డైనోసార్లను తిన్న మానవుడు!
..................................
కోడిపరిణామ క్రమం దాని ఆకారం నడక అన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మనం సినిమాల్లో టీవీల్లో డైనోసార్లు ఎలా నడుస్తాయో చూశాం. అవన్నీ ఊహాచిత్రాలే అయినా కోడి నడకను డైనోసార్ నడకను గమనిస్తే చాలా దగ్గరి పోలికలు కనిపిస్తాయి కదా!. కోడి డైనోసార్ల నుంచి మొదలై అడవి కోడిగా పరిణామం చెంది, ఆపై మన పెరటికోడిగా మారింది.
డైనోసార్ల నుంచి పక్షుల వరకు పరిణామం ఎలా జరిగిందో చూద్దాం. కోడి పూర్వీకులు థెరోపాడ్ జాతికి చెందిన డైనోసార్లు. దాదాపు 150 మిలియన్ సంవత్సరాల క్రితం అంటే 15 కోట్ల ఏళ్ల క్రితం జీవించిన ఆర్కియోప్టెరిక్స్ లాంటి డైనోసార్లు నేటి పక్షులకు మూలం. కోళ్లు పావురాలు రాబందులు అన్నీ ఈ సమూహం నుంచే వచ్చాయి. జన్యు అధ్యయనాల ప్రకారం కోడికి అత్యంత దగ్గరి జీవించి ఉన్న బంధువు టైరన్నోసారస్ రెక్స్ అనే డైనోసార్. ఇద్దరికీ ఎముకల నిర్మాణం కాలివేళ్లు తొడఎముకల అమరిక దాదాపు ఒకేలా ఉండటం దీనికి సాక్ష్యం.
ఇటీవలి పరిశోధనల ప్రకారం డైనోసార్ల దేహంపై కూడా పక్షుల మాదిరిగానే ఈకలు ఉండేవని అవి ఉష్ణోగ్రత నియంత్రణకు ఉపయోగపడేవని తేలింది.
అడవి కోడి అంటే రెడ్ జంగిల్‌ఫౌల్ కు మన ఇంటికోడికి పూర్వీకుడు గాలస్ గాలస్. ఆ అడవికోడి ఇప్పటికీ దక్షిణ ఆగ్నేయాసియాలోని అడవుల్లో కనిపిస్తుంది. దీని రంగు ప్రవర్తన కూత అన్నీ ఇంటి కోళ్లతో దాదాపు ఒకేలా ఉంటాయి. అడవి కోడి చెట్లపై నిద్రిస్తుంది,మట్టి గోకి పురుగులు తింటుంది. గుంపుగా జీవిస్తుంది. ఈ ప్రవర్తనలన్నీ ఇంటి కోళ్లలోనూ మనం చూడవచ్చు.
అయితే ఆధునిక ఇంటికోడిలో గ్రే జంగిల్‌ఫౌల్ (Grey Junglefowl) జన్యువులు కూడా కలిసి ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.దీనివల్లే కోడికాళ్లు పసుపు రంగులో ఉంటాయని తెలుస్తోంది.
దాదాపు 8,000 నుంచి 10,000 సంవత్సరాల క్రితం ఆగ్నేయాసియా, భారత ఉపఖండంలో మానవులు అడవి కోళ్లను పెంపకం చేయడం మొదలుపెట్టారు. మొదట్లో వాటిని కోడిపందాలకు, మతపరమైన దైవ సంబంధ. ఆచారాలకు అలంకారానికి మాత్రమే పెంచారు. తరువాత మాంసం గుడ్లకోసం వాటిని పెంచడం ప్రారంభమైంది.
పెంపకం వల్ల కోళ్లలో పెద్దగా జన్యు మార్పులు జరిగాయి. అడవికోడి సంవత్సరానికి 10-15 గుడ్లు మాత్రమే పెడుతుంది. కానీ పెంపుడు కోడి సంవత్సరానికి 1000-200 గుడ్లు పెడుతుంది. ఇంటి కోడి శరీరం బరువుగా మారింది ఈకలురంగురంగులుగా మారి దువ్వెన ఆకారంలాగా మారాయి.కాళ్ల పొడవు స్వభావంలో మార్పులు వచ్చాయి. ఈ మార్పులు మానవుల ఎంపిక కృత్రిమ ప్రజననం (హైబ్రీడ్) మరియు జన్యు ఉత్పరివర్తనల వల్ల జరిగాయి.
పరిణామ క్రమంలో కోళ్లు ఎగరగలిగే శక్తిని దాదాపు కోల్పోయాయి. వాటి రెక్కలు చిన్నవిగా మారాయి. కానీ కాళ్లు ఛాతీ కండరాలు బలంగా మారాయి. అడవి కోడిలో ఉండే హెచ్చరిక శబ్దాలు సమూహ క్రమశిక్షణ వంటి ప్రవర్తనలు పెంపుడు కోళ్లలోనూ కొనసాగుతున్నాయి. ఆధునిక జన్యు పరిశోధనలు కోళ్లలోని కొన్ని జన్యువులు ఎముకల పెరుగుదల గుడ్డు ఉత్పత్తి రోగ నిరోధకతకు సంబంధించినవని చూపిస్తున్నాయి. కోడి మెదడులోని కొన్ని భాగాలు కూడా పెంపకం వల్ల పరిమాణంలో మార్పు చెందాయి, తద్వారా అవి మానవులతో కలిసి జీవించడానికి అలవాటు పడ్డాయి.
నేడు ప్రపంచంలో వందలరకాల కోళ్ళ జాతులు ఉన్నాయి. బ్రాయిలర్, లేయర్, స్థానిక నాటుకోళ్లు అన్నీ ఒకే అడవి కోడి నుంచి వచ్చినవే. జన్యు పరిశోధన ప్రకారం ఇంటి కోళ్లలోని DNAలో 90% రెడ్ జంగిల్‌ఫౌల్‌తో సరిపోతుంది. డైనోసార్ నుండి గాలస్ గాలస్ పక్షిరూపం, దాన్నుండి అడవి కోడిరూపం, తరువాత మానవ పెంపకం, అక్కడినుండి నేటి కోడిగా మారడం జరిగింది. కోడి పుట్టుక గురించి శాస్త్రవేత్తలు చేసిన విశ్లేషణలో, అండం ఉత్పత్తి కావడానికి అవసరమైన ఒక ప్రత్యేక ప్రోటీన్ (OV-17) కేవలం కోడి గర్భాశయంలోనే ఉండటం వల్ల, కోడి తర్వాతే గుడ్డు వచ్చిందని ఒక సిద్ధాంతం కూడా ఉంది.అంటే కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్నకు కోడే ముందనే సిద్ధాంతమన్న మాట.
మనం చూస్తున్న కోడి సహజ పరిణామ క్రమంలో రూపాంతరం చెంది, మానవుడి పెంపకం వలన ఇలా అభివృద్ధి చెందింది. అందుకే కోడిని తింటున్నప్పుడు, మనం పరోక్షంగా డైనోసార్ల వారసులను రుచి చూస్తున్నామనే చెప్పవచ్చు. భూమి మీద అత్యంత భారీగా ఉన్న జీవులు, కాలక్రమేణా చిన్నవిగా మారి మనకు ఆహారంగా మారుతున్నాయన్నది ప్రకృతి వింతల్లో ఒకటి.
ఇక నుండి హోటల్స్ లో ఆర్డర్ ఇచ్చేటప్పుడు
డైనోసార్ 65, డైనోసార్ రోస్ట్,డైనోసార్ కర్రీ,డైనోసార్ ఫ్రై,డైనోసార్
పెప్పర్ అని అడిగితే ఎలా వుంటుందంటారు ?
॥సేకరణ॥
................జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

Comments
Post a Comment