14*05*

 






ఎ డీర్ హంట్ - రాత్రి వేట రహస్యం.

...................................

సామాన్యశకం 1775 కాలం నాటి ఎ డీర్ హంట్ అనే ఈ అపురూప రాజస్థానీ పెయింటింగ్ ప్రస్తుతం అమెరికాలోని బాల్టిమోర్‌లోని వాల్టర్స్ ఆర్ట్ మ్యూజియంలో ఉంది. రాజస్థాన్‌లోని కోటా సంస్థాన శైలికి చెందిన ఈ చిత్రం ఒక రాత్రివేళ జరిగిన జింకల వేట దృశ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరింపచేస్తోంది.

ఈ చిత్రంలో వేటగాడితోపాటు మరో స్త్రీచేతిలో ఏదో  ఉంచుకొన్న వస్తువును చూసి చాలామంది అది పురాతన కాలపు ‘ఫ్లాష్‌లైట్’ అని అపోహ పడుతుంటారు. కానీ నిజానికి అది వేట కోసం ప్రత్యేకంగా రూపొందించిన సాంప్రదాయ దీపం. మట్టి కుండలో గానీ శంఖాకారపు లోహపు గొట్టంలో గానీ నూనె దీపాన్ని ఉంచి దాని ముందు భాగంలో మాత్రమే కాంతి వచ్చేలా చిన్న రంధ్రం పెడతారు. ఆ వెలుతురును నేరుగా జంతువుల కళ్లపై కేంద్రీకరిస్తే చీకట్లో ఒక్కసారిగా పడిన వెలుగుకు జింకలు బెదిరిపోయి కళ్లు మిరుమిట్లు గొలిపి కదలకుండా నిలబడిపోతాయి. ఆ సమయంలో వేటగాళ్లు సులభంగా బాణం వేస్తారు. ఈ పురాతన పద్ధతినే ఇప్పుడు ఆధునిక వేటలో ‘స్పాట్‌లైటింగ్’ లేదా ‘జాక్‌లైటింగ్’ అని పిలుస్తారు. చాలా దేశాల్లో ఇది చట్టవిరుద్ధం కూడా.

ఈ పెయింటింగ్ కోటా సంస్థానపు చిత్రకళా శైలికి చక్కటి ఉదాహరణ. 

ఈ చిత్రంలో నేపథ్యం (Back Ground) ముదురు ఆకుపచ్చ, నీలం రంగుల్లో ఉండి రాత్రి వేళను స్పష్టంగా తెలియజేస్తుంది. చెట్లు పొదలు వేటాడిన జింక వద్ద కూర్చోని వున్న అనుచరుడు నీటి మడుగు మొదలైనన్నీ సహజసిద్ధంగా గీశారు. చిత్రంలో ఆకులు, కొమ్మలు కట్టుకుని గిరిజన వేటగాళ్ల వేషంలో ఉన్న స్త్రీ పురుషులు కనిపిస్తారు. అయితే ఆ స్త్రీ మెడలో ముత్యాల హారం, చేతులకు కడియాలు, చెవులకు కుండలాలు ధరించడం చూస్తే ఆమె సాధారణ గిరిజన మహిళ కాదని రాజకుటుంబానికి చెందిన రాణి గానీ రాకుమారి గానీ వేట వినోదం కోసం మారువేషంలో వచ్చి ఉండవచ్చని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు.  

కోటా సంస్థానాధీశులు ముఖ్యంగా మహారాజా ఉమేద్ సింగ్ కాలంలో ఇలాంటి రాత్రి వేట దృశ్యాల చిత్రాలు ఎక్కువగా వేయించారు.  

పెయింటింగ్‌లను ఉడుత తోక వెంట్రుకలతో చేసిన అతి సన్నని కుంచెను ఉపయోగించి ఖనిజాలు మొక్కలు శంఖం పొడి బంగారు రేకుల నుంచి తయారుచేసిన సహజ రంగులతో వేసేవారు. ఒక బొటనవేలి గోరు పరిమాణంలో ఉండే ముఖంలో కూడా కంటిపాప కనుబొమ్మలు స్పష్టంగా కనిపించేలా చిత్రించడం ఈ కళ ప్రత్యేకత. ఎ డీర్ హంట్ చిత్రం కేవలం వేట దృశ్యమే కాదు, 18వ శతాబ్దం నాటి రాజస్థాన్ రాజుల వేట పద్ధతులు, సాంకేతికత, మారువేష వినోదాలు, చిత్రకళా నైపుణ్యం అన్నింటికీ అద్దం పడుతుంది.

ఒక విషయం చెప్పండి ! నాడు రంధ్రం చేసిన కుండలో పెద్ద దీపం వుంచినంత మాత్రానా అది ఈ కాలపు టార్చిలైట్ లా ఫోకస్ గా కాంతి వస్తుందా ? రాదు కదా! ఏదో సాంకేతికత ఉంటేనే చిత్రంలో చూపిన విధంగానేటిలాగా ఫ్లాష్ లైట్ వస్తుంది కదా! మరి ఏ కిటుకు (టెక్నిక్) వాడారో ! గొప్ప జ్ఞానమే కదా వారిది !


॥సేకరణ॥  

................జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం


.*భైరవవాక - 9*

🔱

రచన: ఇందూ రమణ



అప్పటికి సరిగ్గా అర్థరాత్రి రెండు గంటలు కావస్తోంది. దానికి సూచనగా కచేరిలో గంటలు కూడా ఠంగు ఠంగున ... వరుసగా రెండు గంటలు విన్పించాయి.


జనాల అలికిడి ప్రారంభమయింది...


కాకులు కావు కావుమంటూ గోలచేస్తున్నాయి.


చెరువుకు ఇవతల స్మశానం ఉంది. అవతల భక్తుల స్నానాల రేవు. తూర్పున యాతపేట, పడమర పక్కన విజినిగిరి పాలెం వెళ్ళే రహదారి ఉన్నాయి. భక్తుల స్నానాల రేవుకు ఎదురుగా దేవుడి కోనేరుకు రావడానికి రాజవీధి మార్గం ఉంది.


ఇద్దరూ బట్టలు సర్దుకొని పొదల పక్క నుంచి చెరువు గట్టుపైకి వచ్చారు. వారికి ఎదురుగా పదేళ్ళ కుర్రాడు వాళ్లనే గమనిస్తూ నిలబడ్డాడు.


వాణ్ణి చూసి ఇద్దరూ ఒక్కసారే అదిరిపడ్డారు.


"ఎవరు నువ్వు?!" కరకుగా ప్రశ్నించింది మోనిషా.


"నువ్వు... నువ్వు..... పిచ్చిదానివి కాదా?" ఆ కుర్రాడు భయ భయంగా అన్నాడు. అతని చేతిలో పూలబుట్ట క్రిందపడింది. నెమ్మదిగా వంగి తిరిగి చేత్తో పట్టుకున్నాడు ఆ కుర్రాడు.


"ఏరా అప్పల్రాజు ఇక్కడున్నావేం?" ఆ కుర్రాడ్ని సమీపించి ప్రశ్నించాడు పాండే.


"అదిగో! మా అమ్మ ! ఆ తోటలో పూలు ఏరుతోంది. నేనిక్కడ కూర్చున్నాను." భయం భయంగా అన్నాడు కుర్రాడు. విజినిగిరి పాలెంకి వెళ్ళెదారిలో పూలతోట ఉంది. అక్కడ ఆ కుర్రాడి తల్లి పూలు ఏరుతోంది.


“నీకు ఈ కుర్రాడితో పరిచయం ఉందా?" మోనీషా అంది.


“పూలమ్మే పైడమ్మకి ఒక్కగానొక్క కొడుకు మంచోడే” నెమ్మదిగా చెప్పాడు పాండే. 


"నువ్వు ఎంతసేపట్నుండి ఇక్కడున్నావ్!" అడిగాడు పాండే.


"ఎవరో ఒకతన్ని మీరిద్దరూ మాట్లాడి పంపేసారే... అప్పట్నుండీ మిమ్మల్ని చూస్తున్నాను. మీ మాటలు వింటున్నాను. మీరిద్దరూ ఏదో చేద్దామనుకుంటున్నారు. అంతా నాకు తెలుసు" అంటూ ఆ కుర్రాడు రెండడుగులు వెనక్కి వేసి గిర్రున తిరిగాడు.


మోనిషా అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. మరిక, ఆలోచించదలచుకోలేదు.


తల్లిని చేరడానికి వెనుదిరిగిన కుర్రాణ్ని గబాల్న వెళ్ళి ఒక చేత్తో నోరు నొక్కి మరోచేత్తో గట్టిగా ఒడిసి పట్టుకుంది మోనీషా.


ఆ కుర్రాడు ఈ హఠాత్పరిణామానికి ఉలిక్కిపడ్డాడు. ఆమె చేతుల్లోనుంచి విడిపించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ గించుకున్నాడు. ఆమె ఉడుం పట్టునుంచి విముక్తి కాలేక పోయాడు.


ఆమె ఆలోచన గ్రహించిన పాండే అదిరిపడ్డాడు.


"మోనిషా! ప్లీజ్! వదిలేయ్!" జాలిగా అన్నాడు పాండే.


"షటప్ ! ఇప్పుడు మనం వీడి నోరు ముయ్యకపోతే వీడే రేపు మన నోరు మూయిస్తాడు." అంది కోపంగా.


“మోనిషా! ప్లీజ్ ! కుర్రాడే కదా ! పాపం ! వదిలేయ్ ! మన గురించి ఎవరికీ చెప్పడులే!" అర్ధించాడు పాండే.


"ఈ వృత్తిలో దయా దాక్షిణ్యాలుంటే కూడు కాదుకదా గూడు కూడా దొరకదు. పైపెచ్చు కటకటాలపాలై వూచలు లెక్కపెట్టవలసి వస్తుంది. "అంటూ ఆ కుర్రాణ్ణి బలంగా గుండెలకు అదుముకొని నోరు... ముక్కు గట్టిక మూసి పట్టుకుంది.

ఆ కుర్రాడు చాలాసేపు గిలగిలా గించుకుని కాళ్ళూ చేతులు కొట్టుకుంటూ ఆమె రాక్షస హస్తాల నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నించి...ప్రయత్నించి చివరికి విఫలమయ్యాడు. విగతజీవుడయ్యాడు.


పాండే ఎంత వారించినా వినలేదు మోనీషా. రాక్షసిలా జుట్టు విరబోసుకున్న పిశాచిలా వికృతంగా భయంకరంగా ఉందా క్షణంలో మోనిషా. ఆమె కళ్లు ఎర్రగా... చింత నిప్పుల్లా ఉన్నాయి. ఆమె కళ్ళల్లోకి చూసి అప్రయత్నంగానే తన ప్రయత్నం విరమించుకున్నాడు. ఆమె మొహంలో ఆవరించుకున్న ప్రేత కళచూసి అవాక్కయ్యాడు పాండే.

📖


రాత్రి నెమ్మదిగా తెల్లారుతోంది. పాత బస్సు స్టాండ్ అంతా కోలాహలంగా ఉంది.


విశాలమైన కొండ బస్టాండ్ ఆవరణలో వేలమంది యాత్రీకులు ఆదమరిచి నిద్రపోతున్నారు. అందులో సగానికి సగం మంది నిద్రనుంచి తేరుకొని దైవదర్శనానికి సన్నద్ధం అవుతున్నారు.


అంతా గందరగోళంగా ఉంది. ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. యాత్రీకుల వెంట తిరుగుతున్న కొబ్బరికాయల వర్తకుల హడావిడే ఎక్కువగా ఉంది.


నిద్ర లేచిన వాళ్లని వేగిరం బయల్దేరమని గాబరా పెడుతున్నారు. ఆలస్యం అయితే దైవదర్శనం దొరకడం కష్టమని భయపెడు తున్నారు. నిద్ర లేవని వాళ్ళని అదిలించి కేకలేస్తూ లేపుతున్నారు.


కొబ్బరి కాయలు వ్యాపారుల కుటుంబాల్లో ని ఆడా.... మగా ..... పిల్లా పీచు అందరూ యాత్రీకుల చుట్టూ కాయలు పట్టుకొని తిరుగుతున్నారు.


ఎవరూ తనని గమనించకుండా జాగ్రత్త పడుతూ నక్కి నక్కి వచ్చి పాత్రో కుటుంబ సభ్యుల పక్కన తన స్థానంలో తాను పడుకున్నాడు పాండే.


పాండేకి మాత్రం గుండెల్లో ఆందోళనగానే ఉంది. మోనీషా చేసిన పని వలన ఏం ముంచుకొస్తుందోనని భయపడుతూనే పడుకున్నాడు.


తాము పూల కుర్రాడ్ని చంపడం ఎవరైనా గమనిస్తే తమ పని సరి. తమ ప్లానంతా తలక్రిందులవుతుంది. ఆర్నెళ్ల తమ అజ్ఞాత వాస ఫలం బూడిద పాలవుతుంది.

📖


పాత్రో కుటుంబానికి సహాయం చేసిన కొబ్బరి కాయల వ్యాపారి రామయ్యమ్మ ఆదరా బాదరాగా అటూ ఇటూ కంగారు కంగారుగా తిరుగుతోంది.


కొండ బస్టాండ్ కి ఓమూల రాకాసిలా నిలుచున్న మర్రిచెట్టు క్రింద టీ స్టాల్ ఉంది. తోపుడు బల్లమీద 'టీ' స్టాల్ ఏర్పాటు చేసి జనం మధ్యనే బండి తోసుకుంటూ 'టీ' అమ్ముతున్నారు కొందరు. ఇద్దరు ముగ్గురు పెద్ద పెద్ద ప్లాస్కుల్లో 'టీ' పోసి ఆ ప్లాస్కులు భుజాన మోసుకొని 'టీ... టీ...' అని అరుచుకుంటూ తిరుగుతున్నారు.


రామయ్యమ్మ చెల్లెలు, కూతురు, కొడుకులు అందరూ కొబ్బరి కాయల అమ్మకంలోనే ఎవరి హడావుడిలో వాళ్లున్నారు.


పాత్రో కుటుంబాల్లాంటి పాతిక పైచిలుకు కుటుంబాల వాళ్ళను తుంగ చాపలు గట్రా అందించి తను 'ఖాయ' పెట్టుకుంది రామయ్యమ్మ.

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

అక్కడి వ్యాపారుల్లో గమ్మత్తయిన నియమం ఉంది. యాత్రీకులు బస్సు స్టాండ్ లో బస్సు దిగీ దిగ్గానే కొబ్బరి కాయల వ్యాపారస్తులంతా తమ ... తమ... యాత్రీకుల్ని రకాల రకాల పేర్లతో నామగాడు... నా మనిషి... అంటూ విడదీసి ఎవరి గ్రూపు యాత్రికుల్ని వారు బలవంతాన్నైనా లాక్కుపోతారు.


మరిక, ఆ యాత్రీకుల గుంపు కోసం ఇంకో వర్తకుడెవరూ పోటీ తగలరు. ఆ యాత్రీకులు కూడా మరో దుఖాణంలో కొబ్బరి కాయలు కొనరు. కొనకూడదు. అలా ఎవరైనా కొనడానికి ప్రయత్నిస్తే కురుక్షేత్రమే జరుగుతుంది.


రామయ్యమ్మ కుటుంబ సభ్యులు తలో దారి విడిపోయి తాము ఖాయపెట్టుకున్న యాత్రీకులందరికీ కావలసిన సరుకులు సమకూరుస్తూ ఆ రాత్రంతా అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నారు.


అప్పటికింకా సింహాల దేవిడిలో మ్రోగాల్సిన కఛేరి గంటలు మ్రోగలేదు. చందనపురిలో వెలసిన చందన స్వామి ఆలయ నిర్వాహణ చూసే కార్యాలయాన్నే కఛేరి అంటారు. రాజుల కాలం నుండి ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం కావడం మూలానా ఆ రోజుల్లో స్వామికి "కైంకర్యం" నిర్వహించే అర్చకులు క్రింద వూర్లోనే నివాసం ఉండడం వలన వూరు వూరంత టికి కాలగమనాన్ని తెలియజేయడాని కని దేవాలయ కార్యాలయంలో ప్రతి గంటకూ అర్థగంటకూ 'పెద్ద జై గంట' ద్వారా గంటలు మ్రోగించడం అలవాటు.


ఇది ఏనాటి ఆచారమో అయినా ఆ సాంప్రదాయాన్ని ఇప్పటికి కొనసాగిస్తూనే ఉన్నారు.


కచేరిలో గంట గంటకు మ్రోగే గంటలు లెక్కించుకుంటూ కాలగమనాన్ని తెలుసు కోవడం ఆ వూరి ప్రజలకే కాదు వచ్చిన యాత్రీకులకు అలవాటయింది. కఛేరి గంటలు వింటూనే అర్చకులు స్వామి వారికి మేలుకొలుపు పలకడానికి... స్వామి సేవకు కొండ పైకి బయలుదేరుతారు.


తెల్లవారు ఝామున బస్సులో కొందరు ఆలయ ఉద్యోగులు కొండపైకి చేరుకుంటారు. నిష్టాగరిష్టులైన అర్చక స్వాములు మెట్లమార్గంలోనే మడిగా, శుచిగా స్వామి సేవకు కొండపైకి నడిచి చేరుకుంటారు. అలా నడిచివెళ్ళే అర్చక స్వాములను కాలి బాటన మెట్ల మార్గంలో దగ్గరుండి తీసుకువెళ్ళడానికి అర్చకునికో 'మాలి' దివిటీ వెలిగించి పట్టుకొని దారి చూపిస్తూ కొండ పైకి తీసుకువెళతాడు. ఇది ఆచారం. సనాతన సంప్రదాయం..

🔱

*సశేషం*

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ

05-02-2026