కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో శ్రీరాముడి వర్ణచిత్రం.
........................................
18వ శతాబ్దపు భారతీయ చిత్రకళలో పహాడీ కాంగ్రా వర్ణచిత్రాలు అత్యంత సుకుమారమైన రమ్యమైన అద్భుతమైన శైలిగా ప్రసిద్ధి చెందాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా ప్రాంతంలో మహారాజా సంసార చంద్ పోషణలో 1780–1790 కాలంలో రూపొందిన శ్రీరామచంద్ర ప్రభువు లంకపై విజయ సాధించి అయోధ్యకు తిరిగి వస్తున్న మనోజ్ఞ భావన ఈ చిత్రశైలికి అద్భుతమైన నిదర్శనం.
వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండలో వర్ణించిన రావణ వధ అనంతరం శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు విజయోత్సాహంతో అయోధ్యకు తిరిగి వచ్చే సన్నివేశాన్ని ఈ కళాఖండం జీవం పోస్తోంది.
చిత్రంలో శ్రీరాముడు అందమైన పసుపు రంగు వస్త్రాల్లో నలుపు తెలుపు మచ్చల గుర్రంపై హుందాగా, గంభీర వదనంతో ముందుండగా, వెనుక ఛత్ర చామరాలు పట్టిన సేవకులు మంత్రులు, పురప్రముఖులున్నారు. జాంబవంతుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, అంగదుడు వంటి వానర వీరులు ఉత్సాహంగా రాజపరివారంలో కలిసిపోయారు. ఈ చిత్రం. భక్తి విజయం ఐక్యత అనే మూడు భావాలను ఒకే చిత్రంలో చిత్రకారుడు ఆవిష్కరించాడు.
శ్రీవాల్మీకి తులసీదాసు రచనల నుండి ప్రేరణ పొందిన 18 వ శతాబ్దపు రాజులు శ్రీరామభక్తుల పూజించడం కొరకు ఇలాంటి చిత్రాలను వ్రాయించారు.కాంగ్రా చిత్రాలు రామాయణ కథలకు విశేష ప్రాధాన్యం ఇచ్చాయి. రావణ వధ తర్వాత శ్రీరాముని తిరిగి రాక దీపావళి పండుగతో ముడిపడి భారతీయ సంస్కృతిలో లోతుగా నాటుకుపోయింది. ప్రస్తుతం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ఫిట్జ్‌విలియం మ్యూజియంలో భద్రపరచబడిన ఈ చిత్రం భారతీయ మినీయేచర్ కళకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన అరుదైన కళాఖండాలలో ఒకటిగా నిలుస్తోంది.
॥సేకరణ॥
........... జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం

Comments
Post a Comment