ్లు కూడా చాలా రుచిగా అనిపిస్తాయి.
--------------
🌺యథా ధేనుసహస్రేషు వత్సో విదంతి
     మాతరం ౹
     తథా పురాకృతం కర్మ కర్తరామనుగచ్ఛతి ౹౹🌺
      సహస్ర గోవులు ఉన్నా సహా గుంపులోపల దూడ ఎలా తన తల్లిని చేరుతుందో అలా పూర్వం చేసిన కర్మ చేసినవాడిని వెంబడిస్తుంది.
🌺✍🏽

శ్లో𝕝𝕝    *కర్మణా జాయతే భక్తిః,*
         *భక్త్యా జ్ఞానం ప్రజాయతే l*
         *జ్ఞానాత్ ప్రజాయతే ముక్తిః*
         *ఇతి శాస్త్రార్థ సంగ్రహః ll*
           
తా𝕝𝕝 *చిత్తశుద్ధితో చేసే సత్కర్మలవలన భక్తి కలుగుతుంది, నిష్కామభక్తివలన జ్ఞానము కలుగుతుంది. ఆధ్యాత్మికజ్ఞానం వలన మోక్షము సిద్ధిస్తుంది. ఇది శాస్త్ర నిర్ణయము.*

****

శ్లో||    *యత్ర సర్వేsపి నేతారః*
        *సర్వే పండితమానినః |*
        *సర్వే మహత్త్వమిచ్ఛంతి*
        *తత్ర కార్యం వినశ్యంతి ||*

తా||  *ఎచ్చట అందరూ నాయకులు కావాలని ఆరాటపడుదురో, ఎచ్చట అందరూ తమకు తామే పండితులని తలచెదరో, ఎచ్చట అందరూ ఉన్నత స్థానమునే ఆశింతురో అచ్చట పనులు నాశనమగును.*
--------------
🌺తపః పరం కృతయుగే త్రేతాయం 
     జ్ఞానముచ్యతే ౹
     ద్వాపరే యజ్ఞమిత్యూచుః
     దానమేకం కలౌ యుగే ౹౹🌺
        కృతయుగంలో తపస్సు ఉత్తమం,త్రేతాయుగంలో జ్ఞానం ఉత్తమం,ద్వాపరయుగంలో యజ్ఞం శ్రేష్టం.కలియుగంలో దానమే శ్రేష్టం.
---------------
🌺అతిమలినే కర్తవ్యవే భవతి
     ఖలానామతీవా నిపుణా థీః ౹
     తిమిరే హి కౌశికానాం రూపం
     ప్రతిపద్యతే దృష్టిః ౹౹🌺
       అతిగా మలినం అయ్యిన  పని పైన చెడ్డవారి బుద్ధికి ఎక్కువ నైపుణ్యం ఉంటుంది.గుడ్లగూబల కన్నులకు చీకటే ఎక్కువ రూపాన్ని చూసే దృష్టిశక్తి ఉంటుంది.
--------------
🌺వ్యాయామాత్ లభతే స్వాస్థ్యo దీర్ఘాయుష్యo బలం సుఖం ౹
      ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యo సర్వార్థ సాధనం ౹౹🌺

        వ్యాయామం వల్ల ఆరోగ్యం కలుగుతుంది.దీర్ఘాయుష్షు,బలం,సుఖం కలుగుతుంది.ఆరోగ్యమే మహా భాగ్యం.మన దేహానికిప్రతి నిత్యం శిక్షణతో కూడిన వ్యాయామం అత్యవసరం.రక్త ప్రసరణ బాగా జరుగుతుంది


శ్లో𝕝𝕝    *నియతిః కారణం లోకే నియతిః కర్మసాధనమ్।*
         *నియతిః సర్వభూతానాం నియోగేష్విహ కారణమ్॥*

తా𝕝𝕝 కొందరు తాము ఏదో చేశామనుకుంటారు.... కొందరు మేమే దీనిని చేయంచామనుకుంటారు.... ఇద్దరూ భ్రమలోనే ఉన్నారు.... కాని, *ఈ లోకంలో అన్నిటికి కాలమే కారణం.... కాలమే కర్మ సాధనం.... సమస్త ప్రాణికోటిని తమతమ ప్రవర్తనలలో ప్రేరణ కలిగించేది కాలమే....*
--------------
🌺భవంతి భహవో మూర్ఖాః
     క్వచిదేకో విశుద్ధధీః ౹
     త్రాసితోsపి సదా మూరఖైరచలో
     యస్య బుద్ధిమాన్ ౹౹🌺
    (సంగ్రహం )
          మూర్ఖులు ఎక్కువగా ఉంటారు.సద్గుణాలు ఉన్నవారు అపురూపం.మూర్ఖులు బెదరించినా కూడా ఎవరు స్థిరంగా ఉంటారో అతనే బుద్ధిమంతుడు.
--------------
🌺పుస్తకస్థా హి యా విద్యా ధనం యద్వాన్యహస్తగం ౹ నోపకుర్యాజ్జనస్యేహ కార్యకాలే
సముపస్థితే ౹౹🌺

     పుస్తకంలో ఉన్న విద్య అన్యుల చేతిలో ఉన్న డబ్బు మనకి అవసరమున్నప్పుడు సహాయంగా ఉండవు.
---------------
🌺మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం ౹
మనస్యన్యత్వచస్యన్యతత్ కర్మణ్యన్యత్దురాత్మనామ్ ౹౹🌺
      మనస్సులో,మాటలలో, పనిలో అన్నీ మహాత్ములకు ఒకటిగానే ఉంటాయి. మనస్సులో ఒకటి,మాటలలో ఇంకోటి ,పనిలో మరొకటిలా దుర్మాత్ములలో మాత్రం ఉంటాయి.
🌺✍🏾

శ్లో𝕝𝕝   *స జీవతి గుణో యస్య*
        *ధర్మో యస్య స జీవతిl*
        *గుణధర్మవిహీనస్య*
        *జీవితం తస్యనిష్ఫలమ్ll*

                    అజ్ఞాతకవి

తా𝕝𝕝 *సద్గుణాలు కలిగి ఉండి ధర్మాన్ని ఆచరించేవాడి జీవితమే జీవితం.... సద్గుణములు లేక ధర్మాన్ని ఆచరించని వాడి జీవితం వ్యర్థం....*
🙏🙏🙏

🌹అశ్వమేధసహస్రాణి సత్యం చ తులయ ధృతమ్ ౹
అశ్వమేధసహస్రస్య సత్యమేవా తిరిచ్యతే ౹౹ 🌹
         సహస్ర అశ్వమేధ యజ్ఞనములను నిజాన్ని తక్కెట్లో వేసినపుడు సహస్ర అంకె అశ్వమేధాలకన్నా ఎక్కువగా నిజమే తక్కెట్లో తూగుతుంది.
🌺✍🏾

శ్లో𝕝𝕝    *గీతా గఙ్గా చ గాయత్రీ*
         *గోవిన్దేతి హృది స్థితేl*
         *చతుర్గకార సంయుక్తే*
         *పునర్జన్మ న విద్యతేll*

తా𝕝𝕝 ఎవడి మనస్సుయందు ఎల్లప్పుడూ గకారముతో ప్రారంభం అయ్యే ఈ నాలుగూ -
*భగవద్గీతాస్మరణం, గంగానదీస్మరణం, గాయత్రీమంత్రస్మరణం, గోవింద నామస్మరణం చేయబడుతూ ఉంటుందో అట్టివాడికి పునర్జన్మ అనునది ఉండదు.....*
🙏🙏🙏
🌺న బాంధవా న సుహృదో న ధదానిమహాంత్యపి ౹
అలం దారాయితుం శాకాః తమసు గేనిమజ్జతం ౹ 🌺
      ఎక్కువ కష్టంలో వహిక్కుకున్నప్పుడు బంధువులైనా,స్నేహితులైన,చాలా డబ్బు కానీ రక్షించవు.

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ