విగ్రహాలలో భాగాచ్చక్తి నింపటానికి మంత్రం, యంత్రం, తంత్రం అనే మూడు సాధనములు ఉన్నాయి. భగవతత్వం ప్రప్రథమంగా శబ్దంచే గ్రహింపబడుతుంది. భగవద్రాహకమగు శబ్దమేది ఉందో, అదే ఆ దైవం యొక్క మంత్రంగా నిలుస్తోంది. నిత్యపూజాగృహములయందు పూజావిగ్రహాలు 4 అంగుళాలు మొదలు 12అంగుళాల వరకు ఉండాలి. పూజా ప్రతిమలు రత్నాలతో తయారైనవైతే అత్యుత్తమం. ఆ తరువాత బంగారం, వెండి, రాగి లోహాలతో విడివిడిగా గాని, ఈ లోహములన్నింటిలో కలిపి గాని (పంచలోహాలు) చేయుంచుకోవటం ఉత్తమం. రాయితో తయారైనవి మధ్యమం, చెక్కలతో తయారైనవి అధమం. దైవపటాలకన్నా విగ్రహాలు శ్రేష్ఠం. అందులోనూ పంచలోహాల విగ్రహాలు గాని, శిల, దారు, మృత్తికావిగ్రహాలు కాని, శక్త్యానుసారంగా ఉపయోగించుకోవచ్చు. దైవవిగ్రహాలు చూడటానికి ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా, మనస్సుని ఆకట్టుకునే విధంగా, కళాత్మకంగా, సుందర మనోహరంగా తీర్చిదిద్దిఉండాలి. ఇంట్లో ఈశాన్యభాగంలోగాని, ఉత్తర, తూర్పుభాగాలలోగాని పూజామందిరాన్ని ఏర్పరచుకోవాలి. పూజామందిరంలో ఈశాన్య, తూర్పు, ఉత్తర భాగాలలో ఉన్నతమైన స్థలంలో గాని, ఎత్తైన పీఠంపైగాని పూజావిగ్రహాలను ప్రతిష్టించాలి. దైవవిగ్రహాలకు ఎదురుగా కూర్చుని పూజించరాదు. సగుణ జ్ఞానహీనస్య నహినిర్గుణ వేదనమ్ నందిదర్శన హీనస్య యథా న శివదర్శనమ్ ఎలాగైతే నంది దర్శనాన్ని చేయలేనివాడు శివదర్శనాన్ని చేయలేకపోతాడో, అలాగు సగుణజ్ఞానంలేనివానికి నిర్గుణజ్ఞానం సిద్ధించదు. పెద్దఆకారంతో గర్భగుడికి బైటనున్న నందీశ్వరుని చూడజలని అశక్తుడు చీకట్లో చిన్నదిగా ఉన్న శివలింగాన్ని ఎలా చూడగలడు? అని శివపూరానం చెబుతోంది. అందుకనే సగుణరూపంలో మనకోసం భూలోకానికి విచ్చేసి కొలువైన దైవాలను నియమనిష్ఠలతో పూజించి వారి ముందు మన లోరికలను ఉంచి వారి కరుణాకటాక్ష వీక్షణాలతో మన జన్మలను ధన్యం చేసుకుందాం. హిందూమతంలో పధానమయినది ఏకేశ్వరభావాన. ఏ దేవుని పూజించినా ఆ పూజలన్నీ ఏకేశ్వరునికే చెండుతాయన్నది ప్రతి ఒక్క హిందువు అపర నమ్మకం! |
| *** |
రామాయణ మహాభారతాలు ఈ రెండింటిలోను దర్శనమిచ్చే పురాణపురుషులు.
........................................
శ్రీమద్రామాయణం, శ్రీమహాభారతం రెండింటిలోనూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను లేదా పురాణవాఖ్యానాలలో ప్రస్తావనకు వచ్చే పురాణపాత్రలు చాలానే ఉన్నాయి. వాటిలో కొందరివి ప్రధాన పాత్రలు. కాగా కొందరు ఋషులుగా ఇంకొందరు దేవతలుగా మరికొందరు చిరంజీవులుగా దర్శనమిస్తారు.
(1) నారదుడు - బ్రహ్మ మానసపుత్రుడు దేవర్షి త్రిలోక సంచారైన నారదుడు రామాయణంలో వాల్మీకికి రామకథ చెప్పి రామాయణ రచనకు కారణమవుతాడు. మహాభారతంలో యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడు మొదలైన వారికి ధర్మ రాజనీతి ఉపదేశం చేస్తాడు. (2)వాయుపుత్రుడు శివాంశసంభూతుడు చిరంజీవి అయిన హనుమంతుడు రామాయణంలో సీతాన్వేషణ లంకాదహనం సంజీవని ఘట్టంలో కీలకంగా ఉంటాడు. మహాభారతంలో భీముడికి దర్శనమిచ్చి గర్వభంగం చేస్తాడు. అర్జునుడి రథధ్వజంపై కపిధ్వజంగా ఉంటాడు.
(3) విష్ణువుయొక్క ఆరో అవతారం, చిరంజీవి అయిన పరశురాముడు రామాయణంలో శివధనుస్సు విరిచిన తర్వాత రాముణ్ని పరీక్షిస్తాడు. మహాభారతంలో భీష్ముడు కర్ణుడు ద్రోణుడు వంటి యోధులకు గురువుగా ఉంటాడు.
(4) కుంభసంభవుడు సప్తర్షుల్లో ప్రముఖుడు అయిన అగస్త్యమహర్షి శ్రీమద్రామాయణంలో శ్రీరాముడికి దివ్యాస్త్రాలు ఆదిత్యహృదయం ఉపదేశిస్తాడు. మహాభారతంలో పాండవులకు ఉపదేశాలు ఇస్తాడు. వారికి కాలకేయ రాక్షసుల కథ చెబుతాడు.
(5) క్షత్రియుడిగా పుట్టి బ్రహ్మర్షి అయిన విశ్వామిత్ర మహర్షి రామాయణంలో రామలక్ష్మణులను యజ్ఞరక్షణకు తీసుకెళ్తాడు. మహాభారతంలో ఆయన తపస్సు, వశిష్ఠుడితో వైరం, బ్రహ్మర్షిత్వం ప్రస్తావనకు వస్తాయి.
(6) ఇక్ష్వాకువంశ రాజగురు అయిన వశిష్ఠ మహర్షి రామాయణంలో దశరథుడి పురోహితుడు. మహాభారతంలో కురు వంశ కథల్లో, విశ్వామిత్రునితో ఘర్షణలో ప్రస్తావన ఉంటుంది.
(7) చిరంజీవి అయిన జాంబవంతుడు రామాయణంలో హనుమంతుడికి తన శక్తిని గుర్తుచేస్తాడు. మహాభారతంలో కృష్ణుడితో స్యమంతకమణి యుద్ధం చేసి జాంబవతిని ఆయనకు ఇస్తాడు.
(8) రావణుడి తమ్ముడు, ధర్మాత్ముడు, చిరంజీవి అయిన విభీషణుడు రామాయణంలో రామపక్షాన చేరి లంకరాజు అవుతాడు. మహాభారతంలో యుధిష్ఠిరుడి రాజసూయ యాగానికి హాజరవుతాడు.
(8) ఆదికవి వాల్మీకి రామాయణ రచయిత లవకుశులకు గురువు. మహాభారతంలో మహర్షులలో ఆదికవిగా ప్రస్తావన వస్తుంది.
(9) వేదవ్యాసుడు, మహాభారత రచయిత చిరంజీవి అయిన వ్యాస మహర్షి రామాయణ కథను తెలిసిన మహర్షిగా పురాణాల్లో ప్రస్తావన పొందుతాడు. మహాభారతంలో ప్రధానపాత్రధారి కురు వంశ పితామహుడు.
(10) చిరంజీవి మహర్షి అయిన మార్కండేయుడు రామాయణంలో శ్రీరామదర్శనం పొందినట్లు కొన్ని కథలు ఉన్నాయి. మహాభారతంలో యుధిష్ఠిరుడికి పురాణాలు ప్రళయ కథ చెబుతాడు.
(11) అత్రిమహర్షి కుమారుడైన దుర్వాస మహర్షి రామాయణంలో శ్రీరాముణ్ని దర్శించినట్లు ఉత్తరకాండలో ఉదాహరణలున్నాయి. మహాభారతంలో కుంతికి మంత్రవరం ఇస్తాడు.
(13) ప్రజాపతి, అనేక దేవదానవ వంశాల మూలపురుషుడైన కశ్యపమహర్షి శ్రీమద్రామాయణంలో రావణవంశ వివరణల్లో ప్రస్తావన వుంది. మహాభారతంలో సృష్టి నాగవంశ గరుడవంశ కథల్లో ముఖ్యుడు.
(14) సప్తర్షుల్లో ఒకరైన అత్రిమహర్షి రామాయణంలో సీతారాములకు ఆశీర్వాదీస్తాడు. మహాభారతంలో ఋషులలో ప్రముఖుడిగా ప్రస్తావన వస్తుంది.
(15) అత్రిమహర్షి భార్య అనసూయ రామాయణంలో సీతాదేవికి పతివ్రతా ధర్మం బోధిస్తుంది. మహాభారతంలో మహాపతివ్రతగా ఉదాహరణగా ప్రస్తావన వుంది.
(16) దేవేంద్రుడు రామాయణంలో రావణవధ అనంతరం శ్రీరాముణ్ని స్తుతిస్తాడు. మహాభారతంలో అర్జునుడి తండ్రి. (17) వాయుదేవుడు రామాయణంలో హనుమంతుడి తండ్రి మహాభారతంలో భీముడి తండ్రి.
(28) సూర్యదేవుడు రామాయణంలో సుగ్రీవుని తండ్రి. ఆదిత్యహృదయం ద్వారా ప్రాధాన్యం పొందుతాడు. మహాభారతంలో కర్ణుడి తండ్రి.
(21) వరుణుడు రామాయణంలో సముద్రంపై సేతు నిర్మాణానికి ముందు శ్రీరాముడికి దర్శనం ఇస్తాడు. మహాభారతంలో అర్జునుడికి గాండీవం లభించిన సందర్భాల్లో ప్రస్తావన వస్తుంది.
(22) ధనాధిపతి రావణుడి అన్న కుబేరుడు శ్రీమద్రామాయణంలో పుష్పకవిమానానికి సొంతదారు. మహాభారతంలో అర్జునుడు భీముడు కుబేరలోక దర్శనం చేస్తారు.
(23) విష్ణువు వాహనమైన గరుడు రామాయణంలో నాగపాశం నుండి రామలక్ష్మణులను విముక్తి చేస్తాడు. మహాభారతంలో గరుడవంశ కథలు, కృష్ణునితో సంబంధం ఉంటాయి.
(24) ఆదిశేషుడు రామాయణంలో లక్ష్మణుడిగా అవతరిస్తాడు. మహాభారతంలో బలరాముడిగా అవతరిస్తాడు.
(25) విష్ణువు రామాయణంలో శ్రీరాముడిగా మహాభారతంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు.
(26) శివుడు రామాయణంలో రావణుడి ఆరాధ్యదైవము. మహాభారతంలో అర్జునుడికి పాశుపతాస్త్రం ప్రసాదిస్తాడు.
(27) బ్రహ్మదేవుడు రామాయణంలో రావణుడికి వరాలు ఇస్తాడు. మహాభారతంలో అనేక ఉపాఖ్యానాల్లో దర్శనమిస్తాడు.
(28) చిరంజీవుల్లో ఒకడైన కృపాచార్యుడికి రామాయణ సంబంధిత వంశకథల్లో ప్రస్తావన వుంది. మహాభారతంలో కౌరవ గురువుగా ఉంటాడు.
(29) ముఖ్యమైన పాత్రల్లో సప్తర్షులలో ఒకరైన భరద్వాజ మహర్షి అశ్రమంలో పంచవటికి వెళ్లే ముందు రామలక్ష్మణసీతలు అతిథిగా ఉంటారు. మహాభారతంలో ద్రోణాచార్యుని తండ్రి.
(30) గౌతమమహర్షి రామాయణంలో అహల్య భర్త శ్రీరాముడు అహల్యకు శాపవిమోచనం కలిగిస్తాడు. మహాభారతంలో వారణావతంలో కుంతికి దర్శనమిస్తాడు. (32) బ్రహ్మ మానసపుత్రులలో ఒకరైన పులస్త్య మహర్షి రామాయణంలో రావణ కుంభకర్ణ విభీషణులకు తాత. మహాభారతంలో దక్షయాగ వైవస్వత మన్వంతర కథల్లో ప్రస్తావన వస్తుంది.
(32) సప్తర్షులలో ప్రముఖుడైన మరీచి మహర్షి శ్రీమద్రామాయణంలో రావణుడి తాత. సూర్యవంశ కథల్లో ప్రస్తావన వుంది. మహాభారతంలో ఆదిత్య అంగిరసుల సృష్టి కథల్లో ప్రస్తావన వస్తుంది. (33) దైత్యదానవులకు గురువు అయిన శుక్రాచార్యుడు రామాయణంలో రావణుని గురువుగా పురాణ ప్రసిద్ధి. మహాభారతంలో కచదేవయాని ఉపాఖ్యానం యయాతి కథ కర్ణుడి దానశక్తి విషయంలో ఇతని ప్రస్తావన వస్తుంది.
(34) దేవతల గురువైన బృహస్పతి ప్రస్తావన రామాయణంలో సీతాస్వయంవర సందర్భంలో మహర్షులతో ఉంది. మహాభారతంలో ద్రోణాచార్యుని జన్మ కథ యుధిష్ఠిరుని రాజసూయ సందర్భంలో ఇతని ప్రస్తావన వస్తుంది. (36) వామనునికి దానమిచ్చిన దానవేంద్రుడు చిరంజీవులలో ఒకడైన మహాబలి రామాయణ ఉత్తరకాండలో శ్రీరాముని ప్రస్తావిస్తాడు. మహాభారతంలో ధర్మరాజుకు భీష్ముడు బలి చరిత్రను వివరిస్తాడు.
రామాయణం మహాభారతం రెండింటినీ కలిపే అవతార సంబంధాలు కూడా ఉన్నాయి. శ్రీరాముడు శ్రీకృష్ణుడిగా లక్ష్మణుడు బలరాముడిగా అవతరించారు. హనుమంతుడు అర్జునుడి ధ్వజంపై ఉంటాడు. జాంబవంతుడు జాంబవతి తండ్రిగా, విభీషణుడు రాజసూయ యాగ అతిథిగా కనిపిస్తాడు.
హిందూ సంప్రదాయంలో ప్రసిద్ధి చెందిన చిరంజీవులు హనుమంతుడు పరశురాముడు విభీషణుడు వ్యాసుడు అశ్వత్థామ కృపాచార్యుడు మహాబలి మార్కండేయుడు. వీరిలో పలువురు రామాయణమహాభారత యుగాలను కలిపే సజీవ సాక్ష్యాలుగా వీరు ఉన్నారు.
శ్రీమద్రామాయణం ఆదర్శ ధర్మాన్ని బోధిస్తే శ్రీమహాభారతం ధర్మసంకటాలను వివరిస్తుంది. ఈ రెండు ఇతిహాసాల్లో ఒకే పాత్రలు కనిపించడం ద్వారా భారతీయ పురాణ సంప్రదాయం యుగాలను పరస్పరం అనుసంధానించింది. మహర్షులు చిరంజీవులు దేవతలు
కాలాన్ని దాటి
ధర్మం భక్తి జ్ఞానం శాశ్వతమని తెలియజేస్తారు. భరద్వాజ గౌతమ పులస్త్య మరీచి శుక్రాచార్య బృహస్పతి మహాబలి వంటి పాత్రలు ఈ అనుసంధానాన్ని మరింత సంపూర్ణం చేశాయి.
IIసేకరణII
...............జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం

Comments
Post a Comment