Sivaratri

[


🎵 కీర్తన రూపం – “ఓ భవహర ఈశ్వరా”

🎶 రాగ సూచన: హంసధ్వని / మోహనం

🎶 తాళం: ఆది తాళం

పల్లవి

ఓ భవహరా! ఈశ్వరా!

పావన పాద! పరమేశ్వరా!

ఓ లయకరా! చిత్తనాయకా!

మమ్మేలు నిత్యం శంకరా!

అనుపల్లవి

పాశమగు నీ శక్తి మవ్యయా

జీవనమే నీ చేత నక్షయా

గమ్యదీపమై వెలుగువా

భక్తి సందీప్త రూపమా!

చరణం 1

వైభవము నీ భస్మధూళియే

కాళయధరా! స్వప్నతీరువే

ఈ భవము నీ యిచ్ఛ కేళియే

నీ దీక్షలే మా ఈలలే

నీలగళ సాన్నిధ్యమే సదా

శ్రీల నీడ సచ్ఛీలమే గదా

ఫాలనయనా! పాపనాశనా!

మేలు నిడి మమ్మేలు ఈశ్వరా!

చరణం 2

ఆయుమకు నర్ధాంగుడైతివే

ఆయువుకు నర్థాంశుడైతివే

మాయమున మా మానసమ్ములో

ధ్యేయమై నిలిచిన నామమే

సఖ్యతిక సౌమ్యమ్ము నీదరే

ముఖ్యమిక కామ్యమ్ము నీదరే

దుఃఖమిక దూరము చేయవే

సౌఖ్యమున మాకివ్వు ఈశ్వరా!

🎼

15/2 2:10 PM] +919849164250: ఉ.మా.

సాగెది కర్మగా భువిన సాక్షిసుగంధము యీశ్వరానిధీ 

మాగెది భూమితీవ్రతగు మానస యాత్రల నీలకంఠునీ

జాగిల లోకలీలకళ జాగృతి విద్యల శూలపాణిగన్ 

యోగిగుణంబుగన్ జగతి యోగ్యత పూజ్యత  చంద్రమౌళిగన్ 

🌺 పద్య భావవ్యాఖ్యానం

ఈ భూమిపై జరిగే ప్రతి కర్మకు సాక్షిగా నిలిచి, సుగంధంలా సర్వత్ర వ్యాపించి ఉండే ఈశ్వరుడే అసలైన నిధి. “సాక్షి” భావం ద్వారా పరమాత్మ సర్వాంతర్యామిత్వం సూచించారు.

మనసు అనుభవించే కఠినయాత్రలలో, భూమిలోని వేడి బాధల మధ్యలో కూడా శరణాగతునికి ఆదరణగా నిలిచే నీలకంఠుడు.ఈ జగత్తు ఒక లీలా. ఆ లీలకు కర్త, కళాకారుడు శూలపాణి (త్రిశూలధారి).అతనే జాగృతి విద్యలను ప్రసాదించేవాడు — అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానదాత. యోగిగుణంబుగన్ జగతి యోగ్యత పూజ్యత చంద్రమౌళిగన్ యోగుల గుణస్వరూపుడై, జగత్తుకు యోగ్యత (సామర్థ్యం), పూజ్యత (గౌరవం) ప్రసాదించేవాడు చంద్రమౌళి.

*****

[15/2 2:39 PM] . Mallapragada: సమస్య:

ఉపవాసము సేయుటేల యుక్తము గాదే

కం.

అపవాదులువెన్నంటే

ఉపదేశాలఫలమౌను ఉన్నత భక్తిన్?

నెపమెన్నక నిష్ఠలుగన్

నుపవాసము సేయుటేల యుక్తము గాదే

🌺 సరళ భావం

చుట్టూ అపవాదులు ఎక్కువగా ఉన్నప్పుడు,

కేవలం ఉపదేశాలు చేయడం వల్ల ఉన్నతమైన భక్తి కలుగుతుందా?

లోపాలు చెప్పుకుంటూ, నిష్ఠ లేకుండా ఉంటే,

అలాంటి స్థితిలో ఉపవాసం చేయడం ఎలా యుక్తమవుతుంది?

🌼

[15/2 2:51 PM] . Mallapragada: కం.

నవవిధ భక్తిగ శంభో

భవహర శరభర హరహర భవముక్తీశ్వర్

భవునీకళలేనిజమున్

శివ హర భవ శంకర యన; జేకుఱు నిడుముల్

🌺 సరళ భావం

ఓ శంభో! నవవిధ భక్తి మార్గాలతో నిన్ను ఆరాధిస్తే,

భవబంధాలను తొలగించు హరా! శరభరూపా! భవముక్తీశ్వరా!

భవుని (సంసారాన్ని) నీ కళలేనిదే జయించలేము;

“శివ! హర! భవ! శంకర!” అని జపించినవారికి

సర్వ నిడుములు (బాధలు) తొలగిపోవును.

🌼

[15/2 3:11 PM] . Mallapragada: తే. గీ 

అర్ధనారీశ్వరా శివా యాద్య దేవ

రుద్ర తత్పరాదివ్యాంశ బుద్ది జీవ

భద్ర భవ్యాంశ సర్వాణి భాగ్య దేవ

సర్వ సహజత్వ సాక్షిగ సరయు శువుడు

🌺 సరళ భావం

ఓ అర్ధనారీశ్వరా! ఆద్యదేవుడా శివా!

రుద్రస్వరూపుడా! దివ్యాంశాలతో బుద్ధి, జీవరూపాలకి ఆధారుడా!

మంగళకరమైన, భవ్యమైన సర్వ భాగ్యాల ప్రసాదకుడా!

సర్వ సహజత్వానికి సాక్షిగా, సమత్వ స్వరూపుడవు నీవే.

🌼

[15/2 4:36 PM] +919849164250: శివ దివ్యాంశత యాంజనేయునికళాశీఘ్రoబు నిశ్చేష్టగన్ 

భవగౌరీతనయాగణేశమనసాభద్రంబు విజ్ఞాధిగన్ 

బవుడాసీస్సుల సుబ్రమణ్యకళగన్ ఫాలాక్షు దివ్యాంసగన్ 

రవళీతాండవ కావ్యభావశివుడై రాజ్యంబు వేదాంతమున్



ఈ కవితలో కవి,

ఆంజనేయుడులోని శివదివ్యాంశం వేగవంతమైన శక్తిగా వ్యక్తమవుతుందని చెబుతున్నారు.

గణేశుడు, గౌరీ కుమారుడిగా, మనసుకు మంగళం, జ్ఞానం ప్రసాదించే దేవుడని భావిస్తున్నారు.

సుబ్రమణ్యుడు ఆశీర్వాదాలు శుభఫలాలను అందిస్తాయని సూచిస్తున్నారు.

శివుడు (ఫాలాక్షుడు – మూడవ కన్నుగల దేవుడు) తన తాండవ రూపంలో సృష్టి–లయాలకు కారణుడై, ఈ జగత్తు అనే రాజ్యాన్ని వేదాంత తత్త్వంతో నడిపిస్తాడని భావం.

****

[15/2 8:43 PM] . Mallapragada: 🔹 పద్యం

కవిత యనంగ పద్యములు గద్యములన్ను రచించుటౌనె భా

వవిలసనంబు, లోకహితవర్తనముం ప్రచరింపజేసి కన్

గవవకునుద్దమెట్లటుల గ్రంథ చమత్కృతి నేర్పు పెంపునన్

ప్రవిమలవస్తుతత్త్వమగు భాసిత చేయుట గాక ఆరయున్

🔹 సరళ భావం

కవిత్వం అనేది కేవలం పద్యాలు, గద్యాలు రాయడమే కాదు.

అది భావాల వికాసం.

లోకహితాన్ని బోధించగలిగే విధంగా రచన చేయాలి.

పదచమత్కారం, గ్రంథ నైపుణ్యం, అలంకార నిపుణత పెంపొందించాలి.

కాని అంతకన్నా ముఖ్యమైంది 

పవిత్రమైన వస్తు తత్త్వాన్ని వెలుగులోనికి తేవడం.

అదే నిజమైన కవిత్వ ధ్యేయం.

🔹

[15/2 9:12 PM] . Mallapragada: 🔹 పద్యం 

శివుడే దైవము హృద్యమందు భజనౌ శేఖర్గనేమూర్తిగాన్

శివనామంబగు యూపిరే పరిధిగన్ శీఘ్రంబు విశ్వాసమున్

శివపంచాక్షర మంత్ర జీవనముగా చిత్తంబు మౌనంబుగన్

శివసేనాభవితాభవంబగుటవాశీసాధ్య ప్రేమంబుగన్

🔹 సరళ భావం

శివుడే నా హృదయంలో దైవమై, భజనలో శిఖరమై నిలిచిన మూర్తి.

శివనామమే నా శ్వాస పరిమితి — నిశ్చల విశ్వాసంతో జపించేది.

“నమః శివాయ” అనే పంచాక్షర మంత్రమే నా జీవనం;

అది జపించగా చిత్తం మౌనమవుతుంది.

శివసేనలో భాగమై (అంటే శివభక్తుల వర్గంలో చేరి),

భవభయం తొలగించగల ప్రేమ — అదే సాధ్యం.

🔹


చెం. పద్యం

శివ శివ యన్న దేవగణ చిత్త విపత్తుగ చిత్తుయైననున్

దవడవ ధ్యాన తత్వము సదా శివ లక్ష్యము విశ్వ మాయగన్

అవిరళ శక్తి యుక్తి పరమాత్ముని ధర్మ కృపా కటాక్షమున్

భవిత పరాత్పరాజగము భవ్యతగాను సజీవులాత్మగన్

🌿 భావ వివరణ::  దేవతలు “శివ! శివ!” అని సంభ్రమంతో ఉచ్చరించినప్పుడు వారి చిత్తంలో ఉన్న విపత్తులు క్షణంలో తొలగిపోతాయి. 👉 శివనామస్మరణ — చిత్తశుద్ధి 🔶 ధ్యానం ద్వారా తెలిసేది —ఈ విశ్వమంతా మాయ రూపం ఆ మాయకు అతీతమైన లక్ష్యం — శివతత్వం.👉 ధ్యానం మాయను దాటి పరమార్థాన్ని చూపిస్తుంది.🔶పరమాత్మ శక్తి అవిరళం. ఆయన యుక్తి ధర్మమయం. ఆ కటాక్షమే కృప. 👉 శివ కటాక్షం — శక్తి, ధర్మ, కృపల సమ్మేళనం. 🔶పరాత్పరుడు ఈ జగత్తంతా వ్యాపించిప్రతి జీవిలో ఆత్మస్వరూపంగా ఉన్నాడు.👉 శివుడు బయటనూ —అంతర్నూ🌺

***

మానవుడై సదూషణలు మానస వేదన తీవ్ర తాపమున్

మానము దోచు బుద్ధిగను మగ్గెడి పాపము యేలవైనమున్

ప్రాణము తీయు దోపిడిగ పాలన ధిక్కర కోప వైరమున్

మానెడి లేని రోగ మహిమా కనలేని సుబుద్ధి శంకరా

🌿 భావ వివరణ:: మనిషి స్వభావంలోనే దూషణలు, మనసులో వేదనలు, తీవ్ర తాపాలు నిత్యం.👉 మానవత్వం – అపరిపూర్ణతతో కూడినది. అహంకారం మానాన్ని దోచేస్తుంది బుద్ధి చెడితే పాపంలో మునిగిపోతాడు.  బుద్ధి వికృతి — పాపానికి మూలం. లోభం, దోపిడీ, అధికారం దుర్వినియోగం, కోపం–వైరము — ఇవే సమాజాన్ని కాల్చుతున్న అగ్నులు.  అధర్మ పాలన — ప్రాణహారిణి. ఇవి అన్నీ ఆగని రోగాల్లా వ్యాపిస్తున్నాయి సుబుద్ధి కనబడటం లేదు. అందుకే శంకరా!నీ కటాక్షమే ఔషధం.  శివకృపే మానవ రోగ నివారణం.

🌺

[[06:27, 15/02/2026] Mallapragada Ramakrishna: మ.

భవ తత్త్వంబు శుభాసుభంబగుటయున్ భాగ్యంబు విశ్వాంతరం

జవసత్వంబగు సర్వమాయ మహిబాజాలెన్నొ లోకంబు నన్

భువి దాహంబు నిరంతరం కదలిసంపూర్ణంబు గా జ్ఞానమున్

శివ గౌరీశ్వర శంకరా హరయనన్ జేకూఱు సర్వాపదల్

🌼 సరళ భావం:

ఈ భవజీవిత తత్త్వం శుభమూ, అశుభమూ కలగలిసినదే.

మనకు భాగ్యమని అనిపించేది కూడా విశ్వవ్యవస్థలో ఒక భాగమే.

ఈ లోకం సర్వమాయతో నిండి, అనేక రకాల ప్రభావాలతో కదులుతూ ఉంటుంది.

భూమిపై జీవితం దాహంలా నిరంతరం కదులుతూనే ఉంటుంది — తృప్తి లేని ఆశలతో.

అయితే సంపూర్ణమైన జ్ఞానం కలిగితే,

“శివ గౌరీశ్వర శంకర హర” అని స్మరించినవారికి

సర్వ ఆపదలు తొలగిపోతాయి.

🌺

[06:51, 15/02/2026] Mallapragada Ramakrishna: 🙏🙏🙏🙏🙏🙏🙏

శ్రీ గురుభ్యో నమః 🙏

ప్రాంజలి ప్రభ – ఇచ్ఛా ఛందస్సు (15/2)

పాదాది న్యస్తాక్షరి: లిం – గో – ద్భ – వ


🙏 గురుభ్యో నమః


లింగార్చితాంగ సుమలీల నియంత మాయన్

గోపాలభావిత పత్ని పురోభిగానున్

ద్భవాపసుఖంబగు తీరు భవంబు వైనన్

వప్పాభవాంబుజ సమర్థ వరాల దేవా ॥

🌺 సరళ భావం:

లింగరూపంలో ఆరాధింపబడే, సృష్టి లీలలకు నియంతుడవైన వాడు,

గోపాలభావంతో, పార్వతీదేవిని పురోవైపున ఉంచుకొని వెలసిన వాడు,

జననమరణ చక్రంలో సుఖదుఃఖాలను అనుభవింపజేసే సంసార స్వరూపాన్ని అధిగమింపజేయువాడు,

అపాయాలను తొలగించి, అభవ (మోక్ష) పద్మాన్ని ప్రసాదించగల వరదాత — ఓ దేవా!

“""""07:37, 15/02/2026] Mallapragada Ramakrishna: 🙏 శ్రీ గురుభ్యో నమః 🙏

ప్రాంజలి ప్రభ – ఇచ్ఛా ఛందస్సు (15/2)

పాదాది న్యస్తాక్షరి: లిం – గో – ద్భ – వ

లింగోద్భవాక్షర పరాత్పర తేజోరాశిన్

లోకత్రయాంతర విహార విలోల నేత్రన్

గోవిందవందిత గిరీజామనోల్లసాంగన్

గోచరాగోచర మహత్త్వ విభూతి ధామన్

ద్భవదుఃఖదాహ వినివారక దివ్యమూర్తే

ద్భూతాదిసాక్షి జగదేక నిమిత్త కారణ్

వరదాభయప్రద శివేశ్వర శూలపాణిన్

వందే భవాంబుధి తరంగ వినాశకేశమ్ ॥ 🙏

🌺 సరళ భావం:

లింగోద్భవ స్వరూపిగా పరాత్పర తేజస్సుతో వెలసి,

మూడు లోకాలలో విహరించే,

గోవిందుడుకూడా వందించే, గిరీజామనోల్లాసకరుడైన వాడు;

సంసార దుఃఖదాహాన్ని నివారించే,

సృష్టి స్థితి లయాలకు సాక్షియై నిలిచే,

భవసాగర తరంగాలను శాంతింపజేసే వరద శివుడు —ఆయనకు నా వందనం

****

మహా శివరాత్రి శుభాకాంక్షలు 🙏

🎵 శివ పాహి పాహి (కీర్తన రూపం)

పల్లవి

పన్నగధరుడ! ఈశ్వర! పాహి పాహి!

గరళకంఠ! శంకర! పాహి పాహి!

అనుపల్లవి

పార్వతీవల్లభ! పాదసేవ దీయవే

విశ్వనాథ! ప్రజలకు శేమమొసగవే ॥ పన్నగ ॥

చరణం 1

శివ శివా అని తొలగించు చిక్కులన్ని

హర హరా అని జనులకు హాయి గూర్చు

పురహరా అని పుణ్యఫలము నిచ్చు

ఈశ్వరా అని నిడుములన్ని తీర్చు ॥ పన్నగ ॥

చరణం 2

శివ శివయని మనసారా నిన్ను గొల్వగా

కనులముందు ప్రత్యక్షమౌ శివా!

భక్తుల కోర్కెలన్ని తీర్చు దయామయా

పూజాభిషేకములు గ్రహించు పరమా ॥ పన్నగ ॥

చరణం 3

శివశివాయని పిలువగ శాంతి కలుగు

భవుని భక్తితో కొలువగ భవ్యత వెలుగు

హరుని కీర్తన పాడగ హాయియుగ శక్తి

శంకర నామస్మరణే ప్రసాదించు ముక్తి ॥ పన్నగ ॥

ముగింపు (మధ్యమ కాలం)

మోకరిల్లితిని ముక్కంటి ఎదుట

మంగళదాయక! దయచేయుము నన్ను ॥

పన్నగధరుడ! ఈశ్వర! పాహి పాహి! ॥

***

[07:20, 15/02/2026] Mallapragada Ramakrishna: మహాశివరాత్రి రోజున దారిద్ర్య దహన శివస్తోత్రం పఠిస్తే...............!!

అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం

 దారిద్ర్య దహన శివస్తోత్రం 

 విశ్వేశ్వరాయ నరకాంతక తారణాయ

కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ

కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ

దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ 1

గౌరీ ప్రియాయ రజనీశకళాధరాయ

కాలాంతకాయ భుజగాధిప కంకణాయ

గంగాధరాయ గజరాజ విమర్దనాయ

దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ 2

భక్త ప్రియాయ భవరోగ భయాపహాయ

ఉగ్రాయ దుఃఖ భవ సాగర తారణాయ

జ్యోతిర్మయాయ గుణ నామ సునృత్యకాయ

దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ 3

చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ

ఫాలేక్షణాయ మనికుండల మండితాయ

మంజీరపాద యుగళాయ జటాధరాయ

దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ 4

పంచాననాయ ఫణి రాజ విభూషణాయ,

హేమాంశుకాయ భువనత్రయ మండితాయ

ఆనంద భూమి వరదాయ తమోపహాయ

దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ 5

భాను ప్రియాయ భవ సాగర తారణాయ

కాలాంతకాయ కమలాసన పూజితాయ

నేత్రత్రయాయ శుభ లక్షణ లక్షితాయ

దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ 6

రామ ప్రియాయ రఘునాధ వర ప్రదాయ

నామ ప్రియాయ నరకార్ణవ తారణాయ

పుణ్యేషు పుణ్య భరితాయ సురార్చితాయ

దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ 7

ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ

గీతప్రియాయ వృషభేశ్వర వాహనాయ

మాతంగ చర్మ వసనాయ మహేశ్వరాయ

దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ  8

వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగనివారణం ।

సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనమ్ ।

త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గమవాప్నుయాత్ 9

॥ ఇతి శ్రీవసిష్ఠవిరచితం దారిద్ర్యదహనశివస్తోత్రం సంపూర్ణమ్ ॥                                                             🪷⚛️✡️🕉️🪷

[07:23, 15/02/2026] Mallapragada Ramakrishna: 🚩శివలింగాభిషేకం వివిధ ఫలితాలు🚩

1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. 

2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. 

3 .ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును 

4 .పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు  లభించును. 

5 .ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును 

6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును. 

7 .మెత్తని చెక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును  

8 .మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును. 

9 .తేనెతో అభిషేకించిన తేజోవృద్ది  కలుగును.

10.పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.

11.కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.

12 .రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.

13 .భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.

14 .గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర  ప్రాప్తి కలుగును.

15 .బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.

16 .నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును

17 .అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. 

శివపూజలో అన్న      లింగార్చనకు        ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నాన్ని మెత్తగా రుబ్బి దాంతో లింగాకారానికి లేపనంలాగా రాస్తారు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.

18 మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేస్తే దీర్ఘకాలవ్యాదులు నయమగును.

19 కస్తురి కలిపిన నీటితో అభిషేకం చేస్తే చక్రవర్తి యోగం కలుగును.

20 పసుపు కలిపిన నీటితో అభిషేకం చేస్తే మంగళ ప్రదమగును శుభకార్యాలు జరుగును.

🙏🙏🕉🙏🙏🕉

శివరాత్రి వ్రత నియమాలు క్లుప్తంగా తెలుసుకుందాం

                -వ్రతం ఆచరించేవారికి ఫలం-

     శివరాత్రి వ్రతం నామ సర్వపాప ప్రణాశనమ్ |

     నైతస్మాదధికం కించిత్ ముక్తిముక్తి ప్రదాయకమ్ ||"

శివరాత్రి వ్రతం అన్ని పాపాలను నశింపజేస్తుంది.... ఐహిక భోగాలను [ ఈ లోకంలో సుఖం ] ఆముష్మిక సుఖం [మోక్షాన్ని]  ప్రసాదించడంలో దీనికంటే మించినది మరొకటి లేదు...

   

          శివరాత్రి అనుమతి అనుగ్రహం కోసం

                   ప్రాతః కాల శివప్రార్ధన

   శివరాత్రివ్రతం హ్యేతత్ కరిష్యేऽహం మహాఫలమ్|

   నిర్విఘ్నమస్తు మే చాత్ర త్వత్ప్రసాదాజ్జగత్పతే||"

"ఓ జగత్పతీ! నేను మహా ఫలప్రదమైన ఈ శివరాత్రి వ్రతాన్ని చేస్తున్నాను...నీ అనుగ్రహంతో ఇది ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి కావాలి...."

👉 నిత్య కృత్యాలు ముగించి  శివపూజా విధి ఆచరించాలి

                       !!*//*!!

        👉   పూజ ఎలా చేయాలి

   "స్నాపయేత్పంచగవ్యైశ్చ పంచామృతమయైస్తథా |

   శుద్ధోదకేన చ తతః శివలింగం ముదాన్వితః ||"

          🌻పరమశివుడిని పంచగవ్యాలతో🌻

[ ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రం ] 

✓ పంచామృతాలతో మరియు శుద్ధ జలంతో భక్తిశ్రద్ధలతో అభిషేకించాలి....

   "అక్షతైశ్చ సుగంధైశ్చ పుష్పైర్బిల్వైస్తథైవ చ|

   ధూపైశ్చ వివిధైర్దీపైర్నైవేద్యైశ్చ పృథగ్విధైః||"

✓ అక్షతలు, సుగంధ ద్రవ్యాలు, పుష్పాలు, ముఖ్యంగా బిల్వ పత్రాలతో పూజించి, వివిధ రకాల ధూపాలు, దీపాలు మరియు నైవేద్యాలను సమర్పించాలి....

                        !!*//*!!

     [ ఉపవాసంతో పూజను ఆచరించాలి ]

   న స్నానైర్న చ వస్త్రైశ్చ న ధూపైర్న చ మోదకైః|

   తుష్యామి న తథా పుష్పైర్యథా తత్రోపవాసతః||"

✓ "అభిషేక స్నానాల వల్ల కానీ,వస్త్రాల వల్ల కానీ,ధూప దీప నైవేద్యాల వల్ల కానీ నేను అంతగా సంతోషించను...శివరాత్రి నాడు భక్తితో చేసే 'ఉపవాసం' వల్ల కలిగే సంతోషం నాకు మరి దేనివల్లా కలగదు" అని శివుడు స్వయంగా తెలిపారు....

                      !!*//*!!

       ఉపవాసానికి ప్రత్యామ్నాయాలు

   వ్యాధితైశ్చైవ బాలైశ్చ వృద్ధైశ్చైవ తథైవ చ |

   ఫలమూలాశనైః కార్యమశక్తైర్వ్రతముత్తమమ్ ||"

  ✓    వ్యాధిగ్రస్తులు[రోగులు] చిన్నపిల్లలు, వృద్ధులు మరియు శారీరకంగా ఉపవాసం ఉండలేని వారు [అశక్తులు]పండ్లు, కందమూలాలు లేదా పాలు స్వీకరిస్తూ ఈ ఉత్తమమైన వ్రతాన్ని ఆచరించవచ్చు....

   "నక్తం హవిష్యాన్నమౌదనం వా ఫలం తిలాః క్షీరమథాంబు చైవ|

   పంచ ప్రశస్తాని హవీంషి యాని వ్రతేషు సర్వేషు ఫలప్రదాని||"

✓   ఏ వ్రతంలోనైనా సరే, పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు ఈ ఐదు వస్తువులను స్వీకరించవచ్చు పండ్లు, పాలు, నీరు, నువ్వులు, హవిష్యాన్నం, [ఉల్లి వెల్లుల్లి ఇత్యాదులు లేని సాత్విక ఆహారము]

వీటిని స్వీకరించడం వల్ల వ్రత భంగం కలగదు, పైగా ఫలం కూడా దక్కుతుంది....

                  విశేషమైన పూజలు ఏ విధంగా చేయాలి

   శక్తి ఉన్నవారు 4 మార్లు పూజ చేయవచ్చు 

   👉 చతుర్యామ పూజా ఫలితం

👉 రాత్రిని నాలుగు భాగాలుగా చేసి పూజించడం వల్ల కలిగే ఫలితం:

   ఏవం యః కురుతే భక్త్యా చతుర్యామమపి వ్రతమ్|

   ముక్తిం ప్రాప్నోతి స త్యక్త్వా పునరావృత్తిదుఃఖదమ్||

👉 మహాశివరాత్రి ప్రదోషం సా 06. 10 నుంచి 08.39

👉 మహాశివరాత్రి మొదటి యామం సా6. 10 నుంచి 9.16

👉 మహాశివరాత్రి రెండవ యామం రా9.16 నుంచి 12.21

👉 మహాశివరాత్రి నిశీధి సమయం రా11.57 నుంచి 12.46

👉 మహాశివరాత్రి మూడవ యామం రా12.21 నుంచి 3.27

👉 మహాశివరాత్రి నాల్గవ యామం రా.తె3.27 నుంచి ఉ6.33

ఈ విధంగా ఎవరైతే భక్తితో నాలుగు జాముల పూజను [ చతుర్యామ పూజ ] నిర్వహిస్తారో, వారు సంసార బంధాల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు....

                        !!*//*!!

                👉  భక్తియే ప్రధానం 👈

   "యథా శక్తి చరేద్భక్త్యా వ్రతం మే పరమేశ్వర |

   తుష్యామి న తథా పుష్పైర్యథా భక్త్యా మదుత్తమే ||"

 ✓  "ఓ పరమేశ్వరా! నా శక్తి కొద్దీ [యథాశక్తి]భక్తితో ఈ వ్రతాన్ని ఆచరిస్తాను బాహ్యమైన పుష్ప ఉపచారాల కంటే, మనసులోని భక్తితో నేను త్వరగా మీకు  సంతుష్టుడనవుతాను...."

                     !!*//*!!

                      👉 జాగరణ 👈

   రాత్రౌ జాగరణం కుర్యాత్పురాణశ్రవణాదిభిః |

   నృత్యైర్గీతైశ్చ వాద్యైశ్చ శివతుష్టిక రైర్మునే||"

✓    రాత్రి సమయంలో పురాణ శ్రవణం [శివపురాణం వంటివి] భజనలు,కీర్తనలు మరియు శివునికి ప్రీతికరమైన నృత్య వాద్య విశేషాలతో జాగరణ చేయాలి....

     గీత వాద్యైశ్చ నృత్యైశ్చ పురాణ పఠనైస్తథా|

     నీత్యా జాగరణం కుర్యాత్ శివ ప్రీతికరమ్ మునే||"

✓ భజనలు,శివకథలు వినడం [పురాణ పఠనం]మరియు శివ నామ జపం చేస్తూ సమయాన్ని గడపాలి.... అనవసరమైన మాటలు [లోకాభిరామాయణం] మాట్లాడకూడదు...

          👉  జాగరణ విశేషములు 👈

   "యః పునః శివలింగస్య సన్నిధౌ జాగరమ్ చరేత్|

   తస్య పుణ్యఫలం వక్తుం న శక్యమ్ వర్షకోటిభిః||"

     ఎవరైతే శివలింగం సాన్నిధ్యంలో[ఆలయంలో] రాత్రంతా జాగరణ చేస్తారో, వారి పుణ్యఫలాన్ని వర్ణించడం కోటి సంవత్సరాలకైనా సాధ్యం కాదు....వారు చేసిన జ్ఞాతాజ్ఞాత పాపాలన్నీ భస్మమైపోతాయి....

      👉 పునర్జన్మ రాహిత్యం (మోక్షం) 👈

   " శివాలయ సమీపే తు జాగరం యః కరోతి హి |

   స సర్వ పాప నిర్ముక్తో శివలోకం స గచ్ఛతి||"

  ✓   శివాలయానికి దగ్గరగా ఉండి జాగరణ చేసేవారు సర్వపాపాల నుండి విముక్తులై, మరణానంతరం శివలోకాన్ని చేరుకుంటారు...వారికి పునర్జన్మ ఉండదు...

     పుణ్యక్షేత్రం లో ఉండే వారికి మోక్షం నిశ్చయం

     శివ పూజ ఇంట్లో చేసినా వారు కూడా  శివాలయ దర్శనం చేయాలని అంటారు ఎందుకు???

    👉  శివాలయ దర్శన విశేషం 👈

   "శివాలయసమీపస్థః శివరాత్రిం కరోతి యః|

   స సర్వపాపనిర్ముక్తో గచ్ఛేచ్ఛివపురం ప్రతి||"

 ✓   ఎవరైతే శివరాత్రి పర్వదినాన శివాలయ సమీపంలో ఉండి వ్రతాన్ని ఆచరిస్తారో లేదా ఆలయాన్ని దర్శిస్తారో,వారు సర్వ పాపాల నుండి విముక్తులై శివలోకాన్ని పొందుతారు.....

     👉  శివలింగ దర్శన ప్రభావం 👈

   "దర్శనాన్ముక్తిదం లోకే శివలింగం విశేషతః |

   మహాశివరాత్రౌ తద్దర్శనం కోటిజన్మాఘనాశనమ్ ||"

 ✓ "లోకంలో శివలింగ దర్శనం ముక్తిదాయకం....అందునా మహాశివరాత్రి రోజున ఆలయంలో శివలింగాన్ని దర్శించడం వల్ల కోటి జన్మల పాపాలు నశిస్తాయి....

     ఆలయ నియమాలు అతిక్రమించి ప్రవర్తించ రాదు

     ***

               👉   వ్రత సమాప్తి  👈

   "సంసారక్లేశదగ్ధస్య వ్రతేనానేన శంకర |

   ప్రసీద సుముఖో భూత్వా జ్ఞానదృష్టిప్రదో భవ ||"

 ✓  "ఓ శంకరా! సంసారంలోని కష్టాలతో సతమతమవుతున్న నాపై కరుణ చూపి,ఈ వ్రతం వల్ల ప్రసన్నుడవై నాకు జ్ఞాన దృష్టిని ప్రసాదించు....🧘‍♂️🙏

ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏

✓ భజనలు,శివకథలు వినడం [పురాణ పఠనం]మరియు శివ నామ జపం చేస్తూ సమయాన్ని గడపాలి.... అనవసరమైన మాటలు [లోకాభిరామాయణం] మాట్లాడకూడదు...

          👉  జాగరణ విశేషములు 👈

   "యః పునః శివలింగస్య సన్నిధౌ జాగరమ్ చరేత్|

   తస్య పుణ్యఫలం వక్తుం న శక్యమ్ వర్షకోటిభిః||"

     ఎవరైతే శివలింగం సాన్నిధ్యంలో[ఆలయంలో] రాత్రంతా జాగరణ చేస్తారో, వారి పుణ్యఫలాన్ని వర్ణించడం కోటి సంవత్సరాలకైనా సాధ్యం కాదు....వారు చేసిన జ్ఞాతాజ్ఞాత పాపాలన్నీ భస్మమైపోతాయి....

      👉 పునర్జన్మ రాహిత్యం (మోక్షం) 👈

   " శివాలయ సమీపే తు జాగరం యః కరోతి హి |

   స సర్వ పాప నిర్ముక్తో శివలోకం స గచ్ఛతి||"

  ✓   శివాలయానికి దగ్గరగా ఉండి జాగరణ చేసేవారు సర్వపాపాల నుండి విముక్తులై, మరణానంతరం శివలోకాన్ని చేరుకుంటారు...వారికి పునర్జన్మ ఉండదు...

     పుణ్యక్షేత్రం లో ఉండే వారికి మోక్షం నిశ్చయం      శివ పూజ ఇంట్లో చేసినా వారు కూడా  శివాలయ దర్శనం చేయాలని అంటారు ఎందుకు???

    👉  శివాలయ దర్శన విశేషం 👈

   "శివాలయసమీపస్థః శివరాత్రిం కరోతి యః|

   స సర్వపాపనిర్ముక్తో గచ్ఛేచ్ఛివపురం ప్రతి||"

 ✓   ఎవరైతే శివరాత్రి పర్వదినాన శివాలయ సమీపంలో ఉండి వ్రతాన్ని ఆచరిస్తారో లేదా ఆలయాన్ని దర్శిస్తారో,వారు సర్వ పాపాల నుండి విముక్తులై శివలోకాన్ని పొందుతారు.....

     👉  శివలింగ దర్శన ప్రభావం 👈

   "దర్శనాన్ముక్తిదం లోకే శివలింగం విశేషతః |

   మహాశివరాత్రౌ తద్దర్శనం కోటిజన్మాఘనాశనమ్ ||"

 ✓ "లోకంలో శివలింగ దర్శనం ముక్తిదాయకం....అందునా మహాశివరాత్రి రోజున ఆలయంలో శివలింగాన్ని దర్శించడం వల్ల కోటి జన్మల పాపాలు నశిస్తాయి....

     ఆలయ నియమాలు అతిక్రమించి ప్రవర్తించ రాదు


     ***

రమశివుని మహాశివరాత్రి కైకట్టుగా *శివునికి ఉన్న పేర్లు అచ్చ తెలుగులో ( సంస్కృత నామాలు కాకుండా)...(ఈ పేర్లు మనకు తెలుసా)..ఒకసారి చూడండి......🌈

ముక్కంటి, అరపది మోముల వేలుపు, మినిసిగ దయ్యం , మిత్తిగొంగ, గట్టు విల్తుడు , మిక్కిలి కంటి దేవర, బేసికంటి వేల్పు , వలిమల అల్లుడు, మిన్ను వాకతాలుపు, గుజ్జు వేల్పు తండ్రి, వలరాజుగొంగ, జక్కులరేని చెలికాడు, పునుక తాల్పు , విషపు మేతరి, జన్నంపు వేటగాడు, బుడుత నెల తాల్పు, వెలియాలపోతు రౌతు, ముమ్మన వాలు దాల్పు , అంగమోముల వేల్పు, అగ్గి కంటి, ఎద్దుతత్తడి జోదు ,ఏక దిక్కు , ఏక పొత్తు, ,ఏనుగు తోలుదాల్పు, ఏనుగు రాకాసి గొంగ, కంకటీ కుడు, కాట్రేడు ,గట్టు రాజల్లుడు ,గాముల దొర, గిబ్బడాల్దోర ,గిబ్బ పటాణి రౌతు , చిచ్చరకంటి , చిలువ తాలుపు,చిలువ సొమ్ము జంగమయ్య, జడదారి , జడదాలుపు వేలుపు, జడముడి జంగము, జడల శిక దేవరా , జన్నపు వేటగాడు , జాబిలి తాలుపు ,జాలువా వింటి వాడు, జింకతాల్పు , తిగ కంటి ,తెల్లని దొర, తోలుదాల్పు , దిస మొలవేల్పు, నెలతాల్పు ,నెల దారి , నొసలి చూపు వేల్పు ,బంగారుగట్టు వింటి వాడు, బుడిబుడి తాల్పుడు, బూచులదొర, బూచులరాయుడు, బేసికంటి ,బేసికంటి వేల్పు, మరుగొ oగ ,మరుని సూడు ,మిక్కిలి కంటి సామి ,మిత్తి గొంగ, మిత్తి వేటగాడు, మిను సిగ గలాడు, ముక్కను స్వామి, మూడవ కంటి వేల్పు, మూడు కన్నులయ్య ,మూడు కన్నుల వాడు, మూడు కన్నుల వేల్పు ,విను సిగ దేవర, విన్నుమూలదేవర,  వెన్నెల విరి ధాలుపు ,వేడి కంటి దొర, వేల్పు మల వింటి దొర ,హెచ్చు కంటి దొర, సెగ కంటి,......

సార్థకనామ గణాక్షర వృత్తము "భవహర" * భవహర - భ/య/జ/గ UIII UUI UIU 10 పంక్తి 335 * పావనము నీపాద మవ్యయా, పాశమగు నీశక్తి మవ్యయా జీవనము నీచేత నక్షయా, ఈశభవ నీయుక్తి ఈశ్వరా కావగను రా గమ్య దీపమై, వేషమగు రాభక్తి దీపమై దేవ యిట సందీప్త రూపమై.ఆశ యిది విశ్వాస మీశ్వరా * ఓభవహరా యొప్పిదమ్ముగా, ఓలయకరా చిత్త నేర్పుగా శోభిలుచు రా సుందరమ్ముగా, నీలయపరా చిత్త మీశ్వరా వైభవము నీభస్మ ధూళియే, కాళయధరా స్వప్న తీరుయే ఈభవము నీయిచ్ఛ, కేళియే,ఈలయలు నీదీక్ష ఈశ్వరా * నీలగళ సాన్నిధ్యమే సదా, శ్రీల నీడు సచ్ఛీలమే గదా ఫాలనయనా పాపనాశనా,మేలు నిడి మమ్మేలు ఈశ్వరా * ఆయుమకు నర్ధాంగుఁడైతివే ఆయువుకు నర్థాంశుఁడైతివే, మాయమున నామానసమ్ము లో ధ్యేయమిఁక నీదివ్య నామమే సఖ్యతిక సౌమ్యమ్ము నీదరే ముఖ్యమిక కామ్యమ్ము నీదరే దుఃఖ్యమిక దూరమ్ము నీదరే సౌఖ్యమిక మాకివ్వు ఈశ్వరా

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ