శుభోదయం*

*విద్యాజీవితం నిర్విఘ్నంగా సాగడానికి ‘సరస్వతీ నమస్తుభ్యం’ అని ప్రార్థిస్తాం. మరి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో విలసిల్లడానికి ‘అరుంధతీ నమస్తుభ్యం’ అనుకోవాలి. మాటల్లోనే కాదు బాటలోనూ అరుంధతిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆమె పంచమహా పతివ్రతల్లో ఒకరు.* 

 *ఇంతకీ అరుంధతి ఎవరు?  ఏమి ఆమె పెళ్లికథ?  అంటే బోలెడు విషయాలు ఉన్నాయి. యాగకర్త మేధాతిథి అరుంధతిని పెంచి పెద్ద చేసి వసిష్టుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అరుంధతి  వసిష్టుడికి దార. తార. వసిష్టుడితో అరుంధతి అంటే తారతో తార. అరుంధతిని దర్శించుకుంటే దంపతులకు ఆయురారోగ్య  ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయన్నది అనాదిగా  ఉన్న అఖండమైన విశ్వాసం. దంపతులు అన్యోన్యంగా ఉండి చక్కటి సంతానా న్ని పొంది వాళ్లు సమాజానికి మేలు చేయాలన్నదే గా అందరి ఆకాంక్ష.  విశ్వామిత్రుడి శాపకారణంగా వసిష్టుడు తల్లడిల్లిపోతాడు. వసిష్టుడు బతుకు మీద విరక్తితో చనిపోవడానికి కాళ్లుచేతులను తానే కట్టేసుకుని *నదిలోకి దూకుతాడు. వసిష్టుడు చనిపోవడాన్ని ఏమాత్రం సహించలేని  నదీమతల్లి ఆయనను కాపాడుతుంది. కానీ వసిష్టుడు జీవచ్ఛ వంలా  అయిపోయాడు. అప్పుడు అర్ధాంగి అయిన అరుంధతి తన పతి దేవుణ్ని కంటికి రెప్పలా చూసుకుంది. జీవితభాగస్వామి ఎలా ఉండాలో కళ్లకు కట్టేట్టు చూపించింది. ఇది ఆదర్శం కదా! అరుంధతి దర్శనం వల్ల సమకూరే ప్రయోజనం అంతేనా? కాదు కాదు ఆరోగ్య ప్రయోజనం కూడా  ఉందంటారు. అరుంధతీ నక్షత్రాన్ని దర్శించుకుంటే కంటికి ఉన్న చూపు పెరుగుతుందట. నిశిత దృష్టి  కలుగుతుందట! ఎన్నో సంప్రదాయాల్లో ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉంటాయి. వాటిని నిగ్గు దేల్చుకుని ఆచరించుకుంటే జీవితం సార్థకమవుతుంది. అదేగా కావల్సింది*

(((()))))



కర్ణాటకలోని గౌరీపురలో లభించిన రెండవ దేవరాయల తామ్ర శాసనం. 

కర్ణాటక రాష్ట్రంలోని దావణగెరె జిల్లా, జగలూరు తాలూకాలో ఉన్న గౌరీపుర గ్రామంలో గాద్రి పాలానాయక-కంచోబలేశ్వర ఆలయంలో విజయనగర చక్రవర్తి రెండవ దేవరాయల కాలం నాటి అత్యంత విలువైన రాగి ఫలక శాసనం( రాగిరేకుల శాసనాలు) వెలుగులోకి వచ్చాయి. ఇవి విజయనగర చరిత్రను అర్థం చేసుకోవడానికి ఒక కీలకమైన ఆధారంగా నిలుస్తోంది.

శాసన స్వరూపం మరియు భాష >

ఈ శాసనం మూడు రాగి పత్రాల సమితిగా  రూపొందించబడి, ఒక ఉంగరం 6: సహాయంతో పటిష్టంగా భద్రపరచడం జరిగింది.అంటే రాగిరేకుల తామ్ర శాసనలు ఒక రింగ్ కు అటాచ్ చేసి వున్నాయి. శాసన మూలపాఠం సంస్కృత భాషలో, నాగరిలిపిలో వుంది. అయితే శాసనం చివరి భాగంలో గ్రంథలిపి మరియు తెలుగులిపి రెండింటినీ ఉపయోగించడం ఇందులో ఉన్న విశేష లక్షణం.

కాల నిర్ణయం

శాసనంలో పేర్కొన్న వివరాల ప్రకారం 

శక సంవత్సరం > 1358 (వసు-శర-అగ్ని-క్షమా)

తెలుగు సంవత్సరం > రాక్షసనామ సంవత్సరం, కార్తీక శుద్ధ ద్వాదశి

గ్రెగోరియన్ తేదీ > నవంబర్ 2, 1435 (బుధవారం)

చారిత్రక అంశాలు మరియు దాన వివరాలు

వంశావళి >  ఈ శాసనం విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన సంగమ వంశ పరంపరను, రెండవ దేవరాయల వరకు క్రమంగా వివరిస్తుంది.

భూ దానం > పాండ్య-నాడులోని అరసీకెరె-మాగిణి ప్రాంతంలో ఉన్న ఆలదహళ్లి గ్రామాన్ని రాజు పేరు మీద అగ్రహారంగా మార్చి, దానంగా అర్పించారు.'

దాన గ్రహీత > భరద్వాజ గోత్రీకుడు, విష్ణుస్వామి తనయుడు అయిన నృసింహారాధ్య శర్మ,ఇతనిని నృసింహదేశిక అని కూడా పిలుస్తారు. ఈ ప్రసిద్ధ పండితుడికి ఈ గ్రామం దానంగా ఇవ్వబడింది.

నేపథ్య వివరాలు > 

నృసింహారాధ్య శర్మ ఖ్యాతేశ్వర దేవాలయంలో పురోహితునిగా సేవలు అందిస్తూ, పాండురంగ క్షేత్రంలోని విఠలదేవుని అచంచలమైన భక్తుడుగా ఉండేవారని ఈ శాసనం స్పష్టం చేస్తోంది.

ఈ అమూల్యమైన శాసనాన్ని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ASI) లోని శాసన శాఖ అధికారికంగా నమోదు చేసి భావి తరాలకు భద్రపరిచింది.

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ

05-02-2026