12-05-2026
*హనుమాన్ చాలీసా పై...*
*ప్రశ్నలు, సమాధానములు!*
💅🏻💅🏻💅🏻💅🏻💅🏻
*1. చాలీసా" అంటే ఏమిటి?*
జ. ఈస్తోత్రంలో 40 శ్లోకాలు ఉన్నాయి కనుక చాలీసా అని పేరు(చాలిస్ అంటే హిందీ లో 40 అని.)
*2. హనుమాన్ అంటే అర్థం ఏమిటి?*
జ. హనుమాన్ అంటే గట్టివైన దవడలు కలవాడు అనే కాక హను = జ్ఞానం కాబట్టి జ్ఞానవాన్ అని అర్థం. ‘అజ్ఞానమును’ హననము చేయునది కనుక జ్ఞానమునకు హనుమ అని పేరు.
*3. ఆంజనేయ - అర్థం?*
జ. ఆంజనేయ అంటే... సామాన్య కంటితో చూడలేని దానిని చూపించేదే అంజనం, జ్ఞానాంజనం వల్ల మాత్రమే దొరికే పరతత్వం కనుక ఆంజనేయుడు అని పేరు.
*4. తులసీదాస్ అస్సలు పేరు?*
జ. రామ్ బోల. ఎప్పుడూ రామ నామం స్మరిస్తూ వుండడం వల్ల ఆ పేరు వచ్చింది.
*5. హనుమoతుడు బ్రహ్మచారి అయితే మరి సువర్చల ఎవరు?*
జ. దేవుళ్ళ భార్యలను, మానవ సంబంధాల దృష్ట్యా చూడరాదు. భార్య అంటే దేవుని యొక్క విడదీయరాని శక్తి, సూర్యుని వద్ద నేర్చుకున్న విద్యవల్ల వచ్చిన తేజో వర్చస్సు యే “సువర్చల”.
ఆ విద్య సూర్యుని దగ్గర నేర్చుకోవడం మూలాన సువర్చల సూర్యుని పుత్రిక అంటారు.
*6. హనుమంతుడు మనికిచ్చే అష్టసిద్ధులు ఏంటి?*
జ. ‘బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్’
హనుమంతుని స్మరించటం వలన మనం పొందే అష్టసిద్ధులు ఇవే.
*7. సూర్యునితో పాటు తిరుగుతూ విద్య నేర్చుకున్నాడు హనుమ. అంటారు కదా అసలు సూర్యుడు తిరగడు కదామరి?*
జ. తిరగడం అంటే ఇక్కడ, ఉదయించినప్పటి నుండి అస్తమించే వరకు, క్షణక్షణం సూర్యుని తేజస్సు మారుతూ ఉంటుంది దానిని నిరంతరం ఉపాసించడంగా అర్ధం చేసుకోవాలి.
*8. హనుమంతుని పంచ ముఖములు ఏవి?*`
జ. హనుమ శివాంశ సంభూతుడు. శివుని పంచముఖములు, హనుమంతునిలో ఏ పేర్లతో చెప్పబడ్డాయో చూస్తే...తూర్పున వానర ముఖం జన్మతః వచ్చినది అది సద్యోజాత శివవదనము.
దక్షిణం వైపు నార సింహం. అది శివుని వామదేవ ముఖం. రాక్షస సంహారం చేయడంలో చూపించాడు.
పశ్చిమం గరుడ ముఖం. అది శివుని అఘోర రూపం. వేగ గమనము, సర్వరోగ నివారణ చేసి చూపాడు.
ఉత్తరం వరాహ ముఖం. అది శివుని తత్పురుష రూపము. సంపత్ ప్రసాదం, ఉద్ధరణ. శోక సముద్రంలో ఉన్న సీతమ్మని ఉద్ధరించడం ద్వారా దానిని ప్రకటించాడు.
ఊర్ధ్వం హయగ్రీవ ముఖం. అది శివుని ఈశాన ముఖం. వేద పారంగతుడు, సకల విద్యా కోవిదుడు. ప్రతీ ముఖానికి మూడు కళ్ళు వుంటాయి. ఈ మూర్తి పది చేతులతో వుంటాడు. వేద విద్య, త్రిమూర్తి స్వరూపం అని సీతమ్మ నమస్కరించిన హనుమత్ విరాట్ స్వరూపం ఇది.
9. “జయ” హనుమాన్ అని హనుమకి జయం చెప్పడమేంటి?
జ. ఎవరైనా ఏది సాధించడానికి ( పురుషార్థాలను) పుట్టారో అది సాధించడమే జయం అంటే. జయం అంటే అన్నింటినీ మించిపోయి ఉండడం. దేవుళ్లకు మనం జయమగు గాక అంటూ ఉంటాము అంటే నా హృదయంలో నీవు అన్నింటినీ మించి ఉండు అని అర్థము.
10. తులసీదాస్ ఎంతకాలం (వయస్సు) జీవించాడు?
జ.126 సం.జీవించాడు.
11. హనుమ బలం హనుమకు ఎందుకు తెలియదు?
జ. మునుల శాప కారణంగా. ముని ఆశ్రమంలో వయస్సు మించిన శక్తి తో అల్లరి చేస్తున్న హనుమని కట్టడి చేయటానికై మునులు ఇచ్చిన శాపం అది.ఆ వయస్సుకి ఆయనకి ఆ శక్తి అవసరం లేదు కనుక అవసరం వచ్చినపుడు, ఎవరైనా గుర్తు చేస్తేహనుమకి గుర్తు వస్తుంది అని అనుగ్రహించారు.కనుక ఒక విధంగా ఇది శాపం అని అనుకో నక్కరలేదు. కట్టడి మాత్రమే.
12. రాక్షస సంహారానికై హనుమ సంగీతం పాడినది ఎప్పుడు?
జ. ఒకప్పుడురాక్షసుల అరాచకం అరికట్టడానికి కశ్యపుడు యజ్ఞం చేయ సంకల్పిస్తాడు..త్రిశూల రోముడనే రాక్షసుడు భూమికి నష్టం చేయడానికై, యజ్ఞ ధ్వంసం ద్వారా చేయాలని సంకల్పించుకుంటాడు. ఆ సంగతి నారదుని ద్వారా హనుమ తెలుసుకుంటాడు, వాడు యజ్ఞం ధ్వంసం చేయబోగా , హనుమ అడ్డగిస్తాడు. భీకర యుధ్ధం జరుగుతుంది. వాడు సూక్ష్మ రూపం దాల్చి గుహలో ప్రవేశించగా, దేవతలంతా ఇప్పుడు ఏం జరుగుతుందని ఆత్రుతతో ఎదురు చూస్తూండగా అప్పుడు హనుమ ఆ గుహ ముందు కూర్చుని ఎవరూ అప్పటివరకూ ఆలపించని ఒక సరికొత్త రాగం పాడగా, ఆ గుహయొక్క శిల కరిగి, వాడు బయటపడగానే వధిస్తాడు. అలా తన సంగీత చతురతతో వాడిని సంహరించాడు.
13 . రామకార్యం చేయడంలో ఆత్రుత ఎపుడు కనపరచాడు ?
జ. మైనాకుని ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్ళడంలో.
14 . సీతారాములు పట్టాభిషేక అనంతరం హనుమ కిచ్చిన బహుమతులు ఏంటి?
జ. పుట్టింటివారు,అత్తింటి వారు కలిపి చేయించిన అపురూపమైన ముత్యాల హారం సీతమ్మ ఇస్తే, రాముడు ఆలింగనాన్ని బహుమతిగా ఇచ్చాడు.
15. కపీశ అంటే అర్థం ఏమిటి?
జ. కపీశ అంటే...
a) కపులకు ఈశుడు
b) కపి రూపంలో ఉన్న ఈశుడు
సి) కం(జలం) పిబతి (తాగడం) =కపి జలమును తాగేవాడు అంటే సూర్యుడు, సూర్యునిలా తేజస్వరూపుడు అని అర్థం.
16. హనుమ చిరంజీవి. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?
జ. రామ నామ స్మరణ జరిగే చోటుకి ఇప్పటికీ వస్తాడు.అంతే కాక గంధమాదన పర్వతం పై ఇప్పటికీ వున్నాడు, వుంటాడు🙏
17. హనుమ రామదూత ఎలా అయ్యాడు ?
జ. రాముని ఉంగరాన్ని దూతలా వెళ్ళి సీతమ్మ కు ఇచ్చాడు. వేదం అగ్నిని దూతగా చెప్పింది. ఏ దేవతను తృప్తి పరచాలన్నా అగ్ని ద్వారానే
అగ్ని ముఖావై దేవాః.
దేవతలు అనుగ్రహించాలి అంటే మంత్రము స్తోత్రము చెబుతాము. అంటే వాక్ రూపం. ఇక్కడ వాక్కు దూత అయింది. వాక్కుకు అధిదేవత అగ్ని. అయితే అగ్నికి , హనుమకి ఏమిటి సంబంధం అంటే సృష్టి క్రమంలో ఆకాశం నుండి వాయువు వచ్చింది. వాయువు నుండి అగ్ని వచ్చింది. వాయువు నుండి వచ్చింది అంటే అగ్ని వాయుపుత్రుడు అని కదా! కథ ప్రకారం వాయుపుత్రుడు హనుమ కదా! అందుకు అలా అగ్ని తో పోల్చారు. అగ్ని ఏవిధంగా అయితే ఆహూతులను దేవతలకు అందజేస్తుందో, అలానే, ఈ అగ్నిరూప హనుమ మనం చేసే అనుష్టానాలను పరబ్రహ్మ స్వరూపుడైన ఆ రామచంద్రమూర్తికి చేరవేసే దూత అయ్యాడు. అంతేకాక రాముడు లక్ష్మణునితో అంటాడు నేను యజ్ఞ స్వరూపునిగా వచ్చినపుడు హనుమని దూతలా స్వీకరిస్తాను అని- అలా దూత అయ్యాడు . కనుక దూత అంటే just messenger అని మాత్రమే కాదు.
18 . అతులిత బలధామా అంటే అర్థం ? ఒక ఉదాహరణ?
జ. ఎవ్వరితో పోల్చతగ్గ బలం లేని వాడు.అంటే పోల్చలేని బలం. అందుకే సీతాన్వేషణ కై హనుమని ఎంచుకోవడం.
19 . ఇంతకూ హనుమ కేసరి నందనుడా? వాయు పుత్రుడా?
జ. కేసరి క్షేత్రమైన అంజనీ దేవి యందు సూర్య నాడి ద్వారా వాయుదేవుడు సర్వ దేవతా తేజస్సు ప్రవేశ పెట్టాడు కాబట్టి ఇద్దరికీ.
20 . నామస్మరణ మహిమ ఏమిటి?
జ. కలియుగంలో తరించడానికై ఇచ్చిన సులువైన మార్గం.
21. మహాత్ముడు అంటే ఎవరు ?
జ. శౌర్యం, సౌమ్యం కలిసి ఉన్నవారు. తన ప్రతాపాన్ని తానే నిగ్రహించుకో గలవాడు అతనే మహాత్ముడు( ఇక్కడి సందర్భానుసారం ఇలా చెప్పబడింది.)
22 . ఆ రోజులలో ఉన్న వానరుల ప్రత్యేకత ఏమిటి?
జ. నరులతో సమానంగా వేదాధ్యయనం చేసిన జాతి.
23 . *వీర* లో ఎన్ని రకాలు అవి ఏవి?
జ. దానవీర, దయవీర, యుద్ధ వీర, ధర్మ వీర, ఇవన్నీ ఉన్న వారు మహావీర.
24 . విక్రమ అంటే అర్థం ఏమిటి?
జ. క్రమించుట అంటే నడచుట అనగా వివిధ విధాలుగా తన బలాన్ని బయటపెట్టిన వాడు విక్రముడు. ఎటువైపు అయినా వెళ్లగలిగినవాడు.
25. సూక్ష్మరూపం ఎప్పుడు ధరించాడు ?
జ. లంకా ప్రవేశ సమయంలో పిల్లి లా మారాడు . మరో సారి సీతమ్మ ముందుకు చెట్టు పై నుండి చిన్న ఆకారంలో దూకాడు .
26. వికటరూపం అంటే ఏమిటి ?
జ. వికట = హద్దు లేనిది అని అర్థం, వికట రూపం = భయంకర ఘోర రూపం - లంకా దహన సమయంలో చూపుతాడు.
27. హనుమ తత్వాన్ని ఏ కార్యంలో చూస్తాము?
జ. లంకా దహన సమయంలో హనుమ తత్వాన్ని చూస్తాము.
28. భీమరూపధారిగా ఎపుడు వున్నాడు?
జ. అసుర సంహారం లో , ఉగ్రమైనదే భీమ రూపం .
29. రామచంద్రుని కార్యం చక్కబెట్టడానికి ఏం చేసాడు ?
జ. తనదైన ముద్రతో దూతే ఇంత చేస్తే ఇంక రాజు ఎంత చేస్తాడో అని రావణుడు భయపడాలి అని భావించి లంకా దహనం చేసాడు.
30. అశోకవన నాశనానికి ప్రతిగా రావణుడు హనుమకి ఇచ్చిన దండన ఏది?
జ.వానరులకు వారి తోక అంటే ఇష్టం ఉంటుంది కనుక తోకకు నిప్పు పెట్టమన్నాడు.( హనుమని చంపమని ఆదేశిస్తున్న రావణునితో విభీషణుడు, దూతను చంపరాదు అంటాడు) .
31. రఘువీరుడు ఎందుకు సంతోషించాడు ?
జ. ఇంద్రజిత్తు అస్త్రం వల్ల వానర సైన్యం, రావణుని శక్తి అస్త్రం వల్ల లక్ష్మణుడు పడిపోతే సంజీవనీ పర్వతం (2సార్లు) తెచ్చి రామునికి ఆనందం కలిగించాడు హనుమ.
32. అపుడు రాముడు హనుమని ఎవరితో పోల్చాడు?
జ. నీవు నా తమ్ముడు భరతునితో సమానం అని అంటాడు.
33. భీముడు హనుమని కోరినదేమిటి (జెండా పై వుండమని కాకుండా) ?
జ. మహత్ రూపం చూపమని అడుగుతాడు.
34. హనుమ ఎన్ని సార్లు తన మహత్ రూపం చూపాడు? ఎపుడు ?
జ. మహేంద్ర పర్వతం పైన మొదటిసారి, వ్యాకరణం నేర్చుకున్నపుడు, అశోకవనంలో సీతమ్మ దగ్గర మొత్తం మూడు సార్లు తనమహత్ రూపాన్ని చూపాడు.
(సహస్ర వదన తుంహరో యశ గానై---1000 వదనముల హనుమంతుని మహత్ రూపాన్ని శ్రీపతి అనగా సీతారాములు పొగిడారు)
35. హనుమంతుని జన్మదినం రెండు మాసాలలో చెబుతారు ఏది సరి అయినది?
జ) చైత్ర పౌర్ణమి నాడు జన్మించాడు కాని ఇంద్రుని దెబ్బకు మూర్ఛిల్లిని హనుమ బ్రహ్మ స్పర్శద్వారా తిరిగి ఉత్తేజితుడు అయినది వైశాఖ బహుళ దశమి శనివారంనాడు. అందుకు అలా రెండు మాసాలలో చెబుతారు. ప్రాంతాన్ని బట్టి జరుపుతుంటారు.
36. హనుమ - ఓంకార స్వరూపుడు- ఎలా?
జ)` *హ* 'లో 'అ', *ను'* లో 'ఉ', ' *మ* ని మ గా తీసుకుంటే అకార, ఉకార, మకారాత్మకమే ఓంకారం కదా అదే హనుమ అంటే.
37. భజరంగీ అంటుంటాం - ఎందుకు?
జ) వజ్రం వంటి అంగములు అంటే అవయవములు కలవాడు. అదే వజ్రాంగీ కాస్తా భజరంగీ అయింది.
38. తుమ్హారో మంత్ర విభీషణ మానా .. విభీషణునికి మంత్రం ఇవ్వడం ఏమిటి?
జ) రావణాసురుని కొలువులో రావణునితో హనుమ అంటాడు- రాముని శరణు వేడమని చెబితే బాగుపడే లక్షణం లేక వినడు కానీ అక్కడే ఉండి విన్న విభీషణుడు పాటించాడు. మంత్రం- ఆలోచన, వ్యూహరచన.
39. అర్జునుడి జెండాపైన హనుమంతుడు ఎందుకు ఉంటారు?
జ. అర్జునుడు రాముడు అంతటి వాడిని అనిపించు కోవాలి అనుకుంటాడు. ఒకసారి కృష్ణునితో, రాముడు సేతువు రాళ్లతో కట్టడమెందుకు బాణాలతో కట్టవచ్చుకదా అని అంటే, సరే నీవు ప్రయత్నించు అంటాడు. కొంత మేర కట్టగానే హనుమంతుడు ఎక్కి కూల్చుతాడు. నీవు కూల్చలేని సేతువు నిర్మిస్తానని అంటాడు. అలా చేస్తే నీవు ఏం చెబితే అది చేస్తానని అంటాడు హనుమ. కట్టలేకపోతే గాండీవం వదిలేస్తా నంటాడు అర్జునుడు. అయితే హనుమ మళ్లీ కూల్చితే, అర్జునుడు గాండీవం వదలబోగా, ఈసారి ప్రయత్నించు అని కృష్ణుడు చెప్పగా, దానిని హనుమ కూల్చ లేకపోతాడు.( అర్జునుడు గాండీవం వదిలితే జరగవలసిన కార్యం జరగదు).నేను ఓడిపోయాను నువ్వు ఏం చెబితే అది చేస్తాను అంటాడు హనుమ. అప్పుడు అర్జునుడు, నిన్ను ఆజ్ఞాపించే వాడిని కాను అర్థిస్తున్నాను నా రథం పై వుండి నన్ను రక్షించు అంటాడు. అప్పుడు కృష్ణుడు హనుమతో నువ్వు ఓడలేదయ్యా అంటాడు ,మరి అర్జునుడు ? అని అడిగితే , అర్జునుడు గెలవలేదయ్యా అని కృష్ణుడు తన వీపు చూపగా, మొత్తం నెత్తుటి మరకలు వుంటాయి. సేతువు నిలవడానికి వీపు అడ్డుపెట్టాను అంటాడు. తనను శరణు పొందిన అర్జునుని విజయానికి అలా కారణమై నాడు.
యుద్ధసమయంలో అర్జునుడు కృష్ణునితో అంటాడు, నేను చంపాలనుకున్న వారిని నా కన్నా ముందే జటాధారియై త్రిశూలం పట్టుకొని ఒకరు చంపుతూ వుంటే, వారిపై నేను బాణాలు వేసి చంపిన కీర్తి తెచ్చుకుంటున్నాను అని అంటే రథ జెండా పై వున్నఆ శివాంశ సంభూతుడు అయిన హనుమనే అలా చేసినవాడు అని రహస్యం వెల్లడిస్తాడు కృష్ణుడు.
40 . హనుమ సంజీవనీ పర్వతం ఎప్పుడు తెచ్చాడు?
జ) రెండుసార్లు- వానరసైన్యం మూర్చిల్లినప్పుడు.
లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు.
41 . సుందర కాండకి ఆ పేరు ఎందుకు వచ్చింది ?
జ. సుందరకాండలో రామ కథ రెండు సార్లు చెప్పబడింది. అందుకు ఆ కాండకు ఆ పేరు.
పోయిన దాని యొక్క జాడ తెలుసుకొని ఆనందాన్ని ఇచ్చేవాడే సుందరుడు.ఆ సుందరుని గురించి చెప్పేదే సుందరాకాండ.
పోయిన వస్తువు అపురూపంగా సుందరంగా ఉంటుంది.అటువంటి సీత జాడ కనుక్కోవడమే సుందరాకాండ.
హృదయమనే అశోక వనంలో ఆత్మ వస్తువనే సీతను దొరక బుచ్చుకోడమే సుందరాకాండ.
పరబ్రహ్మ తత్వమే, *సత్యం శివం సుందరం.* అటువంటి పరబ్రహ్మ గురించి అసలయిన తత్వాన్ని వెల్లడించిన కాండ కనుక *సుందర* *కాండ* .
42. చూసి రమ్మంటే కాల్చి రావడమేమిటి?
జ. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని అంటే, మరి రాముని మాట జవదాటాడు అని అనుకుంటే హనుమ శివాంశ సంభూతుడు చూపులోనే అగ్ని ఉన్నవాడిని చూసి రమ్మంటే కాల్చి రావడమే కదా మరి.
43. రాబోయే కల్పానికి హనుమంతునికి రాముడిచ్చిన పదవి ఏంటి?
జ. *బ్రహ్మ పదవి.*
పట్టాభిషేక అనంతరం హనుమ గంధమాదన పర్వతం పై తపస్సుకు వెళితే ఒకసారి రాముడు రమ్మని కబురు చేస్తాడు. "బ్రహ్మ నా అంగుళీయాన్ని పూజించుకుంటాను అంటే ఇచ్చాను దానిని సీతమ్మ చూస్తానంటుంది బ్రహ్మలోకం వెళ్లి తీసుకు రమ్మంటాడు. యోగ మార్గం( సుషుమ్నా) ద్వారా బ్రహ్మ లోకం వెళ్లి బ్రహ్మ ను అడిగితే, ఇచ్చిన దానిని అడగరు అని అంటాడు. చర్చ అనవసరం ఇవ్వమంటాడు. ఇవ్వనంటాడు బ్రహ్మ .అప్పుడు బ్రహ్మ కి వింశతి (20) బాహువుల హనుమ దర్శనమిస్తాడు. దాంతో బ్రహ్మ నమస్కరించి, తాను పూజిస్తున్న పళ్ళెంలోని అంగుళీయాన్ని తీసుకో మన గా చూస్తే అందులో చాలా ముద్రికలు ఉన్నాయి . ఎన్నో కల్పాలు ఎందరో రాములు. నాకు 100 కల్పాల ఆయువు. కాబట్టి ఇప్పటి ముద్రిక ఏదో వెతికి తీసుకో అని అంటాడు బ్రహ్మ.హనుమ గుర్తించి తీసుకుంటాడు.
బ్రహ్మకు హనుమ గొప్పతనం తెలియజేయడానికే రాముడు అలా చేస్తాడు.
తిరిగి వచ్చిన హనుమతో బ్రహ్మలోకం ఎలా ఉంది అని రాముడు అడిగితే , బానే ఉంది కానీ కొన్ని లోపాలు ఉన్నాయి అని అంటాడు.అప్పుడు రాబోయే కల్పానికి నీవే బ్రహ్మవు, ఆ దోషాలను నువ్వు అప్పుడు సరిదిద్దు అని చెబుతాడు.
*వింశతి భుజ హనుమ అభీష్ట సిద్ధి రూపం.*
20 చేతులలో *ఖడ్గం* , డాలు,మొనగలిగిన ఆయుధం,పరశువు,పాశం,* *త్రిశూలం,వృక్షం,చక్రం, శంఖం, గద, ఫలం,అంకుశం,అమృత పాత్ర, నాగలి,పర్వతం, టంకం (పార),పుస్తకం,ధనుస్సు,సర్పం* , ఢమరుకం* ధరించి వున్నాడు.
అటువంటి హనుమకు బ్రహ్మతో సహా మనందరo మానసికంగా దర్శించుకొని ప్రణమిల్లుదాం.``
రామ లక్ష్మణ జానకీ
**హనుమాన్ కిజై*
*జై హనుమాన్* ,*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
సేకరణ...
ద్వాదశము
ద్వారమేస్థితి ప్రేమతో వాక్కు పిలుపు
దయ దురుసుతనం సమయాన దనుజ తలపు
శక్తి మేర సహాయము సహనమందు
ముక్తి పొంద సర్వ మయము ముగ్ధ మయము
భావం :
ప్రేమతో పలికే వాక్కే నిజమైన జీవనద్వారం.
దయ ఉన్నచోట దురుసుతనం తగ్గిపోతుంది; లేకపోతే దానవస్వభావపు తలపులు పెరుగుతాయి.
తన శక్తిమేరకు సహాయం చేయడం, సహనంతో ప్రవర్తించడం మానవత్వానికి మూలం.
అలా జీవించినవారికి ముక్తి లభిస్తుంది; అప్పుడే ఈ జగత్తంతా సర్వమయంగా, ముగ్ధమయంగా అనిపిస్తుంది.
*****
కలకాలం మదిలో స్థితి
మలుపే కరుణా కటాక్ష మమతగు తీరుణ్
విలువల తీరుగ కావుము
తలపులే నీదయ విధాన తత్త్వము దేవా
సరళ భావం :
ఓ Venkateswara!
నీవు ఎల్లప్పుడూ మా మనసులో నిలిచి ఉండాలి.
నీ కరుణా కటాక్షమే మా జీవిత మార్గాన్ని మార్చేది.
మా జీవితంలో విలువలు, మంచితనం పెరగునట్లు దయచేయి.
మా తలపులన్నీ నీ దయతో నిండిన తత్త్వ మార్గంలో నడవాలి దేవా.
****
కలియన్నది నీసన్నిధి
కలగానయినాసమర్ధ గమ్యము కాదే
చెలరేగేవిధికాదిది
కొలచిన వారికి సహాయ కొండల రాయా
భావం :
ఓ Venkateswara!
కలుషమైన మనసు నీ సన్నిధిని చేరలేడు.
కలలో అయినా నీ దర్శనం పొందడం సులభం కాదు.
ఆవేశంతో, గర్వంతో నిన్ను చేరడం సాధ్యం కాదు.
నిన్ను భక్తితో కొలిచే వారికి నీవే అండగా నిలిచే కొండలరాయుడవు.
*****
గీతమాలిక
తెల్ల వారకముందరే తిమిని దాటి
తీర్థయాత్రలు సేయంగ. తెంపుజేసి,
బయలుదేరితి నీతోడ భయము లేక
సద్దుసేయక పయనంబు సాగుచుండ
చిన్న చిరునవ్వు ననుజూసి చిలకరించ,
శ్రావ్య గీతాలు చెవిసోక చక్కగాను,
పారి పోవును దూరంగా బాధలన్ని.
సమయ మింకను కాలేదు సందెవాలె.
నీటి పక్షులు నెగురుచూ నీడకొచ్చె.
కటిక చీకటి కమ్మెను కడలి చుట్టు
ఎపుడు తొలగునో సంకెళ్లు నెరుగలేము
తీర మెప్పుడు చేరునో తిన్నగాను
సాగుచున్నది పయనంబు సాగరాన
భావానువాదం కాళిదాసు సుబ్బయ్య
****
[09/05, 21:41] Mallapragada Ramakrishna: ఆ. వె. వినయ వివరములగు విజ్ఞాన సంపద
శ్వయమనంబు గాను శక్తి యుక్తి
ధరణి తత్వ మాయ ధర్మ సత్య మయ మ
ర్మము గనౌను కాల మనసు తీరు
భావం :
వినయంతో కూడిన వివేకమే నిజమైన విజ్ఞానసంపద. స్వయంమనస్సు శక్తి, యుక్తులకు ఆధారంగా ఉంటుంది. భూమి తత్వమంతా ధర్మసత్యమయమైన మాయాస్వరూపమే. కాలం, మనస్సు యొక్క అంతర్మర్మాన్ని గ్రహించినవారికే జీవనతీరు అవగతమవుతుంది.
****
[10/05, 06:34] Mallapragada Ramakrishna: గీ.చిలిపి తనముగా సలిపిన చిత్త చేష్ట
పలికి పలకలేదని చిత్ర పాశమైన
కెలికి పాడుచేసిన తప్పుయెoచ కున్న
కలిని తరిమి తరిమి చూపు గాంచు నమ్మ
భావం :
చిన్న చిన్న చిలిపితనాలతో మనసు ఎన్నో చేష్టలు చేసినా,
ఎవరైనా పలికినా “పలకలేదు” అని అనుమానాలు, అపార్థాలతో విచిత్రమైన బంధాలను సృష్టిoచినా,
ఇలా ఒకరినొకరు కెలికి, బాధపెట్టి చేసిన తప్పులను గుర్తించకుండా జీవించినా
కాని అమ్మ మాత్రం కలియుగ స్వభావమైన కలుషిత భావాలను తరిమి తరిమి, నిజమైన మార్గాన్ని చూపిస్తూ మనలను నమ్మకంతో నడిపిస్తుంది.
****
న్యస్తాక్షరి.. పాదాది... వి,శ్వ, ధ,ర్మ
శాशा.
विद्याविप्लवसर्वकर्मनिरता विज्ञानदीप्तिर्भवेत् ।
श्वासोऽयं जगजीवनार्थसहितः शान्तिप्रसादप्रदः ॥
धर्मार्थप्रभुदायसारसहितो धात्रीजनान् पालयेत् ।
रम्यं प्राञ्जलिविश्वपद्यसुधया रञ्जेत नित्यं जगत् ॥
తెలుగు లిపి :
విద్యావిప్లవసర్వకర్మనిరతా విజ్ఞానదీప్తిర్భవేత్ ।
శ్వాసోऽయం జగజ్జీవనార్థసహితః శాంతిప్రసాదప్రదః ॥
ధర్మార్థప్రభుదాయసారసహితో ధాత్రీజనాన్ పాలయేత్ ।
రమ్యం ప్రాంజలివిశ్వపద్యసుధయా రంజేత నిత్యం జగత్ ॥
భావం :
విద్య ద్వారా సమాజంలో విప్లవాత్మక మార్పులు సంభవించి, ప్రతి కార్యమూ విజ్ఞాన కాంతితో నిండాలి. జీవితం శ్వాసతో నిలిచినట్లే, జగత్తు శాంతి, సౌభాగ్యాలతో నడవాలి. ధర్మం దయతో కూడి ప్రజలను రక్షించాలి. అలాంటి శుభసంకల్పాలను మధురమైన పద్యసుధగా “ప్రాంజలి విశ్వ” నిత్యం ప్రపంచంలో విరజిల్లజేయాలి.
*****
కం.సరితా సమతా సహితా
హరితా భవితా సహాయ హారతి గంధమ్
నరనాడి ఫలము వినతా
మురళీ చరితా శుభంబుపుష్కర గమనమ్
భావం
సమత్వంతో ప్రవహించే నదిలా జీవితం ఉండాలి. పచ్చదనం, భవిష్యత్తు, సహకారం పరిమళంలా వ్యాపించాలి. మానవజీవన సారము వినయమే. మురళీనాదంలా పవిత్రమైన గమనం జీవన శుభతకు దారి చూపుతుంది.
****
శా..సందేశాలను ధర్మ సూక్తులు గనున్ సామర్థ్య వైనంబుగన్
ఆందోళన్ ఋజుమార్గమున్ విముకతన్ ఆదర్శ జ్ఞానంబుగన్
సందేహాలనుదర్శకత్వముగనున్ సాపేక్ష సిద్ధాంతమున్
ద్వందంకాకయు నిర్మలంబగుటయున్ దక్షాదర్శకత్వంబుగన్
ఓక దర్శకుడిగా
(దర్శకుల దినోత్సవ శుభాకాంక్షలు)
సరళ భావం :
దర్శకుడు ఇచ్చే సందేశాలు ధర్మసూక్తుల్లా ఉండాలి.
అవి సామర్థ్యాన్ని పెంపొందిస్తూ, సరైన మార్గంలో నడిపించాలి.
ఆందోళనల నుంచి విముక్తి కలిగించి, ఆదర్శజ్ఞానాన్ని అందించాలి.
సందేహాలను తొలగించి, సత్యాన్ని చూపే దారిదీపంలా ఉండాలి.
ద్వేషాలు, విభేదాలు కాకుండా నిర్మలమైన భావాలను పెంపొందించాలి.
అటువంటి వ్యక్తే నిజమైన దర్శకుడు.
*****
త.తరము మారిన కాలధర్మము తాపమవ్వక నుండగన్
తరగనీకళ దివ్య దీప్తి సుతావిధానపు మార్గమున్
కరమేకనలేనివృత్తము కాంచనావెలుగివ్వగన్
కరుణ చూపుల భాస్కరుండుగు కామ్య వైనము నిత్యమున్
సరళ భావం :
కాలం మారినా, ఆ మార్పు మనసుకు బాధ కలిగించకుండా ఉండాలి.
నశించని కళా ప్రకాశం, మంచి సంతతి కోసం మార్గదర్శకంగా నిలవాలి.
చేతిపని లేకుండా జీవితం సార్థకం కాదు; శ్రమే బంగారు వెలుగును ఇస్తుంది.
కరుణతో నిండిన చూపులు సూర్యుడిలా ప్రపంచానికి శ్రేయస్సు నింపుతాయి.
****
వెలుగు వేదిక మూడు రంగుల వెన్నెలైన పతాకమున్
పలుకు కేవల త్యాగమేయగు ప్రాణ నాద విముక్తిగన్
తలపు శక్తియు అంధకారము దాస్య ముక్తియు మూలమున్
విలువ లన్నియు దేశభక్తియు విద్యభారతి తోడుగన్
సరళ భావం :
మూడు రంగుల జాతీయ పతాకం వెలుగుల వేదికలా ప్రకాశిస్తోంది.
అది త్యాగానికి, ప్రాణార్పణానికి, స్వేచ్ఛా నాదానికి ప్రతీక.
మంచి ఆలోచనల శక్తి అంధకారాన్ని తొలగించి దాస్య విముక్తికి మూలమవుతుంది.
దేశభక్తి, విద్య, భారతీయ సంస్కృతి — ఇవే మన జీవితపు నిజమైన విలువలు.
****
రోజు లన్నియు కష్టమేయగు రోత పుట్టెడి రాజ్యమున్
గాజు మాదిరి ధారదత్తము గమ్య ఓటుకు విత్తమున్
మోజు కాంచన ఆశ పాశము ముక్తి మోక్షము నేటికిన్
రాజు మాదిరి దుత్తసొమ్మును రాజకీయపు వాటికన్
సరళ భావం :
ఈ రోజుల్లో ప్రజల జీవితం అంతా కష్టాలతో నిండిపోయి విసుగు పుట్టిస్తోంది.
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఇచ్చే ధనం గాజులా మెరుస్తుంది కానీ స్థిరమైన విలువ ఉండదు.
బంగారం, ఆశ, లోభం అనే బంధనాల్లో మనుషులు చిక్కుకుని, ముక్తి–మోక్షాల వంటి విలువలను మరచిపోతున్నారు.
రాజకీయాల్లో నాయకులు రాజుల్లా ప్రజాధనాన్ని తమ స్వార్థానికి ఉపయోగిస్తున్నారు.
****
మక్కువ దాహతాపము సమాన మనస్సుగ నెంచగల్గగన్
చక్కిలి గింతలై కదలు సాగర హోరుగ పొంగి పొర్లగన్
చెక్కిన శిల్పసందడి సుచిత్తము తృప్తిగ ఒక్క టవ్వగన్
ముక్కెరలోనతండు కడు ముద్దుగ తోచెను చాన కంటికిన్"
సరళ భావం :
మనసులోని మక్కువ, దాహం, తాపం సమత్వంగా కలిసిపోతే,
ఆనంద తరంగాలు సముద్రపు హోరులా ఉప్పొంగుతాయి.
శిల్పంలా చెక్కిన అందమైన రూపాన్ని చూసినప్పుడు,
మనసు తృప్తితో నిండిపోతుంది.
ముక్కెర (నాసాభరణం) ధరించిన ఆ రూపం
చిలిపి చూపులకు ఎంతో ముద్దుగా కనిపించింది
*****
బుద్ధి శుద్ధ తత్త్వపు గమ్య భూషణంబు
ధరణి తీర్పుధైర్యముతీరు ధర్మపలుకు
వాక్య మాధురి ప్రేమలో వాత్స వంబు
రంజితంబగు జీవితం రక్ష రమణి
సరళ భావం :
శుద్ధమైన బుద్ధి, తత్త్వజ్ఞానం మనిషికి నిజమైన ఆభరణం.
ధర్మబద్ధమైన మాట, ధైర్యమైన తీర్పు జీవనానికి ఆధారం.
మధురమైన వాక్యం, ప్రేమతో కూడిన వాత్సల్యం మనసులను కలుపుతాయి.
అలా జీవితం ఆనందమయమై, రక్షణనిచ్చే రమణీయ మార్గంగా మారుతుంది.
****
చల్లగుండుమనియు చలువజేయపలుకు
కళ్ళలాడవలదు కలలు మాయ
వళ్ళు యప్ప జెప్పు వరుసమహేశ్వరా
తల్లి తల్లి మగడు తల్లి యయ్యె
“ఓ శంకరా!
లోకంలో మాటలు చల్లగా ఉంటాయి, చూపులు మాయ చేస్తాయి, కలలు అసత్యమవుతాయి.
బంధుత్వాలూ, వరుసలూ విచిత్రంగా మారిపోతుంటాయి.
అందుకే — ‘తల్లి తల్లి మగడు తల్లి యయ్యె’ అన్నట్టుగా సంబంధాల గజిబిజి సంసారమంతా మాయగానే ఉంది!”
****
గీ.సంతసా భయజీవన సత్య సతత
పలుకు ప్రేమదీపజ్వాల పంథమగును
దరువు దాహతృప్తిప్రశ్న ధర్మ మౌన
లుంగ రలలితమైవిద్య లోక హితము
సంతోషమూ భయమూ కలిసిన జీవితం సత్యమనే ఆధారంపై నడవాలి.
ప్రేమదీపంలా పలికే వాక్యమే మనకు మార్గదర్శి.
దాహం–తృప్తి–ప్రశ్నల మధ్య ధర్మమే మౌనబోధగా నిలుస్తుంది.
విద్య లలితంగా వికసించి లోకహితానికి దారితీయాలి.
*****
మ. కో. నాచు తీరున నీటి యందున పాచి పట్టియు నూతినా
చూచు చుండగ నీటి శుభ్రత సోకు తీరున తేటగా
కాచు మంచుయు వేడి గాలికి కాల తీరున చల్లగా
వీచుచుండగ వేడి గాలులు వేడి యంతయు బోయలే
సరళ భావం :
నీటిమీద నాచు, పాచి పట్టినా లోపలి నీటి స్వచ్ఛత పోదు;
దగ్గరగా చూసినప్పుడు అది తేటగా కనిపిస్తుంది.
అలాగే మంచు చల్లదనం వేడి గాలుల మధ్య కూడా తన స్వభావాన్ని కాపాడుతుంది.
వేడి గాలులు వీచినా, అంతర్గత శాంతి పూర్తిగా నశించదు.
*****
గీ.కలువ నీటిలో కనులుకే కలవరింపు
విలువ బయటకొచ్చి నిలువ వెన్నెల గను
మొగ్గ విప్పారి యందము మోజు పుట్ట
చేత చిక్క నలుగ కాల చిత్తమాయ
భావం :
కలువ నీటిలో ప్రతిబింబమై కనిపించే అందం కళ్లకు కలవరాన్ని కలిగిస్తుంది.
అంతర్లీనమైన విలువ బయటకు వచ్చినప్పుడు అది వెన్నెలవలె నిండైన కాంతిని ప్రసరిస్తుంది.
మొగ్గ విప్పారిన పువ్వు అందాన్ని చూసి మనసులో మోహం పుడుతుంది.
కానీ చేతికి చిక్కిన వెంటనే ఆ మోజు క్రమంగా తగ్గిపోవడం కాలచిత్తమనే మాయ స్వభావం అని కవి సూచిస్తున్నారు
. సర్వంబునొక్కటే శాంతంబునొక్కటే
పూల గంధమొకటే పూలు వేరు
ధైర్యంబునొక్కటే ధర్మంబు నొ క్కటే
మన దేహమొక్కటే మనసు వేరు
ప్రేమంబు నొక్కటే పీయూష మొక్కటే
జీవతం నొక్కటే జీవి వేరు
సుఖమయ మొక్కటే సూత్రంబు నొక్కటే
సర్దుబాటొక్కటే సమయ తీరు
ఆవె. ఒక్కటొక్క దిక్కు ఒక్క ముక్కు పలుకు
దక్కు కక్కు మొక్కు తక్కు వెక్కు
చక్క నొక్క చుక్క చక్కిలి తోదక్క
దక్కు వింతలన్ని ధరణి నందు
****
కం. కలుగున మంటలు పుట్టెన్
చెలగున ఎలుకలకలుగది చెలగుచు పరుగే
బలమున యేనుగు అరుపులు
ఎలుకలు తమ కలుగులోని కేనుగు తీసేన్
భావం :
మంటలు చెలరేగినప్పుడు ఎలుకలు తమ కలుగులనుండి బయటకు పరుగులు తీస్తాయి. కానీ అవే ఎలుకలు గుంపుగా కలసి, తమ దాగుడు ప్రదేశాలలోనుండి ఏనుగునికైనా ఇబ్బంది కలిగించగలవు. ఎంత బలమైనదైనా, చిన్న చిన్న శక్తులను తక్కువగా అంచనా వేయకూడదనే సంకేతం ఇందులో ఉంది.
****
ఉ.తొమ్మిది రంద్రతిత్తియు సతోడ్పడు కర్మల తీరు లక్ష్యమున్
నమ్మిన వారి నెంచియు వినమ్రత జూపియు జీవనంబుగన్
కమ్మిన కోపతాపములు కాలము బట్టియు మార్చగల్గగన్
తుమ్మిన గాలి తుప్పరులు తుర్రున మాయల తీరు మాయమున్
సరళ భావం :
మన శరీరం తొమ్మిది రంధ్రాలతో కూడిన నశ్వరమైన దేహం.
ఇది కర్మల ఆధారంగా నడుస్తూ జీవన లక్ష్యాలను అనుభవిస్తుంది.
మనపై నమ్మకం ఉంచిన వారిని గౌరవించి, వినమ్రతతో జీవించాలి.
మనసులో కలిగే కోపం, తాపం వంటి భావాలను కాలానుగుణంగా మార్చుకోగలగాలి.
తుమ్మిన వెంటనే గాలి, ధూళి ఎలా క్షణంలో చెదిరిపోతాయో,
అలాగే ఈ ప్రపంచ మాయలు కూడా నిలకడలేని వాటిగా మారును.
*****
కం.బొంకకు తెలుగున తత్త్వము
జంకకు మనిషిగ నిజంబు జగతిన కథగన్
లంకెల యాసలు మానము
సంకట దృష్టిగ విధాన సత్కృప గనుమా
సరళ భావం :
తెలుగులో అబద్ధాలు చెప్పకుండా తత్త్వంతో మాట్లాడాలి.
మనిషిగా నిజాయితీతో జీవించాలి; ఈ ప్రపంచ జీవితం ఒక కథలాంటిదే అని గ్రహించాలి.
అత్యాశలు, బంధనాలపై మమకారం తగ్గించుకోవాలి.
కష్టసమయాలను సరైన దృష్టితో చూసి, సత్కృపతో కూడిన విధానాన్ని అనుసరించాలి.
*****
ఏరి తెలుంగుసాహితి సయోధ్యత చెప్పగ నోరు రాదుగన్
ఏరి వినమ్రతా భవము యెల్లరు తెల్గున పల్కు నందు నన్
ఏరన భాషవృద్ధికి స యిచ్ఛ ప్ర భుత్వపు రాజ మార్గమున్
వారి పదాలయందు తలవాలిచి పోదము తెల్గు జాతిగన్
సరళ భావం :
తెలుగు సాహిత్యంలో ఉన్న సయోధ్యత, మాధుర్యాన్ని పూర్తిగా చెప్పడం సులభం కాదు.
తెలుగు పలుకులో వినమ్రత, ఆప్యాయత సహజంగా నిండివుంటాయి అని అందరూ గ్రహించాలి.
తెలుగు భాష అభివృద్ధి చెందాలంటే ప్రజలకే కాదు, ప్రభుత్వానికీ మంచి సంకల్పం, సరైన మార్గదర్శకత్వం అవసరం.
తెలుగు మహనీయుల మాటలకు గౌరవంగా తలవంచి, మనమంతా తెలుగు జాతిగా భాషాభిమానంతో ముందుకు సాగాలి.
*****
గర్వముగను గంభీరగలేనుగుగతి
తొండమున ఎలుక విహార తొ ట్రుపాటు
గతిగ కొండను ఢీకొన గమ్య చావు
ఎలుక ఏనుగునేవధి యిoచె నవుర
నా దృష్టిలో ఎలుక – ఏనుగు వర్ణన :
ఏనుగు మహాబలశాలి.
దాని నడక గంభీరంగా ఉంటుంది; అడుగేస్తే భూమి కంపించినట్టు అనిపిస్తుంది.
అది అధికారానికి, అహంకారానికి, బాహ్యబలానికి ప్రతీకగా కనిపిస్తుంది.
ఎలుక మాత్రం చిన్నది.
కానీ అది చురుకైనది, చాకచక్యమైనది, ఎక్కడైనా చొరబడగలదు.
చిన్నదైనా తన బుద్ధి, వేగంతో పెద్దదాన్నికూడా ఇబ్బంది పెట్టగలదు.
అందుకే జీవనసత్యం ఏమిటంటే —
పరిమాణం కాదు, పరిజ్ఞానం మరియు సమయస్ఫూర్తే నిజమైన శక్తి.
చిన్నవారిని తక్కువగా చూడటం ప్రమాదకరం; కొన్నిసార్లు సూక్ష్మమైనదే మహాబలాన్ని జయిస్తుంది.
****
రాడ్రావిధివైపరముగా
రాడ్రాoగము చెలరేగి రంజిల మయమున్
నాడ్రా నటనలు తీరున్
గొడ్రాలికి బిడ్డపుట్టె కోరిక దీ రన్
సరళ భావం :
విధివశాత్తు ఉత్సాహభరితమైన వేడుకలు ప్రారంభమయ్యాయి.
ఆనందంతో శరీరమంతా ఉల్లాసంగా కదిలిపోయేలా రంగుల హంగామా చెలరేగింది.
నాట్యాలు, ఆటలు, సంబరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి.
సంతానం కోసం ఎంతోకాలంగా ఎదురుచూసిన ఒక గొడ్రాలికి (సంతానం లేని స్త్రీకి) బిడ్డ పుట్టడంతో ఆమె కోరిక నెరవేరింది; అందుకే ఈ ఆనందోత్సవం
****
తతాతీత తత్త్భావ తన్మాయ తతోతతి రతః
తాతితాం తత్తారం తాం తాం తకధిమ్ తత్త్వంబు రతిః
శివపార్వతులు దివ్యనృత్యంలో లీనమై ఆనందంగా విరాజిల్లుతున్నారు.
వారి తాండవ–లాస్య నృత్యధ్వనులు జగత్తంతా పరచుకొని సృష్టి తత్త్వాన్ని తెలియజేస్తున్నాయి.
ఆ దివ్యనాట్యంలో నాదం, లయం, తత్త్వం కలిసి పరమానందాన్ని ప్రసాదిస్తున్నాయి.
***
కవి భవంబు తెల్పగలుగు కావ్య విలువ
గుర్తు లేని స్థితియు మార్చు గుప్త విద్య
కలము కాలమున కదులు కవికి విలువ
కనుల ముందు నున్నది చూడ కరువు తీరు
సరళ భావం :
కవి తన కవిత్వం ద్వారా జీవన సత్యాలను, భావజాలాన్ని ప్రజలకు తెలియజేయగలడు.
మంచి కావ్యం మనిషి గుర్తింపులేని స్థితినీ మార్చగల గుప్తశక్తిలా పనిచేస్తుంది.
కాలంతో పాటు కలం కదులుతుంటేనే కవికి విలువ పెరుగుతుంది; రచన అతని జీవన శ్వాసవంటిది.
కానీ మన కళ్ల ముందే ఉన్న నిజాలను గమనించకుండా ఉండటం సమాజంలోని ఒక లోపం.
అందువల్ల నిజమైన విలువలు కనిపించకపోవడం ఒక విధమైన “కరువు”గా మారుతోంది.
*****
జ్ఞానమనస్సుగాసహజ జ్ఞానముపాసన విద్య వెళ్లువా
ప్రాణము నిల్ప జీవన నుపాధిగనే మది మాయనుండగా
మానము సర్వ వేళల సమానము గానగు జీవనంబుగన్
మౌనము బూనిరిద్దరును మాటలు మాత్రము వెల్లువెత్తెలా
సరళ భావం :
సహజమైన జ్ఞానం మనసులో వెలుగులా ప్రసరిస్తుంది.
ఆ జ్ఞానం ఉపాసన, విద్య రూపంలో జీవితాన్ని సార్థకం చేస్తుంది.
ప్రాణం నిలబెట్టుకోవడానికి మనిషి అనేక ఉపాధులలో నిమగ్నమవుతాడు; అయితే మనసు చాలాసార్లు మాయలో చిక్కుకుపోతుంది.
గౌరవం, మర్యాద అన్నవి ప్రతి సమయంలో సమానంగా ఉండాలి; అదే నిజమైన జీవన విధానం.
మౌనాన్ని ఆచరించాల్సిన ఇద్దరూ మాటల ప్రవాహంలో మునిగితే, ఆ మౌనసారం కోల్పోతారు — అని చివరి పాదంలో సున్నితమైన వ్యంగ్య తాత్పర్యాన్ని వ్యక్తపరిచారు.
******
పల్లె వాసమ్ములే పల్లె గ్రాసమ్ములే
పంచ వేషమ్ములే పలుకు పంట
పల్లెసౌఖ్యమ్ములే పల్లె భవంతిలే
పల్లె పంచాయితీ పలుకు పంట
పల్లె లార్భాటమ్ము పచ్చ దనంబుగన్
పల్లెపోరాటమ్ములే పలుకు పంట
పల్లె రాజ్యాంగమే పల్లె ప్రేమంబుగా
పిల్లె గాలుల తీరు పలుకు పంట
ఎంత నున్న పట్నము మోజు యేమి చెప్ప
ఆధునిక యంత్రఫలముయే అలక పనులు
దినము బ్రతుకు ప్రశ్న యగుట దీక్ష లున్న
పట్న పల్లె మధ్యన జీవి పలుకు పంట
***
ధర్మ పక్షపాతి కళలు ధరణి యందు
సాటి వారు నిన్నుగమెచ్చ సాధ్య తీరు
భారతంబులో పరమార్ధ భావ మగును
దైవ నీడలేప్పుడు చెంత దివ్య దీప్తి
సరళ భావం :
ధర్మానికి పక్షపాతిగా, నీతిమార్గంలో నడిచే వ్యక్తిని ఈ లోకంలో అందరూ గౌరవిస్తారు.
అటువంటి వ్యక్తి ప్రతిభ, ప్రవర్తన ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి.
భారతీయ సంస్కృతిలో పరమార్థ భావన, ఆధ్యాత్మికత ప్రధానమైనవి.
ధర్మబద్ధ జీవనంలో దైవకృప ఎల్లప్పుడూ నీడలా వెంట ఉంటుంది.
అలాంటి దైవసాన్నిధ్యం జీవనాన్ని దివ్యమైన కాంతితో నింపుతుంది.
****
ఉ.బంధము గాలితోజలము భాద్యత మధ్యన జీవనంబుగన్
బంధము కాంతి చీకటగు భారము వైరము మాయ మూలమున్
బంధము వెల్గు నీడలగు భాగ్య మనస్సుకు శాంతి కష్టమున్
బంధము ఆత్మయోగమగు భాస్కర గమ్యము తీరు మౌనమున్
సరళ భావం :
ఈ ప్రపంచ జీవితం అనేక బంధాల మధ్య సాగుతుంది.
గాలి, నీరు ఎంత అవసరమో, అలాగే బాధ్యతలతో కూడిన బంధాలు కూడా జీవితంలో భాగమే.
కొన్ని బంధాలు కాంతిలా ఆనందాన్ని ఇస్తాయి; మరికొన్ని చీకటిలా భారంగా, వైరంగా మారి మాయలోకి నెట్టేస్తాయి.
మనసుకు కలిగే భాగ్యం, కష్టం, శాంతి — ఇవన్నీ కూడా బంధాల వల్లనే అనుభవంలోకి వస్తాయి; వెలుగు-నీడల వలె అవి మారుతూ ఉంటాయి.
చివరికి నిజమైన బంధం ఆత్మతో కలిసే యోగం.
అది సూర్యుని వెలుగులా జ్ఞానమార్గాన్ని చూపించి, మౌనస్వరూపమైన పరమగమ్యానికి నడిపిస్తుంది.
*****
.కంద పద్యాలు
వెలుగే వాకిట తోడగు
పలుకే వాన గగన ఘోష బాటలు పట్టే
కలలాదూతలు కదలే
కళలన్ని కదలిక గాను కాలపు వానే
*†**
చిరునవ్వు చిలకరింపగ
మురిపమ్ము ముదమన శాంతి ముందర వెలుగే
సరి చెప్పా కదలవుగా
చరితమ్ము తెలప ఫలంబు చక్కగ పంచా
*****
దినమంత వినతి జేసితి
క్షణమొఖ నీరూపుఁ గాంచ గమ్యము తీరే
గుణము పలుకు పరవశించ
ఆణువణువు కళలను చూపు అలకళ వానే
****
అంత్యాను ప్రాస భావం
1
వెలుగుల వాకిట వెలిసెను మనసు వేడే
పలుకుల పూలవాన పరిమళ మాడే
కలల కనులలో కదిలెను కాంతి జాడే
కాలము కదలికలలో కలిసెను నాడే
2
చిరునవ్వు చిందెన చెలిమెల చందే
మురిపాల ముద్దులో మమతల బందే
సరసాల సాగరమె సానుకూల గందే
చరితమెల్ల చాటెన చైతన్య వందే
3
దినమున దివ్యమై దర్శనమై నిండే
క్షణమున కనువిందై కాంతులు చిందే
గుణముల గర్భమై గానమై వినిపించిందే
ఆణువణువున ఆనంద రసమై విరిందే
***
******
విజయనగర సామ్రాజ్యపు రాజలాంఛనాలలో వరాహం, సూర్యచంద్రులు ఖడ్గం ఎందుకు ఉన్నాయి ?
...........................................
దక్షిణ భారత రాజవంశాల చరిత్రలో రాజలాంఛనాలు వారి గుర్తింపు, శక్తి, సార్వభౌమత్వానికి ముఖ్యమైన ప్రతీకలుగా నిలిచాయి. విజయనగర సామ్రాజ్యానికి వరాహం, ఖడ్గం, సూర్యచంద్రులు ఎంత ప్రాధాన్యమో, అదే విధంగా శాతవాహన, పల్లవ, పాండ్య, చాళుక్య, చోళ, హొయసల, కాకతీయ, రెడ్డి, నాయక, వడయార్ వంశాలకు కూడా అంతే ప్రాధాన్యత గల ప్రత్యేక రాజచిహ్నాలుoడేవి. ఇవి నాణేలు శాసనాలు దేవాలయాలు జెండాలపై ఆ రాచముద్రలు కనిపిస్తూ ఆయా రాజ్యాల సంస్కృతిని, మత విశ్వాసాలను రాజకీయ శక్తిని తెలియజేస్తాయి.
మొదటగా శాతవాహనులు దక్కన్ ప్రాంతాన్ని పాలించారు. వారి చిహ్నాల్లో సింహం ఏనుగు చైత్యం పడవ వంటి బొమ్మలు కనిపిస్తాయి. వారి నాణేలపై ఉజ్జయిని గుర్తు స్వస్తిక నదిలో ఓడ వంటి గుర్తులు ఉండేవి.సింగం శక్తికి ఏనుగు బలానికి గుర్తులు. ఓడవారి సముద్ర వాణిజ్య శక్తిని సూచిస్తాయి.
పల్లవుల కాలంలో సింహం ప్రధాన చిహ్నంగా నిలిచింది. సింహం పౌరుషానికి బలానికి గుర్తు. మహాబలిపురం, కాంచీపురం ప్రాంతాల్లో సింహస్తంభాలు విరివిగా కనిపిస్తాయి. వారి నాణేలపై నంది కూడా ఉండేది. నంది శైవ సంప్రదాయాన్ని తెలియజేస్తుంది.
చోళుల చిహ్నం పులి. పులి కూడా బలానికి పౌరుషానికి గుర్తు.వారి జెండాను పులికొడి అని పిలిచేవారు అంటే గాండ్రిస్తున్న పులి అని అర్థం. నాణేలు, శాసనాలపై పులి బొమ్మ తప్పనిసరిగా ఉండేది. కొన్ని చోట్ల పులితో పాటు చేపలు, విల్లు కూడా కనిపిస్తాయి, ఇవి ఇతర రాజ్యాలపై వారి ఆధిపత్యాన్ని గెలుపును సూచిస్తాయి.అంటే చోళులు వారిని జయించి వారి రాజముద్రలను స్వీకరించారు. పాండ్యుల చిహ్నం రెండు చేపలు. ఇవి మధురై ప్రాంతపు సమృద్ధిని, వైగై నదికి వున్న ప్రాధాన్యాన్ని తెలియచేస్తాయి.
చాళుక్యులు వరాహాన్ని తమ చిహ్నంగా ఎంచుకున్నారు. ఇది విష్ణువు వరాహావతారాన్ని సూచిస్తుంది. వరహా అవతారంలో భూమిని విష్ణువు ఏ విధంగా రక్షించాడో అదే విధంగా వారు కూడా తమ రాజ్యాన్ని ఇతరుల నుండి రక్షించినవారిగా భావించుకున్నారు.
తూర్పు చాళుక్యులు కూడా ఇదే వరహ చిహ్నాన్ని కొనసాగించారు. అయితే వారి శాసనాల్లో సూర్యచంద్రులను కూడా జోడించారు.అంటే సూర్యచంద్రులున్నంత వరకు తమసామ్రాజ్యం వుంటుందని వారి భావన. హొయసలుల చిహ్నం చాలా ప్రత్యేకమైనది. ఒక వీరుడు సింహాన్ని కత్తితో పొడిచి చంపే వీరోచిత దృశ్యాన్ని వారు తమ రాజముద్రగా ఉపయోగించారు. ఇది వారి వంశపుగాథను తెలియజేస్తుంది.
కాకతీయులు కూడా వరాహాన్ని తమ చిహ్నంగా స్వీకరించారు. వారి శాసనాలపై నాణేలపై వరంగల్లు కోటపై దేవాలయాలపై ఈ చిహ్నం కనిపిస్తుంది. రెడ్డి రాజుల చిహ్నం నంది. వారు శివభక్తులు కావడంతో నంది బొమ్మను విస్తృతంగా వాడారు. నాణేలు, శాసనాల్లో నంది ముందు శివలింగం కూడా కనిపిస్తుంది. నంది ( ఎద్దు) వ్యవసాయానికి మూలస్థంభం లాంటిది.
మైసూరు వడయారుల చిహ్నం గండభేరుండ అనే రెండు తలల పక్షి. ఇది అత్యంతశక్తి,కి అజేయతకు గుర్తు. గండభేరుండం నేటికీ కర్ణాటక రాష్ట్ర చిహ్నంగా ప్రసిద్ధి.
విజయనగర రాజులు వరాహం, ఖడ్గం, సూర్యచంద్రులను తమ ప్రధాన చిహ్నాలుగా వాడారు. వరహ అవతారంలో ఏ విధంగానైతే విష్ణువు భూమిని కాపాడినాడో అదే విధంగా తమ రాజ్యాన్ని కాపాడగలమని దీనిభావం. వరహం బలానికి వేగానికి రౌద్రానికి కూడా చిహ్నం. వారి రాజలాంఛనంలోని కత్తి విజయనగర ప్రభువుల శౌర్యానికి అంతులేని విజయాలకు గుర్తు. సూర్యచంద్రులంటే సూర్యచంద్రులున్నంత వరకు తమ రాజ్యం వుంటుందని భావన.
నాయక రాజులు విజయనగర ప్రభావంతో ఆ వైభవాలను అవే చిహ్నాలను కొనసాగించారు. తంజావూరు నాయకులు చేప వరాహం శంఖుచక్రాలను రాజముద్రలో తీసుకొన్నారు. వీరు శ్రీరాముడి బొమ్మతో నాణేలు కూడా ముద్రించారు. మధురై నాయకులు పాండ్యుల సంప్రదాయం ప్రకారం చేపలను తమ చిహ్నంగా వాడారు. వారి నాణేలు శాసనాల్లో గరుడుడు వైష్ణవ చిహ్నాలు కూడా కనిపిస్తాయి.
ఈ విధంగా చూస్తే, ఈ రాజలాంఛనాలు కేవలం అలంకారాలు మాత్రమే కావు. వాటిలో ప్రతి రాజవంశం యొక్క మత విశ్వాసం శక్తి పరాక్రమం విజయం రాజకీయ ఆశయాలు ప్రతిబింబిస్తాయి. ఈ చిహ్నాలను అర్థం చేసుకుంటే దక్షిణ భారత చరిత్ర మరింత సులభంగా, స్పష్టంగా అవగతమవుతుంది.
॥సేకరణ॥
............. జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం
*****
*పరుగో పరుగు - 7*
📷🏃🏽
రచన : మల్లిక్
షాపు ఓనర్ చేతిలో అయిదు రూపాయలు పెట్టి బయటికి పరుగుతీశాడు ఆయన.
లక్ష్మి వెనక్కి తిరిగి చూసి కెవ్వుమంది.
“ఏమైంది?” అంది సరోజ కంగారుగా.
"వాడు అంతదూరంలో ఉరుకులు పరుగులు పెడుతూ వస్తున్నాడే.... అద్దాల షాపువాడ్ని త్వరగానే వదిలించుకున్నాడు.”
"మనల్ని చూశాడా?....” నడకవేగం పెంచుతూ అడిగింది సరోజ.
"లేదనుకుంటా....ఈ జనంలో వాడికి కనిపించలేదు. రోడ్డుకి అటూ ఇటూ చూస్తూ గబగబా వస్తున్నాడు..." అంది లక్ష్మి వెనక్కి చూస్తూ.
“అయితే ఈ స్టూడియోలో కాస్సేపు తలదాచు కుందాం.... త్వరగా రా...." అంటూ పక్కనే ఉన్న ఫోటో స్టూడియోలోకి లక్ష్మి చెయ్యిపట్టుకుని లాక్కెళ్ళింది సరోజ '
అది రాంబాబు "ఇస్మైల్ ప్లీజ్ ఫోటో స్టూడియో”
సీలింగ్ వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తున్న రాంబాబు, ఈగలు పడ్తున్న కిష్టయ్య అలికిడికి తలతిప్పి గుమ్మం వైపు చూశారు. సరోజనీ, లక్ష్మినీ చూసిన ఆ ఇద్దరూ ఒక్కసారి సంతోషంతో కీచుమని అరిచారు. వీళ్ళ అరుపుకి అమ్మాయి లిద్దరూ భయపడి వెనక్కి రెండడుగులు వేశారు.
"అహహ....మీరలా వెనక్కి అడుగులు వేయ కూడదు....ముందుకే వెయ్యాలి.... మీ మొహం మీ మొహంలాగానే పడాలంటే మా స్టూడియో లోనే ఫోటో తీయించుకోండి.... ఇస్మైల్ ఫోటో స్టూడియో.... అందరి ఫోటో స్టూడియో .... టింగ్ టింగ్ టింగ్..." అన్నాడు రాంబాబు ఎడ్వటైజ్మెంట్ ధోరణిలో వాళ్ళని నవ్వించి ఇంప్రెస్ చేద్దామని.
“శభాష్ గురూగారూ....కస్టమర్లతో అలా చలాకీగా మాట్లాడి ఆకర్షించాలి.... ఆ విషయం గురించే మీకు చెప్పాలని అనుకుంటున్నా” అన్నాడు కిష్టయ్య రాంబాబు చెవిలో.
వాడి మాటలకి రాంబాబు సంతోషించాడు. కానీ అది ఎంతోసేపు లేదు. ఆ అమ్మాయిల ముఖం చూసిన రాంబాబు నీరుకారిపోయాడు.
రాంబాబు మాటలకి వాళ్ళు నవ్వలేదు. సీరియస్ గా అతని వంక చూసి ముఖముఖాలు చూస్కున్నారు.
“నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి.... అంతేగాని వెళ్ళిపోకండి....మీరు ఇక్కడ ఫోటో తీయించుకోవాల్సిందే...."
"అవును మేడమ్.... మీరు ఒక్కసారి మా దగ్గర ఫోటో దిగితే ఇంక జీవితంలో ఫోటో దిగరు" హుషారుగా అన్నాడు కిష్టయ్య.
"వేరేవాళ్ళ దగ్గర.... వేరేవాళ్ళ దగ్గర...." అంటూ సరిదిద్దాడు రాంబాబు....
వీళ్ళ మాటలు పట్టించుకునే స్థితిలో లేరు వాళ్ళిద్దరూ. సరోజ లక్ష్మికి సైగ చేసింది. లక్ష్మి మెల్లగా గుమ్మంవైపు రెండడుగులు వేసి బయటికి తొంగిచూసి కెవ్వుమని కేకేసింది.
“వాడిక్కడే ఆగి మనకోసం అటూ ఇటూ చూస్తున్నాడు" అంది గబగబా సరోజ పక్కకు వచ్చి.
"ఎవరండీ అతను?.... అతన్ని కూడా లోపలికి రమ్మనండి ఫొటో తీసేస్తాను ....పాపం ఆయన బయటెందుకు నిల్చున్నారు సిగ్గా?.... ఒరేయ్ కిష్టయ్యా.... నువ్వు బయటకు వెళ్ళి ఆయనెవరో ఉన్నారట.... లోపలికి తీసుకురా...." అన్నాడు రాంబాబు.
కిష్టయ్య బయటికి వెళ్ళబోయాడు.
లక్ష్మి, సరోజా చెంగున ముందుకు దూకి వాడి చెరో రెక్కా పట్టుకుని వెనక్కిలాగి “వాడు మావాడు కాదులే.... ముందు మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళు" అన్నారు.
నలుగురూ లోపలి గదిలోకి వెళ్ళారు.
కిష్టయ్య చకచక లైట్లు వెలిగించాడు. కెమేరా రెడీ చేస్కున్నాడు.
"చెప్పండి.... కూర్చుని తీయించుకుంటారా నిల్చునా?.... బస్టా, పుల్లా? ....ఏ సైజులో కావాలి.... కార్డా, కాబినెట్టా?" అన్నాడు రాంబాబు.
సరోజా, లక్ష్మి ముఖముఖాలు చూస్కున్నారు.
"సారీ అండీ.... మేం ఫోటోలు తీయించుకోడానికి రాలేదు....” అన్నారు ఇద్దరూ ఒకేసారి.
"ఓహ్?..."
ఇద్దరమ్మాయిలూ తమ పరిస్థితి వివరించి చెప్పారు.
రాంబాబు నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చుండి పోయాడు. కిష్టయ్య లైట్లన్నీ ఆర్పేశాడు.
“నువ్వెళ్ళి చూసిరావే... వెళ్ళిపోయి ఉంటాడు...” అంది సరోజ•
లక్ష్మి బయటికి వెళ్ళి చూసొచ్చింది. "వాడు వెళ్ళిపోయాడే...." అంది సంబరంగా.
నలుగురూ ముందు గదిలోకి వచ్చారు.
"వియ్యార్ రియల్లీ సారీ అండీ....” అన్నారు మళ్ళీ ఇద్దరూ.
"ఏం పరవాలేదులెండి. మా చేత ఫోటోలు తీయించుకునే అదృష్టం మీకు, మీకు ఫోటోలు తీసే ఆదృష్టం మాకూ లేదు.... ఏం చేస్తాం.... " అన్నాడు రాంబాబు నిస్పృహగా.
"ఏయ్....మనం ఓ విషయం మర్చిపోయామే" అంది లక్ష్మి కళ్ళు పెద్దవి చేస్తూ.
"ఏమిటి ?"
"ఈ ఆదివారం మనం పిక్నిక్ వెళుతున్నాం కదా....అప్పుడు మనం ఒక ఫోటోగ్రాఫర్ ని బుక్ చేసుకుని మనకూడా తీసుకువెళదాం అనుకున్నాంగా....”
“అరెరె....ఆ విషయమే మర్చిపోయాం.... మనం ఈయన్నే మన కూడా తీసుకెళదాం...." అని రాంబాబు వైపు తిరిగింది సరోజ.
"చూడండి..."
“చూడండీ రాంబాబుగారూ.... మేం కాలేజీలో ఫైనలియర్ చదువుతున్నాం.....ఈ సంవత్సరంలో మా క్లాస్మేట్స్ అంతా విడిపోతాంకదా.... అందుకే విడిపోయేముందు గండిపేటకు పిక్నిక్ ఏర్పాటు చేస్కున్నాం. అక్కడ ఫొటోలు తీయించుకుందా మని నిర్ణయించుకున్నాం. మాలో ఎవరైనా ఒక కెమేరా తెచ్చి ఫోటోలు తీసుకోవచ్చనుకోండి ....
కానీ విడిపోతున్న మా స్నేహితుల జ్ఞాపకార్థం జీవితాంతం ఉండాల్సిన ఫోటోలు ఇవి.... అందుకే మీలాంటి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ తీస్తే బావుంటుందని అనుకుంటున్నాం...." అంది సరోజ.
“వచ్చే ఆదివారమే పిక్నిక్...." అంది లక్ష్మి.
"బస్సు సుల్తాన్ బజార్ లో ఆంధ్రాబ్యాంక్ బిల్డింగ్ నుండి ఉదయం ఏడుగంటలకు స్టార్టవుతుంది. మీరు అక్కడికి వచ్చెయ్యండి....నా పేరు సరోజ
....నేనే ఈ పిక్నిక్ ఆర్గనైజర్ని...." అని రాంబాబుకి వందరూపాయలు ఎడ్వాన్స్ ఇచ్చి లక్ష్మిని తీసుకుని వెళ్ళిపోయింది సరోజ.
రాంబాబు కిష్టయ్య ఇద్దరూ క్షణంపాటు వాళ్ళ ముఖముఖాలు చూస్కుని "యాహూ...." అని అరిచారు.
🏃♂️
*సశేషం*
꧁☆
*ప్రాంజలి ప్రభ కథలు..135
🙏🌹 🌹🙏*
*స్త్రీల గుణాలు …*👇
*భగవంతుడి విభూతులే*
*నారీణాం.. కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధా, ధృతి, క్షమ..!!*
స్త్రీలలో కనిపించే ఈ ఏడు గుణాలు నా విభూతులే అంటున్నాడు భగవానుడు.
దీనిని బట్టి ఈ ఏడు లక్షణాలు పురుషులలో కన్నా స్త్రీలలోనే ఎక్కువగా శోభిస్తాయని కావచ్చు. లేదా ఈ ఏడు లక్షణాలు స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తాయని కావచ్చు. ఇవి స్త్రీలకు సహజ గుణాలు కూడా.
‘స్త్రీ’ సృష్టిలో అందమైన దేవుడి వరం. స్త్రీ అంటేనే ప్రేమ, అనురాగం. తన జీవిత కాలంలో నిర్వహించే ప్రతి పాత్రను ఎంతో చక్కగా నిర్వర్తిస్తుంది. నాలుగు గోడల ఇంటిని స్వర్గం చేస్తుంది. ఏ పనిలోనైన రాణించ గలిగే ధైర్యం, సత్తా ఉన్నది స్త్రీకి మాత్రమే అని చాటిచెబుతుంది స్త్రీ.
అద్భుత మూర్తి స్త్రీ. స్త్రీశక్తిని, స్త్రీల గుణగణాలను పొగుడుతూ, ప్రతి వస్తువులోను ఒక్కొక్క విభూతిని చెప్పి,
”స్త్రీలలో మాత్రం ఏడు విభూతులుగా నేనున్నాను” అని భగవానుడు అనటంలో స్త్రీల యొక్క విశిష్ఠతను చాటు తుంది.
ఏమిటా ఏడు విభూతులు అంటే...```
*1. కీర్తి:*```
సత్కర్మలు, దానధర్మాలు, పూజాపునస్కారాలు, యజ్ఞయాగాదులు మొదలైన కర్మల ద్వారా, త్యాగ భావన ద్వారా కీర్తిని సంపాదించటం, భర్తకు అనుకూలంగా కుటుంబ నిర్వహణ గావించటం ఇవి స్త్రీ సహజగుణాలు.```
*2. శ్రీ:*```
శ్రీ అంటే సంపద. అంతేకాదు సంపదతోబాటు శరీర సౌందర్యాన్ని కాపాడుకుంటూ అందంగా అలంకరించుకోవటం కూడా స్త్రీ యొక్క సహజ గుణమే. శ్రీ అంటే లక్ష్మి.```
*3. వాక్కు:*```
వాక్కు అంటే సరస్వతి. విద్య, బుద్ధి, జ్ఞానం సంపాదించటం, చల్లగా, తియ్యగా, మధురంగా మాట్లాడటం కూడా భగవంతుని విభూతియే.```
*4. స్మృతి:* ```
జరిగిపోయిన విషయాలను గుర్తుపెట్టుకొనే జ్ఞాపకశక్తి, జ్ఞానాన్ని మరచిపోకుండా ఉండటం. సందర్భానికి తగినట్లు జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకోవటం స్మృతి. ఇదీ భగవంతుని విభూతియే.```
*5.మేధా:*```
ధారణాశక్తి. విన్న విషయాలను బుద్ధిలో నిలుపుకొనే శక్తి. జ్ఞాన విషయాలు, తత్త్వవిచారణ చేయటానికి కావలసిన మేధాశక్తి స్త్రీలలో అధికం. ఇదికూడా భగవంతుని విభూతియే.```
*6. ధృతి:*```
ధర్మకార్యాలలో, దైవకార్యాలలో ధైర్యంతో, పట్టుదలతో పాల్గొనటం, మోక్ష సిద్ధికొరకు పట్టుదల. ఇంద్రియ, మనస్సులను నిగ్రహించగల బలం. ఇది కూడా స్త్రీలలో అధికమే.```
*7. క్షమా:*```
అత్తమామలను ఆదరించటంలోను, భర్తకు అనుకూలంగా నడుచుకోవటం లోను, పిల్లల పోషణలోను, బావలు, మరుదులు, తోటికోడళ్ళు మొదలైనవారితో నేర్పుతో వ్యవహరించటంలోను ఎంతో ఓర్పు ఉండాలి. ఇది కూడా స్త్రీ సహజగుణమే.```
ఇవన్నీ స్త్రీలలో ఉంటే వాటిని భగవంతుని విభూతులుగా చూడాలి.
విశేషార్థం…
నార అంటే భగవత్ సంబంధమైన.. అని. భగవత్ కార్యాలలో, లేదా భగవత్ సంబంధమైన జ్ఞానంలో జీవించేవారు పురుషులైనా, స్త్రీలైనా పైన చెప్పిన సద్గుణాలు వారిలో ప్రకాశిస్తే అవి భగవత్ విభూతులే!
🙏🌴🌹🪔🌹🌴🙏
*భైరవవాక - 7*
🔱
రచన: ఇందూ రమణ
బజారులో ఉన్న కొండ బస్టాండ్ కి చేరుకున్నారు ఇద్దరూ. ఆ ప్రాంతమంతా గుంపులు గుంపులుగా ఉన్న యాత్రీకులతో కిక్కిరిసి ఉంది. ఆడా, మగా, పిల్లలు, ముసలివాళ్ళు, వ్యాపారులు, కిక్కిరిసిన దుకాణాలు అంతా జాతరలా ఉంది. కొందరు వంటలు చేసుకుంటున్నారు. కొందరు గుర్రుపెట్టి నిద్రపోతున్నారు.
ఓ మూల వయసు మీద పడ్డ పండు ముసలి అవ్వ కళ్ళులేని తన కొడుకు తలని తన ఒళ్ళో పెట్టుకొని పడుకోబెట్టి తను పక్కనే ఉన్న గోడకు తల ఆన్చి కూర్చుంది. ఆ ముసలి అవ్వ కొడుక్కి నలబై సంవత్సరాలు దాటి ఉంటాయి. కళ్లే కాదు రెండు చేతులు వంకరగా ఉన్నాయి. మనిషి మోహం పరిశీలనగా చూస్తే వెర్రి బాగులవాడిలా ఉన్నాడు. ఆ దృశ్యాన్ని పాండే, పాత్రోలిద్దరూ చూసారు. ఇద్దరికీ మనసు చివుక్కుమంది. 'పాపం భోజనం చేసారో లేదోనని' మనసులోనే అనుకున్నాడు పాత్రో. 'తల్లి ప్రేమ ఎంత మధురం' మననం చేసుకున్నాడు.
ఇద్దరూ జనాల్ని చీల్చుకుంటూ తమ వాళ్ల దగ్గరకు చేరుకున్నారు. అప్పటికే వంట పూర్తయింది. పాత్రో తండ్రికి నిద్ర తీరినట్టుంది. లేచి కూర్చున్నాడు.
చల్లారడం కోసం ఆకులు పరచి అందులో అన్నం కుమ్మరించి నలుగురూ కబుర్లాడు కుంటూ కూర్చున్నారు... శశికళ ఏదో చెప్తుంటే పాత్రో తల్లి, పని పిల్ల పగలబడి నవ్వుతున్నారు.
పిల్లలిద్దరూ చాప మీద పడుకుంటే పెద్దవాళ్ళు నలుగురూ పాత్రో, పాండేల కోసం ఎదురుచూస్తూ కబుర్లు
చెప్పుకుంటున్నారు.
"ఎక్కడికి పోయార్రా ఇద్దరూ! ఇంతసేపా తిరగడం!" పాత్రో తండ్రి ఇద్దర్నీ గదమాయించాడు. అతనికీ పాండేమీద వాత్సల్యం పెరిగింది.
"ఈ ప్రాంతం రావడం ఇదేగా. చూద్దామని వెళ్ళాను. ఎక్కడ చూసినా జనం. ఎక్కడా అస్సలు ఖాళీలేదు”. తండ్రికి చెప్పాడు పాత్రో.
ఇద్దరూ వారి పక్కనే చతికిలబడ్డారు.
పాత్రో భార్య లేచి ఆకులు కడిగింది. అందర్నీ వరుసగా కూర్చోమని ఆకులు పరిచింది. పిల్లల్ని పనిపిల్ల లేపి కూర్చోబెట్టింది. వాళ్ళిద్దరూ నిద్రమత్తులో జోగుతున్నారు.
ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ పిచ్చిది పరుగు... పరుగున వచ్చి క్షణ కాలంలో భీభత్సాన్ని సృష్టించి పారిపోయింది. అందరూ అయోమయంగా చూస్తుండిపోయారు.
ఎంత వేగంగా అక్కడకు వచ్చిందో అంతకు పదిరెట్ల వేగంతో కుప్పలా పోసిన అన్నం మీద పడి రెండు చేతుల్తో గబగబా నోట్లో కుక్కుకుని ఆ అన్నం కుప్పని చెల్లా చెదురుగా కెలికేసి పారిపోయింది. రెండు చేతుల్తోనూ పిడికిళ్ళతో అన్నం ముద్దలు తీసి పాండే మొహం మీద.... అన్నం వడ్డించడానికి నిలబడ్డ శశికళ మీదకు విసిరి మరీ పారిపోయింది.
పిల్లలు గబాలున లేచి నిలబడిపోయారు. భయం భయంగా వాళ్ల తాత వెనక్కి వెళ్ళి దాక్కున్నారు. పాత్రో తండ్రికి పట్టరాని కోపం కళ్లలోంచి ఏరులా పారుతోంది. పాత్రోకి నోట మాటరాలేదు.
ఇదే అదను కోసం కాచుక్కూర్చున్న రెండు గజ్జి కుక్కలు మిగిలి ఉన్న అన్నం మీదకు దుమికాయి. ఆ పక్కనే ఉన్న పులుసు, కూర కూడా మొత్తం ఆ గందరగోళంలో నేలపాలయ్యాయి.
అందరూ అచేతనంగా చూస్తుండి పోయారు గానీ, ఏవరూ ఏఁవీ అన్లేదు.
శశికళ కు మాత్రం కళ్లల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. అందరూ ఆకలితో మలమల మాడిపోతున్నారు. పాపం ఎంతో ఆబగా వండుకున్న కూడు కుక్కల పాలయింది. బాధగా వెళ్లి అత్తగారి పక్కనే కూలబడింది శశికళ.
కుక్కలు ఆకలిగా... ఆబగా అన్నం పులుసు, కూరలు తింటున్నాయి.
పాండే కళ్ళు ఎరుపెక్కాయి. పళ్ళు పటపట కొరుక్కుంటూ మౌనంగా నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. పిచ్చిదాని కేసి కోపంగా చూస్తుండిపోయాడు.
📖
అందరూ తుంగ చాపల మీదు కాళ్ళు ముడుచుక్కూర్చున్నారు. ఎవరికీ ఏం పాలుపోలేదు. నిక్షేపం లాంటి కూడు పిచ్చి దాని వలన కుక్కల పాలైంది. ఆ పిచ్చిది ఎక్కడి నుండి దాపురించిందో?
"ఏం చేద్దాం?!" పాత్రో, గైడ్ పాండేని అడిగాడు.
"భోజనం చేద్దాం!" నవ్వుతూ అన్నాడు పాండే.
"ఎలా ? ఎక్కడ?!" ఆత్రంగా అంది శశికళ.
"ఎలా ఏఁవిటి? చేత్తో ! పదండి కేంటీన్ కు పోదాం" లేచి నిలబడుతూ అన్నాడు పాండే.
అందరికి ఆ మాటతో చైతన్యం వచ్చింది. ఆకలితో ఏం చేయాలో తోచక నీరసంగా కూలబడ్డ వాళ్లంతా హుషారుగా లేచారు.
అందరూ తొలిపావంచాకి ఎదురుగా ఉన్న కేంటీన్ లోకి అడుగుపెట్టారు. కేంటీన్ కిక్కిరిసి ఉంది. కేష్ కౌంటర్ దగ్గరకు వెళ్ళి పాత్రో అందరికీ మీల్స్ టోకెన్లు కొనుక్కొచ్చాడు.
"ప్లేట్ మీల్సు యాభై రూపాయలట. ఘోరం" కూర్చుంటూ అన్నాడు పాత్రో.
"ఎందుకు ఘోరం ?" పాండే ప్రశ్న.
"ఒక కూర, చారే ఉందట. ప్లేట్ వైట్ రైస్ అంతే" చెప్పాడు పాత్రో.
"పోనీలేరా! ఇంత ఖర్చు అవుతుంటే లేదుగాని, వెధవది యాభై రూపాయలకి మూలుగుతున్నావ్!" పాత్రో తండ్రి అన్నాడు.
సర్వర్ వచ్చి మీల్స్ ప్లేట్లు సర్వ్ చేసి వెళ్ళాడు. అర్ధగంట తర్వాత అన్ని టేబుల్స్ చూసుకొని ఇంకో సర్వర్ వచ్చి ఉన్న ఒకే ఒక కూర వడ్డించాడు. ఆ వెనుకే ప్లేటు అన్నం, సాంబారు తెచ్చి ముందర పెట్టాడు. అందరూ ఆకలి మీదుండడంతో ఆబగా ఆవురావురుమని పళ్లేలమీద పడ్డారు.
కొయ్యల్లా ఉన్నాయి మెతుకులు. సాంబారు కొంచెం పాచి కంపు కొడుతోంది. కూర సరేసరి. చేత్తో కలిపిన అన్నం ముద్ద నోటి దగ్గరకు చేరేసరికి రుచించలేదు.
ఎవరికీ ఒక్క ముద్ద కూడా తినాలనిపించ లేదు.
పాత్రోకి ఒళ్ళు మండింది. చేత్తో అన్నం పట్టుకొని కేష్ కౌంటర్ దగ్గరకు విసురుగా వెళ్ళాడు.
"ఎలా తింటారండి ఈ గడ్డి. యాభై రూపాయలు తీసుకొని ఇదా పెడతారు.” ఆవేశాన్ని అణుచుకుంటూ ఒరియాలో అరిచాడు పాత్రో.
"వెళ్లవయ్యా! వెళ్లు! తింటే తిన్నగా తిను. లేదంటే మానెయ్. ఇంత అర్ధరాత్రి పూట ఇప్పటికిప్పుడు నీకోసం ప్రత్యేకంగా తయారు చేయాలా?!" ఒరియాలోనే సమాధానం చెప్పాడు ఓనరు.
హోటల్లో అంతమంది ఉన్నారు గాని, ఏ ఒక్కరు ఇదేఁవిటిలా ఉందని అడగడానికి రాలేదు. ఎలాగోలా ముక్కు మూసుకొని భోజనం అయిందనిపిచ్చేస్తున్నారు.
పాత్రోతో మర్యాదగా సమాధానం ఇచ్చినట్టు తలూపి వెళ్ళమని సైగ చేసాడు హోటల్ ఓనరు. చేసేదిలేక వెనుదిరిగాడు పాత్రో.
"వేధవలు! ఎక్కడెక్కడి నుండో వస్తారు. ఇంటి దగ్గర ఎలాంటి గట్టి తింటారోగాని, ఇక్కడకు వచ్చేసరికి పెద్ద గెజిటెడ్ ఆఫీసర్ల లాగా ఫోజులిస్తారు.” పక్కనున్న వ్యక్తితో చెప్తూ సణుక్కుంటున్నాడు హోటల్ ఓనర్.
పాత్రోకి ప్రతి అక్షరం అర్ధం అయ్యింది. పాత్రోని తిట్టుకుంటున్నాడు హోటల్ ఓనర్.
"బాస్టర్డ్ తనకి తెలుగు అర్ధం కాదని ఎలా తిడుతున్నాడు. ఇక్కడ కనుక వీళ్ల అన్యాయం ఇలా సాగిపోతోంది. ఇంకో దగ్గరయితే .... వీళ్ల ఆటలు సాగేవి కావు" పళ్లు పటపట కొరుకుతూ టేబుల్ దగ్గరకు వెళ్లాడు పాత్రో.
అప్పటికే అందరూ ఆ అన్నం తినలేక చేతులు కడుక్కొని లేచిపోయారు.
పాత్రో తండ్రి ఆకలికి తాళలేకపోతున్నాడు. పిల్లలు బెదిరిస్తే ఊరుకుంటున్నారు గాని, ఆ ముసలతను మాత్రం కోపంతో పెట్రేగి పోతున్నాడు.
"నువ్వేం గైడువయ్యా! మాకు తోడుగా వుంటూ మా మంచి చెడ్డలన్నీ చూస్తానన్న వాడివి ... నీకు తెలిసి కూడా ఈ వెధవ మోసాలకి మమ్మల్ని బలిచేస్తావా ?!!" తిట్టలేదు గాని అంతకు పదిరెట్లు ఆవేశంతో అన్నాడు ముసలాయన.
"ఆయనేం చేస్తారు మాఁవయ్య. మనకు తెలియని స్థలాల గురించి చెప్తారు. ప్రత్యేకంగా సందర్శించాల్సిన ప్రదేశాలు చూపిస్తారు. అంతే కానీ, ఇలా ప్రతి విషయం మనకి సమస్యగా తయారవు తుందని ఆయనకి ముందుగా ఎలా తెలుస్తుంది?" మాఁవయ్య గార్కి సర్ది చెప్తూ అంది శశికళ.
"సరస్వతి! మనం పోదాం రా! పోయి పడుకుందాం?!" రుసరుసలాడుతూ భార్యను చెయ్యి పట్టుకు తీసుకుపోయా రాయన.
పక్కనే ఉన్న పాన్ షాప్ దగ్గరకెళ్లి మూడు పెడలు అరటిపళ్ళు కొనుక్కొచ్చాడు గైడ్ పాండే. మిగిలిన చిల్లర పాత్రో చేతిలో పోసాడు. ఆ రాత్రికి అందరూ ఆ అరటి పళ్లతోనే ఆకలికి మేత వేసారు.
పరాయి చోట పౌరుషానికి పోతే పళ్లూడేది, పరువు పోయేది తమకేనని పాత్రో తనకి తనే సర్ది చెప్పుకున్నాడు.
'ఇదే తమ ప్రాంతంలో అయితే హోటల్ ఓనర్ తో పాటు హోటల్ కూడా రాత్రికి రాత్రి గల్లంతయ్యేది.' మనసులోనే కోపాన్ని అణుచుకున్నాడు పాత్రో.
కొబ్బరి కాయల వర్తకురాలిచ్చిన తుంగచాపల మీద చీరలు పరుచుకొని అందరూ వరుసగా కళ్ళుమూసుకు పడుకున్నారు. కానీ, ఎవరికీ సరిగ్గా నిద్రపట్టడం లేదు. అందరికీ ఆకలిగానే ఉంది. ఎలా?!
పాండే పక్కనే పాత్రో పడుకున్నాడు. అతని పక్కనే భార్య శశికళ, పిల్లలు, పాత్రో తండ్రి, తల్లి, పనిపిల్ల వరుసగా పడుకున్నారు.
శశికళ ప్రయాణ బడలికకు ఆకల్ని సైతం మర్చిపోయి గాఢ సుషుప్తిలో ఓలలాడు తోంది. పాత్రోకి కూడా నెమ్మదిగా నిద్రాదేవి ఆవరించుకుంటుంది. అరగంటలో అందరూ మత్తు నిద్రలోకి జారుకొని శవాల్లా కాళ్ళూ, చేతూలూ తేలేసారు.
సింహాల దేఁవిడీలో కఛేరీ గంటలు వరుసగా 'మూడు' గంటలు మ్రోగాయి. కఛేరి గంటలు వింటూ నిద్రలోకి జారుకున్నాడు పాండే.
🔱
*సశేషం*

Comments
Post a Comment