05=05-2026

వర్ణచ్ఛందములు -(001)

*

తంద తాన తంద తాన తంద తాన తనతాన 

*

చందమామ నింగిలోన సందరాన నల లేచె 

జంకు లేని కొంకు లేని జంట లేని చెలి నీకే  

అందులోన అందమంత ఆశ జూప కల లేచె 

పొందుకోరి వచ్చినాను పోరు యేల వల గావె 

మందమారుతంబు వీచె మందహాసమున రావా 

మంచు రాలె మించుబోడి మంతనాల విన రావా 

శాంత ముండ లేవ నీవు సద్దు చేయగను లేవా 

పంత మేల నీకు పాడి ముద్దు గానగును లేవా 

అందు లేదె యిందు లేదె అంతు నీకు కన రాదే 

అందరాని పండు నీవె అండ నాకు కన రాదే 

ఎందు నన్న అందు నేను ఎంత నీకు సుఖమేగా 

అందుకున్న అందుతాను ఆశ వల్ల గుణమేగా 

కుందమాల నిందు తీసికొందు వేమొ ముదమార 

కొండపైన నుండు రీతి కొంచెమేని దయ లేదే 

అందమైన ఆటబొమ్మ నేను గాంచ గనులారా 

బండ గాను నుండు టేల కర్గి జూడ విధి లేరా 

*

విధేయుడు - మల్లాప్రగడ రామకృష్ణ 

 నిజం! శివప్పకు కిట్టప్పకు మధ్య బయోలాజికల్ వార్ ఫేర్ జరిగింది.

.....................................

జీవాయుధయుద్ధం అంటే బయోలాజికల్ వార్‌ఫేర్ లేదా జెర్మ్ వార్‌ఫేర్. అంటే మనుషులకు జంతువులకు పంటలకు వైరస్ లు బ్యాక్టీరియాలు వ్యాప్తిచేసి బలవంతపు మరణాన్ని లేదా వ్యాధిని కలిగించడం. జ్వరాన్ని మరణాన్ని కల్గించడానికి వైరస్‌లు బ్యాక్టీరియాలు శిలీంధ్రాలు (ఫంగి) వంటి విషపదార్థాలను ప్రయోగిస్తారు.

మూడుకాళ్ల జ్వరాసురుడు సనాతనహిందూ ధర్మంలో జ్వరానికి ప్రతిరూపం. ఇతడు మూడుకాళ్లు మూడుతలలు మూడుచేతులు కలిగిన రాక్షసుడిగా తరచూ మేకముఖంతో కనిపిస్తాడు. జ్వర అంటే జ్వరం అసుర అంటే రాక్షసుడు. ఈ రెండుపదాల కలయికే జ్వరాసురుడు.

భాగవతపురాణం విష్ణుపురాణాలలో బాణాసురుని కథలో జ్వరాసురుని ప్రస్తావన వస్తుంది.పరమశివుడి భక్తుడైన బాణాసురుడు శ్రీకృష్ణుడితో యుద్ధం చేశాడు.బాణుడికి సహాయంగా శంకరుడు తన జ్వరరూపమైన జ్వరాసురుడిని శ్రీకృష్ణుని సైన్యంపైకి పంపాడు. జ్వరాసురుడు మూడుతలలు మూడుకాళ్లు మూడుచేతులతో ఉంటాడు.

జ్వరాసురుడు శ్రీకృష్ణుని సైనికుల్లో తీవ్రమైన వేడిని పుట్టించి వారిని స్పృహతప్పేలా చేసాడు. అంటే వైరస్ కారణాలతో ఇదో రకం జ్వరమన్న మాట. దీనికి సరైన చికిత్స లేకపోతే మరణం తథ్యమన్నమాట.

జ్వరాసురుడిని

ఎదుర్కోవడానికి శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం నుండి వైష్ణవ జ్వరం అనే  జ్వరరూపాన్ని సృష్టించాడు. శైవ జ్వరం వైష్ణవ జ్వరం కలబడ్డాయి. వైష్ణవజ్వరం శైవ జ్వరాసురుడిని ఓడించింది.జ్వరాసురుడు శరణాగతి చెందగా ఈ కథను ఎవరు స్మరిస్తారో వారికి తీవ్రమైన జ్వరంరాదని వాగ్దానం చేసి శ్రీకృష్ణుడు అతడి ప్రాణం కాపాడాడు. అప్పటి నుంచి జ్వరాసురుడు ఒక అధీనదేవతగా మారాడు. జ్వరానికి పౌరాణిక రూపం వచ్చింది. మూడు కాళ్లు మూడు తలలు మూడు చేతులున్న ఈ జ్వరాసురుడు ఆయుర్వేదంలోని మూడు దోషాలకు గుర్తు. అవేమంటే వాతం > చలి ఒళ్లు నొప్పులతో వచ్చే జ్వరం. పిత్తం > తీవ్రమైన వేడితో వచ్చే జ్వరం, కఫం > జలుబు, దగ్గుతో కూడిన జ్వరం.

కొన్ని సంప్రదాయాల్లో మూడుకాళ్లు త్రిగుణాలైన సత్వరజోతమో గుణాలకు గుర్తు వాటి అసమతుల్యత వల్లే రోగం వస్తుంది.

జ్వరాసురుడు రాక్షసుడైనా కొన్ని ప్రాంతాల్లో జ్వరాన్ని అణచే దేవతగా పూజిస్తారు. హిమాచల ప్రదేశ్‌లోని కాంగ్రాలో ఉన్న జ్వాలాముఖి దేవాలయం అత్యంత ప్రసిద్ధి చెందింది. అక్కడ అమ్మవారిని జ్వరాన్ని దహించే అగ్నిగా పూజిస్తారు. బెంగాల్ ఒడిశాలో అంటువ్యాధుల సమయంలో శీతలా దేవితోపాటు జ్వరమాత లేదా జ్వరాసురుడిని పూజిస్తారు. జ్వరాలు తగ్గడానికి శీతలాష్టాకం జ్వరహర స్తోత్రం పఠిస్తారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో జ్వరహరేశ్వరుడిని జ్వరాన్ని నయం చేసే శివుని రూపంగా పూజిస్తారు. కంచిలోని ఏకాంబరేశ్వర ఆలయంలో జ్వరహరేశ్వర మందిరం ఉంది. దీర్ఘకాలిక జ్వరంతో బాధపడేవారు చిన్న వెండికాళ్లను ఆలయంలో కట్టి ఉపశమనం కోసం ప్రార్థిస్తారు. జ్వరాసురుడు నలుపు లేదా బూడిద రంగు శరీరంతో మేక ముఖంలో మూడు తలలు మూడు కాళ్లు కలిగి ఉంటాడు. త్రిశూలం జ్వరపుకుండ మండే కాగడా చేతులలో ధరిస్తాడు. కొన్నిసార్లు జ్వరహరేశ్వరుడిగా శివుని పాదాల కింద నలిగిపోతున్నట్టు చూపిస్తారు. అంటే జ్వరాన్ని నాశనం చేసే శివుడు అని అర్థం. ఆధునిక వైద్యం రాకముందు అంటువ్యాధులను జ్వరాసురుడి ద్వారా వివరించేవారు. మలేరియా టైఫాయిడ్ వ్యాపించినప్పుడు గ్రామాల్లో జ్వర శాంతిపూజ చేసేవారు. మూడు కాళ్ల రూపం జ్వరం  శరీరంలోని మూడు అంశాలను ప్రభావితం చేస్తుందని గుర్తు చేసేది.నేటికీ గ్రామీణ బెంగాల్‌లో జ్వరఘోర పంచమి రోజున మూడు కాళ్ల జ్వరాసురుడి మట్టి బొమ్మలు చేసి పూజ తర్వాత నిమజ్జనం చేసి జ్వరాన్ని పంపించేస్తారు. 

జ్వరాసురుడు కేవలం రాక్షసుడు కాదు హిందూ సంప్రదాయంలో జ్వరానికి ఇచ్చిన పౌరాణిక వివరణ. మూడు కాళ్లు ఆయుర్వేదంలోని త్రిదోష సిద్ధాంతాన్ని సూచిస్తాయి. శ్రీకృష్ణుడితో యుద్ధం చేసిన శైవ అసురుడిగా మొదలై చివరకు తనను స్మరించిన వారిని తీవ్ర జ్వరం నుంచి కాపాడే దేవతగా మారాడు.

మన పౌరాణికులు బయోలాజికల్ వార్ ఫేర్ ను ఈ కథను సాంప్రదాయ రూపంలో వివరించారు.

శివుడు ప్రయోగించిన బయోలాజికల్ వార్ కు శైవజ్వరమని, శ్రీకృష్ణుడు చేసిన కౌంటర్ వార్ కు విష్ణుజ్వరమని పేర్లు.

దీనినిబట్టి చూస్తే బయోలాజికల్ వార్ వెపన్ దానికి కౌంటర్ వెపన్ సనాతనకాలంలోనే వున్నాయన్న మాట.

॥సేకరణ॥

.............. జిబి విశ్వనాథ 9441245  857 అనంతపురం
[04/05, 14:54] Mallapragada Ramakrishna:     ప్రతి మంగళవారం పద్యాలు.. భావాలు
04.05.2026
*న్యస్తాక్షరి  :* 
*అంశం      :  కోనసీమ
  ఛందస్సు    :  చంపకమాల

1/4.   మ ,    2/2.  న
3/19.  కో ,   4/ 10. ది
గుణము మనస్సుగాకలసి గుప్తపువిద్యలు నేర్చగల్గగన్
పనసపొట్టుకూరమది ప త్యము పాశము పెంచ గల్గుటన్
ఘనమగుయాటలేగతియు కాముకు వేళల కోటి కోర్కెలున్
మనమనయేకసఖ్యతది మానస విద్యలు కోన సీమగన్
సరళ భావం :
కోనసీమలో మనుషులు మంచి గుణాలతో, కలిసిమెలసి జీవిస్తూ అనేక గుప్తమైన జీవనవిద్యలను నేర్చుకుంటారు.
అక్కడి ప్రసిద్ధమైన పనసపొట్టు కూర వంటి ఆహారాలు ఆరోగ్యకరంగా ఉండి, అనుబంధాలను పెంచుతాయి.
కోడి పందేల వంటి గ్రామీణ ఆటలు అక్కడి ప్రజల వినోదంగా నిలుస్తాయి.
అన్నింటికంటే, పరస్పర సఖ్యత, మనసుల కలయిక, జీవన విద్యలు — ఇవే కోనసీమ ప్రత్యేకత అని పద్యం తెలియజేస్తోంది. 🌴🌾🌹.. 119
చం. చరితము నెంచి జీవనము చక్కగ నెంచగ హెచ్చరించగన్
నిరతము మాయ మర్మమపు నీడలుతీరుగ విత్తమేయగున్
విరివిగ నన్న దేదియన విశ్వము వేడ్కల జీవ వైనమున్
" *దొరకును కీర్తి సంపదలు*
*దుర్వ్యసనమ్ముల వీడకున్నచో"*
సరళ భావం :
మనిషి గత చరిత్రను ఆలోచించి జీవితాన్ని సరిగా నడిపించుకోవాలి.
ఈ ప్రపంచంలో మాయామర్మాలు నీడల్లా వెంటాడుతుంటాయి; సంపద కూడా వాటిలో ఒకటే.
ప్రపంచం విస్తారంగా కనిపించినా, జీవితం అనేక ఆశలతో నిండి ఉంటుంది.
కాని —
దుర్వ్యసనాలను విడిచిపెట్టకపోతే, నిజమైన కీర్తి గానీ సంపద గానీ దొరకవు అని  హెచ్చరికయే...120
*****
గీ.సోయగంమది మదనమే సొమ్ము కళలు
మరులు గొలపువిద్యలగుట మనుజ లీల
వాక్కు తీరుగా జీవన వాసికె క్కి
రంగ వల్లిగా సుమధుర రయము గాను
సరళ భావం :
సోయగం, మదనం, కళలు ఇవన్నీ మనిషి జీవితంలోని అందమైన సంపదలు.
ఆకర్షణ కలిగించే విద్యలు, భావాలు మానవలీలలో భాగమవుతాయి.
మంచి మాటతీరు జీవితానికి సుగంధంలా నిలుస్తుంది.
అలా జీవితం రంగవల్లిలా సుమధురంగా, ఆనందమయంగా మారుతుంది. 🌹..121
****
ఉ. నవ్వుల రాజరేయి కళ నమ్మక వెన్నెల యోగ మోహమున్
నవ్వుల రాణి తోడుగ సునాముని యాపెడి జీవి దాహమున్
నవ్వుతు మాటలన్నియు వినమ్రత జాలిగ జూపు మోసమున్
నవ్వు మనంబుగాబ్రతుకు కాలము తీరుగ జీవనంబుగన్
సరళ భావం :
నవ్వు వెన్నెలలాంటిది; అది నమ్మకాన్ని, ఆనందాన్ని పంచుతుంది.
సంతోషంగా నవ్వుతూ తోడుగా ఉండే మనుషులు జీవిత దాహాన్ని తగ్గిస్తారు.
అయితే ప్రతి నవ్వు నిజమైనదే కాకపోవచ్చు; కొందరు వినమ్రత, జాలి పేరుతో మోసాన్ని కూడా దాచవచ్చు.
అందుకే నవ్వును హృదయపూర్వకంగా ఉంచుకొని, జీవితాన్ని సంతోషంగా గడపాలనేది నిత్యం...122
*****
(కం)ఉదయమ్ స్వాగత యోగము
హృదయమ్ కదిలించ గల్గు పృద్విపునీతమ్
పదిలమ్ ముదమగు భాస్కర
విదితమ్ శుభ క్రాంతి శాంతి విద్యా గమనమ్
సరళ భావం :
ఉదయకాలం ఒక శుభయోగంలా ప్రపంచానికి స్వాగతం పలుకుతుంది.
ఆ వెలుగు హృదయాలను కదిలించి భూమిని పవిత్రంగా మారుస్తుంది.
భాస్కరుని కాంతి ఆనందాన్ని నింపుతూ, శుభకార్యాలకు మార్గం చూపుతుంది.
అది శాంతి, జ్ఞానం, అభివృద్ధి వైపు నడిపించే ప్రకాశమయమైన ప్రయాణంగా నిలుస్తుంది
.123..
****
త.తగని మాటలు చెంత చేర్చగ తప్పు నెంచక సాగగా
వగచి వద్దని వింతవేషము వాక్కు మారక మూగగా
తెగువ జూపక కాలమంత మదీయతత్త్వము బోధగా
తగు మగాడికి తిప్పలెందుకు తప్ప గుండుట ధర్మమున్
సరళ భావం :
తగని మాటలు వినిపించినప్పుడు వాటిని మనసులో పెట్టుకొని తప్పులు వెతకకూడదు.
వింత ప్రవర్తన చూసినా వాదనలకు దిగకుండా, అవసరమైతే మౌనంగా ఉండటం మంచిది.
అవసరం లేని గొడవలు చేయకుండా, కాలమే నిజాన్ని తెలియజేస్తుందని భావించాలి.
మంచి మనసున్న వ్యక్తికి అనవసర తిప్పలు ఎందుకు? తప్పు మార్గాలకు దూరంగా ఉండటమే ధర్మమని నమ్మకం.124
*****
శా..స్వామీ యేమి యనా మనో మధురిమా స్వామీ అనంబోయినా
నీమాటల్ గతి తప్ప కారణసుధానీతత్వ యేమార్పుగన్
డేమీనామనసైనమంజరివిగాపోతిన్ గాని ప్రేమంబుగన్
స్వామీగంగను గల్వ ధర్మమగుటే సంతృప్తి గా యీశ్వరా
సరళ భావం :
పార్వతీదేవి శివునితో మృదువుగా ఇలా అంటోంది —
“స్వామీ! మీరు ఏమి చెప్పినా అది మధురంగానే ఉంటుంది. మీ మాటలు ఎప్పుడూ తప్పుదారిలో ఉండవు. నా మనసులో కొంత అనుమానం కలిగినా, మీ ప్రేమ దానిని తొలగిస్తుంది. గంగను ధరించడం కూడా ధర్మార్థమేనని తెలుసుకొని నేను సంతోషంగా అంగీకరిస్తున్నాను.” 🌹125.
*****
మ. విన నెంచంగ నియోగి వైదికు లకున్ విశ్వాస విన్యాసమున్
వనకూరేస్థితి చాలమైత్రి ఫలమున్ వాత్చల్య లక్ష్యంబు గన్
గుణ మై హ్లాదము బొందుటల్ తగును సాపూజ్యంబు ప్రేమంబుగన్
రుణమైసేవలు ఒక్కరొక్కరగు సారూప్యంబు ధర్మంబుగన్ భావం :
నియోగులు, వైదికులు వంటి వర్గాల మధ్య విశ్వాసపూర్వకమైన అనుబంధం ఉండాలి.
పరస్పర మైత్రి, వాత్సల్యం జీవన లక్ష్యాలుగా నిలవాలి.
మంచి గుణాల ద్వారా ఆనందాన్ని పొందుతూ, ఒకరిని ఒకరు గౌరవంతో ప్రేమించాలి.
అలా పరస్పర సేవాభావంతో జీవించినప్పుడు, అది ధర్మస్వరూపమైన సమానత్వానికి దారి తీస్తుంది...126
*****
మ. కో.నాటు సంస్కృతి నిత్యసత్యము నమ్మ మార్గము సత్సుధన్
మాటు వేటుకి మర్మమైన స మానవత్వము దీపమున్
చేటు దారులు చేరకుండగ చిత్త ముంచియు దూరమున్
కాటు కాలమె ధర్మకాంతి సకాల కాపుయు గావుగన్
భావం
భావం :
మన భారతీయ నాటి సంస్కృతి నిత్యసత్యమై జీవనానికి సత్స్వరూపమైన మార్గదర్శకత్వం ఇస్తుంది.
మాట అనేది కేవలం పలుకుకాదు; అది మానవత్వానికి మర్మమైన దీపంలాంటిది.
చెడుదారులను చేరకుండా, మనసును పరిశుద్ధంగా ఉంచి దుష్టభావాలను దూరం చేయాలి.
అప్పుడు కఠినమైన కాలాల్లో కూడా ధర్మకాంతి మనకు సమయోచితమైన రక్షణగా నిలుస్తుంది. 🌹.127
*****
గీ.కుటిల మార్గమొదలి వృత్తి కుహన జీవి
లలిత పలుకుల జ్ఞానమై లక్ష్య దీపి
వృత్తపు మనసున్ నిగ్రహ కృషి గమనము
త్తిరుగు మానవత్వ మహిమ తేజమగును ॥
భావం :
కుటిల స్వభావాలను విడిచి, మృదువైన జ్ఞానవాక్యాలతో జీవించి, మనస్సును నిగ్రహించగలిగితే మానవత్వ మహిమ వెలుగుతుంది. 🌹128..
*****
[04/05, 14:59] Mallapragada Ramakrishna: ఉ.భాషను మేసియు ప్రభుతే
భాషను నిర్లక్ష్యమేను భాగ్యమనెవా క్కు
భాషవిదేశీయాసలు
భాషతెలుగురానిజీవిబానిస బ్రతుకే
సరళ భావం:
భాషను కాపాడుతూ అభివృద్ధి చేయడమే నిజమైన ప్రభువు (జ్ఞాని) లక్షణం.
భాషను నిర్లక్ష్యం చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ భాగ్యం కాదు.
విదేశీ భాషలపై మోజుతో,
తన తెలుగు భాష రాని జీవితం బానిసత్వ బ్రతుకులాంటిదే... 129
*****
సీస
విడిపోయిన కబుర్లు వినమని  చెప్పుమా
కలిసి ఉండగలిగే కథలు జెప్పు
నాడిని బట్టియు నటనను తెలుపుమా
వాడిక బట్టియు వరుస జెప్పు
పడిపోయిన ఘటన పాఠమనియు జెప్పు
నిలబడ నిర్ధారి నిజము జెప్పు
గెలవడము పునాది గీత బలము జెప్పు
ఓడిపోయిన కథ ఓర్పుజెప్పు

గీ.నీవు చెప్పగలిగినట్టె నిజము జెప్పు
మనుషులందరు బ్రతికేట్లు మంచి జెప్పు
నిత్య ఆనందంగా హాయి నీడ జెప్పు
ఈ సమాజంబు శాంతిగా ఇచ్ఛ జెప్పు..130
-****
అప్పులు చేసిచెప్పకయు ఆశలు రేపియు యివ్వ గుండగన్
జెప్పగ కోపతాపముల స్త్రీ విధి యాటలు దుష్ట బుద్ధిగన్
నెప్పులు జెప్పి ఒప్పనని నిత్యము భర్తను బాధ పెట్ట యా
తప్పును దప్పుగా నెఱిగి తప్పని పల్కుట తప్పెయౌ గదా!
సరళ భావం:
అప్పులు చేసి భర్తకు చెప్పకుండా, ఆశలు పెంచుతూ ఖర్చు చేస్తూ,
తరువాత విషయాన్ని అడిగితే కోపంతో, బాధతో ప్రవర్తించడం సత్కార్యం కాదు.
ఎప్పుడూ బాధలు చెప్పి, భర్త మాటను ఒప్పుకోకుండా అతన్ని మానసికంగా కృంగదీస్తూ,
తప్పును తప్పుగా తెలుసుకొని కూడా దాన్ని సమర్థించుకోవడం మరింత పెద్ద తప్పే కాదా?..131
****
🌹🌹🌹🌹🌹🌹
*అరువు, పరువు, తరువు, బరువు*.
ఆ. వె
అరువు తెచ్చు కోక యవసరమేదైన
పరువు కోస మనుచు పాక లాడ
తరువుకోరుకొనునుత్యాగమెల్లప్పుడు
బరువు బాధ్య తలును మరచిపోక...132
****
*రాను, కాను, మాను, తాను*
ఆ. వె
రానునీదరికన్న రమణీయ దృశ్యము
కాను కివ్వ తలచి కనుల మందు
మాను తోడ మలిచె రాజీవనేత్రుని
తాను తీర్చి దిద్ది తృష్ణ తీర్చె
.133
****
*పాదాది.. న్యస్తాక్షరి.... అ, ను, భ, వం*
ఆ. వె
అడుగుముందుకేయుమల్పులనాదుకొ
నుదయకాంతికొరకునుత్సవంగ
భవితమార్చవలెబడుగుబలహీనుల
వంతు నిలిచి పోరు వసుధ నందు...134.

బోర భారతీదేవి, విశాఖపట్నం
***
[04/05, 15:06] Mallapragada Ramakrishna: పాదాది న్యస్తాక్షరి..
*ఆ, ది, వా, రం*
ఆది దాంపత్యమే ఆశయ మనసు
ఆది విశ్రాంతిగా అక్షయ వయసు
ఆది సంతృప్తిగా ఆశ్రిత సొగసు
ఆది వారము మది వాక్కుల పరసు
భావం:
జీవిత ఆశయాలకు దాంపత్యమే ఆది బలం. విశ్రాంతి వలన వయస్సుకూడా ఉల్లాసంగా నిలుస్తుంది. సంతృప్తి అనేది ఆశ్రయించిన వారికి నిజమైన సొగసు. ఆదివారం మనసుకు ఆనందాన్ని, మాటలకు మాధుర్యాన్ని ఇచ్చే రోజు.135
****
ఆది దంపతులను నార్తితో పూజింపు
దినము రాత్రులందు దీక్షతోడ
వారె గాచు నిన్ను వార్ధక్య మందున.
రంగ నాయకుండు రక్ష నొసగు
కాళిదాసు సుబ్బయ్య నెల్లూరు.136
******
#ఆటవెలది
*ఆ* దిదేవ నీవె యఖిల లోకములకు
*ది* వ్య మైన వెలుగు దినము నందు
*వా* రక నొసగెదవు పద్మపాణి! ప్రజలు
*రం* జి‌త హృది నీకు ప్రణతు లిడరె

[ ఆదిదేవ = స్వయంప్రకాశకుడు, పరమాత్మ ]

భావము:
ఓ ఆదిదేవా! స్వయంప్రకాశకుడా!
సమస్త లోకాలకు మూలకారణుడవైన నీవే జగత్తుకు ఆధారభూతుడవు.
ఓ సూర్యదేవా! పద్మపాణీ! నీవు నీ దివ్యకాంతిని ప్రతి దినమూ ఎడతెగకుండా ప్రసాదిస్తూ, లోకమంతటినీ ప్రకాశింపజేసి పోషించుచున్నావు. నీ కరుణామయ కిరణాలచేత ఆకర్షితులైన ప్రజలు, ఆనందభరిత హృదయాలతో నీకు ప్రణామములు అర్పించకుండా ఎలా ఉండగలరు? తప్పక అర్పించెదరు.
✍️ తిరివీధి శ్రీమన్నారాయణ137
*****
ఆ.వె.

*ఆ* దమరిచి నిదుర యాదివారమునాడె
*ది* నము రాతిరనక తిరుగుడేను
*వా* రమొకటి దొరికె బడలిక తీరగ
*రం* డి యనుచు పిలుపు  లాంఛనముగ
✍🏻కాదంబరి శ్రీనివాసరావు
సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు
విశాఖపట్నం..138
*****
ఆ దిదేవుని ప్రార్ధన హత్తు కొనగ
ది వ్యమయినట్టి కాంతికి దిశెలు మారె
వా రిజాక్షుని హృదయము వరము లివ్వ
రం గని మనసు పులకించి రక్ష నిచ్చె.
పరాశరం శ్రీనివాసాచార్యులు నరసరావుపేట...139
******
ఆ. వె.
ఆది దేవ సలుపు నంతరంగమునందు
దివ్య నామ జపము దేవ దేవ
వారి జాక్ష నిన్ను వరముల కోరెద
రంగ కరుణ జూపి రక్ష నివ్వ
సరస్వతి నాగరాజన్..140
-*****
గీ.ఆది దైవ లీలమనసు అనగ తీరు
దివ్య జ్ఞానసంపద దేహ దీప్తి యగును
వాగ్వైభవ తెలుగు వెలుగు వాసి కెక్కి
రమ్య మైమహీ తలమందు రత్న మెరుపు
భావం:
ఈ జగత్తు ఆది దైవలీలగా నడుస్తోంది. దైవస్మరణతో మనసు నడిస్తే దేహంలో జ్ఞానసంపద ప్రకాశిస్తుంది. తెలుగు భాష వాగ్వైభవంగా వెలిగి ప్రజల హృదయాల్లో స్థానం పొందుతుంది. అప్పుడు భూమిపై అది రత్నమెరుపులా రమ్యంగా కాంతిస్తుంది...141
****
(ఉ) వానల వెళ్లువావరుస వత్సల చల్లని గాలి తోడుగాన్
గాన మనస్సు మాధురిత కాల యశస్సు శుభంబుగాయగున్
మానవ మాన మూర్తిగను మాతృపదంబగు దివ్యతేజమున్
నాన సుఖాల దుఃఖమగు నమ్మక జీవన ధర్మమేయగున్
భావం:
తల్లి ప్రేమ వానల వరుసలా, చల్లని గాలిలా మనసును హాయిగా తాకుతుంది. ఆమె మనస్సు గానంలా మధురమై కుటుంబానికి యశస్సు, శుభం తెస్తుంది. మానవ గౌరవానికి మూర్తిరూపమై తల్లి పదం దివ్య తేజస్సుగా నిలుస్తుంది. అనేక సుఖదుఃఖాల మధ్య జీవనధర్మాన్ని నమ్మకంతో నడిపేది తల్లే...142
*****
వాన, గాన, మాన, నాన
మ. కో
వానవెల్లువ వాక్కుతీరున వాంఛలన్నియు గూర్చగన్
గాన మాధురి నిత్యజీవన గమ్యమేయగు మేలుగన్
మానసంబుయు మార్గమూర్తిగ మాయలన్నియు మార్చగన్
నానరంబున నిత్య సత్యము నమ్మకంబగు వాక్కుగన్
భావం:
వాక్కు వానవెల్లువలాగా ప్రవహించి మన కోరికలన్నిటిని వెల్లడిస్తుంది. గానమాధుర్యంలా మధురమైన మాటలు జీవనానికి శ్రేయోమార్గం చూపుతాయి. మనస్సు సత్మార్గరూపమై ఉంటే మాయలన్నిటిని తొలగిస్తుంది. మన నరనరాల్లో నిత్యసత్యంగా నిలిచేది నమ్మకంతో కూడిన వాక్కే...143
*****
ఆది సత్యము నిత్య ఆశయం గమన
ఆది నిత్యము తల్లి దండ్రుల సేవ
ఆది కర్మల తీరు ఆటల మలుపు
ఆది వారము హాయి ఆనతి తీర్పు
భావం:
జీవితానికి ఆది సత్యమే; అది మన నిత్య ఆశయాలకు దారి చూపుతుంది. తల్లిదండ్రుల సేవ ధర్మాల్లో మొదటిది. కర్మల తీరు జీవన ఆటలో ఎన్నో మలుపులు తెస్తుంది. ఆదివారం హాయిని ఇచ్చి, వారాంత శ్రమకు విశ్రాంతి తీర్పులా నిలుస్తుంది...144
*****
ఆది దాంపత్యమే ఆశయ మనసు
ఆది విశ్రాంతిగా అక్షయ వయసు
ఆది సంతృప్తిగా ఆశ్రిత సొగసు
ఆది వారము మది వాక్కుల పరసు
భావం:
జీవిత ఆశయాలకు దాంపత్యమే ఆది బలం. విశ్రాంతి వలన వయస్సుకూడా ఉల్లాసంగా నిలుస్తుంది. సంతృప్తి అనేది ఆశ్రయించిన వారికి నిజమైన సొగసు. ఆదివారం మనసుకు ఆనందాన్ని, మాటలకు మాధుర్యాన్ని ఇచ్చే రోజు.145
****
ఉ:
సాగిన గొప్ప వారలగు సంబర మొందగ సౌఖ్యమే,యదీ
సాగక యుండినంతనిక సర్వమెరింగెడి జ్ఞాని
యైననూ
భోగము లేక జోగిగను సాగును కాలము చచ్చుయైనిలన్
యేగతిఁ సాగునో యెరుగుటెట్లనఁ యెవ్వరె రుంగునోగదా!
డా.మీ.మి*
.146
*****
మ.పదముల్ తుమ్మెద పాఠ్య భావపు లతల్ ప్రాణంబు వైనంబుగన్
పదముల్ సేవ ప్రభాత లక్ష్యముగనున్ పాశంబు తీరేయగున్
పదముల్ వెన్నెల భావతత్త్వములుగన్ భాగ్యంబు తీరేయగున్
పదముల్ వర్ణన శంకరా యనినివాళిన్ సత్య ధర్మంబుగన్

సరళ భావం:
పదాలు తుమ్మెదల వలె భావలతలపై విహరిస్తూ ప్రాణస్వరూపాలవుతాయి.
పదాలు సేవాభావంతో ప్రభాత లక్ష్యాలవైపు నడిపించి బంధనాలను తొలగిస్తాయి.
పదాలు వెన్నెలవంటి మృదుభావ తత్త్వాలై జీవితానికి భాగ్యాన్ని ప్రసాదిస్తాయి.
పదాలు శంకరుని వర్ణించే సత్యధర్మ రూపాలై నివాళులుగా నిలుస్తాయి.147
*****
శా.ధూర్తుల్యంబరమందురాత్రి
గనగన్ దుష్టత్వ యాలోచనన్
ఆర్తుల్వేదనజూపమార్గమగుటన్ ఆకాంక్ష సూర్యార్థిగన్
మూర్తిత్వమ్ సహనంబుతీరు బ్రతుకుల్ ముఖ్యంబు కాలంబుగన్
మార్తాoడ్రున్ డపరాద్రి గ్రుoకే నిదిగో మధ్యాన్న కాలంబునన్
సరళ భావం:
ధూర్తుల ఆలోచనలు రాత్రి చీకట్ల వలె వ్యాపిస్తుంటాయి; అవి దుష్టత్వానికే దారితీస్తాయి.
ఆర్తుల వేదనను గమనించి వారికి మార్గం చూపుటే నిజమైన ఆకాంక్ష, అది సూర్యుని వెలుగువలె శ్రేయస్సునిస్తుంది.
సహనం జీవనానికి మూర్తిరూపమైన గుణం; కాలప్రవాహంలో అది బ్రతుకులకు ప్రధానాధారం.
చూడండి! మధ్యాహ్న సమయంలో మార్తాండుడు (సూర్యుడు) పశ్చిమాద్రి వైపు సాగుచున్నట్లే కాలం కూడా నిరంతరం కదులుతూనే ఉంటుంది...148
***
నీరద రాత్రిశోభలు వినీల మనస్సును మార్చ గల్గగన్
సారత రార్ధ సంపదలు జామున సక్యత శోభనంబుగన్
దీరిన తృప్తిసంబరము దీక్షఫలంబగు నేస్తమేయగున్
దారిన సత్కృపల్ జరుప దానము ధర్మము శారదాకృపన్
సరళ భావం:
మేఘమయమైన రాత్రి సౌందర్యం మనసులోని నీలిమను (విషాదాన్ని) మార్చగలదు.
జీవితసారమైన సంపదలు ఉదయకాలంలో స్నేహసౌందర్యంలా వికసిస్తాయి.
లభించిన తృప్తి, ఆనందం — ఇవి దీక్షకు ఫలితాలవుతాయి; నిజమైన నేస్తమవుతాయి.
జీవనమార్గంలో సత్కృపను ఆచరిస్తూ దానం, ధర్మం చేయుటే శారదాదేవి కృపకు సూచకం...149
*****
*నవ్వుల దినోత్సవ శుభాకాంక్షలు*
సీ:
మనమున యానందమను భాగ్యమే నవ్వు
నియ్యది యారోగ్య కారకమగు
నవ్వుట తోడను నవ నాడులన్నియుఁ
చక్కగ సహకరించుగద !గాన
నవ్వులు పంచుకో పువ్వులు పూయనే
కనుల వెలుగు నింపు కనుల యింపు
  నవ్య రీతులివియె నవ రసంబు నొకటి
నవ్వుల దినమిది నవ్వు కొనుము!

ఆ:
ఎంత సమయమైన యేమియు గానిమ్ము
కొంత సమయ మైన కొంచె మైన
నవ్వు పంచి చూడు నవ్వించి చూడుమో
నష్ట మేమి లేదు నవ్వు డోయి!
డా.మీ.మి*..150
******
నవ్వగలుగుశక్తి నమ్మగలుగు బుద్ధి
నవ్వు చేటుయనుచు నాలుక కళ
నువ్వు నవ్వియు కాల సూత్రమవ్వు
నవ్వరాదని బెట్టు నారి నవ్వు
నవ్వుకొనుట కళ నవ్వించి బ్రతుకుటే
నొవ్వ జేయతగదు నవ్వి పరులు
నవ్వే మనసు తృప్తి నాటక మున నవ్వు
నవ్వలేని మనిషి నటన వద్దు

నవ్వు నమ్మక జీవన నాణ్యతగను
నవ్వు నడమంత్రపుసిరులు ననుత నేల
నవ్వు రంజిత హృదయము నయన మాల
నవ్వు నవరసంబు నొకటి నవ్య రీతి..151
******
సీస
విడిపోయిన కబుర్లు వినమని  చెప్పుమా
కలిసి ఉండగలిగే కథలు జెప్పు
నాడిని బట్టియు నటనను తెలుపుమా
వాడిక బట్టియు వరుస జెప్పు
పడిపోయిన ఘటన పాఠమనియు జెప్పు
నిలబడ నిర్ధారి నిజము జెప్పు
గెలవడము పునాది గీత బలము జెప్పు
ఓడిపోయిన కథ ఓర్పుజెప్పు

గీ.నీవు చెప్పగలిగినట్టె నిజము జెప్పు
మనుషులందరు బ్రతికేట్లు మంచి జెప్పు
నిత్య ఆనందంగా హాయి నీడ జెప్పు
ఈ సమాజంబు శాంతిగా ఇచ్ఛ జెప్పు..152
****:

జ్వరాసురుడు కేవలం రాక్షసుడు కాదు హిందూ సంప్రదాయంలో జ్వరానికి ఇచ్చిన పౌరాణిక వివరణ. మూడు కాళ్లు ఆయుర్వేదంలోని త్రిదోష సిద్ధాంతాన్ని సూచిస్తాయి. శ్రీకృష్ణుడితో యుద్ధం చేసిన శైవ అసురుడిగా మొదలై చివరకు తనను స్మరించిన వారిని తీవ్ర జ్వరం నుంచి కాపాడే దేవతగా మారాడు.

మన పౌరాణికులు బయోలాజికల్ వార్ ఫేర్ ను ఈ కథను సాంప్రదాయ రూపంలో వివరించారు.

శివుడు ప్రయోగించిన బయోలాజికల్ వార్ కు శైవజ్వరమని, శ్రీకృష్ణుడు చేసిన కౌంటర్ వార్ కు విష్ణుజ్వరమని పేర్లు.

దీనినిబట్టి చూస్తే బయోలాజికల్ వార్ వెపన్ దానికి కౌంటర్ వెపన్ సనాతనకాలంలోనే వున్నాయన్న మాట.

॥సేకరణ॥

.............. జిబి విశ్వనాథ 9441245  857 అనంతపురం.

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ

05-02-2026