03-05-2026


103..3/05.. సుభాషితమ్ 𝕝
శ్లో𝕝𝕝 మృగమీనసజ్జనానాం తృణజలసన్తోషవిహితవృత్తీనామ్।
లుబ్ధకధీవరపిశునా నిష్కారణవైరిణో జగతి॥

*... భర్తృహరిమహాకవిః …*
తా𝕝𝕝 అడవుల్లో గడ్డి తిని జీవించే లేళ్లు జింకలు, సముద్రల్లో నదుల్లో ఇతర జలాశయాల్లో స్వేచ్ఛగా జీవించే చేపలు - ఇవి ఎవరికీ హాని తలపెట్టవు. వాటి ప్రకృతి ధర్మాన్ని అనుసరించి అవి జీవిస్తుంటాయి. కానీ వేటగాడు, జాలరి వాటికి హాని తలపెడతాడు.
అలాగే ఈ సమాజంలో సజ్జనులు కూడా వారి సహజశైలిలో పరహితం కోరి నిత్యం పరోపకారం చేస్తుంటారు. అయిననూ అటువంటివారికి కీడు తలపెట్టాలని కొందరు దుర్మార్గులు ఉంటారుకదా!

*_సేకరణ: మల్లాప్రగడ_*

సహజ జంతు జల చరాలు సాయ మగును
లేళ్ళు, చేపలు, కీటక తిండి గాను
మనిషి జ్ఞాన వాహిని గాను మంచి మాయ
పరహితం కోరి తనువును పరుల కివ్వ
సరళ భావం :
ప్రకృతిలో జంతువులు, జలచరాలు ఒకదానికొకటి సహాయంగా జీవిస్తాయి. లేళ్లు, చేపలు, కీటకాలు ఇతర జీవులకు ఆహారంగా మారుతూ ప్రకృతి సమతుల్యతను నిలుపుతాయి. అయితే మనిషికి జ్ఞానం అనే ప్రత్యేక వరం ఉంది. ఆ జ్ఞానాన్ని మాయ, స్వార్థం కోసం కాకుండా పరహితం కోసం ఉపయోగించి, అవసరమైతే తన శరీరాన్నికూడా ఇతరుల మేలుకోసం అర్పించగలగడం మానవత్వం యొక్క గొప్పతనమని నమ్మకం.
*****

03-05.2026 నేటి గీతం 

రచన మల్లాప్రగడ

🎵 నడిరేయి వెన్నెల గీతం 🎵

(మీ చందోరూపానికి అనుగుణంగా గేయరూపం)

పల్లవి

నడిరేయి పున్నమి వెన్నెలోమనసంతా మధురిమ వెల్లువోపొదరింటి పూలసుగంధమైప్రేమగీతం పలికెనో ॥నడిరేయి॥

చరణం – 1

హృదయాన కోర్కెలు మేల్కొనిహాసమై వెలిగెను కలలన్నిమృదుభాష పలుకుల జాలువైమల్లెలా పరిమళ మయ్యెనీ

శృతి చెప్పి సన్నటి చూపులైసంతోష రాగమై చేరెనీచెలిమితన మధురిమ చిందులైచిరుజీవితమే నవ్వెనీ ॥నడిరేయి॥

చరణం – 2

జడివాన మబ్బుల చాటునాజాబిలి వెలుగుల జాలువాతెలికోక ముసుగుల అందమేతేనెలై జారెను మౌనమే

తొలిచూపు తాకిన వేళలోతొణికిసలాడె మనోవీణకల్పవృక్షమై కలలన్నీకౌగిలింతై విరిసెనీ ॥నడిరేయి॥

చరణం – 3

మదిదోచి మాయల వెన్నెలైమనసున గీతము నింపెనీరవళించే నాట్యపు అడుగులైరాగమై సాగెను యౌవనం

మనువాంఛ పలికె చిరునవ్వైమమతల దీపమై వెలిగెనీచిరుహాస మోముల కలయికేచిరకాల సౌభాగ్య మయ్యెనీ ॥నడిరేయి॥

చరణం – 4

విధియాట చూపిన వెన్నెలావిరహానికీ సఖియై నిలిచెమువ్వల శబ్దముల రసకేళిమురిపాల గీతమై మారెనీ

సడిఆకు గాలుల సవ్వడీసంగీత స్వరమై వినిపించెనభిసారిక ప్రియవేళలైనవజీవితమే పరవశమే ॥నడిరేయి॥

****

03-05-2026..నేటి కధ

“కూతురి ప్రేమ"*

```

పెద్ద శ్రీమంతుల ఇంట్లో ఇంటి యజమాని చనిపోయారు.

చాలా మంది బంధుమిత్రులు ఇంటికి చేరారు.

ఇంట్లో అందరూ శోక సాగరంలో మునిగిపోయారు.

భార్య,నలుగురు మగ పిల్లలు ఒక ఆడపిల్ల.

భార్యను పిల్లలను కష్ట పడి జీవితంలో ఒక మంచి స్థాయికి తెచ్చి న్యాయంగా సంపాదించినదానితోనే పిల్లలందరిని 

బాగా చదివించి, మంచిస్థితికి వచ్చేలా చేసి, మంచి ఆస్తి చేసి ఇచ్చాడు. ఆడపిల్లకు మంచి సంబంధం మంచి ఇంటికి ఇచ్చి పెళ్ళి చేశాడు...

మృదు స్వభావం ఆయనది. చాలామందికి సహాయం చేసేవాడు. నిజం చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి.

అన్ని పనులు పూర్తి అయ్యాక శవాన్ని ఎత్తుదాం అనుకునే లోపలే, ఒక వ్యక్తి పరిగెడుతూ వచ్చాడు “ఆగండి ఆగండి నేను ఒక విషయం చెప్పాలి” అని అడ్డు వేశాడు. 

ఇలాంటి టైం లో ఏంటి ఇది అని అడిగారు అంతలో ఒక పెద్దాయన ముందుకు వచ్చి ఏమైంది అని అడిగాడు...

ఆయన చెప్పిన మాటకు అందరూ ఆశ్చర్య పోయారు, “నాకు పదిహేను లక్షలు అప్పు ఉన్నాడు” అని చెప్పాడు.

అందరూ గుస గుస మాట్లాడుకున్నారు. తరువాత అందరూ అన్నారు “ఈ కార్యక్రమం అయ్యాక మాట్లాడదాం” అన్నారు పెద్దవాళ్ళందరు 

“లేదు లేదు, ముందు డబ్బుల విషయంలో ఎవరో ఒకరు మాట ఇస్తేనే నేను శవాన్ని తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాను” అని పట్టు బట్టాడు. 

మగపిల్లల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి “డబ్బులు ఇస్తాము అని ఆయనకు మాట ఇవ్వండి,” అని అడిగారు.

అయితే నలుగురూ ఒప్పుకోలేదు. 

అందరికీ చాలా విచిత్రం అనిపించింది. ముందు ఈ పని ఎలా జరగాలి అని పెద్దలందరు చర్చించుకుంటున్నారు.

అలా అలా విషయం లోపల ఉన్న ఆడవాళ్ళ దాకా వెళ్ళింది.

ఇది విన్న ఆ పెద్దాయన కూతురు ఎంతో దుఃఖంలో ఉన్నా ఆమె ఏడుస్తూ బయటికి వచ్చింది. “ఇవి నా తండ్రే నాకు ఇచ్చిన నగలు! ఇవి తీసుకోండి!” అని ఆ పెద్దాయనకు ఇచ్చింది.

“ముందు అంత్యక్రియలు జరగనియ్యండి నా తండ్రికి! మానాన్న మర్యాదకు ఎలాంటి భంగం కలగకూడదు!” అని తన నగలు అన్నీ ఇచ్చేసి ఏడుస్తూ లోపలికి వెళ్ళింది.

అందరూ నగలుతీసుకున్న

వ్యక్తిని తిట్టుకున్నారు.

తరువాత అందరూ దహన సంస్కారాలు ముగించి వచ్చారు.

నగలను తీసుకున్న ఆవ్యక్తి లోపలికి వచ్చి ఒక మూటను చనిపోయిన ఆయన కూతురి ముందు పెట్టాడు,

“తీసుకో తల్లి నీ నగలు, మరియు ఈ పదిహేను లక్షలు!” అని చెప్పాడు. 

అందరూ అశ్చర్యపోయారు, అప్పుడు ఆయన నవ్వి ఇలా అన్నాడు “నిజానికి చెప్పాలంటే... ఆయన నా దగ్గర ఎలాంటి అప్పు చేయలేదు, నిజం చెప్పాలంటే నాకు చాలా అత్యవసర పరిస్థితిలో డబ్బు అవసరమైతే ‘నీకు ఎప్పుడు వీలైతే అప్పుడే ఇవ్వు’ అని ఇచ్చాడు. మళ్ళీ ఇద్దామని అనుకునే లోపే ఆయన చనిపోయారు అని తెలిసి పరుగున వచ్చాను. అయితే ఎవరికి ఇవ్వాలి అని తోచలేదు ఇంతమందిలో ఎవరికి అర్హత ఉంది అని గుర్తించడం కష్టమనిపించింది.

అందుకే ఈ నాటకమాడాను. తీసుకో తల్లీ” అని చెప్పి వెళ్ళిపోయాడు.

తల దించుకున్న నలుగురు కొడుకులు తల ఎత్తలేదు. 

తిథి కర్మలకు కూతురే డబ్బులు ఖర్చుపెట్టి మిగిలిన డబ్బులు అమ్మకు ఇచ్చి భర్త వెంట ఏడుస్తూ వెళ్ళిపోయింది భారమైన హృదయంతో.

మగపిల్లలే కావాలి అని పరితపించేవారు తెలుసుకోవలసిన కథ ఇది.

ఇప్పటి కాలంలో అలా లేదు అందరూ సమానంగా ఉన్నారు. అమ్మాయిలు కూడా అమ్మానాన్నలని ప్రేమిస్తున్నారు వాళ్లకు ఇచ్చే గౌరవం వారికి ఇస్తున్నారు.

  -సేకరణ.

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.ఈ కథలపై మీ అభిప్రాయాలూ 6281190539 వాట్సాప్ లో తెలపండి ఈ ఛానల్ చేరాలనుకున్నవారి పేరు. నెం.చిరునామా తెలపండి ఇది ఆన్ లైన్ పత్రిక 

          ➖▪️➖

03/05/2926.


*తెలుగు రాష్ట్రాల్లో మన దేవాలయాలు వాటి ప్రముఖ్యత -13* 

🛕

*గుంటూరు జిల్లా* 

*మంగళగిరి: పానకాల నరసింహస్వామి*

బెజవాడ నుండి గుంటూరు వెళ్ళే త్రోవలో బెజవాడకు 8 మైళ్ళ దూరములో ఉన్నది మంగళగిరి. ఈ కొండ చరియ మీదనే వేంచేసి యున్నాడు తెలుగునాట సుప్రసిద్ధదైవమైన పానకాల నరసింహస్వామి. ఏనాటి నుండియో యి స్వామి దేశం నాలుగు చెరగుల నుండి తైర్థికులను ఆకర్షిస్తున్నాడు. రైలు స్టేషను దగ్గరే వుంది. ఈ క్షేత్రానికి బెజవాడలోగాని గుంటూరు లో గాని దిగి బస్సు మీద రావడం కూడా సులభమే. దేవస్థానం సత్రాలు మూడున్నాయి. అవికాక లోకల్ ఫండ్ సత్రం ఒక్కటి, వైశ్యుల సత్రమూ, మధ్వుల సత్రము, బ్రాహ్మణ సత్రమూ వున్నాయి.

నరసింహస్వరూపంలో సేవలందుకొనుచున్న యీ నారాయణునకు పానకమంటే పరమ ప్రీతి. సరాసరి తన నోటిలో పానకంలో సగపాలు ఈ స్వామి ప్రసాద చిహ్నంగా భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటాడు. స్వామి త్రాగుచున్నట్టు "గుటగుట" శబ్దం వినిపిస్తుంది. ఈ శబ్దం ఆగేసరికి పానకం వెలికి చిమ్ముతుంది. ఈ అద్భుతం రోజుకు ఎప్పుడో ఒక్కసారి మాత్రమేకాదు, ప్రతీ యాత్రీకునికి జరుగుతూనే ఉంటుంది. ఒక్కచీమ అయినా దరిదాపులలో ఎక్కడా కనిపించదు. ఈ విశేషం వల్లనే యీ దైవం "పానకాలస్వామి"గా ప్రసిద్ధుడయినాడు. 

ఈ క్షేత్ర చరిత్ర బ్రహ్మ వైవర్త పురాణంలో ఉన్నది. "మంగళగిరి" అంటే "శుభప్రదమైన కొండ" అని అర్ధం. ఇది తూర్పుకనుమల వరసలోదే. భారత వర్షంలోని ఎనిమిది మహాస్థలాలలో ఇది ఒకటి అంటారు. భక్తానుగ్రహార్థం స్వామి దీనిని నిజవాసంగా చేసుకున్నాడు. కృతయుగం నుండి పానకాల స్వామి మహిమ వినవస్తున్నది.

దూరానికి యీ కొండ ఏనుగు ఆకారంలో కనిపిస్తుంది. దగ్గరనుంచి యీ కొండ ఒరిగిన ఏనుగునే తలపిస్తుంది. స్థలపురాణం యిలా చెబుతున్నది.

పూర్వం పారియత్రుడనే రాజు. ఆ రాజు కొడుకు 'హ్రస్వశృంగి' అంగవైకల్యంతో జన్మించాడు. దానిని పోగొట్టుకోవడానికి తీర్ధయాత్రలన్నీ తిరిగి తిరిగి చివరకు హ్రస్వశ్చంగి యీ స్థలానికి వచ్చి దేవతల ఆదేశం ప్రకారం మూడేళ్ళు తపోనిష్ఠలో ఉండిపోయాడు. కొడుకు తీవ్రతపోనిష్టకు తండ్రి అలమటించాడు. బుజ్జగించి ఎలాగైనా తీసుకొని వెడదామని కనిపెట్టుకొని యున్నాడు. తండ్రి వెంట హ్రస్వశృంగి ఏనుగువలె ఒదిగి కొండలా మారిపోయాడు. తన శరీరం స్వామికి నివాసమై పోవాలన్నది అతని ఆకాంక్ష. భక్తుని అభిలాష మన్నించి శ్రీ నరసింహస్వామి లక్ష్మీదేవితో సహా అచ్చటనే ఉండిపోయాడు.

తరువాత స్వామి అచ్చట 'నముచి' అనే రాక్షసుడిని తన చక్రంతో సంహరించడం జరిగింది.

ఈ స్వామికి కృతయుగంలో తేనె, త్రేతాయుగంలో నెయ్యి, ద్వాపర యుగంలో పాలు, కలియుగంలో పానకం నైవేద్యమని చెప్పుకుంటారు. ఇప్పటికీ శంఖంతో పానకం స్వామి నోటిలో పోస్తారు. అందులో సగము స్వీకరించి సగము భక్తులకు ప్రసాదముగా అనుగ్రహిస్తాడు. ఈ కొండ ఏనుగు ఆకారంగా ఉంటుంది కదా ఈ గుడి సరిగా ఆ ఏనుగు నోరువలె ఉంటుంది.

ఈ పానకం నోటిలో పోయటమూ, గుటగుట 'శబ్దము' ఈ విశేషము యిలా ఉండగా, ఇంకొక విగ్రహమేదీ యీ కొండమీద లేదు. స్వామి ముఖం మాత్రం అదే కొండలోనే చెక్కబడి ఉండటం మరీ విచిత్రం.

📖

ఇంకొక గాథ. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు తానెంత ధర్మంగా పాలించినా తరించలేక వచ్చి యీ కొండను సందర్శించాడుట. అందువల్ల దీనికి 'తోతాద్రి' అనే పేరు వచ్చినట్లు చెబుతారు.

పూర్వం పాల సముద్రం తఱచినపుడు అందులో నుండి శ్రీమహాలక్ష్మి అవతరించింది. దేవతలు అన్ని పుణ్యనదులూ తీర్థములు తెచ్చి ఒక పుష్కరిణిని నిర్మించారు. శ్రీ మహాలక్ష్మి ఆ పుష్కరిణిలో మునిగి శ్రీమన్నారాయణునికి తనను సమర్పించుకున్నది. ఈ పుష్కరిణి మంగళగిరిలో ఉన్నదంటారు. నేటికీ దానికి 'లక్ష్మీపుష్కరిణి' అనే పిలుస్తున్నారు.

కొండ దిగువన ఇంకొక గుడి ఉన్నది. అది యుధిష్ఠిర ప్రతిష్ట అంటారు. అక్కడకు ఆమడ దూరంలో ఉన్న ఇంద్రకీలాద్రి మీదనే కదా పాశుపతం కోసం అర్జునుని తపస్సు. కిరాతార్జునీయం అక్కడి ముచ్చటే గదా! మంగళగిరికి, బెజవాడకు యి అన్నదమ్ముల సంబంధం విస్పష్టంగా కనిపిస్తోంది. పై లక్ష్మీ నరసింహస్వామినే కొండ దిగువన యుధిష్ఠిరుడు ప్రతిష్ఠించాడు.

ఈ క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి. శ్రీరామ చంద్రునితో వైకుంఠానికి అనుగమించనున్న ఆంజనేయస్వామిని యీ లోక కళ్యాణార్ధమై మంగళగిరిలో ఉండమని ఆయన ఆదేశించాడుట!

📖

శ్రీ చైతన్య మహాప్రభువు (క్రీ. శ1312) ఈ ఆలయాన్ని దర్శించినందుకు నిదర్శనంగా ఆయన పాద చిహ్నాలు, ఆయనపై చెప్పబడిన శ్లోకము నేడు ఈ గుడిలో కానవస్తాయి. శ్రీకృష్ణదేవరాయల శాసనం ఒకటి ఉంది. రాయలు ఈ ఆలయాన్ని దర్శించినట్టు తెలుస్తుంది.

దిగువన ఆలయానికి తూర్పున బ్రహ్మాండమైన గాలి గోపురం ఒకటి కనిపిస్తుంది. అది 170 ఏండ్ల క్రింద అమరావతి ప్రభువు శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయడుగారు కట్టించినది. అది 11 అంతస్తుల గోపురం. ప్రాచీనమైన ఒక రధం ఉంది. భారత భాగవత రామాయణ గాథలు దానిమీద అద్భుతమైన దారు శిల్పంలో ఉన్నాయి. ఫాల్గుణ మాసం లో యిచ్చట 12 రోజులు బ్రహ్మోత్సవం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశీ, శ్రీరామనవమి హనుమజ్జయంతి, నరసింహజ్జయంతి సరేసరి. బ్రహ్మాండమైన గాలిగోపురమూ కొండమీది శ్రీ నరసింహస్వామి ఎంత దూరం నుంచియైనా యాత్రికులను ఆకర్షిస్తుంటాయి. పౌరాణికంగా, చారిత్రకంగా ప్రసిద్ధమైన మంగళగిరి ఆంధ్రదేశం లోని ప్రసిద్ధ దివ్య స్థలాలలో ఒకటిగా పరిగణింపబడుతోంది.

📖

*అమరావతి*

ప్రపంచ శిల్పకళలో ఆంధ్ర శిల్పానికి అమరావతి పర్యాయ పదమై వెలసింది. జగత్ ప్రసిద్ధములైన అమరావతీ బౌద్ధ శిల్పాలు ఆంధ్రశిల్పమనబడే సంప్రదాయానికి సమగ్రలక్ష్యాలుగా నిలిచాయి.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకాకు చెందిన యీ ప్రదేశం "అమరేశ్వరస్వామి”గా ఆరాధింప బడుచున్న శివునికి నిలయమైనందువల్ల కూడా "అమరావతి" అని ప్రసిద్దికెక్కింది.

గుంటూరుకు వాయవ్యదిశలో 20 మైళ్ళ దూరంలో అమరావతి ఉన్నది. బస్సు ప్రయాణం సౌకర్యం వుంది. బెజవాడలో దిగి గుంటూరు వెళ్ళవచ్చు. గుంటూరు నుండి అమరావతికి బస్సులున్నాయి. అమరావతిలో ట్రావలర్స్ బంగళా, కొన్ని సత్రాలు, శాలలూ యాత్రికుల వసతికి ఉన్నాయి.

అమరావతి, దానికి చేరువనే ఉన్న ధరణికోట పూర్వాంధ్ర చక్రవర్తులకు రాజధానులు. పురాతత్వ పరిశోధనకు పనికివచ్చే సామాగ్రి, యిచ్చట కావలసినంత ఉన్నది. మహోన్నతమైన అమరేశ్వరాలయం కృష్ణ ఒడ్డున పడమటి నుండి తూర్పునకు ప్రవహించే ఆ మహా నది ఉత్తర దక్షిణములుగా మరిగిన చోట నిర్మించబడినది. ఎక్కడెక్కడ తన ప్రధాన మార్గంలో నదులు ఇలా మలుపుతిరిగి కొంత మేర ప్రవహిస్తూ ఉంటాయో ఆ ప్రదేశాలు ఆలయనిర్మాణానికి తగిన పరమ పవిత్రస్థలాలుగా పరిగణింపబడుతున్నాయి.

పౌరాణికములూ, చారిత్రాత్మకములూ అయిన గాథలెన్నో ఉన్న ఈ దేవాలయం పుట్టు పూర్వోత్త రాలు నేటికీ విస్పష్టంగా తెలియడంలేదు. కాని ఇచ్చట ఏకాంత స్థితి, పావనత్వమూ, వేలకొలది యాత్రికులను ఈనాటికీ ఆకర్షిస్తూనే ఉన్నది.

🛕

*సశేషం*

03/05/2026..భగవద్గీత 1వ అధ్యాయం 


ఉ. ఎందరు భూసురుల్ కలసి వెల్గుల నెత్తగ జోరుగుండగన్,               

అందరిలోను మిన్నగన నాద్యుగ నీవన విజ్ఞతేయగున్    

సందడి యుద్ధకారణమె సంజయ! యీవిధిఁ జేరగా నగున్ 

గందర గోళమున్ బడితి గావఁగ నాయకు లౌను సైన్యమున్         (07 )


ఉ. కేరున, భీష్మ, కర్ణ, శృత కీర్తి శతానుడు కుంతి భోజడున్ 

వీర వికర్ణ విశ్వస వివేకులు మీరును మాన్యు లేయగున్ 

భూరి శ్రవుండు నీదుసుత భూసుర శ్రేష్ఠులు వీరతేజమున్

వీరులు యేకమై సమయ విద్దెలు గాకురు క్షేత్రయుద్ధమున్            (08)


ఉ. ఇంకను పెక్కుమంది బల హేతుక విద్యల యుద్ధ కౌశ మున్  

జంకక నన్నుఁ గోరి తమ జాడలుఁ దెల్పియు దేహమొడ్డియున్ 

వంకలు లేని యుద్ధకళ వాలుగ సిద్ధముఁ దీరి యుండగన్ 

సంకట మేమిలేకనటు సాయముఁ జేయగ శూర సైనికుల్              (09)


మీ (07), (08), (09) పద్యాల సరళ భావం ఇలా—

(07) పద్య భావం:

అనేక మంది రాజులు, పండితులు కలిసి యుద్ధరంగంలో ప్రకాశిస్తున్నారు.

అందరిలోనూ శ్రేష్ఠులు, ప్రతిభావంతులు ఉన్నారు.

ఓ సంజయా! ఈ విధంగా యుద్ధానికి కారణమైన ఈ పరిస్థితి వల్ల

యుద్ధభూమి గందరగోళంగా మారి, సైన్యాలు సమీకరించబడ్డాయి.

(08) పద్య భావం:

భీష్ముడు, కర్ణుడు, వికర్ణుడు, కుంతిభోజుడు వంటి మహావీరులు

అందరూ ధైర్యవంతులు, గౌరవనీయులు.

వీరు తమ తమ శౌర్యంతో ప్రసిద్ధులు.

ఇలాంటి వీరులు అందరూ కలిసి యుద్ధానికి సిద్ధమయ్యారు.

(09) పద్య భావం:

ఇంకా చాలా మంది యోధులు యుద్ధకళలో నిపుణులు.

వారు ఎలాంటి భయమూ లేకుండా యుద్ధానికి సిద్ధమయ్యారు.

తమ శక్తి, నైపుణ్యాన్ని చూపడానికి ఉత్సాహంగా ఉన్నారు.

సమయంలో సహాయం చేసేందుకు సిద్ధంగా నిలిచిన శూర సైనికులు ఉన్నారు.

ఈ మూడు పద్యాలలో యుద్ధరంగం విస్తృతత, యోధుల సమాహారం, వారి ధైర్యం స్పష్టంగా ప్రతిఫలిస్తుంది.

*****

మీ (07), (08), (09) పద్యాల భావసారాన్ని ఆధారంగా తీసుకుని ఒక చిన్న ఉపన్యాసం ఇలా—

చిన్న ఉపన్యాసం:

ప్రియులారా, యుద్ధరంగం అనేది కేవలం పోరాట స్థలం కాదు—అది మనుషుల గుణగణాల ప్రతిబింబం. శ్రీ మద్భగవద్గీతలో ఈ దృశ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది.

అనేక మంది రాజులు, పండితులు, శూరవీరులు ఒకచోట చేరినప్పుడు, ఆ వాతావరణం సహజంగానే ఉత్కంఠతో నిండిపోతుంది. ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను చూపించాలని ఉత్సాహపడతారు. ఈ సమీకరణం యుద్ధానికి దారితీస్తుంది. ఇదే మన జీవితంలో కూడా—పోటీ, ఆత్మగౌరవం, లక్ష్యాలు కలిసి ఒక “అంతరంగ యుద్ధం”ను సృష్టిస్తాయి.

భీష్ముడు, కర్ణుడు వంటి మహావీరులు యుద్ధరంగంలో ఉన్నప్పుడు, అది సాధారణ పోరాటం కాదు. అది శక్తి, ధైర్యం, గౌరవం—all కలిసి ఉన్న ఒక గొప్ప సమరం. వీరందరూ తమ తమ విలువలతో నిలుస్తారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం—శౌర్యం ఉన్నంత మాత్రాన విజయం నిర్ధారితం కాదు; దానికి ధర్మబలం అవసరం.

ఇంకా అనేక మంది యోధులు తమ తమ నైపుణ్యాలతో సిద్ధంగా ఉన్నారు. వారు భయపడకుండా ముందుకు వస్తున్నారు. ఇది మనకు ఒక పాఠం చెబుతుంది—సమస్యలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గకుండా, ధైర్యంగా ఎదుర్కోవాలి. మన శక్తిని విశ్వసించాలి.

సారాంశంగా, ఈ పద్యాలు మనకు చెప్పేది—

సమూహ శక్తి, వ్యక్తిగత ప్రతిభ, ధైర్యం—all కలిసి ఉన్నప్పుడు గొప్ప ఫలితాలు సాధ్యమవుతాయి.

కానీ వాటికి దిశ చూపేది ధర్మమే.

మీ పద్యాల భావం ఉపన్యాసరూపంలో కూడా ఎంతో ప్రభావవంతంగా నిలుస్తోంది.

*****

102..... కలియుగ సూత్రాలు (02)

"నేను" అనేది నాలుగు తత్త్వాలుగా ప్రస్ఫుటమవుతోంది.

 అవే -- మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు.

* సంకల్ప వికల్పాలు చేసేటప్పుడు 'మనస్సు'గా

*  నిత్యానిత్యాలను, మంచి చెడులను చెప్పేటప్పుడు 'బుద్ధి'గా

*  నిరంతర చింతన చేసేటప్పుడు 'చిత్తం'గా

*  నేను, నాది అనేటప్పుడు 'అహంకారం'గా

*- ఆత్మ పదార్ధం ప్రస్ఫుటమవుతోంది.

.......

*మనస్సుని శుద్ధి చేయవలెనంటే 'కర్మయోగం'

* బుద్ధిని సునిశితం చేయవలెనంటే 'జ్ఞానయోగం'

* చిత్త వృత్తులను నిరోధించవలెనంటే 'రాజయోగం'

* అహంకారాన్ని అంటే నేను, నాది అనే భావాలను పూర్తిగా తుడిచిపెట్టుకు పోవాలంటే 'భక్తియోగమే' మార్గము.

.......

*శాశ్వతమైన దాని కోసం క్షణికమైన వాటిని త్యజించండి. అనంతమైన ఆనందాన్ని పొందాలంటే అల్పసుఖాలను వదిలివేయండి.

.......

 ➡️ చాట:-  మంచిని తనలో ఉంచుకొని, చెత్తను బయటికి పంపించును.

➡️ పిండి జల్లెడ:- చెత్తను తనలో ఉంచుకొని, మంచిని బయటికి పంపించును.

 అదేవిధంగా 'జ్ఞాని' చాట వలె (మంచిని తనలో ఉంచుతారు), 'అజ్ఞాని' జల్లెడ వలె (చెత్తను తనలో ఉంచుతారు) వ్యవహరిస్తారు.

 కాని దానిని తొలగించడం, కావలసిన దానిని తెలుసుకోవటం - ఇదియే "ఆధ్యాత్మికత".

 ప్రశ్న:- ఏది బంధం? ఏది మోక్షం?

సద్గురు:- ఉన్నది అంతా భగవద్రూపమే అని ఎరుగుట మోక్షం.,  మరచుట బంధం.

****



 జంతువులకే ఆ పరుగులెందుకు ?

....................................

ప్రకృతి ప్రతిజీవికి ఒక ప్రత్యేకశక్తిని ఇచ్చింది. కొన్ని జీవులు తెలివితో బతికితే మరికొన్ని అసాధారణ వేగంతో మనుగడ సాగిస్తాయి.గాలిలో నీటిలో భూమిపై అత్యంత వేగంగా కదిలే జీవులను పరిశీలిస్తే  వేగం వాటి జీవన విధానంలో ఎంత కీలకమో అర్థమవుతుంది.

ఆకాశంలో పెరెగ్రైన్ ఫాల్కన్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన జీవి. వేటాడేటప్పుడు గాలిలో గంటకు 389 కి.మీ. వేగంతో కిందికి దూకుతుంది, ఈ వేగాన్ని స్టూప్ అంటారు. గోల్డెన్ ఈగిల్ గంటకు 240 నుంచి 320 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది, దీని దృష్టి మనిషి కంటే ఎనిమిది రెట్లు పదునైనది కావడం వల్ల అంత వేగంలోనూ ఎరను ఖచ్చితంగా గుర్తిస్తుంది. 

ఫ్రిగేట్ బర్డ్ అనే సముద్రపక్షి గంటకు 153 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది, ఇది వారాల తరబడి గాలిలోనే ఉంటూ అలాగే నిద్రపోయే సామర్థ్యం కలిగి ఉంటుంది. 

భూమిపై చిరుతపులి అత్యంత వేగవంతమైన జంతువు, కేవలం 3 సెకన్లలోనే 0 నుంచి 110 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. కానీ దాని శరీరం వేడెక్కిపోవడం వల్ల 20 నుంచి 30 సెకన్లకు మించి ఈ వేగాన్ని కొనసాగించలేదు. ప్రాంగ్‌హార్న్ యాంటిలోప్ అనే జింకజాతి జీవి గంటకు 88 కి.మీ. వేగంతో చిరుతపులి కంటే ఎక్కువ దూరం పరిగెత్తగలదు.ఇది ఉత్తరఅమెరికాలో  వేటాడే జంతువుల నుండి తప్పించుకోవడానికి ఈ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంది. 

క్వార్టర్ హార్స్ జాతి గుర్రాలు రేసులో గంటకు 88 కి.మీ. వేగంతో దూసుకెళ్తాయి. సింహం వేటలో గంటకు 80 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. అయితే ఇది కొద్ది దూరం మాత్రమే పరిగెత్తగలదు. అందుకే సి oహాలు సమూహంగా వేటాడుతాయి. కుందేలు ప్రాణరక్షణ కోసం వంకరటింకరగా గంటకు 77 కి.మీ. వేగంతో పరిగెడుతుంది. దాని వెను కాళ్లు పొడవుగా ఉండటం వల్ల ఒక్కసారిగా దిశ మార్చుకోగలదు.

ఎగరలేని ఉష్ట్రపక్షి భూమిపై గంటకు 70 కి.మీ. వేగంతో పరిగెత్తే అతిపెద్ద పక్షి.ఒక్క అడుగులో 3 నుంచి 5 మీటర్ల దూరం వెళ్లగలదు. దమ్ములగొండి (హైనా) గంటకు 60 కి.మీ. వేగంతో వేటాడుతుంది, దీని దవడబలం ఎముకలను కూడా కొరకగలిగేంత శక్తివంతమైనది. నీటిలో సెయిల్ ఫిష్ అత్యంత వేగవంతమైన చేప. గంటకు 110 కి.మీ. వేగంతో ఈదుతుంది.దాని వీపుపై ఉండే పెద్ద తెరచాప వంటి రెక్క వేగంగా దిశ మార్చుకోవడానికి సహాయపడుతుంది. టైగర్ షార్క్ గంటకు 55 కి.మీ. వేగంతో వేటాడుతుంది. దీనికి పగలూ రాత్రీ ఒకేలా చూడగలిగే ప్రత్యేక కన్ను ఉంటుంది. మనిషి విషయానికి వస్తే, ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మనిషి  బోల్ట్ గరిష్టంగా గంటకు 44.7 కి.మీ. వేగాన్ని 2009 బెర్లిన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నమోదు చేశాడు.

జంతువులతో పోలిస్తే మనిషి సహజ వేగం చాలా తక్కువ. జంతువులకు వేగం విలాసం కాదు. మనుగడకు అవసరమైన సహజ ప్రవృత్తి. ఆహారం కోసం చిరుతపులి సింహం వంటి వేటాడే జంతువులకు వేగం లేకపోతే ఆహారం దొరకదు  ఆకలితో చనిపోతాయి. ఆత్మరక్షణ కోసం జింకలు కుందేళ్లు బలమైన జంతువుల నుండి తప్పించుకోవడానికి వేగమే ఆధారం, వాటికి కొమ్ములు లేదా పదునైన పంజాలు ఉండవు. వలసలు సంతానోత్పత్తి కోసం ఆర్కిటిక్ టెర్న్ వంటి పక్షులు ఏటా 70,000 కి.మీ. దూరం వలస వెళ్లడానికి వేగం దిశాజ్ఞానం ఉపయోగపడతాయి. శరీరనిర్మాణం కూడా వేగాన్ని నిర్ణయిస్తుంది, చిరుతపులికి వంగే వెన్నెముక పెద్ద ఊపిరితిత్తులు గాలి గదులు ఉండటం వల్ల ఒక్క అడుగులో 7 మీటర్లు దూకగలదు. మనిషి శారీరక వేగంలో వెనుకబడినా మేధస్సుతో విమానాలు.రాకెట్లు సృష్టించి శబ్ద వేగాన్ని దాటే మాక్ స్పీడ్‌ను సాధించాడు, నాసా X-43 విమానం గంటకు 11,200 కి.మీ. వేగంతో ప్రయాణించింది. అయినా సహజసిద్ధమైన వేగంలో శక్తిని వినియోగించడంలో పర్యావరణానికి అనుగుణంగా మారడంలో ప్రకృతి ఎప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుంది.

IIసేకరణ ప్రాంజలి ప్రభకు పంపినవారు ............జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.



సీస. అగ్రమనేనమ్మ అహముయే పలుకుగా 

నిగ్రహము తప్పియు నిజము తప్పె 

విగ్రహము మాదిరే విద్యలు మరుపులై 

సంగ్రామ పద్ధతి సరయు మలుపు 

ఈగ్రహము మనసు యిష్టరాజ్యమగు 

ప్రోగ్రాము మాదిరే పోరు సలుపు

యుగ్ర జన భయముతో యుచ్చు న చిక్కుటే 

చక్రము మాదిరి చెలిమి తీర్పు 


గీ.బీర నార కూరలతీరు భీకరమగు 

వారు వీరుయుద్ధమనిచూ వాక్కు బొంకు 

నిత్యధరలు పెంచ గలగు నీరు తీరు 

కూడు గుడ్డ గృహము లేక భీతి బ్రతుకు          (101)

****

సీ. స.కోర్కెలున్న మనిషి కొంప కొల్లేరగు 

కోర్కెలు యదుపున గొప్ప బతుకు 

కోర్కెగుండెను పట్టి కొత్త మలుపు గాను 

కోర్కెలు మనసును కొల్లగొట్టు 

కోర్కెలేనిది జీవి కొరివి పట్టబ్రతుకు 

కోర్కెలే జీవన కూడు యగును 

కోర్కెచెప్పియు రాదు గుప్త నిధిగ తీరు

కోర్కెలే మాయలు పూజ్య గుణము 


గీ.ఆడ మగ భేదము లేదు ఆశ పట్టు 

కుల కలము గాలముయుకాదు కూడు పెట్ట 

వలదు నన్న వెంటనుపుట్ట వాక్కు తీరు 

నిజము మల్లాప్రగడ కోర్కె నీడ బ్రతుకు  (102)

***

మ. కో.ఎర్ర మిర్చిని తెచ్చి యిచ్చియు ఏమి కోరియు యిoతికీ

చర్రు చర్రున ముందుయెండిన  చుట్టు నీదగు ఘాటుయే

వెర్రి దానను నన్ను చూసియు విద్యలన్నియు యేలనూ

సర్రు కారము దంచు దాము యు సంధియమ్ముయు దేనికో

సరళ భావం :

ఎర్ర మిర్చి తెచ్చి ఇచ్చిన తరువాత కూడా ఇంకేం కావాలని అడుగుతున్నట్లుంది. ఎండలో ఆరిన మిరపకాయల ఘాటు చుట్టూ వ్యాపిస్తోంది. నన్ను అమాయకురాలిగా చూసి ఎన్నో మాటలు చెప్పినా, చివరికి పని మాత్రం కారంపొడి దంచడమే. అంత శ్రమ, సంధి, మాటలన్నీ దేనికోసమో అనే సరదా భావం (103)

****

గీ.రాశి ఫల కోసమును నమ్మి రాటు తేలి 

వాశి గలవాణి నెంచియు వాక్కు తీరు 

కాశి విశ్వనాధుని కోరి కాల బతుకు 

చేసి కొన్న పుణ్యము తీరు చిత్త మలుపు 

సరళ భావం :

మనుషులు రాశిఫలాలను నమ్మి జీవిత మార్గాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. మాటతీరు, అనుభవం గలవారిని ఆశ్రయిస్తారు. చివరికి కాశి విశ్వనాథుని ఆశ్రయించి జీవితం సార్థకం కావాలని కోరుకుంటారు. జీవితం మొత్తం చేసిన పుణ్యపాపాలే మనసు మలుపులను నిర్ణయిస్తాయని నమ్మకం(104)

******

త.జలక మాడుచు జీవనంబగు జాగృతీభవ తీరుగన్ 

నలక లేనిది మార్గమేయగు నమ్మకంబున కాలమున్ 

కులుకు చెంతన కాల మాయలు కుత్సితంబగు నేస్తమున్ 

డులుచు విశ్వము మూలమేయగు మాట తీరున నిత్యమున్ 

సరళ భావం :

జీవితం జలకంలా కదులుతూ ఎప్పటికప్పుడు జాగృతితో ముందుకు సాగాలి. నమ్మకం లేని మార్గం నిలకడగా ఉండదు; కాలమే దానికి సాక్షిగా మారుతుంది. దగ్గరగా కనిపించే కొంతమంది స్నేహితుల వద్ద కాలమాయలతో కూడిన కుత్సిత భావాలు ఉండవచ్చు. అయితే ఈ విశ్వం మొత్తం మాటతీరు, పరస్పర సంబంధాల మూలంగా నిత్యం నడుస్తుందని నమ్మకం.(105)

****

పదాది.. పగ.. వగ..నగ.. మగ 

చం..పగలను వీడి నేస్తమగు పాశమనస్సు యశస్సు తోడుగాన్ 

వగలకు పోకదారుల సువాక్కులగాను సమర్థతేయగున్ 

నగలనదేహ ధారణకు నమ్మకజీవన చెంత సఖ్యతన్ 

మగ పిలుపేసుఖంబగు సుమాల తపంబు తరంబు నందునన్ 

సరళ భావం :

పగను విడిచిపెట్టి స్నేహభావంతో జీవిస్తే, అది మనిషికి యశస్సును తెస్తుంది. చెడు మార్గాలకు పోకుండా, మంచి మాటలతో నడిస్తే సమర్థత పెరుగుతుంది. శరీర ధారణకు ఆభరణాలకంటే, నమ్మకం–సఖ్యతలే నిజమైన అలంకారాలు. “మగ” అనే పిలుపు కూడా ప్రేమ, బాధ్యత, తపనలతో కూడిన కుటుంబ బంధాలను సూచిస్తుంది.(106)

----

గీ.ప్రకృతి కాలచక్రమువలే పగలు రాత్రి

వరుస కలిపి వయసు పంచి వలస పోవు

చరిత మాదిరి సర్వం విచార సుఖము

నందకుండగా నయనాలు నమ్మ బలుకు

సరళ భావం :

ప్రకృతిలో కాలచక్రం ఎలా పగలు, రాత్రులను వరుసగా నడిపిస్తుందో, అలాగే మనిషి జీవితంలో వయస్సు పెరుగుతూ కాలం ముందుకు సాగిపోతుంది. జీవితం కూడా చరిత్రలాగే సుఖ–విచారాల కలయికగా ఉంటుంది. ఇవన్నీ శాశ్వతం కావని గ్రహించి, కళ్లతో చూసిన నిజాన్ని నమ్ముతూ జీవించ గలగటం లోకరీతి.(107)

****

గీ.తల్లి కి కనబడని కష్ట తపన తీపి 

పిల్ల ల కళలేతీర్చ పెరిగి తరుగు 

ఎల్లి నీడ గాఁ జీవితం యె దురు లేక 

దల్లి ఖిత జీవ పయనము ధరణి యందు

సరళ భావం :

తల్లి తన కష్టాలను బయటకు తెలియనీయకుండా, పిల్లల ఆశలు–కలలు నెరవేర్చేందుకు జీవితమంతా శ్రమిస్తుంది. ఆమె గొడుగు నీడలాగా అండగా నిలుస్తుంది. తనకు ఎదురైన బాధలను పట్టించుకోకుండా, పిల్లల కోసమే జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఈ భూమిపై తల్లి జీవితం ఒక నిస్వార్థ త్యాగగాథగా నిలుస్తుంది.(108)

**::*

ఉ.రాశి గుణంబుగన్ మనిషి రమ్యత కోరియు రంగు మార్చుటన్

కాశి న కాలభైరవుని కామిత లీలలు చూపు లండుటన్

వాసి కి యెక్కి గొప్పలు సువాసన తీరున కాల యాపణన్

చేసిన చెప్పకే కలయు చిత్తము అర్ధము చుట్టు ప్రేమగన్

సరళ భావం :

మనిషి ఎన్నో గుణాల రాశిగా కనిపించినా, అవసరానుసారం తన స్వభావాన్ని మార్చుకుంటూ ఉంటాడు. కాశీలో కాలభైరవుని లీలల వలె జీవితం అనేక ఆశ్చర్యాలను చూపిస్తుంది. కొందరు పేరు, ప్రతిష్ఠల వాసికి ఎక్కి గొప్పలు చెప్పుకుంటారు; అది సువాసనలాగా కొంతకాలమే నిలుస్తుంది. కానీ చేసిన మేలును చెప్పుకోకుండా ఉండగలిగితే, చుట్టుపక్కల ప్రేమతో కూడిన నిజమైన మనసు కలుగుతుంది.(109)

****

సీస. అగ్రమనేనమ్మ అహముయే పలుకుగా
నిగ్రహము తప్పియు నిజము తప్పె
విగ్రహము మాదిరే విద్యలు మరుపులై
సంగ్రామ పద్ధతి సరయు మలుపు
ఈగ్రహము మనసు యిష్టరాజ్యమగు
ప్రోగ్రాము మాదిరే పోరు సలుపు
యుగ్ర జన భయముతో యుచ్చు న చిక్కుటే
చక్రము మాదిరి చెలిమి తీర్పు

గీ.బీర నార కూరలతీరు భీకరమగు
వారు వీరుయుద్ధమనిచూ వాక్కు బొంకు
నిత్యధరలు పెంచ గలగు నీరు తీరు
కూడు గుడ్డ గృహము లేక భీతి బ్రతుకు          (101)
****
సీ. స.కోర్కెలున్న మనిషి కొంప కొల్లేరగు
కోర్కెలు యదుపున గొప్ప బతుకు
కోర్కెగుండెను పట్టి కొత్త మలుపు గాను
కోర్కెలు మనసును కొల్లగొట్టు
కోర్కెలేనిది జీవి కొరివి పట్టబ్రతుకు
కోర్కెలే జీవన కూడు యగును
కోర్కెచెప్పియు రాదు గుప్త నిధిగ తీరు
కోర్కెలే మాయలు పూజ్య గుణము

గీ.ఆడ మగ భేదము లేదు ఆశ పట్టు
కుల కలము గాలముయుకాదు కూడు పెట్ట
వలదు నన్న వెంటనుపుట్ట వాక్కు తీరు
నిజము మల్లాప్రగడ కోర్కె నీడ బ్రతుకు  (102)
***
మ. కో.ఎర్ర మిర్చిని తెచ్చి యిచ్చియు ఏమి కోరియు యిoతికీ
చర్రు చర్రున ముందుయెండిన  చుట్టు నీదగు ఘాటుయే
వెర్రి దానను నన్ను చూసియు విద్యలన్నియు యేలనూ
సర్రు కారము దంచు దాము యు సంధియమ్ముయు దేనికో
సరళ భావం :
ఎర్ర మిర్చి తెచ్చి ఇచ్చిన తరువాత కూడా ఇంకేం కావాలని అడుగుతున్నట్లుంది. ఎండలో ఆరిన మిరపకాయల ఘాటు చుట్టూ వ్యాపిస్తోంది. నన్ను అమాయకురాలిగా చూసి ఎన్నో మాటలు చెప్పినా, చివరికి పని మాత్రం కారంపొడి దంచడమే. అంత శ్రమ, సంధి, మాటలన్నీ దేనికోసమో అనే సరదా భావం (103)
****
గీ.రాశి ఫల కోసమును నమ్మి రాటు తేలి
వాశి గలవాణి నెంచియు వాక్కు తీరు
కాశి విశ్వనాధుని కోరి కాల బతుకు
చేసి కొన్న పుణ్యము తీరు చిత్త మలుపు
సరళ భావం :
మనుషులు రాశిఫలాలను నమ్మి జీవిత మార్గాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. మాటతీరు, అనుభవం గలవారిని ఆశ్రయిస్తారు. చివరికి కాశి విశ్వనాథుని ఆశ్రయించి జీవితం సార్థకం కావాలని కోరుకుంటారు. జీవితం మొత్తం చేసిన పుణ్యపాపాలే మనసు మలుపులను నిర్ణయిస్తాయని నమ్మకం(104)
******
త.జలక మాడుచు జీవనంబగు జాగృతీభవ తీరుగన్
నలక లేనిది మార్గమేయగు నమ్మకంబున కాలమున్
కులుకు చెంతన కాల మాయలు కుత్సితంబగు నేస్తమున్
డులుచు విశ్వము మూలమేయగు మాట తీరున నిత్యమున్
సరళ భావం :
జీవితం జలకంలా కదులుతూ ఎప్పటికప్పుడు జాగృతితో ముందుకు సాగాలి. నమ్మకం లేని మార్గం నిలకడగా ఉండదు; కాలమే దానికి సాక్షిగా మారుతుంది. దగ్గరగా కనిపించే కొంతమంది స్నేహితుల వద్ద కాలమాయలతో కూడిన కుత్సిత భావాలు ఉండవచ్చు. అయితే ఈ విశ్వం మొత్తం మాటతీరు, పరస్పర సంబంధాల మూలంగా నిత్యం నడుస్తుందని నమ్మకం.(105)
****
పదాది.. పగ.. వగ..నగ.. మగ
చం..పగలను వీడి నేస్తమగు పాశమనస్సు యశస్సు తోడుగాన్
వగలకు పోకదారుల సువాక్కులగాను సమర్థతేయగున్
నగలనదేహ ధారణకు నమ్మకజీవన చెంత సఖ్యతన్
మగ పిలుపేసుఖంబగు సుమాల తపంబు తరంబు నందునన్
సరళ భావం :
పగను విడిచిపెట్టి స్నేహభావంతో జీవిస్తే, అది మనిషికి యశస్సును తెస్తుంది. చెడు మార్గాలకు పోకుండా, మంచి మాటలతో నడిస్తే సమర్థత పెరుగుతుంది. శరీర ధారణకు ఆభరణాలకంటే, నమ్మకం–సఖ్యతలే నిజమైన అలంకారాలు. “మగ” అనే పిలుపు కూడా ప్రేమ, బాధ్యత, తపనలతో కూడిన కుటుంబ బంధాలను సూచిస్తుంది.(106)
----
గీ.ప్రకృతి కాలచక్రమువలే పగలు రాత్రి
వరుస కలిపి వయసు పంచి వలస పోవు
చరిత మాదిరి సర్వం విచార సుఖము
నందకుండగా నయనాలు నమ్మ బలుకు
సరళ భావం :
ప్రకృతిలో కాలచక్రం ఎలా పగలు, రాత్రులను వరుసగా నడిపిస్తుందో, అలాగే మనిషి జీవితంలో వయస్సు పెరుగుతూ కాలం ముందుకు సాగిపోతుంది. జీవితం కూడా చరిత్రలాగే సుఖ–విచారాల కలయికగా ఉంటుంది. ఇవన్నీ శాశ్వతం కావని గ్రహించి, కళ్లతో చూసిన నిజాన్ని నమ్ముతూ జీవించ గలగటం లోకరీతి.(107)
****
గీ.తల్లి కి కనబడని కష్ట తపన తీపి
పిల్ల ల కళలేతీర్చ పెరిగి తరుగు
ఎల్లి నీడ గాఁ జీవితం యె దురు లేక
దల్లి ఖిత జీవ పయనము ధరణి యందు
సరళ భావం :
తల్లి తన కష్టాలను బయటకు తెలియనీయకుండా, పిల్లల ఆశలు–కలలు నెరవేర్చేందుకు జీవితమంతా శ్రమిస్తుంది. ఆమె గొడుగు నీడలాగా అండగా నిలుస్తుంది. తనకు ఎదురైన బాధలను పట్టించుకోకుండా, పిల్లల కోసమే జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఈ భూమిపై తల్లి జీవితం ఒక నిస్వార్థ త్యాగగాథగా నిలుస్తుంది.(108)
**::*
ఉ.రాశి గుణంబుగన్ మనిషి రమ్యత కోరియు రంగు మార్చుటన్
కాశి న కాలభైరవుని కామిత లీలలు చూపు లండుటన్
వాసి కి యెక్కి గొప్పలు సువాసన తీరున కాల యాపణన్
చేసిన చెప్పకే కలయు చిత్తము అర్ధము చుట్టు ప్రేమగన్
సరళ భావం :
మనిషి ఎన్నో గుణాల రాశిగా కనిపించినా, అవసరానుసారం తన స్వభావాన్ని మార్చుకుంటూ ఉంటాడు. కాశీలో కాలభైరవుని లీలల వలె జీవితం అనేక ఆశ్చర్యాలను చూపిస్తుంది. కొందరు పేరు, ప్రతిష్ఠల వాసికి ఎక్కి గొప్పలు చెప్పుకుంటారు; అది సువాసనలాగా కొంతకాలమే నిలుస్తుంది. కానీ చేసిన మేలును చెప్పుకోకుండా ఉండగలిగితే, చుట్టుపక్కల ప్రేమతో కూడిన నిజమైన మనసు కలుగుతుంది.(109)
****

ప్ర. వ. చ. నం.
ప్రజలు మెచ్చునట్టి పాలకులిప్పుడు
వలయు జనుల గావ వసుధ యందు
చవట లెట్లు యిలను సాధింప గల్గును
నందనంబు వోలె నజరు నుంచి
కాళిదాసు సుబ్బయ్య  నెల్లూరు   (110)
****
సీ:
గుండెలోనిదియగు కోర్కె బయల్పడన్
   గుణము చేతనెపుడు గురువు తోడు !
దాగదులే కోర్కె దాచి నంతనెపుడు
   వేచి వేచియు గుండె వేడి కాగ !
రాజుకొనెడి మంట రగులు చుండునుగద
  పొగలు గక్కుచునుండు సెగలు తోడ !
పెచ్చు మీరగ కోర్కె వుచ్చుయౌచును జంపు
   యదను బుట్టె నిదియుఁ ౘదయె సుమ్మి!

ఆ:
రాల దోయి పండు రాళ్ళతో గొట్టిన
రాటు దేలె గుండెఁ రంగు మారి
కీడు తలపు పండు కేళియాడుచు నుండు
కోర్కెఁ పండు గుండెఁ గూల్చు చుండు¡
డా.మీ.మి*(111)
*****
పాదాది.... న్యస్తాక్షరి...(ప్ర...వ...చ...నం)కి నా పూరణా ప్రయత్నం.
ప్ర ముఖ పండిత వర్యుల పలుకు లన్ని
వ దనమునకంత వికసిత వన్నె తెచ్చి
చ దివినపురాణ మంతయు జతగ జేర
నం దన వనము తీరగు నరుని మనసు.
పరాశరం శ్రీనివాసాచార్యులు నరసరావుపేట.(112)
****
ఆ.వె.
** గములేలు శూలి! చంద్రకళాధర!
** మ్మి కొలుతు నిన్ను నెమ్మనమున
*కు* వలయాన చెలగు కుత్సితులను నీవె
*డు* లుచుమయ! త్రినయన! మలహర! శివ!
భావము:
సకల జగత్తును పరిపాలించే ఓ పరమశివ!త్రిశూలపాణి! చంద్రకళాధర! నిన్ను నేను సంపూర్ణ విశ్వాసంతో, నిండు మనసుతో ఆరాధిస్తున్నాను. ఈ భూమి మీద విచ్చలవిడిగా చెలరేగుతున్న దుర్మార్గులను నీవే స్వయంగా శిక్షించి నశింప జేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఓ త్రినేత్ర! పాపహారి!(113)
****
పాదాది న్యస్తాక్షరి..
*ప్ర వ చ నం.*
ఆ.వె.
*ప్ర* మథ నాథ! భర్గ! ఫాలలోచన! శూలి!
** రము లొసగి ప్రోచు భక్త‌‌‌ సులభ!
** పల మదిని విడుచు జ్ఞానము నొసగుమ
*నం* ది వాహన! శివ! నాగ భూష!
భావము:
ఓ పరమశివా! నీవు ప్రమథగణాల అధిపతివి; భర్గుడవై పాపాలను హరించువాడవు; లలాటంలో మూడో నేత్రము ధరించినవాడవు; త్రిశూలధారివి. భక్తులకు సులభసాధ్యుడవై, వారికి వరములు ప్రసాదించి రక్షించువాడవు. నంది వాహనుడవు, నాగాభరణుడవు.
అటువంటి నీవు, నా చంచలమైన మనస్సును శాంతింపజేసి, దాని చపలత్వాన్ని తొలగించే ఆత్మజ్ఞానాన్ని దయచేసి నాకు ప్రసాదింపుము.(114)

తిరివీధి శ్రీమన్నారాయణ
*****
రాముడే నారాయణుడు .. ..
తే. గీ.  మనసు గలవాడు మనిషి, మథన మనస్సు 
ప్రభవ పరమార్థ పద హితప్రణి మహర్షి;
విద్య నెరుపు నయ్య గురువు, విపుల నట్టి 
నయము నించు రాముడె నారాయణుండు. -- రా. శే. సా
కఠిన పదార్థము: (మథన = చిలకు; ప్రభవ=పుట్టు; హితప్రణి = సూచకుడు; విపులన్= భూమియందు; నయము=న్యాయము/ధర్మము; నించు = పూర్తిగా స్థాపించు)
కలన పరమార్థము: మనసు కలిగిన ప్రాణ ప్రవరుడు – మనిషి. ఆ మనసును మథనము జేయగా వచ్చు సత్య జ్ఞానాన్ని జనులకు సూచించు వాడు మహర్షి. విజ్ఞానాన్ని బోధించు గొప్ప పూజనీయుడు గురువు. ఆ బోధనా ధర్మాన్ని పూర్తిగా స్థాపించు వాడే నరుని రూపంలోని నారాయణుని నిర్వచించు రామచంద్ర మూర్తి. )  -- -- రా. శే. సా.(115)
*****
ఉండ బట్టలేకయు భాను ఉజ్వలమును
బిడ్డ కోరకుంతీపలు భీతి చెంది
కాల కన్యత్వమును పంచ గమన మాయ
కన్న బిడ్డ గంగను జేర్చ కన్నె మహిమ(116)
******
రోజురోజుకు మార్పుకు పూజ్యమవ్వ
కొంత కొత్త పాత పలుకు కోర్కెతీర
సహజ మనసు శాంతిబతుకు మాయ నెంచ
సమయ నుపకార విధమగు సాక్షిగాను(117)
****
సీ:
పెంచగ ధరలిక బూచిగను, యిరాను
   యమెరికా, నిజ్రెయిల్ యదియె యుద్ధ
కారణంబుగ బుగ్గి పారబోసెను నెత్తిఁ
    నోరుగొట్టెడి తీరు జోరుగుండెఁ
మధ్యతరగతికి మబ్బులు గమ్మగ
    వేదన తోడను రోదనవ్వఁ
యాశ చచ్చె బతుకు యావిరయ్యెనుగద
    పెట్రోలు డీజులు పిచ్చి బట్టెఁ

ఆ.
కాయ కష్ట మైన కనరాదు నష్టము
పెంచు కొనగ ధరలు పేరు గ్యాసు
తిరుగ లేము నేడు పెరిగేనులె ధరలు
బీర, నార కీర కూర లెల్లఁ!
డా.మీ.మి*(118)
*****

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ

05-02-2026