పల్లవి
ఎందుకే అంత అందము ఎవరికొరకు
దాచకున్న దాచలేని సొగసు నీదెందుకు
మిడిసిపాటు వలదు యవ్వన మెరుపులపై
ఆత్మ సౌందర్యమే నిలిచేది చివరికి॥
చరణం – 1
కాలంలో వీక్షింపుము సుమనోహరీ
అద్దమందు అందమును మరిమరి చూచితివి
మురిసిపోవు సొగసులన్ని మాయలయ్యే
కాల గమనమున కరిగిపోవు రూపములే॥
చరణం – 2
పైపై మెరుగులే మన తనువంతా
లోన నున్నదంతా ఎముకల గూడే
విర్రవీగకుము దేహ సౌందర్యముచూచి
ముగ్ధ మోమునకై భ్రమపడకుమోయి॥
చరణం – 3
నునుపు చెంపల సోకు చెదరిపోవు
మెరిసే కన్నుల కాంతి హీనమగు
ముత్యాల పలువరుస మాయమైపోవు
లేత పెదవుల నవ్వు బోసిపోవు॥
చరణం – 4
చర్మపు ఛాయలు చల్లారునోయి
చిగురాకుల యవ్వనము వాడిపోవు
నిన్నటి అందము నేడు మాయమగు
కాలమే శిల్పి రూపము మార్చునోయి॥
చరణం – 5
అహంకారము తగదు అందముందని
ఆత్మ సౌందర్యమే శాశ్వతమని తెలుసుకో
రేపటి తరాలకు మంచితనమే జ్ఞాపకం
మదిలోని మంచే అందానికి కొలమానం॥
ముగింపు
కాయము కూలిన పిమ్మట అస్థిపంజరమే
నీ నిజరూప తత్వమది గ్రహింపుమోయి
మనసులో మంచితనమే మిగిలేది చివరికి
మానవత్వమే మహాసౌందర్యమోయి॥
****
లలిత శృంగార పద్యాలు (001)
ఉ. చల్లదనంబు గాంచగల శ్రాంతి నొసంగెడి ప్రేమకామ్యమున్
ఎల్లశరీరధారులకు యెoతన సఖ్యత లోన సంగుటల్
కల్లల మాయలేభవము కాపురమందున కొంత స ఖ్యతల్
ఎల్లలు దాటు ప్రేమ కధ యేమని చెప్పెద ఎవ్వరివ్వరూ .
సరళ భావం :ప్రేమ మనసుకు చల్లదనాన్ని ఇచ్చి అలసటను పోగొడుతుంది.ప్రతి జీవికి స్నేహం, సఖ్యత అవసరమే.సంసార జీవితం కొంత మాయలతో, కొంత అనుబంధాలతో సాగుతుంది.కానీ ప్రేమకు హద్దులు ఉండవు; ఆ ప్రేమకథను పూర్తిగా ఎవ్వరూ చెప్పలేరు.
****
తియ్యని తేన గ్రోల మది దీపిక తత్త్వము హాయి నిoప గన్
కయ్యము కామ్యమే యదియు కాలము తీరుగ సందడేయగున్
నెయ్యము చింతలేక గతి నీడల తీరున సింహ మాయగాన్
వియ్యము యంటిసామిగను విద్యల తీరుగ ప్రేమ స ఖ్యతన్... (02)
సరళ భావం :తియ్యని తేనెలా ప్రేమ మనసులో హాయిని నింపి దీపంలా వెలుగిస్తుంది.కొన్ని సార్లు చిన్న చిన్న కలహాలు వచ్చినా, అవి కూడా కాలగమనంలో సరదాగానే మారిపోతాయి.చింతలు లేకుండా పరస్పర నమ్మకంతో జీవితం సాగితే, కష్టాలు నీడల్లా తొలగిపోతాయి.ఇద్దరి అనుబంధం సఖ్యతతో నిండినప్పుడు జీవితం విద్యల సౌందర్యంలా మధురమవుతుంది.
*****
చెం.వినెడి విధానభాగ్యమది విత్తమహత్త్యము నైతి రేతిరే
మనెడిన యాలకిస్తిజత మాయల రేతిరి స్వర్గ ధామమున్
అణుకువ గుండెఘోషలవి ఆశల చెంతన గంటకొట్టగన్
తనువున కారుచీకటి విధానము వెల్గగు జీవనంబుగన్ (03)
శృంగార భావం :ప్రియురాలి మాటలను వినడం ప్రేమికునికి అపారమైన ఆనందం; అది ధనసంపదకన్నా గొప్పది.ఇద్దరి మధ్య జరిగే చిలిపి మాటలు, మాయల చూపులు ప్రేమలో స్వర్గసుఖాన్ని కలిగిస్తాయి.అణకువతో పలికే హృదయ స్పందనలు ఆశల గంటలు మోగించినట్లుగా మనసును కదిలిస్తాయి.ప్రియసన్నిధితో ఒంటరి జీవితంలోని చీకట్లు తొలగి ప్రేమవెలుగు నిండిపోతుంది.
*****
ధ్రువ.వెలుగు రేఖలు జీవితానన విద్య మాదిరి జల్లులే
పలుకు గమ్యము యిచ్ఛదీరగ పాశ బంధము ప్రేమలే
విలువలన్నియు విశ్వ మందున వీనులారగ సాగుటన్
కలువ కోర్కెలు తీర్చగల్గుట కాల మాయల జీవనమ్ (04)
శృంగార భావన :ప్రియురాలి ప్రేమ జీవితం మీద వెలుగు రేఖల్లా పరచుకొని హృదయాన్ని ఆనందంతో నింపుతుంది.ఇద్దరి పలుకులు కోరికలను తీర్చే మాధుర్యంగా మారి, ప్రేమబంధమే వారిని మరింత దగ్గర చేస్తుంది.ప్రపంచంలోని విలువలన్నిటికన్నా ప్రేమతో వినిపించే మాటలే హృదయానికి మధురంగా అనిపిస్తాయి.కలువవంటి సుందరి కోర్కెలు తీరుస్తూ, కాలమనే మాయలో జీవితం ఒక మధుర ప్రేమయాత్రగా సాగిపోతుంది.
****
: ధ్రువ.నిజము నీవుగ మాత్రమేయగు నీడ నాదగు తీరుగన్
నిజము మానస తృప్తినీదయ నిత్య సత్యపు వాక్కుగన్
నిజము రేయిన సఖ్యతాభవ నిర్మలంబగు సత్యమున్
నిజము కోర్కెలు కళ్ళ గాకయు విద్య మాదిరి జీవనమ్ (05)
శృంగార భావన :నిజమైన ప్రేమలో నీవే నా జీవితం, నేను నీ నీడవలె వెంట నడిచే అనుబంధమవుతాను.నీ దయ, నీ మాటలు నా మనసుకు తృప్తినిచ్చే నిత్యసత్యంలా అనిపిస్తాయి.రాత్రివేళల సఖ్యతలో కలిసే ప్రేమ నిర్మలమైన అనుభూతిగా హృదయంలో నిలుస్తుంది.నిజమైన కోరికలు కళ్లముందు సాకారమై, ప్రేమ జీవితం ఒక అందమైన విద్యలా మారుతుంది.
*****
మ. అరయున్ భారత గాథనారిమహిమల్ రమ్యత్వ రాత్రంతయున్
మరి సంభావ్యత సఖ్యతామగువగన్ చిక్కేను యంగాoగమున్
సరి ధీరాసహనంబు ప్రేమగనుగన్ సంతోష ప్రేమంబుగన్
ధరణీజాతిగ లక్ష్యసాధనలుగన్ ధర్మజ్నులైజీవనమ్ (06)
శృంగార-లలిత భావన :భారత నారీ మహిమ రాత్రంతా పరిమళించే రమ్యత్వంలా హృదయాన్ని ఆకర్షిస్తుంది.సంభావన, సఖ్యత, మృదువైన అనుబంధంతో ఇద్దరి మనసులు ఒక్కటై శరీరమంతా ప్రేమానుభూతితో నిండిపోతాయి.ధైర్యం, సహనం, ప్రేమ — ఇవే దాంపత్య సంతోషానికి ఆధారాలు అవుతాయి.అలాంటి ప్రేమతో కూడిన జీవితం ధర్మబద్ధంగా సాగి, లక్ష్యసాధనకు మార్గమవుతుంది.
***
గీ.తుమ్మెద కలువ సంతృప్తి సూత్రబంధ
సృష్టి విధిరహస్య బతుకు శృతి లయకళ
తరతరాల యర్పణ విద్య తనువు తృప్తి
సర్వ కళలు నంజుమనసు సామ్య శాంతి
సరళ భావం :తుమ్మెద–కలువల అనుబంధంలా జీవితం కూడా పరస్పర సంతోషంతో నిండిన ఒక సూత్రబంధం.సృష్టి అనే ఈ బతుకు శృతి–లయలతో నడిచే కళామయమైన రహస్యం.తరతరాలకు అర్పణ భావంతో పంచబడే విద్య జీవనానికి తృప్తిని ఇస్తుంది.అన్ని కళలు కలిసినప్పుడు మనసులో సమత, శాంతి, ఆనందం నిలుస్తాయి.
**** (07)
మౌనపు వెన్నెలే మనసు మౌనము మెల్లగ పంచుతుందిలే
మౌనపు కాంతులే వెతుకు మౌనము నీడల వెంట నుండుటన్
మౌనపు బాధలే సుఖము మౌనము పాఠపు కాపురంబునన్
మౌనపు హృద్యమే పలుకు మౌనము మార్పుకు నేర్పు జీవనమ్ (08)
భావం :మౌనం వెన్నెలలా హృదయాన్ని నెమ్మదిగా తాకి ప్రశాంతతను పంచుతుంది.మౌనం కాంతిలా మనిషిని తన నీడల వెంట నడిపిస్తూ ఆత్మాన్వేషణకు దారి చూపుతుంది.బాధలలోనూ, సుఖాలలోనూ మౌనం ఒక జీవనపాఠంలా మనసులో నివసిస్తుంది.చివరికి మౌనమే హృదయానికి నిజమైన పలుకుగా మారి, జీవన మార్పులకు గురువవుతుంది.
*****
మౌనము ముద్దులై మగువ మోమున కాంతులు కొత్త సిగ్గుగన్
మౌనము చూపులై మనసు మాటల వెల్లువ దారిచూపగన్
మౌనము తాకిడై మధుర భావము లక్ష్యము పొంగి పారగా
మౌనపు సంతసం సుధగ మానస రాగము సర్వ వేళలన్ (09)
భావం :మౌనం ముద్దులై మగువ ముఖంలో కొత్త సిగ్గు కాంతులను విరజిమ్ముతుంది.అది చూపులై మారి, మనసులోని మాటల వెల్లువకు దారిచూపుతుంది.స్పర్శగా మారిన ఆ మౌనం మధురభావాలను ఉప్పొంగిస్తుంది.చివరకు ఆ మౌనానందమే మానసిక రాగమై అన్ని వేళలా జీవనంలో మధురత్వాన్ని నింపుతుంది.
******
శా.ఈ కష్టమ్ములుమాయ సత్వరముగన్ నీస్ఫూర్తి తీర్చేందుకన్
ఈ కాలంబుసదా శుభంబుయగుటన్ యీమాట నాదైవంబుగన్
ఏకాలంబునయేమిచేసిన ఫలమ్ యేమార్పు కోరేందుకన్
నా కర్తవ్యము నీసహాయముగనున్ నా హృద్య రామంబుగన్
భావం :“అమ్మా! ఈ కష్టాలన్నీ త్వరలో తొలగిపోతాయి. శ్రీరాముని స్ఫూర్తి వాటిని నివారిస్తుంది. ఈ కాలమంతా శుభఫలితానికే దారితీస్తోంది — ఇది నా విశ్వాసం. ఏ కాలంలో ఏ కార్యం చేసినా దానికి తగిన ఫలమే లభిస్తుంది; మార్పు సమయం సమీపిస్తోంది. నా కర్తవ్యమే మీకు సహాయం చేయడం; శ్రీరాముడు నా హృదయంలో నిత్యవాసి. (10)
****
ఉ.దీటు శుపాటువేటులగు దీనుశుభంబు శు ప్రశ్నయేయగున్
దాటు శుకాటుమోటుయగు తట్టుట పట్టుట గిట్టుటే యగున్
పోటు సుఖాలగాటగుట పూటకు సాటిగ ఘాటు మోటుగన్
చోటును పట్టగుట్టుగను సోకుల సందడి కాపు రంబుగన్ (11)
సరళ భావం :ఈ లోకంలో కొందరు తమ తెలివి, చాతుర్యంతో ఎదగాలని చూస్తారు.కానీ ఆ ప్రయాణంలో మాటల దెబ్బలు, మోసాలు, గెలుపోటములు సహజమైపోతాయి.జీవితం ఒక పోటీగా మారి,ప్రతి రోజు జీవనోపాధి కోసం కఠినంగా పోరాడాల్సి వస్తుంది.ఒక్కో చోట రహస్యాలు, బాధలు, ఆందోళనలు నిండిన కుటుంబ జీవితం కనిపిస్తుంది.అంటే —బతుకు అనేది పోటీ, బాధ, పోరాటం, మరియు సంసారపు కలబోతల సమాహారం కాపురం
****
గీ.లేదు శివరామ నామము మించ మంత్ర
లేదు ఉత్తమగతి విశ్రమించ భవము
లేదు ఉత్తమ పదమన మించ జపము
లేదు శాసన మన్నది శివ పరంబు...12
సరళ భావం :“శివరామ” అనే దివ్యనామం కంటే గొప్ప మంత్రం లేదు.జనన మరణముల చక్రం నుంచి విముక్తి పొందేందుకు దానికంటే శ్రేష్ఠమైన మార్గం లేదు.మనసుకు శాంతి, ఆత్మకు విశ్రాంతి ఇవ్వగల ఉత్తమ జపం ఇదే.శివతత్త్వాన్ని మించిన పరమసత్యం, పరమశాసనం మరొకటి లేదు.అంటే —శివరామ నామస్మరణే మోక్షమార్గం, శాంతి మార్గం, పరమతత్త్వానికి దారి అని కవి భక్తి.
****
చెం. అనలుడు సూర్యుడైవెలుగు ధాత్రిని తృప్తిగపర్చ గావలెన్
తనువుల ధర్మమేమనసు తీపియు చేదుయు తప్ప కవ్వగన్
విలువలు తారు మారయిణ విద్యల తీరుగయేకమే యగున్
తనమన బేధమేయనక తన్మయ జీవనమార్గమేయగున్ (13)
సరళ భావం :అగ్ని, సూర్యుడు ప్రపంచానికి వెలుగునిచ్చి భూమిని తృప్తిపరచినట్లే,మనిషి శరీరధర్మంలో తీపి–చేడు అనుభవాలు తప్పవు.విలువలు కాలక్రమంలో మారినా, నిజమైన విద్య యొక్క సారం ఒక్కటే.“నేను–నువ్వు” అనే భేదం లేకుండా జీవించడం తత్త్వమయమైన జీవనమార్గం.
*****
మ. కో.కమ్మనైనది కాంతిపుంజము కన్నులారగ గాంచగన్
కమ్ముకున్నటి చీకటంతయు కాల మాయగ నెంచితిన్
సమ్మతంబగు మాటలన్నియు శాంతి కూర్చగ సఖ్యతన్
మమ్ము మేముగ యందరందరి మంచి చేయగ ప్రేమగన్ (14)
సరళ భావం :అందమైన కాంతిపుంజాన్ని కన్నులారా చూసినప్పుడు,మనసులోని చీకట్లు అన్నీ కాల మాయలుగా కనుమరుగవుతాయి.సమ్మతితో పలికే మాటలు శాంతిని కలిగించి స్నేహాన్ని పెంచుతాయి.మనమంతా కలిసి అందరికీ మేలు చేయాలనే ప్రేమభావంతో జీవించాలి.
***
మ..రతియేమూలము సృష్టి ధర్మమగుటన్ రమ్యత్వ ప్రేమంబుగన్
రతియేధర్మముగానుసత్యమగు సర్వార్ధంబు కల్పించు శు
వ్రతియేసర్వము సఖ్యతాభవము సంభావింప విశ్వాస భా
రతియేవిద్యల తత్వనేస్తమగుసంరక్షింప లోకంబుగన్ (15)
సరళ భావం : రతి అనేది సృష్టి ధర్మానికి మూలం; అది ప్రేమతో జీవనాన్ని రమ్యంగా చేస్తుంది. అదే ధర్మస్వరూపమై, సత్యమార్గంలో జీవనార్థాలను నెరవేర్చుతుంది. పవిత్రమైన వ్రతంలా సఖ్యత, విశ్వాస భావాలను పెంపొందిస్తుంది. రతి తత్వం అనేది విద్యలకు, జీవనసంబంధాలకు మిత్రంగా ఉండి ప్రపంచ సంరక్షణకు దోహదపడుతుంది.
*****
మ. కో.కమ్మనైనది కాంతిపుంజము కన్నులారగ గాంచగన్
కమ్ముకున్నటి చీకటంతయు కాల మాయగ నెంచితిన్
సమ్మతంబగు మాటలన్నియు శాంతి కూర్చగ సఖ్యతన్
మమ్ము మేముగ యందరందరి మంచి చేయగ ప్రేమగన్ (16)
సరళ భావం :అందమైన కాంతిపుంజాన్ని కన్నులారా చూసినప్పుడు,మనసులోని చీకట్లు అన్నీ కాలమాయలుగా కనుమరుగవుతాయి.సమ్మతితో పలికే మాటలు శాంతిని కలిగించి స్నేహాన్ని పెంచుతాయి.మనమంతా కలిసి అందరికీ మేలు చేయాలనే ప్రేమభావంతో జీవించాలి.
***
ఉ.యంజలియేమనంబున ప్రయత్న శుభంబగు అందరింపుగన్
శృంజన సఖ్యతాభవ విశృం ఖల ప్రేమగ విశ్వ భావమున్
మంజన మానసంబగు సమాన మనోభవ భవ్య దివ్యతన్
రంజిత కన్నులరాగతి రమ్యత లక్ష్యము కాపు రంబుగన్ (17)
సరళ భావం :అంజలి వంటి పవిత్రమనసుతో చేసే ప్రయత్నం అందరికీ మేలు చేకూర్చాలి.సృష్టిలో సఖ్యతాభావం విస్తరించి, విశ్వప్రేమ నిర్బంధం లేకుండా పరచాలి.మనసులు సమాన భావంతో పవిత్రతను పొందినప్పుడు దివ్యత్వం వెలుగుతుంది.ప్రేమతో నిండిన కన్నుల రాగం, దాంపత్య రమ్యతను కాపాడే లక్ష్యంగా నిలుస్తుంది.
****
ధ్రువ. నిలువ నైతిని సుందరాగివి నిన్ను చూడగ యేమియో
పలుకు గుండెన సందడేయగు పాఠమవ్వుట యేలనో
నలుక నాదగు ద్రోహమేమది నాడి నిన్నును కోరుటే
వలపు లన్నియు చెంత జేర్చగ వాక్కులేస్థితి ప్రేమగన్ (18)
సరళ భావం :నీవు సుందరంగా ఎదుట నిలబడగానే ఏమైందో తెలియని భావం కలిగింది.హృదయం సందడిగా మారి, ప్రతి మాట ఒక పాఠంలా అనిపిస్తోంది.నోట పలికే ధ్వనికీ అర్థం లేకుండా, మనసు మాత్రం నిన్నే కోరుతోంది.అన్ని వలపులూ దగ్గర చేరినప్పుడు, మాటలన్నీ ప్రేమరూపంగా మారిపోతున్నాయి.
****
శా.వాయుస్నానము నీరుగాను తనువుల్ స్వచ్చాచ్చ సంశుద్ధకై
హాయిoబొందుట యౌవనంబు కళ సూన్యమ్మందగాజేసి, మీ
రేయుల్లాసమసంతసంబు మనసై నెంతేని శోభించగా
శ్రేయ్యంబిచ్చు సమీరవెన్నెల భవ లాశీర్వాద భాగ్యంబెగా (19)
సరళ భావం :వాయుస్నానం, నీటి స్వచ్ఛత శరీరాన్ని పవిత్రంగా ఉంచుతాయి.అవి హాయిని ప్రసాదించి,యౌవనోత్సాహాన్ని నిలబెడతాయి.రేయి వెన్నెలలో మనసు ఆనందంతోకళకళలాడినప్పుడు జీవితం మరింత శోభిస్తుంది.అలాంటి చల్లని గాలి, వెన్నెలలు భవజీవితానికి దైవాశీర్వాదసమానమైన శ్రేయస్సును అందిస్తాయి.
****
ఉ.శారద చంద్రికా కర సుధా మధురామృత ధారి గానగున్
నీరద నారు నీరుగను నీదయ గా యినుడా తపస్సుగన్
నోర జపించస్తుతలను యించెడు విద్యల సర్వ రూపుడున్
నారద,తుంబురా హనుమ నమ్మక నేస్తము గాను సద్గురో (20)
సరళ భావం :శారదాదేవి చంద్రిక వలె అమృతమయమైన కరుణను ప్రసరింపజేసే గురువు,మేఘజలంలా శాంతిని అందిస్తూ, తన దయతో తపస్సుకు దారి చూపుతాడు.నోటి ద్వారా స్తోత్రజపాలు చేయిస్తూ, సమస్త విద్యారూపుడిగా వెలుగుతాడు.నారదుడు, తుంబురుడు, హనుమంతుడు వంటి భక్తుల నమ్మక స్నేహితుడైన సద్గురువుకు నమస్సులు.
*****
చెప్పగమేలు తప్పగు విచిత్రము దేహము తాపమవ్వగన్
జిప్పల కూడు నొప్పక సుచిత్తము పొంతన మార్పు రాకయున్
ఉప్పులకుప్పయాడెద సఉజ్వల మొందక కాలమాయగన్
నెప్పులు తప్పవే బ్రతుకు యేలిక చెంతకు కాన రాకకున్ (21)
భావం :మనిషి ఎంత చెప్పినా, ఎంత జాగ్రత్తపడినా తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఈ విచిత్రమైన దేహం తాపత్రయాలకు నిలయమవుతుంది. శరీరం కేవలం “జిప్పల కూడు” — ఎముకలు, మాంసం, చర్మం కలయిక మాత్రమే; అయినా మనస్సు పవిత్రతను సంపాదించక, లోపలి మార్పు రాకపోతే జీవితం వెలుగును పొందదు.ఉప్పుల కుప్పలా కోరికలు, క్షణిక రుచులు పెరిగినా, అవి నిజమైన ఉజ్వలతను ఇవ్వవు. కాలమనే మాయ మనిషిని నడిపిస్తుంది. అందువల్ల ఈ బ్రతుకులో నొప్పులు, కష్టాలు తప్పవు; జీవన యాత్రలో అవి మన వెంటనే ఉంటాయి.
******
న్యస్తాక్షరి.. పాదాది... వి,శ్వ, ధ,ర్మ
విద్యావిప్లవసర్వకర్మనిరతా విజ్ఞానదీప్తిర్భవేత్ ।
శ్వాసోऽయం జగజ్జీవనార్థసహితః శాంతిప్రసాదప్రదః ॥
ధర్మార్థప్రభుదాయసారసహితో ధాత్రీజనాన్ పాలయేత్ ।
రమ్యం ప్రాంజలివిశ్వపద్యసుధయా రంజేత నిత్యం జగత్ ॥ 22
భావం :విద్య ద్వారా సమాజంలో విప్లవాత్మక మార్పులు సంభవించి, ప్రతి కార్యమూ విజ్ఞాన కాంతితో నిండాలి. జీవితం శ్వాసతో నిలిచినట్లే, జగత్తు శాంతి, సౌభాగ్యాలతో నడవాలి. ధర్మం దయతో కూడి ప్రజలను రక్షించాలి. అలాంటి శుభసంకల్పాలను మధురమైన పద్యసుధగా “ప్రాంజలి విశ్వ” నిత్యం ప్రపంచంలో విరజిల్లజేయాలి.
*****
కటిక చీకటి కమ్మె సంద్రము గమ్య మేదియు లేకయే
స్పటిక కాంతిన జీవనంబయు సాగలేనిది నీడలో
ఘటిక కారణ మీదిలేకయు గమ్యమే గన లేకయున్
చిటిక తత్త్వపు ప్రేమ జీవన చిత్తమేయగు కాలమున్ (23)
భావం :కటికమైన చీకటి కమ్ముకున్న సముద్రంలా ఈ జీవితం కొన్నిసార్లు గమ్యం లేనిదిగా అనిపిస్తుంది.స్పటికంలాంటి నిర్మల కాంతి ఉన్నప్పటికీ, నీడల మధ్య జీవనం సులభంగా సాగదు.ఏ కారణం స్పష్టంగా కనిపించకపోయినా, గమ్యం కూడా తెలియక మనిషి కాలప్రవాహంలో తడబడుతుంటాడు.అయితే చిటికెడు తత్త్వజ్ఞానం, కొద్దిపాటి ప్రేమ — ఇవే జీవన చిత్తాన్ని నిలబెట్టే అసలైన విలువలు.
***
శా.ఆ తీరం గనలేనిసంద్రమదియే ఆశ్చర్య వైనంబుగన్
ఖ్యాతీగాంచని జీవనంబుగనుయే కాలమ్ము కర్మంబుగన్
నాతీ గమ్యముతృప్తి గాంచ బతుకే నమ్మేట్లు లేదేందుకన్
ఈతీరే పలు దుఃఖ సౌక్యములుగా విద్యల్లె నిశ్చేష్టగన్(24)
భావం :ఈ జీవితం తీరం కనిపించని సముద్రంలాంటిది — అదే గొప్ప ఆశ్చర్యం.పేరు ప్రఖ్యాతులు పొందకపోయినా, కాలమే కర్మరూపంగా జీవనాన్ని నడిపిస్తూ ఉంటుంది.మన గమ్యం ఎక్కడో, ఎప్పుడు తృప్తి లభిస్తుందో అన్న నమ్మకం కూడా స్పష్టంగా కనిపించదు.ఇలాగే ఈ లోకజీవితం ఎన్నో దుఃఖాలు, కొంత సౌఖ్యంతో కలిసిన ప్రవాహంలా సాగుతుంది;చివరికి విద్యలు, జ్ఞానాలు కూడా ఒక నిశ్చేష్ట స్థితిలో నిలిచిపోయినట్లుగా అనిపిస్తాయి.
****
పడవ లాంటిది గమ్య చూపులు పాటు పోటులు తప్పవా
గడప లాగున నొక్క చోటున గాంచ లేనిది కాలమా
నడవ లేని యనంత యాసల నాటకంబగు లోకమున్
మడమ తిప్పిన మౌనయాణము మానసంబగు సంద్రమున్ (25)
భావం :జీవితం ఒక పడవ వంటిది — గమ్యాన్ని చేరే ప్రయాణంలో పాటు, పోటీలు, కష్టాలు తప్పవు.కాలం గడపలా ఒకేచోట నిలిచి ఉండదు; అది ఎప్పటికప్పుడు ముందుకు సాగుతూనే ఉంటుంది.అనంతమైన ఆశలతో నిండిన ఈ లోకం నడక తెలియని నాటకరంగంలా మారిపోతుంది.అలాంటి జీవనంలో, ఒక్కసారిగా మడమ తిప్పినట్లు లోనికి తిరిగే మౌనయాత్ర మనస్సు అనే సముద్రంలోనే సాగుతుంది.
****
మ. స్వరమోహంబుయు పాపకృత్యములుగా వత్సల్య ప్రేమంబుగన్
తరుణానందము విశ్వాసంభవముగాతన్మాయ సంసేవగన్
శరణార్థత్వము సఖ్యతార్ధమగు విశ్వాసంబు విజ్ఞానంబుగన్
కరుణా దూరుఁడు దేవుడందురు నమస్కారమ్ము లింకెందుకో (26)
మధురమైన మాటలు, మోహాలు కొన్నిసార్లు తప్పు పనులకు దారితీస్తాయి.ప్రేమ, మమత, యౌవనానందం విశ్వాసంతో కూడి ఉంటే మంచిగా మారుతాయి.శరణు కోరడం, స్నేహం చేయడం, విశ్వాసం కలిగి ఉండడం వల్ల జ్ఞానం పెరుగుతుంది.కరుణ లేని వాడిని దేవుడని అంటుంటే, అలాంటి దేవునికి నమస్కారం ఎందుకు చేయాలి?
****
శా.ఓంకార ధ్వనియె లోన ఊహలగనే నోదార్పు దీపంబుగన్
టంకారoబుయు మాయ తీరుమనిషే తత్వార్ధ మై ముంచగన్
రింకారంబుజవైన ధ్యానముగనే రీతిస్వ మమ్మేలుగన్
గాoకామ్యస్వరభక్తి జీవనముగన్ గ్రాహ్యంబు గామౌనగన్ ॥
భావం :ఓంకార ధ్వని అంతరంగంలో ఊహలకు ఓదార్పునిచ్చే జ్ఞానదీపంలా వెలుగుతుంది.టంకారంలా వినిపించే లోకమాయ చివరకు మనిషిని తత్వార్థంలో ముంచుతుంది.రింకారస్వరంలా సున్నితమైన ధ్యానం మన అంతరంగ స్వరూపాన్ని మేల్కొలుపుతుంది.గాఢమైన స్వరభక్తితో నిండిన జీవనమే చివరకు మౌనానుభూతిగా గ్రాహ్యమవుతుంది.
****
మ.ఒకనాడే కలిశారుసత్యమగు సింధూరం ప్రసన్నమ్ముగా
సకలంబున్ సహవీర్య సంపదగనున్ సాధ్యంబు సుసేవారమమ్
వికసంబున్ సహభక్తి మార్గమగుటన్ విద్యా విశాలత్వమున్
ఇక రామాయణ ఆంజనేయుని కళా యిష్టాను రామంబుగన్
భావం :ఒకనాడు కలిసిన శ్రీరామ–ఆంజనేయుల అనుబంధం సింధూరప్రసన్నతవలె పవిత్రమైనది.వారి సహవీర్యం, పరస్పర విశ్వాసం, సేవాసంపద సమస్త కార్యాలను సాధ్యంగా చేసింది.సహభక్తి మార్గం వికసించి, విద్యా విశాలత్వాన్ని ప్రపంచానికి చూపింది.ఇదంతా రామాయణంలో ఆంజనేయుని కళ, ఇష్టం, ఆరాధన, రామనిష్ఠగా వెలుగుతోంది.
****
: మ. కో. కానవే మది సోయగాలివి గాంచ గల్గు విపంచికా
మేను దాహము తీపిచేదన మేలు సంతస భామినీ
మానునన్నను మానలేనిది మానసాంబగు హాసినీ
సోనితమ్మున నిత్య సత్యము సొమ్మసిల్లుట గానవా
భావం :ఓ సోయగాల రూపిణీ! నా హృదయానికి కనువిందు చేసే ప్రేమ విపంచికవంటి స్వరమా!నీ మేనిసోయగం దాహంలా వేడెక్కించినా, అదే తీపి చేదనగా సంతోషాన్నీ ఇస్తోంది ఓ భామినీ!నిన్ను మరువాలని అనుకున్నా మరువలేని స్థితి — అది నా మానసస్వరూపమైన చిరునవ్వే.రక్తసంబంధములా లోతైన నిత్యసత్యం ప్రేమలో సొమ్మసిల్లిపోవడమే కాదా?” అని నాయకుని అంతరంగం పలుకుతోంది.
****
: మత్తకోకిల:
కానరావె ప్రియా మదీయ నిగాద ప్రేమ విపంచికా
మేను జూడగ జాను రేఖల మేలు బంగరు సోయగన్
బౌనటే సఖియా!సుశీల విభామిణీ! దర హాసినీ!
సోని వానల జల్లు యైనది చుక్కవైతివి గానవా!
డా.మీ.మి*
భావం :ఓ ప్రియతమా! నా హృదయంలో నినదించే ప్రేమ విపంచికవంటి స్వరరాగమా! ఎందుకు కనబడవు?నీ మేనిని చూచినపుడు బంగారు రేఖల్లా మెరిసే సోయగం మనసును మైమరపింపజేస్తోంది.ఓ సఖీ! ఓ సుశీలవతి! ఓ ప్రకాశమయ సుందరి! చిరునవ్వుతో మనసును కట్టిపడేసే దరహాసినీ!సున్నితమైన వానజల్లులా వచ్చి, ఆకాశంలోని చుక్కవలె నా జీవనంలో వెలుగవు కాదా?” అని నాయకుడు ప్రేయసిని ఆహ్వానిస్తున్నాడు.
****
చం. తనువునుంటధూళి కణ తత్వ విభూతిగ పూత గాగయున్
ఆణువణువేమెరుపు కాంతియు శాంతిగనవ్వు చూపులున్
ప్రణయపు చూపు హృద్యమున పాశము కాముని కన్ను తీరుగన్
గణగున తీరు నవ్వులతొ గమ్యము చూపెడి బాల కృష్ణుడున్
సరళ భావం:బాలకృష్ణుని శరీరంపై ఉన్న ధూళికణాలు కూడా పవిత్ర విభూతిలా కనిపిస్తున్నాయి.ఆయన ప్రతి అణువులో మెరుపులాంటి కాంతి, శాంతిని పంచే నవ్వు కనిపిస్తున్నాయి.ఆ ప్రేమతో కూడిన చూపులు మనసును కట్టిపడేసే మన్మథుని బాణాల్లా హృద్యంగా ఉన్నాయి.ఆయన నవ్వులు గలగలా మోగుతూ జీవన గమ్యాన్ని చూపిస్తున్నాయి.
****
కక్ష కాపుర కామినీమది కాల వైనము యేలనో
శిక్ష యేగతి మోహతాపము శీఘ్ర సంపద తప్పదో
రక్ష గాస్థితి మాత్రమేయగు రమ్య దాహము కాలమే
దక్షతావిధి యాడు నాటక ధారి దాతగ నిత్యమున్
భావం :కక్షలు, కాపుర జీవితం, కామినీ మదం — ఇవన్నీ కాల ప్రభావంలో ఎలా మారిపోతాయో ఎవరికీ పూర్తిగా అర్థం కాదు.మోహంతో కూడిన తాపమే చాలాసార్లు శిక్షగా మారుతుంది; శీఘ్రంగా వచ్చిన సంపద కూడా నిలకడగా ఉండకపోవచ్చు.రక్షణగా కనిపించే స్థితి కూడా కాలానుగుణమైన ఒక తాత్కాలిక దాహమే.చివరకు ఈ జగత్తు మొత్తం దక్షతతో నడిచే విధి అనే మహానాటకంలో, కాలమే పాత్రధారి, దాత, దర్శకుడిగా నిత్యం కొనసాగుతుంటుంది.
***
కరుణ వృష్టిని కామ్య దృష్టిని కన్న తండ్రిగ తల్లిగా
అరుణ దృష్టిని కావ్య ముష్టిని ఆశ శృష్టిగ మెల్లగా
చరణ బ్రష్టుని ప్రేమ త్రాష్టుని చెంచ లాష్టుని నమ్మగా
తరుణ యిష్టుని నిత్య జేష్టుని తన్మ యాష్టుని గొల్వగా
భావం:అరుణోదయ దృష్టిలా మెల్లగా ఆశల సృష్టిని కలిగించే దైవత్వం,తప్పిపోయిన అడుగులవారినీ ప్రేమతో ఆదరించి నమ్మకం కలిగించేది.యువతకు ఇష్టదైవమై, ఎల్లప్పుడూ శ్రేష్ఠతను ప్రసాదించేది.తన్మయత్వంతో ఆరాధించిన వారికి కరుణావర్షమై, కోరికలను నెరవేర్చే దృష్టిగా,కన్న తండ్రిలా రక్షణనిచ్చి, తల్లిలా మమతను పంచేది ఆ పరాశక్తి.
****
వెలుగు రేఖలు జాతినందున వెల్లి విర్శియు కాలమై
విలువలన్నియు విద్యతీరుణ విశ్వముందున జ్ఞానమై
చలన ఆత్మలు తృప్తి చెందుచు జన్మ సార్ధత తన్మ మై
పలుకు దృష్టిని తీపి వృష్టిని పాఠ్య సృష్టిని జన్మమై
భావం :వెలుగు రేఖలు జాతి అంతటా విస్తరించి కాలప్రవాహంగా మారాలి.విలువలు విద్య ద్వారా విశ్వవ్యాప్తంగా జ్ఞానరూపంలో వికసించాలి.చలించే ఆత్మలు తృప్తి పొందుతూ జన్మసార్థకతను అనుభవించాలి.మన పలుకులు దృష్టిని ప్రసాదించి, తీపి వర్షంలా హృదయాలను తడిపి, సృష్టికి పాఠ్యమై నిలవాలి
****
ఉ. లేదను వర్షలేసమగు నేమని చెప్పెద కాలమాయగన్
శోధన తప్పదాబ్రతుకు సోద్యము తీరుగ యేమి మెప్పుగన్
సాధన సూన్యమైకళల సారము మేఘము తీరుయేయగున్
వాదన చుట్టుముట్టగతి వాక్కుల చల్లని వేడి గాలులే
భావం :“లేదని” చెప్పే నిరాశల వర్షాలు వచ్చినా, అది కాలమాయలో భాగమే.జీవితం అనేది ఎప్పటికీ ముగియని శోధన; అందులో నిజంగా ఏది మెప్పు పొందుతుందో చెప్పడం కష్టం.సాధన లేకపోతే కళల సారం మేఘంలా చెదిరిపోతుంది, నిలకడ కోల్పోతుంది.చివరకు వాదనలు మనిషిని చుట్టుముట్టి, మాటలు చల్లగానూ వేడిగానూ మారే గాలుల్లా అశాంతిని కలిగిస్తాయి.
*****
గీ.రెమ్మలాగున ప్రేమను రేపు తరము
కొమ్మ నీడనిచ్చి కుటుంబ గొప్ప గనుము
చెమ్మగుండె మాతృక భాష చిత్త దీప
నెమ్మదై జీవిగాస్థితి నిజము తెల్ప
భావం :రెమ్మలాగా విస్తరించే ప్రేమ భావం తరతరాలకు చేరాలి.కొమ్మలా ఆశ్రయం ఇచ్చే కుటుంబ బంధమే నిజమైన గొప్పదనం.చెమ్మతో నిండిన హృదయంలో మాతృభాష చిత్తానికి దీపంలా వెలుగునిస్తుంది.నెమ్మదిగా, స్థిరంగా జీవించడం ద్వారానే నిజమైన జీవనసత్యం తెలుస్తుంది.
*****
లోకమను చరితా నమ్మ లౌక్య విలువ
నిజ గుణాను భవంబగు నీడ చిత్త
ఉదరపోషణ సర్వ స్వపూజ్య భావ
వర కుటుంబము వసుదైక వాక్కు మాయ
భావం :ఈ లోకం అనేది అనుభవాల చరిత్ర.దీనిలో మనుషులు నమ్మే లౌక్య విలువలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి.నిజమైన గుణానుభవం మాత్రం మనసుకు నీడలాంటిది — ఎప్పుడూ వెంట ఉండే అంతర్మూల్యం.చాలామంది జీవితం ఉదరపోషణకే పరిమితమై, స్వార్థపూరిత స్వపూజ్య భావంతో నడుస్తోంది.“వసుధైక కుటుంబం” అని మాటల్లో చెప్పినా, ఆ వాక్యం చాలాసార్లు ఆచరణలో మాయగానే మిగులుతోందని కవి సూచిస్తున్నారు.
****
శా.అప్పేదప్పక నొప్పుకోచెవుడషే ఆసేలె తప్పేమిలే
విప్పారుజ్వల వాక్కులేభరణమై విస్పార నోరారుగా
నొప్పీచెప్పకవిప్పిచూపకఫలం తోడ్పాటు యేకూర్పుగా
ఒప్పేతప్పక చెప్పకాబ్రతుకుకే ముంచిద్ది లే మంచిగా
భావం :ఎవరైనా అప్పుడప్పుడు తప్పు చేసినా, దాన్ని పెద్దదిగా చేసుకోకుండా ఒప్పుకొని ముందుకు సాగడం మంచిదే.అత్యుత్సాహంతో విప్పారిన మాటలు, ఆగ్రహపు వాక్యాలు అలంకారంలా కనిపించినా చివరకు నోరూరే వాదాలకే దారితీస్తాయి.ప్రతి నొప్పిని బయటపెట్టకుండా, ప్రతి లోపాన్ని విప్పి చూపకుండా, పరస్పర సహకారంతో జీవితం కొనసాగితే ఫలితం మేలే.అన్ని విషయాలు తప్పనిసరిగా చెప్పకపోయినా, అర్థం చేసుకుంటూ జీవించడం బ్రతుకుకు మేలైన మార్గమని కవి సూచిస్తున్నారు.
****
చెప్పి రాదేది ఆవేశ చిత్త బలుపు
నది శరీరము కదలిక నటనకాదు
నా మది స్థానమగు రహస్య స్థలంబు
నిజమని తెలపరాదు యోగులకునైన
భావం :చెప్పినా రాని కొన్ని విషయాలు ఉంటాయి — ముఖ్యంగా ఆవేశంతో నిండిన మనసు యొక్క అసలు బలం, లోపలి కదలికలు.నదీ శరీరం ప్రవహించడం కేవలం ఒక నటన కాదు; అది అంతరంగ స్వభావం. అలాగే మనసులోని గూఢ స్థితి కూడా బయటకు పూర్తిగా తెలియజేయలేనిది.మన హృదయంలో ఉన్న ఆ రహస్య స్థలం, ఆ అంతర్మౌన సత్యం — అది యోగులకు కూడా పూర్తిగా చెప్పలేనంత గంభీరమైనది.
****

Comments
Post a Comment