సూర్యుని సారథి పేరు అనూరుడు. అనూరుడంటే అర్థం తెలుసా ?

.............................................

అజ్మీర్‌ కోటలోని రాజపుత్ర వస్తుసంగ్రాహణాలయం (Museum ) లోనున్న సూర్యదేవుని శిల్పం ఎర్రని ఇసుకరాయితో చేయబడింది.ఈ ప్రతిమాశిల్పం రాజపుత్రుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది. ఈ విగ్రహంలో సూర్యుడు తన రథంపై రాజసంగా ఉన్నాడు. రథాన్ని ఏడు గుర్రాలు లాగుతున్నాయి. ఆ గుర్రాల పేర్లు

(1) గాయత్రి (2) బృహతి (3) ఉష్ణిక్ (4)జగతి (5) త్రిష్టుప్(6) అనుష్టుప్ (7) పంక్తి.

ఈ ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులకు, ఇంద్రధనస్సులోని ఏడు రంగులకు, ఇంకా వేదకాలంలోని కాలచక్రానికి సంకేతాలు.

సూర్యుని ప్రక్కన ఆయనకు సహచరిణులుగా ఉష అంటే ప్రభాత సంధ్య, ప్రత్యూష అనగా సాయంత్ర సంధ్య కనిపిస్తారు. కొన్నిసార్లు ఇతర పరిచారికలు కూడా ఉంటారు.వారు సూర్యుని కాంతికి, శక్తికి, జ్ఞానానికి ప్రతీకలు.

ఈ శిల్పంలో ఆభరణాలను సున్నితమైన రూపకల్పనతోను, వస్త్రాల మడతలను, ముఖభావాలు ఆనాటి పనితనాన్ని చాటుతున్నాయి.

సూర్యుడిని సాధారణంగా స్థానక (నిలుచున్న) స్థితిలో చూపిస్తారు. ఇక్కడ రథారూఢ (ఆసీన) రూపంలో చూపించడం వలన ఆయన విశ్వానికి శక్తిని, ప్రకాశాన్ని అందించే దైవంగా కీర్తించబడ్డాడు.

సాధారణంగా సూర్యుడు రెండు చేతులతో ఉంటాడు. ఆ రెండు చేతులలోనూ వికసించిన పద్మాలను ధరించి ఉంటాడు. సూర్యుని రథ సారథి అనూరుడు. ఈయనకు కాళ్ళు ఉండవు.అనూరుడు అంటే తొడలు లేనివాడు అని అర్థం.

ఈ శిల్పం 8వ శతాబ్దానికి చెందినది. 

భారతీయ సంప్రదాయంలో సూర్యుడు ఆరోగ్యం, శక్తి, ధర్మం, జ్ఞానానికి ప్రతీక. వేదాలలో ఆయనకు ఉన్నత స్థానం ఉంది. గాయత్రీ మంత్రం వంటి ప్రముఖ మంత్రాలు ఆయనకే అంకితం. కోణార్క సూర్య దేవాలయం వంటి నిర్మాణాలు సూర్యారాధన ప్రాముఖ్యతను బుుజువు చేస్తా తూన్నాయి.

ఈ శిల్పం కేవలం కళాఖండం మాత్రమే కాదు. భారతీయ ఆధ్యాత్మికత, శిల్పకళ, ఖగోళ, ఇంకా కాలమానాలను ప్రతిబింబించే చారిత్రక సాక్ష్యం.


॥సేకరణ॥

.............. జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ