*అహోబలేశ్వర దేవాలయంలో ప్రతిరోజూ సహస్రనామ పూజ నిర్వహణ - పెద్ద అహోబిలం శాసనం, ఆంధ్రప్రదేశ్*
ఈ శాసనం ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా, పెద్ద అహోబిలం గ్రామంలోని నరసింహ స్వామి దేవాలయ ప్రవేశ గోపురం కుడివైపు గోడపైవుంది. దేవాలయంలో ఇటీవల రసాయనాలతో శుద్ధీకరణ చేయు సమయంలో ఇది బయటపడింది.
ఇది *కన్నడ భాషలో, కన్నడలిపిలో* వ్రాయబడింది. శాసన తేదీ: *శకం 1475, పరిధావి నామ సంవత్సరం, ఆషాఢ బహుళ 11 = అనగా ACE 1553, జూలై 2, శనివారం.*
*వివరాలు:*
కురుకుంద గ్రామానికి చెందిన దళవాయి లింగరస, గురజాల నరసనాయన కుమారుడైన పోచిరాజ నరసరాజయ మహాఅరసు యొక్క పుణ్యం కోసం, *అహోబల నరసింహుడికి ప్రతిరోజూ సహస్రనామ పూజ నిర్వహించేందుకు* 12 వరాహ-గద్యాణాలను దానంగా ఇచ్చాడు.
_డైరెక్టర్ (ఎపిగ్రఫీ), భారత పురావస్తు సర్వేక్షణ శాఖ_

Comments
Post a Comment