081.: చం.
పలుకుల మాయ మర్మమదిపాఠ్యము తీరుగనెంచ బుద్ధిగన్
నిలకడనెల్లచెప్పగలనిత్యము సత్యశుభంబుమాటగన్
సలపరితత్వసజ్జనులసంగతినెంచవిధానపరంబు గాకడున్
సులభముగానె యర్థమగు సూరన రాఘవ పాండవీయమే
పూరణ విశ్లేషణ
– పదాల మాయ, అంతర్లీన భావం గ్రహించడానికి చిత్తశుద్ధి, వివేకబుద్ధి కావాలి.
– స్థిరచిత్తంతో చెప్పిన మాటే సత్యమూ, శుభమూ అవుతుంది.
– సజ్జనసంగతి, తత్వవిమర్శ లేకపోతే లోతైన గ్రంథార్థం గ్రహించలేం.
– పైపైకి సులభమై కనిపించినా, లోతైన ద్వ్యర్థరచన గనుక అది గంభీరమైనది.
[26/02, 06:41] Mallapragada Ramakrishna: 082.నేటి న్యస్తాక్షరి*
*సూ ర్య చం ద్ర*
తే. గీ.
సూత్ర దారుల లీలలచూపు మా య
ర్యతలు ఒకరికొకరనక యానతిగను
చoపక చెలిమి గలిగియే చిత్త ముంచ
ద్రవము కాంతినీడ మనసు రమ్యతగను
పద్య విశ్లేషణ
– సృష్టిలో నడిచే కార్యాల వెనుక ఉన్న ఆ దృశ్యరహిత నియంత్రణ (సూత్రధారుల లీలా) మాయామయం.
– పరస్పర గౌరవం, అనుకూలత లేకపోతే సంబంధాలు నిలవవు.
– చంపక పుష్పంలా మృదువైన స్నేహం మనసులో నిలవాలి.
– ద్రవమై మృదువైన హృదయం, కాంతి-నీడల సమతుల్యతలోనే రమ్యత పొందుతుంది.
083.[26/02, 07:05] Mallapragada Ramakrishna: విలువ లేని మాటకి మౌనం మంచిది. విలువ ఇవ్వని మనిషికి దూరం మంచిది
పై మంచిమాటకు చక్కని పద్యం రాయండి. **
మ. కో.
మాటపట్టును గాంచలేకయు మౌన మార్గము తప్పదే
మాటదగ్గర జారగుండగ మంచి యన్నది మేలుగన్
మాట మోహము దాహమవ్వగ మానసంబుగ నేస్తమున్
మాటణమ్మకముంచలేనిచొ
మచ్చ తప్పదు జీవిగన్
భావము
విలువలేని మాటలతో వాదించలేకపోతే మౌనం మంచిది.
మాట వద్ద జారిపోతే మంచిదనిపించినదీ చెడుగా మారుతుంది.
మాటల మీద మోహం పెరిగి హృదయాన్ని దహించితే స్నేహం కూడా నశిస్తుంది.
మాటను నమ్మకంగా నిలబెట్టలేకపోతే జీవితం మీద మచ్చ తప్పదు.
084.[26/02, 10:04] Mallapragada Ramakrishna: దత్తపది *వల బల జల కుల*
దత్తపది పూరణ.. నా ప్రయత్నం
తరళము
వలయు కామ్యము గమ్యమాయగనే వయస్సు సమర్ధతన్
బల మనోకళలే నిజాలమయం ప్రణత్వ సుఖంబుగన్
జలసుధాపరదాహమౌవిధిగాజనాల జపంబుగన్
కులమనేది సకుంపటేయగుటన్ గుణాన వినమ్రతన్
భావము
– మనసు కోరిన లక్ష్యం గమ్యంగా మారాలంటే వయస్సుకన్నా సమర్థత ముఖ్యము.
– నిజమైన బలం శరీరబలం కాదు; మనోబలం, కళా నైపుణ్యం. అవే జీవనసౌఖ్యానికి కారణం.
– దాహం తీర్చేది జలం; అలాగే జనులు జపించే సత్సంగం, సద్భావం మనసుదాహాన్ని తీర్చుతుంది.
– కులం గర్వకారణం కాదు; గుణమే గొప్పది. వినమ్రతే అసలైన వంశపారంపర్యం.
*గమ్యానికి వల అవసరం, జీవనానికి బల అవసరం, హృదయానికి జల అవసరం, గౌరవానికి గుణమే కులం.*
085.[26/02, 10:15] Mallapragada Ramakrishna: కనుమీ నీ నగుమోము మేల్సిరికి లక్ష్యం బౌటకున్ ల
జ్జెనెట్టగ మున్మున్న మునింగి కొండచరిబాటం జారె రేరేడటం
చనుమోదించుట బద్మినీపతి నిజుస్య స్మేర దృష్టి ప్రసా
ర నవోల్లాసిత హ్రీణయై తెలిపెడిన్, రామా! జగన్మోహనా!!
భావము
ఓ రామా! జగన్మోహనా!
నీ సుందరమైన నవ్వు మొహం కనబడగానే, మేలైన లక్ష్యమంతా మరచిపోతున్నాను.
లజ్జతో నిండిన హృదయం ముందుకు సాగలేక, కొండచరియ బాటలో జారిపడినట్టుగా తడబడుతోంది.
పద్మినీపతి (విష్ణుమూర్తి)యైన నీ స్మిత దృష్టి ప్రసాదం ఒకసారి పడగానే, నా మనసు పరవశించిపోతుంది.
ఆ నవ్వు చూపు వల్ల హృదయం ఉల్లాసంతో నిండిపోతూ, సిగ్గు–ఆనందాల మేళవింపుగా నా భావాన్ని వ్యక్తపరుస్తోంది.
086.[26/02, 10:31] Mallapragada Ramakrishna: మ.
సమరoబౌమది నీదుమౌముకళగన్ సమ్మోహనంక్రాంతిగన్
మమదేహంబును య ర్పనంబగుటయిన్ మాధుర్య సేవేమదీ
సముఖంబున్గతి బద్మిణీపతి దిశాస్మేర స్వరా దృష్టిగన్
గమనoబున్ స్థితి నీ దయాఋణముగన్ రామా జగన్మోహనా
భావం
ఓ రామా! జగన్మోహనా!
నీ సమరభూమి (ధర్మరంగం) అంతా నీ మహిమామయ కాంతితో సమ్మోహనమై వెలుగుతోంది.
నా దేహమంతటినీ నీకర్పణంగా సమర్పించుటే నాకు మాధుర్యసేవ.
పద్మినీపతివంటి నీ స్మేర స్వరూప దృష్టి ముందున్న దిశను ప్రసన్నంగా చూపుతోంది.
నా గమనం, నా స్థితి అన్నీ నీ దయా ఋణమే. నేను ఉన్నదంతా నీ కరుణప్రసాదమే.
***
న్యాయమను ధనం ప్రకృతిగా నమ్మకంబు
జయమగు వయస్సు బంధుత్వ జ్ఞాన బిక్ష
బ్రతుకు వంశవిద్య తలపు భాగ్య మివ్వ
గౌరవము పెంచు జీవితం గమ్య గీత
🌿 సమగ్ర భావఓ:: న్యాయం అనే ధనం సహజసిద్ధమైన సంపద. నమ్మకం దానికి మూలధనం. న్యాయం ఉన్న చోట విశ్వాసం నిలుస్తుంది. వయస్సు పెరుగుతుండగా నిజమైన జయం — బంధుత్వం, అనుభవం, జ్ఞానం. జీవితం చివరికి గెలుపు అంటే జ్ఞానభిక్షను పంచడం. మన వంశపారంపర్య విద్య, సంస్కారం — ఇవి బ్రతుకుకు భాగ్యం. తరతరాలకు అందించే సంస్కృతి జీవన వరం. గౌరవాన్ని పెంపొందించే జీవితం — అదే గమ్యాన్ని సూచించే గీత.
జీవితం ఒక గీత అయితే, దాని పల్లవి గౌరవమే.
🌺
తే.గీ :: కడలి పొంగు కలువనది కాంక్ష పరుగు
తుమ్మెద పరిమళం జుర్ర దుడుకు తనము
పువ్వు పులకరింపు కులుకు పుడమి తడుపు
మానవ మృగము కాటుగ మాయ విరుపు
వరుస భావం (క్రమంగా): – పెద్దది చిన్నదిని తనలో కలుపుకొనుట. లయం – సహజ ప్రకృతి ధర్మం. – జీవి తన జీవనార్థం గ్రహించుట. ఆకర్షణ – సహజ చలనం. – పుష్పం రాలి భూమికి ఆహారమగుట. రూపాంతరం – సృష్టి చక్రం. 4️⃣ మనిషి కాటు…– అదే గ్రహణ శక్తి, కానీ చైతన్యంతో కలిసినప్పుడు సృష్టి గానీ, వికృతి గానీ అవుతుంది. 👉 మొదటి మూడు — అజ్ఞాన రహిత సహజ ప్రవాహం 👉 నాల్గవది — సంకల్పంతో కూడిన మానవ ప్రవృత్తి
**
తే.గీ . పాదాది న్యస్తాక్షరి ::ప ర మా త్మ
ఆ.వె.::ప రమ పురుష! గరుడవాహన! భక్తుల
ర క్షకుడవు నీవె బ్రహ్మనాభ!
మా ధవ! హరి! నిన్ను స్మరియింతు నిర్మలా
త్మ! కరుణాకర! వనమాలి! చక్రి!
భావము: బ్రహ్మను నాభియందు కలిగిన ఓ విష్ణుమూర్తి! హరి! నీవు గరుడ వాహనుడవు, మెడలో వనమాలను ధరించిన వాడవు, చేతిలో సుదర్శన చక్రమును ధరించిన వాడవు, ఉత్తమోత్తముడవు, భక్తుల రక్షకుడవు, కరుణాకరుడవు, నిర్మలాత్ముడవు, నిన్ను భక్తితో స్మరించెదను.
[18:00, 17/02/2026] Mallapragada Ramakrishna:
మనుజ మనోభవంబుగతి మార్గము జూపెడి కాల నిర్ణయం
మనుసగుమాయనీడలగు మార్పుల వైనము కామ్య సంభవం
మనుటసుఖంబుదోచుటయుమాన్యమహా మధురంబు మోహనం
మనమనునేస్తమేబ్రతుకుమాలనిజంబు శుభంబు తీవ్రతం
పద్య భావ విశ్లేషణ:: – మనిషి మనస్సులో పుడే సంకల్పమే అతని గమనాన్ని నిర్ణయిస్తుంది.కాలమే దానికి దిశా నిర్దేశకుడై మార్గాన్ని చూపుతుంది.అంటే — మనోభావమే విధి బీజం . – మనసే మాయనీడ. అది మార్పుల మూలం. కామనల వల్ల కలిగే సంభవాలన్నీ ఈ మాయామనస్సు నుంచే ఉద్భవిస్తాయి. – మనసు సుఖమిచ్చినట్లు కనిపిస్తుంది; కానీ అదే దోచుకుంటుంది. మధురంగా, మోహనంగా కనిపించే అనుభవాల వెనుక ఆకర్షణ-బంధనం దాగి ఉంటుంది. – “మనమే మనకు నేస్తం” అన్నది మీ సారాంశ బోధ. బాహ్య ఆధారాల కంటే అంతర స్వచ్ఛతే నిజమైన శుభం.ఆత్మసాక్షాత్కార తీవ్రతే జీవన మాలిక.
***
ఉ.
ఊహల తీరునుండగను నుత్సవమేమది లక్ష్యమేయగున్
దేహము తత్త్వమేయదియు దివ్య బలంబగు దీక్ష మార్గమున్
దాహము దీర్చకాలమదియు దాపరి లేకయు హృద్య మర్పణన్
మోహము నుల్లముల్లగల మోక్షము యుండయె జీవనంబుగన్
పద్య భావ విశ్లేషణ :: – ఊహల తీరంలో నడుస్తూ ఉంటే జీవితం ఒక ఉత్సవంలా కనిపిస్తుంది. కానీ ఆ ఉత్సవం వెనుక నిజమైన లక్ష్యం ఏమిటి? — ఇదే మీ ప్రశ్న.భోగానుభవమా? లేక బోధానుభవమా? – దేహమే తత్త్వం కాదు; అది సాధన సాధనం. దేహం దీక్షతో నడిస్తే దివ్యబలంగా మారుతుంది. అనాసక్తి–నియమాచరణలతో అది యోగమార్గానికి ఉపకరణం. – అంతర దాహం (ఆధ్యాత్మిక తపన) కాలంతో తీరదు. దాపరికం లేకుండా హృదయాన్ని అర్పించినపుడే అది శాంతిస్తుంది. అర్పణభావమే దాహ నివారణ. – మోహం ముల్లులాంటిది; తొలగించకపోతే నొప్పిస్తుంది. మోహక్షయం జరిగిన చోటే మోక్షం మొదలవుతుంది. అప్పుడే జీవితం నిజమైన జీవనం అవుతుంది.
**
[18:31, 17/02/2026] Mallapragada Ramakrishna: చెం.
మనసుగ సమ్మతౌను పరమాత్మ వికాస భవంబు తీరుగన్
గుణము నిమిత్తమే యగుట గుర్తు నివేద్య వినమ్రతే యగున్
వినిమయవిద్యలన్నియువింతగలీనముగాను జుండుటన్
మనమగుమాటతీరగుటమానసధర్మముయాత్మ వైనమున్
పద్య భావ విశ్లేషణ::– మనసు సమ్మతించినపుడే పరమాత్మ వికాసం సాధ్యమవుతుంది.అంతర అనుకూలత లేకుండా భక్తి బాహ్యాచరణగా మిగిలిపోతుంది.అంటే — ఆత్మ వికాసానికి మనస్సే ద్వారం. – గుణమే నిజమైన గుర్తింపు. అది నివేదనగా, వినమ్రతగా వ్యక్తమవుతుంది. అహంకారముకాదు — వినయమే గుణంబు – ప్రపంచ జీవనంలో అనేక వినిమయాలు (వ్యవహారాలు, విద్యలు) ఉన్నాయి. కాని అవన్నీ అంతరాత్మలో లీనమైతేనే అవి పరిపక్వం పొందుతాయి. బాహ్యజ్ఞానం అంతరబోధగా మారాలి. – మన మాట మనస్సుతో ఏకీభవించాలి. వాక్కు–మనస్సు–ఆత్మ ఏకత్వమే మానసధర్మం. అదే ఆత్మస్వరూప వైఖరి.
***
చెం.
మకతిక మానమానవతిగన్ శుభ సంబరమౌను సఖ్య మే
థకళలు సూత్రయవ్వనముథా కిడితీరు విధాన మౌనమే
నకనక యాకలేమరుపు నాట్యముతగ్గుతదిక్కు యేకమౌ
ముఖపరశాంతికామ్యమగు ముఖ్య మదంబునుమాపు తీరుగన్
భావం ::మానము (అహంభావం) తగ్గి, మానవత పెరిగినపుడు దంపతుల మధ్య సఖ్యత వికసిస్తుంది. ఆ సఖ్యతే గృహంలో శుభసంబరంగా మారుతుంది. జీవితంలోని కలకలాలు, యవ్వనోద్రేకాలు, అలుకలు — ఇవి మౌనం, సహనం, పరస్పర అవగాహనతో సమతుల్యమవాలి. ఆకాంక్షలు, మరుపులు, చిన్న చిన్న అభిమానం–అభిమానం ఘర్షణలు తగ్గినపుడు జీవితం (దిక్కు) ఏకదిశగా, స్థిరంగా సాగుతుంది. చివరికి, దాంపత్య మదము — స్వామిత్వ భావం, “నేనే” అనే గర్వం — ఇవి తగ్గినపుడే ముఖపరశాంతి (బయటి ప్రశాంతత) నిజంగా సాధ్యమవుతుంది.
ఉ.అక్షరమౌను యుద్ధమది ఆశ్రిత సంస్కృతి వెంట పోరుగన్
అక్షర దాహమేవిధిగ ఆకలి యంతము చేయతీరుగన్
అక్షర లీల యెత్తులకు సాక్షిత మానము మౌనమేయగున్
అక్షర తత్త్వమేబ్రతుకు ఆరనియగ్నిగ జీవనంబుగన్
🌿 సమగ్ర భావ విశ్లేషణ :: ::అక్షరం (రచన, వాక్యరూప సత్యం) ఒక యుద్ధభూమిలాంటిది. సంస్కృతి, విలువలు, ఆలోచనాశైలులు — ఇవన్నీ అక్షరాల ద్వారానే పోరాడుతాయి. అక్షరం ఒక సంస్కృతికి ఆయుధం. జ్ఞానదాహం ఉన్నంతవరకు అక్షరసాధన ఆగదు. ఆత్మాకలి తీరే వరకు రచన కొనసాగుతుంది. అక్షర క్రీడల శిఖరాలకు చేరినపుడు, మానము (అహంకారం) మౌనమవుతుంది. నిజమైన రచయితకు అహంభావం తగ్గుతుంది. అక్షర తత్త్వమే జీవనాగ్ని. అది ఆరని యజ్ఞాగ్ని వలె నిరంతరం వెలిగే జీవనసాధన.
🌺
ఉ:: చీపురు కట్టదుమ్మును సుచిత్రము శుభ్రము పృద్వి పైనగన్
నోపు శుచీ శుభంబుగను నోర్పుగ నోరుయు విప్పకేయగున్
దీపు కళామయంబు శుభ దివ్యత యందము జూప గల్గగన్
మూపుర భక్తిజూపగల మూలన నున్నను నిత్య యోగ్యతన్
పద్య భావ విశ్లేషణ::– చీపురు దుమ్మును తొలగించి భూమిని శుభ్రం చేస్తుంది. – “సుచిత్రము” అనే పదం కేవలం పరిశుభ్రత కాదు, సౌందర్యాన్ని కూడా సూచిస్తోంది. → బాహ్య శుద్ధి అంతర శుద్ధికి ప్రతీక. – చీపురు నిశ్శబ్దంగా పని చేస్తుంది. – బాధను చెప్పదు, నోరు విప్పదు. → సేవలో వినయం, మౌనం, సహనం — ఇవి సత్య భక్తి లక్షణాలు. – గది శుభ్రంగా ఉంటేనే దీపం అందంగా ప్రకాశిస్తుంది. → హృదయం శుద్ధమైతేనే జ్ఞానదీపం వెలుగుతుంది – మూలన ఉంచబడిన చీపురే శుభ్రతకు కారణం. → ప్రసిద్ధి లేకున్నా, మూలస్థానంలో నుంచే సేవచేసే
భక్తుడే నిజమైన యోగ్యుడు. నేటి దత్తపది బండి ,ఓడ ,రథము విమానము.
ఉ.మాలసహాయ(వోడ)వలెమాధురి సంతస భావమేయగున్
గాళము గాను(బండి)యగు గమ్యమనస్సగు మాయతీరుగన్
మేళము శబ్దమై(రథము)మిధ్య సమంబగు యెల్లవేళలన్
కాలమనే(విమానము) వికాశము జూపుచు విశ్వ వేగమున్
🌿 సమగ్ర భావ వరుస 1️⃣ ఓడ (మాలసహాయ వోడ వలె…)“మాలసహాయ వోడ” — జీవనసముద్రంలో సహాయక నావ. మాధుర్యం, సంతసం — ఇవి మనస్సుకు తేలికనిస్తాయి. అంటే, అనుబంధం జీవనాన్ని తేల్చే ఓడవంటిది. 2️⃣ బండి (గాళము గాను బండి యగు…) బండి నేలమీద నడుస్తుంది — నెమ్మదిగా, స్థిరంగా. మనస్సు గమ్యం వైపు సాగాలి; మాయ తొలగాలి. బండి జీవన ప్రాయోగికతకు చిహ్నం. 3️⃣ రథము (మేళము శబ్దమై రథము…) రథయాత్రలో శబ్దం, ఘనత ఉంటుంది. కానీ అది మిధ్యసమం — తాత్కాలికం. అంటే, బయటి ప్రదర్శనలన్నీ నశ్వరమే.
4️⃣ విమానము (కాలమనే విమానము…) కాలమే అసలైన విమానం. ది విశ్వవేగంతో మనలను ముందుకు తీసుకెళ్తుంది. వికాసం కాలప్రవాహంతోనే.
🌺
[16/2 7:01 AM] Mallapragada Sridevi: మల్లాప్రగడ...పూరణ
సమస్య:దత్తపది, మామిడి,నేరేడు,నారింజ,జామ
మత్తేభము:
విధిగా మా మిడి జ్ఞానమే బ్రతుకుగాన్ విశ్వాస వైనంబుగన్
తిధి నే రేడుకనాయమావశమగున్ తీవ్రంబు విశ్వంబుగన్
మది నారిo జగమంతటన్ శుభముగాన్ మానంబు యానందమూన్
నిధి జామమ్ముల తృప్తియే నిరువుగా నిర్వాహ ప్రేమంబుగన్
భావం ::జ్ఞానమే జీవనానికి పునాది; విశ్వాసమే దానికి నిలువు దిక్కు . కాలంలో వెలుగు–చీకట్లు సహజం; వాటిని సమంగా అంగీకరించడమే స్థైర్యం. మనసు మృదుత్వముతో, స్త్రీత్వ మాధుర్యముతో నిండితే జగత్తే సజీవంగా, శుభముగా అనిపిస్తుంది. సుఖ–దుఃఖాల మిశ్రమరుచులను జామకాయల వలె స్వీకరించినపుడే తృప్తి కలుగుతుంది; ఆ తృప్తియే ప్రేమకు సాఫల్యం, జీవనానికి సంపూర్ణత.
[16/2 7:21 AM] Mallapragada Sridevi: శ్రీ గురుభ్యోనమః 🙏
పాదాది న్యస్తాక్షరి - *కా ర్తి క ము*
ఆ.
కాల మాయలన్ని కలువ తీరుగను మూ
ర్తి ప్రభవమగుటయె గీతి చరిత
కళల తీరు జీవి కథల రాత బతుకు
మునక తేల వయసు మరల మరల
భావం.
కాలమనే మాయలు ఎన్నో ఉంటాయి; అవి కలువ పువ్వుల వలె వికసించి క్షీణిస్తాయి.
మూర్తి (దైవస్వరూపం) ప్రభవమే గీతల చరిత్రగా నిలుస్తుంది.
కళల తీరు జీవి కథల రూపంలో బ్రతుకును వర్ణిస్తుంది.
మునకతేలే వయసు మరల మరల అనుభవాల ద్వారా పక్వమవుతుంది.
(కాలం మారుతుంది, మాయలు మారుతాయి;కానీ దైవస్వరూప సత్యం, కళారూప జీవనగాథ,
అనుభవాల పునరావృతితో పక్వమయ్యే జీవితం )—
****
ఆ.వె.
ప రమ పురుష! గరుడవాహన! భక్తుల
ర క్షకుడవు నీవె బ్రహ్మనాభ!
మా ధవ! హరి! నిన్ను స్మరియింతు నిర్మలా
త్మ! కరుణాకర! వనమాలి! చక్రి!
భావము:
బ్రహ్మను నాభియందు కలిగిన ఓ విష్ణుమూర్తి! హరి! నీవు గరుడ వాహనుడవు, మెడలో వనమాలను ధరించిన వాడవు, చేతిలో సుదర్శన చక్రమును ధరించిన వాడవు, ఉత్తమోత్తముడవు, భక్తుల రక్షకుడవు, కరుణాకరుడవు, నిర్మలాత్ముడవు, నిన్ను భక్తితో స్మరించెదను.
[16/2 7:33 AM] Mallapragada Sridevi: 🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః 🙏
ప్రాంజలి ప్రభ..ఇచ్ఛా.. చందస్సు
- 16/2
పాదాది.. న్యస్తాక్షరి.. వి, శ్వ, ధ, ర్మ
🙏🙏🙏🙏🙏🙏🙏
విలువ బట్టిజీవనమగు విద్య పద వి
శ్వమది కాల ప్రకృతిగాను శాంతి నివ్వ
ధరణి నోర్పు జీవనమగు ధ్యాన విధి క
ర్మ గతి తీరుసఖ్యత కాపురంబు జీవి
భావం వరుసగా —
→ విలువల ఆధారంగా నిలిచే విద్యే నిజమైన స్థానం, గౌరవం ఇస్తుంది.
→ ఈ విశ్వం కాల–ప్రకృతి నియమాలతో నడుస్తూ మనకు శాంతి పాఠం నేర్పుతుంది.
→ భూమి సహనమే జీవనానికి ఆదర్శం; ధ్యానం ఆ సహనాన్ని మనలో పెంచుతుంది.
→ కర్మగతిని సరిగా గ్రహించి సఖ్యతతో నడిస్తే జీవితం ఒక సత్సంసారం అవుతుంది.
*****
[16/2 8:49 AM] Seshaphani Sarma: శివ!మహేశ!
----------------
సీ౹౹
వారణాసిని జేరి వందనమ్మిడ లేను!
"విశ్వనాథా!"యన్న
పిలుపు వినుము!
కాళహస్తిని జేరు కష్టాలు పడలేను!
కాళహస్తీశ్వరా!
కంట గనుము!
శ్రీశైల శిఖరమ్ము చేరుకోలేనయా!
"మల్లికార్జున"!నాదు
మాట వినుము!
రామేశ్వరము జేర రాజాలనయ్యరో!
రామేశ్వరా!నాకు
రక్ష నిడుము!
తే.గీ.
భవహరుండవు నీవెగా!శివ!మహేశ!
శంకరుండవు నీవని సంస్తుతింతు!
చంద్రశాబక ధరుడవు!చల్లగాను,
నన్ను బ్రోవంగ వేడెద!నాగభూష!
-------కోడూరి శేషఫణి శర్మ
: శా ::
సాహో నన్నది భద్రతా భవముగన్ సాధ్యమ్ము యైఖ్యంబుగన్
సాహోసారము ధైర్యవిశ్వసముగన్ సామాన్య సారాంశమున్
సాహోవిద్యల ధర్మ తత్త్వముగనున్ సంఘంబు నిద్దేశ్యమున్
సాహోభావము కాపురంబుమదిగన్ కామ్యార్ధ దేశంబునన్
సరళ భావం:– “సాహో” అనేది భద్రతకు మూలం. ఐక్యత ఉన్నచోటే నిజమైన రక్షణ ఉంటుంది.– సాహసం అంటే ధైర్యం + విశ్వాసం. ఇదే సాధారణ జీవన సారం.– సాహోభావం విద్యల్లోనూ, ధర్మంలోనూ ప్రధాన తత్వం. సంఘం (సమాజం) దిశానిర్దేశం కూడా ఇదే.– గృహంలో సాహోభావం ఉంటే, అది ఇష్టార్థాలను నెరవేర్చే పుణ్యభూమిగా మారుతుంది.
****
శా
Comments
Post a Comment